Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఏబది ఒకటవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

అథాతః సంప్రవక్ష్యామి సేతుయాత్రా క్రమం ద్విజాః | యంశ్రుత్వాసర్వపాపేభ్యోముచ్యతే మానవఃక్షణాత్‌ || 1 ||

స్నాత్వాచమ్య విశుద్ధాత్మాకృతనిత్యవిధిః సుధీః | రామనాథస్యతుష్ట్యర్థం ప్రీత్యర్థం రాఘవస్యచ || 2 ||

భోజయిత్వాయథాశక్తి బ్రాహ్మణాన్వేదపారగాన్‌ | భస్మోద్ధూలిత సర్వాంగః త్రిపుండ్రాంకి తమస్తకః || 3 ||

గోపిచందన లిప్తోవా స్వఫాలేప్యూర్థ్వపుండ్రకః | రుద్రాక్షమాలా భరణః సపవిత్రకరః శుచిః || 4 ||

సేతుయాత్రాం కరిష్యేహ మితి సంకల్ప్యభక్తితః | స్వగృహాత్‌ ప్రప్రజేన్మౌనీ జపన్నష్టాక్షరం మనుం || 5 ||

పంచాక్షరం నామమంత్రం జపేన్నియతమానసః | ఏకవారం హవిష్యాశీజితక్రోధోజితేంద్రియః || 6 ||

పాదుకాఛత్రరహితఃతాంబూలపరివర్జితః | తైలాభ్యాంగ విహీనశ్చ స్త్రీ సంగాది వివర్జితః || 7 ||

శౌచాద్యాచార సంయుక్తః సంధ్యోపాస్తి వరాయణః | గాయత్ర్యుపాస్తిం కుర్యాణః త్రిసంధ్యం రామచింతకః || 8 ||

మధ్యేమార్గం పఠన్నిత్యం సేతుమాహాత్మ్య మాదరాత్‌ | పఠన్‌ రామాయణం వాపి పురాణాంతరమేవవా || 9 ||

వ్యర్థవాక్యాని సంత్యజ్య సేతుంగచ్ఛేద్విశుద్ధయే | ప్రతిగ్రహంస గృహ్ణీయాత్‌ నాచారాంశ్చ పరిత్యజేత్‌ || 10 ||

కుర్యాన్మార్గే యథాశక్తి శివవిష్ణ్వాది పూజనం | వైశ్వదేవాది కర్మాణి యథాశక్తి సమాచరేత్‌ || 11 ||

బ్రహ్మయజ్ఞముఖాన్ధర్మాన్‌ ప్రకుర్యాచ్చాగ్ని పూజనం | అతిథిభ్యోన్న పానాది సంప్రదద్యాద్యథా బలం || 12 ||

దద్యాద్భిక్షాంయతిభ్యోపి విత్తశాఠ్యం పరిత్యజన్‌ | శివవిష్ణ్వాదినా మానిస్తోత్రాణిచ పఠేత్పథి || 13 ||

ధర్మమేవ సదాకుర్యాన్నిషిద్ధాని పరిత్యజేత్‌ | ఇత్యాది నియమోపేతః సేతుమూలంతతో ప్రజేత్‌ || 14 ||

తా || శ్రీ సూతుల వచనము - ఓ ద్విజులార ! ఇక ఇప్పుడు ఇక్కడి నుండి సేతుయాత్రా క్రమమును వివరిస్తాను. ఈ విషయమును వినిన మానవుడు క్షణంలో అన్ని పాపముల నుండి ముక్తుడౌతాడు (1) స్నానం చేసి ఆచమించి విశుద్ధాత్ముడై బుద్ధిమంతుడు నిత్యవిధి కూడా చేసి రామనాథుని సంతుష్టికొరకు, రాఘవుని ప్రీతికొరకు (2) వేదపారగులైన బ్రాహ్మణులను శక్తి కొలది భుజింపజేసి, అన్ని అంగములందు భస్మము ధరించి, తలపై త్రిపుండ్రములు ధరించి (3) తన ఫాలభాగమందు గోపిచందనము ధరించియైనా, ఊర్థ్వపుండ్రము ధరించియైనా, రుద్రాక్షమాల ఆభరణముగా కలిగి చేత పవిత్ర(నీరు) ధరించి, శుచియై (4) నేను సేతు యాత్రను చేస్తాను. అని భక్తితో సంకల్పించి మౌనియై అష్టాక్షర మంత్రమును జపిస్తూ తన ఇంటి నుండి బయలుదేరాలి (5) పంచాక్షర నామ (పేరుగల) మంత్రాన్ని నిమమితమైన మనస్సుతో జపించాలి. రోజు కొకసారి హవిష్యమును (హోమాన్నము) భుజిస్తూ క్రోథమును జయించి, ఇంద్రియముల జయించి (6) చెప్పులు గొడుగులేకుండా, తాంబూలమును వదలి, తైలాభ్యంగము వదలి స్త్రీ సంగమము మొదలగునవి వదలి (7) శుచిత్వము మొదలగు ఆచారములతో కూడి, సంధ్యోపాసన పరాయణుడై, మూడు సంధ్యలలో గాయత్య్రుపాసన చేస్తూ, రాముని చింతిస్తూ (8) మార్గమధ్యంలో ఆదరంతో రోజు సేతుమాహాత్మ్యాన్ని పఠిస్తూ లేదా రామాయణాన్ని పఠిస్తూ లేదా ఏ ఇతర పురాణమైన పఠిస్తూ (9) వ్యర్థవాక్యములను వదిలి విశుద్ధి కొరకు సేతువునకు వెళ్ళాలి. దానమును స్వీకరించరాదు. ఆచారములను వదలరాదు (10) మార్గంలో శక్తి కొలది శివుడు,విష్ణువు మొదలగువారి పూజ చేయాలి. శక్తి కొలది వైశ్‌వదేవము మొదలగు కర్మలను ఆచరించాలి. (11) బ్రహ్మయజ్ఞము మొదలగుగా గల ధర్మములను, అగ్ని పూజనము చేయాలి. శక్తి కొలది అతిథులకు అన్నపానాదులు ఇవ్వాలి (12) ధనలోభమును వదలి యతులకు గూడా భిక్షనివ్వాలి. శివవిష్ణ్వాది నామములను స్తోత్రములను మార్గంలో చదువాలి (13) ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించాలి. నిషిద్ధమైన వాటిని వదిలి పెట్టాలి. మొదలుగా గల నియమములు గలవాడై ఆపిదప సేతుమూలమునకు వెళ్ళాలి (14).

మూ || పాషాణంప్రథమందద్యాత్‌తత్రగత్వసమాహితః | తత్రా వాహ్యసముద్రంచవ్రణమేత్తదనంతరం || 15 ||

అర్ఘ్యం దద్యాత్సముద్రాయ ప్రార్ధయేత్తదనంతరం | అనుజ్ఞాంచ తతః కుర్యాత్‌ తతః స్నాయాన్మహోదధౌ || 16 ||

మునీనామథదేవానాం కపీనాం పితృణాం తథా | ప్రకుర్యాత్తర్పణం విప్రా మనసా సంస్మరన్‌ హరిం || 17 ||

పాషాణ సంఖ్యా -

పాషాణ సప్తకం దద్యాదేకం వా విప్రపుంగవాః పాషాణ దానాత్సఫలం స్నానం భవతినాన్యథా || 18 ||

పాషాణదాన మంత్రః -

పిప్పలాద సముత్పన్నే కృత్యేలోక భయంకరే | పాషాణంతే మయాదత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం || 19 ||

సాన్నిధ్యప్రార్ధనామంత్రః -

విశ్వాచిత్వం ఘృతాచిత్వం విశ్వయానే విశాంపతే | సాన్నిధ్యం కురుమేదేవ సాగరేలవణాం భసి || 20 ||

నమస్కారమంత్రః -

నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణోహ్యపాంపతే | నమో హిరణ్యశృంగాయ నదీనాంపతయే నమః

సముద్రాయ వయూనాయ ప్రోచ్చార్య ప్రణమేత్తథా || 21 ||

అర్ఘ్యమంత్రః -

సర్వరత్నమయ శ్రీమాన్‌ సర్వరత్నాకరాకర | సర్వరత్న ప్రధానస్త్వం గృహాణార్ఘ్యం మహోదధే || 22 ||

అనుజ్ఞాపన మంత్రః -

అశేష జగదాధార శంఖ చక్రగదాధర | దేహిదేవ మమానుజ్ఞాం యుష్మత్తీర్థనిషేవణ || 23||

ప్రార్థనామంత్రః -

ప్రాచ్యాందిశిచ సుగ్రీవం దక్షిణ స్యాంనలంస్మరేత్‌ || 24 ||

ప్రతీచ్యాం మైందనామానం ఉదీచ్యాంద్వివిదంతథా | రామంచలక్ష్మణం చైవ సీతామపియశస్వినీం || 25 ||

అంగదం వాయుతనయం స్మరేన్మధ్యే విభీషణం | పృథివ్యాంయాని తీర్థాని ప్రావిశం స్త్వామహోదధే || 26 ||

స్నానస్య మేఫలందేహి సర్వస్మాత్‌ త్రాహిమాంహసః | హిరణ్యశృంగమిత్యాభ్యాంనాభ్యాంనారాయణం స్మరేత్‌ || 27 ||

ధ్యాయన్నారాయణం దేవం స్నానాదిషుకర్మను | బ్రహ్మలోకమవాప్నోతి జాతయేనేహవైపునః || 28 ||

సర్వేషామపిపాపానాం ప్రాయశ్చిత్తం భ##వేత్తతః

ప్రహ్లాదం నారదం వ్యాసమంబరీషం శుకం తథా | అన్యాంశ్చ భగవద్భక్తాన్‌ చితంయే దేకమానసః || 29 ||

స్నానమంత్రః-

వేదాది ర్యోవేద వసిష్ఠయోనిః | సరిత్పతిః సాగరరత్న యోనిః

అగ్నిశ్చతేజశ్చ ఇలాచతేజో | రేతోధా విష్ణురమృతస్యనాభిః || 30 ||

ఇదంతే అన్యాభి రసమానమద్భిః | యాః కాశ్చ సింధుం ప్రవిశంత్యాపః

సర్పోజీర్ణా మివత్వచం జిహామి | పాపంశరీరాత్‌ సశిరస్కోభ్యుపేత్య || 31 ||

తా || అక్కడికి వెళ్ళి శ్రద్ధగా మొదట రాయిని వేయాలి. పిదప అక్కడ సముద్రుని అవాహన చేసి నమస్కరించాలి ( 15 ) పిదప సముద్రునకు అర్ఘ్యమియ్యాలి. ఆ పిదప ప్రార్థించాలి. పిదప అనుజ్ఞను వేడి, అనుజ్ఞ పొంది ఆ పిదప సముద్రమందు స్నానం చేయాలి (16) మనస్సులో హరిని స్మరిస్తూ మునులకు, దేవతలకు, వానరలకు, పితరలకు తర్పణమాచరించాలి, ఓ విప్రులార | ( 17 ) పాషాణముల సంఖ్య - ఓ విప్రశేష్టులార | ఏడురాళ్ళను ఇవ్వాలి సముద్రమునకు, లేదా ఒకరాయినైనా ఇవ్వాలి. పాషాణం ఇస్తేనే స్నానం సఫలమౌవుతుంది. లేకపోతే కాదు (18 ) పాషాణ దాన మంత్రము - పిప్పలాదుని నుండి పుట్టిన దాన | ఓకృత్య, లోకభయంకరి, నీకు నేను పాషాణాన్ని ఇచ్చాను. దానిని ఆహారముగా వినియోగించు ( 19 ) సన్నిధిలో ఉండమని ప్రార్థించే మంత్రము- నీవు విశ్వాచివి, నీవు ఘృతాచివి, విశ్వమునకు యానమువు ( వాహనము) విశాంపతిని ( రాజు) ఓ దేవ | నీవు ఈ ఉప్పు నీరు గల సముద్ర మందు నాకు సన్నిధిలో ఉండు ( విశ్వాచి - విశ్వవ్యాప్తి, ఘృతాచి - అంతట నీరు గలది ( 20 ) సమస్కారమంత్రము విశ్వరక్షక | నీకు నమస్కారము. ఓ అపాంపతి| విష్ణు! నీకు నమస్కారము హిరన్య శృంగుడవు, నదులకు నమస్కారము, ఓ సముద్రుడ! ఓ జ్ఞాన స్వరూపుడ నీకు నమస్కారము అని పలికి నమస్కరించాలి. ( 21 ) అర్ఘ్య మంత్రము - సర్వరత్నమయుడ, శుభప్రదమైన సముద్రములన్నింటికి స్థానమైవాడ, నీవు సర్వరత్నములకు ప్రధానమువు. ఓమహోదధి ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు ( 22) అనుజ్ఞాపన మంత్రము- అశేశ జగత్తునకు అధారమైనవాడ, శంఖచక్రగదలను ధరించినవాడ, ఓ దేవ ! నీ తీర్థమును సేవించే కొరకు నాకు అనుజ్ఞనివ్వు ( 23) ప్రార్థనామంత్రము - తూర్పుదిక్కున సుగ్రీవుని దక్షిణపు దిక్కున నలుని స్మరించాలి. ( 24) పడమర దిక్కున మైందుడను పేరుగల వానిని ఉత్తరమువైపున ద్వివిదుడును వానిని స్మరించాలి. రాముని, లక్ష్మణుని, యశస్వినియైన సీతను కూడ స్మరించాలి ( 25 ) అంగదుని, హనుమంతుని మధ్యలో విభీషణుని స్మరించాలి. పృథివి యందు ఎన్ని తీర్థములు న్నాయో, ఓ మహోదధి ! నీలో ప్రవేశిస్తున్నాయో ( 26 ) అన్నిటి స్నానఫలములను నాకివ్వు. పాపములన్నింటి నుండి నన్ను రక్షించు '' హిరణ్య శృంగం '' ఇవి మొదలుగా గల ప్రధానమైన వానితో నారాయణుని స్మరించాలి ( 27 ) స్నానాది కర్మలలో కూడ దేవుడైన నారాయుణుని ధ్యానించిన బ్రహ్మలోకమును చేరుకుంటాడు. ఇక్కడ తిరిగి జన్మించడు ( 28 ) పాపములన్నింటికి ప్రాయశ్చిత్తమౌతుంది. పిదప ప్రహ్లాదుని, నారదుని, వ్యాసుని, అంబరీషుని, శుకుని, అట్లాగే ఇతరులైన భగవద్భక్తులను నిశ్చలమైన మనస్సుతో ధ్యానించాలి ( 29 ) స్నానమంత్రము - వేదములకు ఆది, వేద పసిష్టులకు స్థానము, సరిత్పతి, సాగరరత్నములకు పుట్టిల్లు, అగ్ని, తేజస్సు, భూమి ఇవన్ని తేజస్సు ( శక్తి ) గా గలవాడ రేతమునకు పొదుగులాంటి వాడ, విష్ణు, అమృతమునకు ప్రధానమైన వాడ ( 30 ) సముద్రంలో ప్రవేశిస్తున్న నీరు ఆ ఇతరమైన నీటితో సమానముకానిది అట్టినీకు ఈ ( స్నానము). నాశీరరంతో ఇక్కడికి వచ్చి సర్పము జీర్ణమైన చర్మమును ( కుబుసం) వదిలినట్లు నా శరీరమునుండి పాపములను వదలుతున్నాను ( 31)

మూ || సముద్రాయవయూనాయనమస్కుర్యాత్సునర్ధ్విజాః | సర్వతీర్థమయంశుద్ధంనదీనాంపతిమంబుధిం || 32 ||

ద్వౌసముద్రావితిపునః ప్రోచ్చార్యస్నానమాచరేత్‌ | బ్రహ్మాండో దరతీర్థాని కరస్పృష్టా నితేరవే || 33 ||

తేనసత్యేన మేసేతౌ తీర్థం దేహిదివాకర | ప్రాచ్యాం దిశిచ సుగ్రీవం ఇత్యాది క్రమయోగతః || 34 ||

స్మృత్వాభూయోద్విజాః సేతౌ తృతీయం స్నానమాచరేత్‌ దేవీవత్తనమారభ్యప్రప్రజేద్య దిమానవః || 35 ||

తదాతునవపాషాణమధ్యే సేతౌ విముక్తిదే | స్నానమంబునిధౌ కుర్యాత్‌ స్వపాపౌఘాపనుత్తయే || 36 ||

దర్భశయ్యాపదవ్యాచేత్‌ గచ్ఛేత్‌ సేతుం విముక్తిదం | తదాతత్రోదధావేవ స్నానం కుర్యాద్విముక్తయే || 37 ||

పిప్పలాదం కవిం కణ్వం కృతాంతాం జీవితేశ్వరం| మన్యుంచ కాలరాత్రించ విద్యాంచాహర్గణశ్వరం || 38 ||

పసిష్ఠం వామదేవంచ పరాశరముమావతిం | వాల్మీకిం నారదం చైవ వాలభిల్యాన్మునీం స్తథా || 39 ||

సలంనీలం గావాక్షంచ గవయం గంధమాదనం | మైందంచ ద్వివిదం చైవశరభం చర్షభంతాథా || 40 ||

సుగ్రీవం చ హనూమంతం వేగదర్శన మేవచ | రామంచ లక్ష్మణం సీతాం మహాభాగాం యశస్వినీం || 41 ||

త్రిః కృత్వాతర్పయేదేతాన్‌ మంత్రానుక్త్వాయథాక్రమం | విభోశ్చతత్తన్నామాని చతుర్ధ్యం తానివైద్విజాః || 42 ||

దేవానృషీన్పితౄంశ్చైవ విధిపచ్చతిలోదకైః | ద్వితీయాంతాని నామాని చోక్త్వావాతర్పయేద్ద్విజాః || 43 ||

తర్పయేత్సవవిత్రస్తు జలేస్థిత్వా ప్రసన్నదీః | తర్పణాత్సర్వతీర్థేషు స్నానస్య ఫలమాప్నుయాత్‌ ||| 44 ||

ఏవమేతాస్తర్చయిత్వా నమస్కృత్యోత్తరేజ్జలాత్‌ | ఆర్ధ్రవస్త్రం పరిత్యజ్య శుష్కవానః సమావృతః || 45 ||

ఆచమ్యసపవిత్రశ్చ విధివచ్ఛ్రాద్ధమాచరేత్‌ | పిండాన్పితృభ్యోదద్యాచ్చతిల తండులకైస్తథా || 46 ||

ఏతత్‌ శ్రాద్ధమశక్తస్య మయాప్రోక్తం ద్విజోత్తమాః | ధనాఢ్యో న్నేనవైశ్రాద్ధం షడ్రసేన సమాచరేత్‌ || 47 ||

తా || జ్ఞానమూర్తియైన సముద్రునకు నమస్కారము చేయాలి. మరల సర్వతీర్థమయుడు, శుద్ధుడు, నదులకు పతియైన అంబుధిని నమస్కరించాలి. ( 32) ద్వౌసముద్రౌ ( రెండు సముద్రములు ) అని మరల ఉచ్చరించి స్నానమాచరించాలి. ఓ రవి! బ్రహ్మండము మధ్యయందున్న తీర్థములన్ని నీకరములతో స్పృశింపబడ్డాయి. (33) ఆజలముతో నాకు సేతువు యందు తీర్థమివ్వు, ఓదివాకర! తూర్పుదిక్కున సుగ్రీవుని అని మొదలుగా గల క్రమప్రకారము (34) మరల స్మరించి సేతువు యందు తృతీయ స్నానము చేయాలి. దేవీ పత్తనం నుండి మానవుడు ప్రయాణమారంభించి ముందుకు వెళ్ళేట్టైతే (35) అప్పుడు సేతువు యందు ముక్తినిచ్చే నవపాషాణ మధ్య మందు సముద్రమందు తనపాపముల సమూహనివృత్తి కొరకు స్నానమాచరించాలి (36) '' దర్భశయ్య'' మార్గంలో ఉంటేముక్తినిచ్చే ఆసేతువునకు వెళ్ళాలి. అప్పుడు విముక్తికొరకు అక్కడి సముద్ర ముందేస్నానమాచారించాలి. (37) ఇకతర్పణవిధి - పిప్పలాదుడు. శుక్రుడు, కణ్వుడు, జీవితేశ్వరుడైనయముడు, మన్యువు, కాలరాత్రి, విద్య, సూర్యుడు, ( 38 ) వసిష్ఠుడు, వామదేవుడు, పరాశరుడు, ఉమావతి, వాల్మీకి, నారదుడు, వాలఖిల్య మునులు (39) అట్లాగేనలుడు, నీలుడు, గవాక్షుడు, గవయుడు, గంధమాదనుడు మైందుడు, ద్వివిదుడు, శరభుడు ఋషభుడు అట్లాగే (40) సుగ్రీవుడు, హనుమంతుడు వేగదర్శనుడు, రాముడు, లక్ష్మణుడు, మహాభాగ యశస్వినియైన సీతవీళ్ళందరిని (41) స్మరించి, మంత్రములనుచెప్పి వరుసగావీరందరికి మూడేసి మార్లుతర్పణంవదలాలి. ఓ ద్విజులారా! చతుర్ధివిభక్యంతములుగా విభువుయొక్క, ఆయాఇతరుల యొక్కపేర్లు చెప్పితర్పణంవదలాలి. ( రామాయ, సుగ్రీవాయాఇట్లా) (42) దేవతలను, ఋషులను, పితరులనుశాస్త్ర ప్రకారమునువ్వులు నీళ్ళతోతర్పణంచేసితృప్తిపరచాలి. ఓద్విజులారా! చతుర్ధివిభక్తికాకపోతే ద్వితీయావిభక్తిఅంతములుగానైనా పేర్లనుచెప్పి ( రామం, సుగ్రీవం అనిగాని ) తర్పణంవదలాలి (43) ప్రసన్నమైనబుద్దితో పవిత్రధరించినీటియందునిలిచితర్పణంవదలాలి. తర్పణమాచరించటం వలనసర్వతీర్థములందు స్నానమాచరించిన ఫలితాన్నిపొందుతాడు (44) ఈవిధముగావీరికి తర్పణంవదలి నమస్కరించి వీటి నుండిపైకిరావాలి. తడిసినవస్త్రాన్నివదిలిపొడి వస్త్రాన్నిధరించి ( 45) ఆచమించి, పవిత్రధరించి, శాస్త్రప్రకారముశ్రాద్ధమాచరించాలి. బియ్యము, నువ్వులతోకలిపి పిండములను పితరులకివ్వాలి. (46) ఓద్విజులారా! నేనుచెప్పిన ఈశ్రాద్ధము ఆశక్తులైనవారి కొరకు ధనవంతుడు, షడ్రసములతోకూడినఅన్నముతో శ్రాద్ధమాచరించాలి (47).

మూ || గోభూతిలహిరణ్యాదిదానం కుర్యాత్సమృద్ధిమాన్‌ | రామచంద్ర ధనుష్కోటా వేవమేవ సమాచరేత్‌ || 48 ||

పాషాణ దాన పూర్వాణి తర్పణాం తానివైద్విజాః | సేతుమూలేయథైతానివిధిపత్‌వ్యనోధ్ద్విజాః || 49 ||

చక్రతీర్ధంతతోగత్వాతత్రాపి స్నానమాచరేత్‌ | పశ్యేచ్చసేత్వధిపతిం దేవం నారాయణం హరిం || 50 ||

గచ్ఛన్‌ పశ్చిమమార్గేన తత్రత్యే చక్రతీర్ధకే | స్నాత్వాదర్భశయం దేవం ప్రవశ్యేద్భక్తి పూర్వకం || 51 ||

కపితీర్థంతతః ప్రాప్యతత్రాపిస్నానమాచరేత్‌ | సీతాకుండం తతః ప్రాప్యతత్రాపిస్నానమాచరేత్‌ || 52 ||

ఋణమోచన తీర్ధంతు తతఃప్రాప్య మహాఫలం | స్నాత్వా ప్రణమ్య రామంచ జానకీరమణం ప్రభుం || 53 ||

గచ్ఛేల్లక్ష్మణ తీర్థంతు కంఠాదుపరివాపనం | కృత్వాస్నాయాచ్చతత్రాపి దుష్కృతాన్యపి చింతయన్‌ || 54 ||

తతః స్నాత్వారామతీర్ధే తతో దేవాలయం ప్రజేత్‌ | స్నాత్వా పాపవినాశే (శ##నే) చ గంగాయమున యోస్తథా || 55 ||

సావిత్ర్యాంచసరస్వత్యాంగాయత్ర్యాంచ ద్విజోత్తమాః | స్నాత్వాచహనుమత్కుండేతతః స్నాయాన్మహాఫలే

బ్రహ్మకుండం తతః ప్రాప్యస్నాయాద్విధిపురః సరం || 56 ||

నాగకుండం తతః ప్రాప్య సర్వపాపవినాశనం | స్నానం కుర్యాన్నరోవిప్రాః నరకక్లేశనాశనం గంగాద్యాః సరితః సర్వాః తీర్ధాని సకలాన్యపి

సర్వదానాగకుండే తువసంతి స్వాఘశాంతయే | అనంతాది మహానాగైః అష్టాభిరిదముత్తమం || 58 ||

కల్పితం ముక్తిదంతీర్ధం రామసేతౌ శివంకరం | అగస్త్య కుండం సంప్రాప్య తతః స్నాయాదనుత్తమం || 59 ||

అథాగ్ని తీర్ధమాసాద్య సర్వదుష్కర్మనాశనం | స్నాత్వా సంతర్ప్యవిధివత్‌ శ్రాద్ధం కుర్యాత్పితౄన్‌ స్మరన్‌ || 60 ||

గోభూహిరణ్యధానాది బ్రాహ్మణభ్యః స్వశక్తితః | దత్త్వాగ్ని తీర్ధతీరేతు సర్వపాపైః ప్రముచ్యతే || 61 ||

అథవాయాని తీర్థాని చక్రతీర్ధముఖానివై | అనుక్రాంతాని విప్రేంద్రాః సర్వపాప హరాణితు || 62 ||

స్నాయాత్తదనుపూర్వేణ స్నాయా ద్వాపియథారుచి | స్నాత్త్వైవం సర్వతీర్థేషు శ్రాద్ధాదీని సమాచరేతే ||63 ||

తా || సమృద్ధిగా ( ధనం) గలవాడు గో, భూ, తిల, హిరణ్యములు మొదలగు దానములు చేయాలి. రామచంద్ర ధనుష్కోటి యందు ఇట్లాగే ఆచరించాలి ( 48 ) పాషాణ దానము మొదలుగా తర్పణాంతము వరకు ఇట్లా సేతుమూలంలో వీనిని శాస్త్రప్రకారము ఆచరించినట్లు ఆచరించాలి (49) పిదప చక్రతీర్ధమునకు వెళ్ళి అక్కడ కూడ స్నానం చేయాలి. సేతువునకు అధిపతియైన, దేవుడు నారాయణుడు ఐన హరిని చూడాలి ( 50 ) పశ్చిమ మార్గంగా వెళ్తూ అక్కడున్న చక్రతీర్ధమందు స్నానం చేసి భక్తిపూర్వకముగా దర్భశయనుడైన దేవుని చూడాలి. (51) పిదప కపితీర్ధమునకు వెళ్ళి అక్కడ కూడ స్నానం చేయాలి. పిదప సీతాకుండమునకు వెళ్ళి అక్కడ కూడ స్నానం చేయాలి ( 52) పిదప మహా ఫలమునిచ్చే ఋణమోచన తీర్థమునకు వెళ్ళి స్నానం చేసి జానకీరమణుడైన రామప్రభువును నమస్కరించి ( 53) లక్ష్మణ తీర్థమునకు వెళ్ళాలి. కంఠంపై భాగంలో, అక్కడ క్షౌరం చేయించుకుని దుష్కృతములను కూడ చింతిస్తూ అక్కడ స్నానం చేయాలి ( 54 ) పిదప రామతీర్ధమందు స్నానం చేసి పిదప దేవాలయమునకు వెళ్ళాలి. పాపవినాశ ( మందు) కమైన గంగయమునలందు ( 55) సావిత్రి, సరస్వతి, గాయత్రులందు స్నానం చేసి మహాఫలవంతమైన హనుమత్కండమందు ఆ పిదప స్నానం చేయాలి. శాస్త్ర ప్రకారముగా పిదప బ్రహ్మకుండమునకు వెళ్ళి అక్కడ స్నానం చేయాలి (56) సర్వపాపనాశకమైన నాగకుండమునకు పిదప వెళ్ళి నరుడు స్నానం చేయాలి. ఓ విప్రులారా ! అది నరకక్లేశమును నశింపచేసేది. గంగాది అన్ని నదులు సర్వతీర్థములు కూడ (57) ఎల్లప్పుడు నాగకుండంలో ఉంటాయి. తమ,తమ పాపముల శాంతి కొరకు అనంతాది మహా నాగములెనిమిదింటితో ఇది ఉత్తమమైనది (58)గా కల్పించబడినది. ముక్తినిచ్చే తీర్థమిది. రామసేతువు యందు శివకరమైనది. పిదప ఆగస్త్య కుండమును చేరి ముఖ్యమైన స్నానం చేయాలి (59) సర్వదుష్కర్మలను నశింపచేసి అగ్ని తీర్ధమునకు ఆపిదప చేరి స్నానం చేసి, తర్పణము చేసి శాస్త్ర ప్రకారము శ్రాద్ధమాచరించాలి, పితృదేవతలను స్మరిస్తూ(60) గోభూహిరణ్యధాన్యాదులు బ్రాహ్మణులకు, తనశక్తి కొలది అగ్ని తీర్ధ తీరమందు ఇచ్చినవారు సర్వపాపముల నుండి ముక్తులౌతారు. (61) లేదా చక్రతీర్ధము మొదలుగా ఎన్ని తీర్ధములున్నాయో, దానిననుసరించి ఉన్న తీర్ధములన్ని, అన్నిపాపములను హరించేవి. (62) వానిలో వరుసక్రమంలో స్నానం చేయాలి. లేదా తమతమ ననుసరించి స్నానం చేయాలి. అన్నితీర్ధములందు స్నానం చేసి శ్రాద్ధాదులను ఆచరించాలి. (63)

మూ || పశ్చాద్రమేశ్వరం ప్రాప్యనిషేవ్యపరమేశ్వరం | సేతు మాధవమాగత్యతథా రామంచ లక్ష్మణం || 64 ||

సీతాం ప్రభంజన సుతం తథాన్యాన్కపిసత్తమాన్‌ | తత్రత్యసర్వతీర్ధేషు స్నాత్వానియమపూర్వకం || 65 ||

ప్రణమ్య రామనాథంచ రామచంద్రం తథాపరాన్‌ | సమస్కృత్య ధనుష్కోటిం తతః స్నాతుం ప్రజేన్నరః || 68 ||

తత్రపాషాణదానాది పూర్వోక్త నియమం చరేత్‌ | ధనుష్కోటౌ చ దానానిదద్యాత్తానుసారతః || 67 ||

క్షేత్రంగాశ్చతథాన్యాని వస్త్రాణ్యనాని చాదరాత్‌ | బ్రాహ్మణభ్యోవేద విద్భ్యో దద్యాద్విత్తానుసారతః || 68 ||

కోటితీర్ధంతతః ప్రాప్య స్నాయాన్నియమ పూర్వకం| తతోరామేశ్‌వరం దేవం ప్రణమే ద్వృషభధ్వజం || 69 ||

విభ##వేనతివిప్రేభ్యో దద్యాత్‌సౌవర్ణదక్షిణాం | తిలాన్‌ ధాన్యంచ గాంక్షేత్రం వస్త్రాణ్యన్యాని తండులాన్‌ || 70 ||

దద్యాద్విత్తానుసారేణ విత్తలోభవిర్జితః | ధూపం దీపం చనైవేద్యం పూజోపకరణానిచ || 71 ||

రామేశ్‌వరాయదేవాయ దద్యాద్విత్తానుసారితః | స్తుత్వారామేశ్వరం దేవం ప్రణమ్యచ సభక్తికం || 72 ||

అనుజ్ఞావ్యతతోగచ్ఛేత్‌ సేతుమాధవ సన్నిధిం | తసై#్మ దత్వాచ ధూపాదీన్‌ అనుజ్ఞాప్యచ మాధవం || 73 ||

పూర్వోక్త నియమోపేతః పునరాయాత్స్వకం గృహం | బ్రాహ్మణాన్భోజయేదన్నైః షడ్రసైః పరిపూరితైః || 74 ||

తేనైవరామనాథోసై#్మ ప్రీతోభీష్ఠంప్రయచ్ఛతి | నారకం చాస్యనాస్త్యేవ దారిద్ర్యంచ వినశ్యతి || 75 ||

సంతతిర్వర్థతేతన్య పురుషన్యద్విజోత్తమాః | సంసారమవధూయాశుసాయుజ్యమపియాన్యతి || 76 ||

అత్రాగంతుమశక్తశ్చేత్‌శ్రుతిస్మృత్యాగమేషుయత్‌ | గ్రంథజాతంమహాపుణ్యంసేతుమాహాత్మ్యసూచకం || 77 ||

తంగ్రంథంపాఠయేద్విప్రామహాపాతకనాశనం | ఇదంవాసేతుమాహత్మ్యంపఠేద్భక్తిపురఃనరం || 78 ||

సేతుస్నానఫలంపుణ్యంతేనాప్నోతినసంశయః | అంధపంగ్వాదివిషయమేతత్ర్పోక్తంమనీషిభిః || 79 ||

శ్రీసూత ఉవాచ-

ఏవంవఃకథితోవిస్రాఃసేతుయాత్రాక్రమోద్విజాః | ఏతత్‌పఠన్వాశృణ్వన్వాసర్వదుఃఖాద్విముచ్యతే || 80 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే యాత్రాక్ర మవర్ణనం నామఏకపంచాశత్తమోధ్యాయః || 51 ||

తా || ఆతరువాతరామేశ్వరమునకుచేరిపరమేశ్వరునిసేవించి, అట్లాగేసేతుమాధవమునకువచ్చిరాముని, లక్ష్మణుని (64) సీతను, హనుమందుని, అట్లాగేఇతరులైనకవులనుసేవించి, అక్కడ ఉన్న అన్ని తీర్థములలోశాస్త్రవిధిగాస్నానముచేసి (65) రామనాథునిరామచంద్రునిఅట్లాగేఇతరులను, నమస్కరించి, ఆపిదపనరుడుస్నానముచేయుటకైధనుష్కోటికివెళ్లాలి. (66) అక్కడపాషాణదానముమొదలగుముందుచెప్పిననియమములనుఆచరించాలి. తనకున్నఐశ్వర్యంననుసరించిధనుష్కోటియందుదానములివ్వాలి. (67) భూమి, గోవులు అట్లాగేఇతరములైనవస్త్రములుఇంకాఇతరమైనవిఆదరంతో, వేదవిదులైన బ్రాహ్మణులకుతనదగ్గరున్నధనాన్నిబట్టిదానంచేయాలి (68) పిదపకోటితీర్థమునకువెళ్ళినియమపూర్వకముగాఅక్కడ స్నానం చేయాలి. పిదపవృషభధ్వజుడైనరామేశ్వరదేవునినమస్కరించాలి. (69) ఐశ్వర్యంకనుకఉంటేబ్రాహ్మణులకునువర్ణదక్షిణను ఇవ్వాలి. నువ్వులు, ధాన్యము, గోవులు, భూమి, వస్త్రములు ఇతరమైనవిబియ్యముమొదలగునవితనకున్న (70) ధనాన్ననుసరించి ధనలోభంలేనివాడై దానంచేయాలి. ధూపము, దీపము, నైవేద్యము, పూజోపకరణములు (71) మొదలగునవి విత్తమునుసరించిరామేశ్వరదేవునకివ్వాలి. రామేశ్వరదేవునిస్తుతించిభక్తితోనమస్కరించి (72) ఆతనిఅనుజ్ఞపొందిపిదప సేతుమాధవునిసన్నిధికివెళ్ళాలి. అతనికిధూపాదులనుఇచ్చి, ఆమాధవునిఅనుజ్ఞపొంది (73) ముందుచెప్పిననియమములు కలిగితిరిగితీఇంటికిరావాలి. షడ్రసములతోనిండినఅన్నములతో బ్రాహ్మణులనుభుజింపచేయాలి. (74) దానితోరామ నాధుడుసంతుష్టడైఈతనికోరికలనునెరవేరుస్తాడు. ఈతనికినరకములేదు. దారిద్ర్యమునశిస్తుంది. (75) ఓబ్రాహ్మణులార! ఆపురుషునిసంతతిఅభివృద్ధిచెందుతుంది. ఆతడు సంసారమును తిరస్కరించి త్వరగా సాయుజ్యమునకు కూడా వెళ్తాడు (76) ఇక్కడికి రావటానికి శక్తుడు కాకపోతే శ్రుతిస్మృతి ఆ గమగ్రంథములలో ఉన్నదానిని, సేతుమాహాత్మ్య సూచకమైన పుణ్యప్రదమైన గ్రంధజాతమును (77) చదివింప చేయాలి. ఓ విప్రులార! అది మహాపాతక నాశకము ఈ సేతు మాహాత్మ్యాన్నైనా భక్తి పూర్వకముగా చదవాలి (78) దానితో సేతుస్నాన ఫలపుణ్యమును పొందుతాడు, అనుమానము లేదు. ఇది గుడ్డివారు కుంటివారు మొదలగు వారి విషయంలో బుద్ధిమంతులు చెప్పారు (79) శ్రీసూతులిట్లన్నారు. ఈ విధముగా మీకు సేతుయాత్రా క్రమాన్ని చెప్పాను. ఓ విప్రులార! దీనిని చదివిన వారు కాని విన్నవారు కాని అన్ని దుఃఖముల నుండి విముక్తులౌతారు (80) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు మూడవదైన బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు యాత్రాక్రమ వర్ణనమనునది ఏబది ఒకటవ అధ్యాయము || 51 ||.

Sri Scanda Mahapuranamu-3    Chapters