Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువదవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

అతఃపరం ప్రపక్ష్యామి శివతీర్థమనుత్తమం | యత్రాసౌ శంకరోదేవః పునర్జన్మ ధరోభవత్‌ || 1 ||

కీలితో దేవదేవేశః శంకరశ్చ త్రిలోచనః | గిరిజయా మహాభాగపాతితో భూమి మండలే || 2 ||

ఛలితో ముహ్యమానస్తు దివారాత్రింసవేత్తిచ | పుంస్త్రీన పుంసకాశ్చైవ జడీభూతస్త్రిలోచనః || 3 ||

కల్పాంత మివ సంజాతం తదాతస్మింశ్చకీలితే | పార్వత్యాసహసాతస్య కృతం కీలన కంతదా || 4 ||

యుధిష్ఠిర ఉవాచ -

ఏతదాశ్చర్య మతులంవచనం యత్త్వయోదితం | యోగురుః సర్వదేవానాం యోగినాం చైవసర్వదా || 5 ||

పార్వత్యా కీలితః కస్మాత్‌ నష్టవృత్తిఃశివః కథం | కారణం కథ్యతాం తత్ర పరంకౌతూహలంహిమే || 6 ||

వ్యాస ఉవాచ -

మంత్రౌఘా వివిధారాజన్‌ శంకరేణ ప్రకాశితాః | పార్వత్యగ్రే మహారాజ అధర్వణోపవేదజాః || 7 ||

శాకినీడాకినీ చైవకాకినీహాకినీతథా | ఏకినీలాకినీ హ్యెతాః షట్‌భేదాః తత్రకీర్తితాః || 8 ||

బీజాన్యుద్ధృత్యవైతాభ్యో మాలాచైకవృతాకృతా | శంభునాకథితా చైవ సార్వత్యగ్రే నృపోత్తమ || 9 ||

తైశ్చైవ అష్టాభవతి మంత్రోద్ధారః కృతస్తుసా | సాధయేత్సా మహాదుష్టాశాకినీ ప్రమదానఘే || 10 ||

శ్రీ పార్వత్యువాచ -

ప్రకాశితాస్త్వయానాథభేదాహ్యేతేషడేవహి | షడ్విధాః శక్తయోనాథ అగమ్యాయోగమాలినీః షడ్విధోక్తం త్వయైకేన కూటాత్‌ కృతం వదస్వమాం || 11 ||

శ్రీ మహాదేవ ఉవాచ -

అప్రకాశో మహదేవి దేవా సురైస్తుమానవైః || 12 ||

పార్వత్యువాచ -

నమస్తే సర్వరూపాయ నమస్తే ఋషభధ్వజ | జటిలేశసమస్తుభ్యం నీలకంఠ నమోస్తుతే || 13 ||

కృపాసింధో నమస్తుభ్యం నమస్తే కాలరూపిణ | ఏతైశ్చబహుభిర్వాక్యైః కోమలైః కరుణానిధిం || 14 ||

తోషయిత్వాద్రి తనయాదండవత్ప్రణిపత్యచ | జగ్రాహ పాదయుగలం తాంప్రోవాచదయాపరః || 15 ||

కిమర్థం స్తూయసే భ##ద్రే యాచ్యతాం మనసీప్సితం || 16 ||

పార్వత్యువాచ -

నమాహారంచ సధ్యానం కథ యస్వసవిస్తరం | అసందేహ మశేషంచ యద్యహంవల్ల భాతవ || 17 ||

తా || వ్యాసుని వచనము - ఇకముందు శివతీర్థమును గూర్చి చెబుతాను. అక్కడ ఈదేవుడు శంకరుడు పునర్జన్మ ధరుడైనాడు (1) కట్టబడి దేవదేవశుడు, శంకరుడు, త్రిలోచనుడు భూమండలమందు పార్వతిచే పారవేయబడ్డాడు, ఓ మహాభాగ (2) అసత్యమైన మోహాన్ని పొంది రాత్రింబగళ్ళు తెలుసుకోలేక పోయాడు. త్రిలోచనుడు జడంగా మారితే పుంస్త్రీ నపుంసకులు జడమైనారు (3) ఆతడు బద్ధుడుకాగా కల్పాంతమైనట్టుగా ఐంది. పార్వతి, త్వరగా ఆతనిని బంధించింది (4) యుధిష్ఠిరుని వచనము - ఇది చాలా పెద్ద ఆశ్చర్యము. మీరు చెప్పిన మాట ఆశ్చర్యము. శివుడు సర్వదేవతలకు గురువు, యోగులకు కూడా ఎల్లప్పుడు గురువు (5) పార్వతి ఆతనిని ఎందుకు బంధించింది. శివుడు కదలిక లేకుండా ఎట్లాఐనాడు. దానికి కారణమేమిటో చెప్పండి. నాకు చాలా కుతూహలముగా ఉంది (6) వ్యాసుని వచనము - ఓరాజ! పార్వతి ఎదుట, అథర్వణ ఉపవేదమందలి రకరకాల మంత్ర సమూహములను శివుడు ప్రకాశింప చేశాడు. (7) శాకిని, డాకిని, కాకిని, హాకిని, ఏకిని, లాకిని, ఈ ఆరు భేదములను అక్కడ కీర్తించాడు (8) వాని నుండి బీజమునుద్ధరించి ఒకచుట్టు కలిగిన మాల చేయబడింది. ఓ నృపోత్తమ! పార్వతి ఎదుట శంభుడు చెప్పాడు (9) మంత్రోద్ధారము చేస్తే అది వాటితో ఎనిమిది విధాలౌతుంది. ఓ అనఘే! మహాదుష్టమైన ఆ శాకినీ స్త్రీని సాధించాలి దానితో. (10) శ్రీపార్వతి వచనము - ఓనాథ! నీవు ఆరేభేదములని చెప్పావు. ఓ నాథ ఈషడ్విథశక్తులు, తెలియని యోగమాలలు. నీవొక్కడివే, ఆరురకాలని చెప్పినదానిని కూడిన (దాచిన) దానిని నాకుచెప్పు (11) శ్రీ మహాదేవుని వచనము - దేవాసురులతో మానవులతో చెప్పతగనిది, ఓమహాదేవి (12) పార్వతి వచనము - సర్వరూప నీకు నమస్కారము. వృషభధ్వజ! నీకు నమస్కారము. జటిలేశ, నీలకంఠ నీకు నమస్కారము (12) కృపాసింధు, కాలరూపి నీకు నమస్కారము. ఈ రకమైన అనేక విధములైన కోమలములైన వాక్యములతో కరుణానిధిని (14) అద్రి తనయ సంతోషపరచి, దండమువలె నమస్కరించి, రెండు పాదములను పట్టుకుంది. దయాపరుడై ఆమెతో ఇట్లన్నాడు (15) ఓ భ##ద్రే నన్నెందుకు స్తుతిస్తున్నావు. నీ మనస్సులోని కోరికను అడుగు అనగా (16) పార్వతి వచనము - వాటన్నిటి సమాహారమును ధ్యానముతో సహా, విస్తారంగానాకు చెప్పు. ఒకవేళ నేను నీకు వల్లభ##నైతే (ప్రియమైతే) సందేహము లేకుండా, అంతా, ఏంమిగలకుండా చెప్పు (17) అనగా

మూ || శ్రీరుద్ర ఉవాచ -

నప్రకాశ్యం త్వయాదేవి నమాహారోద్భవం ఫలం | సర్వం తత్వ మహం వక్ష్యే మంత్రకూటాద్యమే వహి || 18 ||

మాయా బీజంతు సర్వేషాం కుటానాం హివరాననే | సర్వేషాం మధ్యమో వర్ణోబిందు నాదాదిశోభితః || 19 ||

వహ్నిబీజం సవాతంచ కూర్మబీజ సమన్వితం | ఆదిత్య ప్రభవం బీజం శక్తి బీజోద్భవం సదా || 20 ||

ఏతత్కూటంచాద్యబీజంద్వితీయంచవిభోర్మతం | తృతీయంచాగ్ని బీజంతుసంయుక్తంబిందునేందునా || 21 ||

చతుర్థం యుక్తం శేషేణ బ్రహ్మబీజ ముషిన్తథా | పంచమంకాలబీజంచ షష్ఠం పార్థివ బీజకం || 22 ||

సప్తమే చాష్టమే బాహ్యం నృసింహేన సమన్వితం | నవమే ద్వితీయమేకంచ దశ##మే చాష్టకూటకం || 23 ||

విపరీతం తయోర్బీజం రుద్రాక్షేవరచారిణి | చతుర్దశేచ తుర్థ్యర్థం పృధ్వీబీజేన సంయుతం || 24 ||

కూటాః శేషాక్షరాః కేచిత్‌ రక్షితామేనకాత్మజే | సాపపాతయదోర్వ్యాంహి శివపత్నీతదానృవ || 25 ||

రామేణాశ్వాసితా తత్ర ప్రహ సంస్త్రి పురాంతకః | భ##ద్రేయస్మాత్త్వ యాపన్నం జంవశక్తిర్భవిష్యతి || 26 ||

మారణమోహనేవశ్యే ఆకర్షణచ క్షోభ##ణ | యంయంకామయతే నూనం తత్తత్‌ సిద్ధిర్భవిష్యతి || 27 ||

ఇతిశ్రుత్వాతదాదేవి దుష్టచిత్తాశుచిస్మితా | కూటశేషాన్తతో వీరాః ప్రోక్తా స్తసై#్యతు శంభునా || 28 ||

ఉవాచచ కృపాసింధుః సాథయస్వయథావిధి | కైలాసాత్తు హరస్తత్ర ధర్మారణ్యం గతోభృశం || 29 ||

జ్ఞాత్వాదేవీయ¸° తత్రయత్రాసౌ వృషభ ధ్వజః | తత్‌ క్షణాత్‌ పతితోభూమౌ ధర్మారణ్య నృపోత్తమ || 30 ||

జటాచంద్రోరగాః శూలం వృషభాద్యాయుధానివై | ముండమాలాచకౌ పీనం కపాలం బ్రహ్మణస్తువై || 31 ||

గంతాగణాశ్చ సర్వత్ర భూతప్రేతాదిశోదశ | విసంజ్ఞంచ స్వమాత్మానం జ్ఞాత్వా దేవో మహేశ్వరః || 32 ||

స్వేదజాస్తు సముత్పన్నాగణాః కూటాదయస్తథా | పంచకూటాన్‌ సముత్పాద్య తస్మాత్తదధిమూలినే || 33 ||

తా || శ్రీరుద్రుని వచనము - ఓదేవి! నమాహారము వల్ల కలిగే ఫలాన్ని నీవు చెప్పొద్దు. మంత్ర కూటము. మొదలుగా తత్వమంతా నేను చెబుతాను (18) ఓ వరాననే! అన్ని కూటములకు మాయా బీజమును చెబుతాను. అన్నింటి మధ్యమ వర్ణము బిందునాదాది శోభితము (19) వహ్నిబీజము, వాత (బీజ) సహితము, కూర్మబీజముతో కూడినది. ఆదిత్య ప్రభవమైన బీజము ఎల్లప్పుడు శక్తి బీజము నుండి ఉద్భవించింది (20) వీటి కూటమే ఆద్యబీజము, ద్వితీయము విభువున కిష్టమైనది. మూడవది అగ్ని బీజము, ఇది, ఇందు బిందువుతో కూడినది (21) చతుర్థము శేషముతో కూడినది బ్రహ్మబీజము, ఋషికూడా. పంచమము కాలబీజము. షష్ఠము పార్థివ బీజకము (22) సప్తమ, అష్టమములు, బాహ్యమైనవి, నృసింహముతో కూడినవి. నవమ మందు రెండవది ఒకటే. దశమము అష్టకూటకము (23) ఓ వరచారిణి! రుద్రాక్ష మందు వాటి బీజము విపరీతమైనది. చతుర్దశ మందు చతుర్ధ్యర్ధము కలది పృథ్వీబీజముతో కూడినది (24) ఓ మేనకాత్మజ! కూటములైన శేష అక్షరములు కొన్ని రక్షింపబడ్డాయి. శివపత్ని భూమిమీద పడినాక (25) ఆమెను రాముడు ఆశ్వాసించాడు. అప్పుడు త్రిపురాంతకుడు నవ్వుతూ, ఓ భ##ద్రే! నీవు పడిపోయావు. జపశక్తి నీకు కల్గుతుంది. (26) మారణము, మోహనము, పశ్యము, ఆకర్షణము, క్షోభణము నీవు వేటిని కోరుకుంటే అవి అవి నీకు సిద్ధిస్తాయి (27) దానిని విని దేవి, దుష్టచిత్తము కలదై చిరునవ్వు నవ్వుతూ ఉంది. శంభువు ఆమెకు కూటశేషములైన వీరములను చెప్పాడు (28) విధి ప్రకారము సాధించు అని కృపాసింధువు పలికాడు. కైలాసము నుండి హరుడు త్వరగా ధర్మారణ్యమునకు వెళ్ళాడు (29) వృషభధ్వజుడున్న చోటు తెలుసుకొని దేవి కూడా అక్కడికి వెళ్ళింది. ఓ నృపోత్తమ! ఆ క్షణంలోనే భూమి యందు ధర్మారణ్యమందు పడిపోయింది (30) జడలు, చంద్ర ఉరగములు, శూలము, వృషభము మొదలుగా ఆయుధములు, ముండమాల, కౌపీనము, బ్రహ్మయొక్క కపాలము (31) పడిపోయాయి. గణములు, భూతప్రేతములు అంతట పదిదిక్కులకు వెళ్ళారు. దేవుడు మహేశ్వరుడు తాను విసంజ్ఞముగా ఉన్నానని (తెలివి తప్పి) తెలుసుకున్నాడు (32) చెమట నుండి పుట్టిన గణములు అలాగే కూటాదులు అందుండి పంచకూటములను పుట్టించారు. అది అధిమూలి కొరకు (33).

మూ || సాధకాస్తే మహారాజ జపహోమ పరాయణాః | ప్రేతా సనాస్తుతే సర్వే కాలకూటో పరిస్థితాః || 34 ||

కథయంతి స్వమాత్మానం యేనమోక్షః పినాకినః | తతః కష్ట సమావిష్టాగౌరీవహ్ని భయాతురా || 35 ||

సభాజితః శివసై#్తశ్చ గౌరీహ్రీణాత్వధోముఖీ | తపస్తే పేచత త్రస్థా శంకరాదేశ కారిణీ || 36 ||

పంచాగ్ని సేవనం కృత్వాధూమ్ర పానమధోముఖీ | కూటాక్షరైః స్తుతః తైస్తుతోషితోవృషభధ్వజః || 37 ||

ధరాక్షేత్రమిదం రాజన్‌ పాపఘ్నం సర్వకామ దం | దేవమజ్జనకం శుభ్రం స్థానకే7న్‌ విరాజితే || 38 ||

ఆశ్వినే కృష్ణ పక్షేచ చతుర్దశ్యాదినే నృప | తత్రస్నాత్వాచ పీత్వాచ సర్వపాపైః ప్రముచ్యతే || 39 ||

పూజయిత్వాచ దేవేశం ఉపోష్యచవిధానతః | శాకినీడాకినీ చైవ వేతలాః పితరో గ్రహాః || 40 ||

గ్రహాధిష్ణ్యాన పీడ్యంతే సత్యంసత్యం వరాననే | సాంగం రుద్ర జపంతత్ర కృత్వాపాపైః ప్రముచ్యతే || 41 ||

నశ్యంతి త్రివిధారోగాః సత్యంసత్యం చ భూపతే | ఏతత్సర్వం మయాఖ్యాతం దేవమజ్జన కంశ్రుణు || 42 ||

అశ్వమేధ సహసై#్రస్తు కృతైస్తు భూరిదక్షిణౖః | తత్పలం సమవాప్నోతి శ్రోతాశ్రావయితానరః || 43 ||

అపుత్రో లభ##తే పుత్రాన్‌ నిర్ధనోధన మాప్నుయాత్‌ | ఆయురారోగ్యమైశ్వర్యం లభ##తేనాత్ర సంశయః || 44 ||

మనోవాక్కాయజ్జనితం పాతకంత్రివిధంచయత్‌ | తత్సర్వం నాశమాయాతి స్మరణాత్కీర్తనాన్నృవ || 45 ||

ధన్యంయశస్యమాయుష్యంసుఖసంతానదాయకం | మాహాత్మ్యంశృణుయాద్వత్పసర్వసౌఖ్యాన్వితోభ##వేత్‌ || 48 ||

సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వదానేషుయత్ఫలం | సర్వయజ్జైశ్చ యత్పుణ్యం జాయతే శ్రవణాన్నృప || 47 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యేధరాక్షేత్ర వర్ణనం నామ వింశో7ధ్యాయః || 20 ||

తా || ఓమహారాజ! ఆ సాధకులు జపహోమపరాయణులైప్రేతాననులై వారంతా కాలకూటముపై ఉండి (34) తమకుతాముఅనుకుంటున్నారు పినాకికిమోక్షమెట్లా కలుగుతుంది అని. పిదప కష్టముతో కూడినదైనా గౌరి వహ్ని భయముతో ఆతురయైంది (35) వారు శివుని గౌరవించారు. గౌరి సిగ్గుతో తలవంచుకొంది. శంకరుని ఆదేశమును చేయదలచి ఆమె అక్కడ ఉండి తపమాచరించింది. (36) పంచాగ్ని సేవనంచేస్తూ, ధూమ్రపానం చేస్తూ అధోముఖంగా ఉండి కూటాక్షరములతో స్తుతించింది. వాటితో వృషభధ్వజుడు ఆనందపడినాడు (37) ఓరాజ! ఇది ధరాక్షేత్రము, పాపఘ్నము. సర్వకామములనిచ్చేది. దేవతలు మునిగేది, శుభ్రమైనది, ఈ స్థానంలో ఉంది (38) ఓ నృప! ఆశ్వయుజం కృష్ణపక్షము చతుర్దశి యందు అక్కడ స్నానం చేసిన, పానం చేసిన సర్వపాపముల నుండి ముక్తులౌతారు. (39) దేవేశుని పూజించి, విధి ప్రకారము ఉపవసించాలి. శాకిని, డాకిని, వేతాలురు పితరులు గ్రహములు (40) గ్రహముల అధిష్ఠించిన వారు పీడించరు.ఓ వరానన! ఇది సత్యము. సాంగమైన రుద్ర జపమును అక్కడ చేస్తే పాపముల నుండి ముక్తులౌతారు (41) మూడు రకములైన రోగములు నశిస్తాయి. ఇది సత్యము. ఇదంతా నేను చెప్పాను.దేవమజ్జనకమున గూర్జి విను (42) వేల కొలది అశ్వమేధములు భూరిదక్షిణలతో చేసినా అంతఫలమును, ఈ కథను విన్న,వినిపించిన నరులు పొందుతారు (43) పుత్రులు లేనివారు పుత్రులను, ధనములేనివారు ధనమును, ఆయురారోగ్యము ఐశ్వర్యములను పొందుతారు, అనుమానము లేదు (44) మనోవాక్కాయములతో కల్గిన పాపము త్రివిధము. అదంతా స్మరణవల్ల కీర్తనవల్ల నశిస్తుంది (45) ధన్యమైనది. యశస్కరము, ఆయుఃకారకము సుఖసంతానదాయకము.ఈ మహాత్మ్యము. దీనిని విన్నవారు సర్వసౌఖ్యాన్వితు లౌతారు (46) సర్వతీర్థములలోని పుణ్యము,సర్వధానముల ఫలము, సర్వయజ్ఞముల పుణ్యము అదంతా ఈ కథాశ్రవణము వలన కల్గుతుంది ఓ రాజ! (47) అని శ్రీ స్కాంధ మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందుపూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు ధరాక్షేత్ర వర్ణమనునది ఇరువదవ అధ్యాయము || 20 ||

* * *

Sri Scanda Mahapuranamu-3    Chapters