Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీః

శ్రీ గణశాయ నమః

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ వామన మహా పురాణము

ఒకటవ అధ్యాయము

నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం | దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌.|

త్రైలోక్యరాజ్య మాక్షిప్య బలే రింద్రాయ యో దదౌ | శ్రీధరాయ నమస్తసై#్మ ఛద్మవామనరూపిణ. 1

నారాయణునకు ఉత్తముడగు నరునకు సరస్వతీ దేవికి వ్యాసభట్టారకునకు నమస్కరించి జయ కావ్యమును (పురాణము లేక ఇతిహాసము) చదువవలెను.

ముల్లోకముల వ్యాపించిన రాజ్యమును వామనుడను ఛద్మవేషముతో వంచన ద్వారా బలి నుండి లాగికొని ఇంద్రున కొసగిన శ్రీధరునకు నమస్కారము.

పులస్త్య మృషి మాసీన మాశ్రమే వాగ్విదాం వరం |

నారదః పరిపప్రచ్ఛ పురాణం వామనాశ్రయమ్‌. 2

జ్ఞానులలో శ్రేష్ఠుడును, దనయాశ్రమమున సుఖోపవిష్టుడైన వాడునునగు పులస్త్య మహర్షిని నారదుడు వామనునకు సంబంధించిన పురాణమును గురించి ప్రశ్నించెను.

కథం భగవతా బ్రహ్మన్‌ విష్ణునా | వామనత్వం దృతం పూర్వం తన్మమాచక్ష్వ పృచ్ఛతః. 3

బ్రహ్మర్షీ ! సర్వసమర్థుడై యుండియు పురానమయమున విష్ణువు మరుగుజ్జు రూనమునేల ధరించెను.

కథంచ వైష్ణవో భూత్వా ప్రహ్లాదో దైత్యసత్తమః | త్రిదశై ర్యుయుధే సార్థ మత్ర మే సంశయో మహాన్‌. 4

దైత్య శ్రేష్ఠుడగు ప్రహ్లాదుడు పరమ వైష్ణవుడయ్యును దేవతలతోనేల యుద్ధమొనర్చెను ? ఈ సంశయము నన్ను పీడించుచున్నది. దీనిని తోలగించుడు.

శ్రూయతే చ ద్విజశ్రేష్ఠ దక్షస్య దుహితా సతీ | శంకరస్య ప్రియా భర్యా బభూవ వరవర్ణినీ. 5

వా. పు. 1

కిమర్థం సా పరిత్యజ్య స్వశరీరం వరాననా | జాతా హిమవతో గేహే గిరీంద్రస్య మహాత్మనః. 6

పునశ్చ దేవదేవస్య పత్నీత్వ మగమ చ్ఛుభా | ఏతన్మే సంశయం ఛింది సర్వవిత్‌ త్వం మతో7సి మే. 7

తీర్థానాం చైవ మాహాత్మ్యం దానానాం చైవ సత్తమ | వ్రతానాం వివిధానాం చ విధి మాచక్ష్వ మే ద్విజ. 8

బ్రాహ్మణోత్తమా ! దక్షపుత్రి సతీదేవి శంకరునకు ప్రియమున గూర్చునర్ధాంగి అయ్యోనుగదా. ఆ శుభాంగి యేకారణమున తన శరీరమును వదలి పర్వతేశ్వరుడగు హిమవంతు నింట మరల జన్మించెను? మరల దేవదేవుడగు శంకరుల నేల పరిణయమాడెను? ఈనా సందేహములను సర్వజ్ఞుడవగు తాము తొలగింపుడు. ద్విజశ్రేష్ఠా! పలురకములగు వ్రతము లొనర్చు విధానములను, తీర్థక్షేత్రముల మాహాత్మ్యమును, దానముల మహిమను దయతో నాకెరిగింపుడు.

ఏవ ముక్తో నారదేన పులస్త్యో మునిసత్తమః | ప్రోవాచ వదతాం శ్రేష్ఠో నారదం తపసో నిధిమ్‌. 9

ఈ విధముగ ప్రశ్నించిన తపోనిధి నారదునితో మునిశ్రేష్ఠుడు వదతాంవరుడగు పులస్తుడిట్లనెను.

పులస్త్య ఉవాచ:

పురాణం వామనం వక్ష్యే క్రమా న్నిఖిల మాదితః | అవదానం స్థిరం కృత్వా శృణుష్వ మునిసత్తమ. 10

పులస్త్యుని వచనం : ఓ మునిసత్తమా! నీవు కోరినట్లు మొదటి నుండియు క్రమముగా వామన పురాణమును సమగ్రముగ నుడివెదను. సావధానుడవై వినుము.

పురా హైమవతీ దేవీ మందరస్థం మహేశ్వరం | ఉవాచ వచనం దృష్ట్వా గ్రీష్మకాల ముపస్థితమ్‌. 11

గ్రీష్మః ప్రవృత్తో దేవేశ న చ తే విద్యతే గృహమ్‌ |

యత్ర వాతాతపౌ గ్రీష్మే స్థితయో ర్నౌ గమిష్యతః. 12

ఏవ ముక్తో భవాన్యా తు శంకరో వాక్య మబ్రవీత్‌ | నిరాశ్రయోహం సుదతి సదా7నణ్యచరః శుభే. 13

ఇత్యుక్తా శంకరేణాథ వృక్షచ్చాయాసు నారద | నిదాఘకాల మనయత్‌ సమం శ##ర్వేణ సా సతీ. 14

నిదాఘాంతే సముద్భూతో నిర్జనాచరితో7ద్భుతః | ఘనాంధకారితాశో వై ప్రావృట్‌ కాలో7తిరాగవాన్‌. 15

తం దృష్ట్వా దక్షతనుజా ప్రావృట్కాల ముపస్థితం | ప్రోవాచ వాక్యం దేవేశం సతీ సప్రణయం తదా. 16

వివాంతి వాతా హృదయావదారణా గర్జంత్యమీ తోయధరా మహేశ్వర |

స్ఫురంతి నీలాభ్రగణషు విద్యుతో వాశంతి కేకారవమేవ బర్హిణః. 17

పతంతి ధారా గగనా త్పరిచ్యుతా | బకా బలాకాశ్చ సరంతి తోయదాన్‌ |

కదంబసర్జాగునకేతకీద్రుమాః | పుష్పాణి ముంచంతి సుమారుతాహతాః. 18

శ్రుత్వైవ మేఘస్య దృఢం తు గర్జితం | త్యజంతి హంసాశ్చ సరాంసి తత్‌ క్షణాత్‌|

యథాశ్రయాన్‌ యోగిగణాః సమంతాత్‌ | ప్రవృద్ధమూలానపి సంత్యజంతి. 19

ఇమాని యూథాని వనే మృగాణాం | చరంతి ధావంతి రమంతి శంభో.

తథా7చిరాభాః సుతరాం స్ఫురంతి | పశ్యేహ నీలేఘ షునేషు దేవ.

నూనం సమృద్దిం సలిలస్య దృష్ట్వా | చరంతి శూరా స్తరుణ ద్రుమేషు. 20

ఉద్వృత్తవేగాః సహసైవ నిమ్నగా | జాతాః శశంకాంకిత చారుమౌళే |

కిమత్ర చిత్రం యదనుజ్జ్వలం జనం | నిషేవ్య యోషి ద్భవతి త్వశీలా. 21

నీలైశ్చ మేఘైశ్చ సమావృతం నభః | పుషై#్పశ్చ సర్జా ముకుళైశ్చ నీపాః |

ఫలైశ్చ బిల్వాః పయసా తథాపగాః | పత్రైః సపద్మైశ్చ మహాసనాంసి. 22

ఇతీదృశే శంకరదుఃసహే7ద్భుతే | కాలే సురౌద్రే నను తే బ్రవీమి |

గృహం కురుష్వాత్ర మహాచలోత్తమే | సునిర్వృతా యేన భవామి శంభో. 23

పూర్వమొక పర్యాయము గ్రీష్మర్తువు సమీపించుట చూచి మందరగిరి పై ఆసీనుడైన మహేశ్వరుని చూచి భగవతి హైమవతి యిట్లనెను. ''ప్రభూ! దేవాధిపా ! వేసవి సమీపించినది. వేడి గాడ్పులకు మండు టెండలకు తట్టుకొని మనము నివసింపదగిన గృహము నీకు లేకపోయెనే!'' అంతట భవానితో శంకరుడనెను. ''సుదతి! కల్యాణీ! నేనెల్లపుడు నిరాశ్రయుడనై యరణ్యవాసమే చేయుచుంటిని.'' శంకరుని మాటవిని సతీదేవి (చేయునది లేక) భర్తతో ఆ వేసవి దినములు చెట్ల నీడలలో గడిపినది. వేసవి గడచిన తోడనే మేఘముల గుంపులతో దిక్కుల చీకట్లు వ్యాపించగ వర్షాకాలమేతెంచెను. దిక్కులు జన సంచార శూన్యములయ్మెను. అది చూచి దాక్షాయణి తన భర్తతో ప్రేమ పురస్సరముగ నిట్లనెను. ''మహేశ్వరా! గుండెలు బ్రద్దలగునట్లు తీవ్రమైన చలిగాలులు వీస్తున్నవి. మేఘములు గర్జించుచున్నవి. మెరుపులు మెరయుచున్నవి. నెమళ్ళు ఆడుచు కేకారవములు సేయుచున్నవి. ఆకసము నుండి తెరపి లేకుండ జలధారలు పడుచున్నవి. బలాక పంక్తులు మేఘముల వెంట పరుగులిడుచున్నవి. గాలి తూపులకు కదంబ, సర్జ, అర్జున, కేతకీవృక్షములు పుష్పములు రాల్చుచున్నవి. మేఘ గంభీర గర్జనలు విని తమ తమ నెలవులు వదలి వెళ్ళు యోగులకు వలెనే హంసలు కూడ సరోవరాలను వదలిపోవుచున్నవి. శంభో! అవిగో! లేళ్ళ గుంపులు అరణ్యమున ఎల్లెడల తిరుగుచున్నవి పరుగిడుచున్నవి; తమ ప్రియలతో రమించుచున్నవి. అటు చూడుడు. నల్లని మొగిళ్ళమధ్య మెరుపుతీగలెంత మనోహరముగ ప్రకాశించుచున్నవో! నలుగడల నిండుకొనిన నీటి సమూహమును చూచి శూరులు తరుణ వృక్షాల మధ్య తిరుగాడుచున్నారు. ఓ చంద్రశేఖరా ! ఉన్నట్టుండి నదులన్నియు వేగాన్ని పుంజుకున్నవి. కాగా దుశ్శీలుడగు వానిని సేవించిన స్త్రీ తన శీలాన్ని కోల్పోవుటలో ఆశ్చర్యమేముండును ? ఆకాశాన్ని నీలి మబ్బులావరించినవి. సర్జ పృక్షాలు పుష్పాలతో, కడిమి చెట్లు మొగ్గలతో, బిల్వతరువులు ఫలాలతో, నదీ నదాలు జలాలతో సరోవరాలు పద్మపత్రాలతో పుష్పాలతో నిండి యున్నవి. శంకరా! ఇలాంటి భయంకరమూ దుఃసహమైన కాలాన ఈ కొండ కొమ్మున, నేను నిర్భయంగా సుఖించుటకనువైన గృహము నిర్మించుము. ''

ఇత్థం త్రినేత్రః శ్రుతిరామణీయకం | శ్రుత్వా వచో వాక్యమిదం బభాషే |

న మే7స్తి విత్తం గృభసంచయార్థే | మృగారిచర్మావరణం మమ ప్రియే. 24

మమోపవీతం భుజగేశ్వరః శుభే | కర్ణేపి పద్మశ్చ తథైవ పింగళః |

కేయూర మేకం మమ కంబళ స్త్వహి | ర్ద్వితీయ మన్యో భుజగో ధనంజయః. 25

నాగ స్తథైవాశ్వతరో హి కంకణం | సవ్యేతరే తక్షక ఉత్తరే తథా |

నీలో 7పి నీలాంజన తుల్యవర్ణః | శ్రోణీతటే రాజతి సుప్రతిష్ఠః. 26

పులస్త్య ఉవాచ :

ఇతి వచన మథోగ్రం శంకరా త్సా మృడానీ | ఋతమపి తదసత్యం శ్రీమ దాకర్ణ్య భీతా |

అవనితల మవేక్ష్య స్వామినో వాసకృచ్చ్రాత్‌ | పరివదతి సరోషం లజ్జయోచ్ఛ్వస్య చోష్ణం. 27

తన ప్రియురాలి ఈ శ్రుతిమనోహరా లైన మాటలు విని ఆ ముక్కంటి ''ఓ ప్రియురాలా ! నేనేమి చేయుదును గృహ సంపాదనమునకు నా వద్ద ధనములేదు. నేను ధరించేది పులితోలు. జన్నిదమా పాపరేడు. పద్మ పింగళులనే సర్పాలు నాకు చెవిపోగులు. నేను ధరించే కేయూరాలు కంబళ ధనంజయాలనే విషధరాలు. కుడి ఎడమ చేతులకు నేను తొడిగే కంకణాలు అశ్వతర, తక్షకనాగాలు. పోతే కాటుకరంగుతో నిగనిగలాడే మహోరగం నీలుడు నామొలతాడు. ఇంతకు మించి నావద్ద ఏమి గలదు? '' అనెను.

పులస్త్య వచనము: సాధారణ గృహ నిర్మాణము చేసుకోజాలని తన అశక్తతను వెల్లడించుచున్న శంకరుని ఆపలుకులు సత్యములై నను కర్ణ కటువులూ అరుచి కరములగుటచేమృడానికి తృప్తి కలిగించలేదు. లజ్జారోషాలతో క్రుంగి పోయి వేడి నిట్టూర్పులు విడుచుచు చూపులు నేల మీద నిలిపి భర్తతో ఇలా అన్నది.

దేవ్యువాచ :

కథం హి దేవదేవేశ ప్రావృట్కాలో గమిష్యతి | వృక్షమూలే స్థితాయా మే సుదుఃఖేన వదామ్యతః. 28

దేవివచనము : ''ప్రభూ ! అయితే ఇలాంటి భయంకరమూ దుర్భరమైన వర్షాకాలం చెట్ల క్రింద తడుస్తూ రోదిస్తూ ఎలా గడప గలను? అందులకే యింతగట్టిగా నేను మాటాడుచుంటిని. ''

శంకర ఉవాచ :

ఘనావస్థితదేహాయా: ప్రావృట్కాలః ప్రయాస్యతి | యథాంబుధారా న తవ నిపతిష్యంతి విగ్రహే. 29

శంకరవచనము : ''ప్రియురాలా! ఇందులో కష్టమేమి ? వర్షాకాలమంతయు మేఘాలను ఆసనముగా చేసి కొని వాని మీద, నీ శరీరంపైనొక నీటి బిందువు కూడా పడకుండునట్లు నివసింపగలవు సుమా !

పులస్త్య ఉవాచ :

తతో హర స్తద్ఘనఖఃడ మున్నత మారుహ్య తస్థౌ సహ దక్షకన్యయా |

తతో7భవన్నామ తదేశ్వరన్య జీమూతకేతు స్త్వితి విశ్రుతం దివి.

ఇతి శ్రీ వామన మహా పురాణ ప్రథమో7ధ్యాయః.

పులస్త్యవచనము: అంతట శంకరుడు దాక్షాయణితో నొకఎత్తైన మేఘఖండము నధిరోహించి ఆసీనుడయ్యెను. ఆకారణమున వామహేశ్వరునకు స్వర్లోకమున జీమూతకేతువను పేరు సార్థకమాయెను.

ఇది వామన మహా పురాణమునందలి ప్రథమాధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters