Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది ఒకటవ అధ్యాయము

నారద ఉవాచ :

కథం కాత్యాయనీ దేవీ సానుగం మహిషాసురమ్‌ | సనాహనంహతవతీ తథా విస్తరతో వద. 1

ఏతచ్చసంశయంబ్రహ్మాన్‌ హృది మే పరివర్తతే | విద్యమానేషు శ##స్త్రేషు యత్పద్భ్యాం తమమర్దయత్‌| 2

పులస్త్య ఉవాచ :

శ్రుణుష్వావహితో భూత్వా కథామేతాం పురాతనీమ్‌ | వృత్తాందేవయుగస్యాదౌ పుణ్యాం పాపభయాపహామ్‌. 3

ఏవంసనమరఃక్రుద్దః సమాపతత వేగవాన్‌ | సగజాశ్వరథోబ్రహ్మన్‌ దృష్టో దేవ్యా యథేచ్ఛయా. 4

తతో బాణగణౖర్దైత్యః సమానమ్యాథ కార్ముకమ్‌ | వవర్షశైలం ఢారౌఘైర్‌ ద్యౌరివాంబుదవృష్టిభిః. 5

శరవర్షేణ తేనాథవిలోక్యాద్రిం సమావృతమ్‌ | క్రుద్ధాభగవతీ వేగా దాచకర్ష ధనుర్వరమ్‌. 6

తద్దనుర్దానవేసైన్యేదుర్గయా నామితం బలాత్‌| సువర్ణపృష్ఠంవిబభౌ

విద్యుదంబుధరేష్వివ. 7

బాణౖః సురరివూ నన్యాన్‌ ఖడ్గేనాన్యాన్‌ శుభవ్రత| గదయాముసలేనాన్యాం శ్చర్మణా7న్యా నపాతయత్‌. 8

ఏకో7ప్యసౌబహూన్‌ దేవ్యాః కేసరీ కాలసంనిభః | విధున్వన్‌ కేసరసటాం నిషూదయతి దానవాన్‌. 9

కులిశాభిహతా దైత్యాఃశక్త్యానిర్భన్నవక్షసః | లాంగలైర్దారితగ్రీవా వినికృత్తాః పరశ్వథైః. 10

దండనిర్భిన్న శిరస శ్చక్రవిచ్ఛిన్న బంధనాః | చేలుః పేతుశ్చ మవ్లుుశ్చ తత్యజు శ్చాపరేరణమ్‌. 11

తేవధ్యమానా రౌద్రయా దుర్గయా దైత్యదానవాః | కాలరాత్రింమన్యమానా దుద్రవు ర్భయపీడితాః. 12

సైన్యాగ్రంభగ్న మాలోక్య దుర్గామగ్రే తథాస్థితామ్‌ | దృష్ట్వాజగామనమరో మత్తకుంజర సంస్థితః. 13

సమాగమ్యచ వేగేన దేవ్యాఃశక్తిం ముమోచహ | త్రిశూలమపి సింహాయ ప్రాహిణోద్‌ దానవోరణ.. 14

తావాపతంతౌ దేవ్యాతు హుంకారేణాథ భస్మసాత్‌ | కృతావథ గజేంద్రేణ మధ్యతో

హరిః. 15

అథోత్పత్య చవేగేన తలేనాహత్యదానవమ్‌ | గతా7సుః కుంజరస్కంధాత్‌ క్షిప్య దేవ్యై నివేదితః. 16

నారద వచనము : బ్రహాన్‌ ! ఆ కాత్యాయనీ దేవి ఆ మహిషదైత్యుని సకల సైన్యంతో సహా ఎలా సంహరించిందో వివరంగా చెప్పండి. అన్ని శస్త్రాస్త్రాలు కలిగి కూడ కాళ్ళతో ఎలా మర్దించింది ? అందులకా పులస్త్య మహర్షి యిలా చెప్పాడు. నారదా ! ఈ పవిత్రమూ పాపభయాహరమూ అయిన వృత్తాంతం చాలా పురాతన కాలం. కృత యుగం-నాటిది. దీనిని శ్రద్ధగా ఆలకించుము. ఆ విధంగా క్రోధాన్మత్తుడైన మరుడు చతురంగ బలంతో దేవి మీద లంఘించడంతో ఆమె వాని వైపు తదేకదీక్షగా చూచింది. అంతనారాక్షసుడు ప్రచండమైన బాణాసనాన్ని ఎక్కుపెట్టి ఆ వింధ్యాద్రిని బాణవృష్టితో కప్పివేశాడు. వాని ఔద్ధత్యం చూచి భగవతి మహావేగంతో తన శ్రేష్ఠమైన ధనస్సు ఆకర్ణాంతం వంచింది. బంగారువికారం గల ఆ ధనస్సు దానవ సైన్యంలో మేఘాలమధ్య ప్రళయ విద్యుత్తువలె వెలిగింది. అంతటనాదేవి కొందరిని బాణాలతో, కొందరిని ఖడ్గంతో, కొందరను గదతో, కొందరను ముసలంతో, మరికొందరిని చర్మంతో సంహరించింది. ఇక ఆ దేవి వాహనం కాలమృత్యువులాంటి సింహం వంటరిగానే తన జటలను ఝుళిపించి ఎందరో రక్కసులను సంహరించింది. కొందరు రాక్షసులు వజ్రాఘాతాలకు మరణించారు. కొందరి గుండెలు శక్తి తగిలి బ్రద్దలయ్యాయి. కొందర కంఠాలు నాగలివ్రేటులకు చీలిపోయాయి. మరికొందరి తలలు పరశుఘాతాలకు తెగిపోయాయి.గదవ్రేటుకెందరతలలో నుగ్గయుపోతే, చక్రజ్వాలల కెందర సంధిబంధాలు మాంసఖండాలో ఊడిపోయినాయి. ఎందరో భయకంపనంతో నేలకొరిగారు. ఇతరులాభయానక సంహారకాండకు బెదరి పారిపోయారు. వారలకాదేవి రౌద్రరూపం, ప్రత్యక్షకాళరాత్రిగా మృత్యువుగా భాసించింది. తన అనిమొన ఆ విధంగా కకావికలు కావడం ఆ దేవి చెక్కుచెదరకుండా ఉండడం చూచిన నమరుడు మదించిన ఏనుగునెక్కి దేవి మీదకు లంఘించాడు. ఆమె పైకి శక్తిని విడిచాడు. సింహం మీద త్రిశూలం ప్రయోగించాడు. దేవికావించిన హుంకారంతోనే ఆ రెండు ఆయుధాలు భస్మమైపోయాయి. అంతలో ఆ రాక్షసుడి గజం తన తొండంతో దేవి సింహాన్ని ఒడిపి పట్టింది. మెరుపు వేగంతో ఏనుగు పట్టును విడిపించుకుని ఆ మృగేంద్రం తన పంజాతో దానవుని గట్టిగాకొట్టగా వాడు ఏనుగుమీద నుంచి క్రిందపడి ప్రాణాలు వదలాడు. వాడి మృతదేహాన్ని సింహం భగవతికి సమర్పించింది.

గృహీత్వా దానవం మధ్యేబ్రహ్మన్‌ కాత్యాయనీరుషా | సవ్యేనపాణినాభ్రామ్యవాదయత్‌ పటహంయథా. 17

తతో7ట్టహాసంముముచే తాదృశో వాద్యతాంగతే | హాస్యాత్సముద్భవంతస్యా భూతానానావిధా7ద్భుతాః. 18

కేచిద్వ్యాఘ్రముఖా రౌద్రా వృకాకారా స్తథాపరే . హయస్యామహిషాస్యాశ్చ వరాహవదనాః పరే. 19

ఆభుకుక్కటవక్త్రాశ్చ గో7జావికముఖాస్తథా | నానావక్త్రాక్షిచరణా నానాయుధధరాస్తథా . 20

గాయంత్యన్యేహసంత్యన్యేరమంత్యన్యేతుసంఘశః | వాదయంత్యపరే తత్ర స్తువంత్యన్యే తథాంబికామ్‌. 21

సాతైర్భూతగణౖర్దేవీ సార్థం తద్దానవంబలం | శాతయామాస చాక్రమ్య యథాసస్యం మహా7శనిః. 22

సేనాగ్రేనిహతేతస్మిన్‌ తథాసేనాగ్రగామిని | చిక్షురఃసైన్యపాలస్తు యోధయామాస

దేవతాః. 23

కార్ముకందృఢమాకర్ణ మాకృష్య రథినాంవరః | వవర్షశరజాలాని యథామే ఘో వసుంధరామ్‌. 24

తాన్‌ దుర్గాస్వశ##రైశ్ఛిత్వా శరసంఘాన్‌ సుపర్వభిః | సౌవర్ణపుంఖానపరాన్‌ శరాన్‌ జగ్రాహ షోడశ. 25

తతశ్చ తుర్భిశ్చతుర స్తురంగానపి భామినీ | హత్వాసారథిమేకేన ధ్వజమేకేన చిచ్ఛిదే. 26

తతస్తు సశరంచాపం చిచ్ఛేదైకేషుణా7బికా | ఛిన్నేధనుషిఖడ్గంచ చర్మ చాదత్తవాన్‌ బలీ. 27

తంఖడ్గం చర్మణాసార్థం దైత్యస్యాధున్వతో బలాత్‌ | శ##రైశ్చతుర్భిశ్చిచ్ఛేద తతః శూలం సమాదదే. 28

సముద్ర్భామ్యమహచ్ఛూలం సంప్రాద్రవదథాంబికామ్‌ | క్రోష్ఠుకో ముదితో7రణ్య మృగరాజవధూం యథా.

తస్యాభిపతతః పాదౌ కరౌ శీర్షంచ పంచభిః | శ##రైశ్చిచ్ఛేదసంక్రుద్ధా న్యపత న్నిహతో7సురః. 30

విప్రోత్తమా! ఆ దానవుని నడుము పట్టుకొని శ్రీదేవి ఎడమచేతితో గిరగిర త్రిప్పుచు డోలు వాయించినట్లు తాడించింది. వెంటనే వాడి శరీరం డోలుగా మారింది. అది చూచి కాత్యాయని పెద్దగా అట్టహాసం చేయడంతో ఆ నవ్వులో నుంచి రకరకాలయిన అద్భుత భూతాలు బయలుదేరాయి. వానిలో కొన్ని వ్యాఘ్రముఖాలు గలవి కాగా కొన్ని తోడేలుముఖాలతో ఉన్నాయి. కొన్ని భూతాల ముఖాలు గుర్రాలు, దున్నపోతులు పందులు, ఎలుకలు, కోళ్ళు, ఆవులు, మేకలు, గొర్రెలులాగా ఉన్నాయి. వాటి కాళ్ళు కండ్లు రకరకాలుగా ఉన్నవి. నానావిధాలైన ఆయుధాలు దాల్చిన ఆ భూత గణాలు కొన్ని పాడుతూంటే కొన్ని నవ్వుతున్నాయి. కొన్ని ఆడుకుంటుంటే కొన్ని గుంపులుగా వాద్యాలు మోగిస్తున్నవి. మిగిలినవి పరమేశ్వరి అంబికను స్తోత్రం చేస్తున్నవి. ఆ భూతగణాలతో కలిసి ఆదేవి, పిడుగుల వర్షం పంటచేలను ధ్వంసం చేసినట్లు ఆ రాక్షస బలాన్ని నాశనం చేసింది. సేనపతి మరణించి సేనా ముఖం వ్రీలిపోవడంతో సైన్యపాలకుడైన చిక్షురుడు దేవతలతో యుద్ధానికి తలపడ్డాడు. ఆ మహారథుడు భయంకరమైన ధనుస్సు ఎక్కుపెట్టి వర్షధారలు భూమిని ముంచినట్లు దేవి సైన్యాన్ని బాణాలతో నింపాడు. వాడి బాణాలను తనవాడియైన శరాలతో ఛేదించి ఆ దుర్గ, బంగారు రెక్కలుగల పదహారు ఉత్తమ బాణాలను అందుకున్నది. నాలుగు బాణాలతో చిక్షురుడి నాలుగు గుర్రాలను, ఒక బాణంతో సారథిని, మరొక నారాచంతో రథకేతనాన్ని కూల్చింది. ఒక వాడి బాణంతో ఆ రాక్షసుడి ధనుర్బాణాలను ఖండించడంతో ఆవీరుడు ఖడ్గం చర్మం ధరించి విజృంభించాడు. నాలుగు బాణాలతో నాభగవతి వాటిని కూడ ఖండించగా వాడు శూలంతీసి కున్నాడు. దానిని వేగంగా త్రిప్పుచు, సంతోషంతో ఆడు సింహం మీదకు దుమికే శృగాల (నక్క) వలె ఆకాత్యాయని మీదకు లంఘించాడు. అంతట క్రోధంతో ఆ దేవి అయిదు బాణాలువేసి ఆ రాక్షసుని కరచరణాలను తలను ఖండించి వేసినది. దానితో వాడు విగత జీవుడై నేల కొరిగినాడు.

తస్మిన్‌ సేనాపతౌ క్షుణ్ణ తదోగ్రాస్యోమహా7సురః | సమాద్రవతవేగేన కరాళాస్యశ్చ దానవః. 31

బాష్కలశ్చోద్దతశ్చైవ ఉదగ్రాఖ్యో గ్రకార్ముకః | దుర్ధరోదుర్మఖశ్చైవ బిడాలనయనో7పరః. 32

ఏతే7న్యేచమహాత్మానో దానవా బలినాంవరాః | కాత్యాయనీమాద్రవంత నానాశస్త్రాస్త్రపాణయః. 33

తాన్‌ దృష్ట్వాలీలయా దుర్గావీణాం జగ్రాహపాణినా | వాదయామానసహసతీ తథా డమరుకంవరమ్‌ . 34

యథా యథా వాదయతే దేవీ వాద్యానితానితు | తథాతథాభూతగణా నృత్యంతిచ హసంతిచ . 35

తతో7సురాఃశస్త్రధరాః సమభ్యేత్య సరస్వతీమ్‌ | అభ్యఘ్నంస్తాంశ్చ జగ్రాహ కేశేషు పరమేశ్వరీ. 36

ప్రగృహ్య కేశేషు మహాసురాంస్తాన్‌ ఉత్పత్యసింహాత్తునగస్యసానుమ్‌ |

ననర్తవీణాంపరివాదయంతీ పపౌచపానంజగతోజనిత్రీ. 37

తతస్తుదేవ్యాబలినోమహాసురా దోర్దండనిర్ధూతవిశీర్ణదర్పాః|

విస్రస్తవస్త్రావ్యసవశ్చజాతాః తతస్తుతాన్వీక్ష్యమహాసురేంద్రాన్‌. 38

దేవ్యామహౌజామహిషాసురస్తు వ్యద్రావయద్‌ భూతగణాన్‌ ఖురాగ్రైః. 39

నాదేనచైవాశనిసన్నిభేన విషాణకోట్యాత్వపరాన్‌ ప్రమథ్య |

దుద్రావసింహంయుధిహంతుకామః తతో7బికాక్రోధవశంజగామ. 40

తతఃసకోపాదథతీక్షశృంగః క్షీప్రంగిరీన్‌ భూమిమశీర్ణయచ్చ |

సంక్షోభయంస్తోయనిధీన్‌ ఘనాంశ్చ విధ్వంసయన్‌ ప్రాద్రవతాథదుర్గామ్‌. 41

సాచాథపాశేనబబంధదుష్టం సచాప్యభూత్‌ క్లిన్నకటఃకరీంద్రః|

కరంప్రచిచ్ఛేదచహస్తినో7గ్రం సచాపిభూయోమహిషో7భిజాతః. 42

తతో7స్యశూలంవ్యసృజన్మృడానీ స శీర్ణ మూలోన్యపతత్‌ పృథివ్యామ్‌|

శక్తింప్రచిక్షేపహుతాశదత్తాం సాకుంఠితాగ్రాన్యపతన్మహర్షే. 43

చక్రం హరేర్దానవచక్రహంతుః క్షిప్తంత్వచక్రత్వముపాగతంహి |

గదాంసమావిధ్యదనేశ్వరస్య క్షిప్తాతు భగ్నాన్యపతత్‌ పృథివ్యామ్‌. 44

సేనాపతి ఓడిపోగా ఉగ్రాస్యకరాళాస్యులనే మహాసురులిద్దరు కాత్యాయనితో తలపడిరి. బాష్కలుడు, ఉద్దతుడు ఉదగ్రుడు ఉగ్రకార్ముకుడు దుర్ధరుడు దుర్మఖబిడాలాక్షాదులనేకులు మహాబలశాలులైన దానవవీరులు నానాశస్త్రాస్త్రాలు ధరించి దేవిక భిముఖంగా పరుగెత్తారు. ఆ దుర్గ వారలను చూచి అలవోకగా వీణను డమరుకాన్ని చేతగొని నవ్వుతూ వాయించ నారంభించింది. ఆమె వాయించేకొద్ది భూతగణాలన్నీ నవ్వుతూ నృత్యం చేయసాగాయి. ఆ మహా7సురులు శస్త్రాలతో కాత్యాయనిని ప్రహరించగా నా పరమేశ్వరి ఆ రాక్షసులకేశాలు పట్టుకొని సింహం మీదనుంచి పర్వత సానువు మీద దూకి, వీణవాయిస్తూ పానం సేవిస్తూ నాట్యం చేయసాగింది. శ్రీదేవి బాహుబలం వల్ల ఆ మహాదానవుల గర్వం పటపంచలు కాగా వారంతా వివస్త్రులై ప్రాణాలు కోల్పోయి నేలపైబడిరి. అలా చచ్చిపడిన తన వారలను చూచి మహావీరుడైన మహిషుడు తన కాలిడెక్కలతో తోకతో కాళ్ళతో భూతగణాలన్నింటినీ పారదోలాడు. ఆశని ఘోషంలాంటి అరపులతో వేడి ఊర్పులతో, ముట్టెతో, వాడికొమ్ములతో' శత్రువులనుమర్దించి ఆ దుష్టుడు సింహాన్ని చంపేందుకు దాని వెంటబడ్డాడు. అది చూచి అంబిక క్రోధంతో నిండిపోయింది. అంతనారాక్షసుడు తన వాడియైన కొమ్ములతో క్రుమ్మి పర్వత శిఖరాలను, భూతలాన్ని సముద్రాలను మేఘాలను ఛిన్నా భిన్నం చేసి దుర్గాదేవి మీదకు విరుచుపడ్డాడు. ఆమె ఆ దుష్టుని పాశంతో బంధించగా వాడు మదకరీంద్రంగా మారాడు. ఆమె దాని తుండాన్ని నరికివేయగా వాడు మళ్ళీ దున్నపోతుగా మారాడు. ఆభవాని వాడిమీద శూలం విసిరితే అదిపొడియై క్రిందపడిపోయింది. అగ్నిదత్తమైన శక్తిని ప్రయోగిస్తే అదికూడ మొక్కబోయి పడిపోయింది. ఓ మహర్షీ ! విష్ణువు యిచ్చిన చక్రం వాడి మీద ప్రయోగించింది. అయితే అదితన చక్రత్వాన్నే కోల్పోయింది. అంతనామె మండిపడి కుబేర దత్తమైన గదతో ప్రహరించగా అది భగ్నమైనది. వరుణుడిచ్చిన పాశాన్ని కూడ ఆ రాక్షసుడు తన కొమ్ములతో ముట్టెతో గిట్టలతో ముక్కలు చేశాడు. దానితో దుర్గ యముడిచ్చిన కాలదండం వేయగా అది ముక్కలైపోయింది.

జలేశపాశో7పిమహాసురేణ విషాణతుండాగ్రఖుర ప్రణున్నః|

నిరస్యతత్కో పితయాచముక్తో దండస్తు యామ్యోబహుఖండతాంగతః. 45

వజ్రం సురేంద్రస్యచ విగ్రహే7స్య ముక్తం సుసూక్ష్మత్వముపాజగామ|

సంత్యజ్యసింహం మహిషాసురస్య దుర్గా7ధిరూఢాసహసైవపృష్ఠమ్‌. 46

పృష్ఠస్థితాయాంమహిషా7సురో7పి పోప్లూయతేవీర్యమదాన్‌ మృడాన్యామ్‌|

సచా7పిపద్భ్యాం మృదుకోమలాభ్యాం మమర్దతం క్లిన్నమివాజినంహి. 47

సమృద్యమానో ధరణీధరాభో దేవ్యాబలీహీనబలోబభూవ |

తతో7స్యశూలేన బిభేదకంఠం తస్మాత్‌ పుమాన్‌ ఖడ్గధరోవినిర్గతః. 48

నిష్క్రాంతమాత్రం హృదయేయదాతం ఆహత్యసంగృహ్యకచేషుకోపాత్‌ |

శిరఃప్రచిచ్ఛేదవరాసినా7స్య హాహాకృతందైత్య బలంతదా7భూత్‌. 49

సచండముండాః సమయాః సతారాః సహాసిలోమ్నాభయకాతరాక్షాః.

సంతాడ్యమానాః ప్రమథైర్భవాన్యాః పాతాళ##మేవావివిశుర్భయార్తాః. 50

దేవ్యాజయందేవగణా విలోక్య స్తువంతిదేవీంస్తుతిభిర్మహర్షే |

నారాయణీం సర్వజగత్ర్పతిష్ఠాం కాత్యాయనీం ఘోరముఖీంసురూపామ్‌. 51

సంస్తూయమానా సురసిద్దసంఘై ర్నిషణ్ణభూతాహరపాదమూలే |

భూయో భవిష్యామ్యమరార్థమేవ ముక్త్వాసురాంస్తాన్‌ ప్రవివేశదుర్గా. 52

ఇతి శ్రీవామనమహాపురాణ ఏకవింశో7ధ్యాయః.

ఇంద్ర దత్తమైన వజ్రాయుధం ఆ మహిషుని తాకి నుగ్గు నూచమైంది. దానితో రెచ్చిపోయిన ఆదుర్గ సింహం వదలి మహిషుడి వీపుమీదకు లంఘించింది. మహిషుడామెను క్రిందకు త్రోసివేయాలని ప్రయత్నించి విఫలుడైనాడు. ఆమె ఆ దున్నపోతు రక్తసిని తనమెత్తని పాదాలతో తడిసిన తోలను తొక్కినట్లు మర్దించింది. దానితో వాడి బలమంతా నశించింది. ఆమె వాని శిరస్సును శూలంతో తెగవేసింది. ఆకళేబరంలోంచి ఖడ్గధారియైన పురుషుడు బయటకు వచ్చాడు. బయటకు రావడంతోడనే ఆ దేవి తన కత్తితో వాని గుండెలపై బలంగా తాడించి మహా క్రోధంతో వాని జుట్టు పట్టుకొని తన వాడియైన ఖడ్గంతో వాని శిరస్సును ఛేదించివైచెను. దానితో రాక్షస బలాలలో హాహాకారాలు చెలరేగాయి. అంతట భవాని ప్రమథ గణాలచే చావు దెబ్బలు తిని చండ ముండ మయతారాసిలోమాదులైనరాక్షసవీరులు భయంకపితులై పాతాళలోకానికి పారిపోయారు. అంతట పరమేశ్వరి విజయాన్ని విలోకించిన దేవతలందరూ, ఘోరముఖీ సౌందర్యరాశీ, సర్వజగద్రక్షకీ అయిన ఆ నారాయణి కాత్యాయనీ దేవిని పలు విధాల స్తుతించారు. ఓ మహర్షీ ! ఆ విధంగా సురసిద్ధ సంఘాల ప్రార్థన లందుకుంటూ నా మహాదేవి, దేవకార్యార్థమై తాను మరల జన్మించగల నని చెబుతూ హరుని చరణాలకడకు జేరెను.

ఇది శ్రీవామన మహా పురాణంలో యిరువదియొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters