Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదనైదవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ

నపశ్యంతి తదాశీర్షం బ్రహ్మ్యాద్యాస్తు సురాస్తదా | కింకర్మితిహేత్యుక్త్వా జ్ఞానినస్తే వ్యచింతయన్‌ || 1 ||

ఉవాచ విశ్వకర్మాణం తదా బ్రహ్మాసురాన్వితః || 2 ||

బ్రహ్మోవాచ -

విశ్వకర్మన్‌ త్వమేవాపి కార్యకర్తా సదావిభో | శీఘ్రమేవ కురుత్వంవై వక్త్రం సాంద్రంచ ధన్వినః || 3 ||

నమస్కృత్య తదాతసై#్మ స్తుతోసౌ దేవవర్దకిః | ఉవాచ పరయాభక్త్యా బ్రహ్మాణం కమలోద్భవం

యజ్ఞకార్యం నివృత్యాశు వదంతి వివిధాః సురాః || 4 ||

యజ్ఞ భాగవిహీనం మాం కింపుసర్వచ్మితేగ్రతః | యజ్ఞభాగమహం దేవలభేయైవం సురైన్సహ || 5 ||

బ్రహ్మోవాచ -

దాస్యామి సర్వయజ్ఞేషు విభాగం సురవర్ధకే | సోమేత్వం ప్రథమం వీర పూజ్యసే శ్రుతికోవిదైః || 6 ||

తద్విష్ణోశ్చ శిరస్తావత్‌ సంధ త్ప్వాసుర వర్ధక | విశ్వకర్మా బ్రవీద్దేవా నాన యధ్వం శిరస్త్వితి || 7 ||

తన్నాస్తీతి సురాః సర్వే వదంతి నృపసత్తమ | మధ్యాహ్నతు సముద్భూతే రథస్థోది విచాంశుమాన్‌ || 8 ||

దృష్టంతదా సురైః సర్వైః రధా దశ్వమథానయన్‌ | ఛిత్వాశీర్షం మహీపాలకబంధాద్వాజినోహరేః || 9 ||

కబంధేయోజయామాన విశ్వకర్మాతి చాతురః | దృష్ట్వాతం దేవదేవేశ సురాః స్తుతి మకుర్వత || 10 ||

దేవా ఊచుః -

నమస్తేస్తు జగద్బీజ నమస్తే కమలాపతే | నమస్తేస్తు పసురేశాన నమస్తే కమలేక్షణ || 11 ||

త్వంస్థితిఃసర్వభూతానాంత్వమేవశరణంసతాం | త్వంహంతాసర్వదుష్టానాంహయగ్రీవ నమోస్తుతే || 12 ||

త్వమోంకారోవషట్‌ కారః స్వాహా స్వధాచతుర్విధా | అధ్యస్త్వంచ సురేశాసత్వమేవ శరణంసదా || 13 ||

యజ్ఞోయజ్ఞపతిర్యజ్వాద్రవ్యంహోతాహుతస్తథా | త్వదర్థం హూయతే దేవత్వమేవశరణం సఖా || 14 ||

కాలః కరాలరూపస్త్వంత్వం వార్కః శీతదీధితిః | త్వమగ్నిర్వరుణశ్చైవ త్వంచ కాలక్షయంకరః || 15 ||

గుణత్రయం త్వమేవేహగుణహీనస్త్వమేవహి | గుణానామాలయస్త్వంచ గోప్తాసర్వేషు జంతుషు || 16 ||

స్త్రీపుంసోశ్చ ద్విధాత్వంచ పశుపక్ష్యాదిమానవైః | చతుర్విధంకులంత్వంహి చతురాశీతిలక్షణః || 17 ||

దినాంతశ్చైవ పక్షాంతో మాసాంతో హాయనం యుగం | కల్పాంతశ్చ మహాంతశ్చ కాలాంతస్త్వంచవైహరే || 18 ||

ఏవంవిధైర్మహా దివ్యైః స్తూయామానః సురైర్‌నృప | సంతుష్టః ప్రాహ సర్వేషాం దేవానాం పురతః ప్రభుః || 19 ||

తా || వ్యాసుని వచనము - బ్రహ్మాది సురలు అప్పుడు తలను కనుగొనలేక పోయారు హా! ఇప్పుడే చేద్దాం అని అజ్ఞానులు ఆలోచించారు (1) దేవతలతో కూడిన బ్రహ్మ అప్పుడు విశ్వకర్మతో ఇట్లా అన్నాడు (2) బ్రహ్మవచనము - ఓ విభు! విశ్వకర్మ! ఎల్లప్పుడు కార్యకర్తవు నీవే. ధనుర్థారియైన విష్ణువు యొక్క మృదువైనముఖమును త్వరగా నీవు చేయి అనగా దేవతల వర్థకి (వడ్రంగి) ఆతనికి నమస్కరించి, ఆతనిని స్తుతించి పరమభక్తితో కమలోద్భవుడైన బ్రహ్మతో ఇట్లా అన్నాడు (3) యజ్ఞకార్యాన్ని త్వరగా నాతో చేయించుకొని దేవతలంతా ఇట్లా అంటున్నారు. (4) నాకు యజ్ఞభాగము లేదు, అని మీ ముంద ఇంకేం చెప్పను. ఓ దేవ! దేవతలతోపాటు నాకు యజ్ఞభాగము రావాలి అనగా (5) బ్రహ్మవచనము - ఓ సురవర్థక! అన్ని యజ్ఞములలో నీకు భాగాన్ని ఇస్తాను. సోమయజ్ఞ మందు శ్రుతికోవిదులు, నిన్ను మొదలు పూజిస్తారు. ఓవీర (6) ఓ అమరవర్థక! విష్ణువు యొక్క శిరస్సును అతికించు అనగా విశ్వకర్మ అన్నాడు. దేవతలారా! శిరస్సు తెండి అని (7) అనగా దేవతలంత ఆ శిరస్సులేదు అని అన్నారు, ఓ నృపసత్తమ! మధ్యాహ్నము కాగా సూర్యుడు ఆకాశంలో రథస్థుడై ఉన్నాడు (8) అప్పుడు దేవతలంతా చూచారు. పిదప రథము నుండి గుఱ్ఱమును తెచ్చారు. ఓ మహీపాల! గుఱ్ఱము యొక్క కబంథము నుండి తలను ఛేదించి విష్ణువు యొక్క (9) మొండె ముందు, అతిచాతుర్యము కల విశ్వకర్మ తగిలించాడు. ఆ దేవదేవేశుని చూచి దేవతలుస్తుతిచేశారు (10) దేవతల వచనము - జగద్బీజ! నీకు నమస్కారము. ఓ కమల ఈక్షణ (కన్నులు) నీకు నమస్కారము (11) సర్వప్రాణులకు నీవు రక్షకుడవు. సజ్జనులకు నీవేశరణము. సర్వదుష్ట సంహారకుడవు నీవే. ఓ హయగ్రీవ! నీకు నమస్కారము (12) నీవు ఓంకారము, వషట్‌ కారము. స్వాహా, స్వధా ఈనాలుగు నీవే. ఓ సురేశాన! నీవు ఆద్యుడవు. ఎల్లప్పుడు నీవే శరణమవు (13) యజ్ఞమ నీవే. యజ్ఞ పతివి నీవే. యజ్ఞం చేసే వాడివి నీవే. ద్రవ్యము, ఋత్విక్కు, స్వీకర్త అన్ని నీవే. నీ కొరకే హోమం చేయబడుతోంది. ఓ దేవ! నీవే శరణము నీవే సఖుడవు (14) కరాల రూపంగల కాలము నీవు. సూర్యుడవు నీవు చంద్రుడవు నీవే. నీవే అగ్నివి, వరుణుడవు. కాలక్షయకరుడవునీవే (15) గుణత్రయమునీవే. గుణహీనుడవు నీవే. గుణములకు నిలయమునీవే, ప్రాణులన్నింటిలో రక్షకుడవుగా ఉన్నవాడివి నీవే (16) పశుపక్షిమానవులు మొ|| స్త్రీ పురుషుల రెండి రూపమునీవే. నాల్గురకముల కులమునీవే. ఎనుబది నాలుగు లక్షణముల వాడివి నీవే. (17) దినాంతము, పక్షాంతము, మాసాంతము, హాయనము, యుగము, కల్పాంతము, మహాంతము కాలాంతము సర్వము ఓహరి! నీవే. (18) ఓ నృప! ఈ విథముగా దేవతలు గొప్ప స్తోత్రములతో పొగడగా సంతుష్టుడై ప్రభువు దేవతలందరి ఎదురుగా ఇట్లా అన్నాడు (19).

మూ || శ్రీ భగవానువాచ -ఔ

కిమర్థ మిహం సంప్రాప్తాః సర్వే దేవగణా భువి | కిమేతత్‌ కారణం దేవాః కింసుదైత్య ప్రపీడితాః || 20 ||

దేవా ఊచుః -

నదైత్యస్య భయం జాతం యజ్ఞకర్మోత్సుకావయం | త్వద్దర్శన పరాః సర్వే పశ్యామోవైదిశోదశ || 21 ||

త్వన్మాయామోహితాః సర్వేస్యగ్రచిత్తాభయాతురాః | యోగరూఢ స్వరూపంచ దృష్టంతేస్మాభిరుత్తమం || 22 ||

వమ్రీచ నోదితా స్మాభిః జాగరాయ తవేశ్వర | తతాశ్చాపూర్వమభవచ్ఛిరశ్చిన్నం బభూవతే || 23 ||

సూర్యాశ్వశీర్ష మానీయ విశ్వ కర్మాతి చాతురః | సమధత్త శిరోవిష్ణో హయగ్రీవోస్యతః ప్రభో || 24 ||

విష్ణురువాచ -

తుష్టోహం నాకినః సర్వేదదామి వరమీప్సితం | హయగ్రీవోస్మ్యహం జాతో దేవదేవ జగత్పతిః || 25 ||

నరౌద్రం సవిరూపంచ సురైర పిచ సేవితం | జాతోహం వరదో దేవా హయాసనేతితోషితః || 26 ||

వ్యాస ఉవాచ -

కృతేసత్రే తతోవేధా ధీమాన్‌ సంతుష్ట చేతసా | యజ్ఞభాగం తతోదత్వా వమ్రీభ్యో విశ్వకర్మణ || 27 ||

యజ్ఞాంతే చసురశ్రేష్ఠం నమస్కృత్య దివంయ¸° | ఏతచ్చకారణం విద్ధి హయాననోయతో హరిః || 28 ||

యుధిష్ఠిర ఉవాచ -

యేనాక్రాంతా మహీసర్వాక్రమేణౖ కేన తత్వతః | వివరేవివరే రోవ్ణూం వర్తంతేచ వృథక్‌ వృథక్‌ || 29 ||

బ్రహ్మాండాని సహస్రాణి దృశ్యంతేచ మహాద్యుతే | సవేత్తి వేదోయత్పారం శీర్షఘాతోహి వైకథం || 30 ||

వ్యాస ఉవాచ -

శృణుత్వం పాండవ శ్రేష్ఠకథాం పౌరాణికీం శుభా | ఈశ్వరస్యచరిత్రంహినైవనేత్తి చరాచరే || 31 ||

ఏకదాబ్రహ్మనభాయాం గతాదేవాః సవాసవాః | భూర్లోకాద్యాశ్చ సర్వేహిస్థావరాణి చరాణిచ || 32 ||

దేవాబ్రహ్మర్షయన్సర్వే నమస్కర్తుం పితామహం | విష్ణురప్యాగతస్తత్ర సభాయాం మంత్రకారణాత్‌ || 33 ||

బ్రహ్మాచాపి విగర్విష్ఠ ఉవాచేదం వచస్తదా | భోభోదేవాః శృణుధ్వం కస్త్ర యాణాంకారణం మహత్‌ || 34 ||

సత్యం బ్రువంతువైదేవా బ్రహ్మేశ విష్ణుమధ్యతః | తాంవాచంచ సమాకర్ణ్య దేవా విస్మయమాగతాః || 35 ||

ఊచుశ్చైవతతో దేవానజానీమోవయంసురాః | బ్రహ్మపత్నీతదోవాచ విష్ణుం ప్రతిసురేశ్వరం

త్రయాణామపిదేవానాం మహాంతంచ వదస్వమే || 36 ||

విష్ణురువాచ -

విష్ణుమాయా బలేనైవ మోహితం భువనత్రయం | తతోబ్రహ్మోవాచ చేదంసత్వం జానాసిభోవిభోః || 37 ||

నైవముహ్యంతి తేమాయాబలేన నైవమేవచ | గర్వహింసాపరోదేవో జగద్భర్తా జగత్ర్పభుః || 38 ||

జ్యేష్ఠంత్వా నవిదుః సర్వే విష్ణుమాయా వృతాఃఖిలాః తతోబ్రహ్మా సరోక్షేణ క్రుద్ధః ప్రస్ఫురితాననః || 39 ||

ఉవాచ వచనం కోపాత్‌ హవిష్ణోశృణుమేవచః | యేన వత్త్రేణ సభాయాం వచనం సముదీరితం || 40 ||

తచ్ఛీర్షం పతతాదాశు చాల్పకాలేన వైపునః | తతోహాహాకృతం సర్వం సేంద్రాః సర్షిపురోగమాః || 41 ||

బ్రహ్మాణంక్షమయామానుః విష్ణుం ప్రతిసురోత్తమాః | విష్ణుశ్చతద్వచః శ్రుత్వాసత్యం సత్యం భవిష్యతి || 42 ||

తతోవిష్ణుర్మహాతేజాః తీర్థస్యోత్పాదనేవచ | తపస్తేపేతువై తత్ర ధర్మారణ్య సురేశ్వరః || 43 ||

తా || శ్రీ భగవానుని వచనము - ఈ భూమియందు దేవగణములంతా ఎందుకొచ్చారు. ఓ దేవతలార! దీనికి కారణమేమి. రాక్షసులేమైనా, మిమ్మల్ని పీడించారా (20) దేవతలిట్లన్నారు - దైత్యులవల్ల భయము కలుగలేదు. మేము యజ్ఞకర్మ చేద్దామనే ఉత్సాహంతో ఉన్నాము. మేమందరము నీ దర్శనము కొరకు ఆసక్తులమై పదిదిక్కుల చూస్తున్నాము (21) అంతా నీమాయా మోహితులు వ్యాకులచిత్తులు, భయాతురులు మేము, ఉత్తమమైన నీయోగా రూఢరూపాన్ని చూచాము (22) ఓ ఈశ్వర! నిన్ను మేల్కొలుపే కొరకు మేము చెదపురుగును ప్రేరేపించాము. అప్పుడు ఒక అపూర్వ విషయం జరిగింది. నీతల తెగిపోయింది (23) సూర్యుని గుఱ్ఱపు తలను తెచ్చి అతిచతురుడైన విశ్వకర్మ ఆతలను అతికించాడు ఓ విష్ణు! అందువల్ల హయగ్రీవుడవైనావు. ఓ ప్రభు (24) అనగా విష్ణు వచనము - ఓ దేవతలార! నేను ఆనందించాను. మీకు కావలసిన వరమిస్తాను. దేవదేవుడను, జగత్పతిని ఐన నేను హయగ్రీవుడనైనాను. (25) రౌద్రమైనది కాదు. వికృతరూపముకాదు. దేవతలంతా సేవించారు నన్ను. ఓ దేవతలార! నేను వరదుడనైనాను. హయాసనుడను అని సంతోషించాను (26) వ్యాసుని వచనము - యాగం చేశాక బ్రహ్మ ధీమంతుడు సంతుష్టమైన మనస్సుతో చెదపురుగులకు, విశ్వకర్మకు యజ్ఞభాగము ఇచ్చి (27) యజ్ఞాంతమందు ఇంద్రునకు నమస్కరించి దివమునకు వెళ్ళాడు. హయాసనుడుగా హరి ఎందుకైనాడో దానికి కారణము ఇది అని తెలుసుకో (28) అని యుథిష్ఠిరుని వచనము - ఒక పాదంతో భూమినంతా ఆక్రమించినవాడు నిజంగా రోమముల ప్రతిరంధ్రమందు విడివిడిగా (29) వేలకొలది బ్రహ్మాండములు ఉన్నాయి. ఓ మహాద్యుతే ! కన్పిస్తున్నాయి కూడా. ఆతనిని దరిని (అంతమును) వేదములు కూడా తెలుసుకొనలేవు. ఆతని తలతెగిపోవటం ఎట్లా జరిగింది. (30) వ్యాసుని వచనము - ఓ పాండవశ్రేష్ఠ! పౌరాణికమైన శుభ##మైన కథను నీవు విను. ఈశ్వరుని చరిత్రను చరాచరములలో ఎవరూ తెలుసుకొనలేరు (31) ఒకసారి బ్రహ్మసభకు ఇంద్రాది దేవతలు వెళ్ళారు. భూర్లోకాదులు అందరు స్థావరములూ, చరములూ (32) దేవతలు, బ్రహ్మర్షులు అందరు పితామహుని నమస్కరించుటకు వెళ్ళారు. ఆ సభకు విష్ణువు కూడా వచ్చాడు. అది రహస్యం కనుక (33) బ్రహ్మకూడా ఏమాత్రం గర్వం లేకుండ అప్పుడు ఇట్లా అన్నాడు. ఓ దేవతలార! వినండి. మూడింటికి గొప్ప కారణమైన వాడెవడు (34) ఓ దేవతలార! బ్రహ్మ ఈశ విష్ణువుల మధ్యలో ఎవరు గొప్పో నిజం చెప్పండి అనగా ఆ మాటను విని దేవతలు ఆశ్చర్యపడ్డారు (35) అప్పుడు దేవతలన్నారు. ఓ దేవతలార! మాకు తెలియదు. అని బ్రహ్మపత్ని అప్పుడు సురేశ్వరుడైన విష్ణువుతో అంది. మీ ముగ్గురు దేవతలలో ఎవరు గొప్పో చెప్పు అని (36) విష్ణువువచనము - ముల్లోకములు విష్ణుమాయా బలము వలన మోహితమైనాయి, అని అప్పుడు బ్రహ్మ ఇట్లన్నాడు. ఓ విభు! నీకు తెలియదు (37) నీమాయా బలముతో మొహం పొందటంలేదు అనగా ఇట్లా కాదు. నీవు గర్వహింసాపరుడవు. జగద్భర్తగా, జగతంప్రభుడవుగా (38) పెద్ద వానిగా అందరు నిన్ను గుర్తించటంలేదు. విష్ణుమాయా వృతులు అంతా నశించేవారు అనగా అప్పుడు బ్రహ్మరోషంతో క్రుద్ధుడై ముఖంజేవురించగా (39) కోపంతో ఇట్లా అన్నాడు. ఓవిష్ణు! నా మాటవిను. ఏ ముఖంతో సభలో ఈ మాట అన్నావో (40) ఆ నీముఖము (తల) త్వరగా, కొద్ది కాలంలోనే పడిపోనీ. అనగా ఇంద్రుడు ఋషులు మొదలగు వారంతా హాహాకారాలు చేశారు (41) విష్ణువు విషయంలో బ్రహ్మను క్షమింపచేశారు- దేవతోత్తములు విష్ణువు ఆ మాటను విని, సత్యము సత్యమౌతుందిది (42) అని ఆ పిదప మహా తేజస్సంపన్నుడైన విష్ణువు తీర్థమును ఉత్పత్తి చేసి, ఆసురేశ్వరుడు ధర్మారణ్యమందు తపస్సు చేశాడు.

మూ || అశ్వతీర్థం ముఖం దృష్ట్వా హయగ్రీవోజనార్దనః || 43 ||

తపస్తేపే మహాభాగ విధినా సహభారత | నశక్యం కేసచిత్‌ కర్తుమాత్మనాత్మైవ తుష్టవాన్‌ || 44 ||

బ్రహ్మాపితపసాయుక్తః తేపే వర్షశతత్రయం | తిష్ఠన్నేవపురోవిష్ణోః విష్ణుమాయా విమోహితం || 45 ||

యజ్ఞార్థమ వదత్తుష్టో దేవదేవో జగత్పతిః | బ్రహ్మంస్తే ముక్తతాద్యాస్తి మమమాయాప్యదుఃసహా || 46 ||

తతోలబ్థోపరోబ్రహ్మాహృష్టచిత్తోజనార్దనః | ఉవాచ మధురాంవాచం సర్వేషాం హితకారణాత్‌ || 47 ||

అత్రా భవన్మహాక్షేత్రం పుణ్యం పాప ప్రణాశనం | విధివిష్ణుమయం చైతత్‌ భవత్వేతన్న సంశయః || 48 ||

తీర్థస్యమహిమారాజన్‌ హయ శీర్షస్త దాహరిః | శుభాననోహిసంజాతః పూర్వేణౖవాననేసతు || 49 ||

కందర్పకోటి లావణ్యో జాతః కృష్ణస్తదా నృప | బ్రహ్మాపితవసాయుక్తో దివ్యం వర్షశతత్రయం || 50 ||

సావిత్ర్యాచకృతం యత్ర విష్ణుమాయాన బాధతే | మాయయాతుకృతం శీర్షం పంచమం శార్దులస్యవా || 51 ||

ధర్మారణ్య కృతం రమ్యం హరేణచ్ఛేదితం పురా | తసై#్మ దత్వావరం విష్ణుః జగామాదర్శనం తతః || 52 ||

స్థాపయిత్వావిధిస్తత్ర తీర్థంచైవత్రిలోచనం | ముక్తేశం నామదేవస్య మోక్షతీర్థమరిందమ || 53 ||

గతః సోపి సురశ్రేష్ఠః స్వస్థానం సురసేవితం | తత్రప్రేతా దివంయాంతి తర్పణన ప్రతర్పితాః || 54 ||

అశ్వమేధ ఫలం స్నానే పానే గోదాన జంఫలం | పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యాః సరితస్తథా || 55 ||

స్నానార్థ మత్రా గచ్ఛంతి దేవతాః పితరస్తథా | కార్తిక్యాం కృత్తికాయోగే ముక్తేశం పూజయేత్తుయః || 56 ||

స్నాత్వా దేవసరే రమ్యే సత్వా దేవం జనార్దనం | యఃకరోతిసరోభక్త్యా సర్వపాపైః ప్రముచ్యతే || 57 ||

భుక్త్వాభోగాన్యథా కామం విష్ణులోకం సగచ్ఛతి | అపుత్రా కాకవంధ్యాచ మృతవత్సామృత ప్రజా || 58 ||

ఏకాంబరేణ సుస్నాతౌ పతిపత్న్యౌ యథావిధి | తద్దోషం నాశ##యే న్నూనం ప్రజాప్తి ప్రతిబంధకం || 59 ||

మోక్షేశ్వర ప్రసాదేన పుత్రపౌత్రా దివర్థయేత్‌ దద్యాద్వైకేన చిత్తేన ఫలాని సత్యంసంయుతా || 60 ||

నిధాయ వంశపాత్రేపి నారీదోషాత్ప్రముచ్యతే || 60 1/2 ||

తా || హయగ్రీవుడైన జనార్దనుడు గుఱ్ఱపు తలగల తన ముఖం చూసుకొని (43) ఓ భారత! శాస్త్ర ప్రకారముగా ఆ మహాభాగుడు తపమాచరించాడు. ఎవరూ చేయలేనంత తపమాచరించాడు. ఆత్మతో ఆత్మ (తానుతానే) సంతుష్టమైంది (44) బ్రహ్మకూడా తపము చేయువాడై మూడు వందల సంవత్సరాలు తపమాచరించాడు. విష్ణు మాయా విమోహితుడై విష్ణువు ఎదురుగానే ఉండి తపమాచరించాడు. (45) యజ్ఞము కొరకు ఆహ్వానించాడు. దేవదేవుడు జగత్పతి సంతుష్టుడై ఓ బ్రహ్మ! ఈవేళ నీకు ముక్తి లభించింది నా మాయ భరింపరానిది (46) వరమును పొంది బ్రహ్మ, ఆనందముతో నిండిన హృదయం కలవాడైనాడు. అందరికీ మేలు కొరకు జనార్దనుడు మధురమైన మాటను ఇట్లా పలికాడు. (47) ఇక్కడ మహాక్షేత్ర మౌతుంది. పుణ్యప్రదమైనది, పాపనాశకమైనది. విధి విష్ణుమయము ఔతుంది. ఈ ప్రదేశము, అనుమానములేదు (48) ఓరాజ! ఇది ఈ తీర్థమహిమ అట్లా హరిహయ శీర్షుడైనాడు. పూర్వముఖముతో తిరిగి శుభాననుడైనాడు (49) ఓ నృప! అప్పుడు కృష్ణుడు కోటి మన్మథులంత సౌందర్య వంతుడైనాడు. బ్రహ్మకూడా దేవతల మూడు వందల సంవత్సరాలు తపమాచరించాడు (50) సావిత్రి కూడా తపమాచరించింది. ఇక్కడ విష్ణుమాయ బాధించదు. మాయతో చేయబడిన ఐదవతల శార్దూలముది (దానిని శివుడు హరించాడు. అదే బ్రహ్మ విష్ణువునకు శాపమిచ్చిన ముఖము) (51) ధర్మారణ్య మందు, పూర్వము ఆ ముఖమును హరుడు ఛేదించి రమ్యము చేశాడు. ఆతనికి వరమిచ్చి విష్ణువు పిదప కన్పించకుండా పోయాడు (52) విధి అక్కడ త్రిలోచన తీర్థమును స్థాపించాడు. ముక్తేశమను పేరు గల దేవుని మోక్షతీర్థము, ఓ అరిందమ! (53) ఆ సురశ్రేష్ఠుడు కూడా దేవతలు సేవించే తన స్థానమునకు వెళ్ళాడు. అక్కడ మరణించిన వారు తర్పణముతో తృప్తి పొంది స్వర్గమునకు వెళ్తారు (54) స్నానం చేస్తే అశ్వమేథఫలము స్నానంచేస్తే గోదానంవల్ల కలిగే ఫలము కలుగుతాయి. పుష్కరాది తీర్థములు, గంగాది నదులు (55) స్నానం కొరకు ఇక్కడి కొస్తాయి. దేవతలు, పితరులు వస్తారు. కార్తికమాసం కృత్తికానక్షత్రమందు ముక్తేశుని పూజించినవారు (56) రమ్యమైన దేవ సరమందు స్నానంచేసి, జనార్దునుని నమస్కరించి వారు, భక్తితో ఆచరించినవారు పాపములన్నింటి నుండి ముక్తులౌతారు (57) స్వేచ్ఛగా భోగముల ననుభవించి ఆతడు విష్ణులోకమునకు వెళ్ళుతాడు. సంతానహీనురాలు, ఒకే సంతానం గల స్త్రీ చనిపోయిన సంతానం కల స్త్రీ పుట్టగానే చచ్చే సంతానం గల స్త్రీ (58) ఒకే వస్త్రంతో భార్యా భర్తలు శాస్త్ర ప్రకారము స్నానం చేస్తే, సంతాన ప్రాప్తికి ప్రతిబంధకమైన ఆదోషాన్ని (ముక్తేశుడు) నశింపచేస్తాడు తప్పదు. (59) మోక్షేశ్వరుని అనుగ్రహంతో పుత్రపౌత్రాదులు వృద్ధి చెందుతారు. సత్యము గలవారై ఏకా గ్రచిత్తంతో పండ్లను ఇస్తే (60) వెదురు పాత్ర యందుంచి ఇస్తే ఆ స్త్రీ దోష విముక్తురాలౌతుంది (60 1/2).

మూ || ప్రాప్నువంతి చదేవాశ్చ అగ్నిష్టోమ ఫలంనృప || 61 ||

వేధా హరిత్‌ హరిశ్చైవ తప్యంతే పరమంతపః | ధర్మారణ్య త్రిసంధ్యంచ స్నాత్వా దేవసరస్యథ || 62 ||

తత్రమోక్షేశ్వరః శంభుః స్థాపితోవైతతః సురైః | తత్రసాంగం జపంకృత్వాన భూయః స్తనపోభ##వేత్‌ || 63 ||

ఏవంక్షేత్రం మహారాజ ప్రసిద్ధం భువనత్రయే | యస్తత్రకురుతే శ్రాద్ధం పితౄణాం శ్రద్ధయాన్వితః || 64 ||

ఉద్ధరేత్సప్త గోత్రాణి కులమే కోత్తరం శతం | దేవసరో మహారమ్యం నానాపుషై#్పః సమన్వితం శ్యామం సకల కల్హారైః వివిధైర్జల జంతుభిః || 65 ||

బ్రహ్మవిష్ణు మహెశాద్యైః సేవితం సురమానుషైః | సిద్ధైర్య క్షైశ్చ మునిభిః సేవితం సర్వతః శుభం || 66 ||

యుధిష్ఠిర ఉవాచ -

కీ దృశం తత్సరః ఖ్యాతం తస్మిన్భానే ద్విజోత్తమ | తస్యరూపం ప్రకారం చ కథయస్వయథాతథం || 67 ||

వ్యాస ఉవాచ -

సాధుసాధు మహాప్రాజ్ఞ ధర్మపుత్ర యుధిష్ఠిర | యస్య సంకీర్త నాన్నూనం సర్వపాపైః ప్రముచ్యతే || 68 ||

అతి స్వచ్ఛతరం శీతం గంగోదక సమప్రభం | పవిత్రం మధురం స్వాదు జలం తస్యనృపోత్తమ || 69 ||

మహావిశాలం గంభీరం దేవఖాతం మనోరమం | లహర్యాది భిర్గం బీరైః ఫేనావర్త సమాకులం || 70 ||

ఝషమండూక కమఠైః మకరైశ్చ సమాకులం | శంఖశుక్త్యాది భిర్యుక్తం రాజహంసైః సుశోభితం || 71 ||

వటప్లక్షైః సమాయుక్తం అశ్వత్థామ్రైశ్చవేష్టితం | చక్రవాక సమోపేతం బకసార పటిట్టిభైః || 72 ||

కమనీయ ప్రగం ధాచ్ఛ చ్ఛత్రవత్రైః సుశోభితం | సేవ్యమానం ద్విజైః సర్వైః సారసాద్యైః సుశోభితం || 73 ||

సదేవైర్మునిభిశ్చైవ విపై#్రర్మర్త్యైశ్చ భూమిప | సేవితం దుఃఖహం చైవ సర్వపాప ప్రణాశనం || 74 ||

అనాదిని ధనోదంతం సేవితం సిద్ధమండలైః | స్నానాదిభిః సర్వదైవ తత్సరో నృపసత్తమ || 75 ||

విధినాకురుతేయస్తు నీలో త్సర్గం చ తత్తటే | ప్రేతా నైవ కులేతస్య యావదింద్రాశ్చతుర్దశ || 76 ||

కన్యాదానం చేయేకుర్యుః విధినాతత్ర భూపతే | తేతిష్ఠంతి బ్రహ్మలోకే యావదా భూతసంప్లవం || 77 ||

మహీషీం గృహ దాసీంచ సురభీం సుత సంయుతాం | హోమ విద్యాం తథాభూమిం రథాంశ్చ గజవాససీ || 78 ||

దదాతి శ్రద్ధయాతత్ర సోక్షయం స్వర్గమశ్నుతే |

దేవఖాతస్య మాహాత్మ్యం యః పఠేచ్చివసన్నిధౌ | దీర్ఘమాయుస్తథాసౌఖ్యం లభ##తేనాత్ర సంశయః || 79 ||

యః శృణోతి సరోభక్త్యానా రీవాత్వి దమద్భుతం | కులేతస్య భ##వేచ్ఛ్రేయః కల్పాంతేపి యుధిష్ఠిర || 80 ||

ఏతత్సర్వం మయాఖ్యాతం హయగ్రీవస్యకారణం | ప్రభావస్తస్య తీర్థస్య సర్వపాపాయ నుత్తయే || 81 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే హయగ్రీవ స్యాఖ్యాన వర్ణనం నామ పంచదశోధ్యాయః || 15 ||

తా || ఓ నృప! దేవతలు అగ్నిష్టోమ ఫలమును పొందుతారు (61) బ్రహ్మ విష్ణువు, శివుడు పరమమైన తపమాచరించారు. ధర్మారణ్య మందు మూడు సంధ్యలందు దేవసరమందు స్నానంచేసి (62) ఆ పిదప దేవతలు మోక్షేశ్వరుని శంభుని అక్కడ స్థాపించారు. అక్కడ సాంగముగా జపమాచరించినవారు, తిరిగిస్తన్యపానం చేయరు (63) ఓ మహరాజ! ఈ విధముగా ఆ క్షేత్రము భువన త్రయమందు ప్రసిద్ధమైనది. అక్కడ పితరులకు శ్రద్ధతో శ్రాద్ధము చేసిన నరుడు (64) సప్త గోత్రములను ఉద్ధరిస్తాడు. దేవ సరము చాలా రమ్యమైనది. రకరకాల పూలతో కూడినది. శ్యామ వర్ణము కలది. అన్ని విధములైన కలువపూలతో, రకరకాలైన జలజంతువులతో కూడినది (65) బ్రహ్మ విష్ణు మహెశాదులతో, సురలతో మనుషులతో సేవించబడినది. సిద్ధులు యక్షులు మునులు సేవించినట్టిది. అన్ని విధముల శుభ##మైనది (66) యుధిష్ఠిరుని వచనము - ఓ ద్విజోత్తమ! ఆ స్థానమందు ఆ సరస్సు ఎట్లా ప్రసిద్ధి చెందింది. దాని రూపాన్ని దాని ప్రకారాన్ని ఉన్న దున్నట్లుగా చెప్పండి (67) అనగా వ్యాసుని వచనము - ఓ మహాప్రాజ్ఞ! ధర్మపుత్ర! యుధిష్ఠిర! బాగుబాగు. దాని సంకీర్తన వల్ల నిజంగా సర్వపాపముల నుండి ముక్తులౌతారు (68) మిక్కిలి స్వచ్ఛతరమైనది శీతమైనది. గంగో దకముతో సమమైన కాంతి గలది, పవిత్రమైనది మధురమైనది రుచికరమైనది దాని నీరు, ఓ నృపోత్తమ! (69) మహా విశాలమైనది గంభీరమైనది మనోరమమైనది ఆదేవ ఖాతము, అలలు మొదలగు వానితో గంభీరమైనది నురుగుతో నుడులతో నిండినది (70) చేపలు, కప్పలు, తాబేళ్ళు, మొసళ్ళతోనిండినది. శంఖములు, ముత్యములు మొదలగు వానితో కూడినది, రాజహంసలతో బాగా శోభిస్తున్నది (71) మర్రిజువ్వి, వృక్షములతో కూడినది, రావి మామిడి చెట్లతో చుట్టబడినది. చక్రవాకములతో కూడినది. కొంగలు, సారసపక్షులు, లకుముకిపిట్టలు వీటితో కూడినది (72) అందమైన మంచి వాసనగల స్వచ్ఛమైన గొడుగు వంటి (పెద్ద) ఆకులతో బాగా శోభిస్తున్నట్టిది, పక్షులన్నింటితో సేవించబడుతున్నది, సారసాదులతో బాగా శోభిస్తున్నట్టిది, (73) ఓ భూమిప! దేవతలతో మునులతో బ్రాహ్మణులతో నరులతో (కూడియున్నట్టిది) సేవించబడుతున్నది, దుఃఖమును నశింపచేసేది, పాపములన్నిటిని నశింపచేసేది (74) ఆధ్యంతములు లేని చరిత్ర గలది, సిద్ధమండలములతో సేవింపబడేది, ఎల్లప్పుడు స్నానాదుల ద్వారా, ఓ నృపసత్తమ! ఆ సరస్సు అట్టిది (75) దాని తటమందు జల తర్పణమును శాస్త్రప్రకారము చేసిన వాని కులమందు ప్రేతలు ఉండరు, పదునాలుగు రింద్రులున్నంత కాలము (76) అక్కడ శాస్త్ర ప్రకారము కన్యాదానము చేసినవారు, ఓ భూపతే ! బ్రహ్మలోకమందు జల ప్రళయమొచ్చేదాక ఉంటారు (77) బఱ్ఱను, గృహదాసిని, సంతానము కల సురభిని, బంగారము, విద్య, భూమి రథము, ఏనుగు, వస్త్రములు వీటన్నిటిని (78) అక్కడ శ్రద్ధగా ఇచ్చినవారు అక్షయమైన స్వర్గమును పొందుతారు. దేవఖాత మాహాత్మ్యమును శివుని సన్నిధి యందు చదివినవారు దీర్ఘాయువును, సౌఖ్యమును పొందుతారు, అనుమానము లేదు (79) ఈ అద్భుతమును భక్తితో వినిన నరుడు కాని, నారికాని వారి కులములో శ్రయస్సు కల్గుతుంది, కల్పాంతరమందు కూడ, ఓ యుధిష్ఠిర! (80) హయగ్రీవుని కారణముగా ఇదంతా నేను చెప్పాను. దాని కాంతులు (తీర్థపు) సర్వపాపములు, తొలగించే కొరకే (81) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు హయగ్రీవుని కథ వర్ణించుట అనునది పదునైదవ అధ్యాయము || 15 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters