Sri Vamana Mahapuranam    Chapters   

పదమూడవ అధ్యాయము

ఋషయ ఊచుః :

వనాని సప్తనో బ్రూహి నవనద్యశ్చ యాః స్మృతాః | తీర్థానిచ సమగ్రాణి తీర్థస్నానఫలం తథా. 1

యేనయేన విధానేన యస్య తీర్థస్య యత్పలమ్‌ | తత్సర్వంవిస్తరేణహ బ్రూహి పౌరాణికోత్తమః 2

లోమహర్షణ ఉవాచ :

శృణు సప్తవనానీహ కురుక్షేత్రస్య మధ్యతః | యేషాం నామాని పుణ్యాని సర్వపాపహరానిచ. 3

కామ్యకంచ వనం పుణ్యం తథా7దితివనం మహత్‌ | వ్యాసస్య చవనంపుణ్యం ఫలకీవనమేవచ. 4

తత్ర సూర్యవనస్థానం తతా మధువనం మహత్‌ | పుణ్యం శీతవనం నామ సర్వకల్మషనాశనమ్‌. 5

వనాన్యేతాని వై సప్త నదీః శృణుత మేద్విజాః | సరస్వతీ నదీ పుణ్యాతథా వైతరణి నదీ.

6

ఆపగాచ మహాపుణ్యా గంగామందాకినీనదీ | మధుస్రవా, వాసునదీ, కౌశికీపాపనాశినీ. 7

దృషద్వతీమహాపుణ్యా తథాహిరణ్వతీనదీ | వర్షాకాలవహాః సర్వా వర్జయిత్వా సరస్వతీమ్‌.

8

ఏతాసాముదకంపుణ్యం ప్రావృట్కాలేప్రకీర్తితమ్‌ | రజస్వలత్వమేతాసాం విద్యతేనకదా చన |

తీర్థస్యచప్రభావేన పుణ్యా హ్యేతాః సరిద్వరాః . 9

ఋషులు ప్రశ్నించారు. పౌరాణిక శ్రేష్ఠా ! మాకిప్పుడు సప్తవనాలు, నవనదులు తీర్థాలు వానిలో స్నానం చేస్తే వచ్చే ఫలం, ఏఏ తీర్థాలను ఏఏ విధాన సేవిస్తే యేయే ఫలం కలుగుతుందో ఆ వివరమంతా చెప్పండి. అందుకు లోమహర్షణుడిలా చెప్ప మొదలుపెట్టాడు. ఓ ఋషులారా! కురుక్షేత్ర మధ్య భూమిలో ఏడువనాలున్నవి. వాటిపేర్లు పవిత్రాలు. అవి సర్వపాపాలను హరిస్తాయి. పవిత్రమైన కామ్యకవనం, అదితివనం, వ్యాసవనం, ఫలకీవనం, సూర్య వనం, మధువనం, శీతనవనం యివన్నీ సర్వకల్మషాలను హరిస్తాయి. యిక నదుల వివరం వినండి. సరస్వతి, వైతరణి అపగా, గంగ, మధుస్రవ, వాసు, కౌశికి, దృషద్వతి హిరణ్యవతి ఈ నవనదులు పరమ పవిత్రాలు సకల పాపనాశకాలు. వీనిలో సరస్వతి తప్ప మిగిలినవన్నీ వర్షాకాలంలో ప్రవహిస్తాయి. వర్షాకాలంలో గూడ వీటిఉదకానికి రజస్వల దోషమంటదు. అవి పవిత్రమైన జలాలు. అందుకు కారణం అక్కడ ఉన్న పుణ్యతీర్థాలేసుమా ః

శృణ్వంతు మునయః ప్రీతా స్తీర్థస్నానఫలం మహత్‌ | గమనం స్మరణం చైవ సర్వకల్మషనాశనమ్‌. 10

రంతుకంచసరోదృష్ట్వా ద్వారపాలంమహాబలం | యక్షంసమభివాద్యైవ తీర్థయాత్రాంసమాచరేత్‌. 11

తతోగచ్ఛేతవిప్రేంద్రా నామ్నా7దితివనం మహత్‌ | ఆదిత్యాయత్రపుత్రార్థం కృతం ఘోరంమహత్తపః. 12

తత్రస్నాత్వాచ దృష్ట్వా చ ఆదితిందేవమాతరమ్‌ | పుత్రంజనయతే శూరం సర్వదోషవివర్జితమ్‌.

ఆదిత్యశతసంకాశం విమానంచాధిరోహతి| 13

తతో గచ్ఛేత విప్రేంద్రా విష్ణోః స్థానమనుత్తమమ్‌ | సవనంనామవిఖ్యాతం యత్ర సంనిహితో హరిః . 14

విమలేచనరః స్నాత్వా దృష్ట్వాచ విమలేశ్వరమ్‌ | నిర్మలంస్వర్గమాయాతి రుద్రలోకం చ గచ్ఛతి. 15

హరించబలదేవంచ ఏకత్రాససమన్వితౌ | దృష్ట్వామోక్షమవాప్నోతి కలికల్మషసంభ##వైః . 16

తతఃపరిప్లవంగచ్ఛేత్‌ తీర్థంత్రైలోక్య విశ్రుతమ్‌ | తత్రస్నాత్వాచదృష్ట్వాచ బ్రహ్మాణం వేదసంయుతమ్‌. 17

బ్రహ్మవేదఫలం ప్రాప్య నిర్మలం స్వర్గమాప్నుయాత్‌ | తత్రాపిసంగమం ప్రాప్య కౌశిక్యాం తీర్థ సంభవమ్‌.

సంగమేచనరః స్నాత్వా ప్రాప్నోతి పరమం పదమ్‌. 18

దరణ్యాస్తీర్థమాసాద్య సర్వపాపవిమోచనమ్‌ | క్షాంతియుక్తోనరః స్నాత్వా ప్రాప్నోతి పరమంపదమ్‌. 19

ధరణ్యామపరాధాని కృతాని పురుషేణవై | సర్వాణిక్షమతే తస్య స్నానమాత్రస్య దేహినః.

20

తతోదక్షాశ్రమంగత్వా దృష్ట్వా దక్షేశ్వరం శివమ్‌ | అశ్వమేధస్యయజ్ఞస్య ఫలం ప్రోప్నోతి మానవః. 21

తతఃశాలూకినీం గత్వా స్నాత్వా తీర్థే ద్విజోత్తమాః | హరింహరేణ సంయుక్తం పూజ్యభక్తి సమన్వితః.

ప్రాప్నోత్యభిమతాంల్లోకాన్‌ సర్వపాపవివర్జితాన్‌. 22

సర్పిర్దధిసమాసాద్య నాగానాం తీర్థముత్తమమ్‌ | తత్రస్నానం నరః కృత్వాముక్తో నాగభయాద్‌ భ##వేత్‌. 23

తతోగచ్ఛేత విప్రేంద్రా ద్వారపాలంతు రంతుకమ్‌ | తత్రోష్యరజనీమేకాం స్నాత్వా తీర్థవరే శుభే. 24

ద్వితీయంపూజయేద్యత్ర ద్వారపాలం ప్రయత్నతః|

బ్రాహ్మణాన్‌ భోజయిత్వాచ ప్రణిపత్య క్షమాపయేత్‌. 25

తవప్రసాదాత్‌ యక్షేంద్ర ముక్తోభవతికిల్పిషైః | సిద్ధిర్మయాభిలషితా తయాసార్థం భవామ్యహమ్‌.

ఏవంప్రసాద్యయక్షేంద్రం తతః పంచనదం వ్రజేత్‌. 26

పంచనదాశ్చరుద్రేణ కృతా దానవభీషణాః | తత్రసర్వేషులో కేషు తీర్థం పంచనదం స్మృతమ్‌. 27

కోటితీర్థానిరుద్రేణ సమాహృత్య యతః స్థితమ్‌ | తేనత్రైలోక్య విఖ్యాతం కోటితీర్థం ప్రచక్షతే. 28

తస్మిన్‌ తీర్థేనరః స్నాత్వా దృష్ట్వా కోటీశ్వరం హరమ్‌ |

పంచయజ్ఞానవాప్నోతి నిత్యంశ్రద్దాసమన్వితః. 29

మునులారా ! యిక ప్రేమతో మహిమాన్వితమైన తీర్థస్నాన ఫలం వినండి. వానిని స్మరించినా లేక సమీపించినా సర్వకల్మషాలు నశిస్తాయి. మొదల యాత్రికుడు రంతుకానికి వెళ్ళి మహాబలుడైన ద్వారపాలకుడు యక్షునకు మ్రొక్కి తీర్థయాత్ర ప్రారంభించాలి. అక్కడ నుండి అదితివనానికి వెళ్ళాలి. అక్కడ ఆదేవమాత కఠోరమైన తపస్సు చేసి వామనుని పుత్రునిగా పొందింది. అచట స్నానం వేసి అదితి దర్శనం చేసినచో, సర్వదోష రహితుడు, శూరుడు శతసూర్యకాంతి గల విమానం మీద తిరుగునట్టి పుత్రుడు కలుగును. అక్కడ నుండి సవనమనే ప్రసిద్ధి చెందిన విష్ణుస్థానానికి వెళ్ళాలి. అక్కడ ఎల్లవేళల హరిసన్నిహితుడై యుంటాడు. అక్కణ్ణుంచి విమల తీర్థంలో మునిగి విమలేశ్వరుని దర్శించినచో నిర్మలమైన స్వర్గం రుద్రలోకం పొందవచ్చు. శ్రీహరిని బలరాముని ఒకే చోట ఆసీనులగుట చూచినచో కలిదోషాలు వదలి ముక్తి పొందవచ్చును. అచట నుంచి ముల్లోకాలలో విఖ్యాతి గాంచిన పరిప్లవ తీర్థానికి వెళ్ళి స్నానం చేసి వేదాలచే పరివేష్టితుడైన బ్రహ్మదేవుని దర్శించాలి. బ్రహ్మవేదాల అనుగ్రహం వల్ల పవిత్రమైన స్వర్గం పొందవచ్చును. అచట నుండి కౌశికి సంభవ తీర్థంలో సంగమం అయ్యేచోట, సంగమ జలాల్లో స్నానం చేస్తే మానవుడు పరమపదాన్ని పొందుతాడు. తర్వాత పాపాలు పోగొట్టేధరణి తీర్థంలో మునిగినచో నరుడుక్షాంతి కలవాడై ఉత్తమ పదం పొందుతాడు. ఆ తీర్థంలో స్నానం చేసినంతనే ఆ ధరణిమాత ప్రాణుల సర్వపరాధాలు క్షమిస్తుంది. అక్కణ్ణుంచి దక్షాశ్రమంలో దక్షేశ్వరమహాదేవుని దర్శిస్తే అశ్వమేద యజ్ఞ ఫలాన్ని నరుడు పొందుతాడు. తర్వాత శాలూకినీ తీర్థంలో స్నానం చేసి అచట వేంచేసిన హరి హరులను భక్తితో పూజిస్తే పాపరహితులై యిష్టమైన లోకాలను పొందుతారు. అచట నుండి సర్పిర్దధి అనే ప్రసిద్ధమైన నాగతీర్థంలో మునిగినచో సర్ప విషభయాలుండవు. విప్రోత్తములారా! అచట నుంచి రంతుక ద్వారపాలుని వద్దకు వెళ్ళి ఒక రాత్రి గడిపి ఆ పవిత్రతీర్థంలో స్నానం చేసి జాగ్రతగా రెండవద్వారపాలుని పూజించాలి. తర్వాత బ్రాహ్మణులను భుజింపజేసి ద్వారపాలునకు మ్రొక్కి యక్షేశ్వరా ః నా అపరాధాలు క్షమించుము. నీ ప్రసాదం వల్ల సర్వకిల్బిషాలు తొలగినేను కోరిన సిద్ధిలభించునట్లొనరింపుమని అతనిని ప్రసన్నుని గావించుకొనవెలను. అక్కడనుంచి రాక్షసులకు భయంకరంగా, రుద్రుని చేతనిలుపబడిన అయిదు సరస్సుల పంచనద తీర్థంగా లోక ప్రసిద్ధిగాంచిన తీర్థానికి వేళ్ళాలి. అక్కడ త్రిలోకఖ్యాతి పొందిన కోటి తీర్థం ఉంది. రుద్రుడుకోటి తీర్థాలను అచట సమావేశ పరిచాడు. ఆపవిత్ర తీర్థంలో స్నానం చేసి కోటీశ్వర మహాదేవుని దర్శించినచో అయిదు యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది.

తత్త్రైవ వామనో దేవః సర్వదేవైః ప్రతిష్ఠితః | తత్రాపిచనరఃస్నాత్వా హ్యాగ్నిష్టోమఫలం లభేత్‌. 30

అశ్వినోస్తీర్థమాసాద్య శ్రద్దావాన్‌ యోజితేంద్రియః | రూపస్యభాగీభవతి యశస్వీ చ భ##వేన్నరః. 31

వారాహంతీర్థమాఖ్యాతం విష్ణునా పరికీర్తితమ్‌ | తస్మిన్‌ స్నాత్వాశ్రద్దధానః ప్రాప్నోతి పరమందమ్‌.32

తతోగచ్ఛేతవిప్రేంద్రాః సోమతీర్థమనుత్తమమ్‌ | యత్రసోమస్తపస్తప్త్వా వ్యాధిముక్తో7భవత్‌ పురా. 33

తత్రసోమేశ్వరందృష్ట్వా స్నాత్వాతీర్థవరేశుభే| రాజసూయస్య యజ్ఞస్యఫలంప్రాప్నోతిమానవః. 34

వ్యాధిభిశ్చవినిర్ముక్తః సర్వదోషవివర్జితః | సోమలోకమవాప్నోతి తత్త్రైవ రమతేచిరమ్‌.

35

భూతేశ్వరంచ తత్త్రైవ జ్వాలామాలేశ్వరం తథా | తావుభౌలింగావభ్యర్చ్య నభూయో జన్మ చాప్నుయాత్‌. 36

ఏకహంసేనరఃస్నాత్వా గోసహస్రఫలంలభేత్‌ | కృతశౌచంసమాసాద్య తీర్థసేవీద్విజోత్తమః. 37

పుండరీకమవాప్నోతి కృతశౌచోభ##వేన్నరః | తతోముంజవటంనామ

మహాదేవస్యధీమతః. 38

ఉషోష్యరజనీమేకాం గాణపత్యమవాప్ను యాత్‌ | తత్రైవచమహాగ్రాహీ

యక్షిణీలోకవిశ్రుతా. 39

స్నాత్వా7భిగత్వాతత్రైవ ప్రసాద్యయక్షిణీంతతః |ఉపవాసంచతత్రైవ

మహాపాతకనాశనమ్‌. 40

కురుక్షేత్రాస్యతద్ద్వారం విశ్రుతంపుణ్యవర్థనమ్‌ | ప్రదక్షిణముపావర్త్య బ్రాహ్మణాన్‌

భోజయేత్తతః.

పుష్కరంచతతోగత్వా అభ్యర్ఛ్య పితృదేవతాః. 41

జామదగ్న్యేన రామేణ అహృతంతన్మహాత్మనా | కృతకృత్యోభ##వేద్‌ రాజా

అశ్వమేదంచవిందతి. 42

కన్యాదానంచయస్తత్ర కార్తిక్యాం వైకరిష్యతి | ప్రసన్నాదేవతాస్తస్య దాస్యంత్యభిమతం

ఫలమ్‌. 43

కపిలశ్చమహాయక్షో ద్వారపాలః స్వయంస్థితః | విఘ్నంకరోతి పాపానాం దుర్గతించ ప్రయచ్ఛతి. 44

పత్నీతస్య మహాయక్షీ నామ్నోదూఖలమేఖలా | ఆహత్యదుందుభింతత్ర భ్రమతేనిత్యమేవహి. 45

సాదదర్శస్త్రియంచైకాం సుపుత్రాం పాపదేశజామ్‌ | తామువాచతదాయక్షీ ఆహత్య నిశి దుందుభిమ్‌. 46

యుగంధరేదధిప్రాశ్య ఉషిత్వాచాచ్యుతస్థలే | తద్వద్‌ భూతాలయే స్నాత్వా సుపుత్రావస్తుమిచ్ఛసి. 47

దివామయాతేకథితం రాత్రౌ భక్ష్యామి నిశ్చితమ్‌ | ఏతచ్ఛ్రుత్వాతువచనం ప్రణిపత్యచ యక్షిణీమ్‌. 48

ఉవాచ దీనయావాచా ప్రసాదం కురు భామిని | తతఃసాయక్షిణీతాంతు ప్రోవాచకృపయాన్వితా. 49

యదాసూర్యస్యగ్రహణం కాలేన భవితాక్వచిత్‌ | సన్నిహిత్యాం తదా స్నాత్వా పూతాస్వర్గం గమిష్యతి. 50

ఇతి శ్రీవామనమహాపురాణ సరోమాహాత్మ్యే త్రయోదశో7ధ్యాయః.

అచటనే సర్వదేవతలచే ప్రతిష్ఠింపబడిన వామనదేవుని సన్నిధిలో స్నానంచేసి మానవుడు అగ్నిష్టోమ యజ్ఞఫలం పొందగలడు. జితేంద్రియుడు శ్రద్ధాన్వితుడునగువాడు అశ్వినితీర్థం సేవించి రూపసంపదను యశస్సును పొందగలడు. విష్ణువుచే కీర్తింపబడిన వారాహతీర్థంలోమునిగి శ్రద్ధాశువు పరమపదాన్ని పొందుతాడు. బ్రాహ్మణోత్తములారా! అక్కడ నుంచి పవిత్రమైన సోమతీర్థం వెళ్ళాలి. అచటనే చంద్రుడు తపస్సుచేసి రోగముక్తుడయ్యాడు. అచటి తీర్థంలోమునిగి సోమేశ్వరస్వామి దర్శనంచేసినవారలు రాజసూయ యాగఫలం పొందుతారు. వారల వ్యాధులు సర్వదోషాలు తొలగి చిరకాలం చంద్రలోకంలో నివసిస్తారు. అక్కడేఉన్న భూతేశ్వర, జ్వాలామాలేశ్వరుల లింగాలను అర్చించిన వారికి పునర్జన్మ ఉండదు. ఏకహంస తీర్థంలో మునిగినవారలకు వేయిగోవుల దానమిచ్చినఫలం కలుగను. అచటనుండి వెళ్ళి కృతశౌచ క్షేత్రంలో తీర్థసేవచేసి నరుడు శుచియై పుండరీక యజ్ఞఫలం పొందుతాడు. అటనుండి ముంజవట తీర్థంలో ముంజవటేశ్వరుని అర్చించి, ఒక రాత్రి ఉపవసించినచో గాణపత్యము ప్రాప్తించును. అచటనే మహాగ్రాహి యక్షిణి తీర్థమున్నది. అచట స్నానం ఉపవాసం చేసి యక్షిణీ దేవతను ప్రసన్నురాలిని గావించుకొనుచో ఘోరపాపాలన్నీ నశించును. ఆ ప్రదేశం కురుక్షేత్రంయొక్క పుణ్యవర్థక ద్వారంగా ప్రసిద్ధిచెందింది. దానికి ప్రదక్షిణం చేసి బ్రాహ్మణ సమారాధనచేయాలి. అటనుండి జమదగ్నిపుత్రుడు పరశురాముడు ప్రతిష్ఠించిన పుష్కరతీర్థంలో పితృదేవతలనర్చించినరాజు అశ్వమేధఫలం పొంది ధన్యుడౌతాడు. అచ్చోట కార్తికమాసంలో కన్యాదానం చేసిన వానికి ప్రసన్నులై దేవతలు కోర్కెలన్నీ సిద్దింపజేస్తారు. అచట నుండు ద్వారపాలుడు, కపిలుడనే మహాయక్షుడు, పాపులకువిఘ్నాలు కలిగించి వేధిస్తాడు. ఉదూఖలమేఖల అనే అతని భార్యమహా యక్షిణి ఎల్లప్పుడు దుందుభిమ్రోగిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఒక పర్యాయం ఆమె పాపదేశం లోపుట్టి కుమారునితో వచ్చిన ఒక స్త్రీనిచూచి రాత్రివేళ దుందుభిని మ్రోగిస్తూ యిలా అన్నది - యుగంధర తీర్థంలో పెరుగుతిని, అచ్యుత తీర్థంలో ఉపవాసంచేసి, అట్లే భూతాలయ తీర్థం లో స్నానంచేస్తే నీ కొడుకుతో జీవించగలవు. ఈ విషయం నీకుపగటివేళ చెప్పుచున్నాను. రాత్రికాగానే నిన్ను తప్పక భక్షిస్తాను. ఆ మాటలకు భయపడి ఆ స్త్రీ దీనస్వరంతో నన్నెలాగయినా కాపాడుమని వేడుకొనగా దయతలచి ఆ యక్షిణి ఉపాయం చెప్పింది. సూర్యగ్రహణ సమయంలో ఎప్పుడైనా యిచటి సన్నిహితతీర్థంలో మునిగినచో పవిత్రురాలవై స్వర్గానికి పోగలవు.

ఇది శ్రీ వామన మహాపురాణంలో సరోమాహాత్మ్యంలో పదమూడవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters