Sri Scanda Mahapuranamu-3    Chapters   

పంచమోzధ్యాయము

మా || శ్రీ సూత ఉవాచ -

ప్రస్తుత్య చక్రతీర్థంతు పుణ్యంపాప వినాశనం | పునరప్యధ్భుతం కించిత్‌ ప్రబ్ర వీమి మునీశ్వరాః || 1 ||

విధూమనామాహివసుః దేవస్త్రీ చాప్యలంబుసా | బ్రహ్మశాపాత్‌ మహా ఘోరాత్‌ పురాప్రాపౌ మనుష్యతాం || 2 ||

చక్రతీర్థే మహాపుణ్య స్నాత్వా శాపాద్వి మోచితౌ |

ఋషయ ఊచుః సూత సూత మహాప్రాజ్ఞ పురాణార్థ విశారద || 3 ||

ప్రాజ్ఞత్వాత్‌ వ్యాసశిష్య త్వాత్‌ అజ్ఞాతంతేన కించన | బ్రహ్మాకేనా పరాధేన సహాలంబు సయావసుం || 4 ||

పురావిధూమనామానం శప్తవాంశ్చతురాననః | బ్రహ్మశాపేన ఘోరేణకయోస్తౌపుత్రతాంగతౌ || 5 ||

శాపస్యాంతః కథ మభూత్‌ బ్రహ్మణాశప్తయోస్తయోః | ఏతన్నః శ్రద్ధ ధానాదాం విస్తరాద్వక్తు మర్హసి || 6 ||

శ్రీసూత ఉవాచ -

పురాహి భగవాన్‌ బ్రహ్మా స్వయం భూశ్చతురాసనః | సావిత్య్రాచ సరస్వత్యా పార్శ్వయోః ప్రవిరాజితః || 7 ||

సనాతనేన మునినా సనకేన చధీమతా | సనత్కుమారనామ్నాచనారదేన మహాత్మనా || 8 ||

సనందనాదిభిశ్చాన్యైః సేవ్యమానోమునీశ్వరైః | సుపర్వబృంద జుష్టేనస్తూయమానోబిడౌజసా || 9 ||

ఆదిత్యాది గ్రహైశ్చైవస్తూ యమాన పదాంబుజః | సిద్ధైః సాధ్యైః మరుద్భిశ్చ కిన్నరైశ్చ సమావృతః || 10 ||

గణౖః కింపురుషాణాం చవసుభిశ్చాష్టభిర్వృతః | ఊర్వశీ ప్రముఖానాంచ స్వర్వేశ్యానాం మనోరమం || 11 ||

నృత్యం వాదిత్ర సహితం వీక్ష్యమాణోముహుర్ముహుః | గోష్ఠీంచక్రే స భామధ్యేసత్యలోకే కదాచన || 12 ||

మేఘగర్జిత గంభీరో జనానానందయన్ముహుః | వీణా వేణు మృదంగానాం ధ్వనిస్తత్ర వ్యసర్పత || 13 ||

గంగా తరంగమాలానాం శీకర స్పర్శశీతలః | పవమానః సుఖస్పర్శోమందం మందంవవౌతదా || 14 ||

పర్యాయేణ తదా సర్వాననృతుః దేవయోషితః | నృత్యశ్రమేణ ఖిన్నాను వేశ్యా స్వన్యా సుసాదరం || 15 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - పాపనాశకము, పుణ్య ప్రదము ఐన చక్రతీర్థమునుస్తుతించి ఓమునీశ్వరులారా! ఇంకను కొంచము అద్భుతమైన విషయాన్ని మీకు చెబుతాను (1) విధూమ అనే పేరు గల వసువు అలంబున అనే దేవస్త్రీ వీరిద్దరు మహా ఘోరమైన బ్రహ్మశాపమువల్ల పూర్వము మనుష్య రూపమును పొందారు (2) చక్రతీర్థమందు స్నానము చేసి శాపవిముక్తులైనారు అని. ఋషులిట్లన్నారు. - ఓ సూత! మహా ప్రాజ్ఞ! పురాణార్థమెరిగినవాడ! (3) ప్రాజ్ఞుడ వైనందువల్ల వ్యాసశిష్యుడవైనందువల్ల నీకు తెలియనిది ఏమీ లేదు. ఏమి తప్పిదము కారణముగా బ్రహ్మ వసు అలంబునలను (4) శపించాడు. బ్రహ్మశాపంకారణంగా వారు ఎవరికి పుత్రులైనారు (5) శపింపబడ్డవారికి శాపాంతము (శాపమోచనము) ఎట్లా జరిగింది. శ్రద్ధ గలిగిన మాకు వివరించి చెప్పండి. అని (6) శ్రీ సూతులిట్లనిరి పూర్వము స్వయంభువు, చతురాననుడు ఐన బ్రహ్మ సావిత్రి సరస్వతులు పార్శ్వమందుండగా (7) సనాతునుడైన బుద్ధిమంతుడైన సనకుడు, సనత్కుమారుడు, నారదుడు (8) సనందాదులు ఇతర మునులు సేవించుచుండగా, దేవతలతో పరివేష్టింపబడిన ఇంద్రునితోస్తుతింపబడుచు (9) ఆదిత్యాది గ్రహములతో సేవింపబడుతున్న పాదద్వయము కలవాడై, సిద్ధులు, సాధ్యులు, మరుత్తులు, కిన్నరులు పరివేష్టింపట (10) కింపురుషగణము, అష్టవసువులు వీరితో చుట్టబడి, మనోరమమైన ఊర్వశి మొదలగు దేవ వేశ్యల (11) నృత్యమును వాద్యములతో సహకూడిన దానిని (వీణ, మద్దెల, వేణువు, తాళములు వగైరా) మాటిమాటికి చూస్తూ సత్యలోకంలో బ్రహ్మస భామధ్యమందు గోష్ఠిని ఏర్పరచుకున్నారు (12) మేఘగర్జనవలె గంభీరమై మాటిమాటికి జనులను ఆనందపరుస్తూ వీణ, వేణు మృదంగముల ధ్వని అక్కడ వ్యాపించింది (13) గంగాతరంగముల తుం పురులవలె చల్లనైన గాలి సుఖకరమై తగులుతూ మెల్లమెల్లగా వీస్తోంది (14) దేవనాట్యకత్తెలు అందరు ఒకరి తర్వాత ఒకరు నాట్యం చేశారు. ఇతరవేశ్యలు నృత్యశ్రమతో అలసిపోయాక మర్యాదగా - (15)

మూ | అలంబుసాదేవ నారీ రూప¸°వన శాలినీ | మదయన్తీ జనాన్‌ సర్వాన్‌ సభామధ్యేననర్తవై || 16 ||

తస్మిన్నవసరేతస్యాః నృత్యంత్యాః సంసదిద్విజాః | వస్త్రమాభ్యంతరం వాయుః లీలయా సముదక్షిపత్‌ || 17 ||

తత్‌క్షిప్తేవననే స్పష్ట మూరుమూల మదృష్యత | తథాభూతాంతుతాం దృష్ట్వా సర్వే బ్రహ్మాదయోహ్రియా || 18 ||

సభామధ్యే సమాసీనానిమీలి తదృశోzభవన్‌ | విధూమనామాతువసుః కామబాణ ప్రపీడితః || 19 ||

తామేవ బ్రహ్మ భవనే దృష్ట్వా నిలహృతాం శుకాం | హర్షనంపుల్లనయనో హృష్టరోమాతతో7భవత్‌ || 20 ||

అలంబుసాయాం తస్యాంతు జాతకామం విలోక్యతం | వసుంవిధూమనామానం శశాపచతురాననః || 21 ||

యస్మాత్‌ త్వమీదృశంకార్యం విధూమకృతవానసి | తస్మాద్ధి మర్త్యలోకేత్వం మానుష త్వమవాప్స్యసి || 22 ||

ఇయంచదేవయోషిత్తే తత్రభార్యా భవిష్యతి | ఏవం సబ్రహ్మణాశప్తో విధూమః ఖిన్నమానసః || 23 ||

ప్రసాదయామా సవసుఃబ్రహ్మాణం ప్రణిపత్యుతు

విధూమ ఉవాచ -

అస్యశాపస్య ఘోరస్య భగవాన్‌ భక్తవత్సల

నాహమర్హోస్మిదేవేశ రక్షమాంకరుణానిధే | ఏవం ప్రసాదితః తేన భారతీపతిరవ్యయః || 25 ||

కృపయాపరయాయుక్తో విధూమం ప్రాహ సాంత్వయన్‌

బ్రహ్మోవాచ -

త్వయి శాపో7వ్యయం దత్తోన చాసత్యంబ్రవీమ్యహం || 26 ||

తతో 7వధింకల్పయామి శాపస్యాస్య త వాధునా | మర్త్యభావం సమాపన్నః సహాలంబుసయా7నయా || 27 ||

తత్ర భూత్వా మహారాజః శాసయిత్వాచిరం మహీం | పుత్రమప్రతిమంత్వస్యాం జనయిత్వామహీపతిం || 28 ||

అభిషిచ్యచ రాజ్యేతం రాజ్యరక్షా విచక్షణం | ఏతచ్ఛా పస్యశాంత్యర్థం దక్షిణ స్యోదధేః తటే || 29 ||

పుల్లగ్రామ సమీపస్థే చక్రతీర్థే మహత్తరే || 29 1/2 ||

అనయాభార్య యాసార్థం యదాస్నానం కరిష్యసి | తదాత్వం మానుషం భావం జీర్ణత్వచమివోరగః || 30 ||

విసృజ్య భార్య యాసార్ధం స్వంలోకం ప్రతిపత్స్యసే | చక్రతీర్ధేవినాస్నానం ననశ్యేత్‌ శాప ఈదృశః || 31 ||

ఇతి బ్రహ్మవచః శ్రుత్వా విధూమోనాతి హృష్టవాన్‌ | స్వవేశ్మ ప్రావిశత్తూర్ణం ఆమంత్య్రచతురాననం || 32 ||

తా || అలంబున దేవతాస్త్రీ రూపము ¸°వనము కలది. జనులందరిని మత్తెక్కింపచేసేది సభామధ్యంలో నాట్యం చేసింది. (16) ఓ బ్రాహ్మణులారా! సభలో అప్పుడు నాట్యం చేస్తున్న ఆమె యొక్క లోపలి వస్త్రము, వాయువులీల వల్ల పైకి లేచింది (17) అట్లా లేవటంవల్ల (తొలగటం) ఆమె ఊరుమూలము (తొడలభాగం) స్పష్టంగా కన్పించింది. అట్లా ఐన ఆమెను చూచి బ్రహ్మాదులందరు సిగ్గువల్ల (18) సభామధ్యంలో కూర్చున్నవారు కళ్ళు మూసుకున్నారు. విధూమనాముడనే వసువు మాత్రం మన్మథ బాణంతో బాధితుడై (19) బ్రహ్మభవనంలో గాలితో తొలగించబడ్డ వస్త్రముగల ఆమెనే చూస్తూ ఆనందంతో విప్పారినకళ్ళు గలిగి రోమాంచముకలవాడైనాడు (20) ఆ ఆలంబుస యందు కామము కల్గిన ఆతనిని చూచి, బ్రహ్మవిధూమనాముడైన ఆ వసువును శపించాడు (21) విథూమ! నీవు ఇటువంటి పనిచేశావు కాబట్టి మనుష్యలోకంలో మనుష్యుడవై జన్మిస్తావు (22) ఈ దేవతాస్త్రీ నీకు అక్కడ భార్యఔతుంది. ఈరకంగా బ్రహ్మతో శపింపబడి విధూముడు ఖిన్నమానసుడైనాడు (23) బ్రహ్మకు నమస్కరించి ఆతనిని ప్రసన్నుని చేసుకున్నాడు వసువు. విధూముడు ఇట్లా అన్నాడు - భక్తులయందు దయగల ఓ భగవంతుడ! ఈ ఘోరశాపమునకు (24) నేను అర్హుణ్ణికాను. ఓదయా సముద్ర నన్నురక్షించు. ఈ రకంగా విధూమునిచే ప్రార్థింపబడ్డ అవ్యయుడైన భారతీపతి (25) చాలా దయగలవాడై విధూముని ఓదారుస్తూ ఇట్లా అన్నాడు. బ్రహ్మవచనము - నీకీ శాపం ఇచ్చాను ఇది అబద్ధంకాదు (26) నీ ఈ శాపానికి ఒక అవధిని ఏర్పరుస్తాను. మనుష్యుడుగా జన్మించాక ఈ అలంబుసతో కూడి (27) అక్కడ మహారాజువై భూమిని చాలా ఏండ్లు పాలించి, ఈమె యందు సాటిలేని రాజకుమారునికని (28) రాజ్యరక్షావిచక్షణుడైన ఆతనిని రాజ్యమందు అభిషేకంచేసి ఈశాపం యొక్క ముగింపుకొరకు దక్షిణ సముద్రం యొక్క ఒడ్డులో, పుల్లగ్రామ సమీపంలో ఉన్న గొప్ప తీర్థమైన చక్రతీర్థమందు (29) ఈ భార్యతో కూడి స్నానం చేసిన వెంటనే, పాముకు బుసంవిడిచినట్టు నీవు నీ మానుష రూపమును (30) వదలి భార్యతో పాటునీలోకానికి తిరిగి వస్తావు. ఇటువంటి శాపము చక్రతీర్థంలో స్నానం చేయకుండా నశించదు (31) అనే బ్రహ్మ మాటలను విని విధూముడు ఎక్కువ ఆనందపడలేదు. బ్రహ్మను సాగనంపి తన గృహం ప్రవేశించాడు.

మూ || చింతయా మాస తత్రాసౌ మర్త్యతాం యాస్యతోమమ | కోవాపితా భ##వేత్‌ భూమౌ కావామాతా భవిష్యతి || 33 ||

బహుధేత్థం సమాలోచ్య విధూమో నిశ్చికాయానః | కౌశాం బీనగరే రాజా శతానీక ఇతిశ్రుతః || 34 ||

అస్తివీరో మహాభాగో భార్యాచాపిపతివ్రతా | తస్యవిష్ణుమతీనామ విష్ణోః శ్రీరివ వల్లభా || 35 ||

తమేవపితరం కృత్వా మాతరం చవిధాయతాం | సంభవిష్యామిభూలోకే స్వకర్మపరిపాకతః || 36 ||

తతః సమాల్యవంతం చపుష్పదంతం బలోత్కటం| త్రీనాహూయాత్మనోభృత్యాన్‌ వృత్తమేతన్న్య వేదయత్‌ || 36 ||

భృత్యాః శ్రుణుత భద్రంవో బ్రహ్మ శాపాన్మ హాభయాత్‌|జనిష్యామిశతానీకాత్‌ విష్ణుమత్యా మహంసుతః || 38 ||

ఇతి శ్రుత్వావచోభృత్యాస్తస్య ప్రాణాబహిశ్చరాః | బాష్ప పూర్ణము ఖాస్సర్వే విధూమం వాక్యమబ్రువన్‌ || 39 ||

భృత్యాఊచుః -

త్వద్వియోగం వయంసర్వే త్రయో7పిన సహామహే | తస్మాన్మానుషభావంత్వమస్మాభిః సహయాస్యసి || 40 ||

శతానీక స్యరాజర్షేః మంత్రీ యో7యంయుగంధరః | సేనానీః విప్రతీ కశ్చయోzయం ప్రాగ్రసరోరణ || 41 ||

నర్మకర్మ సుహృద్విప్రో వల్లభాఖ్యో మహాంశ్చయః | తేషాం పుత్రాః త్రయో7ప్యేతే భవిష్యామోన సంశయః || 42 ||

శతానీ కస్య రాజర్షేః పుత్ర భావం గతస్యతే | శుశ్రూషాంస విధాస్యామః తేషుతేషుచ కర్మసు || 43 ||

తానేవం వాదినః సోzయం విధూమో వాక్యమ బ్రవీత్‌ |

విధూమ ఉవాచ -

జానే హంభవతాం స్నేహం తాదృశం మయ్యనుత్తమం || 44 ||

తథాపిక థయామ్యద్య తచ్చృణుధ్వం హితంవచః | బ్రహ్మశాపేన ఘోరేణస్వేన దుష్కర్మణాకృతం || 45 ||

కుత్సితం మానుషం భావం అహమేకోను వర్తయే | విహితం నహి యుష్మాకం ఏతచ్ఛా పానువర్తనం || 46 ||

జుగుప్సితేzతో మానుష్యే మాకురుధ్వం మనోzధునా | అతః శాపావధిర్యావత్‌ మద్వియో గోవిషహ్యతాం || 47 ||

ఇత్యుక్త వన్తం తేసర్వే మాల్యవత్‌ ప్రముఖాస్తదా | ఊచుః ప్రణమ్యశిరసా ప్రార్ధయంతః పునః పునః || 48 ||

రక్షిత్వాకృపయా హ్యాస్మాన్‌ మాకురుష్వచ సాహసం | పరిత్యజసి నః సర్వాన్‌ భక్తాన ద్యనిరాగసః || 49 ||

త్వద్వియోగాత్‌ మహాఘోరాత్‌ మానుష్యమపికుత్సితం|బహుమన్యామహెదేవ తస్మాన్నః త్రాహి సాంప్రతం || 50 ||

ఏవం సయాచమానాన్‌ త్రీన్‌ అన్వమన్యత భృత్యకాన్‌|తై స్త్రి భిః సహితః సోzయం కౌశాంబీం గంతుమైచ్ఛత || 51 ||

తా || తన గృహంలో వసువు ఇట్లా ఆలోచించసాగాడు. మనుష్యజన్మనెత్తే నాకు తండ్రెవరు, తల్లెవరౌతారు (33) ఇట్లా చాలాసేపు ఆలోచించి విధూముడు ఇట్లా నిశ్చయించుకున్నాడు. కౌశాంబీనగరంలో శతానీకుడని రాజున్నాడు (34) ఆతడు వీరుడు, ఉత్తముడు ఆతని భార్య కూడా పతివ్రత. విష్ణువునకు శ్రీదేవి వలె ఆతనికి విష్ణుమతి అను ఆమె భార్య (35) ఆతనిని తండ్రిగా ఆమెను తల్లిగా చేసుకొని నా కర్మ పరిపాకం వల్ల భూలోకంలో పుడ్తాను (36) పిదప ఆవసువు మాల్యవంతుడు, పుష్పదంతుడు బలోత్కటుడు అను తన ముగ్గురు భృత్యులను పిలిచి ఈ విషయము చెప్పాడు (37) భృత్యులారా! వినండి మీకు క్షేమం కలగని మహాభయానకమైన బ్రహ్మశాపం వల్ల నేను శతానీకునివల్ల విష్ణుమతియందు పుత్రునిగా పుడ్తాను (38) ఈ మాటవిని ఆతని భృత్యులు, ఆతని బహిః ప్రాణములు, కన్నీళ్ళు గల ముఖాలతో అందరు విధూమునితో ఇట్లా అన్నారు (39) భృత్యుల మాట - మేము ముగ్గురము నీవియోగాన్ని సహించలేము. అందువల్ల మనుష్యరూపాన్ని మాతో పాటు పొందుతావు. (40) శతానీకుని మంత్రియైన యుగంధరుడు, యుద్ధరంగంలో ముందుండే సేనాపతి విప్రతీకుడు (41) సర్మకర్మలలో స్నేహితుడు విప్రుడు, మహాత్ముడైన వల్లభుడు, ఈ ముగ్గురికి మేము ముగ్గురము పుత్రులుగా జన్మిస్తాము అనుమానంలేదు (42) రాజర్షియైన శతానీకునకు పుత్రునిగా జన్మించిన నీకు ఆయా పనుల్లో మేము శుశ్రూష చేస్తాము (43) ఈరకంగా మాట్లాడుతున్న వారితో విధూముడు ఇట్లా అన్నాడు (43 1/2) విధూముని మాట - నేను మీ స్నేహాన్ని ఎరుగుదును. ఉత్తమమైనది అటువంటిదేనని (44) ఐనా చెప్తున్నాను. నాహితకరమైన మాట వినండి. నా దుష్కర్మవల్ల ఘోరమైన బ్రహ్మశాపంవల్ల (45) కుత్సితమైన మనుష్య జన్మను నేనొక్కణ్ణ పొందుతాను మీకు ఈ శాపంలేదు. మీరు దీన్ని అనుసరించటం తగదు. (46) అందువల్ల జుగుప్సితమైన మనుష్యజన్మయందు మనస్సును నిల్పకండి. అందువల్ల నాకు శాపమోక్షంకలిగే వరకు మీరు ఈ వియోగాన్ని భరించండి. (47) అని మాట్లాడుతున్న విధూమునితో మాల్యపత్‌ ప్రముఖులైన ఆ ముగ్గురు శిరస్సు వంచి నమస్కరిస్తూ మరల మరల ఇట్లా ప్రార్థించారు (48) మమ్ములను రక్షించి మీరు ఈ సాహసం చేయవద్దు. తప్పలేనటువంటి, నీ భక్తులమైన మమ్ములను వదలిపెడ్తున్నావు. (49) మహా ఘోరమైన నీ వియోగముకన్నను కుత్సితమైన మానుష జన్మనైనను గొప్పగా భావిస్తాము. అందువల్ల మమ్ములను రక్షించు (50) ఈరకంగా యాచిస్తున్న ఆ ముగ్గురు భృత్యులను అనుమతించాడు. ఆ ముగ్గురితో కూడి ఈ విధూముడు కౌశాంబికి పోదలిచాడు (51)

మూ|| ఏతస్మిన్నే వకాలేతుసోమ వంశీ వివర్ధనః | అర్జునాభిజనే జాతః జనమే జయ సంభవః || 52 ||

శతానీకో మహీపాలః పృధివీమన్వపాలయత్‌ | బుద్ధిమాన్‌నీ తిమాన్‌ వాగ్మీ ప్రజా పాలన తత్పరః || 53 ||

చతురంగ బలోపేతో విక్రమైక ధనోయువా | సకౌశాంబీ మహారాజో నగరీ మధ్యువాసవై || 54 ||

తస్యమంత్ర రహస్యజ్ఞో మంత్రీ జాతో యుగంధరః | సేనానీః విప్రతీకశ్చ తస్య ప్రాగ్రనీ సరోరణ || 55 ||

నర్మకర్మ సుతస్యాసీ ద్వల్లభాఖ్యః సఖాద్విజః | తస్యవిష్ణుమతీ నామ విష్ణోః శ్రీరివ వల్లభా || 56 ||

స సర్వగుణ సంపన్నః శతానీకో మహామతిః | పుత్ర మాత్మ సమంతస్యాం భార్యాయాం నాన్వవిందత || 57 ||

ఆత్మాన మసుతం జ్ఞాత్వా సభృశం పర్యత ప్యత | సయుగంధరమా హూయ మంత్రిణం మంత్ర విత్తమం || 58 ||

పుత్రలాభః కథంమేస్యాదితి కార్య మమంత్రయత్‌ | యుగంధరో మహీపాలం పుత్రా లాభేన పీడితం || 59 ||

హర్షయన్‌ వచసాస్వేన వాక్యమేత దభాషత | || 591/2 ||

యుగంధర ఉవాచ -

అస్తి శాండిల్యనామాతు మహర్షిః సత్యవాక్‌ శుచిః || 60 ||

శత్రుమిత్ర సమోదాంతః తపః స్వాధ్యాయ తత్పరః | తమేవముని మా సాద్య జ్వలంత మివపావకం || 61 ||

పుత్రమాత్మ సమంరాజన్‌ ప్రార్థయేథాః వినీతవత్‌ | కృపావాన్‌సమహర్షిస్తు పుత్రంతే దాస్యతి ధ్రువం || 62 ||

ఇతి తద్వచనం శ్రుత్వాహర్ష సంపుల్లలోచనః | మంత్రిణాతేన సంయుక్తః తస్యాగాదాశ్రమం మునేః || 63 ||

తమాశ్రమే సమాసీనం ప్రణనామ మహీపతిః | శాండిల్యస్తు మహాతేజా రాజా సంప్రాప్తమాశ్రమం || 64 ||

దృష్ట్వా పాద్యాదిభిః పూజ్యస్వాగతం వ్యాజహారసః |

శాండిల్య ఉవాచ :-

శతానీక కిమర్థంత్వం ఆశ్రమం ప్రాప్తవాన్మమ || 65 ||

యత్కర్తవ్యమిదానీంతే తద్వదస్వకరోమ్యహం | మునిమేవం వదంతంతం ప్రత్యవాదీద్యుగంధరః || 66 ||

తా || ఈ కాలంలోనే చంద్రవంశ వర్ధకుడై జనమే జయునకు కల్గినవాడు అర్జునుడు అనుపేరు గల వంశమందు పుట్టినవాడు (52) ఐన శతానీకుడనే రాజు భూపరిపాలన సాగిస్తున్నాడు. ఆతడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, మాటలలో చతురుడు (యుక్తభాషి), ప్రజాపాలన యందు ఆసక్తికలవాడు (53) చతురంగ బలము కలవాడు, పరాక్రమమే ధనముగా గలవాడు, యువకుడు ఆ మహారాజు కౌశాంబీ నగరమును అధివసించాడు (54) ఆతనికి రాజనీతి రహస్యమెరిగిన మంత్రి యుగంధరుడని ఉన్నాడు. యుద్ధమందు ముందునిలిచే విప్రతీకుడనే సేనాని ఆతనికున్నాడు (55) వినోదమునకు (హాస్యమునకు) ద్విజుడు, స్నేహితుడు వల్లభుడు అని ఉన్నాడు. ఆతనికి, విష్ణువునకు లక్ష్మివలె విష్ణుమతి అని భార్య ఉంది (56) అన్ని గుణములు కల ఆశతానీకుడు బుద్ధిమంతుడు. తనకు తగిన పుత్రుని ఆ భార్యయందు రాజు పొందలేదు (57) తనకు సంతానము లేనందుకు ఆతడు చాలా బాధపడ్డాడు. మంత్ర విదుడైన యుగంధరుడనే మంత్రిని పిలిచి (58) నాకు సంతానం ఎలా కలుగుతుంది అని ఆలోచించాడు. మంత్రి సంతానంలేదని బాధపడుతున్న రాజును (59) తన మాటలతో సంతోషపెడ్తూ ఇట్లా మాట్లాడాడు యుగంధరుని వాక్కు - సత్యవాక్కు గల, శుచియైన శాండిల్యుడనే ఋషి ఉన్నాడు. (60) ఆతడు శత్రువులను మిత్రులను సమంగా చూస్తాడు. తపస్సుచే శ్రమించినవాడు, తపః స్వాధ్యాయములందు ఆసక్తి కలవాడు. అగ్నిలాగా వెలిగిపోతున్న ఆమునిని చేరి (61) నీతో సమానమైన పుత్రుని వినయవంతుడవై యాచించు, దయగల ఆ ఋషి నీకు తప్పకుండా పుత్రుని ఇస్తాడు (62) అని అన్న మాటను విని సంతోషంతో కళ్ళు విప్పారగా ఆ మంత్రితో కూడి ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు (63) ఆశ్రమమందుకూర్చున్న ఆ ఋషికి రాజు నమస్కరించాడు. తేజస్సంపన్నుడైన శాండిల్యుడు ఆశ్రమానికి వచ్చిన రాజును (64) చూచి పాద్యము మొదలుగా పూజించి స్వాగతం పలికాడు. శాండిల్యుని మాట - ఓ శతానీకుడ! నీవు ఎందుకొరకు నా ఆశ్రమానికి వచ్చావు (65) నీకేం చేయాలో చెప్పునేను చేస్తాను. అని ఈ రకంగా పల్కుతున్న మునిని చూచి యుగంధరుడు ఇట్లా అన్నాడు (66).

మూ || భగవన్నేషవై రాజా పుత్రాలా భేనకర్షితః | భవంతం శరణంప్రాప్తః సాంప్రతం పుత్ర కారణాత్‌ || 67 ||

అస్యాపుత్ర త్వజం దుఃఖం త్వమపాకర్తు మర్హసి| ఇతి తస్యవచః శ్రుత్వాశాండిల్యోముని సత్తమః || 68 ||

పుత్రలాభవరంతసై#్మ ప్రతిజజ్ఞే నృపాయవై | సరాజ్ఞో వరదః శ్రీమాన్‌ కౌశాంబీమేత్య సాదరం || 69 ||

పుత్రేష్ట్యాం పుత్రతకామస్య యాజకోzభూన్మహామునిః | తతోముని ప్రసాదేన రాజా దశరధోపమః || 70 ||

యజ్వారామమివ ప్రాప సహస్రానీకమాత్మజం | ఏవం విధూమః సంజజ్ఞేశతానీకాత్‌నృపోత్తమాత్‌ || 71 ||

అత్రాంతరే మంత్రి వరః సేనానీస్తు మహీపతేః | ద్విజోనర్మ వయస్యశ్చపుత్రాన్‌ ప్రాపుః కులోచితాన్‌ || 72 ||

తా || ఓ పూజ్యుడ! ఈ రాజు సంతానం లేనందువల్ల కృశించినవాడై ఇప్పుడు పుత్రుని కొరకునిన్ను శరణు పొందినాడు (67) ఈతనికి సంతానం లేనందువల్ల కల్గిన దుఃఖాన్ని తొలగించుటకు నీవు అర్హుడవు. అనే అతని మాటలను విని మునిశ్రేష్ఠుడైన శాండిల్యుడు (68) ఆ రాజునకు పుత్రుడు కలిగేందుకు వరమును (ప్రదానం) ప్రతిజ్ఞ చేశాడు. వరమును ఆ రాజునకు ఇచ్చిన ఆ ఋషి సాదరముగా కౌశాంబకి వచ్చి (69) పుత్రునికొరే ఆ రాజుయొక్క పుత్రకామేష్టియందు (ఆముని) యాజకుడైనాడు. దశరధుని పోలిన ఆ రాజు ఆముని అనుగ్రహం వల్ల (70) యాగము చేసి రామునివలె సహస్రానీకుడనే కొడుకును పొందాడు. ఈవిధముగా శతానీకుడనే రాజువల్ల విధూముడు జన్మించాడు (71) ఇంతలో మంత్రి శ్రేష్ఠుడు, రాజుగారి సేనాపతి, నర్మ వయుస్యుడైన బ్రాహ్మణుడు వీరు తమ తమ కులములకు తగిన పుత్రులను పొందిరి (72).

మూ || పుత్రోయుగంధర స్యాసీన్మాల్య వాన్నామభృత్యకః | ¸°గంధరాయణో నామ్నా మంత్ర శాస్త్రేషుకోవిదః || 73 ||

విప్రతీకస్యతనయో పుష్పదంతో బభూవహ | రుమణ్వానితి విఖ్యాతః పరసైన్య విమర్దనః || 74 ||

వల్లభస్యతదాజజ్ఞే తనయో వైబలోత్కటః | వసంతక ఇతి ఖ్యాతో నర్మకర్మ సుకోవిదః || 75 ||

అధతేవ వృధుః సర్వేరా జపుత్ర పురోగమాః | పంచహాయనతాం తేషు యాతేషు తదనంతరం || 76 ||

అలంబుసాపిస్వర్వేశ్యా భూపతిః కృతవర్మణః | అయోధ్యాయాం మహాపుర్యాం కన్యాజాతామృగావతీ || 77 ||

ఏవం విధూమ ముఖ్యాస్తే జజ్ఞిరేక్షితి మండలే | అత్రాంతరే మహాసత్వో దుష్ట సానుచరోబలీ || 78 ||

అహిదంష్ట్రా ఇతిఖ్యాతో మహాదైత్యో బలోత్కటః | యుక్తః స్థూలశిరోనామ్నా సహాయేన దురాత్మనా || 79 ||

రురోధదేవనగరంబబాధేవిబుధానపి | వర్తమానే దివిమహాసమరే సురరక్షసాం || 80 ||

ఆనీనాయశతానీకం సహాయార్ధం పురందరః | స¸°వరాజ్యేతనయం విధాయ విధినానృపః || 81 ||

ప్రతస్థేరధమా స్థాయయుద్ధాయ దితిజైః సహ | నీతో మాతలినాభ్యేత్య సాదరం సధనుర్ధరః || 82 ||

విధా యప్రేక్షకా న్‌ దేవాన్‌ జఘానదితిజా న్రణ | అథ దైత్యాధిపః సోzపిని హతః సమరేదివి || 83 ||

తా || మాల్యంవంతుడనే పేరుగల భ్యత్యుడుయు గంధరునకు పుత్రుడయ్యాడు. ¸°గంధ రాయణు డనిపేరు. రాజనీతి శాస్త్ర కోవిదుడు (73) పుష్పదంతుడు విప్రతీకుని పుత్రునిగా జన్మించాడు. శత్రుసైన్యమును మర్దించుటలో సమర్థుడు, రుమణ్వంతుడని ప్రసిద్ధి పొందాడు (74) బలోత్కటుడు వల్లభునకు తనయుడైనాడు. వసంతకుడని ఆతనిపేరు. నర్మకర్మలలో సమర్ధుడు. (75) రాజపుత్రుడు మొదలుగా వారందరు వృద్ధి చెందసాగారు. వారికి ఐదేళ్ళ వయసు వచ్చాక (76) దేవవేశ్యయైన అలంబుస కూడా కృతవర్మ అనే రాజునకు అయోధ్యాపురి యందు మృగావతి అనే పేరుతో కన్యగా జన్మించింది (77) ఈ విధముగా విధూముడు మొదలగువారంతా ఈ భూమి యందు జన్మించారు. ఇంతలో గొప్పశక్తి సంపన్నుడు, దుష్ట అనుచరగణం కలవాడు, బలవంతుడు (78) అహిదంష్ట్రుడు అని ప్రసిద్ధి చెందిన రాక్షసుడు బలవంతుడు దుర్మార్గుడైన స్థూలశిరుడను పేరుకల్గిన సహచరునితో కూడి (79) దేవనగరమును అడ్డగించాడు. దేవతలను బాధించాడు. దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం స్వర్గంలో జరుగుతుండగా (80) ఇంద్రుడు శతానీకుణ్ణి సహాయం కొరకు తీసుకువచ్చాడు. ఆరాజు శాస్త్ర ప్రకారము తనకొడుకును యువరాజునుచేసి (81) దేవతలతో సహారథమెక్కి యుద్ధానికి బయలుదేరాడు. ఆ ధనుర్ధారి మాతలితో తీసుకొని పోబడి స్వర్గానికి వచ్చి (82) దేవతలను ప్రేక్షకులనుగా చేసి దైత్యులను సంహరించాడు. ఆ దైత్యాధిపుడు, అతడు కూడా యుద్ధమందు స్వర్లోకంలో చంపబడ్డాడు. (83)

మూ - తతః శక్రస్యవచసా పరేతం నృపపుంగవం | రథ మారోప్యసహసా కౌశాంబీం మాతలి ర్య¸° || 84 ||

నీత్వామహీతలమసౌతత్సు తాయన్యవేదయత్‌ | తతః సహస్రానీ కోపి విలప్యబహుదుఃఖితః || 85 ||

మంత్రి భిః సహ సంభూయ ప్రేత కార్యం న్యవర్తయత్‌ | మృతం జ్ఞాత్వాపతింరాజ్ఞీ సహై వానుమమారచ || 86 ||

మమీష్యా సహ సంప్రాప్తే భూపాలే కీర్తి శేషతాం | భేజేరాజ్యం శతానీక తనయో మంత్రి ణాంగిరీ || 87 ||

యుగంధరే విప్రతీకే వల్లభేచ మృతేసతి | ¸°గంధరాయణ ముఖాః తత్పుత్రాః సర్వేఏవహి || 88 ||

శతానీక సుతస్యా స్యతత్త త్కార్యమకుర్వత | ఏవం నపాలయా మాస మహీంరాజసుతో బలీ || 89 ||

యాతేకాలేమహేంద్రేణ సనందన మహోత్సవే | ని మంత్రితః తత్కధితాం భావినీ మశృణోత్కథాం || 90 ||

స్వర్యోషిత్‌ బ్రహ్మణః శాపాత్‌ అయోధ్యాయామలంబుసా | జాతా మృగావతీ కన్యా భూపతేః కృత వర్మణః || 91 ||

విధూమనామా చ వసుస్త్వం నాక లల నాంపురా | తామేవ బ్రహ్మసదనే దృష్ట్వా నిలహృతాంశుకాం || 92 ||

తదైవ మదనాక్రాంతః శాపాన్మర్త్యత్వమాగతః | సైవతే దయితా రాజన్‌ భావినీ నచిరాత్‌ సఖే || 93 ||

యదాత్వమాత్మనః పుత్రం రాజ్యే సంస్థాప్యభూపతే | మృగావత్యాస్త్రియాసార్థం దక్షిణ స్యోదధేస్తటే || 94 ||

చక్రతీర్థే మహాపుణ్య పుల్లగ్రామ సమీపతః | స్నానం కరిష్య సితదాశాపాన్ముక్తో భవిష్యసి || 95 ||

ఇతిప్రోవాచ భగవాన్‌ సత్యలోకే పితామహః | ఇతీంద్రవచనంశ్రుత్వా సహస్రానీక భూపతిః || 96 ||

తథోద్వాహకృతో త్పాహః సమామంత్ర్యశచీపతిం | కౌశాంబీం ప్రస్థితో హృష్టః సతిలోత్తమయా పథి || 97 ||

స్మరన్‌కిమపితాంకాంతాం భాష మాణాం అనన్యధీః | ధ్యాయన్‌ శతక్రతువచో నాలులోకే మహీమతిః || 98 ||

సాశశాపనృపంసుభ్రూః అనాదరతిరస్కృతా | ఆహూయమానోపి మయా సహస్రానీక భూపతే || 99 ||

మృగావతీం హృదాధ్యాయన్‌కి మర్థం మాముపేక్షసే | సౌభాగ్యమత్తా మానిన్యఃన సహంతేzవధీరణాం || 100 ||

మామవజ్ఞాయయాం రాజన్‌ హృదాధ్యాయసి సాంప్రతం | తయాచతుర్దశ సమా విముక్తః త్వం భవిష్యసి || 101 ||

ఇతిశప్త వతీం రాజా తామువాచ తిలోత్తమాం | తామేవయది లభ్యేయం తను జాంకృత వర్మణః || 102 ||

చతుర్దశ సమా దుఃఖం సహిష్యే తద్వియోగజం | ఇత్యుక్త్వాతద్గత మనానృపః ప్రాయాత్‌ని జాంపురీం || 103 ||

తా || ఆపిదప ఇంద్రుని ఆజ్ఞ ప్రకారము చనిపోయిన రాజును రథ మందుంచుకొని మాతలివేగంగా కౌశాంబికి వచ్చాడు (84) మాతలి భూమిపైకి రాజుశవాన్ని తెచ్చి రాకుమారునికి అప్పగించాడు. పిదప సహస్రానీకుడు కూడా చాలా దుఃఖంతో ఏడ్చాడు (85) మంత్రులతో ఆలోచించి ప్రేతకార్యమును నిర్వర్తించాడు. రాజు గారి మరణవార్త వినిరాణి ఆతనితో పాటు మరణించింది (86) రాణితో పాటు రాజుగారు కూడా కీర్తిశేషులయ్యాక శతానీక తనయుడు మంత్రుల మాటలతో తన రాజ్యానికి వచ్చాడు (పరిపాలన ఆరంభించాడు) (87) యుగంధరుడు, విప్రతీకుడు, వల్లభుడు మృతి చెందాక ¸°గంధరాయణాదులైన వారి పుత్రులు అందరు (88) శతానీకుని పుత్రుడైన ఈతనికి ఆయా పనులు చేయసాగారు. బలవంతుడైన ఆ రాకుమారుడు ఈ విధంగా రాజ్యపాలన చేస్తుండగా (89) కొంతకాలం గడిచాక ఇంద్రునిచే నందన మహోత్సవమునకై ఆహ్వానింపబడి ఈ రాకుమారుడు, ఇంద్రుడు చెప్పిన భవిష్యత్‌ కథను విన్నాడు (90) దేవతాస్త్రీ అలంబుస బ్రహ్మశాపంవల్ల అయోధ్య యందు కృతవర్మ అనే రాజునకు మృగావతి అనే కన్యగా జన్మించింది (91) నీవు విధూమ అనే పేరు గల వసువువు. పూర్వం దేవతాస్త్రీయైన ఆమెను బ్రహ్మ భవనంలో గాలివల్ల తొలగిన వస్త్రం కలదానిని చూచి (92) మన్మధునితో ఆక్రమింపబడి అప్పుడే శాపమును పొంది మనుష్యునిగా జన్మించావు. త్వరలో ఆమెయే నా భార్యగా కాబోయేది ఓ రాజా (93) ఎప్పుడైతే నీ కొడుకును రాజ్యమందుంచి మృగావతితో పాటు దక్షిణ సముద్ర తీరంలోని (94) మహా పుణ్యప్రదమైన చక్రతీర్థంలో పుల్లగ్రామ సమీపంలో స్నానం చేస్తావో అప్పుడే శాప విముక్తుడవౌతావు (95) అని సత్యలోకంలో బ్రహ్మ పూజ్యుడు పలికాడు. అనే ఇంద్రుని మాటలను విని సహస్రానీకుడనే ఈ రాజు (96) వివాహ సంబంధమైన ఉత్సాహంతో ఇంద్రునికి పోయివస్తానని చెప్పి సంతోషంతో తిలోత్తమతో కూడి కౌశాంబికి బయలుదేరాడు. మార్గంలో (97) ఆ స్త్రీని గూర్చి ఏకాగ్రంగా ఏదో ఆలోచిస్తూ ఇంద్రుని మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ తనతో మాట్లాడుతున్న ఆమెను (తిలోత్తమను) రాకుమారుడు చూడలేదు (98) అనాదరంతో తిరస్కరింపబడ్డ ఆమె రాజును శపించింది. ఓ సహస్రానీక మహారాజ! నేను పిలుస్తున్నా (99) మృగావతిని మనసులో ధ్యానిస్తూ నన్నెందుకు ఉపేక్షచేశావు. స్త్రీలు సౌభాగ్యంతో గర్వించేవారు. అవమానాన్ని సహించలేరు. (100) నన్నవమానించి ఇప్పుడు ఎవరిని నీవు మనస్సులో ధ్యానిస్తున్నావో, ఆమెను పదునాల్గు సంవత్సరాలు నీవు విడిచి ఉంటావు (101) అని శపించిన తిలోత్తమతో రాజు ఇట్లా అన్నాడు - కృతపర్మకూతురైన ఆమెనే తిరిగి పొందేట్టైతే (102) ఆమె వియోగం వల్ల కలిగే దుఃఖాన్ని పదునాల్గు సంవత్సరాలు సహిస్తాను, అని చెప్పి ఆమె యందే (మృగావతి) మనను నిలిపి రాజు తన పట్టణానికి వెళ్ళాడు (103).

మూ || తతః కాలేన తనయా భూపతేః కృత వర్మణః | తమానసాద దయితా సర్వస్వం పుష్ప ధన్వనః || 104 ||

మృగావతీం సమాసాద్య విలాస తరువల్లరీం | విభ్రమాంభోధి లహరీం ననంద మదనద్యుతిః || 105 ||

సాతస్మాత్‌ గర్భమా ధత్త భవానీ వేందుశేఖరాత్‌ | పాండిమ్నాశశిలేఖేవ పీయూష క్షాలితాబభౌ || 10 6 ||

సుందరీదౌహృదవ్యక్తేః అథ పౌరందరీపదిక్‌ | రరాజరాజ మహిషీ రజనీ కరగర్భిణీ || 107 ||

సాదౌహృదవశాత్‌రాజ్ఞీయం యంకామమ కామయత్‌ |సుదర్లభమ పిప్రేవ్ణూ తత్తత్‌ సర్వం సమాహరత్‌ || 108 ||

పత్యౌసమీహితకరే సాకదాచిత్‌ మృగావతీ | స్వేచ్ఛయావైమతిం చక్రే రక్తవాపీని మజ్జనే || 109 ||

అభిలాషంస విజ్ఞాయ మృగావత్యా మహీపతిః | కౌసుం భసలిలైః పూర్ణాం క్షణా ద్వాపీ మకారయత్‌ || 110 ||

తస్మిన్రక్త జలే రాజ్ఞీ స్నానం సాదర మాతనోత్‌ | తతస్తాంరక్తతో యార్ద్రాం పుల్లకింశుక సన్నిభాం || 111 ||

రాజస్త్రీ మామిష ధియా సువర్ణకుల సంభవః | జహార వికటః పక్షీ ముగ్ధాందగ్థ విధేర్వశాత్‌ || 112 ||

నీత్వావిహాయసాదూరం సతామ చలసన్ని భః | తత్యా జమోహ వివశాం ఉదయాచలకందరే || 113 ||

తా || కొంతకాలం గడిచాక కృతవర్మ మహారాజు కూతురు ఈతనిని పొందింది. ఆమె పూలుబాణాలుగా గల మన్మథుని సర్వస్వంగా ఉండి (104) విలాసమనే వృక్షము యొక్క తీగలా (చిగురులా) విభ్రమమనే సముద్రం యొక్క అలలలా ఉన్న మృగావతిని పొంది మదనుని కాంతి ఆనందపడింది (105) శివుని నుండి పార్వతివలె ఆమె ఆరాజు వలన గర్భాన్ని ధరించింది. తెలుపులో చంద్రలేఖవలె అమృతంతో కడిగినట్టైంది (106) దౌహృదం వ్యక్తమైనందున ఆ సుందరిపురందర దిక్కువలె (తూర్పు) చంద్రుణ్ణి గర్భంలో కలదానివలె ఆ పట్టపురాణి ప్రకాశిస్తోంది (107) దౌహృదం వల్ల ఆరాణి ఏ ఏకోరికలను కోరిందో వాటన్నిటిని దుర్లభ##మైన వాటన్నిటిని సమకూర్చాడు (108) భర్త, అడిగిన కోర్కెలన్నీ తీరుస్తూ ఉండగా ఒకసారి ఆ మృగావతి రక్తవాపి (బావి) యందు స్నానం చేయాలని కోరింది. (109) మృగావతి యొక్క ఆ కోరికను రాజు తెలుసుకొని క్షణాలలో బావిని కుసుమపూల వంటి ఎర్రని నీళ్ళతో నింపాడు (110) ఆ ఎర్రటి నీళ్ళలో మహారాణి ప్రేమతో స్నానం చేసింది. ఎర్రటి నీళ్ళతో తడిసి ఉన్న ఆమెను వికసించిన మోడుగ పూలలా ఉన్న ఆమెను (111) ఆ రాజస్త్రీని మాంసము అనే బుద్ధితో సువర్ణుని కులంలో పుట్టిన (గరుడని) వికటమైన పక్షి దురదృష్టవశాత్తు ఆ ముగ్థను అపహరించింది. (112) పర్వతంలా ఉన్న ఆ పక్షి ఆమెను ఆకాశమార్గంలో దూరంగా తీసుకుపోయి మోహవివశను, ఉదయపర్వతగుహలో వదిలింది (113).

మూ || లబ్ధసంజ్ఞాశ##నైః కంపవిలోలతను వల్లరీ|దృగ్భ్యాం ఉత్పల తుల్యాభ్యాం ముహుర శ్రూణ్యవర్తయత్‌ || 114 ||

హానాథమందభాగ్యాహం త్వద్వియోగేన పీడితా | కాగతిః క్వనుగచ్ఛామి ద్రక్ష్యామిత్వన్ము ఖంకదా || 115 ||

ఇత్యుక్త్వా గజసింహానాం పురోభూద్వధ కాంక్షిణీ | సా సర్వకేసరి గజైః త్యక్తా న నిధనం గతా || 116 ||

ఆ పత్కాలే నృణాం నూనం మరణం నైవలభ్యతే | అతిదీనం సమాకర్ణ్యతస్యాః క్రంది తమున్ముఖాః || 117 ||

మృగానిష్పంద గతయో నతృణాన్యప్యభక్షయన్‌ | తతస్తాం కురుణాసింధుః మునిపుత్రః తథాస్థితాం || 118 ||

రుదతీం కృపయారాజ్ఞీం సమానీయ స్వమాశ్రమం | న్యవేదయచ్చతాం రాజ్ఞే గురువేజమదగ్నయే || 119 ||

జమదగ్నిస్తు ధర్మాత్మా తమాశ్వానయదంతికే || 119 1/2 ||

జమదగ్నిరువాచ -

తథాజానీహిమాంభ##ద్రే కృతవర్మాయధాతవ || 120 ||

ఏవ మాశ్వాసితా తత్ర కృపయా జమదగ్నినా | చక్రేతత్రైవ సావాసం ఆశ్రమేముని సంకులే || 121 ||

తతః స్పల్పేన కాలేన విశాఖ మివ పార్వతీ | అసూత తనయంబాలా శౌర్యధైర్య గుణాన్వితం || 122 ||

నూతికా గృహకృత్యాని యాని కార్యాణి బంధుభిః | చక్రిరే మాతృవత్తాని మృగావత్యా మునిస్త్రియః || 123 ||

తంసుజాతం నృపసుతం కాపి వాగశరీరిణి | ఉదయా చలజాతత్వాత్‌ చకారో దయనాభిదం || 124

ఆశ్రమే సమునీంద్రేణ కృత చూడాదికవ్రతః | జగ్రాహ సకలా విద్యా జమదగ్నే ర్మహామునేః || 125 ||

తా || తెలివిని పొంది మెల్లగా వణుకుతో కదులుతున్న తీగవంటి శరీరముగల ఆమె కలువలవంటి కన్నుల నుండి మాటిమాటికి కన్నీరు కార్చసాగింది (114) ఓనాథ! నేను మందభాగ్యురాలిని. నీవియోగంతో పీడింపబడుతున్నాను. నాకు దిక్కేది. ఎక్కడికి పోను నీముఖాన్ని ఎప్పుడు చూస్తాను. (115) అని అంటూ తనను తాను చంపుకోదలచి గజ సింహముల ముందుకు వెళ్ళింది. ఆమె సింహములతో గజములతో విడువబడింది. చావును పొందలేదు. (116) ఆపత్కాలమంది మనుష్యులకు నిజంగానే మరణము లభించదు. మిక్కిలి దీనమైన ఆమె ఆక్రందనలను తలలు పైకెత్తి విని (117) మృగములు కదలిక లేకుండా గడ్డి పోచలనుకూడా తినలేదు. అప్పుడు ఆమెను, దయగలిగిన మునిపుత్రుడు, అట్లా ఉన్నదాన్ని (118) ఏడుస్తున్న దాన్ని రాణిని తన ఆశ్రమమునకు తెచ్చి, ఆరాణిని తన గురువైన జమదగ్ని ముందుంచాడు (119) ధర్మాత్ముడైన జమదగ్ని ఆమెను సమీపమందుంచుకొని ఓదార్చాడు (119 1/2) జమదగ్ని ఇట్లనెను - నీక కృతవర్మ ఎట్లాగో నన్నుకూడా అట్లాగే అనుకో (120) ఈ రకంగా జమదగ్నితో ప్రేమతో ఓదార్చబడ్డ ఆమె అక్కడే నివసించసాగింది. మునులు గల ఆశ్రమంలో (121) తరువాత కొద్ది కాలానికి పార్వతి కుమారస్వామినివలె, ఆమె శౌర్యదైర్య గుణములు కల పుత్రుని కనెన. మృగావతి యొక్క తల్లివలెవారు చేశారు (123) మంచి జన్మగల ఆరాకుమారుని గూర్చి (నకు) ఆ శరీరవాణి ఉదయాచలంలో జన్మించాడు కనుక ఉదయనుడు అని పేరు పెట్టింది (124) ఆశ్రమంలో మునీంద్రునితో పుట్టు వెంట్రుకలు మొదలగు కర్మలు చేయబడినవాడై ఆ బాలుడు జమదగ్ని మహర్షి నుండి సకల విద్యలన స్వీకరించెను. (125).

మూ || యువానృపసుతః సోయం కదాచిన్మృగయా పరః | అపశ్యదేకం భుజగం వ్యాధేన దృఢసంయతం || 126 ||

ఉవాచ సకృపాయుక్తో వ్యాధముంచభుజంగమం | కింకరిష్యస్యనేనత్వం నైనం హింసితుమర్హసి || 127 ||

తమువాచతతో వ్యాధః సర్పేణా నేన పూరుష | ధనధాన్యాదికం లప్సే గ్రామేషు నగరేషుచ || 128 ||

అతోహం జీవికా మేనం నైవమోక్ష్యేక ధంచన | ఇత్యుక్త్వాపేటికా యాంతంబ బంధశబరాధమః || 129 ||

బద్ధమాలోక్య భుజగం శబరాయధనార్ధినే | ఆమోచయత్‌ స్వజననీ దత్తందత్వా సకంకణం || 130 ||

మోచితస్తేన సర్పోసౌనరో భూత్వాకృతాంజలిః | సఖ్యంకృత్వాస సహసాతం పాతాళం నినాయవై || 131 ||

కిన్నరా ఖ్యేననాగేన ధృతరాష్ట్రసుతేనసః | పాతాళం ప్రావిశత్తత్రన్యవ సత్‌పూజితస్సుఖం || 132 ||

ధృతరాష్ట్రస్య తనయాం భగినీం కిన్నరస్యచ | లలితాఖ్యాం గుణోపేతాం ప్రియాం భేజేనృపాత్మజః || 133 ||

సాతస్మాజ్జసయామాసపుత్రమ ప్రతిమౌజసం | తతః సా లలితా ప్రాహత్వరితో దయనం ప్రతి || 134 ||

లలితోవాచ -

అహం విద్యాధరీ పూర్వం సుకర్ణీనామ నామతః | శాపాత్‌ సర్పత్వ మాప్తాస్మి శాపాంతో గర్భ ఏషతే || 135 ||

తతో7ముంప్రతి గృహ్ణీష్వ పుత్రమప్రతిమౌజసం | తాంబూలీం స్రజమవ్లూనాం వీణాంఘోష పతీమపి || 136 ||

తథేతిప్రతి జగ్రాహ తత్సర్వం నృపనందనః | పశ్యతాం సర్వసర్పాణాం సాప్యగచ్ఛద్విహాయసం || 137 ||

తతఃసో7పి గృహీత్వాతు వీణాం మాలాంచపుత్రకం | దుఃఖితా మాత్మజననీంద్రష్టుకామస్త్వరాన్వితః || 138 ||

శ్వశురాదీననుజ్ఞాప్యం సహసాస్వాశ్రమం య¸° | జననీంశోక సంతప్తాం ఆశ్వస్తాం జమదగ్నినా || 139 ||

సమేత్యతోషయా మాసవృత్తం చాసై#్యన్య వేదయత్‌ | తదాప్ర హృష్ట హృదయా సబ భూవమృగావతీ || 140 ||

తా || యువకుడైన ఆ రాకుమారుడు ఒకసారి వేట యందాసక్తి కలవాడై వెళ్ళి, బోయవాడిచే గట్టిగా బంధింపబడ్డ ఒక సర్పాన్ని చూచాడు (126) దయగలవాడై ఇట్లా అన్నాడు, ఓ వ్యాధుడ! ఈ సర్పాన్ని వదులు. దీనితో నీవేం చేస్తావు. దీనిని హింసించొద్దు, అని (127) అప్పుడు వ్యాధుడీతనితో అన్నాడు, ఓ పుషురుడ! నేను ఈ సర్పంతో గ్రామములందు నగరములందు ధనధాన్యాదులను పొందుతాను (సంపాదిస్తాను) (128) అందువల్ల నాకు జీవికయైన దీన్ని ఎట్లాగైనా వదలను, అని అంటూ, ఆ పామును ఆబోయవాడు పెట్టెలో బంధించాడు (129) పాము బంధింపబడటం చూచి ధనమునాశించే ఆ బోయవానికి, తనతల్లి ఇచ్చిన కంకణాన్ని ఇచ్చి ఆ పామును విడిపించాడు (130) అతనితో విడిపింపబడ్డ ఆపాము మనిషిగా మారి చేతులు జోడించి, త్వరగా స్నేహంచేసి పాతాళమునకు తీసుకుపోయాడు (131) ధృతరాష్ట్రుని కొడుకైన కిన్నరుడనే నాగునిచేత పాతాళమునకు పోయి అతనితో పూజింపబడి సుఖంగా ఉన్నాడు. (132) కిన్నరుని చెల్లెలు దృతరాష్ట్రుని కూతురును గుణవంతురాలిని లలిత అను పేరుగల దానిని ప్రియురాలిగా రాకుమారుడు పొందాడు. (133) ఆమె ఈతనివల్ల గొప్ప తేజస్సుగల పుత్రుని పొందింది. పిదప లలిత ఉదయనునితో ఇట్లా అంది (134) లలిత మాటలు - నేను ఇతః పూర్వము సుకర్ణీ అనుపేరుగల విద్యాధరిని. శాపంవల్ల సర్పరూపంపొందాను. శాపాంతమే నాకీగర్భము (135) అందువల్ల ఈ పిల్లవాణ్ణి తీసుకో ఈ తేజస్సు కలవాడితోపాటు వాడని తమలపాకుల మాలను, ఘోషవతి అనే వీణను కూడా తీసుకో, అని అనగా (136) అవన్నీ రాకుమారుడు అట్లాగే అని స్వీకరించాడు. అన్ని పాములు చూస్తుండగా ఆమె ఆకాశంలోకి ఎగిరిపోయింది. (137) పిదప అతడు వీణను, మాలను పిల్లవాణ్ణి తీసుకొని, దుఃఖిస్తున్న తన తల్లిని చూడదలచి తొందరకలవాడై (138) మామమొదలగువారి ఆజ్ఞపొంది తొందరగా తన ఆశ్రమానికి వచ్చాడు. శోక తప్తురాలైన తల్లిని, జమదగ్నిచే ఓదార్చబడిన దానిని (139) చేరి సంతోషపరిచాడు. తన కథను ఆమెకు చెప్పాడు. అప్పుడు ఆమృగావతి కూడా సంతోషం కలదైంది. (140)

మూ|| ఆత్రాంతరే సశబరః కౌశాంబ్యాం వణి జంయ¸° | సహస్రానీకనామాంకం విక్రేతుం మణికంకణం || 141 ||

రాజముద్రాం సమాలోక్య కంకణ సవణిగ్వరః | శబరేణ సమంగత్వా సర్వం రాజ్ఞేన్య వేదయత్‌ || 142 ||

తతః సహస్రానీకో7యంతత్ప్రాప్యమణికంకణం | మృగావతీవిప్రయోగవిషాగ్ని పరిపీడితః || 143 ||

తద్బాహు సంగపీయూష శీకరాసారశీతలం | కంకణం హృదయేన్యస్య విలలాపసు దుఃఖితః || 144 ||

ఉవాచ చకథంలబ్దం కంకణం శబరత్వయా | సచైవయుక్తస్తత్ప్రాప్తిక్రమం తసై#్మన్యవేదయత్‌ || 145 ||

శబరస్యవచః శ్రుత్వా సహస్రానీక భూపతిః | ప్రతస్థే మంత్రిభిః సార్ధం ప్రియాలోకనకౌతుకీ || 146 ||

యత్రేం దుభాస్కరము ఖాలభంతే సహసోదయం | తమే వగిరిముద్దిశ్య సహసాసోzభ్యగచ్ఛత || 147 ||

కించిన్మార్గం సముల్లంఘ్యతస్థౌ విశ్రాంతసైనికః | తస్మిన్వినిద్రే దయితా సంగమధ్యాన తత్పరే || 148 ||

వసంతకోవిచిత్రాస్తు కథయామాసవైకథాః | తత్కథా శ్రవణ నైవ తాంరాత్రింసనినాయవై || 149 ||

తతః కాలేన కకుభం ప్రాప్య జంభారిపాలితాం | జమదగ్న్యా శ్రమంగత్వా నిర్వైర హరికుంజరం || 150 ||

తపస్యంతం మునిం దృష్ట్వాశిరసా ప్రణనామసః | ఆశీర్వాదేన సమునిః ప్రతిజగ్రాహతం నృపం || 151 ||

విధివత్‌పూజ యామాస పాద్యార్ఘ్యాచమనీయకైః | ఉవాచచమహీపాలం ధర్మార్థ సహితంవచః || 152 ||

తా || ఇంతలో ఆశబరుడు కౌశాంబిలో ఒక వ్యాపిరిని చేరాడు. సహస్రానీక అను పేరుగల మణికంకణాన్ని అమ్మ తల పెట్టాడు (141) కంకణమందు రాజముద్రను ఆవణిజుడు చూచి శబరునితోపాటు రాజుదగ్గరకు వెళ్ళి అంతా చెప్పాడు (142) ఆ పిదప సహస్రానీకుడు ఆ మణికంకణాన్ని తీసుకొని, మృగావతివి యోగమనే విషాగ్నులతో పీడింపబడుతున్నవాడు (143) ఆమె బాహువుల సమాగమమనే అమృతబిందువుల వర్షంవలె చల్లనైన ఆ కంకణాన్ని హృదయమందుంచుకొని, దుఃఖంతో ఏడ్చాడు. (144) అడిగాడు ఓశబరుడ! నీకు ఈ కంకణం ఎట్లా లభించింది అని అట్లా - అడగబడివాడు అది తనకెట్లా లభించినదో ఆతనికి చెప్పాడు (145) ఆ సహస్రానీకుడనే రాజు ఆ శబరుని మాటలువిని ప్రియురాలిని చూడాలనే కుతూహలంకలవాడై మంత్రులతో పాటు బయలుదేరాడు (146) చంద్రుడు, సూర్యుడు త్వరగా (మొదట) కన్పించే ఆ పర్వతాన్ని ఉద్దేశించి ఆ రాజు తొందరగా బయలుదేరాడు (147) కొంతదూరం వచ్చాక సైనికుల విశ్రాంతి కొరకు ఉండిపోయాడు. ప్రియురాలి సంగమధ్యానమందే ఆసక్తి కలవాడై నిద్రిస్తుండగా (148) వసంతకుడు విచిత్రమైన కథలను చెప్పసాగాడు. ఆకథలను వింటూనే ఆరాత్రిని అతడు గడిపాడు. (149) ఆతర్వాత జంభారి పాలించే దిక్కును (తూర్పు) చేరి, శత్రుత్వంలేకుండా నివసించే సింహాలు ఏనుగులు గల జమదగ్ని ఆశ్రమానికి చేరి (150) తపస్సు చేస్తున్న మునినిచూచి ఆతనికి శిరస్సుతో ప్రణామం చేశాడు. ఆశీర్వాదపూర్వకముగా ఆముని ఆరాజును స్వీకరించాడు (151) పాద్య అర్ఘ్య ఆచమనీయాలతో శాస్త్రప్రకారము పూజించి, ధర్మార్థములతోకూడిన వాక్కును ఆరాజుతో ఇట్టా అన్నాడు (152).

మూ|| నరనాధమృగావత్యాం జాతోzయంతనయస్తవ | యశోనిధిర్మహాతేజారామచంద్ర ఇవాపరః || 153 ||

భవిష్యతిదిశాంజేతా సింహసంహననోయువా | పౌత్ర ఏషమహాభాగతధా హ్యుదయనాత్మజః || 154 ||

ఇయం మృగావతీ భార్యాపాతి వ్రత్యపరాయణా | తదే తాంస్త్రీన్మ హారాజ ప్రతిగృహ్ణిష్వ మాచిరం || 155 ||

ఉక్వైవంమునినా దత్తాంస్తాన్గృ హీత్వా మహీపతిః | ప్రియాసహాయః స్వపురీం ప్రతస్థేమంత్రిభిర్వృతః || 156 ||

తతః ప్రవివ్యకౌశాంబీం నగరం సనృపోత్తమః | స్మరణ్‌శక్రస్యవచనం మానుషం జన్మకుత్పయన్‌ || 157 ||

మహీముదయనాయైన దదౌపు త్రాయథీమతే | తస్మిన్నుదయనే పుత్రేరాజ్యపాలన దక్షిణ || 158 ||

రాజ్యం భారం వినిక్షిప్యసశాపవినివృతమే | వసంతకఋమణ్వద్భ్యాం మృగావత్యాచ భార్యయా || 159 ||

¸°గంధరాయణనాపి మంత్రిపుత్రేణ సంయుతః | చక్రతీర్ధేమహాపుణ్య దక్షిణ స్యోదదేస్తటే || 160 ||

స్నానం కర్తుంయ¸°తూర్ణం సర్వతీర్థోత్తమోత్తమే | వాహనైర్వాతరంహోభిః అచిరాల్లవణోదధిం || 161 ||

సంప్రాప్యచక్రతీర్థంచ స్నానం చక్రుః యథావిధి | తేషుచస్నాతమాత్రేషు చక్రతీర్థేనృపాదిషు || 162 ||

వినష్టం తత్‌క్షణాదేవమానుష్యమతికుత్సికం | తతోవిథూత పాపాసై స్వంరూపం ప్రతిపేదిరే || 163 ||

దివ్యాంబర ధరాః సర్వే దివ్యమాల్యానులే పనాః | విమానాని మహార్హాణి సమారుహ్యవిభూషితః || 164 ||

తత్తీర్థం బహుమన్వానాః స్వశాపచ్ఛేదకారణం | పశ్యతాం సర్వలోకానాం స్వర్గలోకం యయుస్తదా || 165 ||

తదాప్రభృతితే సర్వేజ్ఞాత్వాతత్తీర్థవైభవం | పావనే చక్రతీర్థే7స్మిన్‌ స్నానంకుర్వంతి సర్వదా || 166 ||

ఏవం ప్రభావం తత్తీర్థంయే సమాగత్యమానవాః | స్నానం సకృచ్చకుర్వంతితే సర్వే స్వర్గవాసినః || 167 ||

ఏవం వఃకథితం విప్రాః విధూమ చరితం మహత్‌ | యఃపఠేదిమ మధ్యాయం శృణుయాద్వాసమాహితః || 168 ||

యం యం కామయతే కామంతత్సర్వం శీఘ్ర మాప్నుయాత్‌ || 168 1/2 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతు మాహాత్మ్యే చక్రతీర్థ ప్రశంసాయాం అలంబుసా విధూమశాపవిమోచనం నామ పంచమోzధ్యాయః.

తా || ఓ మహారాజ ! మృగావతి యందు ఈ రాకుమారుడు నీకు కలిగాడు. కీర్తినిధి, తేజస్సంపన్నుడు, మరో రామచంద్రుడు (153) దిక్కులను జయిస్తాడు. సింహాన్ని చంపేశక్తిగల యువకుడు. ఈతడు పౌత్రుడు. ఉదయనుని కుమారుడు (154) ఈమె మృగావతినీ భార్య పాతి వ్రత్యము కలది. ఈ ముగ్గురుని త్వరగా స్వీకరించు ఓ మహారాజ! (155) అని చెప్పిముని ఇచ్చిన, వారిని స్వీకరించి, మహారాజు ప్రియురాలు తోడుగా గలవాడై మంత్రులతో కూడి తన నగరానికి బయలుదేరాడు (156) ఆరాజు కౌశాంబీనగరం ప్రవేశించి ఇంద్రుని వచనాన్ని స్మరిస్తూ మనుష్య జన్మను అసహ్యించుకొని (157) బుద్ధిమంతుడైన తన పుత్రునకు రాజ్యమప్పగించాడు. రాజ్యపాలన సమర్థుడైన తన పుత్రుడైన ఉదయనుని యందు (158) రాజ్యభారాన్ని ఉంచి ఆతడు శాపనివృత్తి కొరకు వసంతక ఋషుణ్వంతులతో మృగావతి యనుభార్యతో (159) మంత్రి పుత్రుడైన ¸°ంగధరాయణునితోకూడా కలిసి దక్షిణ సముద్ర తటంలోని పుణ్యప్రదమైన చక్రతీర్థంలో (160) సర్వతీర్థములలో ఉత్తమోత్తమైన దానిలో స్నానం చేయుటు త్వరగా బయలుదేరాడు. వాయువేగం గలిగిన వాహనములపై త్వరలో ఉప్పు సముద్రాన్ని చేరాడు. (161) చక్రతీర్థముచేరి శాస్త్ర ప్రకారము స్నానము చేశాడు. వారు రాజు మొదలగువారు చక్రతీర్థంలో స్నానం చేసినంత మాత్రముననే (162) వెంటనే అతికుత్సితమైన మనుష్య రూపము నశించింది. ఆ పిదప సమస్త పాపములు పోయి వారు తమతమ రూపములు పొందారు (163) అందరు దేవ వస్త్రములు ధరించి, దివ్యమైన మాలలు, అను లేపనములు కలిగి, అలంకరింపబడి, యోగ్యమైన విమానములనెక్కి (164) తమ శాపం పోవటానికి కారణమైన ఆతీర్థమును ఉత్తమమైనదిగా భావిస్తూ, అన్నిలోకములవారు చూస్తుండగా స్వర్గలోకమునకు వెళ్ళిరి. (165) అప్పటి నుండి అందరు ఆ తీర్థ వైభవాన్ని తెలుసుకొని ఈ పవిత్రమైన చక్రతీర్థములో ఎప్పుడూ స్నానం చేస్తున్నారు (166) ఇట్టి ప్రభావముగల ఆ తీర్థమునకు వచ్చి ఒక్కసారి స్నానము చేసిన మానవులు అందరు స్వర్గవాసులౌతారు (167) ఈ విధముగా గొప్పనైన విధూముని చరిత్రను మీకు చెప్పాను ఓ బ్రాహ్మణులారా! ఈ అధ్యాయాన్ని చదివినవారు, శ్రద్ధగా విన్నవారు కోరిన కోరికలన్ని తొందరగా పొందుతారు. (168) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది ఒక్కవేల సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు చక్రతీర్థ ప్రశంసయందు అలంబుస విధూముల శాపవిమోచనమనునది ఐదవ అధ్యాయము సమాప్తము.

Sri Scanda Mahapuranamu-3    Chapters