Sri Scanda Mahapuranamu-3    Chapters   

శ్రీః

అథశ్రీస్కాందేమహాపురాణతృతీయే

బ్రహ్మఖండే ధర్మారణ్యఖండప్రారంభః

శ్రీగణశాయనమః

మూ || తర్తుంసంసృతివారిధింత్రిజగతాంనౌర్నామ యస్యప్రభోః | యేనేదంసకలంవిభాతిసతతంజాతంస్థితంసంసృతం

యశ్చైతస్యఘనప్రమాణవిధురోవేదాంతవేద్యోవిభుః | తంపందేసహజప్రకాశమమలంశ్రీరామచంద్రంవరం (1)

విద్యారూపంనిమలభవనం¸°వనం¸°వతంవా | సర్వంవ్యర్థంమరణసమయేధర్మేకఃసహాయః (2)

నైమిషే నిమిషక్షేత్రేఋషయఃశౌనకాదయః | సత్రంస్వర్గాయలోకాయసహస్రసమమాసత || 1 ||

ఏకదాసూతమాయాంతందృష్ట్వాతంశౌనకాదయః | పరంహర్షంసమావిష్టౌఃవపుఃనేత్రైఃసుచేతసా చిత్రాఃశ్రోతుంకథాస్తత్రపరివప్రుఃతపస్వినః || 2 ||

అథతేషూపవిష్టేషు తపస్విషు మహాత్మసు | నిర్దిష్ట మాసనంభేజేవినయాల్లోమహర్షణః || 3 ||

సుఖాసీనంచతందృష్ట్యా విఘ్నాంతముపలక్ష్యచ | అథాపృచ్ఛంస్తృషయఃకాశ్చిత్ప్రాస్తావికీఃకథాః || 4 ||

పురాణమఖిలంతాతపురాతేధీ7తవాన్పితా | కచ్చిత్త్వయాపితత్సర్వమధీతంలోమహర్షణ || 5 ||

కథయస్వకథాంసూతపుణ్యాంపాపనిషూదినీం | శ్రుత్వాయాంయాతినిలయంపావంజన్మశతోద్భవం || 6 ||

సూతఉవాచ -

శ్రీభారత్యంఘ్రియుగలంగణనాథపదద్వయం | సర్వేషాంచైవదేవానాంనమస్కృత్యవదామ్యహం || 7 ||

శక్తీంశ్చైవగ్రహాస్యజ్ఞాదిదేవతాః | నమస్కృత్యశూభాన్‌విప్రాన్‌కవిముఖ్యాంశ్చసర్వశః || 8 ||

అభీష్టదేవతాశ్చైవప్రణమ్యగురుసత్తమం | నమస్కృత్యశుభాన్‌దేవాన్‌రామాదీంశ్చవిశేషతః || 9 ||

యాన్‌స్మృత్వాత్రివిధైఃపాపైఃముచ్యతేనాత్రసంశయః | తేషాంప్రసాదాత్‌వక్ష్యేహంతీర్థానాంఫలముత్తమం సర్వేషాంచనియంతారంధర్మాత్మానం ప్రణమ్యచ || 10 ||

ధర్మారణ్యపతిఃత్రివిష్టవపతిఃనిత్యంభవానీవతిః | పాపాద్వఃస్థిరభొగ యోగసులభోదేవఃసథర్మేశ్వరః

పర్వేషాంహృదయానిజీవకలయావ్యావ్యస్థితఃసర్వదా | ధ్యాత్వాయంనపునర్విశంతిమనుజాఃసంసారకారాగృహం || 11 ||

తా || శ్రీగణశునకునమస్కారము - ముల్లోకముల యొక్కసంసారసాగరమును దాటుటకు ఏభ్రువుయొక్కనిర్మల ప్రకాశము పడవలా ఉపయోగపడుతుందో, ఎవనివల్లిదంతావెలుగుతుందో ఎల్లప్పుడూ సృష్టింపబడి, రక్షింపబడి కలిసి ఉందో, ఎవడు చైతన్యమనే ఘన్పరమాణముతోవికలుడు, వేదాంతములచేత తెలుసుకోదగినవాడో, విభువో అట్టి సహజమైనవిమల ప్రకాశముగలవరుడైన శ్రీరామచంద్రునినమస్కరిస్తున్నాను (1) భార్యలు, పుత్రులు, ధనము,పరిజనులు, బంధువర్గము ప్రియమైనవారు తల్లి, అన్నదమ్ములు, తండ్రి, మామగారింటివారు, భృత్యులు, ఐశ్వర్యము, విత్తము,విద్యరూపము, స్వచ్ఛమైనభవనము, యవ్వనము, యువతులు ఇవన్నిమరణ సమయమందువ్యర్థము. ధర్మమొక్కటేతోడుగా ఉండేది. (2) నైమిషారణ్యమందు నిమిషక్షేత్రమందు శౌనకాదులుఋషులువేయి (మందికూడి) సంవత్సరములు స్వర్గలోకముకొరకు సత్రయాగముఆచరించారు. (1) ఒకసారి శౌనకాదులు వచ్చినసూతునిచూచి, చాలాసంతోషమును పొంది మంచి మనస్సుగలిగి తమకళ్ళతోఅతన్నితాగేసారు (చూచారు) చిత్రమైనకథలను వినుటకుఅక్కడృషులుచుట్టూచేరారు. (2) మహాత్ముడైన ఆతపస్వులుకూర్చున్నపిదపలోమహర్షణుడువినయంగా, ఒకప్రత్యేకమైన ఆసనమునుపంపాడు (3) సుఖంగా అతడు కూర్చున్నది చూసి, విఘ్నములులేవనిగమనించి, ఋషులుఏవోకొన్నిప్రాస్తా వికమైన కథలనుఅడిగారు (4) ఓనాయన! పూర్వము అన్నిపురాణములను మీనాయనగారుమీకుచెప్పారుకదా! నీవుకూడాకొన్ని, అవన్నిలోమహర్షణికిచెప్పావుగదా (5) ఓసూత! పాపములనశింపచేసేపుణ్యమైనొక కథనుచెప్పు. దానినివినినూరుజన్మలనుండి కలిగిన పాపమువిలయమౌతుంది. (6) సూతుని వచనము - శ్రీభారతి యొక్కపాదద్వయమును, గణనాథుని పాదద్వయము నునమస్కరించి దేవతలందరికి నమస్కరించి నేనుచెబుతున్నాను. (7) శక్తులను, వసువును, గ్రహములనుయజ్ఞాదిదేవతలను, శుభప్రదమైన విప్రులకు కవి ముఖ్యులకు, అందరికినమస్కరించి (8) అభీష్టదేవతలను, (స్త్రీలు) గురుసత్తమునినమస్కరించి, శుభులైనదేవతలను (పురుషులు), విశేషించిరామాదులనునమస్కరించి (9) చెప్తున్నాను. వారివిస్మరిస్తేత్రి విథములైనపాపములనుండి ముక్తులౌతారు. ఇందులోఅనుమానంలేదు. వారిఅనుగ్రహంతోనేను తీర్థములయొక్కుత్తమ ఫలమునుచెప్పబోతున్నాను. అందరిని నియమించేధర్మాత్మునిగూడానమస్కరించి (10) చెప్తున్నాను. ధర్మారణ్యపతిఎల్లప్పుడు ముల్లోకము లకుపతి, భవానీ పతి, పాపములనుండిమిమ్మురక్షించేవాడు. స్థిరమైనభోగయోగములకు సులభుడు, దేవుడు ఆ ధర్మేశ్వరుడు అందరి హృదయాలను జీవకళతోవ్యాపించిఉన్నావాడు. అతనినిఎల్లప్పుడుధ్యానించు మనుజులు సంసార కారాగృహమునకుతిరిగిరారు (11).

మూ || ఏకదాతుసధర్మోవైజగామబ్రహ్మనంసది | తాంసభాంససమాలోక్యజ్ఞాననిష్ఠో7భవత్తదా || 12 ||

దేవైఃమునివైఃక్రాంతాంసభామాలోక్యవిస్మితః | దేవైఃయక్షైఃతథానాగైఃపన్నగైశ్చతథా7సురైః || 13 ||

ఋషిభిఃసిద్ధగంధర్వైఃసమాక్రాంతోచితాసనా | నసుఖాసాసభాబ్రహ్మన్‌నశీతానచఘర్మదా || 14 ||

సక్షుధంనపిపాసాంచనగ్లానింప్రాప్నువత్యుత | నానారూపైరివకృతామణిభిఃసా సభావరైః || 15 ||

స్తంభైశ్చవిధృతాసాతుశాశ్వతీనసక్షయా | దివ్యైర్నానావిధైర్భావైర్భాసద్భిరమితప్రభా || 16 ||

అతిచంద్రంచసూర్యంచశిభినంచస్వయంప్రభా | దీప్యతేనాకపృష్ఠస్థాభర్త్పయంతీవభాస్కరం || 17 ||

తసయాంసభగవాన్‌శాస్తివివిధాన్‌దేవమానుషాన్‌ | స్వయమేకో7నిశంబ్రహ్మాసర్వలోకపితామహః || 18 ||

ఉపతిష్ఠంతిచాప్యేనంప్రజానాంవతయఃప్రభుం | దక్షఃప్రచేతాఃపులహోమరీచిఃకశ్యపఃప్రభుః || 19 ||

భృగురత్రిర్వసిష్ఠశ్చగౌతమో7థతథాంగిరాః | పులస్తయశ్చక్రతుశ్చైవప్రహ్లాదఃకర్దమస్తథా || 20 ||

అధర్వాంగిరసశ్చైవవాలఖిల్యామరీచిపాః | మనోం7తరిక్షంవిద్యాశ్చవాయుస్తేజోజలంమహీ || 21 ||

శబ్దస్పర్శౌతథారూపంరసోగంధస్తధైవచ | ప్రకృతిశ్చవికారశ్చసదసత్‌కారణంతథా || 22 ||

అగస్త్యశ్చమహాతేజామార్కండేయశ్చవీర్యవాన్‌ | జమదగ్నిఃభరద్వాజఃసంవర్తఃచ్యవనస్తథా || 23 ||

దుర్వాసాశ్చమహాభాగృష్యశృంగశ్చధార్మికః | సనత్‌కుమారోభగవాన్‌యోగాచార్యోమహాతపాః || 24 ||

అసితోదేవలశ్చైవజైగీషవ్యశ్చతత్వవిత్‌ | ఆయుర్వేదస్తథాష్టాంగోగాంధర్వశ్చైవతత్రహి || 25 ||

చంద్రమాఃసహనక్షత్రైఃఆదిత్యశ్చగభస్తిమాన్‌ | వాయవఃతంతవశ్చైవసంకల్పఃప్రాణవచ || 26 ||

మూర్తిమంతోమహాత్మానోమహావ్రతపరాయణాః | ఏతేచాన్యేచబహవోబ్రహ్మాణంసముపాసిరే || 27 ||

అర్థోధర్మశ్చకామశ్చహర్షోద్వేషన్తమోదమః | ఆయాంతితస్యాంగంధర్వాప్సరసాంగణాః || 28 ||

శుక్రాద్యాశ్చగ్రహాశ్చైవయేచాన్యేతత్సమీపగాః | మంత్రారథంతరంచైవహరిమాన్వసుమానపి || 29 ||

మహితోవిశ్వకర్మాచవసవశ్చైవసర్వశః | తథాపితృగణాఃసర్వేసర్వాణిచహవీంష్యధ || 30 ||

తా || సూతులిట్లనిరి - ఒకసారి ఆధర్ముడుబ్రహ్మసభకువెళ్ళాడు. ఆసభనుఆతడుచూచి అప్పుడుజ్ఞాననిష్ఠుడైనాడు (12) దేవతలతోమునులతోఆక్రమింపబడినసభనుచూచిఆశ్చర్యపడినాడు. దేవతలు, యక్షులు,నాగులు, వన్నగులు, అప్సరసలు, (13) ఋషులు, సిద్ధులు, గంధర్వులు, తమతమాసనములందుకూర్చొనిఉన్నారు. ఆసభనుఖకరముగాఉంది. ఓబ్రహ్మ! అంతచల్లగాలేదు. అంతవేడిగాలేదు. (14) ఆకలి,దప్పిక, గ్లానివారుపొందటంలేదు. ఆసభ##శ్రేష్ఠములైననానారూప ములైనమణులతోచేయబడినట్టుగా ఉంది. (15) ఆసభస్తంభములతోభరించబడిందిశాశ్వతమైనది. నాశములేనిది. దివ్యములైననానా విధములైన భావములతో వెలిగిపోతూ అమితంగాప్రకాశిస్తోంది. (16) చంద్రునిసూర్యునిఅగ్నినిఅతిక్రమించిన స్వయంప్రభకలది. స్వర్గముయొక్కపృష్ఠ భాగమందుఉండి వెలుగుతోంది. సూర్యునిభయపెడ్తున్నట్టుగా ఉంది. (17) ఆసభయందుకరకరములైనదేవమనుష్యులనుఆభగవంతుడుశాసిస్తున్నాడు.సర్వలోకపితామహుడై నొక్కడేబ్రహ్మ స్వయముగాఎల్లప్పుడుశాసిస్తున్నాడు. (18) ఈప్రభువునుప్రజాపతులుఅనుసరించిఉన్నారు. దక్షుడు, ప్రచేతనుడు, పులహుడు మరీచి ప్రభువైనకశ్యపుడు (19) భృగువు, అత్రి, వసిష్ఠుడు, గౌతముడు, అంగిరుడ, పులస్త్యుడు, క్రతువు, ప్రహ్లాదుడు, కర్దముడు (20) అధర్వుడు, అంగిరసుడు, వాలభిల్యులు, మరీచిషులు, మనస్సు, అంతరిక్షము, విద్యలు, వాయువు, తేజస్సుజలముభూమి (21) శబ్దస్పర్శలు, రూపము, రసము, గంధము, ప్రకృతి, వికారము, సదసత్కారణములు (22) అగస్త్యుడు, మహాతేజస్సుగల వీర్యవంతుడైనమార్కండేయుడు, జమదగ్నిభరద్వాజుడు, సంవర్తుడు, చ్యవనుడు (23) మహాభాగుడుదుర్వాసుడు, ధార్మికుడుఋష్యశృంగుడు, యోగాచార్యుడుమహా తపస్సంపన్నుడుభగవంతుడైనసనత్కుమారుడు (24) అసితుడు దేవలుడు. తత్వవిదుడైనజైగీషవ్యుడు, ఆయుర్వేదము, అష్టాంగములు,గాంధర్వము (25) చంద్రుడు, నక్షత్రములు, కిరణములు గల సూర్యుడు, వాయువులు, తంతువులు, సంకల్పము, ప్రాణము (26) మహావ్రత పరాయణులైన మూర్తి మంతులైన మహాత్ములు, వీరు, ఇతరులు అనేకమంది బ్రహ్మను చక్కగా ఉపాసించారు. (27) అర్ధము, ధర్మము,కామము, హర్షము, ద్వేషము, తమము, దమము, గంధర్వ అప్సరసల గణములుకూడి ఆ సభకు వస్తున్నారు (28) శుక్రాదులు, గ్రహములు, వాని సమీపమందున్నవి ఇతరములైనవి, మంత్రములు, రథంతరము, హరిమాన్‌, వసుమానులు (29) మహితుడైన విశ్వకర్మ, అందరు వసువులు, పితృగణము లందరు అన్నిహవిస్సులు (30)

మూ || ఋగ్వేదః సామవేదశ్చ యజుర్వేదస్తథైవచ | అథర్వవేదశ్చతథా సర్వశాస్త్రాణి చైవహి || 31 ||

ఇతిహాసోపవేదాశ్చ వేదాంగానిచ సర్వశః | మేధాధృతిః స్మృతిశ్చైవప్రజ్ఞాబుద్ధిః యశః సమాః || 32 ||

కాలచక్రం చతద్దివ్యం నిత్యమక్షయమవ్యయం | యావంత్యోదేవపత్న్యశ్చ సర్వేవమనోజవాః || 33 ||

గార్హపత్యానాకచరాః పితరోలోకవిశ్రుతాః | సోమపాఏక శృంగాశ్చ తథాసర్వేతపస్వినః || 34 ||

నాగాః సువర్ణాః పశవః పితామహముపాసతే | స్థావరాజంగమాశ్చాపిమహాభూతాస్తథాపరే || 35 ||

పురందరశ్చదేవేంద్రో వరుణోధనదస్తథా | మహాదేవః సహోమో7త్ర సదాగచ్ఛతి సర్వదః || 36 ||

గచ్ఛంతి సర్వదాదేవానారాయణస్త థర్షయః | ఋషయోవాలశిల్యాశ్చయోనిజాయో నిజాస్తథా || 37 ||

యత్కించిత్త్రిషులోకేషు దృశ్యతేస్థాణుజంగమం | తస్యాంసహోవవిష్టాయాం తత్రజ్ఞాత్వాసధర్మవిత్‌ || 38 ||

దేవైః మునివరైః క్రాంతాం సమాలోక్యాతివిస్మితః | హర్షేణ మహతాయుక్తోరోమాంచితతనూరుహః || 39 ||

తత్రథర్మోమహాతేజాః కథాం పాపవ్రణాశినీం | వాచ్యమానాంతుశుశ్రావవ్యాసేనామిత తేజసా || 40 ||

ధర్మారణ్యకథాం దివ్యాంతథైవసుమనోహరాం | థర్మార్థకామమోక్షాణాం ఫలదాత్రీంతథైవచ || 41 ||

పుత్రపౌత్రప్రపౌత్రాది ఫలదాత్రీం తథైవచ | ధారణాచ్ఛ్రవణాచ్చాపి పఠనాచ్చావలోకనాత్‌ || 42 ||

తాంనిశమ్యసువిస్తీర్ణాంకథాం బ్రహ్మాండసంభవాం | ప్రమోదోత్ఫుల్లనయనో బ్రహ్మాణ మనుమత్యచ || 43 ||

కృతకార్యోపి ధర్మాత్మాగంతుకామస్తదా భవత్‌ | నమస్కృత్యతదా ధర్మో బ్రహ్మాణం నపితామహం || 44 ||

అనుజ్ఞాతస్తదాతేన గతో7సౌ యమశాసనం | పితామహప్రసాదాచ్చశ్రుత్వాపుణ్యప్రదాయినీం || 45 ||

ధర్మారణ్యకథాం దివ్యాం పవిత్రాంపాపనాశినీం | సగతో7నుచరైః సార్థం తతః సంయమినీం ప్రతి || 46 ||

అమాత్యానుచరైః సార్ధం ప్రవిష్టః స్వపురం యమః | తత్రాంతరే మహాతేజా నారదోమునిపుంగవః || 47 ||

దుర్నిరీక్ష్యః కృపాయుక్తః సమదర్శీ తపోనిధిః | తవసాదగ్ధదేహోపి విష్ణుభక్తి పరాయణః || 48 ||

సర్వగః సర్వవిచ్చైవ నారదః సర్వదాశుచిః | వేదాధ్యయన శీలశ్చత్వాగతస్తత్ర సంసది || 49 ||

తా || ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వవేదము అట్లాగే అన్నిశాస్త్రములు (31) ఇతిహాసములు, ఉపవేదములు అన్ని వేదాంగములు, మేధ, ధృతి, స్మృతి, ప్రజ్ఞ, బుద్ధి, యశము, సంవత్సరములు (32) ఆ దివ్యమైన కాలచక్రము నిత్యమైన, అక్షయమైన అవ్యయమైన (కాలము) మనో వేగము గల దేవపత్నులందరు (33) గార్హపత్యములు, నాక మందు చరించువారు పితరులు లోక విశ్రుతమైనవారు, సోమపులు, ఏకశృంగులు అట్లాగే తపస్వులందరు (34) నాగులు, సుపర్ణులు, యజ్ఞ పశువులు పితామహుని సేవిస్తున్నారు. స్థావరములు, జంగమములు, అట్లాగే ఇతరములైన మహాభూతములు (35) పురందరుడైన దేవేంద్రుడు, వరుణుడు, కుబేరుడు, అన్ని ఇచ్చే మహాదేవుడు ఉమతో కూడి ఇక్కడికి ఎల్లప్పుడు వేళ్తాడు (36) ఎల్లప్పుడు దేవతలు నారాయణుడు అట్లాగే ఋషులు వెళ్తారు. వాలఖిల్యఋషులు, అట్లాగే యోనిజులైన వారు, యోనిజులు కానివారు (37) ముల్లోకములలో చూడబడుతున్న స్థాణుజంగమములు ఆ సభయందు అక్కడ తనతోకలిసి కూర్చోగా ఆధర్మవిదుడు తెలుసుకొని, (38) దేవతలతో మునులతో ఆక్రమింపబడిన దానిని చూచి, అత్యాశ్చర్యమునొంది, గొప్ప ఆనందంతో కూడినవాడై, శరీరం పులకరించగా (39) అక్కడ మహాతేజస్సంపన్నుడైన ధర్మము పాపముల నశింపచేసే కథను అమిత జస్సంపన్నుడైన వ్యాసుడు చెప్పిన దానిని విన్నాడు (40) ఆ ధర్మారణ్యకథ దివ్యమైనది అట్లాగే చాలా మనోహరమైనది. ధర్మఅర్థకామమోక్ష ఫలములను ఇచ్చేదికూడా (41) పుత్రపౌత్ర ప్రపౌత్రాదుల ఫలమును ఇచ్చేది కూడా ధరించుట వలన (ధారణ) వినుటవలన, చదువుట వలన, చూచుట వలన కూడా ఫలమిచ్చేది (42) బ్రహ్మాండములో జరిగిన ఆ విస్తారమైన కథను విని,ఆనందంతో విప్పారిన కనులు గలవాడై బ్రహ్మఅనుజ్ఞపొంది (43) ధర్మాత్ముడైన ఆతడు పనినెరవేరింది కనుక వెళ్ళాలని అనుకున్నాడు. అప్పుడు ధర్ముడు పితామహుడైన బ్రహ్మకు నమస్కరించి (44) అప్పుడాతనిచే అనుజ్ఞపొంది యమశాసనమును ఈతడు వెళ్ళాడు. పితామహుని అనుగ్రహము వలన పుణ్యప్రదమైన (45) దివ్యమైన పవిత్రమైన పావనాశకమైన ధర్మారణ్య కథనువిని, అనుచరులతో కూడి సంయమిని (తననగరం) గూర్చి ఆతడు వెళ్ళాడు (46) అమాత్యులు అనుచరులతో కూడి యముడు తన నగరం ప్రవేశించాడు. ఇంతలో మహాతేజస్సంపన్నుడు ముని పంగవుడు నారదుడు (47) చూడశక్యముకాని (తేజస్సుకల) వాడు, దయగలవాడు, సమదర్శి, తపోనిధి, విష్ణుభక్తి పరాయణుడు, తపస్సుతో దగ్ధమైన (నశించిన) దేహముకలవాడు) (48) సర్వత్ర వెళ్ళగలవాడు, అన్ని తెలిసినవాడు, ఎల్లప్పుడు శుచియైన నారదుడు, వేదాధ్యయనశీలుడు ఆ సభకు వచ్చాడు (49).

మూ || తందృష్ట్వా సహసాధర్మోభార్యయా సేవకైః సహ | సంముఖోహర్ష సంయుక్తో గచ్ఛన్నేవ ససత్వరః || 50 ||

అద్యమే సఫలం జన్మ అద్యమే సఫలం కులం | అద్యమే సఫలో ధర్మః త్వయ్యాయాతే తపోధనే || 51 ||

అర్ఘ్యపాద్యాదివిధి నా పూజాంకృత్వావిధానతః | దండవత్తం ప్రణమ్యాథ విధినాచోపవేశితః || 52 ||

ఆసనేస్వే మహాదివ్యే రత్నకాంచన భూషితే | చిత్రార్పితా సభా సర్వాదీపని ర్వాతగా ఇవ || 53 ||

విధాయ కుశల ప్రశ్నం స్వాగతేనాభినంద్యతం | ప్రహర్షమతులం లేభే ధర్మారణ్యకథాం స్మరన్‌ || 54 ||

నారదం పూజయిత్వాతు ప్రహృష్టేనాం తరాత్మనా | హర్షితం తుయమందృష్ట్వా నారదో విస్మితాననః || 55 ||

చింతయా మాసమనసా కిమిదం హర్షితో హరిః | అతిహర్షం చతం దృష్ట్వా యమరాజ స్వరూపిణం | ఆశ్చర్య మన సంచైవ నారదః పృష్ఠవాంస్తదా || 56 ||

నారద ఉవాచ -

కిందృష్టం భవతాశ్చర్యం కింవాలబ్ధం మహత్పదం | దుష్టస్త్వం దుష్టకర్మాచ దుష్టాత్మా క్రోథ రూపధృక్‌ || 57 ||

పాపినాం యమనం చైవమేత ద్రూపం మహత్తరం | సౌమ్యరూపం కథం జాతమేతన్మే సంశయః ప్రభో || 58 ||

అద్యత్వం హర్ష సంయుక్తో దృశ్యసేకేన హెతునా | కథయస్వమహాకాయహర్షస్యే వహికారణం || 59 ||

ధర్మరాజ ఉవాచ -

శ్రూయతాం బ్రహ్మపుత్రైతత్‌ కథయామిన సంశయః | పురాహం బ్రహ్మసదనం గతవానభివందితుం || 60 ||

తత్రాసీనః సభామధ్యే సర్వలోకైకపూజితే | నానాకథాః శ్రుతాస్తత్ర ధర్మవర్గ సమన్వితాః || 61 ||

కథాఃపుణ్యాః ధర్మయుతాఃరమ్యాఃవ్యాసముఖాచ్చ్యుతాః | ధర్మకామార్థసంయుక్తాఃసర్వాఫ°ఘవినాశినీః || 62 ||

యాః శ్రుత్వా సర్వపాపేభ్యోముచ్యంతే బ్రహ్మహత్యయా | తారయంతి పితృగణాన్‌ శతమేకోత్తరంమునే || 63 ||

నారద ఉవాచ -

కీ దృశీ తత్కథా మేతాం ప్రశంసభవతాశ్రుతాం | కథాం యమమహాబాహో శ్రోతుకామో స్మ్యహం చతాం || 64 ||

యమ ఉవాచ -

ఏకదా బ్రహ్మలోకే7హం నమస్కర్తుం పితామహం | గతవానస్మితం దేశం కార్యాకార్య విచారిణ || 65 ||

మయాతత్రా ద్భుతం దృష్టం శ్రుతం చమునిసత్తమ | ధర్మారణ్య కథాంది వ్యాంకృష్ణ ద్వైపాయనేరితాం || 66 ||

తా || ఆతని చూచి ధర్ముడు భార్యతో సేవకులతో కూడి త్వరగా ఆనందంతో కూడి వేగంగా ఎదురేగుతూ (50) ఓ తపోధన ! నీకరతో, నేడు నాజన్మ సఫలమైంది, నాకులము సఫలమైంది. నేటికి నా ధర్మము సఫలమైంది (51) శాస్త్ర ప్రకారము అర్ఘ్య పాద్యాది విధులతో పూజచేసి, సాక్షాద్దండ ప్రణామము చేసి, శాస్త్ర ప్రకారము కూర్చొన్నాడు (52) తనడైన, మహాదివ్యమైన, రత్నకాంచనములతో అలంకరింపబడిన ఆసనమందు కూర్చొన్నాడు. సభ అంత చిత్రమందు దిద్దినట్లుగా (కదలకుండా) ఉంది. గాలి లేనప్పుడు దీపం నిశ్చలంగా ఉన్నట్లు ఉంది (53) కుశల ప్రశ్నలు వేసి స్వాగతంతో ఆతనిని అభినందించి, ధర్మారణ్య కథను స్మరిస్తూ మిక్కిలి ఆనందాన్ని పొందాడు (54) ఆనందించిన అంతరాత్మతో నారదుని పూజించాడు. ఆనందంతో ఉన్న యముని చూచి నారదుడు ఆశ్చర్యకరమైన ముఖము కలవాడై (55) మనస్సులో ఇట్లా ఆలోచించాడు. యముడు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడు. అని చాలా అనందము కల ఆతనిని యమరాజస్వరూపుని చూచి, ఆశ్చర్యమైన మనస్సుకల ఆతనిని అప్పుడు నారదుడు ఇట్లా అడిగాడు (56) నారద వచనము - నీవు ఆశ్చర్యకరమైన దానిని దేనిని చూచావు. ఏమి గొప్ప పదము నీకు లభించింది. నీవు దుష్టుడివి, నీ కర్మ దుష్టము, నీ ఆత్మదుష్టము, క్రోధరూపమును ధరించినవాడవు (57) పాపులను శిక్షించుట ఈ విధమైన నీకు ఈ మహత్తరమైన రూపమేమి. నీకీ సౌమ్యరూపము ఎట్లా కలిగింది. ఓ ప్రభు! ఇది నా సంశయము. (58) ఈ వేళ నీవు ఆనందంతో కన్పిస్తున్నావు. అందుకు కారణమేమి. ఓ మహాకాయ! నీ హర్షమునకు కారణాన్ని చెప్పు. అని (59) అనగా ధర్మరాజు ఇట్లా అన్నాడు - ఓ బ్రహ్మపుత్ర ! దీనిని చెబుతాను, విను అనుమానం వద్దు. పూర్వము నేను, నమస్కరించుటకై బ్రహ్మ మందిరమునకు వెళ్ళాను (60) సర్వలోకములతో పూజింపబడే సభా మధ్యమందు కూర్చొని, ధర్మవర్గముతోకూడిన అనేక కథలను అక్కడ విన్నాను (61) కథలు పుణ్య ప్రదములు, ధర్మయుతములు, రమ్యములు, వ్యాసముఖము నుండి విన్నటువంటివి. ధర్మకామఅర్థములతోకూడినవి. అన్ని పాప సమూహములను నశింపచేసేవి (62) ఆకథలను విని సర్వపాపముల నుండి, బ్రహ్మహత్యనుండి ముక్తులౌతారు. ఓ ముని! నూటొక్కటి పితృగణములను తరింపచేసేవి (63) నారదుని వచనము - ఆ కథలెట్టివో, నీవు విన్న ఆ కథలను నాకు వినిపించు. ఓ మహాబాహు! యమ! నేను ఆ కథను వినదలిచాను (64) అనగా యముడిట్లన్నాడు - ఒకసారి బ్రహ్మలోకంలో నేను బ్రహ్మను నమస్కరించుటకు వెళ్ళాను. కార్యమేది, అకార్యమేది తెలిసి కొనుటకు అక్కడికి వెళ్ళాను (65) ఓ మునిసత్తమ! నేనక్కడ అద్భుతాన్ని చూచాను, విన్నాను కూడా. కృష్ణద్వైపాయనుడు చెప్పిన దివ్యమైన ధర్మారణ్య కథను విన్నాను (66).

మూ || శ్రుత్వాకథాంమహాపుణ్యాంబ్రహ్మన్‌బ్రహ్మండగాంశుభాం | గుణపూర్ణాం సత్యయుక్తాం తేనహర్షేణ హర్షితః || 67 ||

అన్యచ్చైవమునిశ్రేష్ఠతవాగమనకారణం | శుభాయచ సుఖాయైవక్షేమాయచ జయాయహి || 68 ||

ఆద్యాస్మికృతకృత్యో7హం అద్యాహం సుకృతీమునే | ధర్మోనామాద్యజాతో7హం తవపద్యుగ్మదర్శనాత్‌ || 69 ||

పూజ్యో7హంచకృతార్థోహంధన్యోహంచాద్యనారద | యుష్మత్పాదప్రసాదాచ్చపూజ్యో7హంభువనత్రయే || 70 ||

సూత ఉవాచ -

ఏవంవిధైర్వచోభిశ్చతోషితోమునిసత్తమః | వవ్రచ్ఛపరయాభక్త్యా ధర్మారణ్య కథాం శుభాం || 71 ||

నారద ఉవాచ -

శ్రుత్వావ్యాసముఖాద్ధర్మధర్మారణ్య కథాశుభా | తత్సర్వం హికథయమే విస్తీర్ణం చయథాతథం || 72 ||

యమ ఉవాచ -

వ్యగ్రో7హం సతతం బ్రహ్మన్‌ ప్రాణి నాం సుఖదుఃఖినాం | తత్తత్కర్మానుసారేణ గతిందాతుం సుఖేతరం || 73 ||

తథాపి సాధుసంగోహి ధర్మాయైవ వ్రజాయతే | ఇహలోకే పరత్రాపిక్షేమాయచ సుఖాయచ || 74 ||

బ్రహ్మణః సన్నిధౌ యచ్చశ్రుతం వ్యాసముఖేరితం | తత్పర్వం కథయిష్యామి మానుషాణాం హితాయవై || 75 ||

సూత ఉవాచ -

యమేన కథితం సర్వం యచ్ఛ్రుతం బ్రహ్మసంసది | ఆది మధ్యావసానంచ సర్వంనైవాత్ర సంశయః || 76 ||

కలిద్వా పరయోర్మధ్యే ధర్మపుత్రం యుధిష్ఠిరం | గతో7సౌనారదోమర్త్యే రాజ్యం ధర్మసుతస్యవై || 77 ||

ఆగతః శ్రీహరే రంశోనారదః వ్రత్యదృశ్యత | జ్వలి తాగ్ని ప్రతీ కాశో బాలార్కసదృశేక్షణః || 78 ||

సవ్యావవృత్తం విపులం జటామండల ముద్వహన్‌ | చంద్రాం శుశుక్లేవసనేవసానోరుక్మభూషణః || 79 ||

వీణాం గృహీత్వామహతీం కక్షానక్తాం సఖీమివ | కృష్ణాజినోత్తరాసం గోహెమ యజ్ఞోపవీతవాన్‌ || 80 ||

దండీకమండలుకరః సాక్షాద్వహ్నిరివాపరః | భేత్తా జగతి గుహ్యానాం విగ్రహాణాం గుహోపమః || 81 ||

మహర్షి గణసంసిద్ధో విద్వాన్‌ గంధర్వవేదవిత్‌ | వైరకేలికలో విప్రోబ్రాహ్మః కలిరివాపరః || 82 ||

దేవగంధర్వ లోకానాం ఆది వక్తాసునిగ్రహః | గాతాచతుర్ణాం వేదానాం ఉద్గాతా హరిసద్గుణాన్‌ || 83 ||

సనారదో7ధ విప్రర్షిః బ్రహ్మలోక చరో7వ్యయః | ఆగతో7థ పురీం హర్షాత్‌ ధర్మరాజేన పాలితాం || 84 ||

అథతత్రోవవిష్టేషు రాజన్యేషు మహాత్మసు | మహత్సుచో పవిష్టేషు గంధర్వేషు చతత్రవై || 85 ||

లోకాననుచరన్‌ సర్వాన్‌ ఆగతః సమహర్షిరాట్‌ | నారదః సుమహాతేజా ఋషిభిః సహితస్తదా || 86 ||

తమాగతమృషిం దృష్ట్వా నారదం సర్వధర్మవిత్‌ | సింహాసనాత్‌ సముత్థాయ ప్రయ¸° నన్ముఖస్తదా || 87 ||

తా || ఓ బ్రహ్మన్‌ ! బ్రహ్మాండ మందున్న, మహా పుణ్యమైన శుభ##మైన కథను విని, గుణములతో నిండిన, సత్యము కలిగిన ఆ కథతో కల్గిన ఆనందముతో సంతసించి ఉన్నాను. (67) ఓ మునిశ్రేష్ఠ ! మీరాకకారణము కూడా మరో ఆనందకర విషయము. మీరాక శుభమునకు, సుఖమునకు, క్షేమమునకు,జయమునకు కారణము (68) ఈ వేళ##నేను కృతకృత్యుణ్ణి ఐనాను. ఓ ముని! ఈవేళ##నేను సుకృతిని. మీ పాద ద్వయ దర్శనము వలన ఈవేళ##నేను నిజంగా, ధర్ముడను పేరు కలవాణ్ణౖనాను (69) ఓ నారద! ఈ వేళ##నేను పూజ్యును కృతార్థుడను ధన్యుడను ఐనాను. మీపాదానుగ్రహం వలన ముల్లోకములలో నేను పూజ్యుడనైనాను (70) సూతుని వచనము - ఈ విధమైన మాటలతో ముని సత్తముని సంతోష పరిచాడు. అప్పుడు ముని శుభ##మైన ధర్మారణ్య కథను మిక్కిలి భక్తి కలిగి చెప్పమని అడిగాడు (71) నారదుని వచనము - ఓ ధర్మ వ్యాసుని ముఖము నుండి శుభ##మైన ధర్మారణ్య కథను విన్నావు. అదంతా నాకు వివరంగా ఉన్నదున్నట్లుగా చెప్పు (72) అనగా యముని వచనము - ఓ బ్రహ్మన్‌ ! నేను ఎల్లప్పుడు సుఖ దుఃఖములుగల ప్రాణుల విషయంలో వ్యగ్రుడను. వారి వారి కర్మల ననుసరించి సుఖముకన్న ఇతరమైన గతిని ఇచ్చేవాడిని (73) ఐనా సాధు సంగమము ధర్మము కొరకే ఏర్పడుతుంది. అది ఈ లోకమందు పరలోకమందు కూడా క్షేమమునకే, సుఖమునకే (74) వ్యాస ముఖము నుండి చెప్పబడిన బ్రహ్మ సన్నిధిలో విన్న దంతయు మనుష్యుల హితము కొరకు చెబుతాను (75) సూతుని వచనము - బ్రహ్మ సభలో విన్నదంతయు యముడు చెప్పాడు. ఆది మధ్య అవసానములు అంతా చెప్పాడు. ఇందులో అనుమానము లేదు (76) కలి ద్వాపరముల మధ్య యుధిష్ఠిరుడైన ధర్మపుత్రుని దగ్గరకు ఈ నారదుడు వెళ్ళాడు. ధర్మ సుతుని భూలోకంలోని రాజ్యమునకు (77) వచ్చి శ్రీ హరి అంశ##యైన నారదుడు కన్పించాడు. మండుతున్న అగ్నిలా ఉన్నాడు. బాలసూర్యుని వంటి చూపులు గలవాడు (78) కుడివైపు కప్పబడిన విపులమైన జడల సమూహమును ధరించాడు. చంద్ర కిరణమువలె తెల్లనైన వస్త్రముల ధరించాడు. బంగారుభూషణములు గలవాడై (79) చంకయందు వేలాడే మహతి అనెడు వీణను సఖిని వలె గ్రహించాడు, నల్లని జింక చర్మమును పై భాగమున కలిగి, బంగారు యజ్ఞోపవీతము కలిగి (80) దండము, కమండలువు చేత ధరించి, సాక్షాత్తు మరొక అగ్నిలా ఉన్నాడు. లోకంలోనిరహస్యమును ఛేదించేవాడు. విగ్రహములకు (తగాద) గుహవంటివాడైన (నిలయము) (81) మహర్షి గణములతో కూడిన, విద్వాంసుడైన, గాంధర్వ వేద (సంగీతము) విదుడైన, వైరకేళి యందు నిపుణుడైన, విప్రుడైన, మరొక కలివంటి వాడైనవాడు బ్రాహ్మ (నారదుడు), (82) దేవగంధర్వలోకములకు తొలి వక్త, మంచి నిగ్రహము కలవాడు, చతుర్వేదములను గానం చేసేవాడు, హరి సద్గుణములను కీర్తించే వాడు (83) ఆ నారదుడు విప్రర్షి. బ్రహ్మలోకమందు తిరిగేవాడు, అవ్యయుడు ఆతడు ధర్మరాజు పాలించే నగరమునకు ఆనందంతో వచ్చాడు (84) అక్కడ కూర్చున్నవారు రాజ శ్రేష్ఠులు, మహాత్ములు, గొప్ప గొప్ప గంధర్వులుకూర్చున్నారు (85) లోకములన్ని తిరుగుతు ఆ మహర్షి శ్రేష్ఠుడు ఇక్కడి కొచ్చాడు. గొప్ప తేజస్సుకల నారదుడు ఋషులతోకూడి అప్పుడు అక్కడికి వచ్చాడు (86) వచ్చిన ఆ నారద ఋషిని చూచి అన్ని ధర్మములు తెలిసిన ఆ ధర్మరాజు సింహాసనము నుండి లేచి అప్పుడు ఎదురుగా వెళ్ళాడు (87).

మూ || అభ్యవాదయత ప్రీత్యా వినయావన తస్తదా | తదర్హమాననం తసై#్మ సంప్రదాయయథావిధి || 88 ||

గాంచైవ మధుపర్కంచ సం ప్రదాయార్ఘమేవచ | అర్చయామానరత్నైశ్చ సర్వకామైశ్చ ధర్మవిత్‌ || 89 ||

తుతోషచ యథావచ్చ పూజాం ప్రాప్యచ ధర్మవిత్‌ | కుశలీత్వం మహాభాగ తపనః కుశలం తవ || 90 ||

నకశ్చిత్‌ బాధతే దుష్టో దైత్యోహి స్వర్గభూపతిం | మునే కల్యాణ రూపస్త్వం నమస్కృతః సురాసురైః సర్వగః సర్వవేత్తాచ బ్రహ్మపుత్ర కృపానిధే | || 91 ||

నారద ఉవాచ -

సర్వతః కుశలం మేద్య ప్రసాదాత్‌ బ్రహ్మణః సదా కుశలీత్వం మహాభాగ ధర్మ పుత్ర యుధిష్ఠిర || 92 ||

భ్రాతృభిః సహరాజేంద్ర ధర్మేషు రమతే మనః | దారైః పుత్రైశ్చ భృత్యైశ్చకుశ##లైః గజవాజిభిః || 93 ||

ఔరసానివ పుత్రాంశ్చ ప్రజాధర్మేణ ధర్మజ | పాలయసికిమాశ్చర్యం త్వయా ధన్యాహిసా ప్రజా || 94 ||

పాలనాత్‌ పోషణాత్‌ నౄణాం ధర్మోభవతివై ధ్రువం | తత్తద్ధర్మస్యభోక్తాత్వమిత్యేవం మసుర బ్రవీత్‌ || 95 ||

యుధిష్ఠిర ఉవాచ -

కుశలం మమ రాష్ట్రంచ భవతామం ఘ్రి స్పర్శనాత్‌ | దర్శనేన మహాభాగ జాతో7హంగత కిల్బిషః || 96 ||

ధన్యో7హం కృతకృత్యో7హం సభాగ్యో7హం ధరాతలే | అద్యాహం సుకృతీజాతో బ్రహ్మపుత్రే గృహాగతే || 97 ||

కుత ఆగమనం బ్రహ్మన్‌ అద్యతేమునిసత్తమ | అనుగ్రహార్థం సాధూనాం కింవాకార్యేణ కేనచ || 98 ||

నారద ఉవాచ -

ఆగతో7హం నృపశ్రేష్ఠ సకాశాచ్ఛమనస్యచ | వ్యాసేనోక్తాం బ్రహ్మణోగ్రే కథాం పౌరాణికీం శుభాం || 99 ||

ధర్మారణ్యాశ్రితాం దివ్యాం సర్వసంతాపహారిణీం | యంశ్రుత్వాసర్వపాపేభ్యో ముచ్యతే బ్రహ్మహత్యయా || 100 ||

హత్యాయుత ప్రశమనీం తాపత్రయ వినాశినీం | యాంవై శ్రుత్వాతి భక్త్యాచకఠినో మృదుతాం భ##జేత్‌ || 101 ||

ధర్మరాజేనతాం శ్రుత్వామయాగ్రేచ నివేదితాం | తమపృచ్ఛదమే యాత్మాకథాం ధర్మవినోదినీం || 102 ||

యుధిష్ఠిర ఉవాచ -

ధర్మారణ్యాశ్రితాం పుణ్యాం కథాం మేద్విజనత్తమ | కథయ స్వ ప్రసాదేన లోకానాంహిత కామ్యయా || 103 ||

నారద ఉవాచ -

స్నాన కాలోయమస్మాకం న కథా వసరోమమ | పరంతు శ్రూయతాం రాజన్‌ ఉపదేశం దదామ్యహం || 104 ||

మాసానాముత్తమోమాఘః స్నానదానాదికేతథా | తస్మిన్మాఘేచయః స్నాతిసర్వపాపైఃప్రముచ్యతే || 105 ||

స్నానార్థంయాహి శీఘ్రంత్వంగంగాయాంనృపతే7ధునా | వ్యాసస్యాగమనం చాద్య భవిష్యతి నృపోత్తమ || 106 ||

తం పృచ్ఛస్వమహాభాగశ్రావయిష్యతితే శుభం | తీర్థానాం చైవసర్వేషాం ఫలం పుణ్యంయదద్భుతం || 107 ||

భూతం భవ్యం భవిష్యంచ ఉత్తమాధమ మధ్యమాః | వాచయిష్యతితత్సర్వం వితిహాస సముద్భవం || 108 ||

ధర్మారణ్య స్య సకలం వృత్తం యద్యత్‌ పురాతనం | వ్యాసః సత్యవతీ పుత్రోవ దిష్యతి చతే7ఖిలం || 109 ||

తా || అప్పుడు వినయంతోఅవనతుడైఆప్రేమతో నమస్కరించాడు. శాస్త్రప్రకారము ఆతనికి ఆతనికి తగిన ఆసనమును ఇచ్చాడు (88) ఆవును, మధుపర్కమును, అర్ఘ్యమును ఇచ్చాడు. రత్నములతో అన్నికోరికలర్పిస్తూ ధర్మమెరిగిన ఆతడు పూజించాడు (89) యథాధిగా పూజను పొంది ఆ ధర్మ విదుడు సంతోషించాడు. ఓ మహాభాగ! నీవు క్షేమమా. నీ తపస్సు కుశలమే కదా (90) దుష్టుడైన రాక్షసుడెవడైనా స్వర్గభూపతిని బాధించటములేదుకదా. ఓముని! నీవు కల్యాణరూపుడవు. నీవు సురలు, అసురులతో నమస్కరించబడే వాడివి. అంతట వెళ్ళగలవాడివి అన్ని ఎరిగిన వాడివి. ఓ బ్రహ్మపుత్ర! కృపానిధి (91) నారదుని వచనము - అన్ని విధముల నాకీవేళ కుశలమే. బ్రహ్మయొక్క అనుగ్రహం వలన ఎల్లప్పుడు కుశలమే. ఓ మహాభాగ! ధర్మపుత్ర! యుధిష్ఠిర! నీవు కుశలమేకదా (92) ఓ రాజేంద్ర! తమ్ములతో కూడినీ మనస్సు ధర్మకార్యములందు రమిస్తోంది కదా. భార్యలతో,పుత్రులతో, భృత్యులతో, గజములు, గుఱ్ఱములు వీటన్నిటితో క్షేమంగా సుఖిస్తూ ఉన్నావు కదా (93) ఓ ధర్మజ! ఔరసులైన పుత్రులను వలె ప్రజలను ధర్మంతో పాలిస్తున్నావా. ఇందులో ఆశ్చర్యమేముంది, ఆ ప్రజలు నీ పాలనతో ధన్యులు (94) పాలన, పోషణ ఇదియే రాజుల ధర్మము, నిశ్చయము, ఆయా ధర్మముల భోక్తవు నీవే అని ఈ విధముగా మనువు చెప్పాడు (95) యుధిష్ఠరుని వచనము - మీపాద స్పర్శతో నారాష్ట్రము క్షేమము. ఓ మహాభాగ! నీ దర్శనంతో నేను పాపములన్ని పోయినవాడనైనాను (96) నేను ధన్యుణ్ణి, కృతకృత్యుణ్ణి. ఈభూమియందు నేను భాగ్యవంతుణ్ణి. నేనీనాటికి సుకృతినై నాను. నీ వంటి బ్రహ్మపుత్రులు నా ఇంటికిరావటం వలన (97) ఓముని సత్తమ! ఓ బ్రహ్మ ! ఈ వేళ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు. సాధువులను అనుగ్రమించుటకొరకే వస్తారు. మీకు ఏ పనితో మాత్రం ఏం ప్రయోజనం (అవసరంలేదు) (98) నారదుని వచనము - ఓ నృపశ్రేష్ఠ ! నేను శమనుని దగ్గర నుండి వచ్చాను. బ్రహ్మ ఎదురుగా వ్యాసుడు చెప్పిన పౌరాణికమైన శుభ##మైన కథను (99) ధర్మారణ్యమునకు చెందిన దివ్యమైన, సర్వసంతాపములతొలగించే కథను ఏకథవింటే పాపములన్నింటినుండి, బ్రహ్మహత్యనుండి ముక్తులౌతారో ఆ కథను (100) పదివేల హత్యలను శమింపచేసే, తాపత్రయముల నశింపచేసే కథను, ఏకథను అతిభక్తితో వింటే కఠినుడు మృదువుగా మారుతాడో ఆ కథను (101) ధర్మరాజు నా ఎదురుగా చెప్పిన ఆ కథను విని వచ్చాను అనగా ఆతనిని అమేయమైన ఆత్మకలయుధిష్ఠరుడు ఆ ధర్మముచే ఆనందం కల్గించే కథను అడిగాడు (102) యుధిష్ఠురుని వచనము - ఓ ద్విజసత్తమ ! ధర్మారణ్యాశ్రితమైన పుణ్యకథను నాకు అనుగ్రహంతో లోకముల హితమును కాంక్షిస్తూ చెప్పండి అని అనగా (103) నారదుని వచనము - ఇది మాకు స్నాన కాలము నాకు కథలు చెప్పే సమయముకాదు. ఐనా ఓ రాజ! వినండి. నేను ఉపదేశాన్నిస్తున్నాను (104) మాసములలో మాఘమాసము ఉత్తమము స్నానదానాదికములందు శ్రేష్ఠము. ఆ మాఘమాసంలోస్నానం చేసిన వాడు సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు. (105) ఓరాజా! నీవు ఇప్పడుఉ గంగలో స్నానం చేయటానికి త్వరగా వెళ్ళు. ఓ నృపోత్తమ ! ఈ రోజు వ్యాసుడొస్తాడు (106) ఓ మహాభాగ! ఆతనిని, నీవు అడుగు, నీకు శుభ##మైన దానిని వినిపిస్తాడు.సర్వతీర్థముల ఫలమును, అద్భుతమైన పుణ్యమును (107) వాని గతము, వర్తమానము, భవిష్యత్తు వానిలో ఉత్తమ, అధమ మధ్యమములు అదంతా ఇతి హాసములలో ఉన్న దానిని చెబుతాడు (108) ధర్మారణ్యము యొక్క పురాతనమైన సకల వృత్తాంతమును సత్యవతీ పుత్రుడైన వ్యాసుడు నీకు అంతా చెబుతాడు (109).

మూ || సూత ఉవాచ -

ఏవముక్త్వా విధేః పుత్రః తత్రై వాంతర ధీయత | తస్మిన్గతే ననృపతిః క్రీడతే సచివైః సహ || 110 ||

ఏతస్మిన్నంతరే తత్రప్రాప్తః సత్యవతీసుతః | విజ్ఞావయామాన తదా విదురః పాండవస్యహి || 111 ||

శ్రీ సూత ఉవాచ -

ఆగతంతుమునిం శ్రుత్వా సర్వేహర్ష సమాకులాః సముత్తస్థుర్హిభీమాద్యాః సహధర్మేణ సర్వశః || 112 ||

తదాహినన్ముఖోభూత్వా ముముదే నతకం ధరః | దండవత్తం ప్రణమ్యాథ భ్రాతృభిః సహితస్తదా || 113 ||

మధుపర్కేణ విధినా పూజాం కృత్వా సుశోభనాం | సింహాసనే సమావేశ్యవ ప్రచ్ఛానామయం తదా || 114 ||

తతః పుణ్యాం కథాం దివ్యాం శ్రావయా మా సధర్మవిత్‌ | కథాం తేముని శార్దూలంవచనంచేదమబ్రవీత్‌ || 115 ||

యుదిష్ఠిర ఉవాచ -

త్వత్ప్రసాదాన్మయా బ్రహ్మన్‌ శ్రుతాస్తు ప్రవరాః కథాః | ఆ పద్ధర్మారాజ ధర్మా మోక్షధర్మాహ్యనేకశః || 116 ||

పురాణానాంచ ధర్మాశ్చ వ్రతాని బహుశస్తథా | తీర్థాన్యనేక రూపాణి సర్వాణ్యాయతనానిచ || 117 ||

ఇదానీం శ్రోతుమిచ్ఛామి ధర్మారణ్య కథాం శుభాం | శ్రుత్వాయాంహి వినశ్యేత పాపం బ్రహ్మవధాదికం || 118 ||

ధర్మారణ్యస్థ తీర్థానాం శ్రోతుమిచ్ఛామితత్వతః | కస్యేదం స్థాపితం స్థానం కస్మాదేతద్వినిర్మితం || 119 ||

రక్షితంపాలితంకేనకస్మిన్‌కాలే7థనిర్మితం | కింకింత్వత్రాభవత్‌ పూర్వంశంశైతత్‌ వృచ్ఛతోమమ || 120 ||

భూతంభవ్యంభవిష్యచ్చతస్మిన్‌ స్థానేచయద్భవేత్‌ | తత్సర్యం కథయస్వాద్య తీరథానాంచ యథాస్థితిః || 121 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే యుధిష్ఠిర ప్రశ్న వర్ణనం నామ ప్రథమో7ధ్యాయః || 1 ||

తా || సూతుని వచనము - ఈ విధముగా బ్రహ్మ కొడుకైన నారదుడు పలికి అక్కడే అంతర్థానమైనాడు. ఆతడు వెళ్ళాక ఆ రాజు మంత్రులతో కూడి క్రీడించసాగాడు (110) ఇంతలో సత్యవతీ పుత్రుడు అక్కడికి వచ్చాడు. అని విదురుడు ధర్మరాజుకు తెలియజేశాడు (111) సూతుని వచనము - ముని వచ్చాడని విని అందరు ఆనందంతో నిండి పోయారు. ధర్మరాజుతో కూడి అందరు భీమాదులు లేచారు (112) పిదప ఎదురేగి, తలవంచి ఆనందించాడు. దండము వలె ఆతనికి నమస్కరించి అప్పుడు తమ్ములతో కూడి (113) మధుపర్క విథితో సుశోభ##మైన పూజను చేసి, సింహాసన మందు కూర్చోబెట్టి అప్పుడు యోగ క్షేమములు విచారించాడు (114) ధర్మమెరిగిన వాడుపుణ్యమైన దివ్యమైన కథను వినిపించాడు. కథ చివర మునిసింహముతో ఇట్లా అన్నాడు (115) యుధిష్ఠిరుని వచనము - ఓ బ్రహ్మన్‌! నీ దయవలన నేను శ్రేష్ఠమైన కధలను విన్నాను. ఆ పద్ధర్మములు, రాజ ధర్మములు మోక్ష ధర్మములు అనేకంగా విన్నాను (116) పురాణ ధర్మములు అనేక వ్రతములు విన్నాను అనేకరూపములైన తీర్థములగూర్చి, అన్ని దేవాలయములగూర్చి విన్నాను. (117) ఇప్పుడు శుభ##మైన ధర్మారణ్య కథను వినదలిచాను. దానిని వింటె బ్రహ్మవధాది పాపము నశిస్తుంది. (118) ధర్మారణ్య మందున్న తీర్థముల గూర్చి ఉన్నదున్నట్లుగా వినదలిచాను. ఇది ఎవరు నిర్మించిన స్థానము. దీనిని ఎందు కొరకు నిర్మించారు (119) దీనినెవరు రక్షించారు. పాలించారు. ఏ కాలంలో ఇది నిర్మింపబడింది. ఇంతకు ముందు ఇక్కడ ఏమేమి జరిగింది. అడుగుతున్న నాకు దీనిని చెప్పండి (120) గతంలో వర్తమానంలో భవిష్యత్తులో ఆ స్థానంలో ఏం జరుగుతుందో అదంతా ఈ రోజు చెప్పండి. తీర్థముల గూర్చి ఉన్నదున్నట్లుగా చెప్పండి (121) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు యుధిష్ఠిర ప్రశ్న వర్ణనమనునది ప్రథమో7ధ్యాయము || 1 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters