Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునెనిమిదవ అధ్యాయము

మూ || రుద్ర ఉవాచ -

శృణు స్కంద మహాప్రాజ్ఞ హ్యద్భుతం యత్కృతంమయా | ధర్మారణ్యమహాదుష్టోదైత్యఃకర్ణాటకాభిధః || 1 ||

నిభృతంహి సమాగత్య దంపత్యోర్విఘ్నమాచరత్‌ | తందృష్ట్వాతద్భయాల్లోకః ప్రదుద్రావ నిరంతరం || 2 ||

త్యక్త్వాస్థానంగతాః సర్వేపణిజో వాడవాదయః | మాతంగీరూపమాస్థాయ శ్రీ మాత్రాత్వనయాసుత || 3 ||

హతః కర్ణాటకోనామ రాక్షసోద్విజఘాతకః | తదా సర్వేపివై విప్రాః హృష్టాస్తే తేన కర్మణా || 4 ||

స్తువంతి పూజయంతి స్మపణి జోభక్తితత్పరాః | వర్షేవర్షే ప్రకుర్వంతి శ్రీ మాతా పూజనం శుభం || 5 ||

శుభకార్యేషు సర్వేషు ప్రథమం పూజయేత్తుతాం | నవవిఘ్నం ప్రవశ్యేత తదాప్రభృతి పుత్రక || 6 ||

యుధిష్ఠిర ఉవాచ -

కోసౌదుష్టో మహాదైత్యః కస్మిన్‌ వంశే సముద్భవః | కింకింతేనకృతంతాత సర్వం కథయ సువ్రత || 7 ||

వ్యాస ఉవాచ -

శృణు రాజన్ప్ర వక్ష్యామి కర్ణాటక విచేష్టితం | దేవానాం దానవానాం యోదుఃసహోవీర్యదర్పితః || 8 ||

దుష్టకర్మాదురాచారో మహారాష్ట్రో మహాభుజః | జిత్వాచ సకలాన్‌ లోకాన్‌ త్రైలోక్యేచ గతాగతః || 9 ||

యత్రదేవాశ్చ ఋషయః తత్రగత్వామహాసురః | ఛద్మనావాబలేనైవ విఘ్నం ప్రకురుతే నృప || 10 ||

నవేదాధ్యయనం లోకే భ##వేత్త స్యభ##యేనచ | కుర్వతే వాడవాదేవానచ సంధ్యాద్యుపాసనం || 11 ||

నక్రతుర్వర్తతే తత్రన చైవసురపూజనం | దేశేదేశేచ సర్వత్రగ్రామేగ్రామే పురేపురే || 12 ||

తీర్థే తీర్థేచ సర్వత్ర విఘ్నం ప్రకురుతే7సురః | పరంతుశక్యతేనైవ ధర్మారణ్య ప్రవేశితుం || 13 ||

భయాచ్ఛక్త్యాశ్చ శ్రీమాతుః దానవో విక్లవస్తదా | కేనోపాయేన తత్రైవ గమ్యతే త్వితిచింతయన్‌ || 14 ||

విఘ్నం కరిష్యేహి కథం బ్రాహ్మణానాం మహాత్మనాం | వేదాధ్యయన కర్తౄణాం యజ్ఞేకర్మాధి తిష్ఠతాం || 15 ||

వేదాధ్యయనజం శబ్దం శ్రుత్వా దూరాత్సదానవః | వివ్యధే నయధా రాజన్‌ వజ్రాహత ఇవద్విపః || 16 ||

తా || రుద్రుని వచనము - ఓ స్కంధ! మహాప్రాజ్ఞ! నేను చేసిన అద్భుతాన్ని విను. ధర్మారణ్య మందు మహా దుష్టుడు కర్ణాటక అను పేరుగలవాడు దైత్యుడున్నాడు (1) రహస్యముగా వచ్చి దంపతులకు విఘ్నము కల్గించేవాడు. అతనిని చూచి ఆతని భయంవల్ల లోకమునిరంతరము పరుగెత్తసాగింది. (2) వణిజులు, బాడబాదులు తమ స్థానముల వదలి వెళ్ళిపోయారు. మాతంగి రూపమును పొంది ఈ శ్రీమాత (3) ద్విజులను చంపే కర్ణాటకుడనే రాక్షసుణ్ణి చంపింది, ఓకుమార. అప్పుడు ఆ విప్రులందరు ఆ పనితో ఆనందించారు (4) భక్తతత్పరులై వణిజులు స్తోత్రం చేశారు. పూజించారు కూడా. ప్రతి సంవత్సరము శుభ##మైన శ్రీ మాతా పూజను చేశారు (5) అన్ని శుభకార్యములందు మొదట ఆమెను పూజించాలి. అప్పటి నుండి ఆతడు విఘ్నాన్ని చూడడు, ఓ పుత్రక! (6) యుధిష్ఠిరుని వచనము - ఈ దుష్టుడైన మహా దైత్యుడు ఎవరు? ఏ వంశమందు జన్మించినాడు. ఓ తండ్రి! ఆతడేమేమి చేశాడు. ఓ సువ్రత! అంతా చెప్పు (7) వ్యాసుని వచనము - ఓరాజ! కర్ణాటకునివి చేష్టితమును చెబుతానువిను. దేవతలకు, దానవులకు వాడు దుస్సహుడు, వీర్య దర్పితుడు (8) దుష్టకర్ముడు, దురాచారుడు. మహాభటుడు. మహాఉపద్రవం కల్గించేవాడు అన్ని లోకములను జయించ గలవాడైనాడు (9) దేవతలు, ఋషులున్నచోటికి వెళ్ళి ఈ మహాసురుడు మోనంతో, లేదా బలంతోనైనా విఘ్నం కల్గించేవాడు! ఓరాజా! (10) ఆతని భయంతో లోకంలో వేదా ధ్యయనము లేకుండా పోయింది. బాడబులు దేవతలు సంధ్యాది ఉపాసనను చేయటంలేదు (11) అక్కడ యజ్ఞములు జరగటంలేదు. దేవతల పూజలేదు. ప్రతిదేశమందు ప్రతి గ్రామమందు ప్రతిపురమందు అంతట (12) ప్రతి తీర్థమందు అంతట ఆ అసురుడు విఘ్నం కల్గిస్తున్నాడు. కాని ధర్మారణ్యంలో ప్రశేశించటానికి శక్తుడు కాలేదు (13) శక్తియైన శ్రీమాత భయంవల్ల దానవుడు విక్లబుడైనాడు. ఏ ఉపాయంతో అక్కడికి వెళ్ళొచ్చు అని ఆలోచించసాగాడు (14) మహాత్ములైన బ్రాహ్మణులకు విఘ్నమెట్లా కల్గించాలి. వేదాధ్యయనము చేసేవారు, యజ్ఞమందు కర్మను అధిష్ఠించినవారు వారికి విఘ్నం ఎట్లా కలగాలి (15) వేదాధ్యయన శబ్దమును దూరం నుండేవిని ఆ రాక్షసుడు, వజ్రందేబ్బతిన్న ఏనుగువలె వ్యథ చెందాడు. ఓ రాజ! (16).

మూ|| నిఃశ్వాసాన్ముముచే రోషాద్దంతైర్దం తాంశ్చ ఘర్షయన్‌ | దశమానోనజోవాష్ఠౌ పేశయంశ్చకరావుభౌ || 17 ||

ఉన్మత్తవద్విచరత ఇతశ్చేతశ్చమారిష | సన్నిపాతస్య దోషస్త్రన యథాభవతి మానవః || 18 ||

తథైవదానవోఘోరోధర్మారణ్య సమీపగః | భ్రమతేదహతే చైవదూరాదేవభయాన్వితః || 19 ||

వివాహకాలేవిప్రాణాం రూపంకృత్వాద్విజన్మనః | తత్రాగత్య దురాధర్షోనీత్వా దాంపత్య ముత్తమం || 20 ||

ఉత్పపాతమహీవృష్ఠాత్‌ గగనేసో7సురాధమః | స్వయంచరమతేపాపోద్వేషాజ్ఞాతి స్వభావతః || 21 ||

ఏవంచబహుశఃసో7థ ధర్మారణ్యాచ్చ దంపతీ | గృహీత్వా కురుతే పాపం దేవానామపిదుఃసహం || 22 ||

విఘ్నం కరోతి దుష్టో7సౌ దంపత్యోః సతతంభువి | మహాఘోరతరం కర్మకుర్వంస్త స్మిన్‌ పురేవరే || 23 ||

తత్రోద్విగ్నాద్విజాః సర్వేపలాయంతేది శోదశ | గతాః సర్వే భూమిదేవాః త్యక్త్వా స్థానం మనోరమం || 24 ||

యత్రయత్రమహత్తీర్థం తత్రతత్రగతాద్విజాః | ఉద్వసంతత్పురం జాతం తస్మిన్‌ కాలేనృపోత్తమ || 25 ||

నవేదాధ్యయనం తత్రనచయజ్ఞః ప్రవర్తతే | మనుజాః తత్ర తిష్ఠంతి న కర్ణాట భయార్దితాః || 26 ||

ద్విజాః సర్వేతతో రాజన్‌ వణిజశ్చ మహాయశాః | ఏకత్రమిలితాః సర్వేవక్తుం మంత్రం యధోచితం || 27 ||

కర్ణాటస్య వధోపాయం మంత్రయంతిద్విజర్షభాః | విచార్యమాణతైర్దైవాత్‌ వాగ్జాతా చాశరీరిణీ || 28 ||

ఆరాధయత శ్రీమాతాం సర్వదుఃఖావహారిణీం | సర్వదైత్యక్షయకరీం సర్వోపద్రవనాశినీం || 29 ||

తచ్ఛ్రుత్వావాడవాః సర్వే హర్ష వ్యాకులోచనాః | శ్రీమాతాంతు సమాగత్య గృహీత్వా బలిముత్తమం || 30 ||

మధుక్షీరం తథాచైవ చందనం కుసుమానిచ | ధూపందీపం తథాచైవ చందనం కుసుమానిచ || 31 ||

ఫలాని వివిధాన్యేవ గృహీత్వావాడవానృవ | ధ్యాంతు వివిధం రాజన్‌ భక్తాపూపాఘృతాచితాః || 32 ||

కుల్మాషా వటకాశ్చైవ పాయసం ఘృత మిశ్రితం | సోహాలికా దీపికాశ్చ సార్ద్రాశ్చ వటకాస్తథా || 33 ||

రాజికాభిశ్చ సంలిప్తాన వచ్ఛిద్ర సమన్వితాః | చంద్రబింబ ప్రతీకాశా మండకాస్తత్ర కల్పితాః || 34 ||

పంచామృతేన స్నపనం కృత్వాగంధోదకేనచ | ధూపైర్దీపైశ్చనైవేద్యైః తోషయామానురీశ్వరీం || 35 ||

నీరాజనైః సకర్పూరైః పుషై#్పః దీపైః సచందనైః | శ్రీమాతాతోషితారాజన్‌ సర్వోపద్రవనాశినీ || 36 ||

తా|| పళ్ళతో పళ్ళను కొరుకుతూ కోపంతో నిఃశ్వాసములు విడిచాడు. తన పెదవులను కొరుక్కుంటూ రెండు చేతులను పిసుక్కుంటూ (17) ఓ మారిష! ఇటునటు పిచ్చిదానిలా తిరిగాడు. సన్నిపాత దోషంతో మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడో (18) అట్లాగే దానవుడు ఘోరంగా ధర్మారణ్య సమీపంలో ఉండి ప్రవర్తించాడు. దూరం నుండే భయపడుతూ తనను కాలుస్తున్నట్టు భ్రమపడుతున్నాడు (19) వివాహకాలమందు బ్రాహ్మణ రూపము ధరించి బ్రాహ్మల దగ్గరకు వచ్చి ఎదిరింప శక్యముకాని ఆ రాక్షసుడు ఉత్తమమైన దంపతులను తీసుకొని (20) భూమిపై నుండి ఆకాశమున కెగిరాడు. ఆ రాక్షసాధముడు ద్వేషం వల్ల జాతి స్వభావం వల్ల, ఆ పాపుడు స్వయంగా రమించాడు (21) ఈ విధముగా ధర్మారణ్య ము నుండివాడు అనేక మంది దంపతులను తీసుకొని పోయి దేవతలకూ భరింపరాని పాపము చేశాడు (22) ఈ దుష్టుడు భూమిపై ఎల్లప్పుడు దంపతులకు విఘ్నం కల్గించేవాడు. ఆ పురవర మందు మహా ఘోరతరమైన కర్మచేస్తూ ఉండేవాడు (23) అక్కడ ఉద్విగ్నులై ద్విజులంతా పదిదిక్కులకు పరుగెత్తేవారు. భూదేవులంతా మనోరమమైన ఆ స్థానమును వదలివెళ్ళి పోయారు (24) ఎక్కడెక్కడ గొప్పతీర్థముందో అక్కడంతా ద్విజులు వెళ్ళిపోయారు. ఓ నృపోత్తమ! ఆ సమయమందు ఆ నగరము ఎవ్వరులేకుండా ఐంది (25) అక్కడ వేదాధ్యయనము లేదు. యజ్ఞములు జరగటంలేదు. కర్ణాటుని భయముతో బాధపడి మనుష్యులు అక్కడి నుండి వెళ్ళిపోయారు (26) ఓరాజ! ద్విజులందరు గొప్పకీర్తిగల వణిజులు అందరు ఒకచోట చేరారు. తమకు తోచిన అభిప్రాయాన్ని ఆలోచనను చెప్పటానికి (27) ఆధ్విజర్షభులు కర్ణాటుని వధోపాయమును ఆలోచించసాగారు. వారు ఆలోచిస్తుండగా అదృష్టవశాత్తు అశరీరవాణి పలికింది (28) అన్ని దుఃఖములను అపహరించే శ్రీమాతను ఆరాధించండి. దైత్యులందరిని నశింపచేసేది, ఉపద్రవములనన్నిటిని నశింపచేసేది (29) దానిని విని వాడవులంతా ఆనందంతో నిండిన కళ్ళు గలవారై ఉత్తమమైన బలిని తీసుకొని శ్రీమాత దగ్గరకు వచ్చారు (30)మధు, క్షీరము, పెరుగు, నెయ్యి, శర్కర ఐదింటి ధారను కలిగి, ధూపము, దీపము, చందనము, పూలు, (31) రకరకాల పండ్లు బాడబులు వెళ్ళారు. రకరకాల ధాన్యము, అన్నము, అపూపములు, నేయితో చేసిన వంటకములు (32) వడియాలు, నేయిగల పాయసము, గుగ్గిళ్ళు తీసుకెళ్ళారు. సోహాలికలు (నాగళ్ళా?) దీపాలు, పచ్చివడియాలు (33) నల్లఆవాలు పూయబడిన, తొమ్మిది రంధ్రములు కలిగిన, చంద్రబింబముతోసమానమైన మండకములు (కేకులు) ఏర్పరచారు (34) పంచామృతముతో స్నానము చేయించి గంధోదకము, ధూపదీపములు నైవేద్యముతో ఈశ్వరిని సంతృప్తి పరచారు (35) కర్పూరముతో కూడిన నీరాజనములతో పుష్పములతో, దీపములతో సుచందనములతో సర్వుపద్రవములను నశింపచేసే శ్రీమాతను సంతృప్తిపరిచారు (36).

మూ || శ్రీమాతాచజగన్మాతాబ్రాహ్మీ సౌమ్యావరప్రదా | రూపత్రయం సమాస్థాయ పాయేత్సాజగత్రయం || 37 ||

త్రయీరూపేణ ధర్మాత్మన్‌ రక్షతే సత్యమందిరం | జితేంద్రియాజితాత్మానో మిలితాస్తే ద్విజోత్తమాః || 38 ||

తైః సర్వైరర్చితామాతా చందనాద్యేన తోషితా | స్తుతిమారేభిరేతత్రవాజ్‌మనఃకాయ కర్మభిః

ఏకచిత్తేన భావేన బ్రహ్మపుత్ర్యాః పురః స్థితాః || 39 ||

విప్రా ఊచు:-

నమస్తే బ్రహ్మపుత్ర్యాస్తు నమస్తే బ్రహ్మచారిణి | నమస్తే జగతాం మాతః నమస్తే సర్వగేసదా || 40 ||

క్షున్నిద్రాత్వం తృషాత్వంచ క్రోధతంద్రాదయస్తధా | త్వంశాంతిస్త్వం రతిశ్చైవ త్వం జయావియజాతథా || 41 ||

బ్రహ్మవిష్ణుమహెశాద్యైః త్వంప్రపన్నాసురేశ్వరీ | సావిత్రీశ్రీరుమాచైవ త్వంచమాతావ్యవస్థితా || 42 ||

బ్రహ్మవిష్ణు సురేశానాః త్వదాధారేవ్యవస్థితాః | నమస్తుభ్యం జగన్మాతః ధృతి పుష్టి స్వరూపిణి || 43 ||

రతిఃక్రోధామహామాయాభామాజ్యోతిః స్వరూపిణి | సృష్ఠిస్థిత్యం త కృద్దేవి కార్యకారణదా సదా || 44 ||

ధరాతేజః తథా వాయుఃసలిలాకాశ##మేవచ | నమస్తే స్తు మహావిద్యే మహాజ్ఞాన మయే7నఘే || 45 ||

హ్రీంకారీ దేవరూపాత్వం క్లీంకారీత్వంమహాద్యుతే | ఆదిమధ్యావసానాత్వం త్రాహిచాస్మాన్‌మహాభయాత్‌ || 46 ||

మహాపాపోహి దుష్టాత్మా దైత్యో7యం బాధతే7ధునా | త్రాణరూపాత్వమేకాచ అస్మాకం కులదేవతా || 47 ||

త్రాహిత్రాహి మహాదేవి రక్షరక్ష మహెశ్వరి | హనహనదానవందుష్టం ద్విజాతీనాం విఘ్నకారకం || 48 ||

ఏవంస్తుతా తదాదేవీ మహామాయా ద్విజన్మభిః | కర్ణాటస్యవధార్థాయ ద్విజాతీనాం హితాయచ

ప్రత్యక్షాసాభవత్తత్ర వరం బ్రూహీత్యువాచహ || 49 ||

కెనవైత్రాసితా విప్రాః కేనవోద్వేజితాః పునః | తస్యాహం కుపితా విప్రానయిష్యే యమ సాదనం || 50 ||

క్షీణాయుషం నరం విత్తయేన యూయం నిపీడితాః | దదామియోద్విజాతిభ్యో యధేష్టం వక్తుమర్హథ || 51 ||

భక్త్యాహి భవతాం విప్రాః కరిష్యే నాత్ర సంశయః || 52 ||

ద్విజా ఊచుః -

కర్ణాటాఖ్యో మహారౌద్రో దానవోమదగర్వితః | విఘ్నం ప్రకురుతేనిత్యం సత్యమందిరవాసినాం || 53 ||

బ్రాహ్మణాన్‌ సత్యశీలాంశ్చ వేదాధ్య యనతత్పరాన్‌ |

ద్వేషాద్ద్వేష్టిద్వేషణస్తాన్నిత్య మేవ మహామతే | వేదవిద్వేషణో దుష్టో ఘాతమైనం మహాద్యుతే || 54 ||

తా|| శ్రీమాత, జగన్మాత, బ్రాహ్మి, సౌమ్య, వరప్రద, మూడు రూపముల ధరించి ఆమె ముల్లోకములను రక్షిస్తుంది (37) వేదముల రూపముతో ఆమె సత్యమందిరమున రక్షిస్తోంది, ఓ ధర్మాత్మ! జితేంద్రియులు, జితాత్ములు ఐన ఆ ద్విజోత్తములంతా కలిశారు (38) వారందరు ఆమెను పూజించారు. చందనాదులతో సంతోషపరిచారు. వాక్‌, మనస్సు, శరీరకర్మలతో స్తోత్ర మారంభించారు. బ్రహ్మపుత్రికి ఎదురుగా నిలిచి ఏకాగ్రచిత్తము గలిగి భావపూర్ణముగా స్తుతించారు. (39) విప్రులవచనము - బ్రహ్మపుత్రి నమస్కారము. ఓ బ్రహ్మచారిణి నమస్కారము. ఓ జగన్మాత నమస్కారము. ఎప్పుడూ అంతటికి వెళ్ళగలిగేదానా నమస్కారము (40) ఆకలి, నిద్రలునీవే. దప్పికనీవే క్రోధము, నిద్రమత్తు మొదలగునవి నీవే. నీవు శాంతివి. నీవురతివి. నీవు జయవు, విజయవు (41) బ్రహ్మవిష్ణు మహెశాదులతో స్తుతించబడేదానివి సురేశ్వరివి. సావిత్రివి శ్రీవి, ఉమవు నీవు మాతవు (42) బ్రహ్మవిష్ణు సురేశానులు, నీవు ఆధారముగా ఉన్నారు. ఓ జగన్మాత! నీకు నమస్కారము. ధృతి, పుష్టి రూపముగా గల దానివి. (43) రతివి, క్రోధవు, మహామాయవు, ఛాయవు, జ్యోతిః స్వరూపమువు. సృష్టిస్థితి అంతములను చేసే దేవివి ఎప్పుడూ కార్య కారణములు ఇచ్చే దానివి (44) భూమి, తేజస్సు, వాయువు, సలిలము, ఆకాశము అన్ని నీవే. ఓ మహావిద్య! నీకు నమస్కారము. మహాజ్ఞానమయి, పాపరహితురాల (45) హ్రీంకారి, దేవరూపురాలవు, క్లీంకారి, మహాద్యుతివి. ఆది, మధ్య, అవసానములునీవే. మమ్ములను మహాభయమునుండి రక్షించు (46) మహాపాపి, దుష్టాత్ముడు, ఈ దైత్యుడు, ఇప్పుడు బాధిస్తున్నాడు. రక్షణ రూపిణివి నీ వొక్కదానివే. మాకుల దేవతవు (47) మహాదేవి రక్షించు రక్షించు మహెశ్వరి కాపాడుకాపాడు. ద్విజాతులకు విఘ్నము కల్గించే దుష్టదానవుని సంహరించు (48) ఈ విధముగా బ్రాహ్మణులు దేవిని, మహామాయను స్తుతించగా, కర్ణాటుని చంపే కొరకు, ద్విజాతుల హితము కొరకు ఆమె అక్కడ ప్రత్యక్షమైంది. వరము అడగండి అని పలికింది (49) శ్రీ సూత వచనము - ఓ బ్రాహ్మణులార! ఎవరు మిమ్మల్ని భయపెట్టారు. ఎవరు మిమ్మల్ని ఉద్వేగపరిచారు. ఆతడి విషయంలోనేను కోపం ఉన్నాను. ఓ విప్రులార! ఆతనిని యమమందిరానికి పంపుతాను (50) మిమ్మల్ని పీడించిన వాడి ఆయుస్సు క్షీణించిందని తెలుసుకోండి. ద్విజాతులకు మీకు వరమిస్తున్నాను. యధేష్టముగా చెప్పండి (51) మీ భక్తికి సంతసించాను. ఓ విప్రులార! చేస్తాను. అనుమానంలేదు (52) అనగా ద్విజులన్నారు. కర్ణాటుడను వాడు మహా రౌద్రుడైన దానవుడు మదగర్వితుడు సత్యమందిరములో ఉన్నవారికి నిత్యము విఘ్నము కల్గిస్తున్నాడు (53) బ్రాహ్మణులను, సత్యశీలురను, వేదాధ్యయన తత్పరులను వారిని ఆ శత్రువు ప్రతిరోజు ద్వేషంతో ద్వేషిస్తున్నాడు. ఓ మహామతి! వేదాన్ని ద్వేషించేవాడు దుష్టుడు. ఓ మహాద్యుతి! ఈతనిని చంపు అని అన్నారు (54)

మూ || వ్యాస ఉవాచ -

తథేత్యుక్త్వాతు సాదేవీ ప్రహస్యకులదేవతా | వధోపాయం విచింత్యాస్య భక్తానాం రక్షణాయువై || 55 ||

తతః కోపపరాజాతా శ్రీమాతా నృపసత్తమ | కోపేన భృకుటీం కృత్వారక్తనేత్రాం తలోచనాం || 56 ||

కోపేన మహతా7విష్టా వసంతీ పావకం యథా | మహాజ్వాలా ముఖాన్నెత్రాత్‌ నాసాకర్ణాచ్చ భారత || 57 ||

తత్తే జసాసముద్భూతా మాతంగీ కామరూపిణీ | కాలీకరాల వదనా దుర్దర్శ వదనోజ్జ్వలా || 58 ||

రక్తమాల్యాం బరధరా మదాఘూర్జితలోచనా | న్యగ్రోధస్య నమీపేసా శ్రీమాతా సంశ్రితా తదా || 59 ||

అష్టాదశ భుజాసాతుశుభామాతా సుశోభనా | ధనుర్బాణ ధరాదేవీ ఖడ్గఖేటక ధారిణీ || 60 ||

కుఠారం క్షురికాం బిభ్రత్‌ త్రిశూలం పాన సాత్రకం | గదాసర్పంచ పరిఘం పినాకం చైవపాశకం || 61 ||

అక్షమాలాధరా రాజన్‌ మద్య కుంభాను ధారిణీ | శక్తించ ముసలంచోగ్రం కర్తరీం ఖర్పరం తథా || 62 ||

కంటకాఢ్యాంచ బదరీం బిభ్రతీతు మహననా | తత్రాభవన్‌ మహాయుద్ధం తుములం లోమహర్షణం || 63 ||

మాతంగ్యాః సహ కర్ణాట దానవేన నృపోత్తమ || 64 ||

యుధిష్ఠిర ఉవాచ -

కథం యుద్ధం సమభవత్‌ కథంచైవాప వర్తత | జితంకే నైవధర్మజ్ఞ తస్మమాచక్ష్య మారిష || 65 ||

వ్యాస ఉవాచ -

ఏకదాశృణు రాజేంద్ర! యజ్జాతం దైత్య సంగరే | తత్సర్వం కథయా మ్యాశు యథావృత్తంహితత్పురా || 66 ||

ప్రణష్ట యోషాయేవిప్రావణిజశ్చైవ భారత | చైత్ర మాసేతు సంప్రాస్తే ధర్మారణ్య నృపోత్తమ || 67 ||

గౌరీముద్వాహయా మానుః విప్రాస్తే సంశితవ్రతాః | స్వస్థానం సుశుభం జ్ఞాత్వా తీర్థరాజం తథోత్తమాః || 68 ||

వివాహం తత్ర కుర్వంతో మిలితాస్తే ద్విజోత్తమాః | కోటికన్యా కులంతత్ర ఏకత్రాసీన్మ హోత్సవే || 69 ||

ధర్మారణ్యమహాప్రాజ్ఞ సత్యంసత్యంవదామ్యహం |

చతుర్థ్యామ పరరాత్రే7 భ్యంతరతో7గ్నిమాదధుః | ఆసనం బ్రహ్మణదత్వా అగ్నిం కృత్వాప్రదక్షిణం || 70 ||

తా || వ్యాసుని వచనము - అట్లాగే కానీ అని పలికి ఆకుల దేవత దేవి నవ్వి, భక్తుల రక్షణ కొరకు వీని వధ కొరకు ఉపాయమును ఆలోచించి (55) ఓ నృపసత్తమ! పిదప శ్రీమాత! కోపపరురాలైంది. కోపంతో కనుబొమలు ముడిచింది. కళ్ళ చివరి భాగాలు బాగా ఎఱ్ఱబడ్డాయి (56) చాలా కోపం కలదైంది, అగ్నివలె మండి పోతోంది. ఓ భారత! ఆమె ముఖం నుండి, నేత్రముల నుండి, ముక్కు నుండి, చెవుల నుండి, పెద్ద జ్వాలలు రాసాగాయి (57) ఆ తేజస్సుతో కామరూపముగల మాతంగి అనునది పుట్టింది. నల్గగా ఉంది. భయంకరమైన ముఖము. చూడశక్యముకాని ముఖకాంతి గలది. (58) రక్తపు మాలలు, వస్త్రములు (ఎర్రని) ధరించింది. మదంతో తిరుగుతున్న కళ్ళుగలదామె. ఆ శ్రీమాత అప్పుడు న్యగ్రోధ వృక్షసమీపమందు కూర్చుంది (59) పదునెనిమిది భుజములు గలది. ఆతల్లి శుభ##మైనది, సుశోభన మైనది. ధనుర్బాణములు ధరించింది. ఆదేవి ఖడ్గము డాలు ధరించింది (60) గొడ్డలి, చిన్నకత్తి, త్రిశూలము, పానపాత్ర ధరించింది, గద, సర్పము, పరిఘ (ఇనుపకట్లగుదియ) శివుని విల్లు పాశము ఇవి ధరించింది (61) అక్షమాల ధరించింది. మద్య కుంభాన్ని వెంటధరించింది. శక్తి, రోకలి, ఉగ్రమైన కత్తెర, తలపుర్రె వీటిని ధరించింది (62) ముళ్ళు గలిగిన రేగును ధరించింది. పెద్దముఖము గలది (నోరు) వెంట్రుకలు నిక్కబోడిచెట్టుగా దొమ్మియుద్ధము, మహాయుద్ధము అక్కడ జరిగింది. (63) ఓ నృపోత్తమ! కర్ణాట దానవునకు మాతంగితో యుద్ధం జరిగింది (64) యుధిష్ఠిరుని వచనము యుద్ధము ఎట్లా జరిగింది. ఎట్లా తొలగిపోయింది. ఎవరు గెలిచారు ఓధర్మజ్ఞ. మారిష! (ఆర్య) దాన్ని నాకు చెప్పండి (65) అనగా వ్యాసుని వచనము - ఓ రాజేంద్ర ! దైత్యునితో జరిగిన యుద్ధమందు ఏం జరిగిందో ఒక్కసారి విను. పూర్వము ఎట్లా జరిగిందో అదంతా త్వరగా చెబుతాను (66) స్త్రీలు నష్టమైన విప్రులు, వణిజులు, వారి కథచెప్తాను. ఓ నృపోత్తమ! ధర్మారణ్యమందు చైత్రమాసంరాగా (67) వ్రతమును ఆశ్రయించిన ఆ విప్రులు గౌరిని వివాహమాడారు. తమ స్థానము సుశభ##మైనదిగా గ్రహించి, అట్లాగే ఉత్తమమైన తీర్థరాజమున్నదని (68) అక్కడ వివాహాన్ని చేస్తూ ఆ ద్విజోత్తములు కలిశారు. ఆ మహోత్సవమందు కోటికన్యల సమూహము అక్కడ ఒక్కటైంది. ఓ మహాప్రాజ్ఞ! ధర్మారణ్యంలో కలిశారు. ఇది సత్యము. నేను సత్యం చెబుతున్నాను (69) చతుర్ధియొక్క అపర రాత్రమందు అభ్యంతరం నుండి అగ్నిని తెచ్చారు. బ్రహ్మకు ఆసనమువేసి, అగ్నికి ప్రదక్షిణం చేశారు (70).

మూ || స్థాలీ పాకం చకృత్వాథ కృత్వావేదీః శుభాస్తదా | చతుర్‌హస్తాః సకలశాః నాగపాశసమన్వితాః || 71 ||

వేదమంత్రేణ శుభ్రేణ మంత్రయంతే తతోద్విజాః | చరతాందంపతీనాంహి పరివేశ్యయథోచితం || 72 ||

బ్రాహ్మణా సహితాస్తత్ర వాడవాస్తే సుహర్షితాః | కుర్వతే వేదనిర్ఘోషం తారస్వరనినాదితం || 73 ||

తేనశ##బ్దేన మహతా కృత్స్నమా పూరితం నభః | తంశ్రుత్వాదానవో ఘోరో వేదధ్వనింద్విజేరితం || 74 ||

ఉత్పపాతాసనాత్తూర్ణం ససైన్యోగతచేతనః | ధావతః సర్వభృత్యాస్తంయేచాన్యే తానువాచసః || 75 ||

శ్రూయతాంకుత్రశబ్దో7యంవాడవానాంసముత్థితః | తస్యతద్వచనంశ్రుత్వాదైతేయాఃసత్వరంయయుః || 76 ||

విభ్రాంతచేతసః సర్వేఇతశ్చేతశ్చధావితాః | ధర్మారణ్యగతాః కేచిత్‌తత్ర దృష్టా ద్విజాతయః || 77 ||

ఉద్గిరంతో హినగమాన్‌ వివాహ సమయేనృప | సర్వం నివేదయామానుః కర్ణాటాయదుర్మాత్మనే || 78 ||

తచ్ఛ్రుత్వారక్తతామ్రాక్షోద్విజద్విట్‌ కోపపూరితః | అభ్యధావన్మహాభాగయత్రతేదంపతీనృప || 79 ||

ఖమాశ్రిత్యతదాదైత్యమాయా కుర్వన్సరాక్షసః | అహరద్దంపతీ రాజన్‌ సర్వాలంకార సంయుతాన్‌ || 80 ||

తతస్తే వాడవాః సర్వే సంగతాభువనేశ్వరీం | బుంబార వంప్రకుర్వాణాః త్రాహిత్రాహీతిచోచిరే || 81 ||

తచ్ఛ్రుత్వా విశ్వజననీ మాతంగీ భువనేశ్వరీ | సింహనాదం ప్రకుర్వాణో త్రిశూల వరధారణీ || 82 ||

తతః ప్రవవృతే యుద్ధం దేవీ కర్ణాటయోస్తధా | ఋషీణాం పశ్యతాంతత్రవణి జాంచద్విజన్మనాం || 83 ||

పశ్యతామభవత్‌ యుద్ధం తుములం లోమహర్షణం | అసై#్త్రశ్చిచ్ఛేదమాతంగీ మదవిహ్వలితంరివుం || 84 ||

సో7పి దైత్యః తతస్త స్యాబాణ నైకేన వక్షసి | అసావపిత్రిశూలేన ఘాతితః కశ్మలంగతః || 85 ||

ముష్టిభిశ్చైవతాందేవీం సో7పి తాడయతే7సురః | సో7పి దేవ్యాతతః శీఘ్రం నాగపాశేన యంత్రితః || 86 ||

తా || స్థాలీపాకమును చేసి, అప్పుడు శుభ##మైన వేదికలు చేసి, నాలుగు చేతులతో, కలశములు ధరించి, నాగ పాశములు కలవారై (71) నారు. పిదప ద్విజులు శుభ్రమైన వేదమంత్రమును చదువుతున్నారు. తిరుగుతున్న దంపతులను తటినట్లుగా చుట్టిఉన్న (72) ఆ బాడబులు, బ్రహ్మతోకూడి అక్కడ బాగా ఆనందించారు. తార స్వరముగా ధ్వనించగా వేదనిర్ఘోష చేస్తున్నారు (73) గొప్పనైన ఆ శబ్దంతో ఆకాశమంతా నిండిపోయింది. బ్రాహ్మణులు చేసే ఆ వేద ధ్వనిని, ఘోరమైన ఆదానవుడు విని (74) ఆసనము నుండి వెంటనే లేచాడు. చైతన్యముకోల్పోయి సైన్యంతోకూడి, పరుగెత్తుతున్న భృత్యులందరితో, ఇతరమైన వారితోను ఆతడిట్లా అన్నాడు (75) బాడబుల నుండి పుట్టిన ఈ శబ్దము ఎక్కడుందో వినండి, ఆతని ఆ మాటను విని దైతేయులు త్వరగా వెళ్ళారు. (76) విభ్రాంతచేతస్కులై అందరు ఇటుఅటు పరుగెత్తారు. కొందరు ధర్మారణ్యమునకు వెళ్ళారు. అక్కడ ద్విజాతులు కన్పించారు (77) ఓ నృప! వివాహసమయమందు వారు వేదములను చదువుతున్నారు. దురాత్ముడైన కర్ణాటునకు అంతా నివేదించారు (78) దానిని విని రక్తంవలె ఎర్రనైన కళ్ళు గలవాడై, ఓ మహాభాగ! (79) ఆకాశంలో ఉండి అప్పుడు ఆ రాక్షసుడు దైత్యమాయను చేస్తూ, సర్వాలంకారములతో కూడిన దంపతులను హరించాడు, ఓరాజ! (80) అప్పుడు ఆ బాడబులందరు కలిసి భువనేశ్వరిని చేరి, బుంబుం అని శబ్దిస్తూ రక్షించు, రక్షించు అని పలికారు (81) దానిని విని విశ్వజనని, మాతంగి, భువనేశ్వరి సింహనాదంచేస్తూ త్రిశూల శ్రేష్ఠమును ధరించి (82) వచ్చింది. అప్పుడు దేవికి కర్ణాటునకు యుద్ధం ఆరంభ##మైంది. ఋషులు వణిజులు, బ్రాహ్మణులు చూస్తున్నారు (83) చూస్తుండగా రోమహర్షకమైన సంకులసమరము జరిగింది. మదవిహ్వలుడైన రివువును మాతంగి, అస్త్రములతో ఛేదించింది (84) ఆ రాక్షసుడు కూడా ఒక బాణంతో ఆమె పక్షఃస్థలమందు కొట్టాడు. వాడుకూడా, ఆమె త్రిశూలంతో కొట్టగా ఇంద్రియ వైకల్యమును పొందాడు. (85) ఆ దేవిని వాడు పిడికిళ్ళతో ఆ రాక్షసుడు కొట్టసాగాడు. వానిని దేవి త్వరగా నాగపాశంతో బంధించింది (86).

మూ || తతోస్తేనైవ దైత్యేన గరుడాస్త్రం సమాదధే | తయానారాయణాస్త్రంతు నందధేశరపాతనం || 87 ||

ఏవమన్యోస్యమాకృష్‌యయుధ్యమానౌజయేచ్ఛయా | తతః పరిఘమాదాయ ఆయసందైత్యపుంగవః || 88 ||

మాతంగీం ప్రతి సంక్రుద్ధో జఘాన పరవీరహా | దేవీక్రుద్ధాముష్ఠి పాతైః చూర్ణయామానదానవం || 89 ||

తేనముష్ఠి ప్రహారేణ మూర్ఛితోని పపాతహా | తతస్తు సహసోత్థాయ శక్తిం ధృత్వాకరేముదా || 90 ||

శతఘ్నీం పాతయామాస తస్యాఉపరిదానవః | శక్తించిచ్ఛేద సాదేవీ మాతంగీచ శుభాననా || 91 ||

జహాసోచ్చైస్తుసానుభ్రూః శతఘ్నీం వజ్రసన్నిభా | ఏవమన్యోన్య శస్త్రౌఘైరర్దయంతే పరస్పరం || 92 ||

తతస్త్రి శూలేన హతో హృదయేని పపాతహ | మూర్చాంవిహాయ దైత్యో7సౌమాయాం కృత్వాచరాక్షసీం || 93 ||

పశ్యతాంతత్ర తేషాంతు అదృశ్యో7భూస్మహాసురః | వపౌపానం తతోదేవీ జహాసారుణలోచనా || 94 ||

సర్వత్రగం తంసాదేవీ త్రైలోక్యే సచరాచరే || 95 ||

క్వపాస్య సీతిబ్రూతేసా బ్రూహిత్వం సాంప్రతంహిమే | కర్ణాటక మహాదుష్ట ఏహిశీఘ్రంహి యుధ్యతాం || 96 ||

తతో7భవస్మహా యుద్ధం దారుణంచ భయానకం | వపౌదేవీతుమైరేయం పధార్థం సుమహాబలా || 97 ||

మాతంగీచతతః క్రుద్ధావక్త్రేచిక్షేపదానవం | తతో7పి దానవో రౌద్రోనాసారంధ్రేణ నిర్గతః || 98 ||

యుధ్యతేసపునర్దైత్యః కర్ణాటోమరపూరితః | తతోదేవీ ప్రకుపితా మాతంగీమదపూరితా || 99 ||

దశ##నైర్మధయిత్వాచ చర్వయిత్వాపునః పునః | శవాస్థిమేధసాయుక్తం మజ్జా మాంసాదిపూరితం || 100 ||

సఖరోమాభిసంయుక్తం ప్రక్షిప్యచోదరే7సురం | కరేకేణముఖం రుద్థం కరేణౖకేననాసికాం || 101 ||

తతోమహాబలోదైత్యః కర్ణరంధ్రేణ నిర్గతః | తతస్తయామహాదేవ్యానామచక్రేతదాభువి || 102 ||

కర్ణరంధ్రప్రయాతో7యం కర్ణాటేతి విదుర్బుధాః | పునర్యుద్థార్థమాయాతో దైత్యోహి బలదర్పితః || 103 ||

తా || అప్పుడు ఆదైత్యుడు గరుడాస్త్రాన్ని సంధించాడు. ఆమె శరీరమును పడవేసే నారాయణాస్త్రమును సంధించింది (87) ఈ విధముగా ఒకరినొకరు ఆకర్షించి జయంకలగాలనే కోరికతో యుద్ధం చేయసాగారు. పిదప దైత్యపుంగవుడు ఉక్కుతో చేసిన గదను తీసుకొని (88) పరవీరులను సంహరించేవాడు మాతంగిపై కోపగించినవాడై కొట్టాడు. కోపగించిన దేవి పిడికిలి దెబ్బలతో రాక్షసుని పొడిపొడి చేసింది (89) ఆముష్టి ప్రహారములతో మూర్ఛితుడై పడిపోయాడు. పిదప త్వరగాలేచి సంతోషంతో చేతశక్తిని ధరించి (90) ఆమెపై దానవుడు శతఘ్నిని విసిరాడు. ఆ శుభానన మాతంగి, ఆదేవి, శక్తిని ఛేదించింది (91) ఆ సుభ్రవు గట్టిగా నవ్వింది. వజ్రసన్నిభ ఆమె శతఘ్నని నశింపచేసేసింది. ఈ విధముగా పరస్పరము శస్త్రముల గుంపులతో పరస్పరము పీడించుకోసాగారు (92) పిదప త్రిశూలంతో కొట్టగా అది హృదయంలో తగిలింది. ఆ రాక్షసుడు మూర్ఛనుండి తేరుకొని రాక్షసమాయచేశాడు (93) అక్కడ చూస్తున్న వారికి ఆ మహాసురుడు కన్పించకుండా పోయాడు. పిదప దేవి పానము సేవించింది. ఎర్రని కళ్ళతో నవ్వింది (94) ఆదేవి సచరాచరమైన త్రిలోకములందు, అంతట ఉన్న ఆతనిని (95) ఎక్కడ దాక్కున్నావు. ఎక్కడున్నావు. అని అడుగుతోంది. నీవిప్పుడు నాకు సమాధానం ఇవ్వు అని అంది. కర్ణాటక మహాదుష్ట త్వరగారా యుద్ధం చేయి అని అంది (96) ఆ పిదప దారుణము, భయానకముఐన మహాయుద్ధము జరిగింది. సుమహాబల ఆమె ఆ రాక్షసుని చంపేకొరకుమై రేయమును (చెరుకు రసవుకల్లు) తాగింది (97) ఆపిదప మాతంగి కోపంతో ఆ రాక్షసుని నోట్లో పెట్టుకుంది. ఆ పిదప దానవుడు రౌద్రుడై ఆమె నాసారంధ్రము నుండి బయటికొచ్చాడు (98) మదపూరితుడై ఆ దైత్యుడు కర్ణాటుడు తిరిగి యుద్ధం చేశాడు. ఆ పిదప మదపూరితమైన మాతంగిదేవి కోపగించి (99) పళ్ళతో బాగా కొరకి మాటిమాటికి నమిలింది. శవము, ఎముకలు, మేధస్తు వీటితోకూడిన, మజ్జ మాంసాదులతో నిండిన (100) నఖరోమములతో కూడిన అసురుని ఉదరమందుంచుకుంది. వాని ఓ చేతితో నోరు నిండిపోయింది. ఒక చేతితో నాసిక భాగము అడ్డగింపబడింది (101) పిదప మహాబులడైన తైత్యుడు కర్ణరంధ్రము నుండి బయటికొచ్చాడు. ఆ పిదప ఆ మహాదేవి భూమిపై వానికి ఇట్లా పేరు పెట్టింది. (102) కర్ణరంధ్రము నుండి వచ్చాడు కనుక వీడు కర్ణాటుడు అని విజ్ఞులు తెలుసుకోవాలి అని. ఆ దైత్యుడు బల దర్పితుడై తిరిగి యుద్ధం కొరకు వచ్చాడు (103).

మూ || గర్జమానోసురస్తత్రసాయుధో యుధిసంస్థితః | తందృష్ట్వాదుః సహందైత్యంవిమృశ్చచపునఃపునః|| 104

వధోపాయంహిమాతంగీ చింతయా మాసభారత | యదాచింతయతే దేవీ మాతంగీ మదపూరితా || 105 ||

మాయారూపం సమాస్థాయ కర్ణాటఃకుసుమాయుథః | గౌరశ్చాంబుజ పత్రాక్షస్తథాషోడశవార్షికం || 106 ||

అభ్యేత్య దేవీం బ్రూతేస్మ మాంత్వం పరయశోభ##నే || 107 ||

సాధుచేదం త్వయాప్రోక్తం దైత్యరాజసునిశ్చితం | రూపేణ సదృశోనాన్యో విద్యతే భువనత్రయే || 108 ||

ప్రతిజ్ఞామే కృతాపూర్వం శ్రుతా కి మసురోత్తమ | మమానుజా శుభాశ్యామా వివాహె విప్రకాంక్షిణీ || 109 ||

పిత్రామే స్థాపితా దైత్య రక్షార్థంహి ద్విజన్మనాం | కేవలం శ్యామలాంగీసా సర్వలోకహితావహా || 110 ||

నకశ్చిద్వరయేత్‌ కన్యామిత్యుక్త్వా స్థాపితాతుసా | కథయాశుతవ శుభం శ్రుత్వోపాయం కథం శుభం || 111 ||

భగినీమేస్తి దైత్యేంద్ర శ్యామలాహ్య పరిగ్రహా | తవార్థం రక్షితా శూరతాంచ పూర్వేణచోద్వహ || 112 ||

సపితాతాం మహావీరదాస్యతే వైశుభామిమాం | గచ్ఛత్వం వ్రియతాంహ్యెవశ్యామలా కోపసంయుతా || 113 ||

తతః కర్ణాటకః క్రుద్ధోగృహీత్వాశక్తి మూర్జితాం | అభ్యధావత దుష్టాత్మా శ్యామలాని ధనేచ్ఛయా || 114 ||

ఆగతంచా సురందృష్ట్వా శ్యామలాసుమహామనాః | వివాహార్థం పరం జ్ఞాత్వా7భిప్రాయందుష్టచేతసః || 115 ||

మహాయుద్ధమభూత్తత్ర శ్యామలాసుర వర్యయోః | మాసత్రయం తతోరాజంశ్చా భవత్తు ములంక్షితౌ || 116 ||

మాఘేకృష్ణతృతీయాయాం ధర్మారణ్య మహారణ | మధ్యాహ్న సమయే భూపకర్ణాటాఖ్యోనిపాతితః || 117 ||

కార్ణాటిః పతితస్తత్రయత్రదేవ్యాని పాతితః | తచ్ఛైలశృంగ ప్రతిమం పపాతశిర ఉత్తమం || 118 ||

చచాల సకలా పృథ్వీసాబ్థి ద్వాపాస పర్వతా | తతోవిప్రాః ప్రహృష్టాస్తే జయమాతరుదైరయన్‌ || 119 ||

జగుః గంధర్వ పతయోన నృతుశ్చాప్సరోగణాః | తతోత్సవం ప్రకుర్వంతో గీతం నృత్యం శుభప్రదం || 120 ||

పాయసైః వటకైశ్చైవ నైవేద్యైః మోదకైస్తథా | తుష్టువుః శుభవాణ్యాతే స్థానేమోటేరకే వరే || 121 ||

తా || అక్కడ అసురుడు గర్జిస్తూ ఆయుధములు ధరించి యుద్ధమందు నిల్చున్నాడు. దుఃసహుడైన ఆ దైత్యుని చూచి మరలమరల ఆలోచించి (104) మాతంగి ఆతని వధోపాయమును ఆలోచించసాగింది. ఓ భారత! దేవి మాతంగి మదపూరితమై ఆలోచిస్తుండగా (105) ఆ కర్ణాటుడు మాయా రూపమును ధరించి, కుసుమాయుధుడై, తెల్లని వర్ణుడై, అంబుజ పత్రముల వంటి కళ్ళుగలవాడై, పదహారు సంవత్సరముల వయసు కలవాడై (106) దేవి దగ్గరకు వచ్చి ఇట్లన్నాడు. ఓ శోభన! నీవు ననను వరించు అని (107) శ్రీ మాత వచనము - నీవు ఇప్పుడు చెప్పింది బాగుంది. దైత్యరాజ! ఇది సునిశ్చితము. భువనత్రయమందు నీరూపంతో సమానమైనవాడు మరొకడులేడు. (108) ఓ అసురోత్తమ! నేను పూర్వము ప్రతిజ్ఞ చేశాను దానిని విన్నావా. నాచెల్లెలు శుభ##యైనది. శ్యామ(పేరు) విప్రుణ్ణి వివాహం చేసుకో దలిచింది. (109) ఆమెను బ్రాహ్మణుల రక్షణ కొరకు మానాన్న ఉంచాడు. ఓ దైత్యుడ! ఆమె కేవలము శ్యామలాంగి. సర్వలోకములకు హితము కోరేది (110) ఆ కన్యను ఎవరూ వరించరాదని ఆమెను ఏర్పరచాడు. నీశుభాన్ని త్వరగా చెప్పు. నీ ఉపాయం విన్నాను. ఎంత శుభ##మైంది. (111) నా భగిని ఉంది. ఓ దైత్యేంద్ర. శ్యామల అని పేరుగలది. స్వీకరించతగినది. ఓశూర! నీ కొరకు రక్షించాను. ఆమెను మొదట వివాహమాడు (112) ఆ తండ్రి ఆమెను నీకిస్తాడు. ఓ మహావీర! శుభ##మైన ఈమెను నీవు వరించు వెళ్ళు అనగా శ్యామల కోపంగలదైంది (113) అప్పుడు కర్ణాటకుడు క్రోధుడై, గట్టిదైన శక్తిని తీసుకొని, ఆదుష్టాత్ముడు శ్యామలను చంపే కొరకు పరుగెత్తాడు (114) వచ్చిన అసురుని చూచి శ్యామల, సుమహా మనస్సు గలదై, ఆ దుష్టచేతసుడు వివాహం కొరుకు వస్తున్నాడని ఆతని అభిప్రాయమును గ్రహించింది (115) అక్కడ శ్యామలకు, అసురవరునకు గొప్ప యుద్ధం జరిగింది. ఓరాజ! ఈ భూమియందు మూడు నెలలు సంకుల సమరం జరిగింది (116) మాఘమాసం కృష్ణ తృతీయనాడు ధర్మారణ్యమందు గొప్ప యుద్ధమున మధ్యాహ్న సమయమందు కర్ణాటనువాడు పడవేయబడ్డాడు, ఓ భూప! (117) దేవి ఎక్కడ పడవేసిందో అక్కడ కర్ణాటుడు పడ్డాడు. వాని ఉత్తమమైన తల పర్వత శిఖరమువలె పడింది (118) భూమి అంతా, సముద్రములు, ద్వీపములు, పర్తములతో సహకంపించింది. ఆ పిదప బ్రాహ్మణులు సంతుష్టులై, ఓమాత నీకు జయము అని పలికారు (119) గంధర్వపతులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. పిదప ఉత్సవం చేస్తూ శుభప్రదమైన గీత నృత్యములు చేశారు (120) పాయసములతో, వడియాలతో, మోదకములతో, నైవేద్యములతో, మంచి మాటలతో స్తుతించారు. వరమైన మోటేరక స్థానమందు వారు స్తుతించారు (121).

మూ || శ్రీమతీ పూజితా సాచ సుతసౌఖ్యధన ప్రదా | మహోత్సవేచ సంప్రాప్తే మాతంగీ పూజనం హితం || 122 ||

యే7ర్చయంతి స్థాపమిత్వా ధనపుత్రార్థసిద్ధమే | సుఖంకీర్తింతథాయుష్యంయశఃపుణ్యంసమాప్నుయుః || 123 ||

వ్యాధయో నాశమాయాంతి చొదిత్యాద్యా గ్రహాః శుభాః | భూతవేతాల శాకిన్యోజంభాధ్యాః పీడయన్తిన || 124 ||

నజాయతే తథా క్వాపిప్రేతా దీనం ప్రపీడనం | తతోవిప్రాః ప్రహృష్టాశ్చ స్తుతిం కర్తుం సముద్యతాః || 125 ||

శ్రీమాతాం చైవశక్తీశ్చ మాతంగీ మస్తువం స్తదా | శ్యామలాంచ మహాదేవం హర్షేణ మహతాయుతా || 126 ||

విప్రా ఊచుః -

మాతస్త్వమేవ మస్మాకం రక్షికా స్థానకేభవ | దంపతీనాంహితార్థాయ యథానోద్విజతేద్విజాః || 127 ||

మాంతగ్యువాచ -

తుష్టాహం వో మహాభాగాః స్తవేనానేనవోద్విజాః | వరయధ్వం వరం యద్వోమనసాస మభీప్సితం || 128 ||

బ్రాహ్మణా ఊచుః-

దాస్యామహె బలిందే వియస్తేమనసివర్తతే | అస్మాకంచైవదంపత్యోః రక్షార్థంత్వం స్థిరాభవ || 129 ||

దేవ్యువాచ -

స్వస్థాః సంతు ద్విజాః సర్వేనచపీడా భవిష్యతి | మయిస్థితా యాం దుర్థర్షాదైత్యాయే7న్యే చరాక్షసాః || 130 ||

శాకినీ భూతప్రేతాశ్చ జంభాద్యాశ్చ గ్రహాస్థథా | శాకిన్యాది గ్రహాశ్చైవ సర్పావ్యాఘ్రాదయస్తధా || 131 ||

పీడయిష్యంతినక్వాపి స్థితాయాం మయిశాసనే | మహోత్సవం యః కురుతే వివాహె సముపస్థితే || 132 ||

దంపత్యోశ్చహితార్థంహి పూజయేన్మాం సదాసరః | తస్యాహం సకలాంబాధాంనాశయిష్యామ్య సంశయం || 133 ||

నాధయోవ్యాధయశ్చైవ నక్లేశోనచ సంభ్రమః | ప్రాప్యతే పరమం సౌఖ్యం యశః పుణ్యం ధనం సదా నాకాలే మరణం తస్య వాతపిత్తాదికంనహి || 134 ||

విప్రాఊచుః -

కేనవా విధినా పూజా నైవేద్యంకీ దృశం భ##వేత్‌ | ధూపంచ కీదృశం మాతః కథంపూజాం ప్రకల్పయేత్‌ || 135 ||

తా || శ్రీమతిని పూజిస్తే ఆమె సుతసౌఖ్య ధనములను ఇస్తుంది. మహోత్సవము వచ్చినప్పుడు మాతంగిని పూజించటం మంచిది (122) ఆమెను స్థాపించి, ధనపుత్ర అర్ధసిద్ధి కొరకు పూజించేవారు సుఖమును, కీర్తిని, ఆయుష్యమును, యశస్సును, పుణ్యమును పొందుతారు (123) వ్యాధులు నశిస్తాయి. ఆదిత్యాది గ్రహములు శుభప్రదమౌతాయి. భూతవేతాళ శాకినులు జంభాదులు (రాక్షసులు) పీడించరు (124) ప్రేతాదుల పీడనము ఎక్కడా కలుగదు. అప్పుడు విప్రులు ఆనందపడి స్తోత్రము చేయటము ఆరంభించారు (125) శ్రీ మాతను, శక్తులను, మాతంగిని స్తుతించారు. మహాఆనందంతో కూడినవారై మహాదేవిని శ్యామలను స్తుతించారు (126) బ్రాహ్మణులిట్లన్నారు - ఓమాత! నీవీ విధముగా మాకు రక్షకురాలివి. స్థానకమందు ఉండు. దంపతుల హితము కొరకు, బ్రాహ్మణులు ఉద్వేగం పొందకుండా ఉండేందుకు ఇక్కడ ఉండు. (127) అని. మాతంగి వచనము - ఓ మహాభాగులార! ఓ ద్విజులార! ఈమీస్తవంతో మీవిషయంలో నేను సంతుష్టు రాలనైనాను. మీ మనస్సునకు నచ్చిన వరాన్ని కోరండి. (128) బ్రాహ్మణులిట్లన్నారు - ఓదేవి! నీ మనస్సులో ఏం ఉందో, దానిని బలిగా ఇస్తాము. మా దంపతుల రక్షణ కొరకు నీవు స్థిరంగా ఉండు (129) అనగా దేవి వచనము - ద్విజులందరు సుఖంగా ఉండండి. మీకు పీడకలుగదు. నేనుండగా దుర్ధర్షులైన రాక్షసులు కాని ఏ ఇతర దైత్యులుకాని (130) శాకిని భూతప్రేతములుకొని జంభాదులు గ్రహాలు కాని శాకిన్యాది గ్రహాలు కాని సర్పములు, వ్యాఘ్రాదులుకాని (131) నేను శాసిస్తుండగా ఎక్కడ పీడించవు. వివాహం వస్తే మహోత్సవ మాచరించాలి. (132) దపంతుల హితము కొరకు నరుడ! ఎప్పుడూ నన్ను పూజించాలి. ఆతని సకల బాధలను నేను నశింపచేస్తాను. అనుమానము లేదు (133) ఆధులు (మనో వ్యధలు) వ్యాధులు (శారీరకమైనవి) ఉండవు. క్లేశము కాని తొట్రుపాటుకాని ఉండవు. పరమ సౌఖ్యమును, యశస్సు, పుణ్యము, ధనము వీటిని ఎల్లప్పుడు పొందుతాడు. ఆతనికి అకాల మరణముండదు. వానికి వాతపిత్తాదికములు ఉండవు. (134) విప్రుల వచనము - ఏవిధి ప్రకారము పూజ చేయాలి. నైవేద్యము ఎట్టి దుండాలి. ఓతల్లి! ధూపం ఎట్లా ఉండాలి. పూజను ఎట్లా ఏర్పరచాలి (135) అనగా -

మూ || శ్రీదేవ్యువాచ -

శ్రూయతాం మేవచో విప్రా పత్రేచైవ హిరణ్మయే | లిఖిత్వాపూజయే ద్యస్తు చిరాయుర్దంపతీ భ##వేత్‌ || 136 ||

అథవారాజతే పత్రే కాంసపత్రే7ధవాసేపః | అష్టాదశ భుజాదేవీ చందనేన విచర్చితా || 137 ||

శూర్పం శ##రైః కరేశ్వాసం పద్మంతు పరమంపునః | కర్తరీం కారయే దేకాం తూణీరంచ ధనూంషిచ || 138 ||

చర్మపాశం ముద్గరంచ కాంసాలంతో మరంతథా | శంఖం చక్రం గదాం శుభ్రాం ముశలంపరిఘంశుభం || 139 ||

ఖట్వాంగం బదరీం చైవ అంకుశంచ మనోరమం | అష్టాదశాయుధైరేభిః సంయుతా భువనేశ్వరీ || 140 ||

లిఖేత్సకుండలాం దేవీం బాహునూపురభూషితాం | కేయూర ముక్తా పద్మైశ్చ ముండమాలాభిరన్వితాం || 141 ||

మాతృకాక్షర పరివృతాం అంగులీయక సంయుతాం | నానాభరణ శోభాఢ్యాం లిఖిత్వాభునవేశ్వరీం || 142 ||

మాతంగీమితి విఖ్యాతం ప్రతిష్ఠార్థం ద్విజోత్తమాః | చందనేన చహృద్యేన పుషై#్పశ్చైవ ప్రపూజయేత్‌ || 143 ||

యక్షకర్దమమానీయ మాతంగీం పూజయే త్సుధీః | ఘృతేన బోధయే ద్దీపం సప్తవర్తియుతం శుభం || 144 ||

ధూపయేద్గుగ్గులేనాథ సాజ్యేనాతి సుగంధినా | నాలికేరేణ శుఁభేణ దద్యాదర్ఘంచ దంపతీ || 145 ||

ప్రదక్షిణాః ప్రకుర్వీత చతురః సుమనోరమం | వస్త్రాం శుకం గుంఠయిత్వా అగ్రేకృత్వాచ దంపతీ || 146 ||

ప్రోక్షిణీ కృత్య మాతంగ్యాః ప్రాశ్య మాధ్వీకముత్తమం | గీతవాదిత్రనిర్ఘోషైః మాతంగీం పూజయేత్సుధీః || 147 ||

సువాసినీస్తుత ద్రూపామాతంగీ సంభవా ఇతి | నృత్యంతీ దంపతీచాగ్రే సర్వోపద్రవశాంతయే || 148 ||

నైవేద్యం వివిధాన్నేన అష్టాదశ విధం శుభం | వటకాపూపికాః శుభ్రాః క్షీరం శర్కరయా యుతం || 149 ||

బల్లాకరం పరం యూపాక్షి ప్తకుల్మాషకంతథా | సోహాలికాభిన్నవటాలాప్సికా పద్మచూర్ణకం || 150 ||

శైవేయా విమలాస్తత్ర పర్పటాః శాలకాదయః | పూరణం తస్యమాసస్య కుర్యాచ్ఛుభ్రం మనోరమం || 151 ||

రాజమాషాఃసూపచితాః కల్పయేత్తత్ర దంపతీ | ఫేణికారోపి కాస్తత్ర కుర్యాచ్చైవ మనోరమాః || 152 ||

ఏతాన్యష్టా దశాన్యాని పక్వాన్నాని ప్రకల్పయేత్‌ || 152 1/2 ||

తా || శ్రీ దేవి వచనము - ఓ విప్రులార! నామాట వినండి. బంగారు మయమైన ఆకుయందు దేవి రూపంరాసి పూజించినవారు దంపతులు చిరాయువులౌతారు (136) లేదా వెండి పాత్రలోగాని లేదా కాంస్యపాత్రలోగాని పదునెనిమిది భుజములు గల దేవిని వ్రాయాలి. ఆమె ఒంటినిండా చందనం పూయాలి. (137) చాట, బాణములు, చేతియందు శ్వానము, పద్మము శ్రేష్ఠము, ఒక కత్తెర చేయించాలి. అమ్ములపొది ధనుస్సులు (138) డాలు, పాశము, గద కాంస్యంతో చేసింది, చర్లకోల, శంఖము, చక్రము, శుభ్రమైన గద ముసలము, శుభ##మైన గడియ (వంటిది) (139) ఖట్వాంగము, బదరి, మనోరమమైన అంకుశము ఈ పద్దెనిమిది ఆయుధములతో భువనేశ్వరి కూడి ఉంది (140) ఆ దేవికి కుండములుండేట్లు దించాలి, బాహునూపురములు కలదిగా చిత్రించాలి. కేయూర ముక్తా పద్మములు, ముండమాల కలదానినిగా చిత్రించాలి. (141) మాతృకాక్షరంతో చుట్టబడింది. అంగుళీయకములతో కూడి ఉంది. రకరకాల ఆభరణముల శోభతో కూడింది. ఈవిధముగా భునేశ్వరిని చిత్రించి (142) ద్విజోత్తములార! ప్రతిష్ఠ కొరకు మాతంగి అని ప్రసిద్ధిని కల్గించండి. హృద్యమైన చందనముతో పుష్పములతో పూజించాలి (143) బుద్ధిమంతుడు యక్షకర్దమమును తెచ్చి మాతంగిని పూజించాలి. (144) గుగ్గిలంతో ధూపం వేయాలి. మంచి వాసన గల నేయితో దీపం పెట్టాలి. దంపతులు శుభ్రమైన నాలికేర నీరంతో అర్ఘ్యమివ్వాలి (145) సుమనోరమమైన దేవతలకు నాలుగు ప్రదక్షిణలు చేయాలి. వస్త్రపు ఉత్తరీయమును కప్పుకొని దంతులు నిలబడి (146) మాతంగి యొక్క ఉత్తమమైన మాధ్వీకమును (ఇప్పపువ్వుకల్లు) ప్రోక్షించుకొని, పానముచేసి, సుధీయుతుడు గీతవాదిత్రముల ధ్వనులతో మాతంగిని పూజించాలి (147) సువాసినులు ఆ రూపములే మాతంగీ సంభవులు అని పూజించాలి. ఎదురుగా దంపతులు నృత్యం చేయాలి. సర్వ ఉపద్రవముల శాంతి కొరకు (148) రకరకాల అన్నములతో నైవేద్యములు ఇవ్వాలి. పద్దెనిమిది రకముల శుభ##మైన నైవేద్యములు ఇవ్వాలి. శుభ##మైన వడియాలు, అప్పాలు, పాలు చెక్కర గలవి (149) వరమైన బల్లాకరము, యూపములు, వేయించిన గుగ్గిళ్ళు, సోహాలి, భిన్నవటము, లాప్సికము, పద్మచూర్ణకము (150) శైవేయములు, విమలములు, పర్పటములు, శాలకాదులు, శుభ్రమైన మనోరమమైన ఆమాసమునకు చెందిన పూరణము చేయాలి (151) బాగా పండిన అలచంతలు అక్కడ దంపతులు ఏర్పరచాలి. పేణిలు, రోపికలు మనోరమమైనవి అక్కడ చేయాలి. పేణిలు, రోపికలు మనోరమమైన అక్కడ చేయాలి. (152) ఈ పదునెనిమిది ఇతరమైన పక్వ అన్నములు ఏర్పరచాలి || 152 1/2 ||.

మూ || ఆజ్యశర్కరాయుక్తానియుక్తానిశాకసంచయైః || 153 ||

రాత్రౌజాగరణం కార్యం సువాసినీంచ పూజయేత్‌ | ముఖావలోకసం చాజ్యే కుర్వీయాతాంచ దంపతీ || 154 ||

పరస్పరంహి కుర్వీత ఉత్పాత పరిశాంతయే | ఏవం విధంమయాఖ్యాతం మాతంగీపూజసంశుభం || 155 ||

నపూజయతియోమూఢః తస్యవిఘ్నం కరోతిసా | దంపత్యోర్మరణంచాథ ధననాశం మహాభయం || 156 ||

క్లేశం రోగంతథా వహ్నెః ప్రాదుర్భావం ప్రపశ్యతి | ఏతస్మాత్కారణాద్విప్రా మాతంగీం పూజయేత్సుధీః || 157 ||

దంపతీనాంచసర్వేషాం ద్విజాతీనాంచశాసనే | వణిజాంచ మహాదేవీ నిర్విఘ్నం కురుతే సదా || 158 ||

తథేతి చైవతైరుక్తే పునర్వచనమ బ్రవీత్‌ | శ్రూయతాం బ్రాహ్మణాః సర్వేవివాహాది మహోత్సవం || 159 ||

మదీయవచనం శ్రుత్వాతథా కురుతవైవిధిం | వివాహకాలే సంప్రాప్తే దంపత్యోః సౌఖ్యహెతవే || 160 ||

నిర్విఘ్నార్థంతుకర్తవ్యం నిజైశ్చసహసేవకైః | అంజనంస యనే కుర్యాత్‌ సంబంధినాంచ సర్వశః || 161 ||

భ్రూమధ్యాత్తు ప్రకర్తవ్యం అర్థచంద్ర సమాకృతి | బిందుంతు కారయేద్విప్రాః తస్యో పరిమనోహరం || 162 ||

ఏవం కృతేతదా విప్రాః శాంతిర్భవతి నాన్యథా |

పుత్రవృద్ది కరంచైతత్తి లకంచార్థబింబకం | సర్వవిఘ్నహరం సర్వదౌః స్థ్యవ్యాధి వినాశనం || 163 ||

వ్యాస ఉవాచ -

తతఃశాంతాః ప్రజాః సర్వాః ధర్మారణ్యన రాధిప | ప్రసాదాచ్చైవ మాతంగ్యాః దేవ్యావై సత్యమందిరే || 164 ||

తతోహృష్ట హృదావిప్రాఃప్ర పూజుస్తే విధేః సుతాం | మాతంగ్యాశ్చ ప్రకర్తవ్యం వర్షే వర్షేచ పూజనం || 165 ||

మాఘిసితే తృతీయాయాం భక్ష్యభోజ్యాదిభిస్తధా | కర్ణాటస్య తథోత్పత్తిః పునర్జాతాతుభూతలే || 166 ||

భయాచ్చైవహితత్థ్సానం త్యక్తాయామ్యమగాత్తతః | గచ్ఛమానస్తదా దైత్యో యక్ష్మరూపోహ్యభాషత || 167 ||

శ్రూయతాంభోద్విజాః సర్వేధర్మారణ్యనివాసినః | వణిజశ్చ మహచ్చేదం మద్వాక్యం పరిపాల్యతాం || 168 ||

మాఘమాసేహి మత్ర్పీత్యా నిర్విఘ్నార్థం సదాభువి | త్రిదలేన చధాన్యేన మూలకేన విశేషతః || 169 ||

తిలతైలేన వాకుర్యాత్‌ పురుషోని యతవ్రతః | ఏకాశనంహి కురుతే యక్ష్మప్రీత్యై నిరంతరం || 170 ||

తా || నేయి, శర్కరతో కూడినవి, శాకములతో కూడినవి (153) ఏర్పరచాలి. రాత్రి జాగరణ చేయాలి. సువాసినిని పూజించాలి. నేయి యందు దంపతులకు ముఖావలోకనము చేయించాలి. (154) ఉత్పాత పరిశాంతి కొరకు పరస్పరము అట్లా చేయాలి. ఈ విధముగా శుభ##మైన మాతంగి పూజను నేను చెప్పాను (155) పూజించని వారికి ఆమె విఘ్నం కల్గిస్తుంది. దంపతుల మరణము, ధననాశము మహాభయము (158) క్లేశము, రోగము, అగ్గిపుట్టటము వంటివి చూస్తాడు అందువల్ల బుద్ధిమంతులైన విప్రులు మాతంగిని పూజించాలి (157) బ్రాహ్మణుల శాసనంతో దంపతులందరికి వణిజులకు మహాదేవి ఎల్లప్పుడు విఘ్నాలు లేకుండా చేస్తుంది (158) వాళ్ళు అట్లాగే అని అన్నాక మళ్ళీ ఇట్లా పలికింది. ఓ బ్రాహ్మణులార! మీరంత వివాహాది మహోత్సవమును గూర్చి వినండి. (159) నామాటను విని అట్లాగే విధానమాచరించండి. వివాహకాలమురాగా దంపతుల సుఖముకొరకు (160) నిర్విఘ్నము కొరకు తన సేవకులతో కూడి ఆచరించాలి. సంబంధీకులందరికి కళ్ళకు కాటుక పెట్టాలి (161) (భూమధ్య మందు అర్ధచంద్రునితో సమానమైన రూపాన్ని వ్రాయాలి. దానిపై మనోహరమైన బిందువును వ్రాయాలి (162) ఓ విప్రులార! ఇట్లాచేస్తే శాంతి లభిస్తుంది. మరోరకంగా రాదు. ఈ అర్ధబింబకమైన తిలకము పుత్రవృద్ధిని కల్గించేది. సర్వవిఘ్నములను తొలగించేది. సర్వదుఃస్థితులను వ్యాధులను నశింపచేసేది (163) వ్యాసుని వచనము - ఓ నరాధిప! ధర్మారణ్యమందలి ప్రజలందరు శాంతులైనారు. సత్యమందిర మందలివారు దేవియైన మాతంగి దయవల్ల శాంతులైనారు (164) పిదప, సంతోషించిన హృదయాలుగల విప్రులు, విధి సుతను పూజించారు. ప్రతివర్షమందు మాతంగి పూజను ఆచరించాలి (165) మాఘ కృష్ణమందు తృతీయ యందు భక్ష్యభోజ్యాదులతో పూజించాలి. కర్ణాటుని ఉత్పత్తి తిరిగి మళ్ళీ జరిగింది (166) భయంవల్ల ఆ స్థానమును వదలి దక్షిణ దిశకు వెళ్ళాడు. వెళ్తూవెళ్తూ ఆదైత్యుడు యక్ష్మరూపుడై మాట్లాడినాడు (167) ధర్మారణ్యమందున్న ఓద్విజులార! అంతా నామాట వినండి. వణిజులు కూడా వినండి. గొప్పదైన ఈ మాటను ఆచరించండి (168) మాఘమాసంలో నా ప్రీతి కొరకు భూమియందు ఎల్లప్ప్పుడు విఘ్నములు లేకుండా ఉండేందుకు త్రిదళధాన్యముతో విశేషించి మూలకములతో పూజించాలి. (169) పురుషుడు నియతవ్రతుడై నువ్వుల నూనెతోనైనా చేయాలి. నిరంతరము యక్ష్మప్రీతి కొరకు ఒంటి పూట భుజించాలి (170).

మూ || ఆబాల¸°వనేనైవ వృద్ధేనా పీహసర్వదా | వర్షేవర్షే ప్రకర్తవ్యం యక్ష్మణోవ్రత ముత్తమం || 171 ||

యస్మిన్‌ గృహెహియా వచ్చ పురుషాకారరూపిణః | తస్యాహ్వయం ప్రకుర్యుస్తే ఏకభక్తరతాః సదా || 172 ||

బాలస్యార్థేతుజననీ కురుతే వ్రతముత్తమం | పితావావ్యథవాభ్రాతాయన్నిమిత్తం వ్రతంచరేత్‌ || 173 ||

నచతస్యభయం క్వాపి నవ్యాధిః నచ బంధనం | భర్తుర్నిమిత్తే స్త్రీకుర్యాత్‌ అశ##క్తేత్వితరేణచ || 174 ||

ఏవం సమాదిశన్‌ దైత్యః సత్యమందిరముత్సృజన్‌ | గతో7సౌయామ్యదిగ్భాగ ఉదధేస్తీర ఉత్తమే || 175 ||

విపులందేహమాసాద్య కర్ణాటః సనరాధిప | స్వనామ్నాచైవ తందేశం స్థావయామానచోత్తమం || 176 ||

యస్మింశ్చసర్వవస్తూని ధనధాన్యాని భూదిశః | కర్ణాటదేశంతం రాజన్‌ పరివార్యచిరం స్థితః || 177 ||

ధర్మారణ్య కథాంపుణ్యం కథితాం సరసత్తమ | శ్రీమాతుశ్చైవ మాహాత్మ్యం శృణ్వంతి శ్రావయంతియే || 178 ||

తేషాంకులేకదాచిత్తు అరిష్టంనైవజాయతే | అపుత్రో లభ##తే పుత్రాన్‌ ధనహీనస్తు సంపదః ఆయురారోగ్యమైశ్వర్యం శ్రీమాతుశ్చ ప్రసాదతః || 179 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తీథీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే మాతంగీ కర్ణాటకోపాఖ్యాన వర్ణనం నామ అష్టాదశో7ధ్యాయః || 18 ||

తా || ఇక్కడ బాలురుకాని యువకులు కాని వృద్ధులు కాని అందరు ప్రతి సంవత్సరము యక్ష్మవ్రతమును ముఖ్యంగా చేయాలి (171) ఏ ఇంట్లో ఎంతమంది పురుషాకారరూపంలో ఉన్నారో వారు ఏక భక్తరతులై (ఒకపూట భోజనము) ఆతనిని ఆహ్వానించాలి (172) పిల్లవాని కొరకు తల్లి వ్రతం చేస్తుంది. లేదా తండ్రి అన్నలు చేస్తారు. ఎవని కొరకు వ్రతం చేస్తారో వానికి (173) భయముకాని రోగముకాని బంధనముకాని ఎక్కడా కలుగవు. భర్తకొరకు స్త్రీ ఆచరించాలి. ఆమెకు శక్తిలేకపోతే ఇతరులతో చేయించాలి (174) ఇట్లా ఆదేశించి దైత్యుడు సత్యమందిరం వదిలాడు. ఆతడు దక్షిణ దిక్కుగా వెళ్ళి ఉత్తమమైన సముద్రతీరమందు (175) ఓ నరాధివ! ఆ కర్ణాటుడు విశాలమైన దేహాన్ని పొంది ఆ ప్రదేశమును తన పేరుతోనే ఏర్పరచాడు (176) ఎక్కడైతే అన్ని వస్తువులు, అధికముగా ధనధాన్యములు ఉంటాయో దానిని ఆ కర్ణాటదేశమును చుట్టి చాలా కాలము ఉన్నాడు. ఓరాజ! (177) ఓనరసత్తమ! పుణ్యమైన ధర్మారణ్య కథను చెప్పాను. శ్రీమాత మాహాత్మ్యాన్ని ఎవరు వింటారో, ఎవరు వినిపిస్తారో (178) వాళ్ళకులంలో ఎప్పుడూ అరిష్టము కలుగదు. సంతానహీనులు సంతానవంతులౌతారు. ధనహీనులు సంపదను పొందుతారు. శ్రీమాత ప్రసాదము వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి. (179) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు మాతంగి కర్ణాటక ఉపాఖ్యాన వర్ణన మనునది పదునెనిమిదవ అధ్యాయము || 18 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters