Sri Scanda Mahapuranamu-3    Chapters   

సప్తమ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

స్వసైన్య మవలోక్యాథ మహిషోదానవేశ్వరః | హతం దేవ్యామహాక్రోధాత్‌ చండకోపమథాబ్రవీత్‌ || 1 ||

మహిష ఉవాచ -

చండకోపమహావీర్య యుద్ధ్యసై#్వనాందు రాత్మికాం | తథాస్త్వితి సచోక్త్వాథ చండకోపః ప్రతాపవాన్‌ || 2 ||

అవాకిరత్‌ బాణవర్షైః దేవీం సమరమూర్థని | బాణజాలనితస్యాశు చండకోపస్యలీలయా || 3 ||

ఛిత్వాజఘానశ##స్త్రేణ చండకోపస్యసాంబికా | చకర్తవాజినో7ప్యస్య సారధించధ్వజంధనుః || 4 ||

ఉన్మమాథ రథంచాపితంబాణౖః హృద్యతాడయత్‌ | సభగ్నధన్వావిరథోహతాశ్వోహత సారథిః || 5 ||

చండకోపస్తతో దేవీం ఖడ్గచర్మధరోzభ్యగాత్‌ | ఖడ్గేనసింహమాజఘ్నే దేవ్యావాహం మహాసురః || 6 ||

దేవీమపిభుజేసవ్యే ఖడ్గేన ప్రజఘానసః | ఖడ్గోదేవ్యాభుజే సవ్యేవ్యశీర్యత సహస్రధా || 7 ||

తతః శూలేన మహతా చండకోపం తదాంబికా | జఘానహృదయేసోzపి పపాతచ మమారచ || 8 ||

చండకోపేహతేతస్మిన్‌ మహావీర్యే మహాబలే | చిత్రభానుర్గజారూఢో దేవీంతా మభ్యధావత || 9 ||

దివ్యాంశక్తిం ససర్జాథ మహాఘంటారవాకులాం | న్యవారయతహుంకారైః దేవీశక్తిం నిరాకులాం || 10 ||

తతః శూలేన సాదేవీచిత్రభానుం వ్యదారయత్‌ | మృతేతస్మిన్‌తతో యుద్ధేకరాలో ద్రుత మభ్యగాత్‌ || 11 ||

కరముష్టి ప్రహారేణ సోzపి దేవ్యానిపాతితః | తతోదేవీమదోన్మత్తం గదయావ్యసుమాతనోత్‌ || 12 ||

బాష్కలం పట్టిశేనాపి చక్రేణాపి తథాంతికం | ప్రాహిణోద్యమలోకాయదుర్గాదేవీ ద్విజోత్తమాః || 13 ||

ఏవమన్యాన్మహాకాయాన్‌ మంత్రిణోమహిషస్యచ | శూలేన ప్రోథయిత్వాథ ప్రాహినోద్యమ సాదనం || 14 ||

ఆత్మసైన్యేహతేత్వేవం దుర్గయా మహిషాసురః | మాహిషే ణాథరూపేణ గణాన్‌ దేవ్యా అభక్షయత్‌ || 15 ||

తుండేననిజఘానైకాన్‌ ఖురాఘాతైః తథాపరాన్‌ | నిశ్వాసవాయుభిశ్చాన్యాన్‌ పాతయామానరోషితః || 16 ||

దేవ్యాభూతగణం త్వేవం నిహత్యమహిషాసురః | సింహం మారయితుందేవ్యాః చుక్రోథచననాదచ || 17 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - దానవేశ్వరుడైన మహిషుడు దేవితో చంపబడ్డ తన సైన్యాన్ని చూచి కోపంతో, చండకొవునితో ఇట్లనెను (1) మహిషుని వాక్కు - చండకోప! మహాపరాక్రమశాలి ! ఈదురాత్మురాలితో యుద్ధంచేయి, అని అట్లాగే అని ప్రతాపవంతుడైన చండకోవుడు పలికి (2) దేవిని యుద్ధరంగంలో బాణ వర్షంతో ముంచెత్తాడు. ఆ చండకోపుని బాణ జాలములను లీలగా తొందరగా దేవి ఛేదించి (3) ఆ అంబిక చండకోపుణ్ణి శస్త్రంతో కొట్టింది ఆతని గుఱ్ఱములు ఛేదింపబడ్డాయి సారధిని, ధ్వజమును, ధనస్సును చేధించింది (4) రథమును కూడా చేధించి బాణములతో దేవి ఆతని హృదయంలో కొట్టింది. ధనస్సు విరిగి, రథంలేక, గుఱ్ఱములు సారధీ చచ్చి (5)న వాడై చండకోపుడు ఖడ్గచర్మములను ధరించి దేవిని సమీపించాడు. దేవీ వాహనమైన సింహమును ఆ అసురుడు తన ఖడ్గంతో కొట్టాడు (6) దేవిని కూడా తన ఖడ్గంతో ఆమె ఎడమ భుజంమీద ఈ రాక్షసుడు కొట్టాడు. ఆ దేవి భుజమందు ఖడ్గము వేయి ముక్కలైంది (7) దేవి గొప్ప శూలంతో చండకోపుణ్ణి హృదయంలో కొట్టింది. వాడు క్రిందపడి మరణించాడు (8) మహావీరుడు, బలవంతుడు ఐన చండకోపుడు మరణించగా, చిత్రభానువు అనువాడు ఏనుగనధిరోహించి ఆదేవిని అనుసరించాడు (9) గొప్ప ఘంట ధ్వని కలిగిన దివ్యశక్తిని వదిలాడు. దేవి తన హుంకారముతో శక్తిని వారించి సందడి లేకుండా చేసింది. (10) పిదప దేవి శూలంతో చిత్ర భానును సంహరించింది. యుద్ధంలో ఆతడు మరణించాక కరాలుడు అనువాడు వచ్చాడు (11) చేతి పిడికిలితో వాడిని దేవి పడగొట్టింది. మదోన్మత్తుడైన ఆతనిని గదతో దేవి పడగొట్టింది. మదోన్మత్తుడైన ఆతనిని గదతో దేవి ప్రాణహీనుని చేసింది (12) పట్టిశంతో బాష్కలుడనే వాణ్ణి. వాని దగ్గరివాణ్ణి (అంతికుని) చక్రంతో యమలోకానికి పంపింది. ఓ బ్రాహ్మణులారా ! దుర్గాదేవి ఇట్లా (13) మహిషుని మంత్రులైన ఇతర మహాకాయులను శూలంతో పొడిచి యమమందిరానికి పంపింది (14) దుర్గవల్ల తన సైన్యం ఇట్లా చంపబడ్డాక మహిషాసురుడు, మహిషరూపంతో దేవి యొక్క గణములను తిన్నాడు (15) కొందరిని తుండంతో చంపాడు ఇతరులను గిట్టలతాకిడితో చంపాడు. ఇతరులను నిశ్వాస వాయువులతో కోపగించి పడవేశాడు (16) దేవి యొక్క భూతగణములను ఇట్లా చంపి మహిషాసురుడు దేవి యొక్క సింహాన్ని చంపటానికి కోపోద్రిక్తుడైనాడు నాదం చేశాడు. (17)

మూ || తతః సింహో7భవత్‌ క్రోద్ధో మహావీర్యో మహాబలః | ఖురాభిఘాత నిర్భిన్న మహీతల మహీధరః || 18 ||

మహిషాసుర మాయాంతం నఖైరేనం వ్యదారయత్‌ | చండికాపితతః క్రుద్ధా వధేతస్యాకరోన్మతిం || 19 ||

బబంధపాశైర్మహిషంచండికా కోప మూర్ఛితా | మోచయిత్వాతతః పాశాన్‌ త్యక్తమా హిషవేషవాన్‌ || 20 ||

సింహవేషోzభవద్దైత్యో మహాబల పరాక్రమః | దేవీతస్యశిరోయావత్‌ ఛేత్తుంబుద్ధిమధారయత్‌ || 21 ||

తావత్‌స పురుషో భూత్వాఖడ్గపాణి రదృశ్యత | అథతం పురుషం దేవీ ఖడ్గ హస్తం శరోత్కరైః || 22 ||

జఘానతీక్ష ధారాగ్రైః పరమర్మావిధారణౖః | తతఃస పురుషో విప్రాగజోభూద్ధస్తదంతవాన్‌ || 23 ||

దుర్గాయా వాహనం సింహం కరేణవిచకర్షచ | తతః సింహః కరంతస్యవిచకర్తనఖాంకురైః || 24 ||

భూయోమహాసురోజాతో మాహిషం వేషమాశ్రితః | తతః క్రుద్ధా భద్రకాలీ మహత్పాన మసేవత || 25 ||

తతః పానవశాన్మత్తా జహాసారుణలోచనా | మహిషః సో7పి గర్వేణ శృంగాభ్యాం పర్వతోత్కరాన్‌ || 26 ||

చండికాం ప్రతి చిక్షేప సాచతానచ్ఛినచ్ఛరైః | తతో దేవీజగన్మాతా మహిషాసురమ బ్రవీత్‌ || 27 ||

దేవ్యువవాచ -

కురుగర్వం క్షణం మూఢమధుయావత్పి బామ్యహం | నివృత్త మధుపానాహంత్వాంనయిష్యేయమక్షయం || 28 ||

హతేత్వయి దురా ధర్షే మయా దైవతకంటకే | స్వంస్వం స్థానం ప్రపద్యం తాం సిద్ధాః సాధ్యాః మరుద్గణాః || 29 ||

ఉక్త్వైవం తాడయామాసముష్టినా మహిషాసురం | తాడితో7యంతతో దేవ్యా మహిషోభృశవిహ్వలః || 30 ||

దక్షిణస్యోదధేఃతీరే ప్రదుద్రావత్వరాన్వితః | అనుదుద్రావతం దేవీ సింహమారుహ్యవాహనం || 31 ||

అసుద్రుతస్తతో దేవ్యా మహిషోదానవేశ్వరః | ధర్మపుష్కరిణీతోయే దశయోజనమాయతే || 32 ||

ప్రవిశ్యాంతర్హితస్త స్థౌ దుర్గాతాడన విహ్వలః | తతోదుర్గాసమాసాద్య ధర్మ పుష్కరిణీతటం || 33 ||

నదదర్శాసురం తత్రమహిషం చండికా తదా | అశరీరాతతోవాణీ దుర్గాదేవీ మభాషత || 34 ||

తా || వీర్యము బలము గల ఆ సింహము కోపగించింది. తన కాలి గిట్టలతాకిడితో పగిలిన భూమి, పర్వతములు కలదై (18) వస్తున్న మహిషాసురుణ్ణి తన గోళ్ళతో చీల్చింది. చండికకూడా కోపగించి ఆతననిని చంపాలనుకుంది. (19) చండిక కోపంతో మహిషుణ్ణి తాళ్ళతో బంధించింది. ఆతాళ్ళను విడిపించుకొని మహిషుని వేషాన్ని వదిలి (20) బలపరాక్రమములు గల వీడు రాక్షసుడు సింహవేషం ధరించాడు దేవి వాని తలను ఖండించుదామని అనుకున్నంతలో (21) వాడు పురుష వేషము ధరించి చేత కత్తి ధరించి కవ్వించాడు. ఖడ్గహస్తుడైన ఆ పురుషుణ్ణి దేవి అనేక శరములతో (22) పరులమర్మస్థానములను చీల్చగల్గిన, తీష్ణమైన అంచులు గల శరములతో కొట్టింది. ఆ పిదప ఆ పురుషుడు తొండము దంతములు గల ఏనుగుగా మారాడు. (23) తన తొండంతో దేవి వాహనమైన సింహంనులాగింది. అప్పుడు సింహం తన గోళ్ళతో దాని తొండమును ఖండించింది (24) మళ్ళా ఆ రాక్షసుడు మహిష రూపం ధరించాడు. అప్పుడు కోపగించిన భద్రకాళి గొప్పగా పానం చేసింది (25) పిదప పానం చేసినందువల్ల మత్తురాలైన కళ్ళు ఎర్రబడగా నవ్వింది. మహిషుడు కూడా గర్వంతోకూడి, త నకోమ్ములతో పర్వతములను (26) చండికమీదికి విసిరాడు. ఆమె తన బానములతో వాటిని ఛేదించింది. అప్పుడు జగన్మాతయైన దేవి మహిషాసురునితో ఇట్లా అంది (27) దేవి వాక్కు - నేను మధువును సేవించే వరకు మూఢుడ! క్షణకాలం గర్వపడు. మధుపానం నుండి విరమించాక నేను నిన్ను యముని దగ్గరకు తీసుకు వెళ్తాను (28) దేవతలకు కంటకుడవైన, అణచటానికి వీలులేని నిన్ను నేను చంపాక సిద్ధులు, సాధ్యులు, మరుద్గణములు తమ తమ స్థానాలు పొందని (29) అని అంటూ మహిషాసురుణ్ణి పిడికిలితో కొట్టసాగింది. ఆతడు దేవితో కొట్టబడి చాలా భయపడినవాడై (30) తొందరగా దక్షిణ సముద్ర తీరంవైపు పరుగెత్తసాగాడు. ఆమె సింహవాహనాన్న ధిరోహించి దనుజుని అనుసరించింది (31) దేవితో అనుసరించబడ్డ రాక్షసేశ్వరుడు మహిషుడు, పదియోజనముల విశాలమైన ధర్మపుష్కరిణీతోయ మందు (32) ప్రవేశించి, దుర్గాతాడనముతో కలతచెంతి అంతర్హితుడై ఉన్నాడు. అప్పుడు దుర్గ పుష్కరిణీ తటమునకు వచ్చి (33) అక్కడ రాక్షసుడైన మహిషుణ్ణి చండిక చూడలేదు. అశరీరవాణి దుర్గాదేవితో ఇట్లా అంది (34).

మూ || భద్రకాలి మహాదేవి మహిషోదానవస్త్వయా | తాడితో ముష్టినా భ##ద్రే ధర్మపుష్కరిణీజలే || 35 ||

అస్మిన్నంతర్హితః శేతే భయార్తోమారయస్వతం | యేనకేనా ప్యుపాయేన చైనం ప్రాణౖర్వియోజయ || 36 ||

ఏవం వాచా7శరీరిణ్యాకథితాచండికాతదా | ప్రాహస్వవాహనం సింహం అసురేంద్రవధోద్యతా || 37 ||

మృగేంద్ర సింహ విక్రాంత మహాబలపరాక్రమ | ధర్మపుష్కరిణీ తోయంనిః శేషం పీయతాంత్వయా || 38 ||

దేవ్యైవముక్తః పంచాస్యోదర్మపుష్కరిణీజలం | నిః శేషంచ వపౌవిప్రా యథాపాంసుర్భవేత్తథా || 39 ||

నిరగాన్మహిషోదీనఃతతస్త స్మాజ్జలాశయాత్‌ | ఆయాంతమసురందేవీ పాదేనా క్రమ్యమూర్ధని || 40 ||

కంఠం శూలేన తీక్షణన పీడయామాసకోపితా | తతో దేవ్యసిమాదాయ చకర్తాస్యశిరోమహత్‌ || 41 ||

ఏవం సమహిషోవిప్రాః సభృత్యబలవాహనః | దుర్గయానిహతోభూమౌ పపాతచమమారచ || 42 ||

తతోదేవాః సగంధర్వాః సిద్ధాశ్చపరమర్షయః | స్తుత్వాదేవీంతతః స్తోత్రైః తుష్టాజహృషిరేతదా || 43 ||

అనుజ్ఞాతాస్తతోదేవ్యాదేవాజగ్ముర్యథాగతం | తతోదేవీ జగన్మాతా స్వనామ్నాపురముత్తమం || 44 ||

దక్షిణస్య సముద్రస్యతీరే చక్రేతదోత్తరే | తతో దేవ్యనుశిష్టాస్తేదావాః శక్రపరోగమాః || 45 ||

పూరయామాసురమృతైః ధర్మపుష్కరిణీంతదా | తతోహ్యమృత తీర్థాఖ్యాం లేభేతత్తీర్థముత్తమం || 46 ||

తతోదేవీవరమదాత్‌ స్వపురస్యముదాన్వితా | పశవ్యంచా పరోగంచ పురమేతత్‌ భవత్వితి || 47 ||

దదౌతీర్ధాయచవరం స్నాతానా మత్రవైనృణాం | యథాభిలాషం సిద్ధిః స్యాత్‌ ఇత్యుక్త్వా సాదివంయమౌ || 48 ||

తా || ఓ భద్రకాళీ ! మహాదేవి! దానవుడైన మహిషుడు నీచే కొట్టబడ్డాడు. నీ పిడికిలితో కొట్టబడి ధర్మపుష్కరిణీ జలమందు (35) దీనిలో భయార్తుడై అంతర్హితుడైనిద్రిస్తున్నాడు. వాణ్ణి చంపు. ఏదో ఒక ఉపాయంతో వీని ప్రాణములు తీసివేయి (36) ఈ విధముగా అశరీరవాణితో చెప్పబడ్డ చండిక, అసురేంద్రుణ్ణి చంపదలచి తన వాహనమైన సింహంతో ఇట్లా అంది (37) ఓ మృగరాజ! మహా బలపరాక్రమశాలి ! నీవు ధర్మపుష్కరిణీ నీటిని ఏమి మిగల్చకుండా తాగు (38) దేవితో ఇట్లా చెప్పబడ్డ సింహము, ధర్మపుష్కరిణీజలాన్ని నిఃశేషంగా తాగింది (బురద) దుమ్ముఉండేట్టే చేసింది (39) దీనుడైన మహిషుడు ఆజలాశయం నుండి బయటికి వచ్చాడు. అట్లా వస్తున్న ఆ రాక్షసుని తలపై దేవి తన పాదాన్నుంచి, (40) కంఠంలో తీక్షమైన శూలాన్నుంచి కోపంతో పీడించసాగింది. పిదప దేవి కత్తిని తీసుకొని ఈతని శిరస్సును ఖండించింది (41) ఈ విధముగా మహిషుడు భృత్యబలవాహనములతో కూడి దుర్గతో చంపబడి భూమియందు పడ్డాడు. చంపబడ్డాడు (42) పిదప దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమర్షులు అందరు స్తోత్రములతో దేవిని స్తుతించి, ఆనందపడినారు, సంతృప్తులైనారు (43) దేవితో అనుజ్ఞను పొంది వచ్చిన ప్రకారమే దేవతలు వెళ్ళిపోయారు. పిదప జగన్మాత తనపేరుతో ఉత్తమమైన నగరాన్ని (44) దక్షిణ సముద్రతీరంలో ఉత్తరభాగంలో ఏర్పరచింది. పిదప దేవి ఆజ్ఞననుసరించి ఇంద్రుడు మొదలగా గల దేవతలు (45) అమృతముతో ధర్మపుష్కరిణిని నింపారు. అందువల్ల ఆ ఉత్తమ తీర్థము అమృత తీర్థమనే పేరును పొందింది (46) అప్పుడు దేవి సంతోషంతో తన నగరానికి వరమిచ్చింది. పశుసంపద ఉండేట్టు, రోగములు పొగొట్టునట్లు ఈ పట్టణం ఉండనీ అని (47) తీర్థమునకు గూడా ఇట్లా వరమిచ్చింది. ఇక్కడ స్నానము చేసిననరులు కోరిన ప్రకారము సిద్ధిని పొందని అని పలికి దేవి స్వర్గమునకు వెళ్ళింది (48).

మూ || శ్రీ సూత ఉవాచ -

యస్త్వనామ్నాచకారేదందేవీపురమసుత్తమం | దేవీవత్తనమిత్యుక్తంతేనదేవ్యాఃపురోత్తమం || 49 ||

దేవీపత్తనమారభ్యసుముహూర్తేదినేద్విజాః|విఘ్నేశ్వరంప్రణమ్యాదౌసలిలస్వామినంతధా || 50 ||

మహాదేవాభ్యనుజ్ఞాతో రామచంద్రోzతిధార్మికః | స్థాపయిత్వాస్వహస్తేనపాషాణనవకం ముదా || 51 ||

సేతుమారబ్ధవాన్‌ విప్రాయావల్లం కామతంద్రితః | సింహాసనం సమారుహ్యరామోనలకృతం శుభం || 52 ||

వానరైఃకారయామాససేతుమబ్ధౌనలాదిభిః | పర్వతాన్‌ శాఖినోవృక్షాన్‌ దృషదః కాష్ఠ సంచయాన్‌ || 53 ||

తృణానిచనమాజహ్రుః వానరా వనమధ్యతః || 53 1/2 || (54)

నలస్తాని సమాదాయచక్రేసేతుం మహోదధౌ | పంచభిః దివసైః సేతుః యా వల్లంకాసమీపతః || 55 ||

దశయోజన విస్తీర్ణః శతయోజసమాయతః | కృతః సేతుర్నలేనాబ్ధౌ పుణ్యః పాపవినాశనః || 56 ||

దేవీపురస్యనికటేనవ పాషాణరూపకే | సేతుమూలేనరః స్నాయాత్‌ స్వపాపపరిశుద్ధయే || 57 ||

చక్రతీర్థే తథాస్నాయాత్‌ భ##జేత్‌ సేత్వధిపంహరిం | దేవీ పత్తనమారభ్యయత్కృతం సేతుబంధనం || 58 ||

తత్సేతుమూలం విప్రేంద్రాః యధార్థం పరికల్పితం | సేతోస్తు పశ్చిమాకోటిః దర్భశయ్యా ప్రకీర్తితా || 59 ||

దేవీపురీచ ప్రాక్కోటి రుభయం సేతుమూలకం | ఉభయం పుణ్యమాఖ్యాతం పవిత్రం పాపనాశనం || 60 ||

యత్సేతు మూలంగచ్ఛంతి యేనమార్గేణయేనరాః | తత్తన్మార్గగతాస్తేతే తస్మింస్తస్మిన్‌ విముక్తిదే || 61 ||

స్నాత్వాదౌసేతుమూలేతు చక్రతీర్థే తథైవచ | సంకల్పపూర్వం పశ్చాత్‌ గచ్ఛేయుః సేతుబంధనం || 62 ||

దేవీపురేతథాదర్భ శయ్యా యామపి భూసురాః | చక్రతీర్థే శివే స్నానం పుణ్‌యం పాపవినాశనం || 63 ||

స్మరణాదుభయత్రాపి చక్రతీర్థస్య వైద్విజాః | భస్మీ భవంతి పాపానిలక్షజన్మకృతాన్యపి || 64 ||

జన్మాపి విలయం యాయాత్‌ముక్తిశ్చాపికరేస్థితా | చక్రతీర్థసమంతీర్థం నభూతం నభవిష్యతి || 65 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - దేవీ తన పేరుతో ఈ పట్టణాన్ని నిర్మించింది అందువల్ల ఈ దేవీపురము దేవీ పత్తనమని పిలువబడింది (49) దేవీపత్తనం మొదలుకొని మంచి ముహూర్తము గలదినమందు మొదట విఘ్నేశ్వరుని నమస్కరించి అట్లాగే సలిలస్వామికి నమస్కరించి (50) మహాదేవుని ఆజ్ఞపొంది ధార్మికుడైన రామచంద్రుడు తన హాస్తంతో తొమ్మిది పాషాణములను ఉంచి (51) సేతువును లంకా నగరం వరకు ఆరంభించాడు, జాగృతుడై (కునికిపాటులేక), నలుడు ఏర్పాటుచేసిన సింహాసనమును ఆరోహించి రాముడు (52) సముద్ర మందు నలుడు మొదలగు వానరులతో సేతువును నిర్మింప చేశాడు. పర్వతములను శాఖలను (కొమ్మలు) వృక్షములను, రాళ్ళను, కట్టెలను (53) అడవిమధ్యనుండి గడ్డి మొదలగు వానిని వానరులు తెచ్చారు (54) వాటన్నిటిని నలుడు సమకూర్చి సముద్రమందు సేతువును చేశాడు. ఐదు రోజులలో సేతువు లంకా సమీపం వరకు (55) పది యోజనముల విస్తీర్ణము, నూరుయోజనముల పొడవగలదై సముద్రమందు పుణ్యప్రదము, పాపనాశకమైన సేతువు నలునితో నిర్మించబడింది (56) (తొమ్మిది) నవపాషాణరూపకమైన దేవీపురం సమీపంలో సేతుమూలంలో తన పాపముల పరిశుద్ధికొరకు నరుడు స్నానం చేయాలి (57) చక్రతీర్థంలో అట్లాగే స్నానం చేయాలి! సేతువునకు అధిపుడైన హరిని సేవించాలి. దేవీపత్తనం ఆరంభించి చేసిన సేతుబంధనము (58) సేతువునకు మూలము దానికయ్యే కల్పించబడింది. సేతువునకు పశ్చిమ చివర దర్భశయ్య అనబడుతుంది (59) దేవీపురము తూర్పుచివరి భాగము. ఈ రెండు సేతువునకు మూలములు. ఈరెండు పుణ్య ప్రదములు పవిత్రములు. పాపనాశకములు (60) ఏ ఏ మనుషులు ఏ ఏ దారిలో ఏ సేతు మూలమునకు వెళ్లారో ఆ యామార్గల్లోపోయి, వారు వారు వాని వాని యందు విముక్తులౌతారు (61) సేతు మూలంలో తొలుత స్నానం చేసి అట్లాగే చక్రతీర్థంలోను పిదప సంకల్ప పూర్వకముగా సేతు బంధనమునకు వెళ్లాలి. (62) దేవీపురమందు, దర్భశయ్యయందు శివప్రదమైన చక్రతీర్థమందు స్నానంచేసిన పుణ్యప్రదము. పాపనాశకము (63) రెండు చోట్లను చక్రతీర్థాన్ని స్మరించటంవల్ల లక్ష జన్మలలో చేసిన పాపములైనా భస్మమౌతాయి. (64) జన్మనశిస్తుంది ముక్తి కరగతమౌతుంది. చక్రతీర్థముతో సమానమైన తీర్థం ఇది వరలో లేదు. కలగ బోదుకూడా (65).

మూ|| భూలోకేయాని తీర్థాని గంగాదీని ద్విజోత్తమాః | చక్రతీర్థస్యతాన్యద్ధాకలాంనార్హతి షోడశీం || 66 ||

ఆ దౌతునవపాషాణమధ్యzబ్ధౌస్నానమాచరేత్‌ | క్షేత్ర పిండేతతః కుర్యాత్‌ చక్రతీర్థే తథైవచ || 67 ||

సేతునాథం హరింసేవేత్‌ స్వపాపపరిశుద్ధయే | ఏవం హిదర్భశయ్యాయాం కుర్యుః తన్మార్గతోగతాం || 68 ||

ఆరూఢం రామచంద్రేణ యోనమస్కురుతేజనః | సింహాసనం నలకృతం నతస్యనరకాద్భయం || 69 ||

సేతుమాదౌనమస్కుర్యాత్‌ రామంధ్యాయన్‌ హృదాతదా | రఘువీరపదన్యాసపవిత్రీకృతపాంసవే || 70 ||

దశకంఠశిరచ్ఛేద హెతవే సేతవేనమః | కేతవే రామచంద్రస్యమోక్షమార్గైక హేతవే || 71 ||

సీతాయాః మాన సాంభోజనవే సేతవేనమః | సాష్టాంగంప్రణిపత్యాదౌమంత్రేణానేనవైద్విజాః || 72 ||

తతోవేతాలవరదంతీర్థం గచ్ఛేన్మహాబలం | తత్రస్నానాదవాప్నోతి సిద్ధింపారమికాం నరః || 73 ||

యోzధ్యాయమేనం పఠతేమనుష్యః | శ్రుణోతివా భక్తియుతోద్విజేంద్రాః

స్వర్గాదయస్తస్యనదుర్లభాః స్యుః | కైవల్యమప్యస్యకరస్థమేవ || 74 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతు మాహాత్మ్యే చక్రతీర్థ ప్రశంసాయాం దేవీ పురాభిధాన కథనే మహిషాసుర సంహార వర్ణనం నామ సప్తమోధ్యాయః || 7 ||

తా భూలోకంలో గంగాది తీర్థములెన్ని ఉన్నాయో అవి చక్రతీర్థము యొక్క పదునారవ కళకు కూడా సరితూగవు (66) తొలుత నవపాషాణముల మధ్య యందు సముద్రంలో స్నానం చేయాలి. పిదప క్షేత్ర పిండ ప్రదానముచేయాలి. అట్లాగే చక్ర తీర్థంలోను చేయాలి (67) తన పాప పరిశుద్ధి కొరకు సేతునాథుడైన హరిని సేవించాలి. ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఈ విధంగా దర్భశయ్య యందు కూడా చేయాలి (68) నలుడు చేసిన రామచంద్రుడెక్కిన సింహాసనానికి నమస్కరించిన నరునకు భయములేదు (69) రాముణ్ణి హృదయంలో ధ్యానిస్తూ మొదట సేతువునకు నమస్కారం చేయాలి. ఆ సేతువు రాముని పాదన్యాసముతో పవిత్రంగా చేయబడ్డ ధూళి గలది. (70) దశకంఠుని శిరచ్ఛేదమునకు హేతువైన సేతువునకు నమస్కారము రామచంద్రునకు కాంతి దాయకము మోక్షమార్గమునకు హేతువు ఇదొక్కటే (71) సీతయొక్క మనస్సనే తామరపుష్పమునకు సూర్యుని వంటిది ఐన సేతువునకు నమస్కారము. ఈ మంత్రంతో తొలుగ సాష్టాంగ నమస్కారముచేసి (72) పిదప మహాశక్తి గల వేతాల వరద తీర్థమునకు వెళ్ళవలెను. అక్కడ స్నానం చేయటం వలన పరలోక సిద్ధిని నరుడు పొందుతాడు (73) ఈ అధ్యాయమును భక్తిగలవాడై చదివిన నరుడు లేదా విన్న వాడైనా ఆతనికి స్వర్గాదులు దుర్లభములు కావు. కైవల్యం కూడా ఆతనికి కరతలగతమే (74) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది ఒకటివేల సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు చక్రతీర్థ ప్రశంసయందు దేవీపుర అభిధానము చెప్పే సందర్భమున మహిషాసుర సంహార వర్ణన అనునది ఏడవ అధ్యాయము || 7 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters