Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

పురాణ మిత్యేవ న సాధు సర్వమ్‌

అరవిందాశ్రమవాసి దేవదత్‌ అనే ఆయన కంచిలో స్వాములవారిని కలసికొన్నారు. శ్రీవారు చిన్నకుటీరంలో రెండు యజ్ఞకుండముల మధ్య కాష్టాసనంపై ఉపవిష్టులై ఉన్నారు. ఆయనను చూడగానే'జాజ్జ్వల్యమానమైన గులాబీ' అనే అరవిందులు ఉపమ జ్జప్తి కొచ్చింది. సంభాషణ ఇలా నడచింది.

''స్వామీ, మీరు ధర్మవ్యవస్థాపకులు. శంకరాచార్యపీఠాధిపతులు, నేటి యవసమాజం అంధత్వంతో పాశ్చాత్యానుకరణం చేస్తున్నది. దేశంలోని పరిస్థితులతో కానీ, దేశం వెలుపలి పరిస్థితులతో కాని, వారి కేమీ జోక్యం ఉన్నట్టు కనిపించదు. మీ అభిప్రాయం?''

'మీరు ప్రతివిషయాన్నీ గూర్చి అధికంగా ఆలోచిస్తున్నారు. స్వధర్మాన్ని విడిచిన ప్రతివ్యక్తీ పరధర్మాన్ని గురించి బయపడుతాడు. ప్రాచీన పాశ్చాత్య సంస్కృతుల సమన్వయం నేడు మనముందున్న ప్రశ్న ఆధునిక జగతిలోని మంచికి- ప్రాచీనసంస్కృతి ఏనాటికీ వ్యతిరేకంకాదు.'

'ఆధునిక విజ్ఞానంవల్ల ప్రాచీన సంస్కృతి నశించే పక్షంలో దానివలన ప్రయోజన మేమి?

'పురాణ మిత్యేవ న సాథు సర్వమ్‌' ప్రాచీనమైన దంత మాత్రాన దానినే సంపూర్ణంగా గ్రహించడం మన ఉద్దేశంకాదు. ప్రాచీనతతోబాటు ఉత్తమమైన నవీనత్వాన్ని కూడా స్వీకరించడం మన పరమధర్మం. దేశంలోని ప్రతియువకుడూ ఈ రెంటి సమన్వయాన్నీ సాధించడం కల్యాణప్రదం. భారతీయ సంస్కృతిని రక్షించటం మా ధ్యేయం. అయితే ఆధునిక ప్రజాజీవనం, వారి ఆదర్శాలూ, ఆకాంక్షలూ కూడా గౌరవించి నవీనతను ఆహ్వానిస్తున్నాం.

తర్వాత దేవదత్‌ జయేంద్రస్వామిని దర్శించారు. ఆయనకు హిందీభాషా పరిచయం తక్కువ. అందుచేత సంస్కృతంలో మాట్లాడసాగినారు.

్వఆధునిక భారతీయ యువకసమాజం ఆదర్శవిహీనమైపోతూ ఉంది. వారిని సన్మార్గంలో పెట్టగల దక్షులెవరూ కనిపించటంలేదు.''

''సనాతన ధర్మంతో బాటు యుగధర్మం కూడా కలసి ఉంటుంది. ఈ కాలచక్రంలో ఒకపుడు వ్లుెచ్ఛాచారం వృద్ధి ఐతే మరొకపుడు వైదికాచారం ప్రవృద్ధమౌతుంది. ఇంత మాత్రాన గాబరాపడ పనిలేదు. గోరంతవిషయాన్ని కొండంత చేసి భయపడదారు.''

( 6 - 22 )

'ప్రాచీనసంస్కృతీ పరిరక్షకులకు, ఈ సమాజ సముద్ధరణం కూడ ఒక బాధ్యతేకదా.'

''కర్తవ్య మనేది ఏకపక్షప్రాయం కాదు. జ్యోతిని చూపటం మాకర్తవ్యం. జ్ఞానజ్యోతిని గ్రహించి మేము ముందు నడుస్తుంటాం. అంధకారం తనంతట అదే వెనుకరు పోతుంది.''

ఈ మాటలకు దేవదత్‌ విభ్రాంతులయ్యారు.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page