Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది మూడవ అధ్యాయము

మూ || రామ ఉవాచ -

జీర్ణోద్ధారం కరిష్యామి శ్రీ మాతుర్వచ నాదహం | ఆజ్ఞాప్రదీయతాం మహ్యం యథాదానంద దామివః ||1 ||

పాత్రేదానం ప్రదాతవ్యం కృత్వాయజ్ఞపరంద్విజాః | నాపాత్రే దీయతే కించిత్‌ దత్తం సతు సుఖావహం || 2 ||

సుపాత్రం నౌరి వనదాతారయే దుభయోరపి | లోహపిండోప మంజ్ఞేయం కుపాత్రం భంజనాత్మకం || 3 ||

జాతి మాత్రేణ విప్రత్వం జాయతేన హిభో ద్విజాః | క్రియా బలవతీలోకే క్రియాహీనే కుతః పలం || 4 ||

పూజ్యాస్తస్మాత్పూజ్యతమా బ్రాహ్మణాః సత్యవాదినః | యజ్ఞకార్యే సముత్పన్యే కృపాంకుర్వంతుసర్వదా || 5 ||

బ్రహ్మోవాచ -

తతస్తు మిలితాన్సర్వే విమృశ్యచ పరస్పరం | కేచి దూచుస్త దారామం వయంశిలోంఛ జీవివాః || 6 ||

సంతోషం పరమాస్థాయ స్థితాధర్మ పరాయణాః | ప్రతిగ్రహ ప్రయోగేణనచాస్మాకం ప్రయోజనం || 7 ||

దశనూనా సమశ్చక్రీ దశచక్రి నమోధ్వజః | దశధ్వజ సమావేశ్యా దశ##వేశ్యా నమోనృపః || 8 ||

రాజప్రతిగ్రహో ఘోరో రామసత్యంస సంశయః | తస్మాద్వయం నచేచ్ఛామః ప్రతిగ్రహం భయావహం || 9 ||

ఏకాహికాద్విజాః కేచిత్‌ కేచిత్‌ స్వామృతవృత్తయః | కుంభీధాన్యా ద్విజాః కేచిత్‌ కేచత్‌ షట్కర్మతత్పరాః || 10 ||

త్రిమూర్తి స్థాపితాః సర్వే వృథగ్భావాః వృథగ్గుణాః | కేచిదేవం వదంతి న్మత్రిమూర్త్యా జ్ఞాం వినావయం || 11 ||

ప్రతిగ్రహస్య స్వీకారం కథం కుర్యామ హద్విజాః | నతాంబూలం స్త్రీ కృతం నోహ్యద్మోదానేన భాషితం || 12 ||

విమృశ్య నతదారామో వసిష్ఠేన మహాత్మనా | బ్రహ్మవిష్ణు శివాదీనాం సస్మారరగురుణా సహ || 13 ||

స్మృతమాత్రా స్తతో దేవాః తందేశం సముపాగమన్‌ | సూర్యకోటి ప్రతీకాశ విమానా వలి సంవృతాః || 14 ||

రామేణ తేయథాన్యాయం పూజితాః పరయాముదా | నివేదితంతు తత్సర్వం రామేణాతి సుబుద్ధినా || 15 ||

అధిదేవ్యావచనత జీర్ణోద్థారం కరోమ్యహం | ధర్మారణ్య హరిక్షేత్రే ధర్మకూప సమీపతః || 16 ||

తతస్తే బాడవాః సర్వే త్రిమూర్తీః ప్రణివత్యచ | మహతాహర్ష వృందేన పూర్ణాః ప్రాప్తమనోరథాః || 17 ||

అర్ఘ్య పాద్యాది విధినా శ్రద్ధ యాతాన పూజయన్‌ | క్షణం విశ్రమ్యతే దేవా బ్రహ్మవిష్ణు శివాదయః || 18 ||

ఊచూరామం మహాశక్తిం వినయాత్కృత సంపుటం || 19 ||

తా || రాముడిట్లన్నాడు - శ్రీమాత వచన ప్రకారమునేను జీర్ణోద్ధారము చేస్తను. నాకు ఆజ్ఞనివ్వండి. మీకు తగిన విధముగా దానమిస్తాను. (1) ద్విజులు ఉత్తమ యజ్ఞమునే చేసి యోగ్యునకు దానమును ఇవ్వాలి. అపాత్రునకు ఏ కొంచెము ఇవ్వరాదు. ఒకవేళ ఇచ్చినా అది సుఖకారికాదు (2) సుపాత్రదానము నావవలె ఉభయులను ఎల్లప్పుడు తరింపచేస్తుంది. కుపాత్రదానము లోహపిండముతో సమానమైనది. పగిలిపోయేది (3) ద్విజులార! జాతి మాత్రంచేత విప్రత్వము కలుగదు. లోకంలో క్రియబలమైనది క్రియాహీనునకు ఫలితంలేదు (4) అందువల్ల పూజ్యతములైన సత్యవాదులైన బ్రాహ్మాణులను పూజించాలి. యజ్ఞకార్యము సంభవిస్తే ఎప్పుడ దయచూపండి (5) బ్రహ్మఇట్లన్నాడు - పిదప అందరు కలిసి పరస్పరము ఆలోచించుకొని కొందరప్పుడిట్లన్నారు. రామ! మేము శిల ఉంఛవృత్తితో జీవించేవారము (6) పరమైన సంతోషమును పొందిఉన్నాము. ధర్మపరాయణులము. దానం స్వీకరించటంవల్ల మాకేలాంటి ప్రయోజనంలేదు (7) దశసూనములతో సమానమైంది చక్రి (పాపము) పదిపాపములతో సమానమైంది ధ్వజము. (కల్లమ్మేవాడు) పది ధ్వజములతో సమానమైంది. వేశ్య. పదిమంది వేశ్యలతో సమానమైనవాడు రాజు (8) రాజుదగ్గర దానం గ్రహించుట మహా ఘోరము. ఓరామ! ఇది నిజము. అనుమానంలేదు. అందువల్ల మేము భయం కల్గించే ప్రతి గ్రహమును ఇష్టపడము (9) ఏకాహి ద్విజులు కొందరు (ఒకనాటి వ్రతం) కొందరు ఆయాచిత వృత్తిగలవారు. కొందరు ద్విజులు చిన్న జాడెడు (వంటకుండ) ధాన్యంతో జీవించేవారు. కొందరు షట్కర్మతత్పరులు (10) అందరు త్రిమూర్తులచే స్థాపింపబడ్డవారే పృధక్‌ భావము, గుణములు కలవారు. కొందరిట్లా అంటారు. త్రిమూర్తుల ఆజ్ఞలేకుండ మేము (11) దాన స్వీకారమును ఎట్లా చేస్తాము. స్త్రీ కృతమైన తాంబూలమును తినము. దానంతో వచ్చిన ఆహారమును తినము (12) అప్పుడ రాముడు వసిష్ఠునితో విమర్శించి గురువుతో కూడి బ్రహ్మవిష్ణుశివాదులను స్మరించాడు (13) స్మరించిన మాత్రంచేత ఆ దేవతలు ఆ ప్రాంతమునకు వచ్చారు. కోటి సూర్యులతో సమానమైన కాంతి గల విమానములతో కూడి వచ్చారు (14) వారిని రాముడు తగినట్లుగా పూజించాడు. పరమానందంతో రాముడు అతి సుబుద్ధిమంతుడు ఆ విషయాన్నంతా వారికి నివేదించాడు (15) అధి దేవత వచనం ప్రకారము నేను జీర్ణోద్ధారము చేయదలిచాను. ధర్మారణ్యమందు హరిక్షేత్రమందు ధర్మకూప సమీపంలో చేయదలిచాను (16) అప్పుడు ఆ బ్రాహ్మణులందరు త్రిమూర్తులకు నమస్కరించి గొప్ప ఆనందంతో నిండినవారై కోరికలు నెరవేరి (17) అర్ఘ్య పాద్యాది విధులతో శ్రద్ధతో వారిని పూజించారు. క్షణంసేపు విశ్రాంతి పొంది ఆ బ్రహ్మ విష్ణు శివాది దేవతలు (18) మహాశక్తి మంతుడు వినయంతో చేతులు జోడించిన వాడు ఐన రామునితో ఇట్లన్నారు (19)

మూ || దేవా ఊచుః

దేవద్రుహస్త్వయా రామయే హతా రావణారయః | తేనతుష్టావయం సర్వేభానువంశ విభూషణ || 20 ||

ఉద్థర స్వమహాస్థానం మహతీంకీర్తిం మాప్నుహి || 21 ||

లబ్ధ్వానతేషా మాజ్ఞాంతు ప్రీతో దశరథాత్మజః | జీర్ణోద్ధారే7నంతగుణం ఫలమిచ్ఛన్నిలా పతిః || 22 ||

దేవానాం సన్నిధౌ తేషాం కార్యారం భమధాకరోత్‌ | స్థండిలం పూర్వతః కృత్వా మహాగిరి నమంశుభం || 23 ||

తస్యోపరిబహిః శాలా గృహశాలాహ్యనేకశః | బ్రహ్మశాలాశ్చ బహుశో నిర్మమే శోభనాకృతీః || 24 ||

నిధానైశ్చ సమాయుక్తా గృహోపకరణౖర్వృతాః | సువర్ణ కోటి సంపూర్ణా రసవస్త్రాది పూరితాః || 25 ||

ధనధాన్య సమృద్ధాశ్చ సర్వధాతుయుతాస్తథా | ఏతత్సర్వం కారయిత్వా బ్రాహ్మణభ్యస్తదాదదౌ || 26 ||

ఏకైక శోదశదశ దదౌధెనూః పయస్వినీః | చత్వారింశచ్ఛతంప్రాదాత్‌ గ్రామాణాం చతురాధికం || 27 ||

త్రైవిద్యద్విజ విప్రేభ్యో రామోదశరథాత్మజః | కాజేశేన త్రయే ణౖవ స్థాపితా ద్విజసత్తమాః || 28 ||

తస్మాత్త్రయీ విద్య ఇతిఖ్యాతి ర్లోకే బభూవహ | ఏవంవిధం ద్విజేభ్యః సదత్వా దానం మహాద్భుతం || 29 ||

ఆత్మానం చాపిమేనేన కృతకృత్యం సరేశ్వరః | బ్రహ్మణా స్థాపితాః పూర్వం విష్ణునా శంకరేణయే || 30 ||

తేపూజితా రాఘవేణ జీర్ణోద్థారే కృతే సతి | షట్‌ త్రింశచ్చ సహస్రాణి గోభుజాయే పణిగ్వరాః || 31 ||

శుశ్రూషార్థం ప్రదత్తా వైదేవైః హరి హరాదిభిః | సంతుష్టేన తుశ##ర్వేణ తేభ్యో దత్తంతు చేతనం || 32 ||

శ్వేతాశ్వచామరౌదత్తౌ ఖడ్గందత్తం సునిర్మలం | తదా ప్రబోధితాస్తే చ ద్విజశుశ్రూషణాయవై || 33 ||

వివాహాదౌ సదా భావ్యం చామరైర్మంగలంవరం | ఖడ్గం శుభం తదా ధార్యం మమచిహ్నం కరేస్థితం || 34 ||

గురుపూజా సదాకార్యాకులదేవ్యాః పునః పునః | వృద్ధ్యాగమేషు ప్రాస్తేషు వృద్ధి దాయక దక్షిణా || 35 ||

ఏకాదశ్యాం శ##నేర్వారే దానం దేయం ద్విజన్మనే | ప్రదేయంబాల వృద్ధేభ్యో మమరామస్యశాసనాత్‌ || 36 ||

మండలేషుచయే శుద్ధా పణిగ్వృత్తి రతాఃపరాః | సపాదలక్షాస్తే దత్తా రామశాసన పాలకాః || 37 ||

మాండలీకాస్తుతేజ్ఞేయాః రాజానోమండలేశ్వరాః | ద్విజశుశ్రూషణ దత్తా రామేణ పణిజాం పరాః || 38 ||

తా || దేవతలిట్లన్నారు - దేవతలక పకారం చేసే రావణాదులను నీవు చంపావు. ఓరామ! భాను వంశ విభూషణ! దానితో మేము అందరము సంతసించాము (20) మహాస్థానమును ఉద్ధరించి గొప్పకీర్తిని పొందు (21) వారి ఆజ్ఞను పొంది ఆనందించి ఆ దశరథాజ్ముడు జీర్ణోద్ధారణమందు అనంత గుణ ఫలమును కోరుకొని ఆరాజు (22) దేవతల సన్నిధి యందు వారి కార్యారంభమున చేశాడు. మహా పర్వతముతో సమానమైన శుభ##మైన స్థండిలమును పూర్వభాగంలోచేసి (23) దానిపైన బహిఃశాలలు అనేకమైన గృహశాలలు అనేకమైన బ్రహ్మశాలలు అందమైన ఆకారములతో నిర్మింపచేశాడు (24) నిధానములతో కూడినవి గృహోపకరణములతో కూడినవి. కోట్లకొలది బంగారముతో నిండినవి, రసవస్త్రాదులతో నిండినవి (25) ధనధాన్యములతో సమృద్ధమైనవి. అట్లాగే సర్వధాతువులతో కూడినవి. ఇవన్నీ ఏర్పరచి అప్పుడు వాటిని బ్రాహ్మణులకు ఇచ్చాడు (26) ఒక్కొక్కరికి పాలిచ్చే గోవులను నూరేసి ఇచ్చాడు. నాలుగువేల నాలుగు గ్రామములను (27) వేదవిద్య నెరిగిన ద్విజులకు బ్రాహ్మణులకు దశరథాత్మజుడైన రాముడిచ్చాడు. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురితో ఏర్పరుచబడిన బ్రాహ్మణులువారు (28) అందువల్ల త్రయివిద్య అని లోకంలో కీర్తి వచ్చింది. ఈ విధముగా బ్రాహ్మణులకు మహాద్భుతమైన దానమును ఆతడిచ్చి (29) ఆ రాజు తనను కృతకృత్యునిగా భావించాడు. బ్రహ్మతో విష్ణువుతో శంకరునితో ఇది వరలో ఎవరు స్థాపింపబడ్డారో (30) వారు జీర్ణోద్ధారంజరిగాక రామునితో పూజింపబడ్డారు. ముప్పది ఆరువేలమంది గోభుజులైన ఏ పణిక్‌ వరులున్నారో (పాలకులు) (31) వారిని, శుశ్రూష కొరకు హరిహరాదులైన దేవతలు ఇచ్చారు. శర్వుడు ఆనందపడి వారికి చేతసత్వం కల్పించాడు. (32) తెల్లని గుఱ్ఱములు చామరములు, నిర్మలమైన ఖడ్గము వారికిచ్చాడు. వారు ద్విజశుశ్రూష కొరకు అప్పుడు మేల్కొలుపబడ్డారు. (33) వివాహాదులందు ఎప్పుడూ చామరములుండాలి. అవి మంగళకరమైనవి. శ్రేష్ఠమైనవి. నా చిహ్నమైన చేతియందున్న శుభ##మైన ఖడ్గాన్ని అప్పుడు ధరించాలి (34) గురుపూజను ఎల్లప్పుడు చేయాలి. కులదేవత పూజ మళ్ళీ మళ్ళీ చేయాలి. వృద్ధి ఆగమములు వస్తే దక్షిణ వృద్ధిగా ఇవ్వాలి (35) బ్రాహ్మణునకు ఏకాదశిరోజున శనివారమందు దానమివ్వాలి. నా ఆజ్ఞ ప్రకారము బాలవృద్ధులకు ఇవ్వాలి (36) మండలములందు శుద్ధులైన పణిక్‌ వృత్తియందున్న ఇతరులున్నారో వారు రామశాసన పాలకులుగా లక్షపాతికమంది ఏర్పరచబడ్డారు (37) వారిని మాండలీకులని అన్నారు. వారు రాజులు, మండలేశ్వరులు. పణిక్‌ శ్రేష్ఠులు ద్విజశుశ్రూషకొరకు రామునిచే ఇవ్వబడ్డారు (38)

మూ || చామరద్వితయంరామో దత్తవాన్‌ ఖడ్గమేవచ | కులస్య స్వామినం సూర్యంప్రతిష్ఠావిధిపూర్వకం || 39 ||

బ్రహ్మాణం స్థాపయామాన చతుర్వేద సమన్వితం | శ్రీమాతరం మహాశక్తిం శూన్యస్వామి హరింతథా || 40 ||

విఘ్నాపధ్వం సనార్థాయ దక్షిణద్వార సంస్థితం | గణం సంస్థాపయామాన తథాన్యాశ్చైవ దేవతాః || 41 ||

కారితాస్తేనవీరేణప్రాసాదాఃసప్తభూమికాః | యత్కించిత్కురుతేకార్యంశుభంమాంగల్యరూపకం || 42 ||

పుత్రేజాతే జాతకేవాన్నాశ##నే ముండనే7పివా | లక్షహోమే కోటిహోమే తథా యజ్ఞ క్రియానుచ || 43 ||

వాస్తు పూజాగ్రహశాంత్యోః ప్రాప్తేచైవమహోత్సవే | యత్కించిత్కురుతే దానం ద్రవ్యంవాధాన్యముత్తమం || 44 ||

వస్త్రం వాధేవోనాథ హేమరూప్యంతథైవచ | విప్రాణా మథ శూద్రాణాం దీనానాధాంధకేషుచ || 45 ||

ప్రథమం బకులార్కస్య శ్రీమాతుశ్చైవ మానవః | భాగందద్యాచ్చ నిర్విఘ్న కార్య సిద్ధ్యే నిరంతరం || 46 ||

వచనంమే సముల్లంఘ్య కురుతేయో7న్యధానరః | తస్యతత్కర్మణో విఘ్నం భవిష్యతి నసంశయః || 47 ||

ఏవముక్త్వాతతోరామః ప్రహృష్టేనాం తరాత్మనా | దేవానమధ వాపీశ్చ ప్రాకారంస్తు సుశోభవాన్‌ || 48 ||

దుర్గోపకరణౖ ర్యుక్తాన్‌ ప్రతో లీశ్చ సువిస్తృతాః | నిర్మమే చైవకుండాని నరాంసి సరసీస్తథా || 49 ||

ధర్మవాపీశ్చ కూపాంశ్చ తథాన్యాన్‌ దేవనిర్మితాన్‌ | ఏతత్సర్వంచ విస్తార్య ధర్మారణ్య మనోరమే || 50 ||

దదౌత్రై విద్యముఖ్యే భ్యః శ్రద్ధయాపరయాపునః | తామ్ర పట్టస్థితం రామశాసనంలో వయేత్తుయః || 51 ||

పూర్వజాః తస్యనరకే వతం త్యగ్రేన సంతతిః | వాయుపుత్రం సమాహూయ తతోరామో7బ్రవీద్వచః || 52 ||

వాయుపుత్ర మహావీర తవపూజా భవిష్యతి | అన్యక్షేత్ర స్యరక్షాయైత్వమత్ర స్థితిమాచర || 53 ||

ఆంజనేయస్తుతద్వాక్యం పరణమ్య శిరసాదధౌ | జీర్ణోద్ధారం తదాకృత్వాకృతకృత్యో బభూవహా || 54 ||

శ్రీమాతరం తదా భ్యర్చ్య ప్రసన్నేనాం తరాత్మనా | శ్రీ మాతరం నమస్కృత్య తీర్థాన్యన్యానిరాఘవః || 55 ||

తే7పి దేవాః స్వకం స్థానం యయుః బ్రహ్మపురోగమాః || 56 ||

దత్వా శిషంతు రామాయ వాంఛితం తేభవిష్యతి | రమ్యం కృతంత్వయా రామ విప్రాణాంస్థావనాదికం || 57 ||

అస్మాక మపి వాత్సల్యం కృతం పుణ్యవతా త్వయా | ఇతిస్తు పంతఃతే దేవాః స్వాని స్థానాని భేజిరే || 58 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వార్థే ధర్మారణ్య మాహాత్మ్యే శ్రీరామ

చంద్రస్య పురవ్రత్యా గమన వర్ణనం నామ త్రయస్‌త్రింశో7ధ్యాయః || 33 ||

తా || రాముడు రెండు చామరములను ఒక ఖడ్గమును ఇచ్చాడు. ప్రతిష్ఠావిధి పూర్వకముగా కులస్వామిని సూర్యుని ఇచ్చాడు (39) చతుర్వేదములతో కూడిన బ్రహ్మను స్థాపించాడు. మహాశక్తిని శ్రీ మాతను, అట్లాగే శూన్యమునకు స్వామియైన హరిని స్థాపించాడు (40) విఘ్నములను నశింపచేసేకొరకు దక్షిణ ద్వారమందున్న గణపతిని స్థాపించాడు. అట్లాగే దేవతలను కూడా స్థాపించాడు (41) ఆ వీరుడు ఏడు అంతస్థులు గల మేడలను ఏర్పరచాడు. మంగల పూర్వకముగా ఏ పనిచేసినా (42) కొడుకు పుట్టినప్పుడు జాతకర్మ, అన్నప్రాశన, పుట్టువెంట్రుకలు,లక్షహోమము, కోటి హోమము, యజ్ఞ క్రియలు (43) వాస్తు పూజ, గ్రహశాంతి, మహోత్సవం వచ్చినా, ఏ కొంచం దానం చేసినా, ధనముగాని, ధాన్యముగాని ఇచ్చినా (44) వస్త్రములు, ధేనువులు, బంగారు, వెండి ఇచ్చినా, బ్రాహ్మణులకు శూద్రులకు దీనులకు అనాథులకు గుడ్డివారికి ఇచ్చినా (45) మొదట బకులార్కునకు పిదప శ్రీమాతకు ఇవ్వాలి నరులు. నిర్విఘ్న కార్య సిద్ధి కొరకు నిరంతరము భాగమివ్వాలి (46) నా మాటనతిక్రమించి మరో రకంగా చేసే నరుని ఆకర్మకు విఘ్న మేర్పడుతుంది, అనుమానములేదు (47) అని పలికి రాముడు ఆనందించిన మనస్సుతో దేవతలకు బావులను, అందమైన ప్రాకారములను (48) దుర్గుపకరణములతో కూడిన వానిని, విశాలమైన రాజవీధులను, కుండములను, సరస్సులను, కొలనులను ఏర్పరచాడు. (49) ధర్మవాపులను, బావులను, అట్లాగే ఇతరమైన దేవ నిర్మాణములను ఇదంతా అందమైన ధర్మారణ్యంలో ఏర్పరచాడు.(50) వేద విద్యగలిగిన ముఖ్యులకు మిక్కిలి శ్రద్ధతో ఇవి ఏర్పరచి ఇచ్చాడు. రాగిరేకుయందున్న రామశాసనాన్ని ఎవరు నశింపచేస్తారో (51) వారి పూర్వజులు నరకంలో పడిపోతారు. భవిష్యత్తులో వారికి సంతతి కలుగదు. వాయుపుత్రుని పిలిచి పిదప రాముడు ఇట్లన్నాడు (52) ఓ వాయుపుత్ర! మహావీర! నీకు పూజ ఏర్పడుతుంది. ఈ క్షేత్ర రక్షణ కొరకు నీవిక్కడ ఉండు (53) ఆంజనేయుడు ఆ వాక్యమును నమస్కరించి శిరసావహించాడు. ఈ విధముగా జీర్ణోద్ధారము చేసి అప్పుడు కృతకృత్యుడైనాడు (54) అప్పుడు శ్రీ మాతను పూజించి ప్రసన్నమైన మనస్సుతో, శ్రీమాతకు నమస్కరించి, రాఘవుడు ఇతర తీర్థములను నమస్కరించాడు (55) ఆ దేవతలంతా బ్రహ్మను ముందుంచుకొని తమ తమ స్థానములకు వెళ్ళారు. (56) నీవు కోరినది నెరవేరుతుంది అని రాముని ఆశీర్వదించారు. విప్రుల స్థాపన మొదలగునవి. ఓ రామ! బాగా చేశావు (57) పుణ్యవంతుడవైన నీవు మాకు దయగలిగేట్టు చేశావు. అని స్తుతిస్తూ ఆ దేవతలు తమస్థానములకు వెళ్ళారు (58) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు పూర్వార్థమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు శ్రీరామ చంద్రుడు పురమునకు తిరిగి వచ్చుట అనునది ముప్పది మూడవ అధ్యాయము || 33 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters