Sri Scanda Mahapuranamu-3    Chapters   

నలుబది నాల్గవ అధ్యాయము

మూ || ఋషయ ఊచుః -

సర్వవే దార్థతత్వజ్ఞ పురాణార్ణవపారగ | వ్యాస పాదాంబుజ ద్వంద్వ నమస్కార హృతాశుభ || 1 ||

పురాణార్థోపదేశేన సర్వప్రాణ్యుపకారక | త్వయాహ్యనుగృహీతాఃస్మ పురాణకథ నాద్వయం || 2 ||

అధునాసేతుమాహాత్మ్య కథనాత్సుతరాం మునే | వయంకృతార్థాః సంజాతాః వ్యాసశిష్యమహామతే || 3 ||

యథాప్రాతిష్ఠి పల్లింగం రామోదశరథాత్మజః | తచ్ఛ్రోతుం పయమిచ్ఛామః త్వమిదానీం వదస్వనః || 4 ||

శ్రీ సూత ఉవాచ -

యదర్థం స్థాపితం లింగం గంధమాదన పర్వతే | రామచంద్రేణ విప్రేంద్ర తదిదానీం బ్రవీమి-వః || 5 ||

హృతభార్యోపనాద్రామో రావణన బలీయసా | కపిసేనాయుతో ధీరః ససౌమిత్రి ర్మహాబలః || 6 ||

మహేంద్రం గిరిమాసాద్యప్యలోకయతావిరిధిం | తస్మిన్నపారేజలధౌకృత్వాసేతుం రఘూద్వహః || 7 ||

తేనగత్వాపురీం లంకాం రావనణనాభిరక్షితాం | అస్తంగతే సహస్రాంశౌ పౌర్ణమాస్యాం నిశాముఖే || 8 ||

రామః ససైనికో విప్రాః సువేల గిరిమారుహత్‌ | తతః సౌధస్థితం రాత్రౌ దృష్ట్వాలంకేశ్వరం బలీ || 9 ||

సూర్యపుత్రోస్య ముకుటం పాతయామాసభూతలే | రాక్షసోభగ్నముకుటః ప్రవిశేశగృహోదరం || 10 ||

గృహం ప్రవిష్టేలంకేశేరామః సుగ్రీవసంయుతః | సానుజః సేనయాసార్ధమవరుహ్య గిరేస్తటాత్‌ || 11 ||

సేనాంస్యవేశయద్వీరో రామోలంకాసమీపతః | తతోనివేశయానాంస్తాన్వానరాన్రావణానుగాః || 12 ||

అభిజగ్ముర్మహాకాయాః సాయుధాః సహసైనికాః | పర్వణః పూతనోజృంభః ఖరః క్రోధవశోహరిః || 13 ||

ప్రారుజశ్చారు జశ్చైవ ప్రహస్తశ్చేతరేతథా | తతోభి పతతాంతేషామదృశ్యానాం దురాత్మనాం || 14 ||

అస్తర్థాన వధంతత్ర చకారస్మ విభీషణః | తే దృశ్య మానాబలిభిః హరిభిర్దూర పాతిభిః || 15 ||

నిహతాః సర్వతశ్చైతే న్యపతన్వైగతాసవః | అమృష్యమాణః సబలోరావణోనిర్యయావధ || 16 ||

తా || ఋషులిట్లనిరి - సర్వవేదార్థ తత్వము నెరిగిన వాడ! పురాణ సముద్రము నీది దరిజేరినవాడ ! వ్యాసుని అంబుజముల వంటి పాద ద్వంద్వములను నమస్కరించుటచే తొలగిన అశుభములు కలవాడ ! (1) పురాణార్థమును ఉపదేశించుటద్వారా సర్వ ప్రాణులకు ఉపకార మాచరించేవాడ ! నీవు పురాణములను చెప్పటం వలన మేము నీతో అనుగ్రహింపబడినాము (2) ఓ ముని! ఇప్పుడే సేతు మాహాత్మ్యమును చెప్పటం వలన మిక్కిలిగా మేము కృతార్థులమైనాము ఓ వ్యాస శిష్య ! మహామతి ! (3) దశరథాత్మజుడైన రాముడు లింగమును స్థాపించిన వృత్తాంతాన్ని మేము వినుటకు ఇష్టపడుతున్నాము. నీవిప్పుడు మాకు చెప్పు (4) అని అనగా శ్రీ సూతులిట్లనిరి - గంధమాదన పర్వతమందు లింగమును రామచంద్రుడెందుకు స్థాపించాడో ఓ విప్రులార ! నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను (5) వనంలో బలవంతుడైన రావణుడు రాముని భార్య నెత్తుకుపోగా ధీరుడైన రాముడు వానర సైన్యంతో సౌమిత్రితో కూడి మహాబలుడైన రాముడు (6) మహేంద్రగిరికి చేరి సముద్రాన్ని చూచాడు. ఆ అపారమైన సముద్ర మందు రాముడు సేతువును నిర్మించి (7) దాని ద్వారా రావణుడు రక్షించే లంకానగరమునకు వెళ్ళి, సూర్యుడస్తమించాక పౌర్ణమినాటి సాయం సమయమందు (8) రాముడు సైన్యంతో పాటు సువేల గిరిని అధిరోహించాడు. పిదప బలవంతుడైన సుగ్రీవుడు రాత్రియందు సౌధమందున్న లంకేశ్వరుని చూచి (9) ఆతని ముకుటమును భూమిపై పడవేశాడు. ఆ రాక్షసుడు ముకుటం భగ్నంకాగ గృహమధ్య భాగంలోకి వెళ్ళాడు (10) లంకేశుడు గృహంలో ప్రవేశించాక రాముడు సుగ్రీవునితో కూడి, తమ్మునితో కూడి సేనతో పాటు గిరితటము నుండి క్రిందకిదిగి (11) వీరుడు రాముడు లంక సమీపంలో సేనను నిలిపాడు. పిదప లంకను ప్రవేశిస్తున్న ఆ వానరులను రావణానుచరులు (12) మహాకాయులు సైనికులతో కూడి, ఆయుధాలు ధరించి అనుసరించారు. పర్వణుడు, పూతనుడు, జృంభుడు, ఖరుడు, క్రోధవశుడు హరి (13) ప్రారుజ చారుజులు, ప్రహస్తుడు అట్లాగే ఇతరులు వచ్చారు కనిపించకుండా పడుతున్న ఆ దురాత్ముల (14) అంతర్థాన వధను విభీషణుడు చేయనారంభించాడు. దూరంగా పడుతున్న బలవంతులైన వానరులు ఆ రాక్షసులను చూడగా (15) వారు ఆ రాక్షసులను చంపి ప్రాణం తీసి పారవేస్తున్నారు. దీనిని సహించలేని రావణుడు బలంతోకూడి బయలు దేరాడు (16).

మూ || వ్యూహ్యతా న్వానరన్సర్వాన్‌ న్యవారయతసాయకౌః | రాఘవస్త్వథనిర్యాయ ప్యూఢానీకోదశాసనం || 17 ||

ప్రత్యయుథ్‌యతవేగేన ద్వంద్వ యుద్ధమభూత్తదా | యుయుధే లక్ష్మణ నాథ ఇంద్ర జిద్రావణాత్మజః || 18 ||

విరూపాక్షేణ సుగ్రీవస్తారే యేణాపి ఖర్వటః | పౌండ్రేణచ నలస్తత్ర పుటేశః పనసేనచ || 19 ||

అన్యేపికపయోవీరా రాక్షసైసౌర్ద్వంద్వ మేత్యతు | చక్రుర్యుద్ధం సతుములంభీరూణాం భయవర్ధనం || 20 ||

అథరక్షాంసిభిన్నాని వానరైర్భీమవిక్రమైః | ప్రదుద్రుపూరణా దాశులంకాం రావణ పాలితాం || 21 ||

భ##గ్నేషుసర్వసైన్యేషు రావణ ప్రేరితేనవై | పుత్రేణంద్రజితాయుద్ధేనాగాసై#్త్రరతిదారుణౖః || 22 ||

విద్ధౌ దాశరధీ విప్రా ఉభౌతౌ రామలక్ష్మణౌ | మోచితౌ వైనతే యేన గరడేన మహాత్మనా || 23 ||

తత్రప్రహస్తస్తరసా సమభ్యేత్య విభీషణం | గదయా తాడయా మాసవినద్య రణ కర్కశః || 24 ||

సతయాభిహతోధీమాన్గదయా భీమవేగయా | నాకం పతమహాబాహుః హిమవాని వసుస్థితః || 25 ||

తతః ప్రగృహ్య విపులామష్టఘంటాం విభీషణః అభిమంత్ర్యమహాశక్తించిక్షేపాస్యశిరః ప్రతి || 26 ||

పతంత్యాసతయావేగా ద్రాక్షసోశనినా యథా | హృతోత్తమాం గోదదృశే వాతరుగ్ణఇవ ద్రుమః || 27 ||

తందృష్ట్వానిహతం సంఖ్యే ప్రహస్తం క్షణదాచరం | అభిదుద్రావ ధూమ్రాక్షో వేగేన మహాతాకపీన్‌ || 28 ||

కపిసైన్యం సమాలోక్య విద్రుతం పవనాత్మజః | ధూమ్రాక్ష మాజఘానాశు శ##రేణ రణ మూర్థని || 29 ||

ధూమ్రాక్షం నిహతం దృష్ట్వా హతశేషానిశాచరాః | సర్వంరాజ్ఞే యథావృత్తం రావణాయస్యవేదయన్‌ || 30 ||

తతః శయానంలంకేశః కుంభకర్ణమ బోధయత్‌ | ప్రబుద్ధం ప్రేషయామాస యుద్ధాయ సచరావణః || 31 ||

ఆగతం కుంభకర్ణంతం బ్రహ్మాస్త్రేణతు లక్ష్మణః | జఘాన సమరేక్రుద్ధో గతాసుర్న్య పతచ్చసః || 32 ||

తా || ఆ వానరులందరిని చుట్టుముట్టి బాణములతో వారించాడు రావణుడు. పిదప రాముడు సైన్యాన్ని వ్యూహంగా ఏర్పరచి రావణునితో (17) యుద్ధం చేశాడు. అప్పుడు వారిద్దరికి వేగంగా ద్వంద్వం యుద్ధమైంది. లక్ష్మణునితో రావణుని కుమారుడు ఇంద్రజిత్తుయుద్ధంచేశాడు (18) విరూపాక్షునితోసుగ్రీవుడుఅంగదునితో ఖర్వటుడు, పౌండ్రునితో నలుడు, పనసునితో పుటేశుడు (19) ఇతర వానర వీరులు రాక్షసులతో ద్వంద్వంగా ఏర్పడి భయంకరమైన యుద్ధము చేశారు. అది భీరువులకు భయాన్ని కల్గించేది (20) భీమవిక్రములైన వానరులతో భేదింపబడ్డ రాక్షసులు యుద్ధం నుండి రావణుడు పాలించే లంకకు త్వరగా పరుగెత్తారు (21) సర్వసైన్యము భగ్నము కాగా రావణ ప్రేరితుడైన, కొడుకైన ఇంద్రజిత్తు యుద్ధంలో అతి దారుణమైన నాగాస్త్రములతో (22) దాశరథులైన ఆ ఇద్దరు రామలక్ష్మణులను కొట్టగా, వారు మహాత్ముడైన వైనతేయుడైన గరుడునితో విడిపింపబడ్డారు (23) అక్కడ ప్రహస్తుడు త్వరగా వచ్చి విభీషణుని గదతో కొట్టాడు. రణ కర్కశంగా గర్జించాడు (24) భయంకర వేగము గల గదతో కొట్టబడిన ఆ బుద్ధిమంతుడు, మహాబాహుడు చలించలేదు. హిమంవతుని వలె స్థిరంగా ఉన్నాడు (25) ఆ పిదప విపులమైన అష్టఘంటను విభీషణుడు ధరించి, మహాశక్తిని అభిమంత్రించి ఈతని తలపై విసిరాడు (26) పిడుగులాగ పడుతున్న ఆ శక్తి వేగం వల్ల రాక్షసుడు వాతరోగం వచ్చిన చెట్టువలె తలలేని వాడై కనిపించాడు (27) యుద్ధంలో చంపబడ్డ ప్రహస్తుడను ఆ రాక్షసుని చూచి, ధూమ్రాక్షుడు గొప్ప వేగంతో వానరులను వెంబడించాడు (28) పరుగెత్తుతున్న వానరసైన్యాన్ని చూచి ఆంజనేయుడు బాణంతో రణరంగంలో త్వరగా ధూమ్రాక్షుని కొట్టాడు (29) ధూమ్రాక్షుడు చావటం చూశాక చావగా మిగిలిన రాక్షసులు జరిగినదంతా రాజైన రావణునకు నివేదించారు. (30) ఆపిదప రావణుడు నిద్రిస్తున్న కుంభకర్ణుని లేపాడు. ఆ రావణుడు లేచిన అతనిని యుద్ధమునకు పంపాడు (31) వచ్చిన కుంభకర్ణుని లక్ష్మణుడు బ్రహ్మాస్త్రంతో, కోపంతో సమరంలో కొట్టాడు. ఆతడు ప్రాణములు పోయి భూమిపై పడ్డాడు (32)

మూ || దూషణ స్యానుజా తత్ర వజ్ర వేగప్రమాధినౌ | హనుమన్నీల నిహతౌ రావణ ప్రతిమౌరణ || 33 ||

వజ్రదంస్త్రం సమవధీద్విశ్వకర్మసుతో సలః | అకంపనం చన్యహన త్కుముదోవాసరర్షభః || 34 ||

షష్ఠ్యాం పరాజితోరాజాప్రావిశచ్చపురీం తతః | అతికామోలక్ష్మణన హతిశ్చత్రిశిరాస్తథా || 35 ||

సుగ్రీవేణ హఠౌయుద్ధే దేవాంతకనరాంతకౌ | హనూమతాహతౌ యుద్ధే కుంభకర్ణ సుతావుభౌ || 36 ||

విభీషణన నిహతో మకరాక్షః ఖరాత్మజః | తతింద్రజితంపుత్రం చోదయామానరావణః || 37 ||

ఇంద్రజిన్మోహయిత్వాతౌ భ్రాతరౌరామలక్ష్మణౌ | ఘోరైఃశ##రైరంగదేన హతవాహోదివిస్థితః || 38 ||

కుముదాంగద సుగ్రీవనలజాంబవదాదిభిః | సహితావానరాః సర్వేన్యపతంస్తేనఘాతితాః || 39 ||

ఏవం నిహత్యసమరేససైన్యౌ రామలక్ష్మణౌ | అంతర్దధేతదావ్యోమ్ని మేఘనాదో మహాబలః || 40 ||

తతోవిభీషణో రామ మిక్ష్వాకుకులభూషణం | ఉవాచ ప్రాంజలిర్వాక్యం ప్రణమ్యచపునః పునః || 41 ||

అయమంభోగృహీత్వాతు రాజరాజస్య శాసనాత్‌ | గుహ్యకోభ్యాగతో రామత్వత్సకాశమరిందమ || 42 ||

ఇదమం భః కుబేరస్తే మహారాజప్రయచ్ఛతి | అంతర్హితానాం భూతానాందర్శనార్థం పరంతప || 43 ||

అనేన స్పష్టనయనోభూతాన్యంతర్హితాస్యపి | భవాన్‌ ద్రక్ష్యతి యసై#్మవా భవానేతత్ర్పదాస్యతి || 44 ||

సోపి ద్రక్ష్యతి భూతాని వియత్యం తర్హితానివై | తథేతి రామస్తద్వారి ప్రతిగృహ్యాథసత్కృతం || 45 ||

చకారనేత్రయోః శౌచం లక్ష్మణశ్చ మహాబలః | సుగ్రీవ జాంబవంతౌచ హనుమానం గదస్తథా || 46 ||

మైందద్వివిద నీలాశ్చయేచాన్యే వానరాస్తథా | తే సర్వే రామదత్తేన వారిణా శుద్ధచక్షుశః || 47 ||

ఆకాశేంతర్హితం వీరమ పశ్యన్రావణాత్మజం | అతస్తమభిదుద్రావ సౌమిత్రిర్‌ దృష్టిగోచరం|| 48 ||

తతోజఘాన సంక్రుద్ధో లక్ష్మణః కృతలక్షణః | కుబేర ప్రేషిత జలైః పవిత్రీకృతలోచనః || 49 ||

తతః సమభవద్యుద్ధః లక్ష్మణంద్ర జితోర్మహత్‌ | అతీవచిత్రమాశ్చర్యం శక్రప్రహ్లాదయోరివ || 50 ||

తతః తృతీయదివసేయత్నేన మహతాద్విజాః | ఇంద్రజిన్నిహతోయుద్ధేలక్ష్మణన బలీయసా || 51 ||

తా || దూషణుని అనుజులు వజ్రవేగ ప్రమాథులు రావణ ప్రతిములు రణమందు హనుమన్నీలులచే చంపబడ్డారు. (33) విశ్వకర్మ సుతుడు నలుడు వజ్రదంష్ట్రుని చంపాడు. కుముదుడను వానరశ్రేష్ఠుడు అకంపనుని చంపాడు (34) యుద్ధమందు పరాజితుడైన రాజు తరువాత తన నగరిలో ప్రవేశించాడు. అతికాయుడు త్రిశిరుడు ఇద్దరు లక్ష్మణుని చేత హతులైనారు (35) దేవాంతకనరాంతకులు సుగ్రీవునితో చంపబడ్డారు యుద్ధంలో, కుంభకర్ణునికుమారులిద్దరు హనుమంతునితో యుద్ధంలో చంపబడ్డారు (36) ఖరుని కొడుకు మకరాక్షుడు విభీషణునితో చంపబడ్డాడు. పిదప రావణుడు ఇంద్రజితుడను కుమారుని పంపాడు (37) ఇంద్రజిత్తు ఘోరమైన బాణములతో అన్నదమ్ములైన రామలక్ష్మణులను మోహింపజేయగా, అంగదుడు గుఱ్ఱములను చంపగా ఆకసమందున్నాడు (38) కుముద అంగద సుగ్రీవ నలజాంబవదాదులు వీరితో కూడిన ఇతర వానరులందరు ఆతనితో కొట్టబడి పడిపోయారు (39) ఈ విధముగా సైన్యంతో కూడిన రామలక్ష్మణులను యుద్ధంలో హింసించి మహాబలుడైన మేఘనాదుడు ఆకాశంలో అంతర్ధానమై నాడు (40) పిదప ఇక్ష్వాకుకుల భూషణుడైన రామునితో విభీషణుడు చేతులు జోడించి మాటిమాటికి నమస్కరిస్తూ ఇట్లా అన్నాడు (41) రాజ రాజు యొక్క(కుబేరుని) శాసనంతో ఈ గుహ్యకుడు నీటిని తీసుకొని అరిందముడవైన రామ! నీ దగ్గరకు వచ్చాడు (42) ఓ మహారాజ! ఈ నీటిని కుబేరుడు నీకు పంపిస్తున్నాడు. ఓ పరంతప ! దాగిన (కనిపించని) ప్రాణులను చూచుటకు ఇది ఉపయోగిస్తుంది. (43) ఈ నీటిని కళ్ళకు రాసుకుంటే దాగిన ప్రాణులను కూడా నీవు చూడగలుగుతావు. దీనిని నీవు ఎవరికైనా ఇచ్చినచో(44) ఆతడు కూడా ఆకాశంలో కనిపించకుండా ఉన్న ప్రాణులను చూడగలడు. అని రాముడు అట్లాగే అని పలికి గౌరవంగా ఆ నీటిని తీసుకొని (45) నేత్రములను శుచిగా చేసుకున్నాడు. మహాబలుడు లక్ష్మణుడు కూడా అట్లాగే చేశాడు. సుగ్రీవ జాంబవంతులు హనుమాన్‌ అంగదులు (46) మైందద్వివిదనీలులు ఇతరులైన వానరులు, అందరు రాముడిచ్చిన నీటితో కనులను శుభ్రపరచుకొని (47) ఆకాశంలో అంతర్హితుడుగా ఉన్న వీరుడైన రావణుని కుమారుని చూచారు. పిదప దృష్టిగోచరుడైన ఆతనిని లక్ష్మనుడు వెంటనంటాడు (48) మంచి లక్షణము గల (లక్ష్యము) లక్ష్మణుడు, కుబేరుడు పంపిన జలముతో కళ్ళను పరిశుద్ధిచేసుకొని, కోపంతో కొట్టినాడు (49) అప్పుడు లక్ష్మణ ఇంద్రజిత్తులకు గొప్ప యుద్ధం జరిగింది. శక్రప్రహ్లాదులకు వలె మిక్కిలి చిత్రమైన ఆశ్చర్యకరమైన యుద్ధమది (50) ఓ బ్రాహ్మణులార ! పిదప మూడవరోజున గొప్ప ప్రయత్నంతో బలవంతుడైన లక్ష్మణుడు యుద్ధంలో ఇంద్రజిత్తును చంపాడు (51)

మూ || తతో మూలబలం సర్వంహతం రామేణ ధీమతా | అథక్రుద్ధో దశగ్రీవః ప్రియపుత్రే నిపాతితే || 52 ||

నిర్య¸°రథమాస్థాయ నగరాద్బహుసైనికః | రావణోజానకీం హంతుం ఉద్యుక్తో వింధ్యవారితః || 53 ||

తతోహర్యశ్వయుక్తేన రథేనాదిత్య వర్చసా | ఉపతస్థేరణ రామం మాతలిః శక్రసారధిః || 54 ||

ఐంద్రం రథం సమారుహ్య రామోధర్మ భృతాంపరః శిరాంసిరాక్షసేంద్రస్య బ్రహ్మాస్త్రేణా వధీద్రణ || 55 ||

తతోహతదశ గ్రీవం రామం దశరథాత్మజం | ఆశీర్భిర్జయయుక్తాభిర్దేవాః నర్షిపురోగమాః || 56 ||

తుష్టువుః పరిసంతుష్టాః సిద్ధ విద్యాధరా స్తథా | రామం కమల పత్రాక్షం పుష్పవర్షైర వాకిరన్‌ || 57 ||

రామసైః సురసంఘాతైః సహితః సైనికైర్వృతః | సీతాసౌమిత్రి సహితః సమారుహ్యచ పుష్పకం || 58 ||

తథాభిషిచ్య రాజానం లంకాయాంచ విభీషణం | కపిసేనావృతోరామోగంధమాదనమన్వగాత్‌ || 59 ||

పరిశోధ్యచవై దేహీం గంధమాదన పర్వతే | రామంకమల పcతాక్షం స్థితవానరసం వృతం || 60 ||

హతలంకేశ్వరం వీరంసానుజం సవిభీషణం | సభార్యం దేవ వృందైశ్చ సేవితం మునిపుంగవైః || 61 ||

మునయోభ్యాగతా ద్రష్టుం దండకారణ్యవాసినః | అగస్త్యంతే పురస్కృత్య తుష్టువుర్మైధిలీపతిం || 62 ||

తా || ధీమంతుడైన రాముడు మూలబలాన్నంతా చంపాడు. ప్రియపుత్రుడు చనిపోయాక కోపగించిన రావణుడు (52) అనేకమంది సైన్యంతో కూడి రథమధిరోహించి నగరం నుండి బయటికి వచ్చాడు, రావణుడు సీతను చంపుటకు సిద్ధముకాగా వింధ్యనివారించింది (53) పిదప సూర్యునిలా వెలిగిపోతున్న ఇంద్రాశ్వములతో కూడిన రథంతో ఇంద్రసారధి మాతలి యుద్ధంలో రాముని ఎదుట నిలిచాడు (54) ధర్మభృతులలో శ్రేష్ఠుడైన రాముడు ఇంద్రరథాన్ని అధిరోహించి బ్రహ్మాస్త్రంతో యుద్ధంలో రావణుని శిరస్సులను సంహరించాడు. (55) పిదప దశగ్రీవునిచంపినదశరథకుమారుడైనరాముని దేవతలు ఋషులుమొదలగువారుజయధ్వానములతోకూడిన ఆశీస్సులతోస్తుతించారు. (56) అట్లాగేసిద్ధవిద్యాధరులు సంతోషించిస్తుతించారు కమలపత్రములవంటికన్నులు గలరామునిపైపూలవాననువెదజల్లారు. (57) రాముడుదేవతలతో కూడిసైనికులతో చుట్టబడి, సీతా సౌమిత్రులతో కూడిపుష్పకవిమానమునెక్కి (58) లంకలోవిభీషణునిరాజుగా అభిషేకించి, వానరసైన్యంతోకూడిరాముడు గంధమాదనమునకువెళ్ళాడు (59) గంధమాదనపర్యతమందుసీతను పరిశుద్ధిచేసి ఉన్న కమలపత్రములవంటి కన్నులు గల రామునివానరులతోచుట్టబడినవానిని (60) లంకేశ్వరునిచంపినవీరునితమ్మునితో, విభీషణునితోకూడిఉన్నవానిని భార్యతో, దేవబృందములతోమునిపుంగవులతోసేవించ బడుతున్న (61) రాముని చూచుటకు దండకారణ్యమందుండే మునులు వచ్చారు. అగస్త్యుని పురస్కరించుకొనిరామునివారుస్తుతించారు (62)

మూ || నమస్తేరామచంద్రాయలోకానుగ్రహకారిణ | అరావణంజగత్కర్తుంఅవతీర్ణాయభూతలే || 63 ||

తాటకాదేహసంహర్త్రేగాధిజాధ్వజరక్షిణ | నమస్తేజితమారీచనుబాహుప్రాణహారిణ || 64 ||

అహాల్యాముక్తిసందాయిపాదపంకజరేణవే | నమస్తేహరకోదండలీలాభంజనకారిణ || 65 ||

నమస్తేమైథిలీపాణిగ్రహణోత్సవశాలినే | నమస్తేరేణుకాపుత్రపరాజయవిధాయినే || 66 ||

సహలక్ష్మణసీతాభ్యాంకెకైయ్యాస్తుపరద్వయాత్‌ | సత్యంపితృపచఃకర్తుంనమోవనముపేయుషే || 67 ||

భరతప్రార్థనాదత్తపాదుకాయుగలాయుతే | నమస్తే శరభంగస్య స్వర్గ ప్రాప్త్యేకహేతవే || 68 ||

నమో విరాధ సంహర్త్రే గృధ్రరాజ సఖాయతే | మాయామృగమహాక్రూర మారీచాంగవిదారిణ || 69 ||

సీతాపహారిలోకేశ యుద్ధత్యక్తకలేవరం | జటాయుషంతు సందహ్య తత్కైవల్య ప్రదాయినే || 70 ||

నమఃకబంధసంహర్త్రే శబరీ పూజితాంఘ్రయే | ప్రాప్త సుగ్రీవ సఖ్యాయ కృతవాలి పధాయతే || 71 ||

నమః కృతపతే సేతుం సముద్రే వరుణాలయే | సర్వరాక్షస సంహర్త్రే రావణ ప్రాణ హారిణ || 72 ||

సంసారాంబుధి సంతార పోతపాదాంబుజాయతే | నమోభక్తార్తిసంహార్త్రే సచ్చిదానంద రూపిణ || 73 ||

నమస్తేరామ భద్రాయజ గతామృద్ధిహేతవే | రామాది పుణ్యనామానిజపతాం పాపహారిణ || 74 ||

నమస్తే సర్వలోకానాం సృష్టిస్థిత్యంతకారిణ | నమస్తే కరుణామూర్తే భక్తరక్షణ దీక్షిత || 75 ||

ససీతాయనమస్తుభ్యం విభీషణ సుఖప్రద | లంకేశ్వర వధాద్రామ పాలితం హి జగత్త్వయా || 76 ||

రక్షరక్ష జగన్నాధ పాహ్యస్మాన్‌ జానకీ పతే | స్తుత్వైవం మునయః సర్వే తూక్ష్‌ణీంతస్థుర్ద్విజోత్తమాః || 77 ||

శ్రీ సూత ఉవాచ -

య ఇదంరామచంద్రస్య స్తోత్రం మునిభిఠీరితం | త్రిసంధ్యం పఠతేభక్త్యా భుక్తిం ముక్తించవిందతి || 78 ||

ప్రయాణకాలేపఠతో నభీతిరువజాయతే | ఏతత్‌ స్తోత్రస్య పఠనాత్‌ భూతవేతాలకాదయః || 79 ||

నశ్యంతి రోగానశ్యంతి నశ్యతే పాప సంచయః | పుత్రకామోలభేత్పుత్రం కన్యావిందతి సత్పతిం || 80 ||

మోక్షకామోలభేన్మోక్షం ధనకామోధనం లభేత్‌ | సర్వాన్కామాన వాప్నోతి పఠన్‌ భక్త్యాత్విమంస్తవం || 81 ||

తా || మునులు ఇట్లా అన్నారు - లోకములను అనుగ్రహించే రామచంద్ర నమస్కారము. లోకంలో రావణుడు లేకుండా చేయటం కోసం భూమియందవతరించిన (63) తాటకి దేహమును సంహరించి గాధిజుని యజ్ఞమును రక్షించిన సుబాహుప్రాణమును హరించి, మారీచుని జయించిన రామనీకు నమస్కారము (64) అహల్యకు ముక్తినివ్వ గలిగిన, పంకజముల వంటి పాదములందలి రేణువులు గలవాడ! శివధనుస్సును అవలీలగా విరువగలవాడ! నీకు నమస్కారము(65) సీతను పాణిగ్రహణము చేసుకోగల శక్తిగలవాడ, నమస్సులు, రేణుకాపుత్రుని ఓడించినవాడ, నమస్సులు (66) కైకేయి యొక్క రెండు వరముల వలన లక్ష్మణ సీతలతో కూడి, తండ్రి మాటను నిజం చేసే కొరకు అరణ్యము చేరిన వాడ, నమస్సులు (67) భరతుని ప్రార్థననుసరించి నీ రెండు పాదుకలను ఆతనికిచ్చిన వాడ, శరభంగుని స్వర్గప్రాప్తికి కారణమైన వాడ నమస్కారము (58) విరాధుని సంహరించినవాడ, గృధ్రరాజునకు సఖుడవైన వాడ నమస్కారము. మాయా మృగరూపంలో నున్న మహా క్రూరుడైన మారీచుని శరీరమును ఛేదించినవాడ (69) సీతను అపహరించే లోకేశుడైన రావణునితో యుద్ధంలో శరీరమును వదలిన జటాయువును దహించి, ఆతనికి కైవల్యమునిచ్చిన వాడ (70) కబంధుని సంహరించినవాడ, శబరితో పూజింపబడిన పాదములు గలవాడ నమస్కారము సుగ్రీవునితో సఖ్యమును పొందినవాడ, వాలిని వదించినవాడ నీకు నమస్కారము (71) వరుణాలయమైన సముద్రమందు సేతువును నిర్మించినవాడ, రాక్షసులందరిని సంహరించినవాడ, రావణుని ప్రాణమును హరించినవాడ (72) సంసార సముద్రమును దాటుటకు నావయైన పాదాంబుజములు గలవాడ నీకు నమస్కారము. భక్తుల ఆర్తిని తొలగించే సచ్చిదానంద రూపుడవైన నీకు నమస్కారము. (73) రామభద్రునకు నీకు నమస్కారము. జగత్తు యొక్క అభివృద్ధికి కారణమైన రామ నమస్సులు. రామాది పుణ్యనామములు జపించేవారి పాపముల హరించేవాడ (74) సర్వలోకముల సృష్టి స్థితి అంతములను చేసేవాడ నీకు నమస్కారము. కరుణామూర్తి. భక్తుల రక్షణలో దీక్షవహించినవాడ నమస్సులు (75) విభీషనునకు సుఖమిచ్చిన వాడ, సీతతో కూడిన నీకు నమస్కారము. రావణుని చూపి ఓ రామ! నీవు ఈ జగత్తును రక్షించావు. (76) జగన్నాథ రక్షించు రక్షించు. ఓ జానకీపతి మమ్ములను రక్షించు. ఓ బ్రాహ్మణులార ! అందరు మునులు ఈ విధముగా స్తుతించి మౌనం వహించారు (77) శ్రీ సూతులిట్లన్నారు. మునులు పలికిన ఈ రామచంద్రుని స్తోత్రాన్ని మూడు సంధ్యల యందు భక్తితో పఠించిన వారు భుక్తిముక్తులను పొందుతారు (78) ప్రయాణకాలమందు చదివిన వారు భీతిని పొందరు. ఈ స్తోత్రాన్ని పఠించటం వలన భూతభేతాల కాదులు (79) నశిస్తారు, రోగాలు నశిస్తాయి. పాపసంచయము నశిస్తుంది. పుత్రకాముడు పుత్రుని పొందుతాడు. కస్యసత్పతిని పొందుతుంది. (80) మోక్షకాముడు మోక్షమును పొందుతాడు. ధనకాముడు ధనాన్ని పొందుతాడు. ఈస్తోత్రమును భక్తితో చదివిన వారు అన్ని కోరికలను పొందుతారు (81).

మూ|| తతో రామోమునీన్స్రాహప్రణమ్చయ కృతాంజలిః | అహంవిశుద్ధయేప్రాప్యః సకలైరపిమానవైః || 82 ||

మదృష్టిగోచరోజన్తుః నిత్యమోక్షస్యభాజనం | తథాపిమునయోనిత్యం భక్తియుక్తేన చేతసా || 83 ||

స్వాత్మలాభేన సంతుష్టాన్‌సాధూన్‌ భూత సుహృత్తమాన్‌ | నిరహంకారిణః శాంతాన్నమస్యామ్యూర్థ్వరేతనః || 84 ||

యస్మాద్ర్బహ్మణ్యదేవోహమతోవిప్రాన్‌ భ##జేసదా | యుష్మాన్పృచ్ఛామ్యహంకించిత్తద్వదధ్వం విచార్యతు || 85 ||

రావణస్య వధాద్విప్రాయత్పాపంమమ వర్తతే | తస్యమే నిష్కృతిం బ్రూత పౌలస్త్యవధజన్మహి

యత్కృత్వాతేన పాపేన ముచ్యేహం మునిపుంగవాః || 86 ||

మునయ ఊచుః -

సత్యప్రత జగన్నాథ జగద్రక్షా ధురంధర || 87 ||

సర్వలోకోపకారార్థం కురురామ శివార్చనం | గంధమాదన శృంగేస్మిన్మ హాపుణ్య విముక్తిదే || 88 ||

శివలింగప్రతిష్ఠాంత్వం లోకసంగ్రహకామ్యయా | కురురామదశగ్రీవ వధ దోషాపనుత్తయే || 89 ||

లింగస్థాపనజం పుణ్యం చతుర్వక్త్రోపి భాషితుం | నశక్రోతి తతోవక్తుం కింపునర్మనుజేశ్వర || 90 ||

యత్త్వయాస్థాప్యతే లింగం గంధమాదనపర్వతే | అస్య సందర్శనం పుంసాం కాశీలింగావలోకనాత్‌ || 91 ||

అధికం కోటి గుణితం ఫలవత్స్యాన్న సంశయః | తపనామ్నాత్విదంలింగం లోకే ఖ్యాతిం నమశ్నుతాం || 92 ||

నాశకం పుణ్య పాపాఖ్య కాష్ఠానాం దహనోపమం | ఇదం రామేశ్వరం లింగం ఖ్యాతం లోకే భవిష్యతి || 93 ||

మావిలం బంకురుష్వాతో లింగస్థాపన కర్మణి 7 రామచంద్రమహాభాగ కరుణా పూర్ణవిగ్రహ || 94 ||

శ్రీ సూత ఉవాచ -

ఇతి శ్రుత్వావచో రామో మునీనాంతం మునీశ్వరాః | పుణ్యకాలం విచార్యాథ ద్విముహూర్తం జగత్పతిః || 95 ||

కైలాసం ప్రేషయామాన హనుమంతం శివాలయం | శివలింగం సమానేతుంస్థాపనార్థం రఘూద్వహః || 96 ||

రామ ఉవాచ -

హనుమన్నంజనీ సూనో వాయుపుత్ర మహాబల | కైలాసం త్వరితోగత్వాలింగమానయమాచిరం || 97 ||

ఇత్యాజ్ఞప్తన్సరామేణ భుజావాస్ఫాల్య వీర్యవాన్‌ | ముహూర్త ద్వితయం జ్ఞాత్వా పుణ్యకాలం కపీశ్వరః || 98 ||

పశ్యతాం సర్వదేవానాం ఋషీణాంచ మహాత్మనాం | ఉత్పపాతమహావేగాచ్చాలయన్గంధమాదనం || 99 ||

లంఘయన్సవియన్మార్గం కైలాసం పర్వతం య¸° || 99 1/2 ||

తా || పిదప రాముడు చేతులు జోడించి నమస్కరించి మునులతో ఇట్లా అన్నాడు. నేను, సకల మానవులకు విశుద్ధి కొరకు పొందదగిన వాణ్ణి (82) నా దృష్టి గోచరమైన ప్రాణి నిత్యమైన మోక్షమునకు స్థానము. ఐనా మునులు నిత్యము భక్తితో కూడిన మనస్సుతో (నమస్కరింప తగినవారు) (83) పరమాత్మ లాభముతో (ఆత్మజ్ఞానంతో) సంతుష్టులైన సాధువులైన ప్రాణికోటికి సుహృత్తములైన, అహంకార రహితులైన, శాంతులైన, మునులను నమస్కరిస్తున్నాను. (84) నాకు బ్రహ్మణ్యులే దేవతలు అందువలన ఎల్లప్పుడు విప్రులను సేవిస్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కొంచెం ఆలోచించి చెప్పండి (85) రావణుని వధ వలన నాకు కల్గిన పాపమునకు నాకు నిష్కృతిని చెప్పండి. ఓ మునిపుంగవులార! నేను ఏం చేస్తే పౌలస్త్య వధ వల్ల కల్గిన పాపము నుండి నేను ముక్తుడనౌతాను. (86) అని అనగా మునులిట్లనిరి - సత్యవ్రత ! జగన్నాథ ! జగద్రక్షణలో ధురంధర! (87) ఓ రామ ! సర్వలోకముల ఉపకారం కొరకు శివార్చన చేయి. మహా పుణ్య ప్రదమైన, ముక్తినిచ్చే ఈ గంధమాదన శిఖర మందు (88) దశగ్రీవవధ వల్ల కల్గిన దోషం పోయే కొరకు ఓ రామ ! లోక క్షేమ కామనతో నీవు శివలింగ ప్రతిష్టను ఆచరించు (89) లింగస్థాపన వల్ల కలిగే పుణ్యమును గూర్చి బ్రహ్మ దేవుడు కూడా చెప్పలేడు. అందువల్ల ఓ మనుజేశ్వర ! చెప్పడానికింకేముంది (90) గంధమాదన పర్వతమందు నీవు స్థాపించే లింగమును చూచిన పురుషులు కాశిలో లింగాన్ని చూడటం వల్ల (91) పొందే పుణ్యం కన్న కోటిరెట్టు ఎక్కువ ఫలవంతమైంది అనుమానంలేదు. నీపేరుతో ఈ లింగము లోకంలో ఖ్యాతిని పొందని (92) పుణ్యపాపములను కట్టెలకు అగ్నివంటిది నాశకమైనది. ఇది రామేశ్వర లింగమని లోకంలో ప్రసిద్ధమౌతుంది (93) అందువల్ల లింగస్థాపన కర్మలో ఆలస్యం చేయవద్దు. రామచంద్ర! మహాభాగ : కరుణా పూర్ణశరీర ! (94) అని అనగా శ్రీ సూతుని వచనం ఇట్లా - రాముడు ఆ మునుల మాటలను విని, మునులతో పుణ్యకాలమును గూర్చి విచారించి రెండు ముహూర్తముల కాలంలో ఉందని తెలుసుకొని జగత్పతి (95) రాముడు హనుమంతుని కైలాస మందలి శివాలయమునకు పంపాడు. శివలింగమును తెచ్చుటకు స్థాపించుట కొరకు రాముడు పంపాడు (96) రాముని వచనము - అంజనీపుత్ర ! వాయుపుత్ర! మహాబల ! హనుమాన్‌ కైలాసమునకు త్వరగా వెళ్ళి ఆలసించకుండా లింగం తీసుకురా (97) అని రాముడాజ్ఞాపించగా వీర్యవంతుడాతడు భుజములు చరచి పుణ్యకాలము రెండు మూహూర్తములలో ఉందని తెలుసుకొని ఆ హనుమంతుడు (98) దేవతలు, ఋషులు, మహాత్ములు అందరూ చూస్తుండగా గంధమాదనాన్ని కదిలించి వేస్తూ వేగంతో ఎగిరాడు. (99) ఆకాశ మార్గంలో ఎగురుతూ ఆతడు కైలాస పర్వతానికి వెళ్ళాడు.

మూ || సదదర్శమహాదేవం లింగరూపధరం కపిః || 100 ||

కైలాసే పర్వతే తస్మిన్‌ పుణ్య శంకరపాలితే | ఆంజనేయస్తవస్తేపే లింగప్రాప్త్యర్థ మాదరాత్‌ || 101 ||

ప్రాగగ్రేషు సమాసీనః కుశేషు మునిపుంగవాః | ఊర్థ్వబాహుర్నిరాలంబోనిరుచ్ఛ్వాసోజితేంద్రియః || 102 ||

ప్రసాదయన్‌ మహాదేవం లింగంలేభే సమారుతిః | ఏ తస్మిన్నంతరే విప్రాః మునిభిస్తత్వదర్శిభిః || 103 ||

అనాగతం హనూమంతం కాలం స్వల్పావశేషితం | జ్ఞాత్వా ప్రకథితం తత్ర రామం ప్రతి మహామతిం || 104 ||

రామరామమహాబాహోకాలోహ్యత్యేతిసాంప్రతం | జానక్యాయత్కృతంలింగంసైకతం లీలయావిభో || 105 ||

తల్లింగం స్థాపయస్వాద్యమహాలింగమనుత్తమం | శ్రుత్వైత ద్వచనం రామోజానక్యాసహసత్వరం || 106 ||

మునిభిః సహితః ప్రీత్యా కృతకౌతుక మంగలః | జ్యేష్ఠే మాసేసితేవక్షే దశమ్యాంబుధ హస్తయోః || 107 ||

గరానందేవ్యతీపాతేకన్యాచంద్రే వృషేరవౌ | దశయోగే మహాపుణ్య గంధమాదనపర్వతే || 108 ||

సేతుమధ్యే మహాదేవం లింగరూపధరం హరం | ఈశాసం కృత్తివసనం గంగాచంద్రకలాధరం || 109 ||

రామోవైస్థాపయామాన శివలింగ మనుత్తమం | లింగస్థంపూజయా మానరాఘవః సాంబమీశ్వరం || 110 ||

లింగస్థః సమహాదేవః పార్వత్యా సహశంకరః | ప్రత్యక్ష మేవభగవాన్‌ దత్తవాస్వరముత్తమం || 111 ||

సర్వలోకశరణ్యాయరాఘవాయమహాత్మనే | త్వయాత్రస్థాపితం లింగంయేపశ్యంతి రఘూద్వహ || 112 ||

మహాపాతకయుక్తాశ్చతేషాం పాపంప్రణశ్యతి | సర్వాణ్యపిహిపాపాని ధనుష్కోటౌనిమజ్జనాత్‌ || 113 ||

ధర్శనాద్రామలింగస్య పాతకాని మహాంత్యపి | విలయంయాంతిరాజేంద్ర రామచంద్రనసంశయః || 114 ||

ప్రాదాదేవంహిరామాయ పరందేవోంబి కాపతిః | తదగ్రేనందికేశంచ స్థాపయామానరాఘవః || 115 ||

ఈశ్వరస్యాభిషేకార్థం ధనుష్కోట్యాథ రాఘవః | ఏకం కూపం ధరాంభిత్వా జనయామాసవై ద్విజాః || 116 ||

తస్మాజ్జలము పాదాయస్నాపయామాన శంకరం | కోటితీర్థమితి ప్రోక్తం తత్తీర్థం పుణ్యముత్తమం || 117 ||

ఉక్తంతద్వైభవం పూర్వం అస్మాభిర్ముని పుంగవాః | దేవాశ్చమునయోనాగా గంధర్వాప్సరసాంగణాః

సర్వేపి వానరాలింగమేకైకం చక్రురాదరాత్‌ || 118 ||

శ్రీ సూత ఉవాచ -

ఏవం వః కథితం విప్రా యథారామేణ ధీమతా || 119 ||

స్థాపితం శివలింగం వైభుక్తి ముక్తి ప్రదాయకం | ఇమాం లింగప్రతిష్ఠాం యః శృణోతి పఠతేథవా || 120 ||

సరామేశ్వర లింగస్య సేవాఫలమవాప్నుయాత్‌ | సాయుజ్యంచ సమాప్నోతి రామనాథస్యవైభవాత్‌ || 121 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతు మాహాత్మ్యే రామనాథ లింగ ప్రతిష్ఠావిధి వర్ణనం నామ చతుశ్చత్వారింశోధ్యాయ || 44 ||

తా || వానరుడు లింగరూపధారియైన శివుని చూడలేదు (100) పుణ్యప్రదమైన శంకరుడు పాలించే ఆ కైలాస పర్వతమందు లింగ ప్రాప్తి కొరకు ఆదరంతో ఆంజనేయుడు తపస్సు చేశాడు (101) ఓ ముని పుంగవులార ! తూర్పువైపు కొసలు గల దర్భలపై కూర్చున్నవాడై, చేతులు పైకెత్తి, ఆధారం లేకుండా, ఉచ్ఛ్వాసములేకుండా, ఇంద్రియముల జయించి (102) తపస్సు చేసి మహాదేవుని సంతృప్తి పరచి ఆ మారుతి లింగమును పొందాడు. ఇంతలో తత్వదర్శులైన మునులు (103) హనుమంతుడు రాకపోవటం గమనించి ముహూర్తకాలము కొద్దిగానే మిగిలిందని తెలుసుకొని మహామతియైన రామునితో ఇట్లా చెప్పారు (104) ఓ రామ ! మహాబాహు ! ఇప్పుడు మూహూర్త కాలము గడిచి పోతోంది. ఓ విభు! విలాసంగా జానకి చేసిన ఇసుక లింగాన్ని (105) ఇప్పుడు స్థాపించు. అది చాలా శ్రేష్ఠమైన మహాలింగము. ఈ మాటలను రాముడు విని జానకితో కూడి త్వరగా (106) మునులతో కూడి ప్రీతితో మంగళకరమైన కంకణమును (దారంతో) ధరించి, జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం, దశమి, బుధవారం, హస్తనక్షత్రం బుధుడు హస్తయందుండగా (107) గరిజికరణ మందు (ఆ) నందయందు వ్యతీపాత యోగమందు, చంద్రుడు కస్య యందు సూర్యుడు వృషభరాశి యందుండగా ఈ పది కలిసినప్పుడు మహాపుణ్యసమయమందు గంధమాదన పర్వతమందు (108) సేతు మధ్యమందు లింగరూప ధారియైన మహాదేవుని హరుని, ఈశానుని, కృత్తి వాసుని, గంగనుచంద్రకళను ధరించిన వానిని (109) శ్రేష్ఠమైన శివలింగమును రాముడు స్థాపించాడు. లింగమందున్న సాంబుని, ఈశ్వరుని రాఘవుడు పూజించసాగాడు (110) లింగమందున్న ఆ మహాదేవుడు పార్వతితో కూడిన శంకరుడు ప్రత్యక్షమై ఉత్తమమైన వరమును ఆ భగవానుడు ఇచ్చాడు (111) సర్వలోకశరణ్యుడైన మహాత్ముడైన రామునకు వరమిచ్చాడు. ఓ రఘుశ్రేష్ఠ ! నీవు ఇచ్చట స్థాపించిన లింగాన్ని చూచినవారు (112) మహాపాతకములు కలవారైనా వారి పాపం నశిస్తుంది. అన్ని పాపములు ధనుష్కోటి యందు స్నానం చేయటం వలన (113) రామలింగమును దర్శించటం వలన మహాపాతకములైనా నశిస్తాయి. ఓ రాజేంద్ర! రామచంద్ర! అనుమానంలేదు (114) ఈ విధముగా రామునకు అంబికాపతియైన దైవము వరమిచ్చాడు. రాముడు ఆ లింగము ముందు నందికేశుని స్థాపించాడు. (115) రాఘవుడు ఈశ్వరుని అభిషేకము కొరకు ధనస్సు యొక్క అంచుతో భూమిని ఛేదించి ఒక బావిని కల్పించాడు, ఓ ద్విజులార ! (116) దాని నుండి జలం తీసుకొని వచ్చి శంకరునకు స్నానం చేయించాడు కోటి తీర్థమని చెప్పబడే ఆ తీర్థము ఉత్తమమైనది పుణ్యమైనది (117) ఇంతకు మునుపు దాని వైభవాన్ని మేము చెప్పాము. ఓ ముని పుంగవులార ! దేవతలు, మునులు, నాగులు, గంధర్వ అప్సరసల సమూహములు, అందరు వానరులు ఆదరంతో ఒక్కొక్క లింగాన్ని చేశారు (118) శ్రీ సూతులిట్లనిరి - ధీమంతుడైన రాముడు స్థాపించిన, భక్తి ముక్తి ప్రదాయకమైన శివలింగమును గూర్చి ఓ విప్రులార ఈ విధము మీకు చెప్పాను. (119) ఈ లింగ ప్రతిష్ఠను గూర్చి వినిన, చదివిన (120) వారు రామేశ్వర లింగమును సేవించటం వల్ల కలిగే ఫలాన్ని పొందుతారు. రామనాథుని వైభవం వల్లసాయుజ్యమును కూడా పొందుతారు. (121) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్య మందు రామనాథ లింగ ప్రతిష్ఠ విధి వర్ణన మనునది నలుబది నాల్గవ అధ్యాయము(44)

Sri Scanda Mahapuranamu-3    Chapters