Sri Vamana Mahapuranam    Chapters   

పండ్రెండవ అధ్యాయము

సుకేశిరువాచ:

కర్మణా నరకానేతాన్‌ కేనగచ్ఛంతివై కథామ్‌ | ఏతద్వదంతు విప్రేంద్రాః పరంకౌతూహలం మమ. 1

ఋషయః ఊచుః:

కర్మణాయేనయేనేహ యాంతిశాలకటంకట | స్వకర్మఫలభోగార్థం నరకాన్‌ మేశృణుష్వతాన్‌. 2

వేదదేవద్విజాతీనాం యైర్నిందా సతతంకృతా | యే పురాణతిహాసార్థాన్‌ నాభినందంతి పాపినః. 3

గురునిందాకరాయే చ మఖవిఘ్నకరాశ్చయే | దాతుర్నివారకాయే చ తేతేషునిపతంతిహి. 4

సుహృద్దంపతిసోదర్య స్వామిభృత్య పితాసుతాన్‌ | యాజ్యోపాధ్యాయయోర్యైశ్చ కృతోభేదో7ధమైర్మిథః.

కన్యామేకస్యదత్వా చ దదత్యన్యస్యయే7ధమాః | కరపత్రేణపాట్యంతే తేద్విధా యమకింకరైః. 6

పరోపతాపజనకా శ్చందనోశీరహారిణః | వాలవ్యజనహర్తారః కరంభసికతాశ్రితాః. 7

నిమంత్రితో7స్యతో భుంక్తేశ్రాద్ధేదై శేనపైతృకే | సద్విధాకృష్యతేమూఢ స్తీక్‌ష్ణతుండైః ఖగోత్తమైః. 8

మర్మాణియస్తుసాధూనాం తుదన్‌ వాగ్భిర్నికృంతతి | తస్యోపరితుదంతస్తు తుండైస్తిష్ఠంతి పత్రిణః. 9

యఃకరోతి చ పైశున్యం సాధూనామన్యథామతిః | వజ్రతుండనఖాజిహ్వా మాకర్షంతే7స్యవాయసాః. 10

మాతాపితృగురూణాం చ యే7వజ్ఞాం చక్రురుద్ధతాః |

మజ్జంతే పూయవిణ్మూత్రే త్వప్రతిష్ఠేహ్యధోముఖాః. 11

దేవతా7తిథిభూతేషు భృత్యేష్వభ్యాగతేషు చ| అభుక్తవత్సు యే7శ్నంతి బాలపిత్రగ్నిమాతృషు. 12

దుష్టాసృక్సూయనిర్యాసం భుంజంతేత్వధమాఇమే | సూచీముఖాశ్చ జాయంతే క్షుధార్తాగిరివిగ్రహాః. 13

ఏకపంక్త్యుపవిష్టానాం విషమంభోజయంతియే | విడ్భోజనం రాక్షసేంద్ర నరకంతే వ్రజంతి చ. 14

ఏకసార్థప్రయాతంయే పశ్యంతశ్చార్థినం నరాః | అసంవిభజ్యభుంజంతి తేయాంతి శ్లేష్మభోజనమ్‌. 15

గోబ్రాహ్మణాగ్నయః స్పృష్టాయై రుచ్ఛిష్టైః క్షపాచర | క్షిప్యంతేహికరాస్తేషాం తప్తకుంభే సుదారుణ. 16

సుకేశి అన్నాడు - ఓ విప్రశ్రేష్ఠులారా ! ఏ ఏ కర్మలు చేస్తే ఈ నరకాలు సంభవిస్తాయి ? వినాలనికుతూహలంగా ఉంది. చెప్పండి.

ఋషులన్నారు : సుకేశీ ! ఏ ఏ దుష్టకర్మలు చేస్తే యీ నరకాలు కలుగుతాయో, అంతా వివరంగా విను. ఎల్లవేళలా వేదాలను విప్రులను నిందిస్తూ పురాణతిహాసాలనుద్వేషించే పాపులు, గురువులను దూషించేవారు, యజ్ఞాలు ధ్వంసం చేసేవారు, దాతలను దానంచేయకుండా నివారించేవారు అందరూ ఈ నరకాల్లోపడతారు. స్నేహితులను, దంపతులను, అన్నదమ్ములను, స్వామిసేవకులను, పితాపుత్రులను, యాజ్ఞికోపాధ్యాయులను, దుర్బుద్ధితో విడదీసేవారు, ఒకనికి తన కూతునిత్తునని చెప్పి యివ్వక మరొకరికి యిచ్చే అధములు, వీరందరను యమకింకరులు రంపాలతో రెండు ముక్కలుగా చీలుస్తారు. పరులకు తాపంకలిగించేవారు, చందనం, ఉశీరం (వట్టివేరు) చామరవ్యజనాలు, దొంగిలించేవారు, కరంభసికత నరకానికి పోతారు. శ్రాద్ధానిమంత్రణం స్వీకరించి, మరొక చోట భుజించువారలను భయంకరఖగాలు తమ ముక్కులతో ముక్కలు ముక్కలుగాచీలుస్తారు. మర్మవేధకాలయిన నిందావాక్యాలతో సాధువుల మనస్సులు నొప్పించు దుర్మార్గులు నెత్తిపై వ్రాలి గ్రద్దలు ముక్కులతో పొడుస్తాయి. మంచివారలకు వ్యతిరేకంగా చాడీలు చెప్పేవారి నాలుకలను కాకులు తమ యినుపముక్కలతో బయటకు లాగి చీల్చుతాయి. ఏ పొగరు బోతులు తలిదండ్రులను గురుజనులను అవమానిస్తారో, వారలు మలమూత్రాదులతో నిండిన అప్రతిష్ఠమనే నరకకూపాల్లో ముంచబడతారు. దేవతలకు, అతిథులకు, జీవాలకు, సేవకులకు అభ్యాగతులకు, బాలురకు, పితృదేవతలకు అగ్నికి పెట్టకుండా తాముభుజించే అధములు, చీము రక్తంతో కలిపిన మాంసాహారాన్ని , నోటినిండా సూదులు గ్రుచ్చబడుటచే, తినలేక ఆకలి తీరక వేదనతో ఆక్రోశిస్తూ ఉంటారు. వాళ్ళ శరీరాలు ఉబ్బిపోయి వికృతంగా ఉంటాయి. ఒకే పంక్తిలో కూర్చున్న వారికి పక్షపాతంతో భేదదృష్టితో వడ్డించే నీచులు, విడ్భోజనం అనే నరకంలో పక్షుల రెట్టలకుప్పలలో పడిపోతారు. పలువురతో కలిసి ప్రయాణం చేయునపుడు దారిలో తాము తెచ్చుకొన్న తినుబండారాలను యితరులతో పంచుకొనక తనే భుజించువారు శ్లేష్మభోజన 'నరకగాములౌతారు. ఎంగిలి చేతులతో గోవులను బ్రాహ్మణులను పవిత్రాగ్నులను ముట్టుకునే వారి చేతులను ఎర్రగా క్రాగిపోయే కుంభాలలో వేసి కాల్చుతారు.

సూర్యేందుతారకా దృష్టా యైరుచ్ఛిష్టైశ్చకామతః | తేషాంనేత్రగతోవహ్ని ర్దమ్యతే యమకింకరైః. 17

మిత్రజాయాభఛగినీ జ్యేష్ఠోభ్రాతాపితాస్వసా | జామయోగురవోవృద్ధాయైః సంస్పృష్టాఃపదా నృభిః. 18

బద్దాంఘ్రయస్తే నిగడై ర్లోహై ర్వహ్నిప్రతాపితైః | క్షిప్యంతే రౌరవేఘోరే హ్యాజానుపరిదాహినః. 19

పాయసంకృశరం మాంసం వృథాభుక్తాని యైర్నరైః | తేషామయోగుడాస్తప్తాః క్షిప్యంతే వదనే7ద్భుతాః 20

గురుదేవ ద్విజాతీనాం వేదానాంచనరాధమైః | నిందానిశామితాయైస్తు పాపానామితి కుర్వతామ్‌. 21

తేషాంలోహమయాః కీలా వహ్నివర్ణాః పునః పునః | శ్రవణషునిఖన్యంతే ధర్మరాజస్య కింకరైః. 22

ప్రపాదేవకులారామాన్‌ విప్రవేశ్మ సభామఠాన్‌ | కూపవాపీతడాగాంశ్చ భంక్త్వావిధ్వంసయంతియే. 23

తేషాం విలపతాంచర్మ దేహతః క్రియతే పృథక్‌ | కర్తికాభిః సుతీక్‌ష్ణాభిః సురౌద్రైర్యమకింకరైః 24

గోబ్రాహ్మణార్కమగ్నించ యేవై మేహంతిమానవాః | తేషాంగుదేన చాంత్రాణి వినికృంతంతి వాయసాః. 25

స్వపోషణ పరోయస్తు వరిత్యజతిమానవః | పుత్రభృత్యకళత్రాది బంధువర్గమకించనమ్‌.

దుర్ఫిక్షసంభ్రమేచాపి సశ్వభోజ్యేనిపాత్యతే. 26

శరణాగతంయేత్యజంతి యోచబంధనపాలకాః | పతంతియంత్రపీడేతే తాడ్యమానాస్తుంకింకరైః . 27

క్లేశయంతిహి విప్రాదీన్‌ యేహ్యకర్మసు పాపినః | తే పిష్యంతే శిలా పేషే శోష్యంతే7పి చ శోషకైః. 28

న్యాసాపహారిణః పాపా బధ్యంతే నిగడై | రపి క్షుత్‌ క్షామాః శుష్కతాల్వోష్ఠాః పాత్యంతే వృశ్చికాశ##నే. 29

పర్వమైథునినః పాపాః పరదారరతాశ్చ యే | తే వహ్నితప్తాం కూటాగ్రా మాలింగంతే చ శాల్మలీమ్‌. 30

ఉపాధ్యాయ మధఃకృత్య యైరధీతం ద్విజాధమైః | తేషామధ్యాపకో యశ్చ సశిలాం శిరసావ హేత్‌. 31

మూత్రశ్లేష్మ పురీషాణి యైరుత్సృష్టాని వారిణి | తేపాత్యంతే చ విణ్మూత్రే దుర్గంధే పూయపూరితే. 32

శ్రాద్దాతిథేయమన్యోన్యం యైర్భుక్తం భువిమానవైః | పరస్పరం భక్షయంతే మాంసాని స్వాని బాలిశాః. 33

వేదవహ్నిగురుత్యాగీ భార్యాపిత్రో స్తథైవ చ | గిరిశృంగాదధః పాతం పాత్యంతేయమకింకరైః. 34

పునర్భూపతయో యే చ కన్యావిధ్వంసకాశ్చ యే | తద్గర్భశ్రాద్ధభుగ్‌ యశ్చ కృమీన్భక్షే త్పిపీలికాః. 35

చాండాలాదంత్యజాద్యాపి ప్రతిగృహ్ణాతి దక్షిణామ్‌ | యాజకో యజమానశ్చ సో7శ్మాంతః స్థూలకీటకః. 36

పృష్టమాంసాశినో మూఢా స్తథైవోత్కోచ జీవినః | క్షిప్యంతే వృకభ##క్షేతే నరకే రజనీ చరః 37

స్వర్ణస్తేయీ చ బ్రహ్మఘ్నః సురాపో గురుతల్పగః | తథాగోభూమిహర్తారో గోస్త్రీబాలహనాశ్చయే. 38

ఏతేనరాద్విజా యేచ గోఘ విక్రయిణస్తథా | సోమవిక్రయిణో యేచ వేదవిక్రయిణస్తథా. 39

కూటసభ్యాస్త్వశౌచాశ్చ నిత్యనైమిత్తనాశకాః | కూటసాక్ష్యప్రదాయే చ తే మహారౌరవే స్థితాః. 40

అశుచిగా ఉంటూ ఎంగిలి నోటితో, చేతులతో, ఎవరైతే సూర్యుని చంద్రుని నక్షత్రాలను కావలయునని చూచెదరో వాళ్ళనేత్రాగ్నిని (జ్యోతిని-చూపును) యమకింకరులు లాగివేస్తారు. మిత్రుని భార్యను, తన తల్లిని, అగ్రజుని తండ్రిని, తోబుట్టువును, కుమార్తెను, చుట్టపు ఆడువారిని, గురువులను, పెద్దలను ఎవరు తమ కాలితో తాకుదురో ఆ పాపుల పాదాలను యినుప సంకెళ్ళతో కట్టి మోకాళ్ళ వరకు అగ్నిలో కాచి రౌరవనరక జ్వాలల్లో తోసేస్తారు. పాలలో వండిన పరమాన్నాన్ని, మాంసాన్ని భగవన్ని వేదనము చేయకుండా భుజించే వారినోళ్ళలో, నిప్పులో కాచిన యినుప గుండ్లను కుక్కుతారు. గురుదేవ బ్రాహ్మణులను వేదాలను గురించి చేసే నిందా వాక్యాలను ఓపికగా వినే పాపుల చెవులలో యమదూతలు, ఎర్రగా కాల్చిన మేకులు గ్రుచ్చుతారు. చలివెంద్రలను, దేవకులాలను, గుడులను, తోటలోనిచెట్లను, బ్రాహ్మణుల యిండ్లను, సభామంటపాలను, మఠాలను, బావులను చెరువులను, కూల్చినాశనం చేసే సంఘద్రోహుల చర్మాలను పదునైన కత్తులతో ఒలిచి, యమదూతలు, బాధతో పెద్దగా విలపించే వారలను క్రూరంగా హింసిస్తారు. ఆవులకు బ్రాహ్మణులకు సూర్యునకు అగ్నికి ఎదురుగా నిలబడి మలమూత్ర విసర్జనము చేయువారల గుదస్థానాన్ని ముక్కులతో చీల్చి కాకులు లోపలి ప్రేవులను బయటకు లాగుతాయి. కరువు కాటక పరిస్థితుల్లో తన తలిదండ్రులను పుత్ర భృత్యభార్యాబాంధవులను అన్నార్తులుగా వదలిపెట్టి తానొక్కడే కడుపు నింపుకునే వాడు శ్వభోజనమనే నరకానికి పోతాడు. శరణుజొచ్చిన వారిని వదలివేయువాడు, యితరులను చెరసాలలలో బంధించువారు 'యంత్రపీడ' మనే నరకంపాలౌతారు. ఏ ప్రయోజనం లేకుండా ఉబుసుపోకకు విప్రులను యితరులను బాధించే పాపులను యమదూతలు శిలాయంత్రాల్లో పిండి పిండిగా విసిరినిప్పుల మీద కాలుస్తారు. తమ వద్దదాచుకొన్న యితరుల, సొమ్ము అపహరించే దురాత్ములు ఆకలితో ఎండిన నాలుకలతో ఆక్రోశిస్తూంటే, వారలను యమదూతలు సంకెళ్ళతో బంధించి వృశ్చికాశనమనే నరకంలో తోసేస్తారు. పర్వదినాల్లో స్త్రీ సంగమం చేసేవారిని, పరస్త్రీలను చెరిచే వారిని, శాల్మలి అనే నరకంలోనికి త్రోసి వారల చేత అక్కడ భగభగమండే మేకులతో కూడిన యినుపస్తంభాలను ఆలింగనం చేయిస్తారు. ఉపాధ్యాయుని కన్న ఎత్తైన ఆసనం మీద కూర్చొని అధ్యయనంచేసిన శిష్యులూ ఆ గురువూ యిద్దరూ తమనెత్తిమీద రాతిబండలు మోయవలసి వస్తుంది. నీళ్ళలో మలమూత్ర విసర్జనం, నిష్ఠీవనం చేసే వారలను విణ్మూత్ర మనే దుర్గంధ పూర్ణమైన నరకంలోకి తోసివేస్తారు. శ్రాద్ధాది కార్యాలలో పరస్పరం ఒకరింటికొకరు వెళ్ళి భోజనము చేయు మూర్ఖులు, పరస్పరం ఒకరి మాంస మొకరు తినవలసి ఉంటుంది. వేదాలను, అగ్నులను, గురువులను, భార్యా, పితరులను వదలి పెట్టే పాపులను యమకింకరులు గిరిశిఖరాల నుంచి క్రిందకు పడద్రోయుదురు. విధవలను పెండ్లాడువారు, కన్యలను చెరచువారు, అట్టివారల పితృదేవతలతో సహా మురికి గుంటలలోని పురుగులను చీమలను భక్షించగలరు. శూద్రచండాలుర నుంచి దక్షిణలు తీసికొని పురోహితుడు ఆ పురోహితుని నియమించిన యజమానీ యిద్దరూ శిలా గర్భంలో పురుగులయి జన్మిస్తారు. లంచగొండులూ పృష్ఠమాంస భుక్కులూ, ఓ దైత్యేశ్వరా ! వృకభక్షమనే నరకంలో పడతారు. బంగారం దొంగిలించువారు, బ్రాహ్మణులను చంపువారు, సురాపానం చేయువారు, గురువు భార్యను పొందువారు, యితరుల గోవులను భూములను అపహరించువారు, గోవులను స్త్రీలను శిశువులను చంపువారు, సోమ విక్రయం వేద విక్రయం చేసే విప్రులు, మోసగాళ్ళు, అపవిత్రులు, నిత్య నైమిత్తికాదులు వదలినవారు, తప్పుడు సాక్ష్యం చెప్పువారు, మహారౌరవనరకాన్ని పొందుతారు.

దశ వర్షసహస్రాణి తావత్‌ తామిస్రకే స్థితాః | తావచ్చైవాంధతామిస్రే అసిపత్రవనే తతః. 41

తావచ్చైవఘటీయంత్రే తప్తకుంభే తతఃపరమ్‌ | ప్రపాతోభవతే తేషాం యైరిదందుష్కృతం కృతమ్‌. 42

యేత్వేతే నరకారౌద్రా రౌరవాద్యాస్తవోదితాః | తేసర్వేక్రమశః ప్రోక్తః కృతఘ్నేలోకనిందితే. 43

వీరంతా పదేసి వేల సంవత్సరాలు తామిస్రక, అంధతామిస్ర అసి పత్రవన, ఘటీయంత్ర, తప్తకుంభ నరకాలలో వరుసగా యాతనలనుభవిస్తారు. నేను వివరించిన ఈ నరక యాతనలన్నీ వరసగా కృతఘ్నులు లోకనిందకులు గూడ అనుభవిస్తారు.

యథాసురాణాం ప్రవరోజనార్దనో యథాగిరీణామపి శైశిరాద్రిః |

యథాయుధానాం ప్రవరం సుదర్శనం యథాఖగానాం వినతాతనూజః|

మహోరగాణాం ప్రవరో7ప్య నంతో యథా చ భూతేషుమహీవ్రధానా. 44

నదీషు గంగా జలజేషు పద్మం సురారిముఖ్యేషు హరాంఘ్రి భక్తః |

క్షేత్రేషుయద్వత్కురుజాంగలంవరం తీర్థేషుయద్వత్ర్పవరం పృథూదకమ్‌. 45

సరస్సు చైవోత్తరమానసం యథా వనేషుపుణ్యషుహినందనం యథా |

లోకేషుయద్వత్సదనం విరించేః సత్యంయథాధర్మవిధిక్రియాసు. 46

యథాశ్వమేదః ప్రవరఃక్రతూనాం పుత్రోయథాస్పర్శవతాం వరిష్ఠః |

తపోధనానామపి కుంభయోనిః శ్రుతిర్వరాయద్వదిహాగ మేషు. 47

ముఖ్యఃపురాణషు యథైవ మాత్స్యః స్వాయంభువో క్తిస్త్వపి సంహితాసు |

మనుఃస్మృతీనాం ప్రవరోయథైవ తిథీషుదర్శో విషువేషుదానమ్‌. 48

తేజస్వినాం యద్వదిహార్కఉక్తో ఋక్షేషుచంద్రో జలధిర్‌ హ్రదేషు

భవాన్‌ యథా రాక్షససత్తమేషు పాశేషునాగః స్తిమితేషు బంధః. 49

ధాన్యేషుశాలి ర్ద్విపదేషువిప్రః చతుష్పదేగౌః శ్వపదాం మృగేంద్రః |

పుష్పేషు జాతీ నగరేషుకాంచీ నారీషురంభా77 శ్రమిణాంగృహస్థః. 50

కుశస్థలీ శ్రేష్ఠతమాపురేషు దేశేషు సర్వేషు చ మధ్యదేశః |

ఫలేషు చూతోముకులేష్వశోకః సర్వౌషధీనాం ప్రవరాచపథ్యా. 51

మూలేషుకందః ప్రవరోయథోక్తో వ్యాధిష్వజీర్ణంక్షణదా చరేంద్ర|

శ్వేతేషు దుగ్దం ప్రవరంయథైవ కార్సాసికం ప్రావరణషు యద్వత్‌. 52

కళాసుముఖ్యాగణితజ్ఞతాచ విజ్ఞానముఖ్యేషు యథేంద్రజాలమ్‌|

శాకేషుముఖ్యాత్వపికాకమాచీ రసేషుముఖ్యం లవణం యథైవ. 53

తుంగేషుతాలో నలినీషుపంపావనౌకసేష్వేవచ ఋక్షరాజః |

మహీరు హేష్వే వయథావటశ్చ యథాహరో జ్ఞానవతాం వరిష్ఠః. 54

యథాసతీనాంహిమవత్సుతాహి యథార్జునీనాం కపిలావరిష్ఠా |

యథావృషాణామపి నీలవర్ణో యథైవసర్వేష్వపి దుఃసహేషు|

దుర్గేషు రౌద్రేషు నిశాచరేశ నృపాతనం వైతరణీప్రధానా. 55

పాపీయసాంతద్వదిహకృతఘ్నః సర్వేషు పాపేషు నిశాచరేంద్ర|

బ్రహఘ్నగోఘ్నాదిషు నిష్కృతిర్హి విద్యేతనైవాస్యతు దుష్టచారిణః |

ననిష్కృతిశ్చాస్తి కృతఘ్నవృత్తేః సుహృత్కృతంనాశయతో7బ్దకోటిభిః. 56

ఇతి శ్రీవామనమహాపురాణ ద్వాదశో7ధ్యాయః.

రాక్షసేంద్రా : దేవతలందరిలో శ్రేష్ఠుడు జనార్దనుడైనట్లు, పర్వతాల్లో హిమవంతంవలె, ఆయుధాల్లో సుదర్శనం మాదిరి, పక్షులలో గరుత్మంతుని వలె, జాతి సర్పాల్లో అనంతునికి వలె, భూతాల్లో ప్వథ్వివలె, నదులలో గంగ, జలజాల్లో పద్మం ఎలా శ్రేష్ఠములో అసురులలో శివభక్తుడెట్లో, క్షేత్రాల్లో కురుజాంగలం, తీర్థాలలో పృథూదకం, సరస్సులలో మానసం, వనాల్లో నందనవనం, లోకాల్లో బ్రహ్మలోకం, ధర్మాదిక్రియలలో సత్యం ఏ విధంగా శ్రేష్ఠమైనవో, యజ్ఞాల్లో అశ్వమేధం, ప్రియబంధువులలోపుత్రుడు, తపస్వులలోఅగస్త్యుడు ఎలాముఖ్యులో,ఆగమాల్లోవేదాలు పురాణాల్లో మత్స్యపురాణం, సంహితలలో స్వాయంభువసంహిత, స్మృతులలో మనుస్మృతి, తిథులలో అమావాస్య, విషువాల్లో దానం ఎంత శ్రేష్ఠాలో, తేజఃపుంజాల్లో సూర్యుడెట్లో, నక్షత్రాల్లో చంద్రుడెట్లో, జలాశయాల్లో సముద్రం ఎట్లు ముఖ్యమో, రాక్షసవర్యులలో నీ వెట్లో, పాశాల్లో నాగపాశం, స్తిమితులలో బంధితుడు, ధాన్యాలలో వరి, ద్విపాత్తులలో విప్రుడు, చతుష్పాత్తులలో ఆవు, శ్వాపదాల్లో సింహం, పుష్పాల్లో జాజి, నగరాల్లో కాంచీ, స్త్రీలలో రంభ, ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం, పురములలో కుశస్థలి, దేశాల్లో మధ్యదేశం, ఫలాల్లో మామిడి, మొగ్గలలో అశోకం, ఔషధాల్లో హరీతకి (కరక్కాయ), గడ్డలలో కంద ఎట్లు ఉత్తమములో, వ్యాధులలో అజీర్ణ రోగం, తెల్లని వానిలో పాలు, బట్టలలో నూలు (ప్రత్తి) వస్త్రాలు, కళలలో గణితం, విజ్ఞానాల్లో మహేంద్రజాలం, శాకాలలో కాకమాచి (ఆకుకూర), షడ్రసాలలో లవణం, ఎత్తైనచెట్లలో తాళం, పద్మ సరస్సులలో పంపాసరం వనచరాలలో జాంబవంతుడు, వృక్షాల్లో వటం, జ్ఞానులలో శివుడు ఎలా శ్రేష్ఠులో, పతివ్రతలలో పార్వతి, ఆవులలో కపిలగోవు, ఎడ్లలో గూడనీలపుటెద్దు ఎలా శ్రేష్ఠాలో, భరింపరాని నరకాలన్నింటిలో వైతరణి ఎంత దుస్తరమైనదో అట్లే ఓ నిశాచరపతీ ! పాపులందరలో కృతఘ్నుడు పరమనికృష్ణుడు ! కృతఘ్నత్వం సర్వపాపాల్లో భయంకరమైంది. బ్రహ్మహత్య గోహత్యా పాతకాలకైనా నిష్కృతి (ప్రాయశ్చిత్తం) ఉండవచ్చుగాని, స్నేహితులొనరించు మేలు మరచిన కృతఘ్నుడికి కోటి సంవత్సరాలకైనా నిష్కృతి లేదు. ఇది నిజం.

ఇదీ శ్రీ వామన మహా పురాణంలోని పన్నెండవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters