Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది ఎనిమిదవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

తతః ప్రభాతే విమలేకృత పూర్వాహ్నిక క్రియాః | శుభ్రవస్త్ర పరీధానాః పలహస్తాః పృథక్‌ పృథక్‌ || 1 ||

రత్నాంగ దాఢ్య దోర్దండా అంగులీయక భూషితాః | కర్ణాభరణ సంయుక్తాః సమాజగ్ముః cవహర్షితాః || 2 ||

రాజద్వారంతు సంప్రాప్య సంతష్ఠుః బ్రహ్మవాదినః | తాన్‌ దృష్ట్వా రాజపుత్రస్తు ఈషత్ర్పహసితోబలీ || 3 ||

రామంచహనుమంతంచగత్వావిప్రాఃసమాగతాః | శ్రూయతాంమంత్రిణః సర్వేదృశ్యంతో ద్విజసత్తమాన్‌ || 4 ||

ఏతదుక్త్వాతువచనం తూష్ణీం భూత్వాస్థితోనృపః | తతోద్విత్రా ద్విజాః సర్వే ఉపావిష్టాః క్రమాత్తతః || 5 ||

క్షేమం వప్రచ్చుః నృపతిం హస్తిరథ పదాతిషు | తతః ప్రోవాచ నృపతిః విప్రాన్‌ ప్రతిమహామనాః || 6 ||

అరిహంత ప్రసాదేన సర్వత్ర కుశలంమమ | సాజిహ్వాయా జినం స్తౌతి తౌకరే ¸°జినార్చనౌ || 7 ||

సాదృష్టిః యాజినే లీనా తన్యనోయజ్జినే రతం | దయాసర్వత్ర కర్తవ్యాజీవాత్మా పూజ్యతే సదా || 8 ||

యోగశాలాహిగం తవ్యాకర్తవ్యం గురువందనం | సచకారం మహామంత్రం జపితవ్యమహర్నిశం || 9 ||

పంచూషణం హి కర్తవ్యం దాతవ్యం శ్రమణసదా | శ్రుత్వా వాక్యంతతోవిప్రాః తస్యదంతాన పీడయన్‌ || 10 ||

విముచ్య దీర్ఘని శ్వాసమూచుస్తే నృపతింప్రతి | రామేణ కథితం రాజన్‌ థీమతాచ హననూమతా || 11 ||

దీయతాం విప్ర వృత్తించ ధర్మిష్టో7సి ధరాతలే | జ్ఞాయతే తవదత్తాస్యాత్‌ మదత్తా నైవనైవచ || 12 ||

రక్షస్వరామవాక్యం త్వం యత్కృత్వాత్వం సుఖీభవ || 13 ||

రాజోవాచ -

యత్రరామ హనూమంతౌ యాంతు సర్వేపితత్రవై | రామోదాస్యతి సర్వస్వం కింప్రాప్తా ఇహవైద్విజాః || 14 ||

నదాస్యామిన దాస్యామి ఏకాంచైవవరాటికాం | సగ్రామంనైవ వృత్తించ గచ్ఛధ్వం యత్రరోచతే || 15 ||

తచ్ఛ్రుత్వా దారుణం వాక్యం ద్విజాః కోపాకులాస్తదా | సహస్వరామకోపంహిసాం ప్రతంచహనుమతః || 16 ||

తా || వ్యాసులిట్లన్నారు. పిదప ప్రభాతమందు స్వచ్ఛమైన దానియందు పూర్వాహ్ణ క్రియలను ఆచరించి, శుభవస్త్రములను ధరించి విడివడిగా ఫలములు చేతధరించి (1) రత్నాంగదములతో కూడిన భుజదండములు కలవారై అంగుళీయకములతో భూషితులై, కర్ణాభరణములు గలవారై ఆనందంతో వచ్చారు (2) రాజద్వారమునకు చేరి బ్రహ్మావాదులు ఉన్నారు. వారిని చూచి రాజపుత్రుడు బలవంతుడు కొద్దిగా నవ్వాడు (3) రాముడు, హనుమంతుడు దగ్గరకు వెళ్ళి బ్రాహ్మణులు వచ్చారు. మంత్రులంతా వినండి. బ్రాహ్మణులను చూడండి (4) అని పలికి రాజు మౌనము వహించి ఉన్నాడు. ఆ పిదప ఇద్దరు ముగ్గురు ఆ పిదప అందరు బ్రాహ్మణులు క్రమంగా కూర్చున్నారు (5) రాజుగారిని ఏనుగులు రథములు పదాతిసైన్యం క్షేమంగా ఉందా అని అడిగారు. మహామనస్సు గల రాజు బ్రాహ్మణులతో పిదప ఇట్లన్నాడు. (6) అరిహంత అనుగ్రహంవల్ల అంతట నాకు క్షేమమే. జినుని స్తుతించే నాలుకనాలుక. జినుని అర్చించే చేతులు చేతులు (7) జినుని యందులీనమైన చూపులే చూపులు జినుని యందు అనురక్తి కలిగిన మనస్సే మనస్సు. అంతట దయ చూపాలి. అంతట జీవాత్మ పూజింపబడుతుంది. ఎల్లప్పుడు (8) యోగశాలకు వెళ్ళాలి. గురువందనము చేయాలి నచకారము, మహామంత్రము రాత్రింబవళ్ళు జపించాలి (9) పంచూషన చేయాలి. శ్రమణులకు ఎల్లప్పుడు దానం చేయాలి. ఆ మాటలు విని బ్రాహ్మణులు పండ్లుకొరికారు. (10) దీర్ఘనిశ్వాసమును విడిచి రాజుతో ఇట్లన్నారు. ఓ రాజా! రాముడుచెప్పాడు. బుద్ధి గలిగిన హనుమంతుడు చెప్పాడు. (11) బ్రాహ్మణుల వృత్తిని ఇచ్చేయి. ఈ భూమియందు నీవు ధర్మిష్ఠుడివి. నీవు ఇచ్చిన ట్లౌతుంది.నేనిచ్చినట్లుకాదు. (12) రాముని వాక్యాన్ని నీవు రక్షించు. దానినాచరించి నీవు సుఖివౌతావు (13) అనగా రాజిట్ల్నాడు. రామ హనుమంతులెక్కడున్నారో అందరుఅక్కడికే వెళ్ళండి. రాముడంతా మీకిస్తాడు. మీకిక్కడ ఏం లభించింది (14) ఇవ్వను ఇక్క గవ్వకూడా ఇవ్వను. గ్రామమివ్వను. మీ వృత్తి (జీవనము) ఇవ్వను. ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి వెళ్ళింది (15) ఆదారుణమైన మాటను విని బ్రాహ్మణులు కోపాకులులైనారు. రాముని కోపాన్ని సహించు. ఇప్పుడు హనుమంతుని కోపాన్ని సహించు (16).

మూ || ఇత్యుక్త్వా హనుమద్దత్తా మామకక్షోద్భవాపులటీ | cపక్షిప్తాచాస్యనిలయే వ్యావృత్తా ద్విజసత్తమాః || 17 ||

గతేతదా విప్రసంఘే జ్వాలామాలాకులంత్వభూత్‌ | అగ్నిజ్వాలాకులం సర్వం సంజాతం చైవతత్రహి || 18 ||

దహ్యంతే రాజవస్తూని ఛత్రాణి చామరాణిచ | కోశాగారాణి సర్వాణి ఆయుధాగారమేవచ || 19 ||

మహిష్యో రాజపుత్రాశ్చగజా అశ్వాహ్యనేకశః | విమానానిచ దహ్యంతే దహ్యంతే వాహనానిచ || 20 ||

శిబికాశ్చ విచిత్రా వైరథాశ్చైవ సహస్రశః | సర్వత్ర దహ్యమాసం చదృష్ట్వా రాజాపి వివ్యధే || 21 ||

నకోపిత్రాతాతస్యాస్తి మానవాభయ విక్లవాః | సమంత్రయంత్రైః వహ్నిః నసాధ్యతేన చమూలికైః || 22 ||

కౌటిల్య కోటినాశీచయత్ర రామః ప్రకునప్యత | తత్రసర్వే ప్రణశ్యంతి కింతత్కుమారపాలకః || 23 ||

సర్వంత జ్జ్వలితం దృష్ట్వానగ్నక్షపణ కాస్తదా | ధృత్వాకరేణ పాత్రాణి నీత్వాదండాన్‌ శుభానపి || 24 ||

రక్తకంబలికా గృహ్య వేపమానాము హుర్ముహుః | అనుపానహికాశ్చైవ నష్టాః సర్వేదిశోదశ || 25 ||

కోలాహలం ప్రకుర్వాణాః పలాయధ్వమితి బ్రువన్‌ | దాహితా విప్రముఖ్యైశ్చ వయం సర్వేనసంశయః || 26 ||

కేచిచ్చ భగ్నపాత్రేస్తే భగ్నదండాస్తథాపరే | ప్రణష్టాశ్చ వివస్త్రాన్తే వీతరాగమితి బ్రువన్‌ || 27 ||

అర్హంతే మేవకే చిచ్చ పలాయన పరాయణాః | తతోవాయుః సమభవత్‌ వహ్ని మాందోలయన్నిచ || 28 ||

ప్రేషితో వై హనుమతా విప్రాణాం ప్రియకామ్యయా | ధావన్సనృపతిః పశ్చాత్‌ ఇతశ్చేతశ్చ వైతదా ||29 ||

పదాతిరేకః ప్రరుదన్‌ కవిప్రాఇతి జల్పకః | లోకాచ్ఛుత్వా తతోరాజా గతస్తత్రయతో ద్విజాః || 30 ||

గత్వాతు సహసారాజన్‌ గృహీత్వా చరణౌదతా | విప్రాణాం నృపతిర్భూమౌ మూర్ఛితోస్యపతత్తదా || 31 ||

ఉవాచ వచనం రాజా విప్రాన్‌ వినయతత్పరః | జపన్‌ దాశరధిం రామం రామరామేతి వైపునః || 32 ||

తా || అని పలికి హనుమంతుడిచ్చిన ఎడమ చంకయందున్న (పుట్టిన) పుటిని ఆతని నిలయ మందుంచి బ్రాహ్మణులు తిరిగి వెళ్ళారు (17) బ్రాహ్మణ సమూహం వెళ్ళాక అగ్ని జ్వాలలో వ్యాకులమైంది. అక్కడఅంతా అగ్నిమయమైంది (18) రాజు వస్తువులు కాలిపోతున్నాయి. ఛత్రచామరములు కోశాగారములు అన్నీ ఆయుధాగారము (19) పట్టపురాణులు, రాజపుత్రులు అనేకములైన గజ అశ్మములు, విమానములు కాలిపోతున్నాయి. వాహనములు కాలిపోతున్నాయి. (20) విచిత్రములైన పల్లకీలు, వేలకొలది రధములు కాలిపోతున్నాయి. అంతటా కాలిపోవటాన్ని చూసి రాజుకూడా బాధపడ్డాడు (21) ఆతని రక్షకుడెవ్వడూ లేడు. మానవుల భయవిక్లబులైనారు. ఆ అగ్ని మంత్రయంత్రములతో కాని మూలికలతో కాని సాధ్యం కాదు (22) రామునకు కోపంవస్తే కోట్ల కొలది కుటిలములనైనా నశింపచేస్తాడు. అక్కడ అన్నీ నశిస్తాయి. కుమారపాలకుడు ఒక లెఖ్ఖా. (23) అందరు ఆమంటలను చూచి నగ్న క్షపణకులు అప్పుడు చేతులలో పాత్రలు ధరించి శుభ##మైన దండలు తీసుకొని (24) రక్తకంబళములను తీసుకొని మాటిమాటికి వణుకుతు పాదుకలు లేకుండానే అందరు తలోదిక్కుపారిపోయారు (25) కోలాహలము చేస్తూ, పరుగెత్తండి అని అరుస్తూ వెళ్ళారు. విప్రముఖ్యులు మనల్ని అందర్ని కాల్చారు. అనుమానంలేదు (26) కొందరి పాత్రలు భగ్నమైనాయి. కొందరి దండములు భగ్నమైనాయి, నష్టులైనారు. వివస్త్రులైనారు. వీతరాగులమని పల్కుతున్నారు. (27) అర్హంతులే కొందరు పరుగెత్తసాగారు. వహ్నిని ఆందోళన పరుస్తూ గాలి వీవనారంభించింది (28) విప్రుల క్షేమము కొరకు హనుమంతుడు పంపాడు. అప్పుడు రాజు ఇటునటు పరుగెత్తుతూ (29) ఎక్కువగా అడుగులేస్తూ ఏడ్చాడు. బ్రాహ్మణులెక్కడున్నారు అని మాట్లాడుతున్నాడు ప్రజల వలన తెలుసుకొని ఆ రాజు బ్రాహ్మణులున్న చోటికి వెళ్ళాడు. (30) రాజు త్వరగా వెళ్ళి వారి పాదములను గ్రహించి, రాజు భూమిపై మూర్ఛితుడై పడ్డాడు. (31) వినయతత్పరుడై రాజు, విప్రులతో ఇట్లన్నాడు. దశరథ రాముని జపిస్తూ రామ, రామ అని పులుకుతూ (32).

మూ || తస్యదానస్యదాసోహం రామస్యచ ద్విజస్యచ | అజ్ఞాన తిమిరాంథేన జాతోస్మ్యంధోహిసంప్రతి || 33 ||

అజనంచ మయాలబ్థం రామనామ మహౌషధం | రామం ముక్త్వాహి యే మర్త్యాహ్యన్యందేవంఉపానతే

దహ్యంతేతే7గ్ని నా స్వామిన్యథాహం మూఢ చేతనః || 34 ||

హరిర్భాగీరథీ విప్రా విప్రాభాగీరథీ హరిః భాగీరథీ హరి ర్విప్రాః సారమేకం జగత్త్రయే || 35 ||

స్వర్గస్యచైవసోపానం విప్రాభాగీరథీ హరిః | రామనామ మహారజ్జ్వా వైకుంఠేయేన నీయతే || 36 ||

ఇత్యేవం ప్రణమన్నాజా ప్రాంజలి ర్వాక్యమబ్రవీత్‌ | వహ్నిః ప్రశామ్యతాంవిప్రాఃశాసనంవోదదామ్యహం || 37 ||

దాసో7స్మి సాంప్రతం విప్రాసమేవాగన్యథాభ##వేత్‌ | యత్పావం బ్రహ్‌ మహత్యాయాఃపరదారాభిగామినాం || 38 ||

యత్పావంమద్యపానాంచ సువర్ణస్తేయినాంతథా | యత్పావంగురుఘాతానాంతత్పావంహి భ##వేన్మమ || 39 ||

యంయంచియతే కామం తంతం దాస్యామ్యహంపునః | విప్రభక్తిః సదాకార్యారామ భక్తిస్తథైవచ || 40 ||

అన్యధా కరణీయంమేనకదాచిద్ద్విజోత్తమాః || 41 ||

వ్యాస ఉవాచ -

తస్మిన్నవసరే విప్రాజాతా భూపదయాలవః | అన్యాతు పుటికా చాసీత్‌సాదత్తా శాపశాంతయే || 42 ||

జీవితం చైవ తత్సైన్యం జాతంక్షిప్తేషురోమసు | దిశః ప్రసన్నాః సంజాతాః శాంతాః దిగ్జనితస్వనాః || 43 ||

ప్రజాస్వస్థా7భవత్తత్ర హర్షనిర్భర మానసా - అవతస్థేయథాపూర్వం పుత్రపౌత్రాదికంతధా || 44 ||

విప్రాజ్ఞాకారిణోలోకాః సంజాతాశ్చయథాపురా | విష్ణు ధర్మం పరిత్యజ్య నాన్యం జానం తితే వృషం || 45 ||

నవీనం శాసనం కృత్వా పూర్వవద్విథి పూర్వకం | నిష్కాసి తాస్తు పాషండాః కృతశాస్త్ర ప్రయోజకాః || 46 ||

వేదబాహ్యాః ప్రవష్టాస్తే ఉత్తమాధమ మధ్యమాః | షట్‌ త్రింశచ్చ సహస్రాణియే భూవన్‌ గోభుజాః పురా || 47 ||

తేషాం మధ్యాత్తు సంజాతా అడవీజావణిగ్జనాః | శుశ్రూషార్థం బ్రాహ్మణానాం రాజ్ఞసర్వే నిరూపితాః || 48 ||

సదాచారాః సునిపుణాః దేవబ్రాహ్మణ పూజకాః | భక్త్యా పాఖండ మార్గంతు విష్ణుభక్తి వరాస్తుతు || 49 ||

జాహ్నవీ తీరమాసాద్యత్రైవిద్యేభ్యో దదౌనృపః | శాసనంతు యదాదత్తం తేషాం వైభక్తి పూర్వకం || 50 ||

స్థాన ధర్మాత్‌ ప్రచలితా బాడబాస్తే సమాగతా ః | నృపోవిజ్ఞాపితోవిపై#్రః తైరేవం క్లేశకారిభిః || 51 ||

తా || ఆతని దాసుని దాసుడను రామునకు ద్విజునకుదాసుడను. అజ్ఞానమనే చీకటితో గుడ్డివాణ్ణౖ ఇప్పటిదాకా గుడ్డిగానే ఉన్నాను (3) నాకు కాటుకలభించింది. రామనామమనే గొప్ప ఔషధము. రాముని వదలి ఏ నరులు ఇతర దేవుణ్ణి ఉపాసిస్తారో, వారు అగ్నితో దహిస్తారు. నేనెట్లా మూఢచేతనుణ్ణో ఓస్వామి! (34) హరి భాగీరథి, విప్రులు విప్రులు, భాగీరథి, హరి, భాగీరథీ, హరి, విప్రులు ముల్లోకములందు వీటిసారమొక్కటే (35) విప్రులు, బాగీరథీ, హరి స్వర్గమునకు సోపానము. రామనామమనే గొప్పతాడుతో వైకుంఠమందు ఎవనితో తీసుకుపోబడుతాడో (వాడు అదృష్టశాలి) (36) అని రాజు నమస్కరిస్తూ చేతులు జోడించి ఇట్లా అన్నాడు - ఓవిప్రులార! అగ్నిని శమింపచేయండి. మీ శాసనమును ఇస్తాను (37) ఓ విప్రులార! ఇప్పుడు నేను దాసుణ్ణి. నా మాట మరొరకంగా కాదు. బ్రహ్మహత్యవల్ల ఏ పాపం వస్తుందో వరదారాభిగాములకు ఏ పాపంవస్తుందో (38) మద్యంతాగే వారికి ఏ పాపంవస్తుందో, సువర్ణస్తేయులకు ఏ పాపం వస్తుందో గురుఘాతులకు ఏ పాపం వస్తుందో, ఆ పాపం నాకు రాని (39) మీరు ఏ కోరికలు కోరితే ఆయా కోరికలను ఇస్తాను. విప్రభక్తి ఎప్పుడూ ఆచరించాలి. అట్లాగే రామభక్తి కూడా (40) ఓ బ్రాహ్మణులార! మరో విధంగా చేయాల్సింది నాకులేదు (41) వ్యాసులిట్లన్నారు - ఓ భూప! ఆ సమయమందు విప్రులు దయాళువులైనారు. మరో పుటిక ఏదైతే ఉందో దానిని శాపశాంతి కొరకు ఇచ్చారు (42) రోమములు పడిపోగా ఆసైన్యమంతా బ్రతికింది. దిక్కులు ప్రసన్నమైనాయి. దిక్కులయందు కల్గిన స్వరములు (శబ్దం) శాంతమైనాయి (43) ప్రజలు స్వస్థులైనారు. హర్షంతో నిండిన మనస్సు కలవారైనారు. ముందు మాదిరిగా పుత్రపౌత్రాదికము అట్లాగే ఉన్నారు (44) ముందటిలాగే లోకులు విప్రుల ఆజ్ఞను పాలించేవారైనారు. విష్ణుధర్మమును వదలి మరో ధర్మాన్ని వారెరుగరు (45) కొత్త శాసనమును చేసి ముందు మాదిరి విధి పూర్వకముగా ఏర్పరచారు. శాస్త్ర ప్రయోజకులైన పాషండులువెళ్ళగొట్టబడ్డారు. (46) ఉత్తమ అథమ, మధ్యములైన వేద బాహ్యులు నష్టమైనారు. ముప్పది ఆరువేల మంది గోభూజులెవరైతే ఉన్నారో పూర్వం (47) వారి మధ్య నుండి అఢవీజ వణిక్‌ జనులు పుట్టారు. బ్రాహ్మణులకు శుశ్రూష కొరకు రాజు వారిని ఏర్పరచాడు (48) సదాచారులు, సునిపుణులు, దేవ బ్రాహ్మణ పూజకులు, పాఖండ మార్గమును వదలి, వారు విష్ణుభక్తి పరులైనారు (49) జాహ్నవి తీరమునకు వచ్చి త్రైవిద్యులకు రాజు శాసనం ఇచ్చాడు. ఎప్పుడైతే వారికి భక్తి పూర్వకముగా శాసనమిచ్చాడో (50) అప్పుడు స్థాన ధర్మము నుండి వెళ్ళి పోయిన ఆ బాడబులు తిరిగి వచ్చారు. ఆ బ్రాహ్మణులు, క్లేశమను భవించిన వారు రాజుతో ఇట్లా విజ్ఞాపన చేశారు (51).

మూ || యేత్యక్తవాచోపిప్రేంద్రాఃతాన్ని స్సారయ భూపతే | పరస్పరం వివాదాస్తుసంజాతాదత్తవృత్తయే || 52 ||

న్యాయ ప్రదర్శనార్థంచ కారితాస్తు సభాసదః | హస్తాక్షరేషు దృష్టుషు పృధక్‌పృధక్‌ ప్రసాదితం || 53 ||

ఏతచ్ఛ్రుత్వాతతో రాజాతులాదానంచ కారహ | దీయమానే తదాదానే చాతుర్విద్యా బభాషిరే || 54 ||

అస్మాభి రాహారితాజాతిః కథంకుర్మః ప్రతిగ్రహం | నివారితాస్తుతే సర్వే స్థానాన్మోహెర కాద్విజాః || 55 ||

దశపంచ సహస్రాణివేదవేదాంగ పారగాః | తతస్తే స తదారాజన్‌ రాజ్ఞా రామానువర్తినా || 56 ||

ఆహూతా వాడవాంస్తాస్తు జ్ఞాతి భేదంచకారసః | త్రయీవిద్యావాడవాయే సేతుబంధం ప్రతిప్రభుం || 57 ||

గతాస్తే వృత్తిభాజః స్యుః నాన్యే వృత్త్యభి భాగినః | తత్రనైవగతాయే వైచాతుర్విద్యత్వమాగతాః || 58 ||

పణిగ్భిర్నచసంబంధోన వివాహశ్చతైన్సహ | గ్రామవృత్తౌన సంబంధోజ్ఞాతిభేదేకృతే సతి || 59 ||

ద్విజభక్తి పరాఃశూద్రాః యేపాఖండైః సలోపితా ః | జైనధర్మాత్సరావృత్తాః తేగోభూజాః తథోత్తమాః || 60 ||

యేచపాఖండనిరతాః రామశాసనలోపకాః | సర్వేవిప్రాస్తధా శూద్రా ప్రతిబంధేనయోజితాః || 61 ||

సత్యప్రతిజ్ఞాం కుర్వాణాః తత్రస్థాః సుఖినో7భవన్‌ | చాతుర్విద్యా బహిర్గ్రామే రాజ్ఞాతేన నివాసితాః || 62 ||

యథారామోన కుప్యేత తథాకార్యం మయాధ్రువం | పరాజ్‌ముఖాయే రామస్య సన్ముఖానుగతాఃఖిల || 63 ||

చాతుర్విద్యాస్తే విజ్ఞేయావృత్తిబాహ్యాః కృతాస్తదా | కృతకృత్యస్తదాజాతో రాజా కుమారపాలకః || 64 ||

విప్రాణాం పురతః ప్రాహప్రశ్రయేణ వచస్తదా | గ్రామవృత్తిర్నమే లుప్తా ఏతద్వైదేవనిర్మితం|| 65 ||

స్వయంకృతా వరాధానాం దోషోకన్యనదేయతే | యథావనే కాష్ఠవర్షాత్‌ వహ్నిస్స్యాత్‌ దైవయోగతః || 66 ||

భవద్భిస్తువణః ప్రోక్తోహ్య భిజ్ఞానస్యహెతవే | రామస్య శాసనం కృత్వా వాయుపుత్రస్య హెతవే || 67 ||

వ్యావృత్తావాడవాయూయం సదోషః కస్యదీయతే | అవసానే హరింస్మృత్వామహాపాయుతో7పివా || 68 ||

విష్ణులోకం ప్రజత్యాశు సంశయస్తు కథం భ##వేత్‌ | మహత్పుణ్యో దయేనౄణాంబుద్ధిఃశ్రేయసిజాయతే || 69 ||

పావస్యోదయ కాలేచ విపరీతాహి సాభ##వేత్‌ | సకృత్పాలయతేయస్తు ధర్మేణౖ తత్‌ జగత్త్రయం || 70 ||

యోంతరాత్మాచభూతానాంసంశయస్తత్ర నోహితః | ఇంద్రాదయో7మరాః సర్వే సనకాద్యాః తపోధనాః || 71 ||

ముక్త్యర్థమచ్చయంతీహ సంశయస్తత్ర నోహితః | సహస్రనామ తత్తుల్యం రామనామేతి గీయతే || 72 ||

తా || ఓ భూపతి! మాటజారిన విప్రులు ఎవరున్నారో వారిన తొంలగించు. ఇచ్చిన వృత్తి కొరకు వారిలో పరస్పరము వివాదం జరిగింది (52) న్యాయప్రదర్శన కొరకు సభాసదులను ఏర్పరచారు. హస్తాక్షరములు కన్పించాకవిడివిడిగా ఇచ్చారు. (53) దీనినివినిరాజుతులాదానముచేశాడు ఆదానాన్నిఇస్తుండగాచాతుర్విద్యులుఇట్లాఅన్నారు (54) మనం దానిని వదిలాంతిరిగిదాన్నిఎట్లా తీసుకుంటాం. వారందరుమోహెరకద్విజులుస్థానంనుండినివారింపబడ్డారు. (55) వారు పదిహేనువేలమందివేదవేదాంగపారగులు. పిదపరామానువర్తియైనరాజువారిని (56) పిలిచిఆబాడబులలో జ్ఞాతిభేదమును చేశాడు. త్రయివిద్యబాడబులుఎవరున్నారోవారు. సేతుబంధమునకు (57) వెళ్ళారు. వారేవృత్తిభాజులౌతారు. ఇతరులు వృత్తిభాజులుకారు. చాతుర్విద్యత్వంపొందిఅక్కడికివెళ్ళనివారు (58) న్నారోవారికివణిజులతోసంబంధంలేదు. వారితో వివాహంకూడాలేదు. జ్ఞాతిభేదంఅయ్యాక గ్రామవృత్తితో సంబంధంలేదు(59) ద్విజభక్తి పరులైన శూద్రులు పాఖండులతో కలవనివారు. జైన ధర్మంనుండి మరలిన వారు ఆగోభూజులు (శూద్రులు) ఉత్తములు (60) పాఖండ నిరతులైన వారు రామశాసన లోపకులు, బ్రాహ్మణులు శూద్రులు అంతా ప్రతిబంధంతో కూడినవారే (61) సత్య ప్రతిజ్ఞను చేసినవారు అక్కడివారు సుఖులైనారు. చాతుర్విద్యులను గ్రామంబయట ఆరాజునివసింపచేశాడు. (62) రాముడు కోపగించనట్లుగా నేను ఏర్పరచాలి. రామునకు పరాఙ్‌ముఖులైన వారు రామునకు అనుకూలులైనారు (63) వృత్తి బాహ్యులుగాచేయబడ్డ వారిని చాతుర్విద్యులుగా గుర్తించాలి. కుమారపాలకుడు రాజు అప్పుడు కృతకృత్యుడైనాడు (64) అప్పుడు బ్రాహ్మణుల ఎదుట రాజు వినయంగా ఇట్లా పలికాడు. నాకు గ్రామ వృత్తి లోపించలేదు. ఇది దైవ నిర్మితము (65) స్వయముగా దోషమాచరించిన దానికి ఎవరిని నిందించపనిలేదు. అడవిలో కాష్ఠ వర్షంవల్ల దైవయోగంవల్ల వహ్ని ఏర్పడినట్లు (66) అభిజ్ఞాన హేతువు కొరకు మీరు పణాన్ని చెప్పారు. రాముని శాసనం చేసి వాయుపుత్రుని కొరకు (67) మీరు బాడబులు వ్యావృత్తులైనారు. ఆ దోషము ఎవరిపై వేస్తాము. అవసానమందు హరిని స్మరించి, మహాపాపయుతుడైనా (68) త్వరగా విష్ణులోకమునకు వెళ్తాడు. అనుమానం ఎట్లా ఉంటుంది. మహాత్పుణ్యోదయమందు నరులకు బుద్ధిశ్రేయో విషయమందుఏర్పడుతుంది (69) పాపోదయ కాలమందు బుద్ధి విపరీతమౌతుంది. జగత్త్రయమున ధర్మంతో ఎవడు పరిపాలిస్తాడో (70) భూతములకు ఎవడు అంతరాత్మనో ఆ విషయంలో సంశయం హితము కాదు. ఇంద్రాది దేవతలు, సనకాది తపోధనులు (71) ఇక్కడ ముక్తి కొరకు అర్చిస్తారు. అందులో అనుమానంలేదు. హితము అది వేయినామములతో సమానము, రామనామము గానం చేయబడితే (72).

మూ || తస్మిన్ననిశ్చయంకృత్వా కథంసిద్ధిర్భవేదిహ|మమజన్మ కృతాత్‌ పుణ్యాత్‌ అభిజ్ఞానందదౌహరిః || 73 ||

పాఖండాద్యత్‌కృతంపాపంమృష్టంతద్వః ప్రణామతః | ప్రసీదంతుభవంతశ్చత్యక్త్వా క్రోధంమమాధునా || 74 ||

బ్రాహ్మణా ఊచుః -

రాజన్‌ ధర్మో విలుప్తస్తే ప్రాపితానాం తథాపునః | అవశ్యం భావినోభావా భవంతి మహతామపి || 75 ||

నగ్నత్వం నీలకంఠస్య మహాహిశయనం హరేః | ఏతత్‌ దైవకృతం సర్వం ప్రభుర్యః సుఖదుఃఖయోః || 76 ||

సత్యప్రతిజ్ఞాసై#్త్ర విద్యాభజంతురామశాసనం | అస్మాకంతు వరం దేహిస్థానం యత్ర వసామహె || 77 ||

తేషాంతు వచనం శ్రుత్వా సుఖమిచ్ఛుః ద్విజన్మనాం|తేషాం స్థానంతు దత్తంవై సుఖవాసంతు నామతః || 78 ||

హిరణ్యం పుష్పవాసాంసిగావః కామదుఘానృప | స్వర్ణాలంకరణం సర్వం నానావస్తుచయంతథా || 79 ||

శ్రద్ధయా పరయాదత్వా ముదంలేభే నరాధిపః | త్రయీ విద్యాస్తుతేజ్ఞేయాః స్థాపితా యేత్రిమూర్తిభిః || 80 ||

చతుర్థేనైవ భూపేన స్థాపితాః సుఖవాసనే | తేబభూవుః ద్విజశ్రేష్ఠాః ఛాతుర్విద్యాః కలౌయుగే || 81 ||

చాతుర్విద్యాశ్చతే సర్వే ధర్మారణ్య ప్రతిష్ఠితాః | వేదోక్తా ఆ శిషోధత్వా తసై#్మ రాజ్ఞే మహాత్మనే || 82 ||

రథైరశ్వైరుహ్యమానాః కృతకృత్యాద్విజాతయః | మహత్ర్ప మో దయుక్తాస్తే ప్రాపుర్మోహె రకం మహత్‌ || 83 ||

పౌషశుక్ల త్రయోదశ్యాం లబ్ధంశాసనకంద్విజైః | బలిప్రదానం తుకృతం ఉద్దిశ్యకులదేవతాం || 84 ||

వర్షే వర్షే ప్రకర్తవ్యం బలిదానం యథావిధి | కార్యంచ మంగల స్నానం పురుషేణ మహాత్మనా || 85 ||

గీతం నృత్యం తథా వాద్యం కుర్వీత తద్దినే ధ్రువం | తన్మాసేతద్దినే నైవ వృత్తి నాశోభ##వేద్యథా || 86 ||

దైవదతీత కాలేచేత్‌ వృద్ధిరావద్యతే యదా | తదాప్రథమతః కృత్వా పశ్చాద్వృద్ధి ర్విధీయతే || 87 ||

యేచభిన్న ప్రపాప్రాయాః త్రైవిద్యామోఢ వంశజాః | తథాచాతుర్వే దినశ్చ కుర్వంతి గోత్ర పూజనం || 88 ||

వర్షమధ్యే ప్రకుర్వీత తథాసుప్తే జనార్దనే | పౌషే చలుప్తం కృత్వాచ శ్రౌతం స్మార్తం కరోతియః || 89 ||

తత్రcకోథ సమావిష్టా నిఘ్నంతికులదేవతాః | వివాహోత్సవ కాలేచ మౌంజీ బంధాది కర్మణి || 90 ||

ముహూర్తం గణనాథస్య తతః ప్రభృతి శోభనం || 91 ||

నిర్వాసితాస్తు యేవిప్రా ఆమరాజ్ఞాస్వశాసనాత్‌ | పంచ దశ సహస్రాణి యుయుస్తే సుఖవానకం || 92 ||

పంచ పంచాశతో గ్రామాన్‌ దదౌరామః పురాస్వయం | తత్రస్థావణిజ శ్చైవ తేషాం వృత్తిమకల్పయత్‌ || 93 ||

అడాలజామాండలీయాగో భూజాశ్చ పవిత్రకాః | బ్రాహ్మణానాం వృత్తిదాస్తే బ్రహ్మసేవా సుతత్పరాః || 94 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే బ్రాహ్మణానాం శాసన వృత్తి ప్రాప్తి వర్ణనం నామ అష్ట త్రింశో7ధ్యాయః || 38 ||

తా || ఆతని యందు నమ్మకం లేకుండా సిద్ధిఎలా కలుగుతుంది. నా జన్మలో చేసిన పుణ్యాన్ననుసరించి విష్ణువు గుర్తులు ఇచ్చాడు (73) పాఖండుడనై నేనే పాపం చేశానో అది మీకు నేను చేసే నమస్కారం వల్ల నశించని. కోపాన్ని వదలి నాపై మీరు అనుగ్రహించండి. (74) బ్రాహ్మణులు వచనము - ఓ రాజ! నీ ధర్మంలోపించిందిలభించినవి కూడా నశించాయి. మహాత్ములకైనా జరుగవలసినవి తప్పకుండా జరుగుతాయి. (75) శివుడు నగ్నంగా ఉండటం, హరిపాముపై నిద్రించుట ఇదంతాదైవకృతముసుఖము దుఃఖములకుప్రభువాతడు. (76) త్రైవిద్యులుసత్యప్రతిజ్ఞులు రామశాసనాన్నిపొందనీమేము ఎక్కడఉంటామోఆస్థానాన్నిమాకివ్వు (77) వారిమాటవినిబ్రాహ్మణులసుఖాన్నికోరి, వారిస్థానాన్నివారికిచ్చాడు. దాని పేరు సుఖవాసము (78) బంగారము, పూలు, వస్త్రములు, గోవులు, కోరికలిచ్చేవి, అన్నిస్వర్ణాలంకారములు, అనేక విధముల వస్తువులుకూడాఇచ్చాడు (79) రాజుచాలాశ్రద్ధతో ఇచ్చిఆనందించాడు. త్రిమూర్తులుఎవరినిస్తాపించారోవారు త్రయివిద్యులు (80) సుఖవాసనమందునాల్గవవారుగా రాజుతోస్థాపించబడ్డవారు ఆద్విజశ్రేష్ఠులు కలియుగంలోచాతుర్విద్యులైనారు. (81) చాతుర్విద్యులంతాధర్మారణ్యమందుస్థాపించబడ్డారు. ఆమహాత్ముడైనరాజునకు వేదోక్తమైన ఆశీస్సులనిచ్చి (82) రథములతో, అశ్మములతోమోయబడుతూ కృతకృత్యులైన బ్రాహ్మణులు, చాలా ఆనందంతోవారు మోహెరకమును చేరారు (83) ద్విజులుపౌషకశుక్లత్రయోదశి రోజునశాసనాన్నిపొందారు కులదేవతనుద్దేశించిబలప్రదానము చేశారు. (84) శాస్త్రప్రకారము ప్రతిసంవత్సరముబలిదానముచేయాలి. మహాత్ముడైన పురుషుడుమంగళస్నానంచేయాలి (85) ఆరోజుగీత, నృత్యవాద్య ములనుచేయాలి. ఆమాసంలోఆరోజు కారికివృత్తి నాశంకానివిధంగాచూడాలి. (86) దైవవశాత్తుకాలందాటిపోతే, వృద్ధివచ్చే పక్షంలో, అప్పుడు మొదటిదిచేసి పిదపవృద్ధిది ఆచరించాలి (87) భిన్నప్రపాప్రాయులైన (రెండుకాల్వాలు) మోఢవంశజులైన త్రైవిద్యులు, అట్లాగేచాతుర్వేదులు గోత్రపూజ చేస్తారు.జనార్థనుడునిద్రించినప్పుడు వర్షమధ్యమందుగోత్రపూజచేయాలి. పౌషమందులోపంచేసి, శ్రౌతస్మార్తములెవ రాచరిస్తారో (89) అప్పుడుకులదేవతలు కోపగించినాశనంచేస్తారు. వివాహమహోత్సవకాలమందు మౌంజీ బంధాదికర్మ యందు (90) అప్పటి నుండి గణనాథుని ముహూర్తము ఉత్తమము (91) పంపబడిన బ్రాహ్మణులు ఆమరాజుతో తనశాసనంవల్ల పదిహేనువేల సంవత్సరాల పిదపవారు సుఖవాసకమునకు వెళ్ళారు (92) ఏబదిఐదు గ్రామములను పూర్వంరాముడు స్వయంగా ఇచ్చాడు. అక్కడున్న వణిజాలు కూడా వారికి వృత్తి కల్పించారు (93) అడాలజులు, మాండ లీయులు, గోభూజులు, పవిత్రకులు, బ్రాహ్మణులు వృత్తినిచ్చువారు (జీవనం కల్గించువారు) బ్రహ్మసేవ యందు తత్పరులు (94) అని శ్రీ స్కాద మహాపురాణమందుఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రమ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్యమాహాత్మ్యమందుబ్రాహ్మణుల శాసనవృత్తి ప్రాప్తి వర్ణనమనునది ముప్పది ఎనిమిదవ అధ్యాయము || 38 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters