Sri Vamana Mahapuranam    Chapters   

పదిహేడవ అధ్యాయము

ఋషయః ఊచుః :

కథంమంకణకః సిద్ధః కస్మాజ్ఞాతోమహానృషిః | నృత్యమానస్తుదేవేన కిమర్థంసనివారితః 1

లోమహర్షణవాచ :

కశ్యపశ్యసుతోజజ్ఞేమానసోమంకణోమునిః | స్నానంకర్తుంవ్యవసితో గృహీత్వావల్కలంద్విజః 2

తత్రగత్వాహ్యప్సరసో రంభాద్యాః ప్రయదర్శనాః | స్నాయంతిరుచిరాః స్నిగ్థాస్తేన సార్ధమనిందితాః 3

తతోమునేస్తధా క్షోభా ద్రేతః స్కన్నంయదంభసి | తద్రేతఃసతు జగ్రాహ కలశేవైమహాతపాః 4

సప్తధాప్రవిభాగంతు కలశస్ధం జగామహా | తత్రర్షయఃసప్త జాతా విదుర్యాన్‌ మరుతాంగణాన్‌. 5

వాయువేగోవాయుబలో వాయుహా వాయుమండలః | వాయుజ్వాలోవాయురేతో వాయుచక్రశ్చ వీర్యవాన్‌. 6

ఏతేహ్యపత్యాస్తస్యర్షే ర్దారయంతి చరాచరమ్‌ | పురామంకణకః సిద్దః కుశాగ్రేణతి మేశ్రుతమ్‌. 7

క్షతఃకిలకరేవిప్రా స్తస్య శారసో7స్రవత్‌ | సవైశాకరసందృష్ట్వా హర్షావిష్టః ప్రనృత్తవాన్‌. 8

తతఃసర్వంప్రనృత్తంచ స్థావరంజంగమంచయత్‌ | ప్రనృత్తంచ జగద్దృష్ట్వా తేజసా తస్యమోహితమ్‌. 9

బ్రహ్మాదిభిః సురైస్తత్రఋషిభిశ్చతపోధనైః | విజ్ఞప్తోవై మహాదేవో మునేరర్థే ద్విజోత్తమాః. 10

నాయంనృత్యేద్‌ యథాదేవః తథాత్వంకర్తుమర్హసి | తతోదేవోమునిం దృష్ట్వా హర్షావిష్టమతీవహి. 11

సురాణాంహిత కామార్థం మహదేవో7భ్యభాషత | హర్షస్థానంకింమర్థంచ తవేదం మునసత్తమః

తపస్వినోధర్మపథే స్థితస్యద్వజసత్తమ. 12

ఋషులు ప్రశ్నించారు : మంకణకుడెలా సిద్ధుడయ్యాడు? ఆయన ఎవరి కుమారుడు ? ఆ మహర్షి నృత్యం చేస్తుంటే శివుడేల నివారించాడు ? అందులకు రోమహర్షణుడిలా చెప్పాడు. మంకణముని కశ్యపమహర్షి మానసపుత్రుడు. ఒకానాడాయన పల్కలాలతో స్నానంచేయనుద్యుక్తుడయ్యాడు. బ్రాహ్మణులారా ! అప్పుడచటకు సుందరులు ప్రియదర్శనలు కోమలాంగులయిన రంభాది అప్సరసలుకూడ వచ్చి ఆయనతోబాటు స్నానంచేయసాగారు. వారలను చూచి మనస్సు చలించి నందున ఆ ముని వీర్యం నీటిలోజారిపడగా నాతపస్వి దనానొక కలశంలో పట్టివేశాడు. కలశంలోని వీర్యం ఏడుభాగాలయి అందలోనుండి సప్తమరుద్గణాలు, వాయువేగ, వాయుబల, మయుహా, ముమండల, వాయుజ్వాల, వాయురేత, వాయు చక్రులను మహావీర్యవంతులుద్భవించారు. ఆ ఋషికిపుట్టిన ఆ ఏడుగురు కుమారులు ఈ చరాచరజగత్తును ధరించియున్నారు. సిద్ధపురుషుడైన ఆ మంకణకుడు పూర్వమొకసారి కుశాగ్రలతో చేయికోసుకున్నట్లు ఆ వ్రణంలోనుండి శాకరసంస్రవించినట్లు విన్నాను. చేతినుండి కారుచున్న ఆశాకరసాన్ని చూచి ఆయన ఆనందంలో నాట్యంచేయసాగాడు. ఆ నాట్యోద్ధతికి స్థావర జంగమాలల్నీ నాట్యం చేయసాగాయి. ఆయన తేజస్సుకు మోహంచెంది జగత్తంతానాట్యం చేయడంతో బ్రహ్మాదిదేవతలు తపోధనులయిన ఋషులందరుకలిసి మహాదేవుని దర్శించి యిలా ప్రార్థించారు. ప్రభూ ! ఈ మునిని నృత్యంచేయకుండా నివారించండి. అంతట శివుడు హర్షోన్మత్తుడయిన మునినిచూచి దేవహితం కోసమై యిలా ప్రశ్నించాడు. ఓ మునిసత్తమా ! ఓ బ్రాహ్మణోత్తమా ! ధర్మపథాన నడచుచున్న నీకింతటి హర్షాతిరేకం కలుగుటకు కారణమేమిటో చెప్పవలయును.

ఋషిరువాచ :

కింనపశ్యసిమేబ్రహ్మన్‌కరాచ్ఛాకరసంస్రుతమ్‌?|యందృష్ట్వాహంనృత్తోవైహర్షేణమహతా7న్వితః. 13

తంప్రహస్యాబ్రవీద్దేవో మునింరాగేణమోహితమ్‌ | అహంనవిస్మయంవిప్రః గచ్ఛామీహప్రవశ్యతామ్‌. 14

ఏవముక్త్వామునిశ్రేష్ఠం దేవదేవోమహాద్యుతిః | అంగుళ్యగ్రేణవిప్రేంద్రాం స్వాంగుష్ఠంతాడయద్భవః. 15

తతోభస్మక్షతాత్‌తస్మా న్నిర్గతంహిమసన్నిభమ్‌ | తద్దృష్ట్వావ్రీడితోవిప్రః పాదయోః పతితో7బ్రవీత్‌. 16

నాన్యందేవాదహంమన్యేశూలపాణర్మహాత్మనః | చరాచరస్యజగతో వరస్త్వమసిశూలదృక్‌. 17

త్వదాశ్రయాశ్చదృశ్యంతే సురాబ్రహ్మాదయో7నఘ | పూర్వస్త్వమసిదేవానాం కర్తాకరయతామహత్‌. 18

త్రత్ప్రసాదాత్‌సురాస్సర్వే మోదంతేహ్యకుతోభయాః | ఏవంస్తుత్త్వామహాదేవం ఋషిఃనప్రణతో7బ్రవీత్‌. 19

భగవంస్త్వత్ప్రసాదాద్ది తపోమేనక్షయంవ్రజేత్‌ | తతోదేవః ప్రసన్నాత్మా తమృషింవాక్యమబ్రవీత్‌. 20

ఈశ్వర ఉవాచ :

తపస్తేవర్ధతాంవిప్రః మత్ప్రసాదాత్‌ సహస్రధా | ఆవ్రమేచేహవత్ప్యామి త్వయా సార్థమహంసదా. 21

సప్తసారస్వతేస్నాత్వా యోమామర్చిష్యతే నరః | నతస్యదుర్లభంకించి దిహలోకేపరత్రచ. 22

సారస్వతంచతంలోకం గమిష్యతి నసంశయః | శిస్యచప్రసాదేన ప్రాప్నోతి పరమంపదమ్‌. 23

ఇతి శ్రీవామనహాపురాణ సరోమహాత్మ్యే సప్తదశో7ధ్యాయః.

మంకణఋషి యిలా అన్నాడు. భగవాన్‌ ! నాచేతినుండి కారుచున్న శాకరసాన్ని చూడటంలేదా? దానినిచూచియే ఆనందంతో గంతులు వేస్తున్నాను. ఆ మాటకునవ్వి పరమేశ్వరుడిలా అన్నాడు. ఓ రాగమోహితుడనైన మునీ ! ఇందులో నాకేమి ఆశ్చర్యం కనిపించుటలేదు ! ఆమాట చెప్పి ఆ మహాతేజస్వియైన దేవదేవుడు తనవ్రేలి చివరభాగంతో బొటనవ్రేలిని ప్రహరించాడు. అంతట అందులో నుంచి తెల్లనిమంచులాంటి భస్మం బయటకు వచ్చింది. అది చూచి సిగ్గుపడి ఆ వంకణుడు పరమేశ్వరుని పాదాలమీదవ్రాలి యిలా ప్రార్థించాడు. ప్రభూ ! శంకరా! నిన్నుమించిన దేవుడున్నాడని నేననుకోను. చరా చరజగత్తులో శూలపాణివగు నీవే శ్రేష్టుడవు. ఈ బ్రహ్మాదిదేవతలంతా నిన్నాశ్రయించి బ్రతుకుచున్నారు. ఓ అనఘా! దేవ శ్రేణిలో అగ్రస్ధానం నీదే. ఈ జగత్తునంతను సృష్టించి నడపుతున్నవాడవు నీవే. నీ అనుగ్రహంవల్లనే దేవతలంతా ఎవరివల్లా ఏలాంటి భయంలేకుండా మనుగడ సాగిస్తున్నాడు. ఈ విధంగా స్తుతించి. ఆ ఋషి పరమేశ్వరుని పాదాల పట్టుకొని యిలా అన్నాడు. భగవాన్‌ ! నీదయవల్ల నాతపస్సు నశింపకుండుగాక. అలా అనుగ్రహించుము. అందులకు ఈశ్వరుడిలా అన్నాడు. నీతోబాటు ఈ ఆశ్రమంలో నేనుకూడా ఎల్లప్పుడూ ఉంటాను. సప్తసారస్వత క్షేత్రంలో స్నానంచేసి నన్నర్చించినవానికి ఇహలోకంలోనూ పరలోకంలోకూడా లభించనిదేమీ ఉండదు. శివానుగ్రహంవల్ల అలాంటి అదృష్టవంతులు సర్వోన్నతపదం పొందుతారు. సారస్వత స్వర్గసౌఖ్యాలనుభవిస్తారు.

ఇది శ్రీ వామన మహాపురాణంలోని సరోవరమహాత్మ్యంలో పదునేడవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters