Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది ఐదవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

మేనాయాః స్తికన్యకాస్రో జాతారూపగుణాన్వితాః | సునాభఇతిచఖ్యాత శ్చతుర్థస్తనయో7భవత్‌. 1

రక్తాంగీర క్తనేత్రాచ రక్తాంబర విభూషితా | రాగిణీనామసంజాతా

జ్యేష్ఠామేనాసుతామునే. 2

శుభాంగీపద్మపత్రాక్షీ నీలకుంచితమూర్థజా | శ్వేతమాల్యాంబరధరా

కుటిలానామచాపరా. 3

నీలాంజనచయప్రఖ్యా నీలేందీవరలోచనా | రూపేణానుపనాకాలీ జఘన్యామేనకాసుతా 4

జాతాస్తాఃకన్యకాస్తిస్రః షడబ్దాత్‌ పరతోమునే | కర్తుంతపఃప్రయాతాస్తా దేవాస్తాదదృశుఃశుభాః. 5

తతోదివాకరైఃసర్వైర్వసుభిశ్చతపస్వినీ | కుటిలాబ్రహ్మలోకంతు నీతాశశికరప్రభా. 6

అథోచుర్థేవతాస్సర్వాః కింత్వియంజనయిష్యతి | పుత్రంమహిషహంతారం బ్రహ్మన్‌ వ్యాఖ్యాతుమర్హసి. 7

తతో7బ్రవీత్‌ సురపతిర్నే యంశక్తాతపస్విని | శార్వంధారయితుంతేజో వరాకీముచ్యతాంత్వియమ్‌. 8

తతస్తుకుటిలాక్రుద్ధా బ్రహ్మాణంప్రాహనారద | తథాయతిష్యేభగవన్‌ యథాశార్వంసుదుర్ధరమ్‌. 9

చారయిష్యామ్యహంతేజ స్తథైవశృణుసత్తమః | తపసాహంసుతప్తేన సమారాధ్యజనార్దనమ్‌. 10

యథాహరస్యమూర్థానం నమయిష్యేపితామహ | తథాదేవకరిష్యామి సత్యంసత్యంమయోదితమ్‌. 11

పులస్త్య ఉవాచ :

తతఃపితామహఃక్రుద్దః కుటిలాంప్రాహదారుణామ్‌ | భగవానాదికృద్‌ బ్రహ్మా సర్వేశో7పిమహామునే. 12

పులస్త్యుడు చెప్పసాగాడు : ఆ మేనాదేవి గుణసంపన్నురాలయిన కుమార్తెలు మువ్వురను సునాభుడిగా పేరొందిన పుత్రునొకనిని కనినది. వారలలో ఎర్రనికాంతిని కలిగి ఎర్రని నేత్రాలతో ఎర్రనివస్త్రాలు ధరించిన రాగిణియను పుత్రిక జ్యేష్ఠురాలు. ఓ మునీః తామరాకుల్లాంటి నేత్రాలతో తెల్లని అంగకాంతితో నల్లని నొక్కుల జుట్టుతో తెల్లని వస్త్రాలు ధరించి పుట్టిన కుటిల రెండవది. నల్లని దేహకాంతితో నల్ల కమలాలబోలిన కండ్లతో చక్కని పిరుదులతో సాటిలేని అందంతో పుట్టిన మూడవ కుమార్తె కాళీ. పుట్టిన ఆరేండ్ల తర్వాత ఆ ముగ్గురు బాలికలు తపస్సు చేయసాగారు. ఆ సుందరాంగులను దేవతలు చూచారు. చంద్రకిరణాల శోభతో వెలిగే కుటిలయను కన్యను ఆదిత్య వసువులు దేవలోకానికి గొనిపోయి బ్రహ్మకు చూపించి ప్రభూ! ఈమె మహిషాసురుని చంపగల పుత్రునికనగలదా చెప్పడన్నారు. అందుకు బ్రహ్మ ఈ తపస్విని శివవీర్యాన్ని ధరించజాలదు. కనుక ఈ చిన్నదానిని వదలిపెట్టండి అని చెప్పాడు. బ్రహ్మ మాటలకు కోపించిన ఆ కుటిల ఓనారదాః బ్రహ్మతో - భగవన్‌ ! నేను జనార్దనుని గూర్చి తీవ్రమైన తపస్సు చేసి శివ వీర్యం ధరించగల శక్తి సంపాదించి శివుని పాదాక్రాంతుని చేసుకోగలను. అందుకు తీవ్రంగా ప్రయత్నించగలననెను. అది విని కోపించిన విరించి, ధూర్తయైన కుటిలతో ఇలా అన్నాడు.

బ్రహ్మోవాచ :

యస్మాన్మద్వచనంపాపే నక్షాంతంకుటిలేత్వయా | తస్మాన్మచ్ఛాపనిర్దగ్దా సర్వాఆపోభవిష్యసి. 13

ఇత్యేవంబ్రహ్మణాశప్తా హిమవద్దుహితామునే | ఆపోమయీబ్రహ్మలోకం ప్లావయామానవేగినీ. 14

తాముద్‌ వృత్తజలాందృష్ట్వా ప్రబబంధపితామహః | ఋక్సామాథర్వయజుభి ర్వాజ్‌ మయైర్బంధనైర్దృఢమ్‌.

సాబద్దాసంస్థితాబ్రహ్మన్‌ తత్రైవగిరికన్యకా | ఆపోమయీప్లావయంతీబ్రహ్మణోవిమలాజటాః. 16

యాసారాగవతీనామ సాపీనీతాసురైర్దివమ్‌ | బ్రహ్మణతాంనివేద్యైవం తామప్యాహప్రజాపతిః. 17

సా7పిక్రుద్దా7బ్రవీన్నూనం తథా తప్స్యే మహత్తపః | యథామన్నామసంయుక్తో మహిషఘ్నా భవిష్యతి.

తామప్యథాశపద్‌ బ్రహ్మా సంధ్యాపాపే భవిష్యసి | యామద్వాక్యమలభ్యాంవై సురైర్లంఘయసేబలాత్‌. 19

సాపిజాతామునిశ్రేష్ఠ సంధ్యారాగవతీతతః | ప్రతీచ్ఛత్‌ కృత్తికాయోగం శైలేయా విగ్రహంధృఢమ్‌. 20

తతోగతేకన్యకేద్వే జ్ఞాత్వామేనాతపస్వినీ | తపసోవారయామాస ఉమేత్యేవాబ్రవీచ్చసా. 21

తదేవమాతానామాస్యా శ్చక్రేపితృసుతాశుభా | ఉమేత్యేవహికన్యాయాః సాజగామ తపోవనమ్‌. 22

తతఃసామనసాదేవం శూలపాణింవృషధ్వజమ్‌ | రుద్రంచేతసిసంధాయ తపస్తేపే పేసుదుష్కరమ్‌. 23

తతోబ్రహ్మా7బ్రవీద్దేవాన్‌ గచ్ఛద్వంహిమపత్సుతామ్‌ | ఇహానయధ్వంతాంకాళీం తపస్యంతీంహిమాలయే.

తతోదేవాఃసమాజగ్ము ర్దదృశుఃశైలనందినీమ్‌ | తేజసావిజితాస్తస్యా

నశేకురుపనర్పితుమ్‌. 25

ఇంద్రో7మరగణౖస్సార్థం నిర్థూతస్తేజసాతయా | బ్రహ్మణో7ధికతేజో7స్యా వినివేద్యప్రతిష్ఠితః. 26

తతోబ్రహ్మా7బ్రవీద్‌ సాహిద్రువంశంకరవల్లభా | యూయంయత్తేజసానూనం విక్షిప్తాస్తుహతప్రభాః. 27

తస్మాద్భజధ్వంస్వంస్వంహి స్థానంభోవిగతజ్వరాః | సతారకంహిమహిషం విదద్వం నిహంతరణ. 28

ఇత్యేవముక్తాదేవేన బ్రహ్మణాసేంద్రకాఃసురాః | జగ్ముఃస్వాన్యేవధిష్ణ్యాని సద్యోవైవిగతజ్వరాః. 29

బ్రహ్మ వచనం - పాపిష్ఠవైన కుటిలాః నాహిత వచనాన్ని ధిక్కరించినందుకు నిన్ను నా శాపాగ్నితో దహించి వేస్తాను. నీవు ఈ క్షణమే నీరుగా మారిపోతావు. అలా బ్రహ్మ శాపానికి గురియై ఆ కుటిల నీరుగామారి బ్రహ్మలోకాన్ని ముంచివేయబోగా నా పితామహుడు ఋగ్యజుస్సామాథర్వణ వేదాలతో నామెను గట్టిగా బంధించాడు. ఆమెయు అక్కడ బ్రహ్మదేవుని జటామండలాన్ని తడుపుతూ ఉండిపోయింది. అంతట రాగిణియను బాలికను గూడ దేవతలు బ్రహ్మకడకు గొనిపోగా ఆయన ఆ బాలిక గూడ శివవీర్య ధారణ కనర్హురాలన్నాడు. ఆమె కూడ బ్రహ్మతో వివాదపడి ఆయన శాపానికి గురియై సంధ్యగా నాటినుండీ పిలువబడుతోంది. పర్వతంమీద కృత్తికగా గుర్తింపబడుతూంది. అలా తన కుమార్తె లిర్వురు చేతినుండి జారిపోవుటచూచిన మేనాదేవి మూడవ కుమార్తె కాళిని చూచి, "ఉ - మా" అమ్మా నీవు తపస్సు జేయవద్దని వారించింది. ఆనాటి నుండీ ఆ తల్లి ఆ బిడ్డను "ఉమా" అనే సంబోధించసాగింది. అంతటనా "ఉమ" అడవికి వెళ్ళి పోయింది. అక్కడ తన మనస్సులో శూలపాణి, వృషభ కేతనుడు మహాదేవుడైన రుద్రుని సంధానించుకొని ఘోరమైన తపోదీక్షలో మునిగిపోయెను. అంతట బ్రహ్మమరల హిమగిరి పుత్రికయైన ఆ కాళినిగొని తెమ్మని దేవతలను పంపగా ఆమె తపో7గ్నికి భయపడి ఆమె దగ్గరకుగూడ వెళ్ళలేక పోయారు. ఆమె ముందర యింద్రుడు కూడ తన తేజస్సు గోల్పోయి ఆమె తేజస్సు బ్రహ్మతేజాన్ని గూడ మించినదని వక్కాణించాడు. అది విని బ్రహ్మ మిమ్ము లనందరను తన తేజస్సుతో నిర్జించిన ఆ బాలికయే శంకరుని అర్థాంగి. ఇది తథ్యం. కనుక యిక మీరు మీ చింతలుమాని మీమీ నెలవులకు పొండ''ని ఆదేసించాడు. బ్రహ్మ వచనాలకు సంతసించి యింద్రాదిసురులు భయాందోళనలు వదలి తమ తమ యిండ్లకు వెళ్ళి పోయారు.

ఉమామపితపస్యంతీం హిమవాన్‌ పర్వతేశ్వరః | నివర్త్యతపసస్తస్మాత్‌ సదారోహ్యనయత్‌ గృహాన్‌. 30

దేవో7ప్యాశ్రిత్యత ద్రౌద్రం వ్రతంనామ్నానిరాశ్రయమ్‌|

విచచారమహాశైలాన్‌ మేరుప్రాగ్ర్యాన్‌ మహామతిః. 31

సకదాచిన్మహాశైలం హిమవంతంసమాగతః|తేనార్చితఃశ్రద్దయా7సౌతాంరాత్రిమవసద్దరః| 32

ద్వితీయో7హ్నిగిరీశేన మహాదేవోనిమంత్రితః | ఇహైవతిష్ఠస్వవిభోః తపః

సాధనకారణాత్‌. 33

ఇత్యేవముక్తోగిరిణా హరశ్చక్రేమతించతామ్‌ | తస్థావాశ్రమమాశ్రిత్య త్యక్త్వావాసంనిరాశ్రయమ్‌. 34

వసతో7ప్యాశ్రమేతస్య దేవదేవస్యశూలినః | తందేశమగమత్‌ కాళీ గిరిరాజసుతాశుభా. 35

తామాగతాంహరోదృష్ట్వా భూయోజాతాంప్రియాంసతీమ్‌ | స్వాగతేనాభిసంపూజ్య తస్థౌయోగరతోహరః. 36

సచాఖ్యేత్యవరారోహాకృతాంజలిపరిగ్రహా | వవందేచరణౌశౌవౌ సఖీభిఃసహభామినీ. 37

తతస్తుసుచిరాచ్ఛర్వఃసమీక్ష్యగిరికన్యకామ్‌ | నయుక్తం చైవముక్త్వా7థ నగణోం7తర్దధేతతః| 38

సా7పిశర్వవచోరౌద్రం శ్రుత్వా జ్ఞానసమన్వితా | అంతర్దుఃఖేనదహ్యంతీ పితరం ప్రాహపార్వతీ. 39

తాతః యాస్యేమహారణ్య తప్తుం ఘోరంమహత్తపః | ఆరాధనాయదేవస్య శంకరస్య పినాకినః. 40

తథేత్యుక్తంవచఃపిత్రా పాదేతసై#్యవ విస్తృతే లలితాఖ్యాతపస్తేపే

హరారాధనకామ్యయా. 41

తస్యాఃసఖ్యస్తదాదేవ్యాః పరిచర్యాంతుకుర్వతే|సమిత్కుశఫలంచాపిమూలాహరణమాదితః. 42

వినోదనార్థంపార్వత్యా మృణ్మయఃశూలధృగ్‌ హరః | కృతస్తుతేజసాయుక్తో భద్రమస్త్వితిసా7బ్రవీత్‌. 43

పూజాంకరోతితసై#్యవ తంపశ్యతిముహూర్ముహుః | తతో7స్యాయాస్తుష్టిమగమ చ్ఛ్రద్దయాత్రిపురాంతకృత్‌. 44

వటురూపంసమాధాయ ఆషాఢీముంజమేఖలీ | యజ్ఞోపవీతీఛత్రీచ మృగాజినధరస్తథా. 45

కమండలువ్యగ్రకరో భస్మారుణితవిగ్రహః | ప్రత్యాశ్రమంపర్యటన్‌ స తంకాల్యాశ్రమమాగతః. 46

తముత్థాయతదాకాశీ నఖీభిః సహనారదః పూజ్యయిత్వాయతాన్యాయం పర్యపృచ్ఛదిదంతతః. 47

అంతట తపస్సు చేస్తున్న ఉమనుకూడ పర్వతేశ్వరుడు వారించి భార్యతోవెళ్ళి యింటికి తీసికెళ్ళాడు.ఆ దినాలలో శంకరుడు నిరాశ్రయమనే కఠోర తపస్సులో మునిగి మేరువు మొదలయిన మహాశైలాల్లో తిరుగసాగాడు. అలా తిరుగుతూ నొకసారి హిమవంతానికి రాగా హిమవంతుడు యథావిధిగా పూజించాడు. ఆ రాత్రి శివుడచటనే ఉండిపోయాడు. మర్నాడు హిమవంతుడాయనను ఆహ్వానించి తపస్సు సమయమంతా తనవద్దనే గడపమని అర్థించాడు. పర్వతేశ్వరుని ప్రార్థన మన్నించి హరుడచటనే ఉండ నిశ్చయించి తన నిరాశ్రయ వ్రతాన్ని వదలి అచటే నిలిచాడు. అచట నొకయాశ్రమంలో శూలపాణి యుండగా గిరికన్యకాళి తన సఖులతో కలసి అచటకు వెళ్ళింది. వచ్చిన గిరికన్యను మరల జన్మించిన తన భార్య సతీదేవిగా గుర్తించిన శివుడామెకు స్వాగతంపలికి మరల తపస్సులో మునిగిపోయాడు. అంతటనా కాళి చేతులు జోడించుకుని సతీ సమేతగా నా హరుని పాదములకు మ్రొక్కెను. అంతనా గిరికన్యను చాలాసేపు తదేకదృష్టితోచూచి శివుడు అలా చేయుట యుక్తంకాదని పలుకుచూ గణాలతో సహా అంతర్హితుడ్యాయడు. జ్ఞాన సంపన్నురాలైన ఉమశివుని ఆ తీవ్రవచనాలు విని దుఃఖించి తండ్రివద్దకు వెళ్ళి యిలా అన్నది. ''తండ్రీ! పినాకపాణి, మహాదేవుడు శంకరుని ఆరాధించుటకై నేను మహారణ్యానికి వెళ్తాను'', అందుకు తండ్రి సమ్మతించగా, నా హిమవత్పర్వతమూలాన్నే లలిత అనే పేరుతో ఘోర తపస్సు చేయసాగింది. ఆమె సఖులు కంద మూలఫలాలు సమిధలు కుశలు తెచ్చి ఆమెకు సపర్యలు చేయసాగారు. పార్వతి వినోదానికై వారలు శూలపాణి శివుని మట్టిబొమ్మను అందంగాచేసి చూపారు. తేజోవంతమైన ఆ బొమ్మనుచూచి ఆమె ఆనందించి సఖులను దీవించెను. పూజా సమయాల్లో మాటిమాటికీ ఆ విగ్రహాన్నే చూస్తూ ఆరాధించేది. ఈ విషయాన్ని కనిపెట్టిన ఆ త్రిపురాంతకుడు సంతోషించి, పలాశదండం , ముంజమేఖల, కృష్ణాజినం కమండలువు ధరించి భస్మాంకిత విగ్రహంతో బ్రహ్మచారి వేషంలో పర్యటిస్తూ ఆమె ఆశ్రమానికి చేరాడు, నారదా ! అలా వచ్చిన హరునిచూచి ఆ కాళి సఖులతో లేచి స్వాగతంపలికి యథావిధిగా అతిథి మర్యాదలు చేసి యిలా ప్రశ్న చేసింది.

ఉమోవాచ ;

కస్మాదాగమ్యతే భిక్షో కుత్రస్థానేతవాశ్రమః | క్వచత్వంప్రతిగంతాసి మమశీఘ్రం నివేదయ. 48

భిక్షురువాచ ః

మమాశ్రమపదంబాలే వారాణస్యాంశుచివ్రతేః | అథతస్తీర్థయాత్రాయాం గమిష్యామిపృథూదకమ్‌. 49

దేవ్యువాచ;

కింపుణ్యంతత్ర విప్రేంద్ర లబ్దాసిత్వంపృథూదకే ? | పథిస్నానేన చఫలం కేషుకిం అబ్దవానసి ? 50

భిక్షురువాచ :

మయాస్నానం ప్రయాగేతు కృతంప్రథమమేవహి తతో7థతీర్థేకు బ్జామ్రేజయంతే చండికేశ్వరే. 51

బంధువృందేచ కర్కంధే తీర్థేకనఖలేతథా | సరస్వత్యామగ్ని కుండే భద్రాయాంతుత్రివిష్టపే. 52

కోనటేకోటితీర్థేచ కుబ్జకేచకృశోదరి | నిష్కామేనకృతం స్నానం తతో7భ్యాగాంతవాశ్రమమ్‌. 53

ఇహస్థాంత్వౌంసమాభాష్య గమిష్యామిపృథూదకమ్‌ | పృచ్ఛామియదహంత్వాంవై తత్రనక్రోద్దుమర్హసి. 54

అహంయత్తపసాత్మానం శోషయామికృశోదరి | బాల్యే7పిసంయతతను స్తత్తుశ్లాఘ్యంద్విజన్మనామ్‌. 55

కిమర్థంభవతీరౌద్రం ప్రథమేవయసిస్థితా | తపఃసమాశ్రితాభీరు సంశయఃప్రతిభాతిమే| 56

ప్రథమేవయసిస్త్రీణాం సహభర్త్రావిలాసిని | సుభోగాభోగితాః కాలే వ్రజంతి

స్థిర¸°వనే. 57

తపసావాంఛయంతీహ గిరిజేసచరాచరాః | రూపాభిజనమైశ్వర్యం

తచ్చతేవిద్యతేబహు. 58

తత్కిమర్థమపాసై#్యతానలంకారాన్జటాధృతాః | చీనాంశుకంపరి త్యజ్య కింత్వంవల్క లధారిణీ? 59

పులస్త్య ఉవాచ :

తతస్తుతపసావృద్ధా దేవ్యాఃసోమప్రభాసఖీ | భిక్షవేకథయామాస యథావత్‌

సాహినారద. 60

సోమప్రభోవాచ :

తపశ్చర్యాద్విజశ్రేష్ఠ పార్వత్యాయేన హేతునా | తంశృణుష్వత్వియంకాశీ హరంభర్తారమిచ్ఛతి. 61

పులస్త్య ఉవాచ :

సోమప్రభాయావచనంశ్రుత్వాసంకంప్యవైశిరః|విహస్యచమహాహాసం భిక్షురాహవచస్త్విదమ్‌. 62

ఉమ యిలా అన్నది : ఓ భిక్షూ ! మీరెచట నుండి వస్తున్నారు ? మీ ఆశ్రమెక్కడ ? ఎక్కడకు వెళ్ళుచున్నారు. త్వరగా చెప్పండి. అందులకా భిక్షువిట్లు చెప్పాడు. "ఓ సుందరీ ! నా ఆశ్రమం వారణాసిలో ఉన్నది. దారిలో తీర్థయాత్రలు చేసుకుంటూ పృథూదక తీర్థానికి వెళ్తున్నాను'. అందులకాదేవి ఓ బ్రాహ్మణోత్తమా ! పృథూదకంలో ఏమి పుణ్యమార్జించావు. దారిలో స్నానంచేసి తీర్థాల ఫలమెట్టిది ? అందులకా భిక్షువు యిలా చెప్పాడు. మొట్టమొదట తీర్థ రాజం ప్రయాగలో స్నానంచేశాను. తర్వాత పవిత్రాలైన కుబ్జామ్రం , జయంతం, చండికేశ్వరం, బంధువృదం, కర్కంధం, కనఖలం, అగ్నికుండం, భద్రా త్రివిష్టపం, కోనటం, కోటితీర్థం, కుబ్జకతీర్థాలలో స్నానం చేశాను. ఓ పవిత్రురాలా ! నేనేలాంటి కోరికలేకుండానే ఈ తీర్థాలను సేవించి నీ ఆశ్రమానికి చేరాను. ఇక్కడ ఉండి నీతో మాటాడి తర్వాత పృథూదకానికి వెళ్ళగలను. నీవు కోపపడకపోతే ఒక విషయం అడుగుతాను. నేను చిన్నతనాన్నుంచీ యింద్రియాలను నిగ్రహించి తపస్సువల్ల శరీరాన్ని కృశింప చేసుకునానంటే, అందుకు బ్రాహ్మణుడనుగా నేను తగియున్నాను. అది నా యెడ శ్లాఘ్యమే. కాని నీవు ఈ చిన్నవయసునందే యింతటి కఠోర తపస్సు ఎందుకు పూనుకున్నావా అని శంక కలుగుతోంది. ఓ సుందరీ ! ¸°వనదశలో స్త్రీలు భర్తతో కలిసి చక్కని భోగాలు అనుభవిస్తారు. చరాచర జీవులు, అందం , పవిత్రత, ఐశ్వర్యాదులు కాంక్షించి తపస్సు చేస్తుంటారు. అయితే నీకు వానిలోటులేదు. అన్నింటిలో నీవు సంపన్నవు. మరి ఏ కారణంవల్ల యిలా సర్వాలంకారాలు వదలి జటాధారిణివై పట్టుచీరెలకు బదులు నారచీరలు ధరించి తపిస్తున్నావు ? బ్రహ్మచారి మాటలకు ఉమాదేవి సోమప్రభ అనే వృద్ధాంగన భిక్షువుకు ఓ నారదా ! బదులు చెప్పింది. "ఓ విప్రేంద్రా ! ఈ నాసఖి కాళి పరమశివుడగు హరుని భర్తగా పొందుటకై యిలా తపస్సు చేస్తున్నది". నారదా ! ఆ సోమప్రభ మాట విని, బ్రహ్మచారి శిరః కంపనంచేసి పక పకా నవ్వుతూ యిలా అన్నాడు.

భిక్షురువాచ :

వదామితేపార్వతి వాక్యమేవం కేనప్రదత్తాతవబుద్ధిరేషా ?

కథంకరఃపల్లవకోమలస్తే సమేష్యతేశార్వకరంససర్పమ్‌. 63

తథా దుకూలాంబరధారిణీత్వం మృగారిచర్మాభివృత్తస్తురుద్రః |

త్వంచందనాక్తాసచభస్మ భూషితో నయుక్తరూపం ప్రతిభాతిమేత్విదమ్‌. 64

పులస్త్య ఉవాచ ;

ఏవంవాదినివిప్రేంద్ర ః పార్వతీ భిక్షుమబ్రవీత్‌ | మామైవంవదభిక్షోత్వం హరః సర్వగణాదికః. 65

శివోవాప్యథవాభీమః నదనోనిర్దనో7పివా | అలంకృతోవాదేవేశ స్తథావాప్యనలంకృతః. 66

యాదృశస్తాదృశోవాపి సమేనాథోభవిష్యతి | నివార్యతామయంభిక్షుః వివక్షుఃస్పురితాధరః.

నతథానిందకఃపాపీ యథాశృణ్వన్‌ శశిప్రభే| 67

ఇత్యేవముక్తావరదా సముత్థాతుమథైచ్చత | తతో7త్యజద్భిక్షురూపం స్వరూపస్థో7భవచ్చివః. 68

భూత్వోవాచప్రియేగచ్ఛ స్వమేవభవనంపితుః | తవార్ధాయప్రహేష్యామి మహర్షీన్‌ హిమవద్గృ హే. 69

యచ్చేహరుద్రమీహంత్యా మృణ్మయశ్చేశ్వరః కృతః | అసౌభ##ద్రేశ్వరేత్యేవంఖ్యాతోలోకేభవిష్యతి. 70

దేవదానవగంధర్వా యక్షాఃకింపురషోరగాః | పూజయిష్‌ంయతిసతతం మానవాశ్చశుభేప్సవః. 71

ఇత్యేవముక్తాదేవేన గిరిరాజసుతామునే | జగామాంబరమావిశ్యస్వమేవ భవనంపితుః. 72

శంకరో7పిమహాతేజా విసృజ్యగిరికన్యకామ్‌ | పృథూదకంజగామాథ స్నానం చక్రేవిధానతః. 73

తతస్తుదేవప్రవరోమహేశ్వరః పృథూదకేస్నానమపాత్తకల్మషః|

కృత్వాసనందిఃసగణఃసవాహవోమహాగిరింమందరమాజగామ. 74

ఆయాతిత్రిపురాంతకే సహగణౖ ర్బ్రహ్మర్షిభిః సప్తభి|

రారోహత్పులకో బభౌగిరివరః సంహృష్టచిత్త? క్షణాత్‌|

చక్రేదివ్యఫలై ర్జలేన శుచినా మూలైశ్చ కందాదిభిః |

పూజాం సర్వగణశ్వరై ః సహ విభో రద్రిస్త్రినేత్రస్యతు. 75

ఇతి శ్రీ వామనమహాపురాణ పంచవింశోద్యాయః.

భిక్షువిలా అన్నాడు : ఓ పార్వతీ ! నీకీ సలహా ఎవడిచ్చాడని అడుగుతున్నాను. చిగురుటాకులను వెక్కిరించే నీ మెత్తటి చేతులెక్కడ ? వీటితో ఆ పాములచేతివాడి కరగ్రహణం ఎలా చేస్తావు ? నీవో చీనిచీనాంబరాలు ధరిస్తావు. అతడో పులితోలు కప్పుకునే రుద్రుడు (భయంకరుడు).నీవు చందన లేపనంచేసుకుండే అతడు బూడిద పూసుకుండాడు. ఈ సంబంధం నాకేమాత్రం నచ్చలేదు !

పులస్త్యుడన్నాడు : నారదా ! అలా మాటాడుతున్న భిక్షువును వారిస్తూ పార్వతి " అలా అనగూడదు. హరుడు, ఓ భిక్షూ ! సర్వ గుణాల్లో సర్వాధికుడు ! ఆ ప్రభుడు మంగళరూపి కానీ భయంకరాకారుడు కానీ, దనవంతుడు గానీ, దరిద్రుడు కానీ, సర్వాలంకారుడు కానీ, దిగంబరుడు కానీ ఆయనే నా భర్తకాగలడు ! ఓ శశిప్రభూ ! ఈతని పెదవులు కదలుచున్నవి. ఇంకా ఏమోవదరోబోతున్నాడీతనిని ఆపండి. ఇతరులను నిందించే వానికన్నా అనిందనువివే వారలు ఎక్కువ పాపంమూటగట్టుకుండారు" అని తన నిశ్చయం వెల్లడిచేసినది. పులస్తుడు ఓ నారదా ! అలాపలికి అచటనుండి లేచిపోవనుద్యమించిన ఆ వరదాయిన ఎదుట శివుడి తననిజరూపంతో నిలచి యిలా అన్నాడు. "ప్రియురాలా! సుఖంగా యింటికి వెళ్ళిపో. నేను త్వరలోనే నిన్ను పొందుటకై మహర్షులను నీ తండ్రి యింటికి పంపుతాను. నీవుపూజించిన ఈ మృణ్మయ శంకర ప్రతిమ నేటి నుండీ భ##ద్రేశ్వరుడుగా లోకంలో ప్రసిద్ధమౌతుంది. దీనిని దేవదానవ గంధర్వ యక్ష కింపురుష నాగమనుష్యాదులు పూజించి శుభాలు పొందుతారు". హరుని మాటల కలరి ఆ గిరికన్య వెంటనే ఆకాశమార్గానా తన నెలవుకు వెళ్ళి పోయినది. మహాతేజస్వి అయిన శంకరుడు హిమవత్పుత్రిని వదలిపృథూదక క్షేత్రానికి వెళ్ళి యథావిధిగా స్నానం చేశాడు. అలా పృథూదక స్నానంతో పవిత్రుడై నందీశ్వరుడు మొదలగు గణాలతో కూడికొని మందర మహాశైలానికి తరలివెళ్ళాడు. అనంతరం ప్రమథగణాలు సప్తర్షులతో కలిసి తనయింటికే తెంచిన ఆ త్రిపుర సంహరునిచూచి హర్షసంభ్రమాశ్చర్యాలతో పులకించి ఆ నగధిరాజు, ఆ దేవునికి స్వాగతంపలికి, కందమూల ఫలాలు దివ్య జలాలు సుగంధిత కుసుమాదులతో వారల నందరను ఘనంగా పూజించాడు.

ఇది శ్రీ వామన మహాపురాణంలో యిరువది యైదవ అధ్యాయము సమాప్తం

Sri Vamana Mahapuranam    Chapters