Sri Scanda Mahapuranamu-3    Chapters   

అష్టమ అధ్యాయము

మూ || ఋషయ ఊచుః -

భగవాన్‌ సూత సర్వజ్ఞకృష్ణ ద్వైపాయనప్రియ | త్వన్ముఖాద్వైక థాః శ్రుత్వాశ్రోత్ర కామృతవర్షిణీః || 1 ||

తృప్తి ర్నజాయతేస్మాకం త్వద్వచోమృత పాయినాం | అతః శుశ్రూషమాణానాం భూయోబ్రూహికథాః శుభాః || 2 ||

వేతాల వరదం నామ చక్రతీర్థస్యదక్షిణ | తీర్థమస్తి మహాపుణ్యం ఇత్యవాదీత్‌ భవాన్‌ పురా || 3 ||

వేతాల వరదాభిఖ్యాతీర్థస్యాస్యాగతా కథం | కిం ప్రభావంచతత్తీర్థం ఏతన్నోపక్తుమర్హసి || 4 ||

శ్రీ సూత ఉవాచ -

సాధుపృష్టం హియుష్మాభిః అతి గుహ్యం మునీశ్వరాఃశ్రుణుధ్వంమనసాసార్ధంబ్రవీమ్యత్యద్భుతాం కథాం || 5 ||

పామరా అపిమోదన్తే యాంవైశ్రుత్వాకథాంశుభాం | కథాచేయం మహాపుణ్యాపురాకైలాసపర్వతే || 6 ||

కేలికాలేషు పార్వత్యై శంభునాకథితా ద్విజాః | తాం బ్రవీమి కథామేనాం అత్యద్భుత తరాంహివః || 7 ||

పురాహిగాలవోనామ మహర్షిః సత్యవాక్‌శుచిః | చింతమానః పరం బ్రహ్మ తపస్తే పేనిజాశ్రమే || 8 ||

తస్యకన్యా మహాభాగా రూప¸°వనశాలినీ | నామ్నాక్రాంతి మతీబాలా వ్యచరత్‌ పితురంతికే || 9 ||

ఆహరం తీచపుష్పాణి బల్యర్థం తస్యవైమునేః | వేదిసంమార్జనాదీని సమిదాహరణానిచ || 10 ||

కుర్వంతీపితరం బాలా సమ్యక్‌ పరిచచారహ | కదాచిత్‌ సాతుబల్యర్థం పుష్పాణ్యాహర్తుముద్యతా || 11 ||

తస్మిన్వనే కాంతిమతీ సుదూరమగమత్తదా | తత్రపుష్పాణిరమ్యాణి సమాహృత్యచపేటకే || 12 ||

తూర్ణం నివవృతే బాలా పితృశుశ్రూషణరతా | నివర్త మానాం తాంకన్యాం విద్యాధర కుమారకౌ || 13 ||

సుదర్శన సుకర్ణా ఖ్యౌవిమానస్థౌదదర్శతుః | తాం దృష్ట్వాగాలవసుతాం రూప¸°వనశాలినీం || 14 ||

కామస్య పత్నీంలలితాం రతింమూర్తి మతీమివ | సుదర్శనాభిధోజ్యేష్ఠోవిద్యాధరకుమారకః || 15 ||

హర్షసంపుల్లనయనః చకమే కామమోహితః | పూర్ణచంద్రాననాంతాంవై వీక్షమాణోముహుర్ముహుః || 16 ||

తయారిరంసుకామోసౌవిమానాగ్రాదవాతరత్‌ | తాముపేత్యమునేః కన్యాంఇత్యువాచ సుదర్శనః || 17 ||

సుదర్శన ఉవాచ -

కాసిభ##ద్రే సుతాకస్య రూప¸°వనశాలినీ | రూపమప్రతిమంహ్యెతత్‌ ఆహ్లాదయతిమేమనః || 18 ||

త్వాం దృష్ట్వారతినంకాశాం బాధతేమాం మనోభవః | సుకంఠనామధేయస్యవిద్యా ధరపతే రహం || 19 ||

ఆత్మజోరూపసంపన్నోనామ్నాచైవసుదర్శనః | ప్రతిగృహ్ణీష్వమాం భ##ద్రే రక్షమాం కరుణా దృశా || 20 ||

భర్తారం మాంసమాసాద్య సర్వాన్భోగాన వాప్స్యసి | ఇత్యాకర్ణ్యవచస్తస్యవిద్యాధరసుతస్యసా || 21 ||

తా || ఋషులిట్లా అన్నారు - ఓ భగవాన్‌ ! సూత ! సర్వజ్ఞుడ ! కృష్ణద్వైపాయనునకు ప్రేమపాత్రుడ ! శ్రోతలకు అమృతాన్ని వర్షించే కథలను నీ ముఖంనుండి విని (1) నీ వాగమృతాన్ని తాగే మాకు తృప్తికలగటంలేదు. అందువల్ల శుశ్రూష చేసే మాకు శుభ##మైన కథలను చెప్పండి (2) చక్రతీర్థానికి దక్షిణ భాగంలో వేతాళవరదమనే తీర్థముంది. అది మహాపుణ్య ప్రదమని మీరు ఇది వరలో చెప్పారు (3) ఈ తీర్థానికి వేతాళవరదమనే పేరు ఎట్లా వచ్చింది ఆ తీర్థ ప్రభావమేమిటి. ఈ విషయాన్ని మాకు చెప్పండి (4) శ్రీ సూతులిట్లనిరి - మిక్కిలి రహస్యమైన దానిని మీరు బాగా అడిగారు. నిశ్చలంగా వినండి. ఆ అద్భుత కథను చెప్తాను (5) ఆ కథను విని పామరులైనా ఆనందిస్తారు ఈ కథ పుణ్య ప్రదమైంది. పూర్వంకైలాస పర్వతమందు (6) విశ్రాంతి సమయంలో పార్వతికి శివుడు చెప్పాడు ఆ అద్భుతమైన ఆ కథను మీకు చెప్తాను (7) పూర్వము గాలవుడను మహర్షి సత్యవాక్కు కలవాడు, శుచియైనవాడు పరబ్రహ్మను చింతిస్తూ తన ఆశ్రమంలో తపమాచరించాడు (8) ఆతని కూతురు ఉత్తమురాలు, రూప¸°వనములు కలది, కాంతిమతి అని పేరు కలది బాలతండ్రి దగ్గర ఉంటూండేది (9) ఆ మహర్షికి బలి కొరకు పూలు తెస్తూ ఉండేది. వేదిక సమ్మార్జనము సమిధలను తేవటం చేస్తుండేది (10) ఇట్లా ఆ బాలతండ్రికి మంచిగా పరిచర్య చేసేది ఒకసారి ఆమె బలికొరకు పుష్పాలు తెచ్చుటకు బయలుదేరి 911) ఆవనంలో కాంతిమతి చాలా దూరము ప్రయాణించింది. అక్కడ అందమైన పూలను బుట్టలో తీసుకొని (12) తండ్రిని శుశ్రూష చేయాలనే ఆసక్తితో ఆ బాల తొందరగాతిరిగి బయలుదేరింది. మరలుతున్న ఆ కన్యను విద్యాధరకుమారులు (13) సుదర్శన సుకర్ణులను పేరుగలవారు విమానంలో నుండి ఈమెను చూచారు. రూప ¸°వనములు గల ఆ గాలవుని కూతురును చూచి (14) మన్మధుని పత్ని ఐన రతీదేవి వలె సుకుమారమైన మూర్తి కలదానిని, సుదర్శన అనుపేరుగల విద్యాధరకుమారకుడు పెద్దవాడు (15) సంతోషంతో విప్పారి న కళ్ళుగలవాడై కామమోహితుడై కామించాడు. పూర్ణచంద్రుని వంటి ముఖంగల ఆమెను మాటిమాటికి చూస్తూ (16) ఆమెను అనుభవించాలనే కోరిక కలవాడై విమానం నుండి దిగాడు. మునికన్యను సమీపించి సుదర్శనుడిట్లా అన్నాడు. (17) సుదర్శనుని మాట - రూప¸°వనములుగల నీవెవరు. ఎవరికూతురువు. నీ సాటిలేని రూపం నామనస్సును ఆహ్లాద పరుస్తోంది. (18) రతీదేవి సదృశ##మైన నిన్ను చూచాక నన్ను మన్మథుడు బాధిస్తున్నాడు. సుకంఠుడు అనుపేరుగల విద్యాధరవతికి నేను (19) కుమారుణ్ణి అందగాణ్ణి సుదర్శనుడని నాపేరు నన్ను స్వీకరించు. నీదయగలచూపులతో నన్ను రక్షించు (20) నన్ను భర్తగా పొంది సర్వ భోగములను పొందగలవు అనే విద్యాధరసుతుని మాటలను విని ఆమె (21)

మూ || తదాకాంతి మతీవాక్యం ధర్మయుక్త మభాషత | సుదర్శన మహాభాగవిద్యాధరపతేః సుత || 22 ||

ఆత్మజాం మాం విజానీహి గాలవస్య మహాత్మనః | కన్యాచాహం అనూఢాస్మి పితృశుశ్రూషణరతా || 23 ||

బల్యర్థం హి పితుశ్చాహం పుష్పాణ్యా హర్తుమాగతా | ఆహరంత్యాశ్చ పుష్పాణి యామ ఏకోన్య వర్తత || 24 ||

మద్విలంబేన సమునిః దేవతార్చనతత్సరః | కోపంవిధాస్యతేనూనం తపస్వీమునిపుంగవః || 25 ||

తచ్ఛీఘ్రమద్యగచ్ఛామి పుష్పాణ్యప్యాహృతానిమే | కన్యాశ్చపితురాధీనానస్వతంత్రాః కదాచన || 26 ||

యదిమామిచ్ఛతిభవాన్‌ పితరం మమయాచయ | ఇతివిద్యాధరసుతం ఉక్త్వాకాంతి మతీతదా || 27 ||

పితురాశంకితా తూర్ణం ఆశ్రమం గంతు ముద్యతా | గచ్ఛంతీంతాం సమాలోక్యవిద్యాధరకుమారకః || 28 ||

తూర్ణంజగ్రాహకే శేషుధావిత్వామదనార్దితః | అభ్యేత్యనిజకేశేషు గృహ్ణంతంతంవిలోక్యసా || 29 ||

ఉచ్చైశ్చక్రంద సహసాకురరీవమునేః సుతా | అస్మాత్‌ విద్యాధర సుతాత్‌ జనక త్రాహిమాం విభో || 30 ||

బలాత్‌ గృహ్ణాతి దుష్టాత్మా విద్యాధరసుతోzద్యమాం | ఇత్థముచ్చైః ప్రచుక్రోశస్వాశ్రమాన్నాతి దూరతః || 31 ||

తదాక్రం దిత మాకర్ణ్య గంధమాదనవాసినః | మునయస్తు పురస్కృత్యగాలవం మునిపుంగవం || 32 ||

కిమేతదితి విజ్ఞాతుం తందేశం తూర్ణమాయయుః | తందేశంతే సమాగత్యసర్వేతే ఋషిపుంగవాః || 33 ||

విద్యాధర గృహీతాంతాం దదృశుఃముని కన్యకాం | విద్యాధర సుతం చాన్యం అంతికే సముపస్ధితం || 34 ||

ఏతద్‌ దృష్ట్వా మహాయోగీ గాలవోముని పుంగవః | గతః కోపవశం కించిత్‌ దురాత్మానం శశాపతం || 35 ||

కృతవానీ దృశం కార్యం యత్త్వం విద్యాధరాధమ | తద్యాహిమానుషీంయోనిం స్వస్యదుష్కర్మణః ఫలం || 36 ||

సంప్రాప్యమానుషం జన్మబహుదుఃఖ సమాకులం | అచిరేణతుకాలేన తస్మిన్నేవతుజన్మని || 37 ||

మనుషై#్యరపి నింద్యంతత్‌ వేతాలత్వం ప్రయాస్యసి | మాంసాని శోణితంచైవ సర్వదా భక్షయిష్యసి || 38 ||

వేతాలా రాక్షస ప్రాయాబలాత్‌ గృహ్ణంతియోషితః | తస్మాత్త్వం మానుషోభూత్వా వేతాలత్వమవాప్ప్యసి || 39 ||

తవదుష్కర్మణో యోzసౌ అనుమంతా కనిష్ఠకః | సుకర్ణితి విఖ్యాతో భవితా సోపిమానుషః || 40 ||

కింతుసాక్షాన్నకృతవాన్‌ యతోzసావీదృశీంక్రియాం | తన్మానుషత్వమేవాస్యవేతాలత్వంతునోభ##వేత్‌ || 41 ||

తా || అప్పుడు కాంతిమతి ధర్మయుక్తంగా మాట్లాడింది. ఓసుదర్శనా ! విద్యాధరుని కుమారుడ! (22) నేను గాలవమహాత్ముని కుమార్తెనుగా గ్రహించు. కన్యను వివాహంకానిదాన్ని తండ్రి గారి సేవయం దున్నదాన్ని (23) మాతండ్రి గారికి బలికొరకు పూలు తేవటానికి వచ్చాను. పుష్పాలు తెంపుతూ ఉంటే ఒక జాము గడిచి పోయింది (24) నా ఆలస్యంవల్ల దేవతార్చన తత్పరుడైన ఆముని, తపస్వి, కోపగిస్తాడు (25) నేను పూలు కోయటం ఐంది ఇప్పుడు తొందరగా వెళ్తాను. కన్యలు తండ్రి అధీనలు ఎప్పుడూ స్వతంత్రులు కారు (26) నీవునన్ను ఇష్టపడేట్టైతే నా తండ్రిగారిని అడుగు అని కాంతిమతి విద్యాధరసుతునకు చెప్పి (27) తండ్రి గారిని గూర్చి ఆశంకిస్తూ తొందరగా ఆశ్రమానికి వెళ్ళటానికి బయల్దేరింది. విద్యాధరకుమారుడు వెళ్తున్న ఆమెను చూచి (28) మదన బాధితుడై పరుగెత్తి ఆమె వెంట్రుకలను పట్టుకున్నాడు. పరుగెత్తుకొచ్చి తన వెంట్రుకలను పట్టుకుంటున్న ఆతణ్ణి చూచి ఆమె (29) లేడి పిల్లలా పెద్దగా అరిచింది. ఓ నాన్న! సమర్థుడ! ఈ విద్యాధరుని నుండి నన్ను రక్షించు (30) బలవంతంగా నన్ను ఈదుష్టాత్ముడు విద్యాధరసుతుడు ఈ వేళ పట్టుకున్నాడు ఈ విధంగా పెద్దగా తన ఆశ్రమానికి దగ్గరలోనే అరిచింది. (31) ఆమె ఆక్రందనను విని గంధమాదనంలో ఉండే మునులుముని శ్రేష్ఠుడైన గాలవుని ముందుంచుకొని (32) ఇది ఏమిటో తెలుసుకుందామని ఆ ప్రదేశానికి తొందరగా వచ్చారు. ఆ ప్రదేశానికి ఆ ఋషిపుంగవులందరు వచ్చి (33) విద్యాధరునితో గ్రహించబడ్డ ఆముని కన్యను చూచారు. దగ్గరలో ఉన్నామరో విద్యాధర కుమారుని చూచారు (34) దీన్ని చూచి గొప్ప యోగియైన గాలవముని కొద్దిగా కోపానికి వచ్చి ఆ దురాత్ముణ్ణి శపించాడు (35) ఓ విద్యాధరాధమ ! నీవిటువంటి పని చేశావు కనుక నీ దుష్కర్మకు ఫలముగా మానుషయోనికి వెళ్ళు (36) మానుష జన్మను ఎక్కువ దుఃఖములకు కారణమైనదానిని పొంది అదే జన్మలో త్వరలోనే (37) మనుష్యులు కూడా నిందించే వేతాళత్వమును పొందు. మాంసము, రక్తము ఎప్పుడు తింటూ ఉండు (38) వేతాలు రసగా రాక్షసులతో సమానమైనవారు. స్త్రీలను బలత్కారముగా స్వీకరిస్తారు. అందువల్ల నీవు మనుష్యుడవై వేతాలత్వాన్ని పొందుతావు (39) నీ దుష్కర్మను అనుమతించిన నీతమ్ముడు సుకర్ణుడనే వీడు కూడా మనుష్యుడౌతాడు (40) ఈతడు సాక్షాత్తుగా ఈపని చేయలేదు కాబట్టి ఈతనికి మానుషత్వమే, వేతాలత్వమురాదు (41).

మూ || విజ్ఞప్తి కౌతుకాభిఖ్యం యదావిద్యాధరాధిపం | ద్రక్ష్యతేzసౌకనిష్ఠస్తే తదా శాపాద్విమోక్ష్యతే || 42 ||

ఈదృశస్యతుయః కర్తా మహాపాపస్యకర్మణః | సత్వం సంప్రాప్యమానుష్యం తస్మిస్నేవతుజన్మని || 43 ||

వేతాల జన్మసంప్రాప్యచిరంలోకే చరిష్యసి | ఇత్యుక్త్వా గాలవః కన్యాం గృహీత్వామునిభిః సహ || 44 ||

విద్యా ధరసుతౌ శప్త్వా స్వాశ్రమం ప్రతినిర్య¸° | తతస్తస్మిన్మహాభాగే నిర్యాతేముని పుంగవే || 45 ||

సుదర్శనసుకర్ణాఖ్యౌవిద్యధరపతేః సుతౌ | మునిశాపేన దుఃఖార్తౌచింతయా మా సతుర్భృశం || 46 ||

కర్తవ్యంతౌ వినిశ్చిత్య సుదర్శన సుకర్ణకౌ | గోవింద స్వామినామానం యమునా తటవాసినం || 47 ||

బ్రాహ్మణం శీలసంపన్నం పితృత్వే పరికల్ప్యతౌ | పరిత్యజ్యస్వకంరూపం అజాయేతాం తదాత్మజౌ || 48 ||

విజయాశోకదత్తా ఖ్యౌతస్యపుత్రౌ బభూవతుః | సుతోవిజయదత్తా ఖ్యోజ్యేష్ఠో జజ్ఞే సుదర్శనః || 49 ||

అశోకదత్తనామాతుసుకర్ణశ్చకనిష్ఠకః | విజయాశోకదత్తౌతుక్రమాద్యౌవనమావతుః || 50 ||

ఏతస్మిన్నేవకాలేతుయమునా యాఃతటేశుభే | అనావృష్ట్యాతు దుర్భిక్షం అభూత్‌ద్వాదశవార్షికం || 51 ||

గోవింద స్వామి నామాతు బ్రాహ్మణోవేదపారగః | దుర్భిక్షోవహతాం దృష్ట్వాతదానీం సనిజాంపురీం || 52 ||

ప్రయ¸°కాశీనగరం నపుత్రః సహభార్యయా | సప్రయాగం సమాసాద్యపుణ్యం దృష్ట్వా మహావటం || 53 ||

కపాల మాలా భరణం సోzపశ్యద్యతినం పురః | గోవిందస్వామి నామాతునమశ్చక్రేసతంమునిం || 54 ||

నపుత్రస్యసభార్యస్య సోzవాదీ దాశిషోమునిః | ఇదంచ వచనం ప్రాహ గోవింద స్వామినం ప్రతి || 55 ||

జ్యేష్ఠేనానేన పుత్రేణ సాంప్రతం బ్రాహ్మణోత్తమ | క్షిప్రం విజయదత్తేన వియోగస్తే భవిష్యతి || 56 ||

ఇతితస్యవచః శ్రుత్వాగోవిందస్వామినామకః | సూర్యేచాస్తంగతే తత్రసాంధ్యంకర్మ సమాప్యచ || 57 ||

సభార్యః ససుతోవిప్రః సుదూరాధ్వసమాకులః | ఉవాస తస్యాం శర్వర్యాం శూన్యేవైదేవతాలయే || 58 ||

తదాత్వశోకదత్తశ్చ బ్రాహ్మణీచనమాకులౌ | వస్త్రేణా స్తీర్యపృధివీం రాత్రౌనిద్రాం సమాపతుః || 59 ||

తా || విజ్ఞప్తి కౌతుకుడనే పేరుగల విద్యాధరాధిపుని ఈకనిష్ఠుడు చూచిన వెంటనే శాపవిముక్తుడౌతాడు. (42) ఇటువంటి మహాపాపకర్మకు కర్తవైననీవు మనుష్యజన్మనుపొంది అదే, జన్మలో (43) వేతాల జన్మను పొంది లోకంలో చిరకాలం తిరుగుతావు. అనిగాలవుడు పలికి కన్యను తీసుకొని మహర్షులతోకూడి (44) విద్యా ధరసుతులను శపించి తన ఆశ్రమమునకు వెళ్ళాడు. ఆమునిపుంగవుడు వెళ్ళాక (45) విద్యా ధరపతిసుతులైన సుదర్శనసుకర్ణులను వారు మునిశాపంతో దుఃఖార్తులై చాలావిచారించారు. (46) సుదర్శన సుకర్ణకులు ఏంచేయాలో నిశ్చయించుకుని యమునా తీరంలో ఉండే గోవిందస్వామి అనే అతనిని (47) బ్రాహ్మణుని, శీలవంతుని, తండ్రిగా వారు భావించుకొని తమ రూప ములను వదలి అతని కుమారులుగా జన్మించారు (48) విజయుడని అశోకదత్తుడుగా జన్మించాడు (49) చిన్నవాడు సుకర్ణుడు అశోక దత్తునిగా జన్మించాడు. విజయ అశోక దత్తులు క్రమంగా ¸°వన వంతులైనారు. (50) ఈకాలంలోనే శుభ##మైనయమునా తటమందు, వర్షాలులేని కారణంగా పన్నెండు సంవత్సరాలు దుర్భిక్షమేర్పడింది (51) గోవిందస్వామి అనుపేరుగల బ్రాహ్మణుడు వేదపారగుడు, తన నగరందుర్భిక్షంతో బాధపడటంచూసి (52) భార్యా పుత్రులతో కలిసి కాశీనగరానికి బయలు దేరాడు. అతడుప్రయాగకుచేరి, మహావటమును పుణ్యప్రదమైనదానిని చూచి (53) దాని ఎదుట కపాల మాల ఆభరణంగా గల యతినిచూచాడు. గోవిందస్వామిఐతే ఆమునినినమస్కరించాడు (54) పుత్రులు భార్యతో కూడిన అతనికి ముని ఆశీర్వాదము పలికాడు. గోవిందస్వామితో ఆముని ఇట్లా అన్నాడు (55) ఓ బ్రాహ్మణోత్తమ! ఈ పెద్దకొడుకు విజయదత్తునితో నీకు త్వరలో వియోగం కలుగబోతోంది (56) అనేఆతని మాటలను విని గోవిందస్వామి, సూర్యుడు అస్తమించాక, అక్కడే సంధ్యకర్మను సమాప్తిచేసి (57) భార్యతో పుత్రునితో చాలాదూరం ప్రయాణంచేయటంవల్ల అలసిపోయి, ఆరాత్రి శూన్యమైనదేవాలయంలో వసించాడు. (58) అశోకదత్తుడు బ్రాహ్మణికలసి భూమిపై వస్త్రం పరిచి రాత్రినిద్రించారు (59)

మూ||తతోవిజయదత్తస్తు దూరమార్గవిలంఘనాత్‌ | బభూవాత్యంతమలసోభృశంశీతజ్వరార్దితం || 60 ||

గోవిందస్వామినా పిత్రాశీతబాధాని వృత్తయే | గాఢమాలింగ్యమానో7పిశీతబాధాంనసో7త్యజత్‌ || 61 ||

బాధతే7త్యర్థమధునాతాత మాంశీతలో జ్వరః | ఏతద్బాధానివృత్త్యర్థం వహ్నిమానయమాచిరం | || 62 ||

ఇతిపుత్రవచఃశ్రుత్వాసర్వత్రాగ్నింగవేషయన్‌| అలబ్ధవహ్నిఃప్రోవాచపునరభ్యత్యపుత్రకం || 63 ||

నవహ్నింపుత్రవిందామిమార్గమాణో7పిసర్వశః | రాత్రిమధ్యేతుసంప్రాప్తే ద్వారేషుపిహితేషుచ || 64 ||

నిద్రాపరవశాఃపౌరాఃనైవదాస్యంతిపావకం| ఇత్ధంవిజయదత్తో7సావుక్తఃపిత్రాజ్వరాతురః || 65 ||

యయాచేవహ్నిమేవాసౌపితరందీనయాగిరా| శీతజ్వరసముద్భూతశీతబాధాప్రపీడితం || 66 ||

హిమశీకరవాన్‌ వాయుః ద్విగుణంబాధతే7ద్యమాం | వహ్నిర్నలబ్ధితివై మిధ్యైవోక్తం పితస్త్వయా || 67 ||

దూరాదేషపురోభాగేజ్వాలామాలాసమాకులః | శిఖాభిః లేలిహానోభ్రం దృశ్యతేపశ్యపావకః || 68 ||

తంవహ్నిమానయక్షిప్రం తాతశీతనివృత్తయే | ఇత్యుక్తవంతం తంపుత్రం సపితా ప్రత్యభాషత || 69 ||

నానృతం వచ్మిపుత్రాద్యసత్యమేవ బ్రవీమ్యహం | వహ్నిమాన్‌ యో7యముద్దేశోదూరాదేవవిలోక్యతే || 70 ||

పితృకాననదేశంతం పుత్రజానీ హిసాంప్రతం | యద్యేషోభ్రంలిహాజ్వాలః పురస్తాత్‌ జ్వలతే7 నలః || 71 ||

పుత్రవిత్రాసజనకం తంజానీహి చితానలం | అమంగలోనసేవ్యో7యంచి తాగ్నిః స్పర్శదూషితః || 72 ||

తస్యచాయుః క్షయం యాతిసేవతేయఃచి తానలం | తస్మాత్తవాయుర్హానిర్మాభూయాదితిమయాసుత || 73 ||

అమంగలస్తథా స్పృశ్యోనానీతో7యంచి తానలః - ఇత్యుక్తవంతం పితరం సదీనః ప్రత్య భాషత || 74 ||

అయంశవానలో వాస్యాత్‌ అధ్వరాసల ఏవవా | సర్వథానీయతా మేషనోచేన్మే మరణం భ##వేత్‌ || 75 ||

పుత్రస్నేహా భిభూతోzథ సమాహర్తుంచి తానలం | గోవింద స్వామి నామాతుశ్వశానం శీఘ్రమభ్యగాత్‌ || 76 ||

తా || విజయదత్తుడు చాలా దూరం ప్రయాణం చేసినందువల్ల బాగా అలసిపోయాడు. శీత జ్వరంతో బాధపడుతూ (60) చలిబాధనివృత్తి కొరకు గోవింద స్వామితో తండ్రితో, గట్టిగా కౌగిలించుకోబడుతున్నా ఆతనికి చలిబాధపోలేదు (61) నాన్న | నన్ను చలిజ్వరము ఇప్పడు మిక్కిలి బాధిస్తోంది. ఈ బాధని వృత్తి కొరకు త్వరగా అగ్నిని తీసుకురండి (62) అనే కొడుకు మాటలను విని అంతటా అగ్నిని వెతుకుతు అగ్ని లభించక తిరిగి వచ్చి పుత్రునితో ఇట్లా అన్నాడు (63) అంతటా వెతికినా కూడా కుమార ! అగ్ని లభించటంలేదు. అర్ధరాత్రి సమీపించినందువల్ల ద్వారాలన్నీ మూసివేసారు (64) పౌరులంతా నిద్రా పరవశులైనారు అగ్నిని ఇవ్వటంలేదు అని ఈ రకంగా జ్వరంతో బాధపడే విజయదత్తునితో తండ్రి చెప్పాడు (65) ఆతడు మరల తండ్రిని దీనమైన వాక్కులతో అగ్ని కావాలని అడిగాడు. శీత జ్వరం వల్ల కల్గిన చలిబాధతో పీడింపబడిన నన్ను (66) మంచు తుంపరలవంటి చల్లనిగాలి నన్ను ఈ వేళ రెట్టింపుగా బాధిస్తోంది. అగ్ని లభించటం లేదని నీవు అబద్ధం చెప్పావు నాన్న! (67) దూరంగా ఇదుగో ముందు భాగంలో జ్వాలా మాలలతో కూడినటువంటిది, తన జ్వాలలతో ఆకాశాన్నితాకుతున్నట్టున్నది అగ్నికన్పిస్తోంది చూడు (68) నాన్న! నాచలిపోయేందుకు తొందరగా ఆ అగ్నిని తీసుకురా. ఇట్లా అంటున్న ఆకొడుకుతో తండ్రి ఇట్లా అన్నాడు (69) కుమారా! ఈవేళ##నేను అబద్ధం చెప్పటంలేదు. నిజమే చెప్తున్నాను దూరంగా కన్పించే అగ్ని ఉన్న ప్రాంతముందేఅది (70) పితరుల అడవి ప్రదేశంఅదే అని తెలుసుకో. ఆకాశాన్నంటే జ్వాలలుగలది ఎదురుగా మండుతున్న అగ్ని (71) భయాన్ని కల్గించేది అదిచితాగ్నిగా తెలుసుకో. ఇది అమంగళ##మైనది. దీనిని తాకరాదు. సేవించరాదు. ఇది చితాగ్ని (72) చితాగ్నిని ముట్టుకున్న వాని ఆయువు క్షీణిస్తుంది కుమార! నీ ఆయువు క్షీణించకూడదనే, కుమార (73) అమంగళకరము, తాకరానిది ఈచితాగ్ని అందుకేతీసుకురాలేదు. అని అన్నతండ్రితో ఆకుమారుడే దీనుడై ఇట్లన్నాడు (74) ఇదిశవాసలంకాని యజ్ఞాగ్నికాని, ఎట్లాగైనా దీన్నితీసుకురాలేని పక్షంలో నాకు మరణం సంభవిస్తుంది (75) పుత్రస్నేహం అతిగా గలవాడై చితాగ్నిని తేవటానికి గోవిందస్వామి శ్మశానానికి తొందరగా వెళ్ళాడు. (76)

మూ||గోవిందస్వామినిగతేసమాహర్తుంచితానలం|తూర్ణంవిజయదత్తో7పితదాగచ్ఛంతమన్వయాత్‌ || 77 ||

సంప్రాప్యతాపనికటంవికీర్ణాస్థిచితానలం |ఆలింగన్నివసోద్వేగం శ##నైఃనిర్వ్పతి మాప్తవాన్‌ || 78 ||

అధావీదీ త్సపితరం తదిదంపరివర్తులం | అతిదీప్తంవిభాత్యగ్నౌ కింరక్తాంబుజసన్నిభం || 79 ||

ఇతితస్యవచఃశ్రుత్వాపుత్రస్యబ్రాహ్మణోత్తమః | నిపుణంతంనిరూపై#్యతత్‌వచనంపునరబ్రవీత్‌ || 80 ||

గోవిందస్వామ్యువాచ :-

ఏతత్కపాలమనలజ్వాలావలయవర్తులం | వసాకీకస మాంసాఢ్యమేతద్రక్తాంబుజోపమం || 81 ||

ద్విజస్యసూనుఃశ్రుత్వేతికాష్ఠాగ్రేణజఘానతత్‌ | యేన తత్‌స్ఫుటనోద్గీర్ణ వసాసిక్తముఖో7భవత్‌ || 82 ||

కపాలఘట్టనాద్రక్తంయత్సంసక్తంముఖేతదా| జి హ్వయాలేలిహానో7సాముహుస్తద్రక్తమాస్వదత్‌ || 83 ||

ఆస్వాద్యైవంసమాదాయ తత్కపాలంసమాకులః | పీత్వావసాంమహాకాయో బభూవాతి భయంకరః || 84 ||

సద్యోవేతాలతాంప్రాపతీక్షణదంస్త్రస్తదానిశి | తస్యాట్టహానఘోషేణదిశశ్చప్రదిశస్తదా || 85 ||

ద్యౌరంతరిక్షంభూమిశ్చస్ఫుటితా ఇవసర్వశః | తస్మిన్‌వేగాత్‌ సమాకృష్యపితరంహంతుముద్యతే || 86 ||

మాకృధాః సాహసమితి ప్రాదురాసీద్వచోదివి | సదివ్యాంగిరమాకర్ణ్య వేతాలో7తిభయంకరః || 87 ||

పితరంతంపరిత్యజ్యమహావేగసమన్వితః | తూర్ణమాకాశమావిశ్యప్రయయావస్ఖలత్‌గతిః || 88 ||

సగత్వాదూరమధ్వానం వేతాలైః సహసంగతః | సమాగతంసమాలోక్య వేతాలాస్సర్వేవతే || 89 ||

కపాలస్ఫోటనాదేష వేతాలత్వంయదాప్తవాన్‌ | కపాలస్ఫోటోనామానం ఆహ్వయాంచక్రిరేతతః || 90 ||

తతఃకపాలస్ఫోటో7సౌవేతాలైఃసర్వతోవృతః|నరాస్థిభూషణాఖ్యస్యసద్యోవేతాలభూపతేః || 91 ||

అన్తికంసహసాప్రాపమహాబలసమన్వితః | నరాస్థిభూషణశ్చైనం సేనాపతిమకల్పయత్‌ || 92 ||

తంకదాచిత్తుగంధర్వః చిత్రసేనాభిధోబలీ | నరాస్థిభూషణం సంఖ్యేన్యవధీత్‌ సో7పిసంస్థితః || 93 ||

నరాస్థిభూషణతస్మిన్‌ గంధర్వేణహతేయుధి | తదాకపాలస్ఫోటో7సౌ తత్పదం సమవాప్తవాన్‌ || 94 ||

విద్యాధరేంద్రస్యసుతః సుదర్శనో | మనుష్యతాంవైప్రధమంసగత్వా

వేతాలతాం ప్రాప్యమహర్షిశాపాత్‌ | క్రమాచ్చవేతాలపతిర్బభూవ ||

ఇతిశ్రీస్కాందేమహాపురాణఏకాశీతిసాహస్య్రాంసంహితాయాంతృతీ యే బ్రహ్మఖండే సేతుమమాత్మ్యే వేతాల వరద తీర్థ ప్రశంసాయాం సుదర్శన వేతాలత్వప్రాప్తివర్ణనం నామఅష్టమో7ధ్యాయః

తా || చితాగ్నిని గోవింద స్వామి తీసుకురావటానికి వెళ్ళగా, వేగంగా విజయదత్తుడుకూడ అట్లావెళ్తున్న ఆతనిని అనుసరించాడు (77) వేడిమిని సమీపించి బొక్కలతో నిండిన చితాగ్నిని కౌగిలించుకుంటున్నట్లు ఉద్వేగంతో కూడి మెల్లగా ఊరటను పొందాడు (78) ఆతడు తండ్రితో ఇట్లా అన్నాడు - ఆచుట్టూ గుండ్రంగా ఉన్నది బాగా వెలుగుతున్నది అగ్నిలో ప్రకాశిస్తున్నది ఎర్రతామరవలె ఉన్నట్టిది అది ఏమిటి, అని (79) ఆ పుత్రుని మాటలను బ్రాహ్మణోత్తముడువిని, అదిఏమిటో, నిశ్చయించుకొని మళ్ళా ఇట్లన్నాడు (80) గోవిందస్వామివచనం - అగ్నిజ్వాలల వలయంతో గుండ్రంగాఉన్నది ఇదిక పాలము, వస (బొడ్డుక్రింది) కొవ్వు కీకస (ఎముక) మాంసములతోకూడినది, ఎర్రతామరలా ఉన్నది కపాలమని (81) బ్రాహ్మణ కుమారుడువిని కట్టెచివరతో దాన్ని కొట్టాడు. అది పగిలిపైకివచ్చిన వసతో ఆతనిముఖంతడిసిపోయింది(82)కపాలాన్ని కొట్టటంవల్ల తనమఖం పైపడ్డరక్తాన్ని నాలుకతో చప్పరిస్తూ ఈతడు మాటిమాటికి ఆరక్తాన్ని ఆస్వాదించాడు(83) ఈరకంగా ఆస్వాదించి ఆకపాలాన్ని తీసుకొని వ్యాకులుడై వసనుతాగిమహా కాయుడు, అతిభయంకరుడుఐనాడు (84) వెంటనే వేతాళుడైనాడు. ఆరాత్రితీక్షణమైనకోరలుగలవాడైనాడు. ఆతనిఅట్టహాసశబ్దంతో దిక్కులు, అన్నిప్రదేశములు (85) స్వర్గము అంతరిక్ష ము, భూమిఅన్నివిధములపగిలిపోయినట్లుఐంది. ఆతడువేగంగా లాగి తండ్రిని చంపబోయేంతలో (86) ఇటువంటి సాహసంచెయ్యొద్దని ఆకాశంలో ఒకవాక్కు వినిపించింది. ఆతడు దివ్యవాక్కును విని అతిభయంకరుడై వేతాలుడు (87) తండ్రిని వదలి వేగంతో కూడి తొందరగా ఆకాశం ప్రవేశించి తొట్రుపాటు లేని నడక గలిగి (88) అతడు చాలా దూరంవెళ్ళి వేతాలురతో కూడాడు. వచ్చిన ఆతణ్ణి చూచి వేతాలురందరు, (89) కపాలస్ఫోటన చేసి ఈతడు వేతాల రూపాన్ని పొందాడు కనుక ఈతనిని కపాల స్ఫోటుడనే పేరుతో పిలువ సాగారు (90) ఈకపాలస్ఫోటుడు వేతాలురతో చుట్టబడి వేతాలరాజైన, నరాస్థిభూషణుడనే వాని (91) సమీపమునకు బలము కలవాడై తొందరగా వెళ్ళాడు. నరాస్థిభూషణుడీతనిని సేనాపతిని చేశాడు. (92)బలవంతుడైన చిత్రసేనుడనే పేరుగల గంధర్మడు ఒకసారి యుద్ధం చేసి, యుద్ధంలో నరాస్థిభూషణుడనే వాణ్ణి చంపాడు.(93)నరాస్థిభూషణుడు గంధర్వునితో యుద్ధంలో చంపబడ్డాక అప్పుడు ఈ కపాలస్ఫోటుడు ఆ పదవిని పొందాడు (94) విద్యాధరుని కొడుకుసుదర్శనుడు మొదటమనుష్యుడై మహర్షి శాపంవల్ల ఆపిదప వేతాలత్వాన్ని పొంది క్రమంగా వేతాలపతి ఐనాడు (95) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది యొక్కవేల సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు సేతుమాహాత్మ్యమందు వేతాల వరద తీర్థ ప్రశంసయందు సుదర్శనుడు వేతాలుడగుట అనుదాని వర్ణన అనునది ఎనిమిదవ అధ్యాయము.

Sri Scanda Mahapuranamu-3    Chapters