Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది నాలుగవ అధ్యాయము

దేవదేవ ఉవాచ :

ఏవంపృథూదకోదేవాః పుణ్యఃపాపభయాపహః | తద్‌ గచ్ఛద్వంమహాతీర్థంయావత్‌ సంనిధిబోధితమ్‌. 1

యదామృగశిరోఋక్షే శశిసూర్యౌబృహస్పతిః | తిష్ఠంతి సాతిథిఃపుణ్యా త్వక్షయాపరిగీయతే. 2

తంగచ్ఛధ్వంసురశ్రేష్ఠా యత్రప్రాచీ సరస్వతీ | పితౄనారాధయధ్వంహి తత్ర శ్రాద్దేనభక్తితః. 3

తతోమురారివచనం శ్రుత్వా దేవాః సనాసవాః | సమాజగ్ముఃకురుక్షేత్రే పుణ్యతీర్థంపృథూదకమ్‌. 4

తత్రస్నాత్వాసురాఃసర్వే బృహస్పతిమచోదయన్‌ | విశస్వభగవన్‌ ఋక్ష మిమం మృగశిరంకురు. 5

ప్రవర్తతేరవిస్తత్ర చంద్రమా7పివిశత్యసౌ | త్వదాయత్తం గురోకార్యం సురాణాంతత్కురుష్వచ. 6

ఇత్యేవముక్తోదేవైస్తు దేవాచార్యో7బ్రవీదిదమ్‌ | యదివర్షాధిపో7హం తతోయాస్యామిదేవతాః.

బాఢమూచుః సురాస్సర్వే తతో7సౌప్రాక్రమన్మృగమ్‌. 7

అషాడే మాసిమార్గర్‌క్షే చంద్రక్షయతిథిర్హియా | తస్యాంపురందరఃప్రీతః పిండంపితృషుభక్తితః. 8

ప్రాదాత్తిలమధూన్మిశ్రం హవిష్యాన్నంకురుష్వథ | తతః ప్రీతాస్తుపితర స్తాం ప్రాహుస్తనయాంనిజామ్‌. 9

తాంమేనాంహిమవాం ల్లబ్ద్వా ప్రసాదాద్దైవతేష్వథ | ప్రీతిమానభవచ్చాసౌ రరామచయథేచ్ఛయా. 10

తతోహిమాద్రిః పితృకన్యయాసమం సమర్పయన్‌ వైవిషయాన్‌ యథేష్టమ్‌ |

అజీజనత్‌ సా తనయాశ్చతిస్రో రూపాతియుక్తాః సురయోషితోపమాః. 11

ఇతి శ్రీవామన మహాపురాణ చతుర్వింశో7ధ్యాయః.

దేవదేవుడిలా అన్నాడు: ఆ విధంగా పృథూదక క్షేత్రం పాపభయం వినారకం . కాన దేవతలారా! సన్నిహిత తీర్థం వరకు సూచించబడిన ఆ మహాతీర్థానికి మీరు వెళ్ళండి. మృగశిర నక్షత్రంలో సూర్యచంద్ర బృహస్పతులు చేరిన పవిత్ర తిథి అక్షయ అనిపించుకుంటుంది. అక్కడ ప్రాచీన సరస్వతీ తీరానికి వెళ్ళి భక్తితో శ్రాద్ధ కర్మ నిర్వర్తించి పితరులను ఆరాధించండి. మహావిష్ణువు చెప్పిన హితోక్తులు విని ఇంద్ర పురోగాములై దేవతలు కురుక్షేత్రంలోని పావన పృథూదక తీర్థానికి వెళ్ళారు. అక్కడ స్నానంచేసి దేవతలు బృహస్పతిని ప్రార్థించారు. "మహాత్మా మృగశిరా నక్షత్రంలో ప్రవేశించి ఈ తిథి పవిత్రం కావించండి. సూర్యుడు చంద్రుడు కూడ అందులో ప్రవేశించారు. గురుదేవాః ఇక దేవతల కార్యమంతా మీమీద ఆధారపడి ఉంది. అందులకు బృహస్పతి నాకు ఈ సంవత్సరాధిపత్యం యిస్తేనే మీరు చెప్పినట్లు చేయువాడ" ననగా దేవతలందులకంగీకరించారు. వెంటనే బృహస్పతి మృగశిరలో ప్రవేశించాడు. ఆషాఢంలో మృగశిరానక్షత్రయుక్త అమావాస్యనాడు దేవేంద్రుడు ప్రీతిపూర్వకంగా కురుక్షేత్రంలో పితరులకు, తిలమధుహవిష్యాన్నంతో చేసిన పిండ ప్రదానం చేశాడు. అందులకు సంతుష్టులై పితృదేవతలు కుమారలకు హిమవంతునితో వివాహానికై తన కుమార్తె మేనాదేవిని అప్పగించారు. దేవతల ప్రసాద రూపంలో అ మేనాదేవిని స్వీకరించి ఆమెతో ఇష్టసుఖాలు అనుభవించాడు. ఆ మేనాదేవి ఆ శైలాధిపతికి దేవకన్యలతో సమానలైన ముగ్గురు అందమైన కుమార్తెలను కని యిచ్చినది.

ఇది శ్రీ వామన మహాపురాణంలో యిరవైనాలుగవ అధ్యాయం

Sri Vamana Mahapuranam    Chapters