Sri Vamana Mahapuranam    Chapters   

ఐదవ అధ్యాయము

కశ్యప ఉవాచ :

నమోస్తుతే దేవదేవ ఏకశృంగ వృషార్చే

సింధువృష వృషాకపే సురవృష అనాదిసంభవ

రుద్ర కపిల విష్వ క్సేన సర్వభూతపతే ధ్రువ

ధర్మాధర్మ వైకుంఠ వృషావర్తఅనాదిమధ్యనిధన

ధనంజయ శుచిశ్రవః పృశ్ని గర్భ నిజజయ. 5

అమృతేశయ సనాతన త్రిధామ తుషిత మహాతత్త్వ

లోకనాథ పద్మనాభ విరించే బహురూప అక్షయ

అక్షర హవ్యభుజ ఖండపరశో శక్ర ముంజకేశ

హంస మహాదక్షిణ హృషీకేశ సూక్ష్మ మహానియమధర

విరజ లోకప్రతిష్ఠ అరూప అగ్రజ ధర్మజ ధర్మనాభ. 10

గభస్తినాభ శతక్రతునాభ చంద్రరథ సూర్యతేజః

సముద్రవాసః ఆజ సహస్రశిరః సహస్రపాద

అధోముఖ మహాపురుష పురుషోత్తమ సహస్రబాహో

సహస్రమూర్తే సహస్రాస్య సహస్రసంభవ సహస్ర సత్వం

త్వామాహుః పుష్పహాస చరమత్వమేవ వౌషట్‌. 15

వషట్కారం త్వామాహురగ్ర్యం మఖేషు ప్రాశితానం సహస్రధారం

చ భూశ్చభువశ్చ స్వశ్చత్వమేవ వేదవేద్య బ్రహ్మశయ

బ్రాహ్మణప్రియ త్వమేవ ద్యౌరసి మాతరిశ్వాసి

ధర్మోసి హోతా పోతా మంతా నేతా హోమహేతు స్త్వమేవ

అగ్ర విశ్వదామ్నా త్వమేవ దిగ్బిః సుభాండ 20

ఇజ్యోసి సుమేధోసి సమిదస్త్వమేవ మతి ర్గతిర్‌

దాతా త్వమసి. మోక్షోసి యోగోసి సృజసి.

ధాతా పరమయజ్ఞోసి సోమోసి దీక్షితోసి దక్షిణాసి

విశ్వమసి. స్థవిర హిరణ్యనాభ నారాయణ

త్రినయన ఆదిత్యవర్ణ ఆదిత్యతేజః మహాపురుష. 25

పురుషోత్తమ ఆదిదేవ సువిక్రమ ప్రభాకర

శంభో స్వయంభో భూతాదిః మహాభూతోసి విశ్వభూత

విశ్వం త్వమేవ విశ్వగోప్తాసి పవిత్రమసి విశ్వబవ

ఊర్ధ్వకర్మ అమృత దివస్పతే వాచస్పతే ఘృతార్చే

అనంతకర్మ వంశప్రాగ్వంశ విశ్వపాస్త్వమేవ 30

వరార్థినాం వరదోసి త్వం.

చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ |

హూయసే చ పునర్ద్వాభ్యాం తుభ్యంహోత్రాత్మనే నమః. 31

ఇతి శ్రీవామనమహాపురాణ సరోమాహాత్మ్య పంచమోధ్యాయః.

కశ్యపుడిలా స్తోత్రంచేశాడు : ఓ దేవా, ఏకశృంగా, పృసార్చీ, సింధుపతే, కృషాకపీ, సురశ్రేష్ఠ అనాద సంభవా రుద్రా కపిలా విష్వక్సేనా సర్వభూతపతీ, ధ్రువా ధర్మాధర్మా, వైకుంఠా, వృషావర్తా అనాది మధ్యవిధనా ధనంజయా, శుచిశ్రవా (సత్కీర్తీ), పృశ్నితేజా నిజజయా నీకు నమస్కారము అమృతేశయా సనాతనా, త్రిధామా, తుషితా, మహాతత్వా, లోకనాథా, పద్మనాభా, విరించీ, బహురూపా, అక్షయా, అక్షరా, హవ్యభోజీ, ఖండపరశూ, శక్రా, ముంకేశా, హంసా, మహా దక్షిణా, హృకేశా, సూక్ష్మా, నుహానియమధరా, విరజా, లోకప్రతిష్ఠా అరూపా, ఆగ్రజా, ధర్మజా ధర్మనాభా నీకు ప్రణామాలు. గభస్తినాభా శతక్రతునాభా చంద్రరథా సూర్యతేజా, సముద్రవసనా, అజా, సహస్రశీర్షా, సహస్రచరణా, అధోముఖా మహాపురుషా, పురుషోత్తమా, సహస్రబాహూ, సహస్రరూపా, సహస్రముఖా,సహస్రసంభవా, సహస్రసత్త్వా, నిన్ను ఈ విధంగా వర్ణిస్తారు. ఓ పుష్పహాసా, చరమా, వౌషట్‌ వషట్‌ కారాలు నీవే. నిన్ను మొదటివాడనీ యజ్ఞభోక్తవనీ, సహస్రధారివనీ భూర్భువః సువర్లోక రూపడవని, వేదవేద్యుడవు మహాశయుడవు బ్రాహ్మణప్రియుడవనీ అంటారు. అంతరిక్షం, వాయువు ధర్మానివీ నీవే. హోతవు, పురోహితుడవు నీవే, మంత్రానివి నీవే. నేతవు హోమహేతువు నీవే. నీవే ఆగ్ర్యుడవు విశ్వధాముడవు. దిక్కులు నీవు. సుభాండము, యజింపబడదగినవాడవు, చక్కని మేదస్వరూపిని నీవే. సమిధలు, మతిగతి, దాతవు నీవే. మోక్షం నీవు యోగం నీవు స్రష్టవు నీవు, ధాతవు,పరమయజ్ఞానివి. సోమరసానివి, దీక్షితుడవు, యజ్ఞదక్షిణవు. విశ్వానివీ నీవే. స్థవిరుడవు, హిరణ్యనాభుడవు, నారాయణుడవు, త్రినేత్రుడవు, ఆదిత్యవర్ణుడవు ఆదిత్య తేజస్వియగు మహాపురుషుడవు, పురుషోత్తముడవు ఆదిదేవుడవు సువిక్రముడవు ప్రభాకరుడవు, శంకరుడవు, స్వయంభువు నీవే. సమస్త భూత జాలానికీ ఆదిని, మహాభూతానివి, విశ్వభూతానివి, విశ్వానివి, విశ్వరక్షకుడవు నీవే. నీవు పవిత్రుడవు. విశ్వభవుడవు, ఊర్ధ్వ కర్మవు, అమృతానివి, దివస్పతివి, వాచస్పతివి, ఘృతార్చివి, వంశానివి, ప్రాగ్వంశానవి (అన్ని వంశాలకు మూలం). విశ్వ రక్షకుడవు నీవే, అర్ధులకు కామ్యాలు కర్షించే వరదుడవగు నీకునమస్కారం. నిన్ను నాలుగు మరి నాలుగు, రెండు మరియు అయిదు మరల రెండు హోమాలతో అర్చిస్తారు. అట్టి హోత్రాత్మ (యజ్ఞరూపి)వగు నీకు ప్రభో ! నమస్సులు !

ఇది శ్రీ వామన మహాపురాణమందలి సరోమాహాత్మ్యంలోని అయిదవ అధ్యాయం సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters