Sri Scanda Mahapuranamu-3    Chapters   

తృతీయ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

శ్రూయతాం నృపశార్దూల కథాంపౌరాణికీం శుభాం | యాంశ్రుత్వా సర్వపాపేభ్యోముచ్యతేనాత్ర సంశయః || 1 ||

ఏకదాధర్మ రాజోవై తవస్తేపేను దుష్కరం | బ్రహ్మవిష్ణు మహెశాద్యైః జల వర్షాత పాదిషాట్‌ || 2 ||

ఆదౌత్రేతాయుగే రాజన్‌ వర్షాణా మయుతత్రయం | మధ్యే వనం త వస్యంతం అశోక తరుమూలగం || 3 ||

శుష్కస్నాయుపినద్ధాస్థి సంచయం నిశ్చలాకృతిం | వల్మీక కీటకాకోటి శోషితా శేషశోణితం || 4 ||

నిర్మాం సకీకనచయం స్ఫటికోవల నిశ్చలం | శంఖకుందేందు తుహిన మహాశంఖల సచ్ఛ్రియం || 5 ||

సత్వావలంబితప్రాణమాయుఃశేషేణ రక్షితం | నిశ్వాసోచ్ఛ్వాసవవన వృత్తి సూచిత జీవితం || 6 ||

నిమేషోన్మేష సంచార పిశునీకృత జంతుకం | పిశంగితస్ఫుర ద్రశ్మినేత్రదీపిత దిఙ్‌ముఖం || 7 ||

తత్తపోగ్ని శిఖాదావచుంబి తవ్లూన కాననం | తచ్ఛాంత్యుదనుధావర్ష సంసిక్తాఖిల భూరుహం || 8 ||

సాక్షాత్తవస్యంతమివ తపోధృత్వాసరాకృతిం | నిరాకృతిం నిరాకాంక్షం కృత్వాభక్తించ కాంచనం || 9 ||

కురంగశాబైర్గణశో భ్రమద్భిః పరివారితం | నినాదభీషణా సై#్యశ్చ వనజైః పరిరక్షితం || 10 ||

ఏతాదృశం మహాభీమం దృష్ట్వా దేవాః సవాసవాః | ధ్యాయంతంచ మహాదేవం సర్వేషాం చా భయప్రదం || 11 ||

బ్రహ్మాద్యా దైవతాః సర్వేకైలాసం ప్రతిజగ్మిరే | పారిజాతత రుచ్ఛాయా మాసీనంచ నహోమయా || 12 ||

నంది భృంగి మహాకాలస్తథాన్యేచ మహాగణాః | స్కందస్వామీచ భగవాన్‌ గణపశ్చత థైవచ

తత్రదేవాః స బ్రహ్మాద్యాస్వస్వస్థానేషు తస్థిరే | || 13 ||

తా || వ్యాసుని వచనము - ఓ నృపశార్దూల! పురాతనమైన శుభ##మైన కథనువిను. దీనిని వింటే అన్ని పాపముల నుండి ముక్తులౌతారు. అనుమానములేదు (1) ఒకసారి ధర్మరాజు చాలా దుష్కరమైన తపమాచరించాడు. బ్రహ్మమహెశులు మొదలగువారు చేయలేనిది, నీటియందు, వర్షమందు ఎండయందు సంచరిస్తూ చేశాడు (2) ఓరాజ! మొదలు త్రేతాయుగమందు ముప్పదివేల సంవత్సరాలు చేశాడు. అడవి మధ్య అశోకతరువు మొదలులో కూర్చొని (క్రింద) తపస్సు చేస్తున్నాడు (3) ఎండిన సన్నని నరములు కలిగి, చుట్టబడిన ఎముకల సమూహము గలవాడై (ఎముకలుతేలి) నిశ్చల ఆకారంతో ఉన్నాడు. పుట్టలోని పురుగులుకోట్ల కొలది అతని రక్తాన్నంతా తాగేశాయి. అందువల్ల ఎండిపోయాడు (4) మాంసములేని ఎముకలున్నాయి. స్ఫటికంరాయిలా నిశ్చలంగా ఉన్నాడు. శంఖము, మొల్లపూలు, చంద్రుడు, మంచు వీని వంటి మహా శంఖము (నొసలు, ఎముకలు) వంటి ప్రకాశించు తెల్లని కాంతి గలిగినవాడు (5) సత్వ (గుణము) చే ప్రాణములు నిలిచి ఉన్నాయి. ఆయుస్సు మిగిలి ఉండటంచే రక్షింప బడుతున్నాడు. ఉచ్ఛ్వాసనిశ్శ్వాసముల గాలినడకచే బ్రతికి ఉన్నాడని తెలుస్తోంది (6) రెప్పలుకొడ్తూ సంచరిస్తున్న జంతువులను దుర్మార్గులనుగా చేస్తున్నాడు. పింగళవర్ణమై వెలుగుతున్న కాంతి గల కన్నులతో దిక్కులను వెలిగిస్తున్నాడు (7) ఆతని తపస్సనే దావాగ్ని శిఖలతో ముద్దాడబడి వ్లూనమైపోయింది. ఆ అడవి ఆతని శాంతి అనే, ఉత్కృష్టనుధావర్షముతో చెట్లన్నీ తడిసినాయి (8) తపస్సు అనేది నరరూపమును ధరించి సాక్షాత్తుగా తపస్సు చేస్తున్నట్లుగా ఉన్నాడు. ఆకారంలేని వాడు ఆకాంక్షలేనివాడు, భక్తిని బంగారముగా చేసి తపస్సు చేస్తున్నాడు. (9) లేడిపిల్లలు గుంపుల కొలది అతనిని చుట్టి తిరుగుతున్నాయి. భయంకరంగా శబ్దిస్తూ భయంకరముఖాలతో అడవి జంతువులు (అడవిలో పుట్టినవారు) రక్షిస్తున్నారు (10) ఇట్టి మహా భయంకరమైన వానిని, ఇంద్రునితో సహా దేవతలందరు చూచారు. అందరికి అభయమిచ్చే మహాదేవుని ఆతడు ధ్యానిస్తున్నాడు (11) దేవతలు బ్రహ్మాదులు అందరు కైలాసానికి వెళ్ళారు. ఉమతో కూడి పారిజాతపు చెట్టునీడ యందు కూర్చున్న వానిని (12) చూచారు నంది, భృంగి మహా కాలులు, అట్లాగే ఇతరమైన మహాగణములు, కుమారస్వామి, భగవాన్‌ గణపతి, ఉన్నారు. అక్కడ దేవతలు బ్రహ్మాదులందరు తమ తమ స్థానములందు నిల్చున్నారు (13).

మూ || బ్రహ్మోవాచ -

నమోస్త్వనంత రూపాయ నీలకంఠనమోస్తుతే | అవిజ్ఞాత స్వరూపాయ కైవల్యాయామృతాయచ || 14 ||

నాంతం దేవావిజానంతి యస్యతసై#్మనమోనమః | యంనవాచః ప్రశంసంతి నమస్తసై#్మచిదాత్మనే || 15 ||

యోగినోయం హృదః కోశేప్రణిధానేన నిశ్చలాః | జ్యోతీరూపం ప్రవశ్యంతి తసై#్మశ్రీ బ్రహ్మణనమః || 16 ||

కాలాత్పరాయ కాలాయస్వేచ్ఛాయ పురుషాయచ | గుణత్రయ స్వరూపాయనమః ప్రకృతిరూపిణ || 17 ||

విష్ణవే సత్వరూపాయ రజోరూపాయవేధసే | తమోరూపాయ రుద్రాయ స్థితి సర్గాంతకారిణ || 18 ||

నమోబుద్ధిస్వరూపాయ త్రిధాహంకారరూపిణ | పంచతన్మాత్రరూపాయ నమః ప్రకృతి రూపిణ || 19 ||

నమోనమః స్వరూపాయ నమస్తే విషయాత్మనే | క్షిత్యాది పంచరూపాయ నమస్తే విషయాత్మనే || 20 ||

నమోబ్రహ్మాండ రూపాయ తదంతర్వర్తినేనమః | అర్వాచీనపరాచీన విశ్వరూపాయతేనమః || 21 ||

అనిత్యనిత్యరూపాయ సదసత్పతయేనమః | నమస్తేభక్తకృపయాస్వేచ్ఛావిష్కృతవిగ్రహ || 22 ||

తవనిశ్వసితం వేదాః తవ వేదోఖిలంజగత్‌ | విశ్వాభూతానితేపాదః శిరోద్యౌః సమవర్తత || 23 ||

నాభ్యాఆసీదంతరిక్షంలోమానిచవనస్పతిః | చంద్రమామనసోజాతః చక్షోః సూర్యఃతవప్రభో || 24 ||

త్వమేవసర్వంత్వయిదేవ సర్వం | సర్వస్తుతిస్తవ్య ఇహత్వమేవ ఈశత్వయావాస్యమిదం హిసర్వం | నమో7స్తు భూయో7పినమోనమస్తే || 25 ||

ఇతిస్తుత్వా మహాదేవం నిపేతుః దండవత్‌క్షితౌ | ప్రత్యువాచతదాశంభుః వరదో7స్మికి మిచ్ఛతి || 26 ||

తా || బ్రహ్మవచనము - అనంతరూప నీకు నమస్కారము. నీలకంఠ నీకు నమస్కారము. తెలుసుకోవీలుకాని స్వరూపము కలవాడ, కైవల్యుడ, అమృతుడ (14) నమస్కారము. ఎవని అంతము దేవతలు తెలుసుకోలేరో ఆతనికి నమస్కారము. మాటలతో పొగడ శక్యముకాని, చిదాత్ముడైన ఆతనికి నమస్కారము (15) యోగులు తమ హృదయకోశమందు ప్రార్థనలతో నిశ్చలంగా ఉండి జ్యోతిస్వరూపునిగా ఎవనిని చూస్తారో అట్టి శ్రీ బ్రహ్మకు నమస్కారము (16) కాలమునకు పరుడు, కాలుడు, స్వేచ్చగలవాడు, పురుషుడు (పరమాత్మ), గుణత్రయస్వరూపుడు, ప్రకృతి రూపుడు, అట్టి ఆతనికి నమస్కారము (17) సత్వరూప విష్ణువునకు, రజోరూప బ్రహ్మకు, తమోరూప రుద్రునకు ఉనికి, సృష్టి, నాశము వీటిని చేసేవానికి (18) బుద్ధి స్వరూపునకు, మూడు రకములైన అహంకార రూపుడు అట్టి వానికి నమస్కారము. పంచతన్మాత్ర రూపునకు, ప్రకృతి రూపునకు నమస్కారము (19) స్వరూపునకు, పంచ జ్ఞానేంద్రియముల రూపునకు నమస్కారము. భూతల రూపునకు, విషయాత్మునకు నీకు నమస్కారము (20) బ్రహ్మాండరూపునకు, అందులో వసించేవానికి నీకు నమస్కారము. క్రిందనున్న పై నున్న విశ్వరూపునకు నీకు నమస్కారము. (21) అనిత్యరూపునకు, నిత్యరూపునకు, సత్‌కు 'అసత్తుకు' పతివి ఐన నీకు నమస్కారము. భక్తుల మీది దయతో, స్వేచ్ఛగా నీ రూపమును ప్రదర్శించేవాడ (22) నీ, నిశ్వాసమే వేదములు, నీ వేదములే ఈ సమస్త జగత్తు, విశ్వము భూతములు (ప్రాణులు) నీ పాదములు స్వర్గము, (ఆకాశము) నీశిరము (23) నాభి నుండి అంతరిక్షము, రోమములు, వనస్పతి కలిగాయి. చంద్రుడు మనస్సు నుండి పుట్టాడు. నీ కన్నుల నుండి సూర్యుడు కలిగాడు (24) అంతానీవే. ఓదేవ! అంతా నీయందే అట్టి స్తోత్రములు, స్తుతించ తగినవాడు అన్నీ ఇక్కడ నీవే. ఓ ఈశ! ఇదంతా నీవు నివసించతగినది నమస్కారము నీకు. నీకు మరల మరల నమస్కారము (25) అని మహాదేవుని స్తుతించి, దండమువలె భూమి యందు పడి నమస్కరించినారు. అప్పుడు శంభువు వరమివ్వదలిచాను. ఏం కావాలి అని అడిగాడు (26).

మూ || మహాదేవ ఉవాచ -

కథంవ్యగ్రాః సురాః సర్వేబృహస్పతి పురోగమాః | తత్సమాచక్ష్వమాం బ్రహ్మన్‌ భవతాందుఃఖకారణం || 27 ||

బ్రహ్మోవాచ -

నీలకంఠమహాదేవదుఃఖనాశా భయప్రద | శృణుత్వం దుఃఖమస్మాకం భవతోయద్వదామ్యహం || 28 ||

ధర్మరాజో7పి ధర్మాత్మాతవస్తేపే సుదుఃసహం | నజానే7సౌకిమిచ్ఛతిదేవానాం పదముత్తమం || 29 ||

తేనత్రస్తాస్తత్త వసాసర్వింద్రపురోగమాః | భవతోంఘ్రీచిరేణౖవ మనస్తేన సమర్పితం తముత్థాపయదేవేశకి మిచ్ఛతి సధర్మరాట్‌ | || 30 ||

ఈశ్వర ఉవాచ -

భవతాం నాస్తిను భయం ధర్మాత్సత్యం బ్రవీమ్యహం || 31 ||

తత ఉత్ధాయతేసర్వే దేవాః సహదివౌకసః | రుద్రం ప్రదక్షిణీకృత్యనమస్కృత్వాపునః పునః || 32 ||

ఇంద్రేణ సహితాః సర్వేకైలాసాత్పున రాగతాః | స్వస్వస్థానే తదాశీఘ్రం గతాః సర్వేది వౌకసః || 33 ||

ఇంద్రో7పి వైసుధర్మాయాం గతవాన్‌ ప్రభురీశ్వరః | ననిద్రాం లబ్ధవాంస్తత్రన సుఖంనచ నిర్వృతిం || 34 ||

మనసాచింతయామానవిఘ్నంమేసముపస్థితం | అవాపమహతీంచింతాం తదాదేవః శచీపతిః || 35 ||

మమస్థానం పరాహర్తుంతపస్తేపేనుదుశ్చరం | సర్వాన్‌ దేవాన్‌ సమాహూయ ఇదంవచనమబ్రవీత్‌ || 36 ||

ఇంద్ర ఉవాచ -

శృణ్వంతుదేవతాస్సర్వాః మమదుఃఖస్య కారణం | దుంఖేనమమయల్లబ్ధం తత్కింవాప్రార్ధయేద్యమః

బృహస్పతిః సమాలోక్య సర్వాన్‌ దేవాసథా బ్రవీత్‌ || 37 ||

బృహస్పతి రువాచ -

తవసేనాస్తి సామర్థ్యం విఘ్నం కర్తుం దివౌకసః | ఊర్ద్వశ్యాద్యాః సమాహూయ సంప్రేష్యంతాంచ తత్రవై || 38 ||

తాసామాకారణార్థాయ ప్రతిద్వారం వ్రతస్థివాన్‌ | సగత్వాతాః సమాదాయ సభాయాంశీఘ్రమాయ¸° || 39 ||

ఆగతాస్తాః హరిః ప్రాహమహత్కార్యమువస్థితం | గచ్ఛంతుత్వరితాః సర్వాధర్మారణ్యం ప్రతిద్రుతం || 40 ||

యత్రవై ధర్మరాజోసౌ తపశ్చక్రేసుదుష్కరం | హాస్యభావకటాక్షైశ్చగీతనృత్యాదిభిస్తథా || 41 ||

తంలోభయధ్వం యమినంతపః స్థానత్‌చ్యుతిర్భవేత్‌ | దేవస్యవచనం శ్రుత్వాతథాఅప్సర సాంగణాః || 42 ||

మిథః సంరేభిరేకర్తుం విచార్యచపరస్పరం | ధర్మారణ్యం వ్రతస్థేసావుర్వశీ స్వర్వరాంగనా || 43 ||

తా || మహాదేవుని వచనము - బృహస్పతి మొదలుగా దేవతలందరు ఎందుకు విచారంగా ఉన్నారు. ఓ బ్రహ్మ! మీ దుఃఖమునకు కారణమేమో నాకు చెప్పండి (27) బ్రహ్మవచనము - ఓనీలకంఠ, మహాదేవ, దుఃఖనాశక, అభయమిచ్చేవాడ, నేనునీకు చెప్పే మా దుఃఖమేమో నీవు విను (28) ధర్మాత్ముడైన ధర్మరాజు కూడా భరింపరాని తపమాచరిస్తున్నాడు. దేవతల యొక్క ఏ ఉత్తమ పదవిని కోరి ఈతడు తపస్సు చేస్తున్నాడో తెలియదు (29) ఆ తపస్సుతో ఇంద్రుడు మొదలుగా అందరు భయపడినారు. ఆతడు చాలాకాలం క్రితమే తనమనస్సును మీ పాదములందు సమర్పించాడు. ఓదేవేశ! ఆతనికి లేపండి తపస్సు నుండి ఆ ధర్మరాజు తపస్సుతో ఏం కోరుకుంటున్నాడు. (30) అని ఈశ్వర వచనము- ఆ ధర్ముని నుండి మీకు భయం లేదు. నేను నిజం చెప్తున్నాను (31) దివౌకసులైన ఆ దేవతలందరు కూడి అక్కడి నుండి లేచి, రుద్రునకు ప్రదక్షిణము చేసి, మరల నమస్కరించి (32) ఇంద్రునితో కలసి అందరు కైలాసము నుండి తిరిగి వచ్చారు. అందరు స్వర్గవాసులు అప్పుడు త్వరగా తమ తమ స్థానములకు వెళ్ళారు (33) ప్రభువు, ఈశ్వరుడు ఐన ఇంద్రుడు కూడా తన సుధర్మసభకు వెళ్ళాడు. అక్కడ ఆతడు నిద్రపోలేకపోయాడు. సుఖంగా లేడు. ఊరట పొందలేదు (34) మనస్సులో అనుకున్నాడు నాకు విఘ్నం వస్తోంది అని. దేవుడు, శచీపతి అప్పుడు గొప్ప చింతను పొందాడు (35) నా స్థానాన్ని అవహరించుటకు, ఆచరించవీలులేని తవమాచరిస్తున్నాడు ఆతడు అని భావించి దేవతలందరి నిపిలిచి ఇట్లాపలికాడు (36) ఇంద్రుని వచనము - దేవతలందరు వినండి, నా దుఃఖకారణమేమిటో నేను చాలా కష్టపడి సంపాదించిన దాన్ని యముడు కోరుతున్నాడా ఏమిటి అని. బృహస్పతి దేవతలందరిని చూచి ఇట్లా అన్నాడు (37) బృహస్పతి వచనము - తపస్సునకు శక్తిలేదు. కనుక దివౌకసులార, విఘ్నం కల్గించటానికి ఉర్వశి మొదలగువారిని పిలిచి అక్కడికి పంపండి (38) వాళ్ళను పిలిచే కొరకు ద్వారపాలకుడు వెళ్ళాడు. ఆతడు వెళ్ళి వారిని తీసుకొని సభకు త్వరగా వచ్చాడు (39) వచ్చిన వారితో ఇంద్రుడిట్లన్నాడు. పెద్ద పని వచ్చింది త్వరపడి, అందరు వేగంగా ధర్మారణ్యానికి వెళ్ళండి (40) అక్కడ ధర్మరాజు చాలా దుష్కరమైన తపమాచరిస్తున్నాడు. హాస్యము, భావప్రకటన, ఓరచూపులు, గీతనృత్తములు మొదలుగా గలవానితో (41) ఆయమవంతుడైన వానిని (అహింసి) లోభ పెట్టండి. తపః స్థానము నుండి దిగజారుతాడు అని. దానిని విని అట్లా ఆ అప్సరస గణములు (42) పరస్పరము ఆలోచించుకొని ఆచరించుటకు ఉద్యమించారు. దేవలోకంలోని శ్రేష్ఠమైన వనిత ఆ ఉర్వశి ధర్మారణ్యమునకు బయలుదేరింది (43).

మూ || తుష్టువుః పుష్పవర్షాంశ్చ ససృజుః తచ్ఛిరస్యమీ | తతస్తు దేవైర్విపై#్రశ్చస్తూ యమానా సమంతతః || 44 ||

నిర్య¸° పరమప్రీత్యావనం పరమపావనం | బిల్వార్కఖ దిరాకీర్ణం కపిత్థధనసంకులం || 45 ||

నసూర్యో భాతి తత్రైవ మహాంధకార సంయుతా | నిర్జనం నిర్మనుష్యంచ బహుయోజసమాయతం || 46 ||

మృగైః సింహైః వృతంఘోరై రన్యైశ్చాపివనేచరైః పుష్పితైః పాదపైః కీర్ణం సుమనోహరశాద్వలం || 47 ||

విపులం మధురానాదైః నాదితం విహగైస్తథా | పుంస్కోకిల నినాదాఢ్యం రి&ుల్లీకగణనాదితం || 48 ||

ప్రవృద్ధవికటైర్వృక్షైః సుఖచ్ఛాయైః సమావృతం | వృక్షరాచ్ఛాదితతలం లక్ష్మ్యాపరమయాయుతం || 49 ||

నాపుష్పః పాదపః కశ్చిత్‌ నాఫలో నాపి కంటకీ | షట్పదైరప్యనాకీర్ణం నాస్మిన్‌ వైకాననేభ##వేత్‌ || 50 ||

విహంగైర్నాదితం పుషై#్పరలంకృతమతీవహి | సర్వర్తుకుసుమైః వృక్షైః సుఖచ్చాయైః సమావృతం || 51 ||

మారుతాకలితాస్తత్రద్రుమాః కుసుమశాఖినః | పుష్పవృష్టిం విచిత్రాంతు విసృజంతిచపాదపాః || 52 ||

దివన్పృశోథ సంపుష్టాః పక్షిభిర్మధురస్వనైః | విరేజుః పాదపాస్తత్రసుగంధకుసుమైర్వృతాః || 53 ||

తిష్ఠంతి చప్రవాలేషు పుష్పభారావనాదిషు | రువంతి మధురాలాపాః షట్‌వదామధులిప్సవః || 54 ||

తత్రప్రదేశాంశ్చ బహూనామోదాంకురమండితాన్‌ | లతాగృహపరీక్షిప్తాన్మసనః ప్రీతివర్ధనాన్‌ || 55 ||

సంపశ్యంతీమహాతేజాబభూపముదితాతదా | పరస్పరాళ్లిష్టశాఖైః పాదపైః కుసుమాచితైః || 56 ||

అశోభతవనం తత్తు మహేంద్ర ధ్వజసన్నిభైః | సుఖశీతసుగంధీచ పుష్పరేణువహోనిలః || 57 ||

ఏ వంగుణ సమాయుక్తం దదర్శసావసంతదా | తదాసూర్యోద్భవాంతత్ర పవిత్రాం పరిశోభితాం || 58 ||

ఆశ్రమప్రవరం తత్ర దదర్శచమనోరమం | పతిభిర్వాలల్యైశ్చ వృతం మునిగణావృతం || 59 ||

అగ్న్యగారైశ్చబహుభిః వృక్షశాఖా వలంబితైః | ధూమ్ర పానకణౖస్తత్ర దిగ్వాసోయతిభిస్తథా || 60 ||

పాల్యావన్యామృగాస్తత్రసౌమ్యాభూయోబభూవిరే | మార్జారామూషకై స్తత్ర సర్పైశ్చనకులాస్తథా || 61 ||

మృగశావైస్తథా సింహాః సత్వరూపాబభూవిరే | పరస్పరంచి క్రీడుస్తే యథాచైవసహోదరాః

దూరాద్దదర్శచ వనం తత్రదేవోబ్రవీత్తదా || 62 ||

తా || వారు పుష్ప వర్షమును ఆతని శిరసుపై (శక్రుని) కురిపించారు అతనిని స్తుతించారు. పిదప దేవతలతో, విప్రులతోచుట్టూ పొగడబడుతూ (44) మిక్కిలి ఆనందముతో పరమపావనమైన వనమునకు బయలుదేరారు. బిల్వము, జిల్లేడు, చండ్ర చెట్లతో కూడినది వెలగ, ఉమ్మెత్తలతో నిండినది (45) అక్కడ సూర్యుడు వెలగటం లేదు పెద్ద చీకటిగా ఉండి. జనులు లేరు, మనుష్యులు లేరు. అనేక యోజనముల విశాలమైంది (46) మృగములతో సింహములతో ఘోరమైన ఇతర వనచరములతో నిండింది.పుష్పించిన చెట్లతో నిండింది. చాలా మనోహరమైన పచ్చని గడ్డితో నిండి ఉంది (47) విశాలమైనది. మధురనాదము గల పక్షుల ధ్వినితో ప్రతిధ్వనిస్తోంది పుంస్కోకిలల నాదములతో నిండినది కీచురాళ్ళగుంపుల ధ్వనితో ప్రతిధ్వనిస్తోంది. (48) పెరిగిన వికటములైన వృక్షములతో, వాటి సుఖకరమైన నీడలతో కూడినది, భూ ప్రదేశము చెట్లతో కప్పబడింది. మిక్కిలి శోభతో కూడి ఉంది (49) పూలులేని వృక్షములేదు. పండులేని చెట్టులేదు. ముల్లుగల చెట్టు లేదు. ఈ అడవిలో తుమ్మెదలతో చుట్టబడని చెట్టూలేదు (50) పక్షుల నాదములతో, పుష్పముల అలంకారములతో చాలా అందంగా ఉన్నాయి. అన్ని ఋతువులలోని పూలతో వృక్షములు, సుఖకరమైన నీడలు ఇస్తూ నిండి ఉన్నాయి (51) పూలతో నిండిన కొమ్మలు గల చెట్లు గాలితో కదిలింపబడి విచిత్రంగా పుష్పవృష్టిని వదులుతున్నాయి. ఆ చెట్లు (52) ఆకాశాన్ని తాకుతూ బాగా పోషింపబడి(బలిసి) పక్షుల మధుర కూజితములు గలిగి చెట్లువాసన గల పూలతో కూడి వెలిగి పోతున్నాయి (53) పూల బరువుతో వంగిన చిగుళ్ళ యందు కూర్చొని మధువును కాంక్షించే తుమ్మెదలు మధురమైన శబ్దములు కలవై ధ్వనిస్తున్నాయి (54) ఆమోదపు(వాసన) అంకురములతో అలంకరింపబడిన అనేక ప్రదేశములను లతాగృహములతో చుట్టబడిన,, మనస్సునకు ఆనందమున పెంచే ప్రదేశములను (55) చూస్తూ మహా తేజము గల ఆమె ఆనందపడింది. పరస్పరము కలిసపోయిన కొమ్మలుగల పాదములతో పూలతో నిండిన వానితో (56) మహేంద్ర ధ్వజ సన్నిభ##మైన వానితో ఆ వనము ప్రకాశిస్తోంది. గాలి సుఖకరంగా, చల్లగా, మంచి వాసన గలిగి పూలపుప్పొడిని మోస్తూ వస్తోంది (57) ఇటువంటి గుణములతో కూడిన ఆవనమును ఆమె అప్పుడు చూచింది. అక్కడ అప్పుడు సూర్యుని నుండి పుట్టిన(దివలె) పవిత్రమైన చుట్టూ శోభిస్తున్న (58) మనోరమమైన ఉత్తమ ఆశ్రమమును ఆమె చూచింది. యజమానులైన వాలఖిల్యులతో చుట్టబడినది మునిగణములతో కూడుకొనినది అది (59) వృక్ష శాఖలందు వేలాడుతున్న అనేక అగ్ని స్థానములతో, ధూమ్రపాన కణములుగల, దిక్కులే వస్త్రముగా గల (నగ్నమైన) యతులతో కూడినది (60) పాలించబడే అడవిమృగములు తిరిగి సౌమ్యముగా మారాయి. పిల్లులు ఎలుకలతో, ముంగిసలు, పాములతో (61) సింహములు లేడిపిల్లలతో కూడి సత్వరూపము కలిగినవిగా ఐనాయి. సహోదరులు క్రీడించినట్లు అవి పరస్పరము ఆడుకొంటున్నాయి. అక్కడ దూరంగా వనం కన్పించింది. అప్పుడు దేవుడు ఇంద్రుడు ఇట్లా అన్నాడు (62).

మూ || ఇంద్ర ఉవాచ -

అయంచ ఖలుధర్మరాట్‌ తపస్యుగ్రేపతిష్ఠతే | యమరాజ్యాభికాంక్షోసావతోర్థేయత్యతామిహ || 63 ||

తపోవిఘ్నంప్ర కుర్వంతు మమాజ్ఞా తత్రగమ్యతాం | ఇంద్రస్యవచనం శ్రుత్వా ఉర్వశీచతిలోత్తమా || 64 ||

సుకేశీమంజుఘోషాచ ఘృతాచీమేన కాతథా | విశ్వాచీ చైవ రంభాచ ప్రవ్లూెచాచారుభాషిణీ || 65 ||

పూర్వచిత్తిం సురూపాచ అనువ్లూెచా యశస్వినీ | ఏతాశ్చాన్యాశ్చ బహుశః తత్రసంస్థాప్యచింతయన్‌ || 66 ||

పరస్పరం విలోక్యైవ శంకమానాభ##యేనహి | యమశ్చైవతథాశక్ర ఉభౌవాయతనం హివః || 67 ||

ఏవం విచార్యబహుధా వర్థనీ నామభారత | సర్వాసామప్సర సాంశ్రేష్ఠా సర్వాభరణ భూషితా || 68 ||

ఉవాచైవోర్వశీతత్రకింభిద్యసి శుభాననే | దేవానాం కార్యసిద్ధ్యర్థం మాయా రూపబలేనచ

వర్ణధర్మోయథా భూయాత్‌ కరిష్యేపాకశాసన | || 69 ||

ఇంద్ర ఉవాచ -

సాధుసాధు మహాభాగే వర్ధనీనామసువ్రతా | శీఘ్రం గచ్ఛస్వయం భ##ద్రేకురుకార్యం కృశోదరీ || 70 ||

ధీరాణా మవనేశక్తా నాన్యాసుభ్రుత్వయావినా | వర్థనీచతథే త్యుక్త్వా గతాయత్రసధర్మరాట్‌ || 71 ||

మహాతాభూషణనైవరూపం కృత్వామనోరమం | కుంకుమైః కజ్జలైః వసై#్త్రః భూషణౖశ్చైవ భూషితా || 72 ||

కుసుమంచతథావస్త్రం కింకిణీకటిరాజితా | ఝణత్కారైస్తథాకష్టైః భూషితాచ పదద్వయే || 73 ||

నానాభూషణ భూషాఢ్యానానా చందన చర్చితా | నానాకుసుమమలాఢ్యాదుకూలేనావృతాశుభా || 74 ||

ప్రగృహ్యవీణాం సంశుద్ధాం కరేసర్వాంగ సుందరీ | నర్తనంత్రివిధం తత్రచక్రేలోకమనోరమం || 75 ||

తారస్వరేణమధురైః వంశనాదేన మిశ్రితం | మూర్ఛనాతాలసంయుక్తం తంత్రీల యసమన్వితం || 76 ||

క్షణన సహసాదేవో ధర్మరాజోజితాత్మవాన్‌ | విమనాః సతదాజాతో ధర్మరాజోనృపాత్మజః || 77 ||

యుధిష్ఠిర ఉవాచ -

ఆశ్చర్యం పరమం బ్రహ్మన్‌ జాతంమే బ్రహ్మ సత్తమ | కథం బ్రహ్మోపపన్నన్యతపశ్ఛేదోబభూవహ || 78 ||

ధర్మేధరాచ నాకశ్చ ధర్మేపాతాల మేవచ | థర్మేచంద్రార్కమాపశ్చ ధర్మేచపవనోనలః || 79 ||

ధర్మేచైవాఖిలం విశ్వం సధర్మోవ్యతగ్రతాం కథం | గతః స్వామింస్తద్వైయగ్ర్యం తధ్యం కథయసువ్రత || 80 ||

తా || ఇంద్రుని వచనము - ఈతడు ధర్మరాజు ఉగ్రమైన తపమందున్నాడు. నా రాజ్యాన్ని కాంక్షిస్తూన్నాడీతడు. ఈ ప్రయత్నం నివర్తించేందుకు ప్రయత్నించండి. (63) ఈతని తపస్సుకు విఘ్నం కల్గించండి. ఇది నా ఆజ్ఞ. అక్కడికి వెళ్ళండి. ఇంద్రుని మాటనువిని, ఉర్వశి, తిలోత్తమ (64) సుకేశి, మంజుఘోష ఘృతాచి, మేనక, విశ్వాచి, రంభ, ప్రవ్లూెచ, చారుభాషిణి (65) పూర్వచిత్తి, సురూప, అనువ్లూెచ, యశస్విని వీరు, ఇంకా అక్కడున్న ఇతరులు చాలాసేపు ఆలోచించారు (66) ఒకరినొకరు చూచుకొని భయంతో, అనుమానపడుతూ, యముడు, ఇంద్రుడు, వీరిద్దరు మనకు స్థానము (67) ఈ విధంగా చాలా ఆలోచించి ఓ భారత! వర్ధనీ అనుపేరుగలది, అప్సరసలందరిలో శ్రేష్టమైనది అన్ని ఆభరణములతో కూడినది (68) ఇట్లా అంది. ఓ శుభాసన! ఉర్వశి, ఎందుకు బాధపడుతావు. దేవతల కార్యసిద్ధి కొరకు మాయా రూపబలముతో వర్ణ ధర్మమునకు తగినట్లు చేస్తాను, ఓ ఇంద్ర అని అనగా (69) ఇంద్రుని వచనము - ఓ మహాభాగే! బాగుంది. వర్ధనీ అనుపేరుగల ఓ సువ్రతే, త్వరగా వెళ్ళు నీవే స్వయంగా ఓ భ##ద్రే! కృశోదరి పనిచేయి (70) ధీరులను వంచటంలో నీవుకాక ఇతరులు శక్తులుకారు, ఓ సుభ్రు! అనగానే వర్ధని అట్లాగే సలికి ధర్మరాజు ఉన్న చోటికి వెళ్ళింది. (71) గొప్ప సొమ్ములతో మనోరమమైన రూపాన్ని కల్గించుకొని, కుంకుమతో, కాటుకతో, వస్త్రములతో భూషణములతో అలంకరించుకొని,(72) పూలు, వస్త్రములు కలిగి చిరుగజ్జెలు నడుము యందు వెలుగుతుండగా, పాదమందు, ధ్వనిస్తున్న, కష్టం కల్గించే సొమ్ములను అలంకరించుకొని (73) అనేకరకములైన అలంకరింపతగిన సొమ్ములతో అలంకరించుకొని, రకరకములైన చందనములను పూసుకొని, రకరకాల పూలమాలలు ధరించి, పట్టు వస్త్రము కప్పుకొని, శుభ##యైన ఆమె (74) బాగా శుద్ధమైన వీణను చేతధరించి, సర్వాంగసుందరియైన ఆమె అక్కడ మూడు రకములైన నాట్యమును లోకమనోరమముగా చేసింది (75) తారస్వరముతో మధురములైనవి, వేణునాదముతో కూడినది (76) మూర్ఛనాతాలములతో కూడినది, తంత్రీలయములతో సమన్వితమైనది ఆ నాట్యము. జితాత్ముడైన ఆ ధర్మరాజు క్షణకాలంలో త్వరగా చలించిన మనస్సు కలవాడైనాడు. అనృపాత్మజుడు ధర్మరాజు అప్పుడు అట్లా ఐనాడు. (77) అనగా ధర్మరాజువచనము (యుధిష్ఠిరుడు) ఓ బ్రహ్మన్‌! ఓ బ్రహ్మసత్తమ! నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. బ్రహ్మను పొందిన ఆతనికి తపస్సు విచ్ఛేదము ఎట్లా జరిగింది (78) ఈ భూమి, స్వర్గము ధర్మమందున్నాయి. పాతాళము ధర్మములోనే ఉంది. చంద్ర సూర్యులు జలముగాలి అగ్ని ధర్మమందున్నాయి. (79) ఈ విశ్వమంతా ధర్మంలోనే ఉంది. అట్టి ధర్మము ఎట్లా ఒకే ఆవిషయమందు లగ్నమైనాడు ఓ స్వామి! ఆ వైయగ్ర్యమును (ఒకే వస్తువు యందు మనస్సు లగ్నము) ఉన్నదున్నట్లుగా చెప్పు, ఓ సువ్రత అనగా (80)

మూ || వ్యాస ఉవాచ-

పతనం సాహసానాం చ నరకసై#్యవకారణం | యోనికుండమిదం సృష్టం కుంభీపాకసమంభువి || 81 ||

నేత్రరజ్జ్వా దృఢం బద్ధ్వాధర్శయంతి మనస్వినః | కుచరూపైర్మహాదండైః తాడ్యమానమచేతనం || 82 ||

కృత్వావై పాతయంత్యాశు నరకం నృపసత్తమ | మోహనం సర్వభూతానాం నారీచైవంవినిర్మితా || 83 ||

తావద్ధంతమనస్థైర్యం శ్రుతం సత్యమనాకులం | యావన్మత్తాంగనాగ్రే సవాగురేవసుచేతసా || 84 ||

తావత్తపోభివృద్ధిస్తు తావద్దానందయాదమః తావత్‌ స్వాధ్యాయవృత్తంచ తావచ్ఛౌచంధ్రుతంవ్రతం || 85 ||

యావత్‌ త్రస్తమృగీదృష్టిం చపలాంసవిలోకయేత్‌ | తాపన్మాతాపితాతాపత్‌ భ్రాతాతావత్‌ సనుహృజ్జనః || 86 ||

తావల్లజ్జా భయంతావత్‌ స్వాచారస్తావదేవహి | జ్ఞానమౌదార్యమైశ్వర్యం తాపదేవహిభాసతే

యావన్మత్తాంగనాపాశైః పాతితోనైవబంధనైః || 87 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే ధర్మారణ్య మాహాత్మ్యే ఇంద్రభయకథనంనామ తృతీయోధ్యాయః || 3 ||

తా || వ్యాసుని వచనము - సాహసముల నుండి పతనము నరకమునకు కారణము ఈ యోనికుండము భూమి యందు కుంభీపాక (నరక) సమముగా సృష్టించబడింది (81) మనస్వులను నేత్రరజ్జువులతో గట్టిగా బంధించి దర్శిస్తారు. కుచరూపములైన మహాదండములతో కొట్టబడుతున్న వానిని, చైతన్య రహితునిగా చేసి (82) త్వరగా నరకమందు పడవేస్తారు. ఓ నృపసత్తమ! సర్వప్రాణులకు మోహం కల్గించేది నారి ఇట్లా నిర్మించబడింది. (83) అయ్యో మనః స్థైర్యము, వ్యాకుల పాటు లేకుండా సత్యం వినటము ఎంత వరకంటే, సుచేత సులముందు మదించిన స్త్రీ వల (ఉరి) వలె ఉండనంతవరకే (84) తపోభివృద్ధి దానము, దయ, దమము, స్వాధ్యాయ వృత్తము, శౌచము, ధృతము, వ్రతము (85) ఇవన్నీ ఎంతవరకంటే, చంచలమైన, భయపడిన లేడిదృష్టివంటి దృష్టిగల స్త్రీని చూడనంత వరకే. తల్లి దండ్రి, అన్నదమ్ములు సుహృజ్జనులు (86) లజ్జ, భయము, స్వాచారము, జ్ఞానము,ఔదార్యము, ఐశ్వర్యము ఇవన్నీ ఎంతవరకు వెలుగుతాయంటే, మదించిన స్త్రీ అనే పాశములతో బధింపబడి పడిపోడో అంతవరకే (87) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు మూడవ బ్రహ్మఖండమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు ఇంద్రుని భయమును చెప్పుట అనునది మూడవ అధ్యాయము || 3 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters