Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఐదవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

అతః పరం ప్రవక్ష్యామి ధర్మారణ్య నివాసినా | యత్కార్యం పురుషేణహ గార్హస్థ్యమనుతిష్ఠతా || 1 ||

ధర్మారణ్యషు యేజాతా బ్రాహ్మణాః శుద్ధవంశజాః | అష్టాదశ సహస్రాశ్చ కాజేశైశ్చ వినిర్మితాః || 2 ||

సదాచారాః పవిత్రాశ్చ బ్రాహ్మణాః బ్రహ్మవిత్తమాః | తేషాం దర్శనమాత్రేణ మహాపాపైర్విముచ్యతే || 3 ||

యుధిష్ఠిర ఉవాచ -

పారశర్య సమాఖ్యాహి సదాచారం చమేప్రభో | ఆచారాద్ధర్మమాప్నోతి ఆచారాల్లభ##తేఫలం

ఆచారాచ్ఛ్రియమాప్నోతి తదాచారం వదన్వమే || 4 ||

వ్యాస ఉవాచ -

స్థాపరాః కృమయోబ్జాశ్చ పక్షిణః పశవోనరాః | క్రమేణ ధార్మికాస్త్వేత ఏతేభ్యో ధార్మికాః సురాః || 5 ||

సహస్ర భాగాత్ర్పథమే ద్వితీయానుక్రమాస్తథా | సర్వఏతే మహాభాగాః పాపాన్ముక్తి సమాశ్రయాః || 6 ||

చతుర్ణామపిభూతానాం ప్రాణినోతీవచోత్తమాః | ప్రాణిభ్యోపి మునిశ్రేష్ఠాః సర్వేబుద్ధ్యుపజీవినః || 7 ||

మతిమద్భ్యోనరాః శ్రేష్ఠాః తేభ్యః శ్రేష్ఠాస్తు వాడవాః | విప్రేభ్యోపిచ విద్వాంసో విద్వద్భ్యఃకృతబుద్ధయః || 8 ||

కృతధీభ్యోపి కర్తారః కర్తృభ్యో బ్రహ్మతత్పరాః | నతేభ్యోభ్యధికః కశ్చిత్‌ త్రిషులోకేషుభారత || 9 ||

అన్యోన్య పూజకాస్తే వైతపోవిద్యావిశేషతః | బ్రహ్మణో బ్రహ్మణా నృష్టః సర్వభూతేశ్వరోయతః || 10 ||

అతోజగత్‌ స్థితం సర్వం బ్రాహ్మణోర్హతినాపరః | సదాచారోహి సర్వార్హోనాచారా ద్విచ్యుతఃపునః || 11 ||

తస్మాద్విప్రేణ సతతం భావ్యమాచారశీలి నా | విద్వేషరాగరహితా అనుతిష్ఠంతి యంమునే || 12 ||

సద్ధియస్తంసదాచారం ధర్మమూలం విదుర్బుధాః | లక్షణౖః పరిహీనోపి సమ్యగా చారతత్పరః || 13 ||

శ్రద్ధాలు రనునూయుశ్చనరోజీవేత్‌ సమాఃశతం | శ్రుతి స్మృతిభ్యా ముదితం స్వేషుస్వేషుచకర్మసు || 14 ||

సదాచారం నిషేవేత ధర్మమూల మతంద్రితః | దురాచారరతోలోకే గర్హణీయః వుమాన్భవేత్‌ || 15 ||

వ్యాధిభిశ్చాభి భూయేత సదాల్పాయుః సదుఃఖభాక్‌ | త్యాజ్యం కర్మపరాధీనంకార్యమాత్మవశం సదా || 16 ||

తా || వ్యాసుని వచనము - ఇకముందు ధర్మారణ్య మందు నివసించే వారు, గార్హస్థ్య మనుసరించే పురుషులు ఏ మాచరించాలో దానిని చెప్తాను (1) ధర్మారణ్య మందు పుట్టిన శుద్ధ వంశజులైన బ్రాహ్మణులు పదునెనిమిది వేలు, కాజేశులతో నిర్మింపబడ్డ వాళ్ళు (2) సదాచారులు, పవిత్రులు, బ్రాహ్మణులు, బ్రహ్మవిత్తములు, వారిని దర్శించినంతలో మహా పాపముల నుండి ముక్తులౌతారు (3) యుధిష్టురుని వచనము - ఓ పారాశర్య! ప్రభు సదాచారమంటే ఏమిటో నాకు చెప్పండి. ఆచారము నుండి ధర్మం లభిస్తుంది. ఆచారము నుండి ఫలితాన్ని పొందుతారు. ఆచారం వల్ల శ్రీని పొందుతారు. కనుక ఆ ఆచారమంటే ఏమిటో నాకు చెప్పండి. (4) వ్యాసుని వచనము - స్థావరములు, పురుగులు, జలజంతువులు, పక్షులు, పశువులు, నరులు వీరు క్రమంగా ధార్మికులు. వీరికన్న ధార్మికులు సురలు (5) సహస్ర భాగము నుండి మొదటి దాని యందు రెండవది ఒక దాని వెంట ఒకటి (మూడవది అట్లా) వీరందరు మహా భాగులు పాపము నుండి ముక్తిని ఆశ్రయించే వారు (6) నాల్గు రకముల ప్రాణులలో(భూతములలో) ప్రాణులు చాలా ఉత్తములు (వృక్షములు, క్రిములు, పక్షులు, మానవులు) ప్రాణులకన్న బుద్ధి ఉపజీవులైన వారు శ్రేష్ఠములు ఓ మునులార (7) మతిమంతుల కన్న నరులు శ్రేష్ఠులు. వారి కన్న బ్రాహ్మణులు శ్రేష్ఠులు. బ్రాహ్మణుల కన్న విద్వాంసులు శ్రేష్ఠులు, విద్వాంసుల కన్న చేయదలచిన దాని యందు బుద్ధి గలవారు శ్రేష్ఠులు (8) వారికన్న చేసేవారు శ్రేష్ఠులు, వారికన్న బ్రహ్మతత్పరులు శ్రేష్ఠులు. ఓ భారత! ముల్లోకములలో వారికన్న శ్రేష్ఠులు లేరు (9) వారు తపస్సు విద్య వీని విశేషములతో పరస్పరము పూజించుకొనేవారు. సర్వభూతములకు ఈశ్వరుడు బ్రాహ్మణుడు. ఆతడు బ్రహ్మచే సృజింపబడ్డాడు (10) అందువల్ల జగత్తులో ఉన్న దానికంతకు బ్రాహ్మణుడు అర్హుడు. ఇతరులుకాదు. సదాచారుడు అన్నింటికి అందరికి అర్హుడు. ఆచారము నుండి తిరిగి విచ్యుతుడు కారాదు (11) అందువల్ల విప్రుడు ఎల్లప్పుడు ఆచారశీలి కావాలి. ఓ ముని! విద్వేషరాగ రహితులై వారాచరించేదాన్ని (12) సద్‌బుద్ధి కలవారు సదాచారమనిన ధర్మమూలమని బుధులు తెలుసుకొన్నారు. లక్షణము వల్ల హీనుడైనా బాగా ఆచారతత్పరుడైన (13) శ్రద్ధాళువై, అసూయరహితుడైన నరుడు నూరు వత్సరాలు జీవిస్తాడు. శ్రుతి స్మతులలోచెప్పబడింది. తమతమకర్మలలో (14) శ్రద్ధగా సదాచారాన్ని ఆచరించాలి. అదిధర్మమునకు మూలము. దురాచారుడైన పురుషుడు లోకంలో గర్హణీయుడౌతాడు. (15) వ్యాధులతో పీడింపబడుతాడు. ఎప్పుడఅల్పాయువు, బాగాదుఃఖభాజనుడుఔతాడు. పరాధీనమైనపనినివదిలిపెట్టాలి ఎప్పుడూ తనఆధీనమైనకర్మను చేయాలి (16)

మూ || దుఃఖీయతఃపరాధీనఃసదైవాత్మవశఃసుఖీ | యస్మిన్కర్మణ్యంతరాత్మాక్రియమాణప్రసీదతి || 17 ||

తదేవకర్మకర్తవ్యంవిపరీతంసచక్వచిత్‌ | ప్రథమంధర్మసర్వస్వంప్రోక్తం యన్నియమా యమాః || 18 ||

అతస్తేష్వేవవైయత్నః కర్తవ్యోధర్మమిచ్ఛతా | సత్యంక్షమార్తవంధ్యానంఅనృశంస్యమహింసనం || 19 ||

దమఃప్రసాదోమాధుర్యంమృదుతేతియమాదశ | శౌచంస్నానంతపోదానంమౌనేజ్యాధ్యయసంప్రతం || 20 ||

ఉపోషణోవస్థదండోదశైతేనియమాఃస్మృతాః | కామంక్రోథందమంమోహంమాత్సర్యంలోభ##మేవచ || 21 ||

అమూన్‌షడ్వైరిణోజిత్వాసర్వత్రవిజయీభ##వేత్‌ | శ##నైఃసంచినుయాద్ధర్మంవల్మీకంశృంగవాన్యధా || 22 ||

పరపీడామకుర్వాణఃపరలోకసహాయినం | ధర్మఏవనహాయీస్యాత్‌ అముత్ర పరిరక్షితః || 23 ||

పితృమాతృసుత భ్రాతృయోషిద్బంధుజనాధికః జాయతేచైకలః ప్రాణీ మ్రియతేచ తథైకలః || 24 ||

ఏకలఃసుకృతం భుంక్తే భుంక్తే దుష్కృతమేకలః | దేహ పంచత్వమాపన్నేత్యక్వైకం కాష్ఠలోష్ఠవత్‌ || 25 ||

బాంధవావిముఖాయాంతిధర్మోయాంతమనువ్రజేత్‌ | అతః సంచినుయాద్ధర్మమత్రాముత్రసహాయినం || 26 ||

ధర్మంసహాయినం లబ్ధ్వా సంతరేద్దుస్తరంతమః | సంబంధానాచరేన్నిత్యముత్తమైరుత్తమైః సుధీః || 27 ||

అధమానధమాంస్త్యక్త్వాకులముత్కర్షతాంనయేత్‌ | ఉత్తమానుత్తమానేవగచ్ఛేద్ధీనాంశ్చ వర్జయేత్‌

బ్రాహ్మణః శ్రేష్ఠతా మేతి ప్రత్యవాయేన శూద్రతాం || 28 ||

అనధ్యయన శీలంచ సదాచార విలంఘినం | సాలసంచదురన్నాదం బ్రాహ్మణం బాధతేంతకః || 29 ||

అతోభ్యస్యేత్ర్పయత్నేన సదాచారం సదాద్విజః | తీర్థాన్య వ్యభిలష్యంతి సదాచారి సమాగమం || 30 ||

రజనీ ప్రాంతయామార్థంబ్రాహ్మః సమయఉచ్యతేః | స్వహితం చింతయేత్ర్పాజ్ఞః తస్మింశ్చోత్థాయసర్వదా || 31 ||

గజాన్యం సంస్మరేదాదౌ తత ఈశం సహాంబయా | శ్రీరంగం శ్రీ సమేతంతు బ్రహ్మాణం కమలోద్భవం || 32 ||

తా || పరాధీనుడు దుఃఖిఎప్పుడూఆత్మవశ##మైనవాడుసుఖి. ఏపనిచేస్తుండగాఅంతరాత్మప్రసన్నంగాఉంటుందో (17) ఆపనిచేయాలి. విపరీతమైనకర్మనుఎప్పుడూచేయరాదు. నియమములు, యమములు, ధర్మసర్వస్వము అని మొదట చెప్పబడింది. (18) అందువల్లధర్మాన్నికోరేవారు వాటికొరకే ప్రయత్నించాలి. యమములు పది. అవి సత్యము, క్షమ, ఋజువర్తనము, ధ్యానము, అహింస, క్రూరభావము లేకుండుట. (19) దమము, ప్రసాదము, మాధుర్యము, మృదుత అని. నియమములు, పది - అవి శౌచము, స్నానము, తపము, దానము, మౌనము, ఇజ్య (పూజ) అధ్యయనము, వ్రతము (20) ఉపవాసము ఉపస్థదండనము అని. కామము, క్రోధము, దమము, మోహము, మాత్సర్యము, లోభము (21) ఇవి అరిషట్‌ వర్గములు వీటిని జయిస్తే అంతట విజయవంతుడౌతాడు. ధర్మాన్ని మెల్లమెల్లగా సంపాదించాలి, శృంగమనుపురుగు ఎట్లా పుట్టను తయారు చేస్తుందో అట్లా (22) పరపీడను చేయరాదు. పరలోక సహాయి ధర్మము. ధర్మము రక్షింపబడితే అది పరలోకంలో సహాయంగా ఉంటుంది (23) పితృమాతృ సుతులు, భ్రాతృ, యోషిత్‌ బంధుజనులు, ఇంకా ఇతరులు, ఒంటరిగానే పుడ్తారు. ప్రాణులు (ఒంటరిగా) ఆసహాయులుగానే చస్తారు (24) సుకృతాన్ని ఒంటరిగానే అనుభవిస్తాడు. దుష్కృతాన్ని ఒంటరిగానే అనుభవిస్తాడు. దేహంలోంచి ప్రాణం పోయాక, కాష్ఠలోష్ఠములను వలె ఒంటరిగా వదలి (25) బంధువులు విముఖులై పోతారు. ధర్మము, పోయే ప్రాణిని అనుసరిస్తుంది. అందువల్ల ఇక్కడ పై లోకంలో సహాయం చేసే ధర్మాన్ని సంపాదించాలి (26) ధర్మాన్ని సహాయంగా పొంది దుస్తరమైన తమస్సును దాటాలి. ప్రతిరోజు ఉత్తములతో ఉత్తమోత్తములతో బుద్ధిమంతుడు సంబంధములు ఆచరించాలి (27) అధములను అధమాధములను వదలి కులమును మేలు వైపుకు తీసుకు పోవాలి. ఉత్తములను, ఉత్తములనే అనుసరించాలి. హీనులను వదలాలి బ్రాహ్మణుడు శ్రేష్ఠుడౌతాడు. పాపముతో శూద్రుడౌతాడు (28) అధ్యయన స్వభావంలేని, సదాచారములు అతిక్రమించే, అలసుడైన, దుష్టమైన అన్నమును తినే బ్రాహ్మణుని యముడు బాధిస్తాడు (29) అందువల్ల ద్విజుడు ఎల్లప్పుడు ప్రయత్న పూర్వకముగా సదాచారమును అభ్యసించాలి. తీర్థములు కూడా సదాచారముగల వాని సమాగమమును కోరుకుంటాయి. (30) రాత్రియొక్క చివరిఅర్ధయామము బ్రాహ్మ సమయముఅని అనబడుతుంది. ఆ బ్రాహ్మముహూర్తమందు లేచి, ఎప్పుడూ ప్రాజ్ఞుడు తన హితమును గురించి ఆలోచించాలి (31) తొలుత గణపతిని స్మరించాలి. పిదప పార్వతితో కూడిన శివుని స్మరించాలి. శ్రీసమేతమైన శ్రీరంగమున, కమలోద్భవుడైన బ్రహ్మనుస్మరించాలి (32).

మూ|| ఇంద్రాదీన్సకలాన్దేవాన్‌ వసిష్ఠా దీన్మునీనపి | గంగాద్యాః సరితః సర్వాః శ్రీశైలాద్యఖిలాన్గిరీన్‌ || 33 ||

క్షీరోదాదీన్‌ సముద్రాంశ్చ మానసాది నరాంసిచ | వనాని నందనాదీని ధేనూః కామదుఘాదయః || 34 ||

కల్పవృక్షాది వృక్షాంశ్చ ధాతూన్‌ కాంచనముఖ్యతః | దివ్యస్త్రీరుర్వశీముఖ్యాఃప్రహ్లాదాద్యాన్‌ హరేఃప్రియాన్‌ || 35 ||

జననీ చరణౌస్మృత్వా సర్వతీర్థోత్తమోత్తమౌ | పితరంచ గురూంశ్చాపి హృదిధ్యాత్వా ప్రసన్నధీః || 36 ||

తతశ్చావశ్యకం కర్తుం నైర్‌ఋతీం దిశమాప్రజేత్‌ | గ్రామాద్ధనుఃశతంగచ్ఛేత్‌ నగరాచ్చచతుర్గుణం || 37 ||

తృణౖరాచ్ఛాద్యవసుధాంశిరః ప్రావృత్యవానసా | కర్ణోప వీత ఉదక్‌ వక్త్రో దివసే సంధ్యయోరపి || 38 ||

విణ్మూత్రే వినృజేన్మౌనీ నిశాయాం దక్షిణాముఖః | సతిష్ఠన్నాశునోవిప్రగోపహ్న్యనిల సంముఖః || 39 ||

సఫాలకృష్టేభూభాగే నరథ్యాసేవ్యభూతలే | నాలోకయేద్దిశోభాగాన్‌ జ్యోతిశ్చక్రంసభోమలం || 40 ||

వామేన పాణినాశిశ్నం ధృత్వోత్తిష్ఠేత్ర్పయత్నవాన్‌ | అథోమృదం సమాదద్యాత్‌ జంతుకర్కరవర్జితాం || 41 ||

విహాయ మూషకోత్ఖాతాం చోచ్ఛిష్టాం కేశసంకులాం | గుహ్యేదద్యాన్మృదం చైకాం ప్రక్షాల్యచాంబునాతతః || 42 ||

పునర్వామకరేణతి పంచధాక్షాలయేద్గుదం | ఏకైక పాదయోర్దద్యాత్తి న్రః పాణ్యోః మృదస్తథా || 43 ||

ఇత్థంశౌచం గృహీకుర్యాత్‌ గంధలేపక్షయావధి | క్రమాద్వైగుణ్యతః కుర్యాత్‌ బ్రహ్మచర్యాదిషుత్రిషు || 44 ||

దివావిహిత శౌచాచ్చ రాత్రా వర్థం సమాచరేత్‌ | పరగ్రామే తదర్ధంచ పథిత స్యార్థమేవచ || 45 ||

తదర్ధంరోగిణాం చాపి సుస్థేన్యూనం నకారయేత్‌ | అపిసర్వనదీతోయైః మృత్కూటైశ్చావ్యగోపమైః || 46 ||

ఆపాతమాచరేచ్ఛౌచం భావదుష్టోనశుద్ధిబాక్‌ | ఆర్ద్రధాత్రీఫలోన్మానామృదః శౌచే ప్రకీర్తితాః || 47 ||

సర్వాశ్చా హుతయోప్యేవంగ్రా సాశ్చాంద్రాయణపిచ | ప్రాగాస్య ఉదగాస్యోవాసూపవిష్టః శుచౌభువి || 48 ||

ఉపస్పృశేద్విహీనాభిః తుషాంగారాస్థిభస్మభిః | అతిస్వచ్ఛాభిరద్భిశ్చ యావత్‌ హృద్గాభిరత్వరః || 49 ||

బ్రాహ్మణోబ్రహ్మతీర్థేన దృష్టి పూతాభిరాచమేత్‌ | కంఠగాభిః నృపః శుధ్యేత్‌ తలుగాభిస్తథోరుజః || 50 ||

స్త్రీ శూద్రా వథ సంస్పర్శమాత్రేణాపి విశుద్ధ్యతః | శిరః శబ్దం సకంఠంవాజలే ముక్తశిఖోపివా || 51 ||

తా || ఇంద్రాది సకల దేవతలను వసిష్ఠాది మునులను, గంగాది అన్ని నదులను, శ్రీశైలము మొదలుగా అన్ని గిరులను (33) పాల సముద్రము మొదలుగా సముద్రములను మానసాది సరస్సులను,నందనాది వనములను కామధేనువు మొదలుగా ధేనువులను (34) కల్పవృక్షాది వృక్షములను, కాంచనము మొదలుగా గల ధాతువులను, ఉర్వశి ముఖ్యులైన దేవతాస్త్రీలను, ప్రహ్లాదుడు మొదలుగా హరిభక్తులను (35) సర్వతీర్థముల కన్న ఉత్తమోత్తమమైన తల్లి పాదములను స్మరించి, తండ్రిని, గురువులను హృదయంలో ధ్యానించి, ప్రసన్నమైన బుద్ధికలవాడై (36) పిదప ఆవశ్యమైన దానిని చేయటకు నైఋతి దిశకు వెళ్ళాలి. గ్రామము నుండి నూరుధనువుల దూరం వెళ్ళాలి (4 మూరలపై కొలత /ధనువు) నగరమునుండైతే నాల్గింతల రెట్టింపు దూరంవెళ్ళాలి (37) భూమిని గడ్డితో కప్పితలను బట్టతో కప్పుకొని, యజ్ఞోపవీతమును చెవికి ధరించి ఉత్తరదిక్కుగా ముఖంపెట్టి పగలు రెండు సంధ్యలందు (38) మౌనంగా మల మూత్రములు వదలాలి. రాతరిపూట దక్షిణ ముఖంగా వదలాలి. నిలబడి వదలరాదు. త్వరత్వరగా వదలరాదు. విప్రులకు గోవులకు, అగ్నికి వాయువునకు ఎదురుగా నిలబడి వదలరాదు (39) నాగలితో దున్నబడిన భూభాగమందు వదలరాదు. రథసమూహములు వెళ్ళే మార్గమందు వదలరాదు. దిగ్భాగములను చూడరాదు. జ్యోతిశ్చక్రమును ఆకాశమును, మలమును చూడరాదు (40) ఎడమ చేతితో శిశ్నమును ధరించి ప్రయత్నించి లేవాలి. పిదప మట్టిని తీసుకోవాలి. అందులో జంతువుల ఎముకలు ఉండరాదు (41) ఎలుకలు తవ్వినది, ఉచ్ఛిష్టమైనది కేశములతో కూడినది తీసుకోరాదు. కొంచం మన్నును ముడ్డికి రాయాలి పిదప నీటితో కడగాలి (42) తిరిగి ఎడమ చేతితో ముడ్డిని కడుగుకోవాలి. ఇట్లా ఐదుసార్లు చేయాలి. ఒక్కొక్క కాలికి మూడేసి సార్లు మట్టి రాయాలి. అట్లాగే చేతులకు గూడా రాయిలి (43) ఈ విధముగా గృహస్థు గంధ లేపము నశించే దాక శౌచము చేయాలి. క్రమంగా బ్రహ్మచర్యాది మూడు ఆశ్రమములలో రెట్టింపుగా చేయాలి (44) పగలు విధించిన శైచముకన్న రాత్రిపూట సగమే ఆచరించాలి. పరగ్రామ మందు అందులో సగ(1/4) మాచరించాలి. మార్గమందు అందులో సగమే (1/8) ఆచరించాలి (45) రోగులకు అందులో సగము. ఆరోగ్యంగా ఉంటే తక్కువగా ఆచరించరాదు. సర్వనదుల నీళ్ళతో, పర్వతములా ఉన్న మట్టి సమూహములతో ఆచరించాలి (46) శౌచమును అప్పుడే ఆచరించాలి. దుష్టంగా మారితే శుద్ధి కాదు.పచ్చి ఉసిరికాయ పరిమాణంగల మట్టిని శౌచమునకు తీసుకోవాలని చెప్పారు (47) అన్ని ఆహుతులు ఇట్లాగే చాంద్రాయణ మందు ఆహారములు ఇదే ప్రమాణము. తూర్పు ముఖంగానో, ఉత్తరముఖంగానో బాగా కూర్చొని శుచి ప్రదేశ మందు (కూర్చొని) (48) ఉముక, బొగ్గులు, ఎముకలు, బూడిద ఇవిలేని నీటిని తాకాలి (ఆచమించాలి) అతి స్వచ్ఛమైన నీటితో, అది హృదయం చేరే వరకు, తొందరపడకుండా (49) బ్రాహ్మణుడు బ్రహ్మతీర్థంతో, దృష్టి పూతమైన తీర్థంతో ఆచమించాలి. కంఠము వరకు నీళ్ళు వెళ్ళే దాకా రాజు ఆచమించాలి. ఊరుజుడు (వైశ్యుడు) తాలువు వరకు నీరు చేరేటట్లు ఆచమించాలి (50) స్త్రీ శూద్రులు నీటిని తాకటంతోనే శుద్ధులౌతారు. శిరము అనగా కంఠము వరకు గాని శిఖను నీటిలో విడువటం వరకుగాని అని గ్రహించాలి (51).

మూ || అక్షాలితపదద్వంద్వఆచాంతోప్యశుచిర్మతః | త్రిః పీత్వాంబువిశుద్ధ్యర్థం తతః ఖాని విశోథయేత్‌ || 52 ||

అంగుష్ఠ మూలదేశేన హ్యధరోష్ఠై పరిమృజేత్‌ | స్పృష్టా జలేన హృదయం సమస్తాభిః శిరః స్పృశేత్‌ || 53 ||

అంగుల్యగ్రైః తథాస్కంధౌ సాంబు సర్వత్ర సంస్పృశేత్‌ | ఆచాంతః పునరాచామేత్కృత్వారథ్యోవనర్పణం || 54 ||

స్నాత్వాభుక్త్యావయః పీత్వా ప్రారంభే శుభకర్మణాం | సుప్త్వా వానః పరీధాయదృష్ట్వాతథా ప్యమంగలం || 55 ||

ప్రమాదాదశుచిస్మృత్వాద్విరాచాంతః శుచిర్భవేత్‌ | దంతధావనం cపకుర్వీత యథోక్తం ధర్మశాస్త్రతః

ఆచాంతోప్యశుచిర్యస్మాత్‌ అకృత్వా దంతధావనం || 56 ||

ప్రతిపద్దర్శ షష్ఠీషు నవమ్యాం రవివానరే | దంతానాం కాష్ఠసంయోగః దహేదాసప్తమంకులం || 57 ||

అలాభేదంతకాష్ఠానాం నిషిద్ధేవాథవానరే | గండూషా ద్వాదశ గ్రాహ్యాముఖస్య పరిశుద్ధయే || 58 ||

కనిష్ఠాగ్ర పరీమాణం సత్వచం నిర్‌ప్రణారుజం | ద్వాదశాంగులమానంచ సార్ద్రం స్యాద్దంతధావనం || 59 ||

ఏకైకాంగులమాసంతత్‌చర్వయేద్దంతధావనం | ప్రాతఃస్నానం చరిత్వాచశుద్ధ్యైతీర్థేవిశేషతః || 60 ||

ప్రాతఃస్నానాత్‌యతఃశుద్ధ్యేత్‌కాయోయంమలినఃసదా | యస్మలం న వభిశ్చిద్రైః స్రవత్యేవ దివానిశం || 61 ||

ఉత్సాహమేధాసౌభాగ్య రూపసంవత్ర్పవర్ధకం | ప్రాజాపత్యసమం ప్రాహుః తన్మహాఘవినాశకృత్‌ || 62 ||

ప్రాతఃస్నానం హరేత్‌ పాపం అలక్ష్మింగ్లానిమేవచ | అశుచిత్వంచదుఃస్వప్నం తుష్టింపుష్టిం ప్రయచ్ఛతి || 63 ||

నోపసర్పంతి వైదుష్టాః ప్రాతస్నాయిజనం క్వచిత్‌ | దృష్టాదృష్ట ఫలంయస్మాత్‌ ప్రాతః స్నానం సమాచరేత్‌ || 64 ||

ప్రసంగతః స్నాన విధిం ప్రవక్ష్యామినృపోత్తమాః | విధిస్నానం యతః ప్రాహుః స్నానాచ్ఛతగుణోత్తరం || 65 ||

విశుద్ధాంమృదమాదాయ బర్హిషస్తిలగోమయం | శుచౌదేశే పరిస్థాప్యహ్యాచమ్యస్నానమాచరేత్‌ || 66 ||

ఉపగ్రహీబద్ధశిఖః జలమధ్యేసమావిశేత్‌ | స్వశాభోక్తవిధానేన స్నానం కుర్యాద్యధావిధి || 67 ||

తా || కాళ్ళు రెండు కడుక్కోకుండా ఆచమించినచో అశుచి అనబడుతుంది. విశుద్ధి కొరకు నీటిని మూడుసార్లు తాగి పిదప ఇంద్రియములను (నోరు, చెవులు, కండ్లు,ముక్కులు,గుదము, శిశ్నము) శుద్ధి చేసుకోవాలి (52) బొటనవ్రేలి మూల ప్రదేశముతో క్రింద పెదవులను తడుచుకోవాలి. జలముతో హృదయమున స్పృశించి అన్ని వేళ్ళతో శిరస్సును స్పృశించాలి. (53) అంగుళి అగ్రములతో భుజములు స్పృశించి నీటితో అంతట స్పృశించాలి. రాజమార్గాన్ని ఆశ్రయించి వచ్చినచో ముందు ఆచరించినా మళ్ళీ ఆచరించాలి (54) స్నానం చేశాక, భోంచేశాక, నీరు తాగాక శుభకర్మల ప్రారంభ మందు, నిద్రపోయిలేచాక, వస్త్రములు ధరించాక, అమంగలమును చూచాక (55) ప్రమాదంవల్ల (పొరపాటున) అశుచిని స్మరించాక రెండుసార్లు ఆచమిస్తే శుచిఔతాడు. ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా దంతధావనం చేసుకోవాలి. ఆచమించినా అశుచియే. ఎందువల్లనంటే పళ్ళుతోముకోలేదు. కాబట్టి (56) ప్రతిపద, దర్శము, షష్ఠి, నవమి, ఆదివారము ఈ రోజుల్లో పళ్ళను పుల్లతో(కర్రతో) తోమితే, ఏడుతరాల వరకు కులము దగ్ధమౌతుంది (57) దంతకాష్టములు లభించకపోతే, నిషిద్ధమైన వారమందు, పన్నెండుసార్లు పుకిలిస్తే ముఖం పరిశుద్ధమౌతుంది (58) చిటికెన వేలి యొక్క అగ్ర భాగమంత లావు గలది, బెరడు కలది, పుండ్లు లేనిది, రోగములేనిది పన్నెండంగుళముల పొడవైనది, పచ్చిది ఐయ్యుండాలి పళ్ళుతో మేది, పుల్ల (59) ఆదంతధావనం పుల్లను ఒక్కొక్క అంగుళం చొప్పున కొరకాలి, చప్పరించాలి. ప్రాతః స్నానము శుద్ధికొరకు ఆచరించాలి. ప్రత్యేకించి తీర్థమందు ఆచరించాలి (60) ఎందువల్లన ంటే ఈ శరీరము ఎప్పుడూ మలినమైందే కనుక ప్రాతః స్నానము వల్ల శుద్ధమౌతుంది శరీరంలోని మలము రాత్రింబగళ్ళు తొమ్మిది రంధ్రముల నుండి ప్రవహిస్తూనే ఉంది (61) ఉత్సాహము, మేధ, సౌభాగ్యము,రూపము, సంపద వీటిని వర్ధింప చేసేదిస్నానము. దీనిని ప్రాజాపత్యముతో సమానమైనదన్నారు. ఇది మహా పాపములను నశింపచేసేది (62) ప్రాతః స్నానము పాపమును హరిస్తుంది. ఆలక్ష్మిని, గ్లానిని హరిస్తుంది. అశుచిని, దుఃస్వప్నమును హరిస్తుంది. తుష్టిని, పుష్టిని ఇస్తుంది (63) దుష్టమైనవి, ప్రొద్దున్నే స్నానం చేసే జనుని ఎక్కడా సమీపించవు. ప్రాతః స్నానము వలన దృష్ట ఫలము అదృష్ట (కనుపించని) ఫలము కలుగుతాయి (64) ఓ నృపోత్తములార! ప్రసంగవశం వలన స్నాన విధిని చెప్తున్నాను. మామూలు స్నానం కన్నా విధి ప్రకారము స్నానము నూరు గుణములు ఉత్తమమైనదని అన్నారు (65) విశుద్ధమైన, దర్భలు, నువ్వులు, గోమయము గలిగిన మట్టిని తీసుకొని, శుచియైన ప్రదేశమందుంచి ఆచమించి స్నానమాచరించాలి (66) వదములు చదువుతూ శిఖను ముడి వేసుకొని నీటి మధ్య యందు ప్రవేశించాలి. తన శాఖ వారికి చెప్పిన ప్రకారము శాస్త్ర ప్రకారము స్నాన మాచరించాలి (67).

మూ|| స్నాత్వేత్థంవస్త్రమాపీడ్యగృహ్ణీయాద్ధౌతవాససీ | ఆచమ్యచతతః కుర్యాత్‌ప్రాతఃసంధ్యాంకుశాన్వితాం || 68 ||

ప్రాణాయామాన్‌ చరన్‌ విప్రోనియమ్యమాన సందృఢం | అహోరాత్రకృతైఃపాపైః ముక్తోభవతితత్‌క్షణాత్‌ || 69 ||

దశద్వాదశసంఖ్యావాప్రాణాయామాః కృతాయది | నియమ్యమాననంతేనతదా తప్తం మహత్తవః || 70 ||

సవ్యాహృతి ప్రణవకాః ప్రాణాయామాస్తుషోడశ | అపిభ్రూణహనం మాసాత్‌ పునంత్యహరహఃకృతాః || 71 ||

యథాపార్థివధాతూనాందహ్యంతే ధమనాన్మలాః | తధేంద్రియైః కృతాదోషాజ్వాల్యంతేప్రాణ సంయమాత్‌ || 72 ||

ఏకాక్షరం వరం బ్రహ్మప్రాణాయామఃపరంతపః | గాయత్ర్యాస్తు పరంనాస్తి పావనం చనృపోత్తమ || 73 ||

కర్మణామనసావాచా యద్రాత్రౌకురుతేత్వఘం | ఉత్తిష్టన్‌ పూర్వసంధ్యాయాం ప్రాణాయామైర్విశోధయేత్‌ || 74 ||

యదహ్నాకురుతేపాపంమనోవాక్కాయకర్మభిః | ఆసీనఃపశ్చిమాంసంధ్యాంప్రాణాయామైఃప్య పోహతి

పశ్చిమాంతుసమాసీనోమలంతిదివాకృతం || 75 ||

నోపతిష్ఠేత్తుయఃపూర్వ్యాంనోపాస్తేయస్తుపశ్చిమాం | నశూద్రవత్‌బహిష్కార్యఃసర్వస్మాద్ద్విజకర్మణః || 76 ||

అపాంసమీపమాసాద్యనిత్యకర్మసమాచరేత్‌ | తతఆచమనంకుర్యాత్‌ యథావిధ్యనుపూర్వశః || 77 ||

ఆపోహిష్ఠేతితినృభిఃమార్జసంతుతతశ్చరేత్‌ | భూమౌశిరసిచాకాశఆకాశేభువిమస్తకే || 78 ||

మస్తకేచతథాకాశేభూమౌచనవదాక్షిపేత్‌

భూమిశ##బ్దేనచరణావాకాశంహృదయంస్మృతం | శిరస్యేవశిరఃశబ్దోమార్జనంతైరుదాహృతం || 79 ||

వారుణాదపిచాగ్నేయాత్‌వాయవ్యాదపిచేంద్రతః | మంత్రస్థానాదపివరంబ్రాహ్మంస్నానమిదంపరం

బ్రాహ్మస్నానేనయఃస్నాతఃసబాహ్యభ్యంతరంశుచిః || 80 ||

సర్వత్రచార్హతామేతిదేవపూజాదికర్మణి | సక్తందినంనిమజ్జ్యాప్సుకైవర్తాఃకిముపావనాః || 81 ||

శతశోపితథాస్నాతానశుద్ధాభావదూషితాః అంతఃకరణశుద్ధాంశ్చతాన్విభూతిఃపవిత్రయేత్‌ || 82 ||

కింపావనాఃప్రకీర్త్యంతేరానభాఃభస్మధూ నరాః | సస్నాతఃసర్వతీర్థేషుమలైఃసర్వైఃవివర్జితః || 83 ||

తేనక్రతుశ##తైరిష్టంచేతోయస్యేహనిర్మలం | తదేవనిర్మలంచేతోయథాస్యాత్తన్మునేశృణు || 84 ||

తా || ఈరకముగా స్నానంచేసివస్త్రముతోబాగారుద్ది ఉతికినవస్త్రములను స్వీకరించాలి. ఆచమించిఆపిదపదర్భలతోకూడి ప్రాతఃసంధ్యనుఆచరించాలి. (68) విప్రుడుప్రాణాయామములనుఆచరిస్తూమనస్సునుదృఢముగా నియమించిన, ఆ క్షణంలోనే అహోరాత్రములందుచేసినపాపములనుండిముక్తుడౌతాడు (69) పదిసార్లుగానిపన్నెండుసార్లుగాని ప్రాణాయా మములుచేసినయెడల, మనస్సునినియమిస్తే ఆతడుఅప్పుడుమహాతపస్సుఆచరించినట్లే. (70) వ్యాహృతి, వ్రణవములతో కూడినప్రాణాయామములుపదహారు. ప్రతిరోజుచేసినప్రాణాయామములుభ్రూణహత్యవల్లవచ్చినపాపమునుమాసంలోతొల గించిపవిత్రునిచేస్తాయి. (71) పార్థివధాతువులమలములు ధనునివలనకాల్చబడినట్లు ఇంద్రియములవల్ల జరిగినదోషములు ప్రాణసంయమమువలనకాలిపోతాయి. (72) ఏకాక్షరముపరమైనబ్రహ్మప్రాణాయామముపరమమైనతపస్సు. ఓనృపోత్తమా! గాయత్రికంటెపరమైనది పావనమైనదిలేదు (73) కర్మద్వారా, మనస్సుతో, మాటతో రాత్రి చేసిన పాపమునుండి పూర్వ సంధ్యయందు లేచి ప్రాణాయామములతో శుద్ధపరచుకోవాలి (74) మనోవాక్కాయ కర్మలతో పగలు చేసిన పాపము, పశ్చిమ సంధ్యయందు కూర్చొని ప్రాణాయామములాచరిస్తే పోతుంది. కూర్చోని పశ్చిమ సంధ్యను ఆచరిస్తే అది పగలు చేసిన మలమును నశింపచేస్తుది. (75) ఎవడు పూర్వమును ఆచరంచడో, ఎవడు పశ్చిమ సంధ్యను ఆచరించడో వానిని అన్ని ద్విజకర్మల నుండి శూద్రునివలె బహిష్కరించాలి (76) నీటి దగ్గరకు చేరి నిత్యకర్మను ఆచరించాలి. పిదప శాస్త్ర ప్రకారము ఒకదాని వెంట ఒకటిగా ఆచమనము వగైరా చేయాలి. (77) పిదప అపోహిష్ట అని మూడు మంత్రములతో మార్జన మాచరించాలి. భూమిపై శిరస్సుపై ఆకాశమందు భూమిపై తలపై (78) అట్లాగే తలపై ఆకాశమందు భూమిపై ఇట్లా తొమ్మిది విధములుగా మార్జన మాచరించాలి. భూమి అనగా చరణములు. ఆకాశమనగా హృదయము అన్నారు. శిరమనగా శిరస్సే. వాటి మార్జనము అని ఉదహరింపబడింది (79) వారుణమంత్రము, ఆగ్నేయ మంత్రము వాయవ్యమంత్రము, ఇంద్రమంత్రము ఈ మంత్రస్థానములకన్నను (స్నానములకన్నను) పరమైన ఈ బ్రాహ్మస్నానము ఉత్తమమైనది. బ్రాహ్మస్నానముతో, స్నానం చేసినవాడు బాహ్యాభ్యంతరము లంద శుచియైనాడు (80) దేవ పూజాది కర్మలన్నిటి యంద అర్హతను పొందుతాడు. రాత్రింబగళ్ళు నీళ్ళలో మునిగిన జాలరులు పవిత్రమైనవారా? (81) అట్లా నూరుసార్లు స్నానం చేసినా భావదూషితులైన వారు శుద్ధులు కారు. అంతః కరణ శుద్ధులైన వారిని దైవశక్తి పవిత్రులను చేస్తుంది. (82) భస్మధూసరములైన గాడిదలు పావనములని అనబడుతాయా, మనస్సు నిర్మలమైనవాడు, సర్వమలములు తొలగిపోయి సర్వతీర్థములందు స్నానం చేసిన వాడౌతాడు (83) నిర్మలమైన మనస్సు కలవాడు నూరుక్రతువులు ఆచరించినట్టు. ఓముని! నిర్మలమైన మనస్సేదో దాని గురించివిను (84).

మూ|| విశ్వేశ##శ్చేత్ర్పసన్నఃస్యాత్తదాస్యాన్నాన్యథా క్వచిత్‌ | తస్మాచ్చేతో విశుద్ధ్యర్థం కాశీనాథం సమాశ్రయేత్‌ || 85 ||

ఇదంశరీరముత్సృజ్య పరం బ్రహ్మాధిగచ్ఛతి | ద్రుపదాం తంతతోజప్త్వాజలమాదాయపాణినా || 86 ||

కుర్యాదృతంచమంత్రేణ విధిజ్ఞస్త్వఘమర్షణం |నిమజ్జ్యాప్సుచయో విద్వాన్‌ జపేత్త్రిరఘుమర్షణం || 87 ||

జలేవాసిస్థలేవాపియః కుర్యాదఘమర్షణం | తస్యాఫ°ఘో వినశ్యేత యధాసూర్యోదయేతమః || 88 ||

గాయత్రీం శిరసాహీనాం మహావ్యాహృతి పూర్వికాం | ప్రణవాద్యాంజపంస్తిష్ఠన్‌క్షి వేదంభోంజలిత్రయం || 89 ||

తేనవజ్రోదకేనాశు మందేహా నామరాక్షసాః |సూర్యతేజః ప్రలోపంతే శైలాఇవ వివస్వతః || 90 ||

సహాయార్థం చసూర్యస్యయో ద్విజోవాం జలిత్రయం | క్షిపేన్మందేహానాశాయ సోపి మందేహతాం ప్రజేత్‌ || 91 ||

ప్రాతస్తావత్‌ జపంస్తష్ఠేత్‌ యావత్సూర్యస్య దర్శనం | ఉపవిష్టోజపేత్సాయం ఋక్షాణామావిలోకనాత్‌ || 92 ||

కాలలోపోనకర్తవ్యో ద్విజేన స్వహితేప్సునా | అర్ధోదయాస్త సమయే తస్మాద్వజ్రోదకం క్షిపేత్‌ || 93 ||

విధినాపికృతా సంధ్యాకాలాతీతాఫలాభ##వేత్‌ | అయమేవ హిదృష్టాంతో వంధ్యాస్త్రీమైథునంయధా || 94 ||

జలేవామకరంకృత్వా యాసంధ్యాచరితాద్విజైః | వృషలీసా పరిజ్ఞేయా రక్షోగణ ముదావహా || 95 ||

ఉపస్థానం తతః కుర్యాత్‌ శాభోక్తవిధినాతతః | సహస్ర కృత్వోగాయత్ర్యాః శతకృత్వోధవాపునః || 96 ||

దశకృత్వోథ దేవ్యైచ కుర్యాత్‌ సౌరీముపస్థితిం | సహస్ర పరమాందేవీం శతమధ్యాం దశావరాం || 97 ||

గాయత్రీం యోజపే ద్విప్రోన సపాపైః ప్రలిప్యతే | రక్తచందన మిశ్రాభిరద్భిశ్చకుసుమైః కుశైః || 98 ||

వేదోక్తై రాగమోక్తై ర్వామంత్రైరర్ఘ్యం ప్రదాపయేత్‌ | ఆర్చితః సవితాయేన తేనత్రైలోక్యమర్చితం || 99 ||

అర్చితః సవితా దత్తే సుతాన్‌ పశువసూనిచ | వ్యాధీన్‌హరేత్‌ దదాత్యాయుః పూరయేద్వాంఛితాన్యపి || 100 ||

అయంహి రుద్ర ఆదిత్యో హరిరేష దివాకరః | రవిర్హిణ్య రూపోసౌత్రయీరూపోయ మర్యమా || 101 ||

తా || విశ్వేశుడు ప్రసన్నుడైతే అప్పుడు మనసు నిర్మల మౌతుంది. లేకపోతేకాదు. అందువలన చేతస్సు విశుద్ధి కొరకు కాశీనాథుని సమాశ్రయించాలి. (85) ఈశరీరాన్ని వదలి పరబ్రహ్మను పొందుతాడు. ద్రుపద అంతమువరకుజపించి చేతితో నీళ్ళు తీసుకొని (86) శాస్త్ర మెరిగినవాడు, ఋతంచ మంత్రముతో అఘమర్షణమును చేయాలి. నీళ్ళలో మునిగి, విద్వాంసుడు మూడుమార్లు అఘమర్షణము జపిస్తే (87) నీటియందుకాని స్థలమందుకాని అఘమర్షణముచేస్తే ఆతని పాపముల సమూహములు నశిస్తాయి. సూర్యోదయమైతే చీకట్లు తొలగిపోయినట్లు (88) శిరస్సులేనటువంటి గాయత్రిని, మహావ్యాహృతి ముందుగల దానిని, వ్రణవము తొలుతగల దానిని జపిస్తూ నిలబడి నీటిని మూడు దోసిళ్ళు వదలాలి (89) ఆ వజ్రోదకముతో త్వరగా మందేహులను రాక్షసులు నశిస్తారు. పర్వతాలవలె వారు సూర్యతేజస్సును లోపింప చేస్తుంటారు (90) సూర్యునికి సహాయము కొరకు అంజలితో మూడుసార్లు నీటిని మందేహుల నాశం కొరకు వదలని బ్రాహ్మణుడు మందేహుడౌతాడు (91) ప్రొద్దుటి పూట జపిస్తూ సూర్యుడు కన్పించేవరకు నిలబడాలి. సాయంకాలము నక్షత్రములు కన్పించే వరకు జపిస్తూ కూర్చోవాలి (92) తన హితాన్ని కోరే బ్రాహ్మణుడు కాలలోపాన్ని చేయకూడదు. సగము సూర్యుడు ఉదయించగానే ఉదయ కాలమందు సాయంకాలమందు బ్రాహ్మణుడు వజ్రోదకమును వదలాలి (93) శాస్త్రం ప్రకారం చేసినా సంధ్యకాలాతీతమైతే ఫలంలేనిదౌతుంది. దానికిదే దృష్టాంతము, ఏమంటే సంధ్యయైన స్త్రీని సంభోగించినట్లు (94) బ్రాహ్మణుడు నీటిలో ఎడమచేయిని ఉంచి సంధ్యను ఆచరిస్తే అది వృషలీ అనబడుతుంది. అది రాక్షస గణములకు ఆనందాన్ని కల్గిస్తుంది (95) పిదప ఆయాశాఖల వారికి చెప్పిన రీతిలో వారు ఉపస్థానమున చేయాలి. గాయత్రిని వేయిమారులు, లేదా నూరుమారులు లేదా (96) పది మారులు దేవికొరకు చేసి సూర్య ఉపస్థానమును చేయాలి. దేవిని, వేయిమార్లు గాయత్రి జపముతో ఉత్తమముగా నూరు మార్లతో మధ్యమముగా పదిమార్లతో తక్కువగా (97) ఆరాధించే బ్రాహ్మణుని పాపములు అంటుకోవు. రక్తచందనము కలిసిన పూలు దర్భలు కలిగిన నీటితో (98) వేదోక్తము లేదా ఆగమోక్తమైన మంత్రములతో అర్ఘమును ఇవ్వాలి. సూర్యుని పూజిస్తే ముల్లోకములను అర్చించినట్లే (99) సూర్యుని పూజిస్తే ఆతడు సుతులను పశుసంపదను ధనమును ఇస్తాడు. వ్యాధులను హరిస్తాడు. ఆయువునిస్తాడు. కోరిన వాటిని కూడా పూరిస్తాడు (100) ఈ ఆదిత్యుడు రుద్రుడు. ఈ సూర్యుడు హరి ఈ రవి హిరణ్య రూపుడు ఈ అర్యమా వేదముల స్వరూపుడు (101).

మూ|| తతస్తు తర్పణం కుర్యాత్‌ స్వశాభోక్తవిధానతః | బ్రహ్మాదీనఖిలాన్దేవాన్‌ మరీచ్యాదీంస్తథా మునీన్‌ || 102 ||

చందనాగరుకర్పూర గంధపత్కుసుమైరపి | తర్పయేత్‌ శుచిభిస్తోయైః తృప్యంత్వితి సముచ్చరేత్‌ || 103 ||

సనకాదీన్‌ మనుష్యాంశ్చ నివీతీతర్పయేద్యవైః | అంగుష్ఠద్వయమధ్యేతు కృత్వాధర్భానృజున్ద్విజః || 104 ||

కవ్యవాడనలాదేంశ్చ పితౄన్దివ్యాన్ర్పతర్పయేత్‌ | ప్రాచీనావీతికోదర్భైః ద్విగుణౖః తిలమిశ్రితైః || 105 ||

రవౌశుక్లేత్రయోదశ్యాం సప్తమ్యాంనిశిసంధ్యయోః | శ్రేయోర్థీ బ్రాహ్మణోజాతునకుర్యాత్తిలతర్పణం || 106 ||

యది కుర్యాత్తతః కుర్యాత్‌ శుక్లైరేవతిలైః కృతీ | చతుర్దశయమాన్‌ పశ్చాత్‌ తర్పయేన్నామ ఉచ్చరన్‌ || 107 ||

తతః స్వగోత్రముచ్చార్య తర్పయేత్‌ స్వాన్‌ పితౄన్‌ముదా | సవ్యజానుని పాతేన పితృతీర్థేన వాగ్యతః || 108 ||

ఏకైక మంజలిందేవాః ద్వౌద్వౌతు సనకాదికాః | పితరః త్రీన్‌ప్రవాంఛంతి స్త్రియ ఏకైక మంజలిం || 109 ||

అంగుల్యగ్రేణవై దైవమార్షమంగులిమూలగం | బ్రాహ్మమంగుష్ఠమూలేతు పాణి మధ్యే ప్రజాపతేః || 110 ||

మధ్యేంగుష్ఠ ప్రదేశిన్యోః పిత్ర్యం తీర్థం ప్రచక్షతే | అబ్రహ్మస్తంబ పర్యంతం దేవర్షిపితృమానవాః || 111 ||

తృప్యంతు సర్వేపితరోమాతృమాతామహాదయః | అన్యేచమంత్రాప్రోక్తాయే వేదోక్తాః పురాణసంభవాః || 112 ||

సాంగంచ తర్పణం కుర్యాత్‌ పితౄణాంచసుఖప్రదం | అగ్నికార్యం తతః కృత్వా వేదాభ్యాసం తతశ్చరేత్‌ || 113 ||

శ్రుత్యభ్యాసః పంచధాస్యాత్‌ స్వీకారోర్థ విచారణం | అభ్యాసశ్చత పశ్చాపి శిష్యేభ్యః ప్రతిపాదనం || 114 ||

లబ్ధస్య ప్రతిపాలార్థ మలబ్ధస్యచలబ్ధయే | ప్రాతః కృత్యమిదం ప్రోక్తం ద్విజాతీనాం నృపోత్తమ || 115 ||

అథవాప్రాతరుత్థాయ కృత్వావశ్యకమేవచ | శౌచా చమనమాదాయ భక్షయేద్దంతధావనం || 116 ||

విశోధ్య సర్వగాత్రాణి ప్రాతః సంధ్యాం సమాచరేత్‌ | వేదార్థనధిగచ్ఛేద్వైశాస్త్రాణి వివిధాన్యపి || 117 ||

అధ్యావయేచ్ఛుచీన్‌ శిష్యాన్‌ హితాన్‌మేధా సమన్వితాన్‌ | ఉపేయాదీశ్వరం చాపియోగక్షేమాది సిద్ధయే || 118 ||

తా || తమ శాఖవారికి చెప్పిన విధముగా పిదప తర్పణము చేయాలి. బ్రహ్మాది అఖిల దేవతలకు మరీచ్యాది మునులకు (102) చందనము, అగరు, కర్పూరము, వాసనగల పూలు వీనితో శుద్ధమైన నీటితో తర్పణ చేయాలి. తృప్యంతు (తృప్తిని పొందండి) అని ఉచ్చరించాలి (103) సనకాదులకు మనుష్యులకునినీతితో, యవలతో తర్పణ చేయాలి. బ్రాహ్మణులు, రెండు బొటన వ్రేళ్ళ మధ్య దర్భలను చక్కగా పట్టుకొని (104) కప్యవాట్‌ (పితరులకై అన్నంమోసే వ్యక్తి) అగ్ని మొదలగు వారికి పితరులకు దేవతలకు తర్పణ వదలాలి. ప్రాచీనా నీతి కలిగి దర్భలు అంతకు రెట్టింపు నవ్వులు కలిపి (తర్పణం చేయాలి) (105) ఆదివారమందు శుక్లత్రయోదశి, సప్తమి తిధులంతు రాత్రియందు శ్రేయస్సును కోరుకునే బ్రాహ్మణుడు తిల తర్పణమును ఎప్పుడూ చేయరాదు (106) ఒకవేళ చేస్తే ఆ పిదప తెల్లని నువ్వులతో చేయాలి, ఆచేసేవాడు. పిదప ఒక్కొక్కరి పేరు ఉచ్చరిస్తూ పదునాల్గురు యములకు తర్పణ చేయాలి. (107) పిదప తన గోత్రాన్ని ఉచ్చరించి సంతోషంతో తన పితరులకు తర్పణం వదలాలి.సవ్యమైన (కుడి) మోకాలును భూమికానించి(వంచి) పితృతీర్థముతో, వాక్కును అదుపులో ఉంచుకొని (108) దేవతలకై ఒక్కొక్క అంజలిని, సనకాదులకు రెండేసి దోసిళ్ళను, పితరులకు మూడేసి దోసిళ్ళను ఇవ్వాలి. ఆడవారికి ఒక్కొక్క దోసిలిని ఇవ్వాలి. 'దోసిలితో నీరు విడవాలి (109) దేవతలకు అంగుళుల అగ్రభాగంతో వదలాలి. ఋషులకు అంగుళుల మూలము నుండి నీరు వదలాలి. బ్రాహ్మతర్పణము బొటన వేలి మూలమందు వదలలాలి. ప్రజాపతికి చేయిమధ్య నుండి నీరు వదలాలి (110) బొటనవేలు ప్రదేశిని (చూపుడువేలు) వీటి మధ్య నుండి పితరులకు తీర్థం వదలాలి అని అన్నారు. బ్రహ్మ మొదలుకొని స్తంబము వరకు (బోదెలేని చిన్నచెట్టు వరకు) దేవ, ఋషి, పితృ, మానవులు (111) పితరులు, మాతృమాతామహాదులు అందరు తృప్తి నందని. ఇంకా వేరే చెప్పబడిన వేదోక్తములు పురాణములందలి మంత్రములు పఠించి (112) సాంగముగా పితరులకు సుఖమనిచ్చే తర్పణ మాచరించాలి. పిదప అగ్నికార్యమును చేసి పిదప వేదాభ్యాసమాచరించాలి (113) వేదాభ్యాసము ఐదురకములు. స్వీకారము, అర్థవిచారణము, అభ్యాసము తపస్సు శిష్యులకు బోధించుట అని (114) లభించిన దానిని రక్షించుట కొరకు లభించని దానిని పొందే కొరకు ప్రయత్నము చేయాలి. ఓ నృపోత్తమ! ఇది బ్రాహ్మణులకు ప్రాతః కాల కృత్యమని చెప్పబడింది (115) లేదా ప్రొద్దున్నే లేచి కాలకృత్యములు తీర్చుకొని, శౌచాచమనములు చేసి దంతధావనమును (పుల్లను) తెచ్చినమలాలి (116) శరీరాన్నంతా శుద్ధి చేసుకొని ప్రాతః సంధ్యను ఆచరించాలి. వేదార్థములను వివిధ శాస్త్రములను అభ్యసించాలి (117) శుచులైన హితులైన మేధా సమన్వితులైన శిష్యులను అభ్యసింపచేయాలి యోగక్షేమాది సిద్ధి కొరకు ఈశ్వరుని గూడా సేవించాలి (118).

మూ || తతోమధ్యాహ్నసిద్ధ్యర్థం పూర్వోక్తంస్నానమాచరేత్‌ | స్నాత్వామాధ్యాహ్నికీంసంధ్యాముపాసీతవిచక్షణః || 119 ||

దేవతాం పరిపూజ్యాథ నైమిత్తికం విధించరేత్‌ | పవనాగ్నిం సముజ్జ్వాల్యవైశ్వదేవం సమాచరేత్‌ || 120 ||

నిష్పావాన్‌ కోద్రవాన్‌ మాషాన్‌ కలాపాంశ్చణకాంస్త్యజేత్‌ | తైలపక్వమవక్వాన్నం సర్వంలవణయుక్‌త్యజేత్‌ || 121 ||

ఆఢక్యన్నంమ నూరాన్నం వర్తుల ధాన్య సంభవం | భుక్తశేషం వర్యుషితం వైశ్వదేవే వివర్జయేత్‌ || 122 ||

దర్భపాణిః సమాచమ్యప్రాణాయామంవిధాయచ | వృషోదివీతి మంత్రేణ పర్యుక్షణ మధాచరేత్‌ || 123 ||

ప్రదక్షిణంచ వర్యుక్ష్యద్విః పరిస్తేర్యవైకుశాన్‌ | రాపోర్థ దేవమంత్రేణ కుర్యాద్వహ్నింస్వ సంముఖే || 124 ||

వైశ్వానరం సమభ్యర్చ్య గంధపుష్పాక్షతైస్తథా | స్వశాభోక్త ప్రకారేణ హోమం కుర్యాద్విచక్షణః || 125 ||

అధ్వగః క్షీణవృత్తిశ్చ విద్యార్థీ గురుపోషకః | యతిశ్చ బ్రహ్మచారీచ షడేతే ధర్మభిక్షకాః || 126 ||

అతిథిః పాంథికోజ్ఞేయోసూచానఃశ్రుతిపారగః | మాన్యావేతౌ గృహస్థానాం బ్రహ్మలోకమభీవ్సతాం || 127 ||

అపిశ్వపాకేశునివా నైవాన్నం నిష్పలంభ##వేత్‌ | అత్రార్ధిని సమాయతే పాత్రాపాత్రంస చింతయేత్‌ || 128 ||

శునాంచ పతితానాంచ శ్వపచాంపావరోగిణాం | కాకానాంచ కృమీణాంంచబహిరన్నంకిరేద్భువి || 129 ||

ఐంద్రవారుణవాయవ్యాః సౌమ్యావైనైఋతాశ్చయే | ప్రతిగృహ్ణంత్విమంపిండం కాకాభూమౌమయార్పితం || 130 ||

ఇత్థం భూతబలిం కృత్వా కాలం గోదోహమాత్రకం | ప్రతీక్ష్యాతిథి మాయాంతం విశద్భోజ్యగృహంతతః || 131 ||

అదత్వావాయసబలిం నిత్యశ్రాద్ధం సమాచరత్‌ | నిత్యశ్రాద్ధే స్వసామర్థ్యాత్‌ త్రీన్‌ ద్వానేక మథాపివా || 132 ||

భోజయేత్సితృయజ్ఞార్థం దద్యాదుద్ధృత్యవారిచ | నిత్యశ్రాద్ధం దైవహీనం నియమాది వివర్జితం || 133 ||

దక్షిణా రహితం త్వేతత్‌ దాతృభోక్తృసుతృప్తికృత్‌ | పితృయజ్ఞం విధాయేత్థం స్వస్థ బుద్ధిరనాతురః || 134 ||

తా || పిదప మధ్యాహ్న సిద్ధికొరకు ముందు చెప్పినట్లు స్నాన మాచరించాలి. స్నానం చేసి మధ్యాహ్న సంధ్యను ఉపాసించాలి. విచక్షణుడు (119) (దేవతను) బాగా పూజించి నైమిత్తిక విధిని ఆచరించాలి. పవిత్రమైన అగ్నిని జ్వలింపచేసి వైశ్వ దేవాన్ని ఆచరించాలి (120) అనుములు, ఆళ్ళు, మినుములు, శనగలు, ఎర్రధాన్యము వీటిని వదలాలి. తైలపక్వము పనికి రాదు, అపక్వమైన అన్నము ఉప్పుగలిగిన పదార్థము అన్ని విడువాలి (121) కందిపప్పు గల అన్నము, చిరుసెనగల అన్నము గుండ్రటి ధాన్యము నుండి వచ్చిన వానిని విడువాలి, తినగా మిగిలినది చద్దిది వైశ్వదేవమందు విడిచి పెట్టాలి (వాడరాదు). (122) ధర్భలు చేత ధరించి మంచిగా ఆచమనము చేసి ప్రాణాయామము చేసి వృషోదివీ అనే మంత్రముతో నీటిని చుట్టూ చల్లాలి (123) ప్రదక్షిణంగా నీటిని చల్లి దర్భలను రెండు (మూర్ల) పరిచి, రాపోర్థ అనే దేవ మంత్రముతో వహ్నిని తన సంముఖమందుంచుకోవాలి (124) వైశ్వానరుని గంధపుష్ప అక్షతలతో బాగా పూజించి విచక్షణుడు తనశాఖవారికి చెప్పిన ప్రకారము హోమమును చేయాలి (125) బాటసారి వృత్తి క్షీణించినవాడు, విద్యార్థి గురుపోషకుడు, యతి బ్రహ్మచారి ఈ ఆరుగురు ధర్మం కొరకు భిక్షమాచరించేవారు (126) అతిథి, బాటసారి, వంశపారంపర్యంగా శ్రుతి పారగుడైనవాడు వీరిని గమనించాలి. బ్రహ్మలోకాన్ని కోరే గృహస్థులు వీరిని గౌరవించాలి (127) శ్వపాకునకు, కుక్కకు అన్నం పెట్టరాదు. వ్యర్థమౌతుంది (నిష్ఫలం). యాచకుడు వస్తే యోగ్యతా యోగ్యతలు ఆలోచించరాదు (128) కుక్కలకు, పతితులకు, ఛండాలురకు పాపరోగులకు, కాకులకు, పురుగులకు అన్నమును బైట భూమి మీద ఉంచాలి (పెట్టాలి) (129) ఐంద్ర వారుణ, వాయవ్య సౌమ్య నైఋతములైన కాకములు నేను భూమిమీద నేను పెట్టిన ఈ పిండాన్ని స్వీకరించండి (130) అని ఈ విధముగా భూతబలిచేసి ఒక ఆవును పాలు పితుకుటకు పట్టే అంతసేపు అతిథి వస్తున్నాడేమో అని ఎదిరిచూచి పిదప భోజన గృహమునకు వెళ్ళాలి (131) నిత్య శ్రాద్ధమును వాయన బలి ఇవ్వకుండా ఆచరించాలి. నిత్యశ్రాద్ధమందు తన సామర్థ్యానికి తగ్గట్టు ముగ్గురుకి, ఇద్దరికి లేదా ఒకరికి భోజనం పెట్టాలి. (132) పితృయజ్ఞము కొరకు నీటిని పై నుండి ఇవ్వాలి. నిత్య శ్రాద్ధము, దైవము లేకుండ నియమాదులు లేకుండ (133) దక్షిణలేకుండ ఆచరించాలి. ఇది చేసే వాడికి తినేవాడికి (ఇద్దరి) చక్కగా తృప్తిగా ఉండాలి (నిచ్చేది). ఈ విధముగా పితృయజ్ఞము నాచరించి స్వస్థమైన బుద్ధికలవాడై తొందరలేనివాడై (రోగములేనివాడై) (134).

మూ|| అదుష్టాసనమధ్యాస్య భుంజీత శిశుభి న్సహ | సుగంథిః సుమనాః న్ర గ్వీశుచి వాసోద్వయాన్వితః || 135 ||

ప్రాగాన్య ఉదగాస్యోవా భుంజీత ఉపసేవితం | విధాయాన్న మనగ్నం తదుపరిష్టాదధస్తథా || 136 ||

ఆపోశాన విధానేన కృత్వాశ్నీయాత్‌ సుదీర్ద్విజః | భూమౌబలిత్రయం కుర్యాత్‌ అపోదద్యాత్త దోపరి || 137 ||

సకృచ్చాపుపస్పృశ్య ప్రాణాద్యాహుతి పంచకం | దద్యాజ్ఠఠరకుండాగ్నీ దర్భపాణిః ప్రసన్నధీః || 138 ||

దర్భపాణిస్తుయోభుంక్తే తస్యదోషోన విద్యతే | కేశకీటాది సంభూతః తదశ్నీయాత్‌ సదర్భకః || 139 ||

తతోమౌనేన భుంజీత సకుర్యాద్దంత ఘర్షణం | ప్రక్షాలి తవ్యహస్తన్య దక్షిణాం గుష్ఠమూలతః || 140 ||

రౌరవేపుణ్యని లయే అధోలోక నివాసినాం | ఉచ్ఛిష్టోదక మిచ్ఛూనాం అక్షయ్యము పతిష్ఠతాం || 141 ||

పునరాచమ్యమేధావీ శుచిర్భూత్వా ప్రయత్నతః | ముఖశుద్ధిం తతః కృత్వా పురాణ శ్రవణాదిభిః || 142 ||

అతివాహ్యదివాశేషం తతః సంధ్యాం సమాచరేత్‌ | గృహషు ప్రాకృతాసంధ్యాగోష్ఠే దశగుణా స్మృతా || 143 ||

సద్యామయుత సంఖ్యాస్యాదనంతా శివసన్నిధౌ | అనృతం మద్యగంధం చ దివామైథున మేవచ

పునాతి వృషల స్థానం సంధ్యాబహిరుపాసితా || 144 ||

ఉద్దేశతః సమాఖ్యాత ఏషనిత్యతనోవిధిః | ఇత్థం సమాచరన్విప్రోనావసీదతి కర్హిచిత్‌ || 145 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే సదాచార వర్ణనం నామ పంచమోధ్యాయః || 5 ||

తా || మంచి ఆసనంపై కూర్చొని పిల్లలతో కూడి భుజించాలి. మంచి వాసనగల అందమైన మల్లెపూల మాల ధరించి శుభ్రమైన రెండు వస్త్రముల గలవాడై (135) తూర్పు ముఖముగా గాని, ఉత్తర ముఖముగా గాని కూర్చొని పితరులు సేవించిన దానిని భుజించాలి. అన్నమును నగ్నం కాకుండా చేసి (కుప్పగా ఉంచి) దానిపైన, అట్లాగే క్రింద (136) ఆపోశన విధానమాచరించి, బుద్ధిమంతుడైన బ్రాహ్మణుడు భుజించాలి. భూమిపై మూడు బలులుంచాలి. దానిపైన నీరుంచాలి. (137) ఒకసారి నీటిని తాకి ప్రాణాది అహుతి పంచకమును జఠరకుండ అగ్నియందు వేయాలి (కడుపులోకి) చేత దర్భలు ధరించి, ప్రసన్నమైన బుద్ధి కలిగి భుజించాలి (138) దర్భలు చేత ధరించి తిన్నవానికి దోషముండదు. కేశములు, కీటాదులున్నా దానిని తినొచ్చు. ధర్భలు ధరించి (139) పిదప మౌనంగా భుజించాలి. పండ్లు (కొరుకుడు) చప్పుడ చేయరాదు.కడుగదగిన చేతిని కుడిబొటనవేలు మొదటి నుండి (140) అపుణ్యనిలయమైన రౌరవమందు, అధోలోకమందు నివసించే వారికి, ఉచ్ఛిష్టుదకమును కోరేవారికి అక్షయ్యముకలగని (141) అని పలికి నీరు వదలాలి. మళ్ళీ ఆచమనంచేసి మేధావియైన ఆతడు శుచియై ప్రయత్నంగా, పిదపముఖశుద్ధినిచేసుకొని పురాణశ్రవణాదులతో (142) మిగిలిన దినమును గడిపి పిదపసంధ్యను ఆచరించాలి. గృహమందుచేసే సంధ్యసాధారణము. గోష్ఠమందుచేసేది దానికన్నపదింతలుమంచిది అని అన్నాడు. (143) నదిలో చేసేది అని అన్నారు. (143) నదిలో చేసేది పదివేల ఉత్తమమైనది. శివసన్నిధిలోచేసేది అనంతమైనది. అబద్ధము, మద్యపువాసన, పగలు సంభోగము శూద్రస్థానము, వీటిని బయటుపాసించిన సంధ్య పవిత్ర పరుస్తుంది. (144) ఈనిత్యతనవిధిని ఉద్దేశపూర్వకముగానే చెప్పాను. విప్రుడు ఈరకముగా ఆచరిస్తే ఏవిధముగా నునశించడు. (145) అని శ్రీస్కాందమహాపురాణమందు ఏకాశీతిసహస్రసంహితయందుతృతీయమైనబ్రహ్మఖండమందు పూర్వభాగమందుధర్వారణ్యమాహాత్మ్యమందు సదాచారవర్ణనమనునది ఐదవఅధ్యాయము || 5 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters