Sri Scanda Mahapuranamu-3    Chapters   

నలుబది ఒకటవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

అథాతః సంప్రవక్ష్యామి గాయత్రీంచ సరస్వతీం | లక్ష్యీకృత్య కథామేకాం పవిత్రాం ద్విజసత్తమాః || 1 ||

కశ్య పాఖ్యో ద్విజః పూర్వమస్మిం స్తీర్థద్వయేశుభే | స్నాత్వాతిమహతః పాపాద్విముక్తోనరకప్రదాత్‌ || 2 ||

ఋషయ ఊచుః -

మునే కశ్యపనామాసావకరోత్కింహి పాతకం | స్నాత్వా తీర్థద్వయేస్యత్రయస్మాన్ముక్తోభవత్‌ క్షణాత్‌ || 3 ||

ఏతన్నః శ్రద్ధధానానాం బ్రూహి సూత కృపాబలాత్‌ | త్వద్వచోమృత తృప్తానాం నపిపాసాపి విద్యతే || 4 ||

శ్రీ సూత ఉవాచ -

గాయత్ర్యాశ్చ సరస్వత్యా మాహాత్మ్య ప్రతిపాదకం | ఇతి హాసం ప్రపక్ష్యామి శృణ్వతాం పాపనాశనం || 5 ||

అభిమన్యునుతోరాజా పరీక్షిన్నామనామతః | అధ్యాస్తే హస్తినపురం పాలయన్‌ ధర్మతో మహీం || 6 ||

సరాజా జాతు విపినే చచార మృగయారతః | షష్టివర్షవయాభూపః క్షుత్తృష్ణా పరిపీడితః || 7 ||

నష్టమేకం సవిపినే మార్గయన్మృగయాదరాత్‌ | ధ్యానారూఢం మునిందృష్ట్వా ప్రాహతం చీరవాసనం || 8 ||

మయాబాణన విపినే మృగో విద్ధోధునామునే | దృష్టః సకింత్వయా విద్వన్‌ విద్రుతో భయకాతరః || 9 ||

సమాధినిష్ఠోమౌనిత్వాన్నకించి దపిసోబ్రవీత్‌ | తతోధనురటన్యాసౌ స్కంధే తస్యమహామునేః || 10 ||

నిదాయమృత సర్పంతుకుపితః స్వపురం య¸° | మునేస్తస్యసుతః కశ్చిచ్ఛృంగీనామబభూవవై || 11 ||

సఖాతస్యకృశాభ్యోభూచ్ఛృంగిణోద్విజసత్తమాః | సఖాయం శృంగిణం ప్రాహకృశాఖ్యః ససఖాతతః || 12 ||

పితాతవమృతం సర్పం స్కంధేన వహతేధునా | మా భూద్దర్పస్తవసఖే మాకృధాస్త్వం మదం వృథా || 13 ||

సోవదత్కుపితః శృంగీదిత్సుశ్శావం నృపాయవై | మత్తాతేశపసర్పంయోన్యస్తవాన్మూఢచేతనః || 14 ||

సప్తరాcత్రాన్మియతాం సందష్టస్తక్షకాహినా | శశాపైవం మునిసుతః సౌభ##ద్రేయం పరీక్షితం || 15 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - ఇప్పుడు గాయత్రి సరస్వతులను తీర్థములను ఆధారం చేసుకొని పవిత్రమైన కథను ఒకదానిని చెప్తాను ఓద్విజులార ! (1) కశ్యపుడను పేరుగల ఒక ద్విజుడు పూర్వము శుభ##మైన ఈ తీర్థముల రెంటిలో స్నానం చేసి చాలా గొప్ప పాపం నుండి నరమిచ్చే దాని నుండి ముక్తుడైనాడు (2) ఋషులిట్లన్నారు - ఓ ముని! కశ్యపుడను పేరుగల ఈతడు ఏం పాపం చేశాడు. ఈ తీర్థములు రెంటిలోస్నానం చేసి క్షణంలో ముక్తుడైనాడు గదా (3) ఓసూత! దయచేసి శ్రద్ధగలిగిన మాకు దీనిని చెప్పండి. మీ మాటల అమృతంతో తృప్తులమైన మాకు దప్పిక కూడా కలగదు అని (4) శ్రీ సూతులిట్లన్నారు - గాయత్రి సరస్వతి తీర్థముల మాహాత్మ్యమును ప్రతిపాదించే ఇతి హాసమును చెప్తున్నాను ఇది వినే వారి పాపములను నశింపచేస్తుంది (5) అభిమన్యుసుతుడు పరీక్షితుడను పేరుగల రాజు హస్తినా పురంలో ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు (6) ఆరాజు ఒకసారి వేటయందాసక్తి కలవాడై అడవిలో తిరిగాడు. అరువది సంవత్సరాలుగల ఆరాజు ఆకలి దప్పులతో పీడింపబడి (7) ఆతడు అడవిలో ఆసక్తితో తప్పిపోయిన ఒక మృగాన్ని వెతుకుతూ ధ్యాన రూఢుడైన ఒకమునిని చూచి చీరవస్త్రముగల ఆమునితో ఇట్లా అన్నాడు. (8) ఓ ముని! ఇప్పుడు నేను అడవిలో బాణంతో ఒక మృగాన్ని కొట్టాను. ఓ విద్వాంసుడ! భయకాతరమై పరుగెత్తిన దానిని నువ్వు చూశావా (9) సమాధినిష్ఠుడై మౌనంగా ఉండటం వల్ల ఆతడేమీ మాట్లాడలేదు. పిదప ఈతడు ధనుస్సు అల్లితాడుతో ఆ మహాముని భుజమందు (10) చనిపోయిన పామును వేసి కోపంతో తన నగరానికి వెళ్ళాడు. ఆమునికి శృంగి అను పేరుగల ఒక కొడుకు ఉండేవాడు (11) ఓ బ్రాహ్మణులార ! ఆ శృంగికి కృశుడను మిత్రుడు ఉన్నాడు. ఆ కృశుడను మిత్రుడు మిత్రుడైన శృంగితో ఇట్లా అన్నాడు (12) నీ తండ్రి ఇప్పుడు చచ్చిన పామును భజంపై మోస్తున్నాడు అని. ఓ మిత్రమ! నీకు దర్పం ఉండకూడదు. నీవు వ్యర్థంగా మదించిపోవద్దు అని (13) శృంగి కోపంతో రాజును శపించదలచి ఇట్లా అన్నాడు. మూఢచేతనుడై నా తండ్రిపై శవసర్పాన్ని ఉంచినవాడు (14) తక్షకుడను పాముతో కరవబడి ఏడురాత్రులలో చనిపోని అని సుతుడు సుభద్రకుమారుడైన పరీక్షిత్తును ఇట్లా శపించాడు (15).

మూ || శమీకాఖ్యః పితాతస్యశ్రుత్వాశప్తంసుతేనతం | నృపంప్రోవాచ తనయం శృంగిణం ముని పుంగవః || 16 ||

రక్షకం సర్వలోకానాం నృపంకిం శప్తవానసి | ఆరాజకేవయంలోకే స్థాస్యామః కథమంజసా || 17 ||

క్రోధేన పాతక మభూన్నత్వయా ప్రాప్యతే సుఖం | యః సముత్పాదితం కోపం క్షమయై వనిరస్యతి || 18 ||

ఇహలోకే పరాత్రాసావత్యంతం సుఖమేధతే | క్షమాయుక్తాహి పురుషాలభంతేశ్రేయ ఉత్తమం || 19 ||

తతః శమీకః స్వంశిష్యం ప్రాహగౌరముఖాభిధం | భోగౌరముఖగత్వాత్వం పదభూపం పరీక్షితం || 20 ||

ఇమం శాపంమత్సుతోక్తం తక్షకాహివిదంశనం | పునరాయాహిశీఘ్రంత్వం మత్సమీపేమహామతే || 21 ||

ఏవముక్తః శమీకేనయ¸°గౌరముఖోనృపం | సమేత్యచా బ్రవీద్రూపం సౌభ##ద్రేయం పరీక్షితం || 22 ||

దృష్ట్వాసర్పంపితుః స్కంధే త్వయావిని హితంమృతం | శమీకస్యసుతః శృంగీ శశాపత్వాంరుషాన్వితః || 23 ||

ఏతద్దినాత్సప్తమేహ్ని తక్షకేణమహాహినా | దష్టో విషాగ్నినా దగ్ధో భూయాదాశ్వభిమన్యుజః || 24 ||

ఏవంశశాపత్వాం రాజన్‌ శృంగీ తస్యమునేః సుతః | ఏతద్వక్తుం పితాతస్యప్రాహిణోన్మాంత్వదంతికం || 25 ||

ఇతీరయిత్వాతం భూపమాశుగౌరముఖోయ¸° | గతేగౌరముఖే పశ్చాద్రాజాశోకపరాయణః || 26 ||

అభ్రంలిహమథోత్తుంగమేకస్తంభంసువిస్తృతం | మధ్యేరంగం వ్యతసుతమండపం నృపపుంగవః || 27 ||

మహాగారుడమంత్రజ్జైరౌషధ జ్జైశ్చికిత్సకైః తక్షకస్యవిషంహంతుం యత్నంకుర్వన్సమాహితః || 28 ||

అనేకదేవ బ్రహ్మర్షిరాజర్షి ప్రవరాన్వితః | ఆస్తేతస్మిన్పృపస్తుంగే మండపే విష్ణుభక్తిమాన్‌ || 29 ||

తస్మిన్నవనరేవిప్రః కాశ్యపో మాంత్రికోత్తమః | రాజానం రక్షితుం ప్రాయాత్తక్షకస్య మహావిషాత్‌ || 30 ||

సప్తమేహని విప్రేంద్రో దరిద్రో ధనకాముకః | అత్రాంతరే తక్షకోపి విప్రరూపీసమాయ¸° || 31 ||

మధ్యేమార్గం విలోక్యాథ కశ్యపంప్రత్యభాషత || 31 1/2 ||

తా || శమీకుడను పేరుగల ఆతని తండ్రి కొడుకు రాజును శపించాడని విని ముని పుంగవుడు తన తనయుడైన శృంగితో ఇట్లా అన్నాడు (16) సర్వలోకములకు రక్షకుడైన రాజును ఎందుకు శపించావు. రాజులేని లోకంలో మనము మంచిగా ఎట్లా జీవిస్తాము (17) కోపంవల్ల పాతకమేర్పడిందినాకు సుఖం లభించదు. తనకు కల్గిన కోపాన్ని ఓర్పుతో తొలగించుకోగలిగిన వాడు (18) ఈ లోకంలో, పరలోకంలోను ఈతడు మిక్కలి సుఖంపోందుతాడు. క్షమ కలిగిన పురుషులు మాత్రమే ఉత్తమమైన శ్రేయస్సును పొందుతారు (19) పిదప శమీకుడు తన శిష్యుడైన గౌరముకుడను వానితో ఇట్లా అన్నాడు. ఓ గౌరముఖ నీవు వెళ్ళి పరీక్షిత్తురాజుతో చెప్పు (20) నా కొడుకు ఇచ్చిన తక్షకుడనే పాముతో కరువబడుతావు అనే శాపాన్ని చెప్పు. ఓ మహామతి! నీవు నా సమీపానికి త్వరగా తిరిగిరా అని (21) శమీకుడు చెప్పగానే గౌరముఖుడు రాజుదగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి సౌభద్రుడైన పరీత్తురాజుతో ఇట్లా చెప్పాడు (22) నీవు వేసిన మృత సర్పాన్ని తన తండ్రి భుజములపై చూచి కోపంతో శమీకుని కొడుకైన శృంగి నిన్ను శపించాడు. (23) నేటి నుండి ఏడవ రోజున తక్షకుడను గొప్ప సర్పము కరువగా ఆ విషాగ్నితో త్వరగా అభిమన్యునికుమారుడు దగ్థుడుకాని (24) అని ఆ ముని కుమారుడైన శృంగి ఓ రాజ! నిన్ను శపించాడు. దీనిని చెప్పటానికి ఆతని తండ్రి నన్ను నీ దగ్గరకు పంపాడు (25) అని ఆ రాజుతో పలికి త్వరగా గౌరముఖుడు తిరిగి వెళ్ళాడు. గౌరముఖుడు వెళ్ళాక, ఆ పిదప రాజు శోకపరాయణుడై (26) ఆకాశాన్ని తాకే ఎత్తైన ఒకే స్తంభము గల చాలా విశాలమైన, మధ్యలో నాట్యమంటపమును రాజు కట్టించాడు (27) మహాగరుడమంత్ర మెరిగిన, ఔషధముల నెరిగిన వైద్యులతో తక్షకుని విషాన్ని తీసివేయుటకు ప్రయత్నిస్తూ సిద్ధమై ఉన్నాడు (28) అనేకులైన దేవ బ్రహ్మర్షి రాజర్షి శ్రేష్ఠులతో పరివేష్టింపబడి రాజు విష్ణుభక్తి గలవాడు ఆ ఎత్తైన మండపంలో ఉన్నాడు. (29) ఆ సమయమందు మాంత్రికోత్తముడైన కాశ్యపుడను బ్రాహ్మణుడు తక్షకుని మహా విషము నుండి రాజును రక్షించటానికి బయలుదేరాడు. (30) విప్రశ్రేష్ఠుడు దరిద్రుడు ధనకాముకుడై ఏడవరోజు బయలుదేరాడు.ఇంతలో తక్షకుడు కూడా బ్రాహ్మణ రూపంతో వచ్చాడు (31) మార్గమధ్యంలో కశ్యపుని చూచి అతడు ఇట్లా అన్నాడు.

మూ|| బ్రాహ్మణత్వం కుత్రయాసి పదమేద్య మహామునే || 32 ||

ఇతిపృష్టస్తదావాదీత్కాశ్యపస్తక్షకం ద్విజాః | పరీక్షితం మహారాజం తక్షకోద్యవిషాగ్నినా

|| 33 ||

దక్ష్యతేతం శమయితుం తత్సమీప ముపైమ్యహం | ఇత్యుక్తపంతం తంవిప్రం తక్షకః పునరబ్రవీత్‌ || 34 ||

తక్షకోహం ద్విజశ్రేష్ఠమయాదష్టశ్చికిత్సితుం | నశక్యోబ్దశ##తేనాపి మహామంత్రాయుతైరపి|| 35 ||

చికిత్సితుంచేన్మద్దష్టంశక్తిరస్తితవాధునా | అనేకయోజనోచ్ఛ్రాయ మిమంవటతరుంత్వహం || 36 ||

దశాముజ్జీవయైనం త్వం సమర్థోస్తితతోభవాన్‌ | ఇతీరయిత్వాతంవృక్షమదశత్తక్షకస్తదా ||37||

అభవద్భస్మసాత్సోపి వృక్షోత్యంతం సముచ్ఛ్రితః పూర్వమేవసరః కశ్చిత్‌ తం వృక్షమధిరూఢవాన్‌ || 38 ||

తక్షకస్యవిషోల్కాభిః సోపిదగ్థోభవత్తదా | తంనరంసవిజిజ్ఞాతేతౌచకాశ్యవతక్షకౌ || 39 ||

కాశ్యపః ప్రతి జిజ్ఞేథ తక్షకప్యాపిశృణ్వతః | తన్మంత్రశక్తింపశ్యంతు సర్వేవిప్రాహినోథునా || 40 ||

ఇతీరయిత్వాతంవృక్షం భస్మీభూతం విషాగ్నినా | అజీవయన్మంత్రశక్త్యా కాశ్యపోమాంత్రికోత్తమః || 41 ||

నరోపితేనవృక్షేణ సాకముజ్జీవతోభవత్‌ | అథాబ్రవీత్త క్షకస్తంకాశ్యపం మంత్రకోవిదం

|| 42 ||

యథానముని వాఙ్‌మిథ్యాభ##వే దేవంకురుద్విజ | యత్తేరాజాధనందద్యాత్తతోపిద్విగుణంధనం || 43 ||

దదామ్యహంనివర్తస్వశీఘ్రమేవద్విజోత్తమ | ఇత్యుక్త్వానర్ఘ్యరత్నాని తసై#్మ దత్వానతక్షకః || 44 ||

న్యవర్తయత్కాశ్యపంతం బ్రాహ్మణం మంత్రకోవిదం | అల్పాయుషం నృపంమత్వాజ్ఞానదృష్ట్వా సకాశ్యపః || 45 ||

స్వాశ్రమం ప్రయ¸°తూష్ణీం లబ్ధరత్నశ్చతక్షకాత్‌ | సోబ్రవీత్తక్షకః సర్వాన్సర్పానాహూయతత్‌క్షణ || 46 ||

యూయంతంనృపతింప్రాప్యమునీనాంవేషధారిణః | ఉపహార ఫలాన్యాశు ప్రయచ్ఛత పరీక్షితే || 47 ||

తథేత్యుక్త్వా సర్వసర్పాదదూరాజ్ఞే పలాన్యమీ | తక్షకోపి తదాతత్ర కస్మింశ్చిద్బదరీఫలే || 48 ||

కృమివేషధరో భూత్వావ్యతిష్ఠద్దంశితుంనృపం || 48 1/2 ||

తా || ఓ మహాముని ! బ్రాహ్మణ ! నీవు ఈ రోజు ఎక్కడికి వెళ్ళుచున్నావు నాకు చెప్పు (32) అని అడుగగా కాశ్యపుడు తక్షకునితో ఇట్లా చెప్పాడు. పరీక్షిన్మహారాజును ఈరోజు తక్షకుడు తన విషాగ్నితో (33) కరువబోతున్నాడు. దానిని తగ్గించటానికి అతని సమీపానికి నేను వెళ్తున్నాను. అని చెప్పిన ఆ బ్రాహ్మణునితో తక్షకుడు తిరిగి ఇట్లా అన్నాడు. (34) ఓ ద్విజశ్రేష్ఠ నేనే ఆ తక్షకుణ్ణి. నేను కరిస్తే చికిత్స చేయటం సాధ్యం కాదు. నూరు సంవత్సరాలకైన పదివేల మంత్రాలతోనైనా (35) నేను కరిచిన దానిని చికిత్స చేయటానికి నీకు ఇప్పుడు శక్తి ఉంటే, అనేక యోజనముల ఎత్తైన ఈ వటవృక్షాన్ని నేను (36) కరుస్తున్నాను. దీనిని నీవు బ్రతికించు. ఆపిదపే నీవు సమర్థుడవౌతావు, అని పలికి తక్షకుడు అప్పుడు ఆ వృక్షాన్ని కరిచాడు. (37) మిక్కిలి ఎత్తైన ఆ వృక్షము భస్మంగా అయిపోయిందికూడా. అంతకుముందే ఒక మనిషి ఆ వృక్షాన్ని ఎక్కి ఉన్నాడు (38) తక్షకుని విషజ్వాలలో అప్పుడు ఆతడు కూడా దగ్థమైనాడు. ఆ కాశ్‌యపతక్షకులు ఆ మనిషిని గమనించలేదు (39) తక్షకుడు వింటుండగా కాశ్యపుడు ప్రతిజ్ఞచేశాడు. ఇప్పుడు నా ఆ మంత్ర శక్తిని అందరు బ్రాహ్మణులు చూడండి (40) అని పలికి విషాగ్నితో భస్మమైన ఆ వృక్షాన్ని కాశ్యపుడు మాంత్రికోత్తముడు తన మంత్ర శక్తితో బ్రతికించాడు. (41) ఆ మనిషి కూడా ఆ వృక్షంతో పాటు తిరిగి బతికాడు. అప్పుడు మంత్రకోవిదుడైన కాశ్యపునితో ఆ తక్షకుడు ఇట్లా అన్నాడు. (42) ఓ బ్రాహ్మణ! మునివాక్కు అబద్ధంకాకుండా చూడు. రాజు నీకిచ్చే ధనం కన్నా రెట్టింపు ధనాన్ని (43) నేను నీకిస్తాను. ఓ బ్రాహ్మణ! త్వరగా మరిలిపో, అని పలికి అమూల్యమైన రత్నములను ఆ తక్షకుడు ఆతనికిచ్చి (44) మంత్రకోవిదుడైన కాశ్యపుడను ఆ బ్రాహ్మణుని మరలింపచేశాడు. జ్ఞానదృష్టితో ఆ కాశ్యపుడు రాజు అల్పాయుష్మంతుడని గ్రహించి (45) తక్షకుని నుండి రత్నాలు తీసుకొని తన ఆశ్రమానికి మౌనంగా వెళ్ళి పోయాడు. ఆ క్షణంలో తక్షకుడు అన్ని పాములను పిలిచి ఇట్లా అన్నాడు. (46) మునుల వేషములు ధరించి మీరు ఆ రాజు దగ్గరకు చేరి ఆ పరీక్షిత్తుకు ఉపహార ఫలములను త్వరగా ఇవ్వండి (47) అని అనగా అట్లాగే అని పాములన్నీ రాజునకు ఫలములనిచ్చాయి. అప్పుడు తక్షకుడు అక్కడ ఒకరేగుపండులో (48) పురుగు రూపమును ధరించి రాజును కరవటానికి సిద్ధంగా ఉన్నాడు.

మూ || అథరాజాప్రదత్తాని సర్పైర్బ్రాహ్మణరూపకైః || 49 ||

పరీక్షిన్మంత్రవృద్ధేభ్యోదత్వాసర్వఫలాన్యపి | కౌతూహలేన జగ్రాహస్థూలమేకం ఫలంకరే || 50 ||

అస్మిన్నవసరే సూర్యోప్యస్తాచలమగాహత | మిథ్యాఋషివచో మాభూదితి తత్రత్యమానవాః || 51 ||

అన్యోన్య మవదన్సర్వే బ్రాహ్మణాశ్చనృపాస్తథా | ఏవం వదత్సుసర్వేషు ఫలే తస్మిన్నదృశ్యత || 52 ||

ఫలేరక్తకృమిః సర్వైః రాజ్ఞాచాపి పరీక్షితా | అయంకింమాందశేదద్యకృమిరిత్యుక్తవాన్పృపః || 53 ||

నిదధేతత్ఫలం కర్ణేనకృమి ద్విజసత్తమాః | తక్షకోస్మిన్‌స్థితః పూర్వం కృమిరూపీ ఫలే తదా || 54 ||

నిర్గత్యతత్ఫలా దాశునృపదేహమవేష్టయత్‌ | తక్షకావేష్టితేభూపే పార్శ్వస్థాదుద్రువుర్భయాత్‌ || 55 ||

అనంతరం నృపోవిప్రాస్తక్షకస్యవిషాగ్నినా | దగ్ధోభూద్భన్మసాదాశు సప్రాసాదోబలీయసా || 56 ||

కృత్వోర్ధ్వదైహికం తస్యనృపస్యస పురోహితాః | మంత్రిణస్తత్సుతం రాజ్యేజనమేజయనామకం || 57 ||

రాజానమభ్యషించన్వైరాజద్రక్షణ వాంఛయా | తక్షకాద్రక్షితుం భూపమాయాతః కాశ్యపాభిధః || 58 ||

యోబ్రాహ్మణోమునిశ్రేష్ఠాః ససర్వైర్నిందితోజనైః | బభ్రామ సకలాన్దేశాన్‌ శిష్టైః సర్వైశ్చ దూషితః || 59 ||

అవస్థానం సలేభేసౌ గ్రామేవా ప్యాశ్రమేపివా | యాన్యాన్దేశానసౌయాతః తత్ర తత్రమహాజన్తెః || 60 ||

తత్తద్దేశాన్నిరస్తః సశాకల్యం శరణం య¸° | ప్రణమ్యశాకల్యమునిం కాశ్యపోనిందితోజనైః

ఇదం విజ్ఞాపయామానశాకల్యాయ మహాత్మనే || 61 ||

కాశ్యప ఉవాచ -

భగవన్సర్వధర్మజ్ఞ శాకల్య హరివల్లభ || 62 ||

మునయోబ్రాహ్మణాశ్చాన్యేమాంనిందంతిసుహృజ్జనాః|నాస్యాహం కారణం జానేకింమాంనిందంతిమానవాః || 63 ||

బ్రహ్మహత్యాసురాపానం గురుస్త్రీగమనంతథా | స్తేయం సంసర్గ దోషోవా మయానాచరితః క్వచిత్‌ || 64 ||

అన్యాన్యపిహి పాపాని సకృతానిమయామునే | తథాపి నిందంతిజనావృథామాం బాంధవాదయః || 65 ||

జానాసి చేత్త్వం శాకల్య మయాదోషంకృతం పద | ఉక్తోథ కాశ్యపే నైవం శాకల్యాఖ్యోమహామునిః

క్షణంధ్యాత్వా బభాషేతం కాశ్యపం ద్విజసత్తమాః || 66 ||

తా || రాజు బ్రాహ్మణ రూపములను ధరించిన సర్పములతో ఇవ్వబడిన వానిని (49) పండ్లనన్నిటిని పరీక్షిత్తు మంత్ర వృద్ధులకు ఇచ్చి, కుతూహలంతో లావైన ఒక పండును చేతిలోకి తీసుకున్నాడు. (50) ఇంతలో సూర్యుడు అస్తాచలంలో మునిగాడు. అక్కడున్న మనుషులు ఋషివాక్కు అబద్ధం కారాదని (51) బ్రాహ్మణులు, రాజులు అందరు పరస్పరమనుకున్నారు. అందరు ఇట్లా అంటుండగా ఆ పండులో (పురుగు) కన్పించింది (52) ఎర్రని పురుగును అందరు రాజుకూడా పండులో చూచారు. ఈ పరుగునన్నీవేళ కరుస్తుందా ఏమి అని రాజు అన్నాడు (53) ఓ బ్రాహ్మణులార! పురుగుతో సహ ఆ పండును చెవిలో పెట్టుకున్నాడు. పూర్వం పురుగు రూపంలో పండులో ఉన్న తక్షకుడు అప్పుడు (54) ఆ పండు నుండి త్వరగా బయటికి వచ్చి రాజు దేహాన్ని చుట్టుకున్నాడు. రాజును తక్షకుడు చుట్టుకోగా పక్కనున్న వారు భయంతో పరుగెత్తారు (55) ఆ పిదప రాజు, విప్రులు తక్షకుని బలమైన విషాగ్నితో ఆ భవనము త్వరగా కాలి భస్మంగా మారిపోయింది (56) ఆ రాజునకు ఊర్ధ్వదైహికక్రియలను చేసి, పురోహితులతో కూడిన మంత్రులు జనమే జయుడను పేరు గల ఆతని పుత్రుని రాజ్యంలో (57) రాజ్యరక్షణ కాంక్షతో రాజుగా అభిషేకించారు. తక్షకుని నుండి రాజును రక్షించటానికి వచ్చిన కాశ్యపుడను పేరుగల (58) బ్రాహ్మణుడు జనులందరితో నిందింపబడి ఓ బ్రాహ్మణులార! శిష్టులందరిచే దూషింపబడుతూ దేశాలన్ని తిరిగాడు (59) గ్రామమందుగాని ఆశ్రమమందుగాని ఈతడు స్థానాన్ని పొందలేక పోయాడు. ఏ ఏ దేశాలకు ఈతడు వెళ్ళాడో అక్కడక్కడ మహాజనులతో (60) ఆయా దేశములనుండి నిరస్తుడై శాకల్యుని శరణు వేడాడు. కాశ్యపుడు జనులతో నిందింపబడి శాకల్యమునికి నమస్కరించి శాకల్య మహాత్మునకు ఇట్లా విజ్ఞాపన చేశాడు. (61) కాశ్యపుని వచనము - భగవాన్‌ ! అన్ని ధర్మముల నెరిగినవాడ ! శాకల్య! హరివల్లభ! (62) మునులు బ్రాహ్మణులు సుహృజ్జనులు ఇతరులు నన్ను నిందిస్తున్నారు. నన్ను నరులెందుకు నిందిస్తున్నారో దానికి కారణం నాకు తెలియటం లేదు (63) బ్రహ్మహత్య, సురాపానము, గురుస్త్రీగమనము, దొంగతనము, సంసర్గోదోషము వీటిని వేటిని నేనాచరించలేదు (64) ఇతరమైన పాపములను కూడా ఓ ముని! నేనాచరించలేదు. ఐనాజనులు, బాంధవులు మొదలగువారు అనవసరంగా నన్ను నిందిస్తున్నారు (65) ఓ శాకల్య ! నీకు తెలిసుంటే నేను చేసిన దోషాన్ని చెప్పండి. కశ్యపుడిట్లా పలుకగా శాకల్య మహాముని క్షణం ధ్యానించి ఆకాశ్యపునితో ఇట్లా అన్నాడు (66).

మూ || శాకల్య ఉవాచ -

పరీక్షితం మహారాజం తక్షకాద్రక్షితుంభవాన్‌ || 67 ||

అయాసీ దర్థమార్గేతు తక్షకేణ నివారితః చికిత్సితుం సమర్థోపి విషరోగాదిపీడితం || 68 ||

యోనరక్షతిలోభేన తమాహుర్ర్బహ్మఘాతకం | క్రోధాత్కామాద్భయాల్లోభాన్మాత్సర్యాన్మోహతోపివా || 69 ||

యోనరక్షతి విప్రేంద్ర విషరోగాతురం నరం | బ్రహ్మహాససురాపీచస్తేయాచగురుతల్పగః || 70 ||

సంసర్గదోషదుష్టశ్చ నాపితస్యహి నిష్కృతిః | కన్యావిక్రయిణశ్చాపిహయవిక్రయిణస్తథా

|| 71 ||

కృతఘ్నస్యాపి శాస్త్రేషు ప్రాయశ్చిత్తం హి విద్యతే | విషరోగాతురంయస్తుసమర్థోపినరక్షతి || 72 ||

సతస్యనిష్కృతిః ప్రోక్తా ప్రాయశ్చిత్తాయుతైరపి | న తేన సహంపంక్తౌచ భుంజీత సుకృతీజనః || 73 ||

సతేన సహ భాషేత సపశ్యేత్తం నరంక్వచిత్‌ | తత్సం భాషణమాత్రేణ మహాపాతక భాగ్భవేత్‌ || 74 ||

పరీక్షిత్స మహారాజః పుణ్యశ్లోకశ్చధార్మికః | విష్ణుభక్తో మాహాయోగీ చాతుర్వర్ణ్యస్య రక్షితా || 75 ||

వ్యాసపుత్రాద్ధరికథాం శ్రుతవాన్భక్తి పూర్వకం | అరక్షిత్వా నృపంతం త్వం పచసాతక్షకస్యయత్‌ || 76 ||

నివృత్తస్తేనవిప్రేంద్రైః బాంధవైరపి దూష్యసే | సపరీక్షిన్మహారాజో యద్యపి క్షణ జీవితః || 77 ||

తథాపి యావస్మరణం బుధైః కార్యంచికిత్ససం | యావత్కంఠగతాః ప్రాణాః ముమూర్షోర్మాన పస్యహి || 78 ||

తావచ్చికిత్సాకర్తవ్యాకాలస్యకుటిలాగతిః | ఇతిప్రాహుః పురాశ్లోకం భిషగ్వైద్యాబ్ధి పారగాః || 79 ||

అతశ్చికిత్సాశక్తోపి యస్మాదకృతభేషజః | అర్ధమార్గేనివృత్తస్త్వం తేనతం హతవానసి

శాకల్యేనైవముదితః కాశ్యపః ప్రత్యభాషత || 80 ||

కాశ్యప ఉవాచ -

మమైత ద్దోష శాంత్యర్థం ఉపాయంపద సువ్రత || 81 ||

యేనమాం ప్రతిగృహ్ణీయుర్బాంధవాః సమహృజ్జనాః || 82 ||

కృపాంమయి కురుష్వత్వం శాకల్యహరి వల్లభ

కాశ్యపే నైవముక్తస్తు శాకల్యోపి మునీశ్వరః | క్షణం ధ్యాత్వా జగాదైవం కాశ్యపం కృపయాతదా || 83 ||

తా || శాకల్యుని పచనము - పరీక్షిత్తు మహారాజును తక్షకుని నుండి రక్షించటానికి నీవు (67) వెళ్ళావు. సగం దారిలోనే నీవు తక్షకునితో వారింపబడినావు. విషరోగాది పీడితుని (రాజును) చికిత్స చేయుటకు సమర్థుడై యుండి (68) లోభంలో రక్షించని వానిని బ్రహ్మఘాతకుడంటారు. క్రోథం వల్ల కామంవల్ల భయంవల్ల లోభంవల్ల మాత్సర్యంవల్ల మోహం వల్లగాని (69) విషరోగాతురుడైన నరుని రక్షించని వాడు బ్రహ్మహంతకుడు, సురాపి, దొంగ, గురుతల్పగుడు (70) సంసర్గదోషదుష్టుడు కూడా ఆతనికి నిష్కృతి లేదు. కన్యను అమ్మేవాడు, గుఱ్ఱాన్ని అమ్మేవాడు (71) కృతఘ్నుడు వీరికి శాస్త్రములలో ప్రాయశ్చిత్తముంది. విషరోగాతురుడైన వానికి సమర్థుడై ఉండి రక్షించనివానికి (72) నిష్కృతి పదివేల ప్రాయశ్చిత్తములతో కూడా చెప్పబడలేదు. సుకృతి ఐన నరుడు ఆతనితో సహపంక్తిలోభోజనము చేయరాదు. (73) అతనితో కూడా మాట్లాడరాదు. అట్టి నరుని ఎక్కడా చూడరాదు. ఆతనితో మాట్లాడినంత మాత్రము చేత మహాపాతక భాజసుడౌతాడు. (74) పరీక్షిత్తు మహారాజు పుణ్యశ్లోకుడు ధార్మికుడు విష్ణు భక్తుడు మహాయోగి చతుర్వర్ణములను రక్షించేవాడు (75) వ్యాసపుత్రుని నుండి హరికథలను భక్తి పూర్వకముగా విన్నాడు. ఆ రాజును రక్షించకుండా నీవు తక్షకుని మాటలతో మరలినావు గదా (76) ఆకారణంగా విప్రశ్రేష్ఠులతో, బాంధవులతో కూడా దూషింపబడుతున్నావు. ఆ పరీక్షిత్తు మహారాజు క్షణ జీవితుడైనా (77) మరణించేవరకు బుధులు ఆతనికి చికిత్స చేయాలి. మరణించే మానవునకు కంఠంలో ప్రాణమున్నంతవరకు (78) చికిత్స చేయాలి. కాల గమనము చాలా కుటిలమైంది. అని భిషక్‌, వైద్యసముద్రముల దాటగలిగిన వారు ప్రాచీన శ్లోకాన్ని చెబుతారు (79) అందువల్ల చికిత్స యందు శక్తుడవై ఉండీ, చికిత్స చేయకుండానే అధర్మ మార్గంలో మరలినావు. కనుక నీవు ఆతనిని చంపిన వాడవైనావు. శాకల్యుడు ఇట్లా చెప్పగానే కాశ్యపుడిట్లా అన్నాడు (80) కాశ్యపవచనము - ఓ సుcవతుడ ! నా ఈ దోష శాంతికొరకు ఉపాయం చెప్పండి (81) దాని వలన నన్ను సుహృజ్జనులతో కూడినా బంధువులు స్వీకరించాలి. (82) శాకల్య ! హరి వల్లభ నీవు నాపై దయచూపు. కాశ్యపుడిట్లా పలుకగానే శాకల్య మునీశ్వరుడు క్షణం ధ్యానించి కృపతో కాశ్యపునితో అప్పుడు ఇట్లా అన్నాడు (83).

మూ|| శాకల్య ఉవాచ -

అస్య పాపస్య శాంత్యర్థం ఉపాయం ప్రవదామితే || 84 ||

తత్కర్త వ్యంత్వయా శీఘ్రం విలంబం మాకృథాద్విజ | దక్షిణాంబునిధౌ సేతై గంధమాదన పర్వతే || 85 ||

అస్తితీర్థద్వయం విప్రాగాయత్రీచ సరస్వతీ | తత్రత్వం స్నానమాత్రేణ శుద్ధోభూయాచ్చతత్‌క్షణ || 86 ||

గాయత్ర్యాచ సరస్వత్యా జలవాతస్పృశోనరః | విధూయసర్వపాపాని స్వర్గం యాస్యంతి నిర్మలాః || 87 ||

తద్యాహి శీఘ్రం విప్రత్వం గాయత్రీం చసరస్వతీం | ఇత్యుక్తః కాశ్యపస్తేన శాకల్యేన ద్విజోత్తమాః || 88 ||

సత్వామునించ శాకల్యం తమాపృచ్ఛ్యమునీశ్వరం | తేనచైవాభ్యనుజ్ఞాతః ప్రయ¸°గంధమాదనం || 89 ||

తత్రగత్వాచ గాయత్రీ సరస్వత్యౌ చకాశ్యపః | నత్వాతీర్థద్వయం భక్త్యా దండపాణించ భైరవం || 90 ||

సంకల్పపూర్వం తత్తీర్థే సస్నౌ నియమ సంయుతః | తీర్థద్వయే స్నాన మాత్రాన్ముక్త పాపోథకాశ్యపః || 91 ||

తీర్థద్వయస్యతీరేసౌకించి త్కాలంతుతస్థివాన్‌ | తస్మిన్కాలేచ గాయత్రీ సరస్వత్యౌ మునీశ్వరాః || 92 ||

ప్రాదుర్బ భూపతు ర్మూర్తే సర్వాభరణ భూషితే | దేవ్యౌతే సనమస్కృత్య కాశ్యపోభక్తి పూర్వకం || 93 ||

కేయువాం రూపసంపన్నే సర్వాలంకార సంయుతే | ఇతిప్రప్రచ్ఛదృష్ట్వాతేకాశ్‌యపోహృష్టమాససః

తేనవృష్టేచగాయత్రీ సరస్వత్యౌ తమూచతుః || 94 ||

గాయత్రీ సరస్వత్యాపూచతుః-

కాశ్యపావాంహి గాయత్రీ సరస్వత్యౌ విధిప్రియే || 95 ||

ఏతత్తీర్థస్వరూపేణ నిత్యం వర్తావహేత్వతః | అత్రతీర్థద్వయేస్నానాత్‌ ఆవాంతుష్టేతవాధునా || 96 ||

పరంమత్తోవృణీష్వత్వం యదిష్టం కాశ్యపద్విజ | స్నాంతి తీర్థద్వయే యేత్ర దాస్యావస్తదభీప్సితం || 97 ||

శ్రుత్వావచస్తద్గాయత్రీ సరస్వత్యోః సకాశ్యపః | తుష్టావ వాగ్భిరగ్ర్యాభిస్తే దేవ్యౌ వేధనప్రియే || 98 ||

కాశ్యప ఉవాచ -

చతురాననగే హిన్యౌ జగద్ధాత్ర్యౌ సమామ్యహం | విద్యాస్వరూపే గాయత్రీ సరస్వత్యౌ శుభే ఉభే || 99 ||

తా || శాకల్యుని వచనము - ఈ పాప శాంతి కొరకు నీకు ఉపాయం చెప్తాను. (84) దానిని నీవు త్వరగా చేయాలి ఓ బ్రాహ్మణ! ఆలస్యం చేయవద్దు. దక్షిణ సముద్రమందు సేతువు యందు గంధమాదన పర్వతమందు (85) గాయత్రి సరస్వతి అను రెండు తీర్థములున్నాయి. అక్కడ నీవు స్నానం చేసినంత మాత్రం చేత ఆ క్షణంలోనే శుద్ధుడవౌతావు (86) గాయత్రి సరస్వతులనీటిని గాలిని స్పృశించిన నరుడు సర్వపాపములను పోగొట్టుకొని నిర్మలులై స్వర్గానికి వెళ్తారు. (87) అందువల్ల ఓ బ్రాహ్మణ! నీవు త్వరగా గాయత్రి సరస్వతుల దగ్గరకు వెళ్ళు. అని కాశ్యపునితో శాకల్యుడనగానే (88) శాకల్యమునికి నమస్కరించి, ఆ మునీశ్వరునితో పోయివస్తానని చెప్పి, ఆతని అనుజ్ఞను పొంది గంధమాదనమునకు వెళ్ళాడు (89) అక్కడికి వెళ్ళిన కశ్యపుడు గాయత్రీ సరస్వతులకు రెండు తీర్థములకు నమస్కరించి భక్తితో, దండపాణియైన భైరవుని నమస్కరించి (90) నియమం కలవాడై సంకల్ప పూర్వకముగా ఆ తీర్థమందు స్నానం చేశాడు. ఆతీర్థద్వయ మందు స్నాన మాత్రం చేత కాశ్యపుడు ముక్తపాపుడైనాడు (91) ఆ తీర్థముల రెంటి యొక్క తీర మందు ఈతడు కొద్ది కాలమున్నాడు. ఓ మునులార ! ఆకాలమందు గాయత్రీ సరస్వతులు (92) సర్వ ఆభరణములతో అలంకృతులైతమ ఆకారంతో కన్పించారు. వారికి ఈ కాశ్యపుడు భక్తి పూర్వకముగా నమస్కరించి (93) సర్వాలంకారములతో కూడిన, రూపసంపన్నులైన మీరెవరు, అని సంతోషంతో కూడిన మనస్సు గల కాశ్యపుడు వారిని చూచి అడిగాడు. ఆతడడుగగా గాయత్రీ సరస్వతులు ఆతనితో ఇట్లా అన్నారు (94) గాయత్రీ సరస్వతులిట్లన్నారు, కశ్యప ! మేము గాయత్రి సరస్వతులము బ్రహ్మకు ఇష్టమైన వారము (95) ఈ తీర్థ స్వరూపంతో ఎప్పుడూ ఉంటున్నాము. ఈ తీర్థ ద్వయమందు నీవు స్నానం చేయటంవలన మేము ఇప్పుడు సంతుష్టులమైనాము (96) ఓ కాశ్యప! బ్రాహ్మణ! నీకు ఏ వరమిష్టమో దాన్ని కోరుకో. ఈ తీర్థ ద్వయమందు స్నానం చేసిన వారికి అతని కోరికను ఇస్తాము (97) అని పలికిన గాయత్రీ సరస్వతుల మాటలను విని ఆకాశ్యపుడు బ్రహ్మకు ప్రియమైన ఆ దేవిలను ఇద్దరిని ముఖ్యమైన వచనములతో స్తుతించాడు. (98) కాశ్యపుని వచనము - ఓ చతురాసన ఇల్లాండ్రార ! జగద్రక్షకులార నేను మిమ్మల్ని నమస్కరిస్తున్నాను. విద్యా స్వరూపులైన ఓ గాయత్రి ! సరస్వతి మీరిద్దరు శుభకరమైన వారు (99)

మూ || సృష్టి స్థిత్యం తకారిణ్యౌ జగతో వేదమాతరౌ | హవ్యకవ్య స్వరూపేచ చంద్రాదిత్య విలోచనే || 100 ||

సర్వదేవాధి పేవాణీగాయత్ర్యౌసతతం భ##జే | గిరిజా కమలాచాపియువామేవజగద్ధితే || 101 ||

యుష్మద్దర్శన మాత్రేణ జగత్సృష్ట్యాదికల్పనం | యుష్మన్నిమేషాత్సతతం జగతాం ప్రలయోభ##వేత్‌ || 102 ||

ఉన్మేషా త్స్రుష్టిరభవత్‌ భోగాయత్రి సరస్వతి | యువమోర్దర్శనాదద్యకృతార్ధోభవమాశువై || 103 ||

మామద్యపాతకాన్ముక్తం స్నానాత్తీర్థద్వయేత్రతు | స్వీకుర్వంతుమునిశ్రేష్ఠాః బ్రాహ్మణాః బాంధవాస్తధా || 104 ||

ఇతః పరం పాపకృత్యే మామేబుద్ధిః ప్రవర్తతాం | ధర్మేప్రవర్తతాం నిత్య మయమేవవరోమయ || 105 ||

దీయతాం భో మహాదేవ్యౌనాన్యమిచ్ఛామ్యహం వరం | ఇతితే ప్రార్థితే తేన కాశ్యపేన ద్విజోత్తమాః || 106 ||

సరస్వతీచ గాయత్రీ ద్వేదేవ్యౌ బ్రహ్మణః ప్రియే | కాశ్యపం ప్రోచతుః ప్రీతే జనన్యౌజగతాం సదా || 107 ||

కాశ్యపైత ద్వరం సర్వం ప్రార్ధితం యత్త్వయాధునా | అనుగ్రహాదావయోస్తదచిరేణ తవాస్తుహి || 108 ||

ఇత్యుక్తా తంతుగాయత్రీ సరస్వత్యౌక్షణన వై | తిరోధానంగతే విప్రాస్తస్మింస్తీర్థ ద్వయే తదా || 109 ||

కాశ్‌యపోపికృతార్థః సన్‌ స్వదేశం ప్రతినిర్య¸° | బాంధవా బ్రాహ్మణాః సర్వేకాశ్‌యవం గతకిల్బిషం || 110 ||

ప్రత్యగృహ్ణంశ్‌చ గాయత్రీ సరస్వత్యోర్ని మజ్జనాత్‌ | ఏవంవః కథితం విప్రా కాశ్యపస్య విమోక్షణం || 111 ||

పాతకేభ్యోహిగాయత్రీ సరస్వత్యోర్నిమజ్జనాత్‌ | పఠతేత్వి మమధ్యాయం శృణుతేవాసమాహితః || 112 ||

యోగా యత్ర్యాం సరస్వత్యా సస్నాత ఫలమశ్నుతే || 113 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే గాయత్రీ సరస్వతీ తీర్థప్రశంసాయాం కాశ్యప పాపశాంతి వర్ణనం నామైక చత్వారింశోధ్యాయః || 41 ||

తా || జగత్తునకు సృష్టిస్థితి అంతక కారకులు, వేదమునకు మాతలు, హవ్యకవ్య స్వరూపలు, చంద్ర సూర్యులను నేత్రములుగా కలవారు (100) సర్వదేవతలకు అధిపులైన గాయత్రి వాణులను ఎల్లప్పుడు సేవిస్తాను లోకక్షేమాన్ని కోరే గిరిజ కమలలు కూడా మీరే (101) మీ చూపుతో జగత్తు సృష్టి మొదలగు కల్పనము, మీ రెప్పపాటుతో ఎల్లప్పుడు జగత్తులకు ప్రళయము కల్గుతుంది (102) ఓ గాయత్రి సరస్వతులు, మీలోచనముల వికాసంతో సృష్టి జరిగింది. మీ దర్శనం వల్ల ఈ వేళ త్వరగా కృతార్థుడనైనాను (103) ఇక్కడ రెండు తీర్థములలో స్నానం వల్లనేను ఈ వేళ పాతకముల నుండి ముక్తుడైనాను. మునిశ్రేష్ఠులు, బ్రాహ్మణులు, బాంధవులు నన్ను స్వీకరించని (104) ఇక ముందు నాబుద్ధి పాప కృత్యమందు ప్రవర్తించకుండా ఉండని. ఎప్పుడు ధర్మ మందునా బుద్ధి ప్రవర్తించని ఇదే నాకు వరము (105) ఓ మహా దేవతలు ! ఇవే ఇవ్వండి. నేను మరో వరాన్ని కోరను. అని కాశ్యపుడు వారిని ప్రార్థించగా (106) బ్రహ్మకు ప్రియమైన ఆ సరస్వతి గాయత్రి దేవతలు, లోకుల కెల్లప్పుడు తల్లులైన వారు సంతుష్టులై కాశ్యపునితో ఇట్లా అన్నారు (107) నీవు ఇప్పుడు కోరిన ఈ వరమంతా ఓ కాశ్యప ! మా అనుగ్రహం వల్ల నీకు త్వరలో కల్గుతుంది (108) అని ఆతనితో పలికి గాయత్రీ సరస్వతులు క్షణంలో ఆ రెండు తీర్థములలో అదృశ్యమయ్యాక అప్పుడు ఓ బ్రాహ్మణులార! (109) కాశ్యపుడు కూడా కృతార్థుడై తన దేశానికి తిరిగి వెళ్ళాడు. బాంధవులు బ్రాహ్మణులు అందరు కాశ్యపుని, పాపరహితుని (110) గాయత్రి సరస్వతులందు స్నాన మాడినందు వలన స్వీకరించారు. ఈ విధముగా మీకు కాశ్యపుని విమోక్షణమును గూర్చి చెప్పాను (111) గాయత్రీ సరస్వతులలో స్నానమాడి పాతకముల నుండి ముక్తుడైనాడు. ఈ అధ్యాయాన్ని చదివినవారు (112) గాయత్రి సరస్వతులందు స్నానమాడిన ఫలితాన్ని పొందుతారు (113) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్యమందు గాయత్రి సరస్వతి తీర్థ ప్రశంస యందు కాశ్యప పాపశాంతి వర్ణన మనునది నలుబది ఒకటవ అధ్యాయము || 41 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters