Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది ఆరవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

మార్కండేయోద్ధాటితంవై స్వర్గ ద్వారమపావృతం | తత్రయే దేహసంత్యాగం కుర్వంతి ఫలంకాంక్షయా || 1 ||

లభంతే తత్పలంహ్యంతే విష్ణోః సాయుజ్యమాప్నుయుః | అతః కింబహునోక్తేసద్వారపత్యాం సదానరైః || 2 ||

దేహత్యాగః ప్రకర్తవ్యో విష్ణోః లోకజిగీషయా | అనాశ##కే జలేవాగ్నౌ యేచసంతి నరోత్తమాః

సర్వపాపవినిర్ముక్తాయాంతివిష్ణోః పురీం సదా || 3 ||

అన్యోపి వ్యాధి రహితో గచ్ఛేదన శనంతు యః | సర్వపాపవినిర్ముక్తో యాతివిష్ణోః పురీం నరః || 4 ||

శతవర్ష సహస్రాణాం వసేరంతే దివిద్విజః | బ్రాహ్మణభ్యః పరంనాస్తి పవిత్రం పావనం భువి || 5 ||

ఉపవాసైస్తథాతుల్యం తపః కర్మన విద్యతే | నాస్తివేదాత్పరం శాస్త్రం నాస్తి మాతృసమోగురుః || 6 ||

న ధర్మాత్పర మస్తీహత పోనానశనాత్పరం | స్నాత్వాయః కురుతే7త్రాపి శ్రాద్ధం పిండోదక క్రియాం || 7 ||

తృప్యంతి పితరస్తస్య యావద్ర్బహ్మదివానిశం | తత్రతీర్థేనరః స్నాత్వా కేశవం యస్తుపూజయేత్‌ || 8 ||

సముక్త పాతకైః సర్వైః విష్ణులోక మవాప్నుయాత్‌ | తీర్థానాముత్తమం తీర్థం యత్రసన్నిహితోహరిః || 9 ||

హరతే సకల పాపం తస్మింస్తీర్థే స్థితస్యసః | ముక్తిదం మోక్షకామానాం ధనదంచ ధనార్థినాం

ఆ యుర్దం సుఖదంచైవ సర్వకామ ఫలప్రదం || 10 ||

కీమన్యే నాత్ర తీర్థేన యత్రదేవో జనార్దనః | స్వయం వసతినిత్యం హి సర్వేషామనుకంపయా || 11 ||

తత్రయద్దేయతే కించిత్‌ దానం శ్రద్ధా సమన్వితం | అక్షయంతద్భవేత్సర్వ మిహలోకే పరత్రచ || 12 ||

యజ్ఞైః దానైః తపోభిశ్చ యత్ఫలం ప్రాప్యతేబుధైః | తదత్రస్నాన మాత్రేణ శూద్రైరపి సువేవకైః || 13 ||

తత్రశ్రాద్ధచయః కుర్యాత్‌ ఏకాదశ్యాముపోషితః | సపితౄనుద్ధరేత్సర్వాన్‌ నరకేభ్యోన సంశయః || 14 ||

అక్షయ్యాంతృప్తి మాప్నోతి పరమాత్మాజనార్దనః | దీయతే7త్ర యదుద్దిశ్య తదక్షయ్యముదాహృతం || 15 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే ద్వారికా మాహాత్మ్య వర్ణనం నామ షడ్వింశో7ధ్యాయః || 26 ||

తా || వ్యాసుని వచనము - మార్కండేయుడు ఆరంభించినది, స్వర్గద్వారము తొలగించినట్టిది. ఫలకాంక్షతో అక్కడ దేహత్యాగం చేసినవారు (1) చివర ఆ ఫలితాన్ని పొందుతారు. విష్ణుసాయుజ్యాన్ని పొందుతారు. ఇంతకన్నా ఎక్కువగా చెప్పి ఏం లాభం. ద్వారపతి యందు నరులు (2) విష్ణులోకం పొందే కొరకు దేహత్యాంగ చేయాలి. కనిపించే జలమందు, అగ్నియందు ఉన్న నరులు సర్వపాప వినిర్ముక్తులై ఎప్పుడూ విష్ణుపురికి వెళ్తారు. (3) వ్యాధిలేనివాడు భుజించకుండావెళ్తే ఆతడు సర్వపాప వినిర్ముక్తుడై విష్ణుపురికి వెళ్తాడు (4) శత వర్ష సహస్రముల చివరి వరకు స్వర్గమందుంటాడు. ఆ ద్విజుడు బ్రాహ్మణులకన్న ఉత్తమమైనది. పవిత్రమైనది. పావనమైనది భూమి మీద మరొకటి లేదు (5) ఉపవాసములతో తుల్యమైనది తపస్సుకర్మ ఏదీ లేదు వేదముకన్న పరమైన శాస్త్రములేదు. తల్లికన్న మరో ఉత్తమ గురువు లేడు (6) ధర్మముకన్న పరమైనదిలేదు. ఉపవాసం కన్న ఉత్తమమైన తపస్సులేదు. ఇక్కడ స్నానం చేసి పిండోదక క్రియలు శ్రాద్ధముచేసినవాని (7) పితరులు బ్రహ్మ ఉన్నంతవరకు పగలురాత్రి తృప్తినందుతారు. నరుడు ఆ తీర్థంలో స్నానంచేసి కేశవుని పూజిస్తే (8) అన్ని పాతకముల నుండి ముక్తుడై విష్ణులోకం పొందుతాడు. తీర్థములలో ఉత్తమ తీర్థముంది. విష్ణువు దగ్గరలో ఉన్న తీర్థమే (9) ఆతడు ఆ తీర్థమందునన వాని పాపమంతా హరిస్తాడు. మోక్షకాములకు ముక్తినిస్తుంది. ధనార్థులకు ధనమునిస్తుంది. ఆయుస్సునిస్తుంది, సుఖమునిస్తుంది, సర్వకామముల ఫలమునిస్తుంది (10) మరో తీర్థంతో పనేమి, అక్కడ జనార్దనుడుండగా అందరిమీద దయచూపే కొరకు నిత్యమ స్వయంగా ఉంటున్నాడు (11) శ్రద్ధతో అక్కడ ఇచ్చిన కించిద్దానము కూడా అదంతా ఈ లోకంలో పరత్ర కూడా అక్షయమౌతుంది (12) యజ్ఞము, దానము, తపము వీటితో బుధుడు ఏ ఫలాన్ని పొందుతాడో అదిక్కడ స్నానమాత్రం తోనే లభిస్తుంది. మంచి సేవకులు గల శూద్రులు గూడా పొందుతారు (13) ఏకాదశి యందు ఉపవశించి ఇక్కడ శ్రాద్ధము చేసినవారు పితరుల నందరిని నరకంనుండి ఉద్ధరిస్తారు. అనుమానంలేదు (14) పరమాత్మయైన జనార్దనుడు అక్షయ్యమైన తృప్తిని పొందుతాడు (15) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు ద్వారికామాహాత్మ్యమనునది ఇరువది ఆరవ అధ్యాయము || 26 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters