Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునారవ అధ్యాయము

మూ || యుధిష్ఠిర ఉవాచ -

రక్షసాంచైవ దైత్యానాం యక్షాణా మథ పక్షిణాం | భయనాశాయ కాజేశైః ధర్మారణ్య నివాసినాం || 1 ||

శక్తీః సంస్థాపితా నూనం నానా రూపాహ్యనేకశః | తాసాంస్థానాని నామాని యథా రూపాణి మేవద || 2 ||

వ్యాస ఉవాచ -

శృణు పార్థమహాబాహో ధర్మమూర్తే నృపోత్తమ | స్థానేవై స్థాపితాశక్తిః కాజేశై శ్చైవ గోత్రపా || 3 ||

శ్రీ మాతా మదారికాయాం శాంతానందా పురేవరే | రక్షార్థం ద్విజముఖ్యానాం చతుర్దిక్షు స్థితాశ్చతాః || 4 ||

యుక్తాశ్చైవ సురైః సర్వైః స్వస్వస్థానే నృపోత్తమ | వనమధ్యే స్థితాః సర్వాద్విజానాం రక్షణాయవై || 5 ||

సాబభూవ మహారాజ సావిత్రీతి ప్రథాశివా | అనురాణాం వధార్థాయ జ్ఞాన జా స్థాపితా సురైః || 6 ||

అన్యాశ్చ బహవశ్చైవ స్థాపితా భయరక్షణ || 7 ||

ప్రతీచ్యో దీచ్యాం యామ్యాం వైవిబుధైః స్థాపితాహిసా | నానాయుధ ధరాసాచ నానాభరణ భూషితా || 8 ||

నానావాహన మారూఢా నానారూపధరాచసా | నానా కోపనమాయుక్తానానాభయ వినాశినీ || 9 ||

స్థాప్యామాతర్యథా స్థానే యథాయోగ్యాదిశోదిశ | గరుడేన సమారూఢాత్రి శూలవర ధారిణీ || 10 ||

సింహారూఢా శుద్ధరూపా వారుణీ పాన దర్పితా | ఖడ్గఖేటక బాణాఢ్యైః కరైర్‌ భాతి శుభాననా || 11 ||

రక్తవస్త్రావృతాచైవ పీనోన్నత వయోధరా | ఉద్యదాదిత్య బింబాభా మదాఘూర్ణితలోచనా || 12 ||

ఏవమేషామహాదివ్యాకాజేశ##కైః స్థాపితాతదా | రక్షార్థం సర్వజంతూనాం సత్యమందిరవాసినాం || 13 ||

సాదేవీ నృపశార్దూల స్తుతాసంపూజితా సహ | దదాతి సకలాన్‌ కామాన్‌ వాంఛితా న్నృవసత్తమ || 14 ||

ధర్మారణ్యాత్పశ్చిమతః స్థాపితాఛత్రజాశుభా | తత్రస్థారక్షతే విప్రాన్‌ కియచ్ఛక్తి సమన్వితా || 15 ||

భైరవం రూపమాస్థాయ రాక్షసానాంథాయచ | ధారయంత్యాయుధానీతథం విప్రాణామభయాయచ || 16 ||

సరశ్చకారతస్యాగ్రే ఉత్తమం జలపూరితం | సరస్యస్మిన్నహాభాగ కృత్వాస్నానాది తర్పణం || 17 ||

పిండదానాదికం సర్వమక్షయం చైవజాయతే | భూమౌక్షిప్తాం జలీన్‌ దివ్యాన్‌ ధూపదీపాదికం సదా || 18 ||

తస్యనోబాధతేవ్యాధిః శత్రూణాం నాశ ఏవచ | బలిదానాదికం తత్ర కుర్యాద్భూయః స్వశక్తితః || 19 ||

శత్రవోనాశమాయాంతి ధన్యం ధాన్యం వివర్థతే | ఆనందాస్థాపితా రాజన్‌ శక్త్యంశా చ మనోరమా || 20 ||

రక్షణార్థం ద్విజాతీనాం మాహాత్మ్యం శృణుభూవత || 20 1/2 ||

తా || యుధిష్ఠిరుని వచనము - రాక్షసులకు దైత్యులకు యక్షులకు, పక్షులకు ధర్మారణ్యమందు నివసించేవారికి భయం నశించే కొరకు కాజేశులు (1) నానా రూపముగా అనేకమైన శక్తులను స్థాపించారు. వాటి స్థానములను పేర్లను, వాటి యథార్థ రూపములను నాకు చెప్పండి (2) అనగా వ్యాసుని వచనము - ఓ పార్థ మహాబాహు, ధర్మమూర్తి, నృపోత్తమ విను. కాజేశులు స్థానమందుంచినది శక్తి అనుపేరు గలది. గోత్రప (3) మ దారిక యందు శ్రీమాత, శ్రేష్ఠమైన నందాపురమందు శాంత బ్రాహ్మణ ముఖ్యుల రక్షణ కొరకు నాలుగు దిక్కులందు ఈ నలుగురున్నారు (4) ఓ నృపోత్తమ! తమతమ స్థానములందు దేవతలందరితో కూడి ఉన్నారు. వన మధ్య యందున్నవారంతా బ్రాహ్మణుల రక్షణ కొరకు. (5) ఓ మహారాజ! సావిత్రి అను పేరుగల ఆమె మంగళకరమైనది. అనురుల సంహారము కొరకు దేవతలు జ్ఞానజను స్థాపించారు. (6) గాత్రాయి ఆడపక్షి రూపంగల దేవి. ఛత్రజ ద్వారమందుండేది. చూట అను సంజ్ఞ గలది, శీహోరీ, పిప్పలాశాపురీ, ఇంక ఇతరమైన అనేక శక్తులు భయము నుండి రక్షణ కొరకు స్థాపించబడ్డాయి (7) ప్రతీచి, ఉదీచి, దక్షిణదిక్కులందు ఆమె దేవతలతో స్థాపించబడింది. ఆమె రకరకాల ఆయుధముల ధరించింది. రకరకాల ఆభరణములతో అలంకరింపబడింది (8) రకరకాల వాహనములను అధిరోహించింది. ఆమె నానా రూపములను ధరించింది కూడా. రకరకాల కోపములతో కూడింది, రకరకాల భయములను తొలగించేది (9) యథాయోగ్యముగా యథాస్థానమందు పదిదిక్కులలో మాత ఉంచతగినది. గరుడుని అధిరోహించింది, త్రిశూలమును ధరించింది (10) సింహము నధిరోహించింది శుద్ధ రూపముగలది, వారుణీపానంతోదర్పించింది. ఖడ్గము, డాలువారు బాణములు గల చేతులతో వెలుగుతోంది. శుభ##మైన ఆసనము కలది (11) రక్త వస్త్రముతో చుట్టబడినది బలిసిన ఎత్తైన పయోధరములు గలది, ఉదయిస్తున్న సూర్యబింబము వంటి కాంతి గలది మదముతో కదులుతున్న కళ్ళు గలది (12) ఈ విధముగా ఈమె మహాదివ్యమైనది అప్పుడు కాజేశులతో స్థాపించబడింది. సత్యమందిరమందుండే సర్వప్రాణుల రక్షణ కొరకు స్థాపితమైంది (13) ఓ నృపశార్దూల! ఆ దేవి స్తుతించబడి, పూజింపబడితే, కోరేకోరికలన్నింటిని ఇస్తుంది. ఓ నృపసత్తమ! (14) ధర్మారణ్యంనకు పశ్చిమ భాగంలో స్థాపించబడినది శుభ##మైనది ఛత్రజా. అక్కడ ఉండి విప్రులను రక్షిస్తోంది. ఎంతో శక్తి గలది (15) భైరవ రూపమును ధరించి రాక్షసుల వధ కొరకు, విప్రులకు అభయమిచ్చే కొరకు ఆయుధములను ధరిస్తోంది (16) ఆమె ఎదురుగా నీటితోని ఉత్తమమైన సరస్సు ఏర్పరచ బడింది. ఓమహాభాగ! ఈ సరస్సు యందు స్నానాదితర్పణం చేసినవారు (17) పిండదానాదికము చేసిన వారి క్రియ అంతా అక్షయమౌతుంది. భూమి యందు పడిన అంజులులను దివ్యమైన వానిని ధూపదీ పాదికములను చేసిన వానిని ఎప్పుడూ (18) వ్యాధులు బాధించవు. శత్రునాశనమౌతుంది కూడా. మరల అక్కడ తన శక్తి కొలది బలిదానాదులను చేయాలి (19) శత్రువులు నశిస్తారు. ధనము ధాన్యము వృధ్ధి ఔతుంది. ఓరాజ! శక్తి అంశతో మనోరమమైన ఆనంద అనే శక్తి (20) బ్రాహ్మణుల రక్షణ కొరకు స్థాపించబడింది, ఓ భూపతి! ఆమె మాహాత్మ్యమునువిను (20 1/2).

మూ || శుక్లాంబరధరా దివ్యాహెమభూషణ భూషితా || 21 ||

సింహారూఢా చతుర్‌హస్తా శశాంకకృతశేఖరా | ముక్తాహారలతో పేతా పీనోన్నత పయోధరా || 22 ||

అక్షమాలాసి హస్తాచ గుణ తో మరధారిణీ | దివ్యగంధవరాధారా దివ్యమాలా విభూషితా || 23 ||

సాత్వికీ శక్తిరానందా స్థితా తస్మిన్‌ పురేపురా | పూజయేత్తాంచ వైరాజన్‌ కర్పూరారక్తచందనైః || 24 ||

భోజయేత్‌ పాయసైః శుభ్రైః మధ్వాజ్య సితయాసహ | భవన్యాః ప్రీతయేరాజన్‌ కుమార్యాః పూజనంతథా || 25 ||

తత్రజప్తంశుతం దత్తం ధ్యాతం చనృపసత్తమ | తత్సర్వం చాక్షయం తత్రజాయతే నాత్రసంశయః || 26 ||

త్రిగుణత్రిగుణావృద్ధిః తస్మిన్‌ స్థానే నృపోత్తమ | సాధకస్య భ##వేన్నూనం ధసదారాది సంపదః || 27 ||

సహానిర్నచరోగశ్చ సశత్రుః నచదుష్కృతం | గావస్తస్య వివర్ధంతే ధనధాన్యాది సంకులం || 28 ||

నశాకిన్యాభయంతస్య నచరాజ్ఞశ్చ వైరిణః | నచవ్యాధి భయంచైవ సర్వత్ర విజయీభ##వేత్‌ || 29 ||

విద్యాశ్చతుర్దశాసై#్యవ భాసంతే పఠితా ఇవ | సూర్యవద్ద్యోతతే భూమా వానంద మాశ్రితోనరః || 30 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వార్థే ధర్మారణ్య మాహాత్మ్యే ఆనందస్థాపన వర్ణనం నామ షోడశోధ్యాయః || 16 ||

తా || ఆమె (ఆనంద) శుక్ల అంబరముల ధరించింది. దివ్యమైనది బంగారు ఆభరణములతో ఆలంకరింపబడింది (21) సింహముపై అధిరోహించింది. నాలుగు చేతులు గలది. చంద్రుని తలలో ధరించింది. తీగవంటి ముత్యాలహారము గలది పీన ఉన్నత వయోధరములు గలది (22) అక్షమాల, ఖడ్గము హస్తమందు గలది తాడుతోమరము వీటిని ధరించినది. దివ్యగంధవరమునకు ఆధారమైనది, దివ్యమాలతో అలంకరింపబడింది (23) ఆనంద సాత్విక శక్తి. ఆ పట్టణమందు పూర్వముండేది ఓ రాజ! ఆమెను కూర్పరము రక్త చందనము వీటితో పూజించాలి (24) మధు, ఆజ్యము, శర్కర వీటితో కూడిన శుభ్రమైన పాయసములతో భుజింపచేయాలి. భవాని ప్రీతి కొరకు కుమారి పూజ కూడా చేయాలి, ఓ రాజ! (25) అక్కడచేసిన జపము, హోమము, అక్కడ ఇచ్చిన దానము, ధ్యానము ఇవన్నీ ఓరాజ! అక్కడ అక్షయమౌతాయి. ఇందులో అనుమానము లేదు (26) ఓనృపోత్తమ! ఆ స్థానమందు చేసినది మూడుగుణములైతే అది దానికి మూడురెట్లు అధికమౌతుంది. సాధకునకు ధనము, దార (భార్య) ఆది సంపదలు తప్పక లభిస్తాయి (27) హానికాని రోగము కాని శత్రువులు కాని, దుష్కృతముకాని ఉండవు. ఆతని గోవులు వృద్ధి చెందుతాయి. ఆతని ఇల్లు ధనధాన్యాదులతో నిండి పోతుంది (28) శాకిని భయము ఆతని కుండదు. రాజునకు శత్రువులుండరు. వ్యాధి భయముండదు. అంతట విజయవంతుడౌతాడు (29) చతుర్దశవిద్యలు ఈతనికి, చదివిన చదువువలె భాసిస్తాయి. ఆనందశక్తి నాశ్రయించిన నరుడు భూమి యందు సూర్యునిలా వెలుగుతాడు. (30) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు పూర్వార్థమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు ఆనంద స్థాపన వర్ణన మనునది పదునారవ అధ్యాయము || 16 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters