Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది ఏడవ అధ్యాయము

మూ|| వ్యాస ఉవాచ -

తతస్తే బ్రాహ్మణా న్సర్వే ప్రత్యూచుః పవనాత్మజం | అథునా సఫలం జన్మ జీవితంచ సుజీవితం || 1 ||

ఆద్యనోమోఢలోకానాం ధన్యోధర్మశ్చ వైగృహాః | ధన్యాఛ సకలా పృథ్వీ యజ్ఞ ధర్మాహ్యనేకశః || 2 ||

నమః శ్రీరామ భక్తాయ అక్షవిధ్వంసనాయచ | నమోరక్షః పురీదాహకారిణవజ్రధారిణ || 3 ||

జానకీ హృదయత్రాణ కారిణ కరుణాత్మనే | సీతావిరహితప్త స్య శ్రీరామస్య ప్రియాయచ || 4 ||

నమోస్తుతే మహావీర రక్షాస్మాన్‌ మజ్జతఃక్షితౌ | నమోబ్రాహ్మణ దేవాయ వాయుపుత్రాయతే నమః || 5 ||

నమోస్తు రామభక్తాయగోబ్రాహ్మణ హితాయచ | నమోస్తు రుద్రరూపాయ కృష్ణవక్త్రాయతే నమః || 6 ||

అంజనీ సూనవేనిత్యం సర్వవ్యాధి హరాయచ | నాగయజ్ఞోపవీతాయప్రబలాయనమో7స్తుతే || 7 ||

స్వయం సముద్ర తీర్ణాయ సేతుబంధన కారిణ || 8 ||

వ్యాస ఉవాచ -

స్తోత్రేణౖవామునా తుష్టో వాయుపుత్రో7బరవీద్వచః | శృణుధ్వంహి వరం విప్రా య ద్వోమనసిరోచతే || 9 ||

విప్రాఊచుః -

యదితుష్టో7సి దేశేశ రామాజ్ఞా పాలక ప్రభో | స్వరూపం దర్శయన్వద్యలకాయాం యత్కృతం వారే || 10 ||

తథావిధ్వంస యాద్యత్వం రాజానం పాపకారిణం | దుష్టం కుమార పాలంహి ఆమంచైవన సంశయః || 11 ||

వృత్తిలోక ఫలంసద్యః ప్రాప్నుయాత్త్వం తథాకురు | ప్రతీత్యర్థం మహాబాహో కింవిలంబం వదస్వనః || 12 ||

త్వయిచిత్తేన దత్తేన నరాజాపుణ్యభాక్‌ భ##వేత్‌ | ప్రత్యయే దర్శితే వీర శాసనం పాలయిష్యతి || 13 ||

త్రయీ ధర్మః పృథివ్యాంతు విస్తారం ప్రాపయిష్యతి | ధర్మధీర మహావీర స్వరూపం దర్శయ స్వనః || 14 ||

హనుమానువాచ -

మత్స్వరూపం మహాకాయం సచక్షుర్విషయం కలౌ | తేజో రాశిమయందివ్యం ఇతిజానంతు వాడవాః || 15 ||

తధాపి పరయాభక్త్యా ప్రసన్నో7హంస్త వాదిభిః | పవనాం తరితం రూపం దర్శయిష్యామి పశ్యత || 16 ||

ఏవముక్తాన్త దావిప్రాః సర్వకార్యసముత్సుకాః | మమారూపమహాకాయం మహాపుచ్ఛసమాకులం || 17 ||

దృష్ట్వాదివ్య స్వరూపంతం హనుమంతం జహర్షిరే | కథంచి ద్ధైర్యమూలంబ్య విప్రాః ప్రోచుః శ##నైఃశ##నైః || 18 ||

తా || వ్యాసులిట్లన్నారు - ఆ పిదప బ్రాహ్మణులందరు పవనాత్మజునితో ఇట్లన్నారు ఇప్పుడు జన్మ సఫలమైంది. జీవనము సుజీవనమైంది (1) ఈ వేళ మా మోఢలోకముల ధర్మము గృహములు ధన్యమైనవి. సకల పృథ్వి ధన్యమైంది యజ్ఞ ధర్మములు, అనేక విధముల ధన్యమైనాయి (2) శ్రీరామ భక్తునకు నమస్కారము. అక్ష విధ్వంసునకు నమస్కారము. రాక్షసుల పురాన్ని కాల్చిన వానికి వజ్రధారికి నమస్కారము. (3)జానకి హృదయాన్ని రక్షించిన వానికి, కరుణాత్మునకు సీతా విరహతప్తుడైన శ్రీరామునకు ప్రియమైన వానికి, (4) నీకు నమస్కారము ఓ మహావీర! భూమి యందు మునుగుతున్న మమ్మల్ని రక్షించు బ్రాహ్మణులకు దేవుడవైన నీకు వాయుపుత్రునకు నమస్కారము (5) రామభక్తునకు నమస్కారము. గో బ్రాహ్మణ హితునకు నమస్కారము. రుద్రరూపునకు నమస్కారము. కృష్ణ భక్తుడవైననీకు నమస్కారము (6) ఆంజనీసూనునకు, సర్వవ్యాధి హరునకు నిత్యం నమస్కారము. నాగయజ్ఞో పవీతునకు, ప్రబలునకు నీకు నమస్కారము (7) స్వయముగా సముద్రము దాటిన వానికి, సేతుబంధనమునకు కారకుడైన వానికి నమస్కారము (8) వ్యాసుని వచనము - ఈ స్తోత్రంతో వాయుపుత్రుడు సంతుష్టుడై ఇట్లన్నాడు - ఓ విప్రులార! మీ మన్సునకు ఇష్టమైన వరాన్ని కోరండి అనగా (9) విప్రుల వచనము - ఓదేవేశ! నీవు తుష్టుడవైతే, ఓ ప్రభు! రామాజ్ఞాపాలక! ఓ హరి! లంకలో ఏ రూపం ధరించావో ఆ రూపానని ఈ వేళ చూపించు (10) అట్లాగే పాపకారియైన ఆ రాజును నీవు ఈవేళ ధ్వంసముచేయి. దుష్టుడైన కుమారపాలుని ఆమునికూడా అనుమానంలేదు. (11) వృత్తిలోప ఫలమును వెంటనే పొందాలి. నీవు అట్లాచేయి. ఓ మహాబాహు! ప్రతీతి కొరకు చేయి. ఆలస్యం ఎందుకో మాకు చెప్పు. (12) నీయందు మనుస్సు నిలిపి ఆరాజు పుణ్యవంతు డౌతాడు. ఓ వీరనమ్మకంకల్గిస్తే ఆరాజుశాసనాన్నిపాలిస్తాడు (13) త్రయీధర్మముపృథివియందువిస్తరిస్తుంది. ఓ ధర్మ ధీర! మహావీర నీస్వరూపాన్నిమాకుచూపు. (14) అనగా హనుమంతుడిట్లన్నాడు - నారూపముశరీరము కలియందు కళ్ళకుకన్పించడు. ఓ బాడబులార! అది తేజోరాశిమయమని దివ్యమనితెలుసుకోండి (15) మీ స్తోత్రములతో పరమ భక్తితో చేసిన వాటితో నేను ప్రసన్నుడైనాను. బట్టతోకప్పబడిన నారూపాన్నిచూపిస్తాను. చూడండి. (16) ఆబ్రాహ్మణులతో అట్లా చెప్పగావారు అన్నికార్యములకుసముత్సుకులై మహారూపము, మహాకాయము, పుచ్ఛముగల (17) దివ్యస్వరూపుడైన ఆహనుమంతునిచూచి ఆనందించారు. ఎట్లాగోధైర్యంచేసుకొనివిప్రులుమెల్లమెల్లగాపలికారు. (18)

మూ || యధోక్తంతుపురాణషుతత్తదైవహిదృశ్యతే | ఉవాచసహితాన్‌సర్వాన్‌చక్షుఃపరచ్ఛాద్యసంస్థితాన్‌ || 19 ||

ఫలానీమానిగృహ్ణీధ్వంభక్షణార్థంఋక్షీశ్వరాః | ఏభిస్తుభక్షితైర్విపరాహ్యతితృప్తిర్భవిష్యతి || 20 ||

ధర్మారణ్యంవినావాదయక్షుధావఃశామ్యతిధ్రువం || 21 ||

వ్యాసఉవాచ -

క్షుధాక్రాంతైఃతదావిపై#్రఃకృతంవైఫలభక్షణం | అమృతప్రాశనమివతృప్తిస్తేషామజాయత || 22 ||

నతృషానైవక్షుచ్చైవవిప్రాఃసంక్లిష్టమానసాః | అభవన్‌సహసారాజన్‌విస్మయావిష్టచేతనః || 23 ||

తతఃప్రాహాంజనీపుత్రఃసంప్రాప్తేహికలౌద్విజాః | నాగమిష్యామ్యహంతత్రముక్త్వారామేశ్వరంశివం || 24 ||

అభిజ్ఞానంమయాదత్తంగృహీత్వాతతగచ్ఛత | తథ్యమేతత్ర్పతీయేతతస్యరాజ్ఞోనసంశయః|| 25 ||

ఇత్యుక్తాబాహుముద్ధృత్య భుజయోరుభయోరపి | పృథగ్రోమాణిసంగృహ్యచకారపుటికాద్వయం || 26 ||

భూర్జవత్రేణసంవేష్ట్యతేఅదాద్విప్రకక్షయోః | వామేతువామకక్షోత్థాందక్షిణోత్థాంతుదక్షిణ || 27 ||

కామదాంరామభక్తస్యఅన్యేషాంక్షయకారిణీం | ఉవాచచయదారాజాబ్రూతేచిహ్నంప్రదీయతాం || 28 ||

తదాప్రదీయతాంశీఘ్రంవామకక్షోద్భవాపుటీ | అధవాతస్యరాజ్ఞస్తు ద్వారేతు పుటికాంక్షిప || 29 ||

జ్వాలయతిచతత్పైస్యం గృహంకోశం తథైవచ | మహిష్యః పుత్రకాః సర్వం జ్వలమానం భవిష్యతి || 30 ||

యదాతువృత్తిం గ్రామాంశ్చ వణిజానాంబలింతథా | పూర్వస్థితంతు యత్కించిత్‌ తత్తద్దాన్యతి వాడవాం || 31 ||

లిఖిత్వాం నిశ్చయం కృత్వాప్యథ దద్యాత్సపూర్వవత్‌ | కరసంపుటకం కృత్వా ప్రణమేచ్చయాదానృపః || 32 ||

సంప్రాప్యచ పురావృత్తిం రామదత్తాం ద్విజోత్తమాః | తతో దక్షిణ కక్షాస్థకేశానాం పుటికాత్వియం || 33 ||

ప్రక్షిప్యతాం తదాసైన్యం పురావచ్చ భవిష్యతి | గృహాణిచ తథా కోశః పుత్రపౌత్ర దయస్తథా || 34 ||

వహ్నినాముచ్య మానాస్తే దృశ్యంతేతత్‌క్షణాదితి | శ్రుత్వా7మృతమయం వాక్యంహనుమంతోదితంపరం || 35 ||

అలభన్తముదం విప్రాన నృతుః ప్రజగుర్‌భృశం | జయంచో దైరయన్‌కే7పి ప్రహసన్తిపరస్పరం || 36 ||

పులకాంకిత సర్వాంగాః స్తువన్తిచ ముహుర్ముహుః | పుచ్ఛంతస్యచ సంగృహ్యచుచుంబుఃకేచిదుత్సుకాః || 37 ||

తా || పురాణములలో ఎట్లా చెప్పబడిందో అది అట్లాగే కన్పించింది. కళ్ళుమూసుకొని నిల్చున్న వారితో అందరితో ఆతడు ఇట్లన్నాడు (19) ఋషీశ్వరులార! భక్షించేకొరకు ఈ పండ్లు తీసుకోండి. ఓ విప్రులార! ఇవి భక్షిస్తే అతితృప్తి కలుగుతుంది. (20) ధర్మారణ్యం లేకుండానే మీ ఆకలి చాల్లారుతుంది,నిశ్చయము (21) వ్యాసులిట్లన్నారు - ఆకలిగొన్న విప్రులు అప్పుడు ఫలభక్షణము చేశారు. అమృత ప్రాశన వలె వారికి తృప్తి కలిగింది (22) దప్పిక, ఆకలి, లేకుండాపోయాయి. విప్రులు ఆనందించారు. ఓ రాజ! త్వరగా ఆశ్చర్యంతో కూడిన మనస్సు కలవారైనారు (23) అప్పుడు అంజనీ పుత్రుడన్నాడు. ఓ ద్విజులార! కలివస్తే రామేశ్వర శివుణ్ణి వదలి నేను అక్కడికి రాను. (24) నేనిచ్చే గుర్తును తీసుకొని అక్కడికి వెళ్ళండి. ఆ రాజుకు ఇది నిజమనిపించాలి, అనుమానంలేదు (25) అని పలికి చేయెత్తి రెండు భుజముల నుండి విడిగా వెంట్రుకలు తీసుకొని రెండు పుటికలు చేశాడు (26) భూర్జవ్రతములతో చుట్టి, విప్రకక్షులకు ఇచ్చాడు. వామకక్షయందలి వాటిని వామమందు, దక్షిణమందలి వాటిని దక్షిణమందు ఇచ్చాడు. (27) రామభక్తునకు కోరికనిచ్చేది ఇతరులకు క్షయముచేసేది అని చెప్పి రాజు పలికినప్పుడు చిహ్నమివ్వండి (28) అప్పుడు త్వరగా వామకక్షమందున్న దొప్పను ఇవ్వండి. లేద ఆ రాజు యొక్క ద్వారమందు దొప్పను పారేయండి (29) ఆతనిసైన్యాన్ని గృహమును, కోశాగారాన్ని మండిస్తుంది. మహారాణి పుత్రులు. అంతా కాలిపోతారు (30) ఎప్పుడైతే వృత్తిని గ్రామములను వణిజులకు బలిని, ముందున్న దానిని ఏ కొంచమైనా అదంతా ఇస్తాడు. ఓ బాడబులార! (31) వ్రాసి, నిశ్చయం చేసుకొని ఆతడు పూర్వంవలె ఇవ్వాలి. చేతులు జోడించి రాజు ఎప్పుడునమస్కరిస్తాడో (32) ఓ ద్విజోత్తములార! రాముడు ఇదివరలోఇచ్చినవృత్తిని పొంది ఆపిదపదక్షిణకక్ష యందున్న ఈ వెంట్రుకలపుటికను (33) పారవేయండి. అప్పుడు సైన్యము ముందులాగేఔతుంది. గృహములు, కోశము పుత్రపౌత్రాదులుఅట్లాగేజీవిస్తారు. (34) వారు అగ్నితోవిడువ బడుతూ ఆక్షణంలోనే కన్పిస్తారు. అగి హనుమంతుడు చెప్ని పరమైన అమృతమయవాక్యములను విని (35) విప్రులు ఆనందిం చారు, నాట్యంచేశారు. మిక్కిలి పాడారు. కొందరు జయజయధ్వానాలుచేశారు. పరస్పరమునవ్వుకొన్నారు. (36) పులకాంకి తశరీరులైమాటిమాటికి స్తుతించారు. ఉత్సాహంగలకొందరు ఆతనితోకనుపట్టుకొనిముద్దాడారు. (37)

మూ || బ్రూతే7న్యోమమయత్నేనకార్యంనియతమేవహి | అన్యోబ్రూతేమహాభాగమయేదంకృతమిత్యుత || 36 ||

తతః ప్రోవాచ హనుమాన్‌ త్రిరాత్రం స్థీయతామితి | రామతీర్థన్యచ ఫలం యథాప్రాప్యథవాడవా ః || 39 ||

తథేత్యుక్త్యాథ తేవిప్రాః బ్రహ్మయజ్ఞం ప్రచక్రికే | బ్రహ్మఘోషేణ మహతా తద్వనం బధిరంకృతం || 40 ||

స్థిత్వాత్రి రాత్రంతే విప్రాగమనే కృతబుద్ధయః | రాత్రౌ హనుమతో7గ్రేత ఇదమూచుః సుభక్తితః || 41 ||

బ్రాహ్మణా ఊచుః -

వయం ప్రాతః గమిష్యామో ధర్మారణ్యం సునిర్మలం | నవిస్మార్యావ యంతాతక్షమ్యతాంక్షమ్యతామితి || 42 ||

తతోవాయుసుతోరాజన్‌ పర్వతాత్‌ మహతీంశిలాం | బృహతీంచ చతుః శాలాందశయోజన మాయతీం || 43 ||

ఆస్తీర్య ప్రాహతాన్‌ విప్రాన్‌ శిలాయాం ద్విజసత్తమాః | రక్ష్యమాణామయావిప్రాఃశయిధ్వంవిగతజ్వరాః || 44 ||

ఇతిశ్రుత్వాతతః సర్వేనిద్రామాపుః సుఖప్రదాం | ఏవంతే కృతకృత్యాస్తు భూత్వాసుప్తానిశాముఖే || 45 ||

కృపాలుం సచరుద్రాత్మా రామశాసనపాలకః | రక్షణార్థంహి విప్రాణాం అతిష్ఠచ్చ ధరాతలే || 46 ||

వ్యాస ఉవాచ -

అర్థరాత్రేతు సంప్రాప్తే సర్వేనిద్రాముపాగతాః తాతం సంప్రార్థయామాసకృతాను గ్రహకోభవాన్‌ || 47 ||

సమీరణ ద్విజానేతాన్‌ స్థానం స్వంప్రాపయస్వభోః తతోనిద్రాభిభూతాంస్తాన్‌ వాయుపుత్రప్రణోదితః || 48 ||

సముద్థృత్య శిలాంతాంతు పితాపుత్రేణ భారత | విశిష్టోయాపయా మాస స్వస్థానం ద్విజసత్తమాన్‌ || 49 ||

షడ్భిః మాసైశ్చయః పంధా అతిక్రాంతో ద్విజాతిభిః త్రిభిరేవ ముహూర్తైస్తు ధర్మారణ్యమవాప్తవాన్‌ || 50 ||

భ్రమమాణాం శిలాం జ్ఞాత్వా విప్ర ఏకోద్విజాగ్రతః | వాత్స్యగోత్ర సముత్పన్నో లోకాన్‌ సంగీతవాన్‌కలం || 51 ||

గీతానిగాయనోక్తాని శ్రుత్వావిస్మయమాయయుః | ప్రభాతే సుప్రసన్నేతు ఉదతిష్ఠన్‌ పరస్పరం || 52 ||

ఊచుస్తేవిస్మితాః సర్వే స్వప్నో7యంవాథవిభ్రమః | ససంభ్రమాః సముత్థాయదదృశుః సత్యమందిరం || 53 ||

అంతర్బుద్ధ్యాన మాలోక్య ప్రభావో వాయుజన్యచ | శ్రుత్వావేదధ్వనింవిప్రాః పరం హర్షముపాగతాః || 54 ||

గ్రామీణాశ్చతతోలోకా దృష్టవాతు మహతీంశిలాం | అద్భుతంమేనిరే సర్వేకి మిదంకి మిదంత్వితి || 55 ||

గృహెగృహేహితే లోకాః ప్రవదంతి తథాద్భుతం | బ్రాహ్మణౖః పూర్యమాణాసా శిలాచ మహతీశుభా || 56 ||

అశుభావాశుభావాపి నజానీమో వయంకిల | సంపదంతే తతోలోకాః పరస్పరమిదంపచః || 57||

తా || ఒకడంటాడు నా ప్రయత్నంతో కార్యం తప్పకుండా ఔతుంది, అని. మరొకడంటాడు ఓ మహాభాగ! నేనీపనిచేశాను, అని (38) తరువాత హనుమంతుడన్నాడు. ఇక్కడ మూడురాత్రులు ఉండండి. రామతీర్థఫలాన్ని ఓ బాడబులార! పొందుతారు అని (39) అట్లాగే అని ఆ విప్రులు బ్రహ్మయజ్ఞాన్ని చేశారు. పెద్ద బ్రహ్మఘోషతో ఆ వనం చెవిటిదైంది (40) మూడు రాత్రులు విప్రులు ఉండి వారు వెళ్ళటానికి నిశ్చయించారు. రాత్రియందుహనుమంతునిఎదుట భక్తితోవారుఇట్లాపలికారు. (41) బ్రాహ్మణులవచనము - సునిర్మలమైనధర్మారణ్యానికిమేముప్రొద్దునవెళ్తాము. ఓ తండ్రి మమ్ములనునీవుమరువరాదు. క్షమించండి, క్షమించండి. అని (42) పిదపవాయుసుతుడుపర్వతంనుండిపెద్దరాయిని పెద్దదానినినాల్గుమూలలున్నదానినిపదియోజనములవిస్తారమైఊనదానిని (43) పరచివారితోఇట్లాఅన్నాడు. ఓ ద్విజులార! శిలయందు, నేనురక్షిస్తుండగావిగతజ్వరులైశయించండి (44) అనివినిపిదపవారందరు సుఖప్రదమైననిద్రనుపొందారు. ఈవిధముగా వారు కృతకృత్యులైనిశాముఖమందు (సాయం)నిద్రించారు. (45) రుద్రాత్ముడైనరామశాసన పాలకుడైన హరిదయగలవాడైవిప్రులరక్షించేకొరకుధరాతలమందున్నాడు (46) వ్యాసులిట్లన్నారు. అర్థరాత్రిఅయ్యాకఅందరునిద్ర పోయారు. తండ్రినిప్రార్థించాడు. నీవుదయగలవాడివి (47) ఓ సమీరణ! ఈ బ్రాహ్మణులను వారిస్థానములకు పంపించు అనిపిదపనిద్రతోకప్పబడిన వారినివాయుపుత్రునితోచెప్పబడి (48) కొడుకుతో చెప్పబడి తండ్రి ఆశిలను ఎత్తి వారితో కూడా ఎత్తి బ్రాహ్మణులను స్వస్థానమునకు పంపించాడు (49) బ్రాహ్మణులు ఆరు మాసములలో దాటిన మార్గమును, మూడు ముహూర్తములలో దాటించాడు. వారు ధర్మారణ్యమునకు వచ్చారు. (50) తిరుగుతున్న శిలను చూచి ఒక బ్రాహ్మణుడు మరో ద్విజుని ఎదుట వాత్స్య గోత్రమందు జన్మించినవాడు.సంగీత విద్వాంసుడు అవ్యక్త మధురంగా పాడాడు (51) పాడతగిన పాటలను విని వారాశ్చర్య పడ్డారు. ప్రభాతం చాలా ప్రసన్నంగా ఉండగా ఒకళ్ళొకళ్ళు లేచారు (52) అందరూ ఆశ్చర్యపడి ఇట్లన్నారు. ఇది కలాకాక భ్రమనా అని. తొందర పాటుతో లేచి సత్యమందిరాన్ని చూచారు (53) అంతర్భుద్ధితో వాయుదేవుని ప్రభావం గమనించి విప్రులు వేద ధ్వనిని విని చాలా ఆనందపడ్డారు (54) లోకులు గ్రామీణులు ఆ గొప్ప రాయిని చూచి అందరు అద్భుతమని తలిచారు. ఇదేమిటి, ఇదేమిటి అని (55) ఆ అద్భుతాన్ని లోకులు ప్రతిఇంట్లో చెప్పుకున్నారు. బ్రాహ్మణులతో నిండిన శుభ##మైన ఆ గొప్పశిల (56) మంచిదో చెడ్డదో మనకు తెలియదు అని లోకులు పరస్పరము ఈ మాటను అనుకుంటున్నారు (57).

మూ|| వ్యాస ఉవాచ -

తతోద్విజానాం తేపుత్రాః పౌత్రాశ్చైవ సమాగతాః | ఊచుస్తే దిష్ట్యాభోవిప్రాః ఆగతాః పథికాద్విజాః || 58 ||

తేతుసంతుష్టమనసా సన్ముఖా పర్యయుర్ముదా | ప్రతుత్థానాభివాదాభ్యాం పరిరం భణకంతథా || 59 ||

ఆఘ్రాణ కాదీంశ్చ కృతవ్‌ఆ యథాయోగ్యం ప్రపూజ్యచ | సర్వంవిస్తార్యకథితం శీఘ్రమాగమమాత్మనః || 60 ||

తతఃసంపూజ్యతాన్‌ సర్వాన్‌ గంథతాంబూలకుంకుమైః | శాంతిపాఠంపఠంతస్తేహృష్టానిజగృహాన్యయుః || 61 ||

ఆనందాయ మహీపీఠే ప్రాతః పాంధాః సముత్థితాః | దదృశుస్తే మహస్థానం సోత్కంఠా హర్షపూరితాః || 62 ||

ఆశ్చర్యం పరమం ప్రాపుః కిమేతత్‌ స్థానముత్తమం | అయంతు దక్షిణ ద్వారే శాంతి పాఠో7త్రపఠ్యతే || 63 ||

గృహారమ్యాః ప్రదృశ్యంతే శచీపతి గృహోపమాః | ప్రాసాదాః కులమాతౄణాం దృశ్యంతే చాగ్నిశోభనాః || 64 ||

ఏవంబ్రువత్సు విప్రేషు మహాశక్తి ప్రపూజనే | ఆగత బ్రాహ్మణో7పశ్యత్‌ తత్ర విప్రకదంబకం || 65 ||

హర్షితో భావితస్తత్ర యత్రవిప్రాః సభాసదః | ఉవాచ దిష్ట్యాభో విప్రాహ్యాగతాః పథికా ద్విజాః || 66 ||

ప్రత్యుత్తస్థుః తతోవిప్రాఃపూజాః గృహీత్వా సమాగతాః | ప్రత్యుత్థానాభివాదౌచ చాకుర్వంస్తేచ పరస్పరం || 67 ||

తేతే సంపూజ్య వేగాత్తు యథాయోగ్యం యథావిధి | హరీశ్వరస్య యద్వృత్తం విప్రాగ్రే సంప్రకాశితం || 68 ||

పథికానాం పచః శ్రుత్వాహర్షపూర్ణాద్విజోత్తమాః | శాంతిపాఠం పఠంతస్తే హృష్టానిజ గృహాన్యయుః || 69 ||

విమృశ్యమిలితాః ప్రాతః జ్యోతిర్విద్భిః ప్రతిష్ఠితాః | బ్రాహ్మె ముహూర్తె చోత్థాయ కాన్యకుబ్జంగతాద్విజాః || 70 ||

దోలాభిర్వాహితాః కేచిత్‌ కేచిదశ్వైః రథైస్తథా | కేచిత్తు శిబికారూఢాః నానావాహనగాశ్చతే || 71 ||

తత్పురంతు సమాసాద్య గంగాయాః శోభ##నేతలే | అకుర్వన్‌ వనతింధీరాః స్నానదానాది కర్మచ || 72 ||

చారేణకేనచి ద్దృష్టాః కథితా నృపసన్నిధౌ | అశ్వాశ్చ బహుశో దోలా రథాశ్చ బహుశోవృషాః || 73 ||

విప్రాణామిహదృశ్యంతే ధర్మారణ్య నివాసినాం | సూనంతేచ సమాయాతౌ నృపేణోక్తం మమాగ్రతః || 74 ||

అభిజ్ఞా వయమే పూర్వం ప్రేషితాః కపిసన్నిధౌ || 75 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే బ్రాహ్మణానాం ప్రత్యాగమన వర్ణనం నామ సప్తత్రింశో7ధ్యాయః || 37 ||

తా || వ్యాసులిట్లన్నారు - పిదప ద్విజుల పుత్రులుపౌత్రులువచ్చారు. వారిట్లన్నారు. ఓ బ్రాహ్మణులార! అదృష్టవశాత్తు వచ్చారు. బాటయందున్న మీరు వచ్చారు (58) వారు ఆనందించిన మనస్సు గలవారై ఆనందంతో ఎదురువెళ్ళారు. ప్రత్యుత్థాన అభివాదనలతో అట్లాగే ఆలింగనములతో (59) ఆఘ్రాణాదులను చేసి తగినట్లు పూజచేశారు. అంతా వివరంగా చెప్పారు. త్వరగా తామెట్లా వచ్చామో చెప్పారు. (60) అప్పుడు వారందరిని గంధ తాంబూల, కుంకుమలతో పూజించి శాంతి పాఠం చదువుతూ ఆనందంతో తమ గృహాలకు వెళ్ళారు (61) ఆనంద మహాపీఠమందు ప్రాతః కాలమందు బాటసారులు లేచారు. ఉత్కంఠతో ఆనందపూరితులైవారు మహాస్థానాన్ని చూచారు. (62) పరమ ఆశ్చర్యాన్ని పొందారు. ఇదేమి ఉత్తమ స్థానము అని. ఇదైతే దక్షిణ ద్వారమందు ఇక్కడ శాంతి పాఠం చదువబడుతోంది. (63) ఇళ్ళు అందంగా కన్పిస్తున్నాయి. ఇంద్రుని గృహంవలె ఉన్నాయి. అగ్నివలె, అందమైన కులమాతల-ప్రాసాదములు కన్పిస్తున్నాయి (64) అని బ్రాహ్మణులు అంటుండగా మహాశక్తి పూజకొరకు వచ్చిన బ్రాహ్మణుడు అక్కడ బ్రాహ్మణ సమూహాన్ని చూచాడు (65) విప్రులను సభాసదులుగాచూచి ఆనందించాడు. ఓ విప్రులార! అదృష్టవశాత్తు వచ్చారు. ఓబాటయందలి ద్విజులార! అని అన్నాడు (66) పిదప విప్రులు లేచారు. పూజను గ్రహించి వచ్చారు. వారు పరస్పరము ప్రత్యుత్థాన అభివాదములు చేసుకున్నారు (67) యథాయోగ్యముగా యథావిథిగా వేగంగా వారిని పూజించారు. హరీశ్వరుని వృత్తాంతమును విప్రుని ఎదుట చెప్పారు (68) వధికుల మాటలను విని బ్రాహ్మణులు హర్షపూర్ణులై వారు శాంతి పాఠం చదువుతూ ఆనందంతో తమ గృహములకు వెళ్ళారు (69) ఆలోచించి ప్రొద్దున అందరు కలిసి జ్యోతిష్కులతో ప్రతిష్ఠింపబడి బ్రాహ్మముహూర్త మందులేచి బ్రాహ్మణులు కాన్యకుబ్జము వెళ్లారు (70) కొందరు పల్లకులలో కొందరు గుఱ్ఱాలపై కొందరు రథాలపై కొందరుమేనాలలో కూర్చొని రకరకాల వాహనాలలో వారు వెళ్ళారు (71) ఆ పురమునకు చేరి గంగయొక్క శోభనతట మందు ధీరులు వసతిని ఏర్పరచుకున్నారు. స్నానదానాది కర్మలు చేశారు. (72) చారుడొకడు చూచి రాజు ఎదుట చెప్పాడు. అనేకమైన అశ్వములు, మేనాలు, రథములు చాలా ఎద్దులు (73) విప్రులకిక్కడ కన్పిస్తున్నాయి. ధర్మారణ్య నివాసులకు. తప్పకుండా వారు వచ్చి ఉంటారు. రాజన్నాడు నా ఎదుట (74) వారిని చూపించు నేను పూర్వము వారిని కపిసన్నిధికి పంపాను (75) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మ ఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు బ్రాహ్మణులు తిరిగి వచ్చుట వర్ణనము అనునది ముప్పది ఏడవ అధ్యాయము || 37 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters