Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది తొమ్మిదవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

అధాతః సంప్రక్ష్యామి కపితీర్థస్యవైభవం | తత్తీర్థం సకలై: పూర్వం గంధమాదన పర్వతే 1

సర్వేషామువకారాయ కపిభిర్నిర్మి తంద్విజాః| రావణాదిషురక్షః సుహతేషు తదనంతరం || 2 ||

తీర్థం నిర్మాయతత్రైవ సన్నుస్తే కపయోముదా | తీర్థాయచ వరం ప్రాదుః కపయః కామరూపిణః || 3 ||

అస్మిం స్తీర్థే నిమగ్నాయే భక్తి ప్రవణ చేతనః | తేసర్వే ముక్తి భాజః స్యుర్మ హా పాతక మోచితాః || 4 ||

అత్రతీర్థే నిమగ్నానాం నస్యాన్నరక జంభయం | అత్రస్నాతానరాః సర్వే దారిద్య్రం నాప్నువంతిహి || 5 ||

అత్రతీర్థేనిమగ్నానాం యమపీడాపి నోభ##వేత్‌ | కపి తీర్థం ప్రయాస్యేహమితియః సతతం బ్రువన్‌ || 6 ||

ప్రజేచ్ఛ తపందంవిప్రాః సయాయాత్‌ పరమం పదం | ఏతత్తీర్థం సమం తీర్థం న భూతంన భవిష్యతి || 7 ||

ఏవం పరంతుతే దత్వాతీర్థాయాసై#్మక పీశ్వరాః | రామం దాశరధిం సర్వే ప్రణమ్యాధయయాచిరే || 8 ||

స్వామిం స్త్వయాసై#్మ తీర్థాయ దీయతాం పరమద్భుతం | కపిభిః ప్రార్ధితోవిప్రారామచంద్రోతిహర్షితః || 9 ||

తత్తీర్థాయవరం ప్రాదాత్కపీనాం ప్రీతికారణాత్‌ | అత్ర తీర్థేనిమగ్నానాం గంగాస్నానఫలం లభేత్‌ || 10 ||

ప్రయాగస్నానజంపుణ్యం సర్వతీర్థఫలం తథా | అగ్నిష్టోమాది యాగానాం ఫలం భూయాదనుత్తమం || 11 ||

గాయత్ర్యాది మహామంత్రజప పుణ్యం తథాభ##వేత్‌ | గో సహస్ర ప్రదనౄణాం ప్రాప్నోత వికలం ఫలం || 12 ||

చతుర్ణామపివేదానాం పారాయణ ఫలం లభేత్‌ | బ్రహ్మవిష్ణు మహేశాది దేవపూజా ఫలం లభేత్‌ || 13 ||

కపితీర్థాయ రామోయం ప్రాదాదేవం పరం ద్విజాః | ఏవం రామేణ దత్తేతు పరే తత్రకుతూహలాత్‌ || 14 ||

షడర్ధసయనో బ్రహ్మా సహస్రాక్షోయమస్తథా | పరుణోగ్నిస్తథావాయుః కుబేరశ్చంద్రమా అపి || 15 ||

ఆదిత్యో నిర్‌ ఋతిశ్చైవ సాధ్యాశ్చవసవస్తథా | అన్యేపి త్రిదశాః సర్వే విశ్వేదేవాద యస్తథా || 16 ||

అత్రిర్‌భృగుస్తథాకుత్సోగౌతమశ్చపరాశరః | కణ్వోగస్త్యః సుతీక్ణశ్చ విశ్వామిత్రాదయోపరే || 17 ||

యోగినః సనకాద్యాశ్చ నారదాద్యాః సురర్షయః | రామదత్త వరం తీర్థం శ్లాఘంతే బహుధాతదా || 18 ||

సస్నుశ్చతత్ర తీర్థేతే సర్వాభీష్టప్రదాయిని | కపిభిర్నిర్మితం యస్యాత్‌ దేతత్తీర్థమనుత్తమం || 19 ||

కపితీర్థమితి ఖ్యాతి మతోలోకే ప్రయాస్యతి | ఇత్యవ్యవోచంస్తే సర్వే దేవాశ్చ మునయస్తథా || 20 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - ఇక ఇక్కడ నుండి కపితీర్థ వైభవమును చెప్తాను. ఆ తీర్థం పూర్వము గంధమాదన పర్వత మందు (1) కవులందరిచే అందరికి ఉపకారము కొరకు నిర్మితమైనది. ఓ బ్రాహ్మణులార ! రావణాది రాక్షసులు చంపబడ్డాక ఆ పిదప (2) తీర్థమును నిర్మించి ఆ కవులందరు ఆనందంతో అక్కడే స్నానం చేశారు. కామరూపులైన కవులు ఆ తీర్థమునకు పరం కూడా ఇచ్చారు (3) భక్తి ప్రవణ చేతునులై ఈ తీర్థమందు మునిగిన వారందరు మహా పాతకముల నుండి మోచితులై ముక్తి భాజనులౌతారు (4) ఈ తీర్థమందు మునిగిన వారికి నరకము నుండి కలిగే భయము ఉండదు. ఇక్కడ స్నానం చేసిన నరులందరు దారిద్ర్యమును పొందరు (5) ఈ తీర్థమందు మునిగిన వారికి యమ పీడకూడా కలుగదు. కపి తీర్థమునకు వెళుతాను అని మాటిమాటికి పలుకుతూ (6) నూరడుగులు వేసిన ఆతడు పరమ పదమునకు వెళుతాడు. ఈ తీర్థముతో సమానమైన తీర్థము గతంలో లేదు భవిష్యత్తులో రాదు (7) ఈ రకమైన వరమును కపీశ్వరులు ఈ తీర్థమునకు ఇచ్చి, అందరు దశరథరామునకు నమస్కరించి ఇట్లా యాచించారు. (8) ఓ స్వామి! మీరు కూడా ఈ తీర్థమునకు అద్భుతమైన వరమును ఇవ్వండి, అని కవులు ప్రార్థించగా రామచంద్రుడు చాలా సంతోషించి (9) కవులకు ప్రీతికలిగేట్లుగా ఆతీర్థమునకు వరమిచ్చాడు. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి గంగా స్నాన ఫలం లభించాలి (10) ప్రయాగ స్నానం వల్ల కలిగే పుణ్యము, సర్వతీర్థముల ఫలము, ముఖ్యమైన అగ్నిష్టోమాది యాగముల ఫలము కలగాలి (11) గాయత్ర్యాది మహామంత్ర జప పుణ్యము కలగాలి. గోసహస్రము దానము చేసిన నరుల అవికల ఫలమును పొందాలి (12) చతుర్వేదముల పారాయణ ఫలము పొందాలి. బ్రహ్మవిష్ణుమహేశాది దేవపూజా ఫలము పొందాలి (13) ఈ విధముగా ఓ ద్విజులార! రాముడు కపితీర్థమునకు ఈ వరములనిచ్చాడు. రాముడు ఈ విధముగా వరమీయగా కుతూహలంతో (14) ముక్కంటి, బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, వరుణుడు, అగ్ని, వాయువు, కుబేరుడు, చంద్రుడు (15) సూర్యుడు, నిర్‌ఋతి, సాధ్యులు, వసువులు, ఇతరదేవతలు, అట్లాగే విశ్వేదేవాదులు (16) అత్రి, భృగు, కుత్స, గౌతమ, పరాశరులు, అగస్త్యులు, సుతీక్షుణడు, ఇతరులు విశ్వామిత్రులు (17) సనకాదియోగులు, నారదాది దేవర్షులు రాముడు వరమిచ్చిన ఆ తీర్థమును అనేక విధముల పొగిడారు (18) సర్వాభీష్టములనిచ్చే ఆ తీర్థమందు వారు స్నానం కూడా చేశారు. ఈముఖ్యమైన తీర్థము కవులతో నిర్మించబడింది కనుక (19) ఇది అందుకే కపితీర్థమనే ఖ్యాతిని లోకంలో పొందగలదు అని కూడా ఆ దేవతలు మునులు అంతా పలికారు (20).

మూ ||తస్మాదవశ్యం గంతవ్యం కపితీర్థం ముముక్షుభిః | రంభాకౌశికశాపేన శిలాభూతాపురాద్విజాః || 21 ||

తత్రస్నాత్వానిజం రూపం ప్రపేదేచదివం య¸° | అస్యతీర్థస్య మాహాత్మ్యం మయావక్తుం సశక్యతే || 22 ||

మునయ ఊచుః -

రంబాంకి మర్థమశపత్‌ కౌశికః సూతనందన | కథం గతా శిలాభూతా కపితీర్థం సురాంగనా

ఏతన్నః సర్వమాచక్ష్వ విస్తరాన్ముని నత్తమ || 23 ||

శ్రీ సూత ఉవాచ -

విశ్వామిత్రా భిదో రాజా ప్రాగభూత్కుశికాన్వయే || 24 ||

సకదాచిన్మహారాజః సేనాపరివృతోబలీ | మేదినీం పరిచక్రామ రాజ్యవీక్షణ కౌతుకీ || 25 ||

అటిత్వాసబహూన్‌ దేశాన్‌ వసిష్ఠ స్యాశ్రమం య¸° | అతిధ్యాయ వృతః సోయం వసిష్ఠేనమహాత్మనా || 26 ||

తథాస్త్విత్య బ్రవీత్సోయం దండవత్ర్పణతోనృపః | కామధేనుప్రభావేన విశ్వామిత్రాయభూభుజే || 27 ||

ఆ తిథ్యమ కరో ద్విప్రా వసిష్ఠో బ్రహ్మనందనః | కామధేను ప్రభావంవైజ్ఞాత్వా కుశిక నందనః || 28 ||

వసిష్ఠం ప్రార్థయామాన కామధేను మభీష్టదాం | ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన ప్రచకర్షచతాం బలాత్‌ || 29 ||

కామధేను విసృష్టౌస్తువ్లుెచ్ఛాద్యైః సవరాజితః | మహాదేవం సమారాధ్య తస్మాదస్త్రాణ్య వాప్యచ || 30 ||

వసిష్ఠస్యాశ్రమం గత్వావ్యసృజచ్ఛరసంచయాన్‌ | సర్వాణ్యస్త్రాణి ముముచే బ్రహ్మాస్త్రంచ సృపోత్తమః || 31 ||

తాని సర్వాణి చాస్త్రాణి వసిష్టో బ్రహ్మనందనః | ఏకేన బ్రహ్మ దండేన నిజఘ్న స్వతపోబలాత్‌ || 32 ||

తతః పరాజితో విప్రా విశ్వామిత్రోతిలజ్జితః | బ్రాహ్మణ్యా వాప్తయే స్వస్యతపః కర్తుం వనం య¸° || 33 ||

పూర్వాసు పశ్చిమాంతాసు త్రిషుదిక్షుతపోచరత్‌ | ప్రాదుర్భూత మహావిఘ్నస్తత్తద్దిక్షు సకౌశికః || 34 ||

ఉత్తరాందిశమాసాద్యహి మవత్పర్వతేమలే | కౌశిక్యాన్సరితస్తీరే పుణ్యపాప వినాశిని || 35 ||

దివ్యంవర్షసహస్రంతునిరాహారో జితేంద్రియః | నిరాలోకోజితశ్వాసోజితక్రోధః సునిశ్చలః || 36 ||

గ్రీష్మే పంచాగ్ని మధ్యస్థః శిశిరే వారిషుస్థితః | వర్షాస్వాకాశగోనిత్యమూర్ధ్వ బాహుర్నిరాశ్రయః || 37 ||

బ్రాహ్ణ్యసిద్ధయేత్యుగ్రంచచారసుమహత్తవః | ఉద్విగ్నమనసస్తన్యత్రిదశాస్త్రిదివాల యాః

జంభారిణాచ సహితా రంభాం ప్రోచురిదం పచః || 38 ||

తా || కనుక మోక్షమును కోరువారు తప్పకుండా కపితీర్థమునకు వెళ్ళాలి. పూర్వం రంభ కౌశికుని శాపంతో శిలగా మారింది (21) అక్కడ స్నానం చేసి తన పూర్వ రూపాన్ని పొందింది. స్వర్గానికి వెళ్ళింది కూడా. ఈ తీర్థమాహాత్మ్యమును నేను చెప్పలేను (22) మునులు ఇట్లా అన్నారు - ఓసూతనందన ! కౌశికుడు రంభ##నెందుకు శపించాడు. శిలగా మారిన ఆమె దేవతాస్త్రీ కపితీర్థానికి ఎట్లా వెళ్ళింది. ఓ ముని సత్తమ ! విస్తరంగా ఇదంతా మాకు చెప్పండి. (23) అని అనగా శ్రీసూతులిట్లనిరి - పూర్వం కుశికాన్వయ మందు విశ్వామిత్రుడను రాజు ఉండేవాడు (24) బలవంతుడైన ఆ రాజు ఒకసారి సేనతో పరివృతుడై రాజ్యాన్ని చూడాలనే కోరికతో భూమిపై తిరిగాడు (25) అతడు అనేక దేశాలు తిరిగి వసిష్ఠా శ్రమమునకు వెళ్ళాడు. మహాత్ముడైన వసిష్ఠుడు ఈతనిని అతిథిగా వరించాడు (26) ఈతడు అట్లాగే కానిమ్మని పలికాడు. రాజు దండమువలె ప్రణామం చేశాడు. కామధేను ప్రభావంతో రాజైన విశ్వామిత్రునకు (27) బ్రహ్మనందనుడైన వసిష్ఠుడు అతిథ్యమిచ్చాడు. ఓ బ్రాహ్మణులార ! కుశికనందనుడు కామధేను ప్రభావమును తెలుసుకొని (28) అభీష్టములనిచ్చే కామధేనువును ఇమ్మని వసిష్ఠుని ప్రార్థించాడు. వసిష్ఠుడు వ్యతిరేకించగా దానిని బలంగా లాగాడు (29) కామధేనువు వదలిన వ్లుెచ్ఛులు అతనినోడించారు. ఆ రాజు మహాదేవునారాధించి ఆతని నుండి అస్త్రములను పొంది (30) వసిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళి శరసమూహములను వదిలాడు. అన్ని అస్త్రములను, బ్రహ్మాస్త్రమును కూడా ఆ రాజు వదిలాడు (31) ఆ అస్త్రములనన్నింటిని బ్రహ్మనందనుడైన వసిష్ఠుడు తన తపోబలంతో ఒక్క బ్రహ్మదండంతోనే సంహరించాడు (32) అక్కడ ఓడినవాడై విశ్వామిత్రుడు చాలా సిగ్గుపడి తనకు బ్రాహ్మణ్యం రావటం కొరకు తపస్సు చేయటానికి అడవికి వెళ్ళాడు (33) పూర్వం దిక్కున దక్షిణ పశ్చిమములందు మూడు దిక్కులలో తపమాచరించాడు. ఆయాదిక్కులలో గొప్ప విఘ్నమేర్పడి కౌశికుడు (34) ఉత్తర దిక్కును చేరి నిర్మలమైన హిమవత్పర్వతమందు కౌశికి సరస్సు తీరమందు పాప నాశకమైన పుణ్యప్రదమైన దాని తీరమందు (35) దేవతల వేయి సంవత్సరముల కాలము నిరాహారుడై ఇంద్రియముల జయించి, వెలుగుచూడకుండ శ్వాసను జయించి, క్రోధమును జయించి సశ్చిలుడై (36) గ్రీష్మ మందు పంచాగ్ని మధ్య మందున్నవాడై శిశిరమందు నీటి యందున్నవాడై వర్షాకాలమందు ఆకాశాన్ని చూస్తూ ఎప్పుడూ చేతులు పైకెత్తి, నిరాశ్రయుడై (37) బ్రాహ్మణ్య సిద్ధికొరకు ఉగ్రమైన గొప్ప తపము ఆచరించాడు. ఉద్విగ్నమనస్కుడైన ఆతనిని గూర్చి త్రిదివాలయ మందలి దేవతలు, ఇంద్రుడు కూడా కలిసి రంభతో ఇట్లా అన్నారు (38).

మూ || దేవా ఊచుః -

రంభేత్వం హిమవచఛైలే కౌశికీ తీరగంమునిం || 39 ||

విశ్వామిత్రం తపస్యంతం విలోభమవిచేష్టితైః | యధాతత్తపసోవిఘ్నోభవిష్యతి తథాకురు || 40 ||

ఏవముక్తాతదారంభాదేవైరింద్ర పురోగమైః | ప్రత్యువాచ సురాన్సర్వాన్ర్పాంజలిః ప్రణతాతదా || 41 ||

రంభోవాచ -

అతిక్రూరోమహాక్రోధో విశ్వామిత్రోమహామునిః | సశప్స్యతే మాంక్రోధేనబిభేమ్యస్మాదహంసురాః || 42 ||

త్రాయధ్వంకృపయాయూయంమాంయుష్మత్పరిచారికాం | ఇత్యుక్తోరంభ యాతత్రజంభారిస్తామభాషత || 43 ||

ఇంద్ర ఉవాచ -

రంభే త్వయాన భీః కార్యా విశ్వామిత్రాత్తపోధనాత్‌

అహమప్యాగమిష్యామిత్వత్సహాయః సమన్మధః || 44 ||

కోకిలాలావమధురోవనంతోప్యాగమిష్యతి | అతిసుందరరూపాత్వం ప్రలోభయమహామునిం || 45 ||

ఇతీంద్రకథితా రం భావిశ్వామిత్రాశ్రమంయ¸° | తద్దృష్టి గోచరాస్థిత్వా లలితం రూపమాస్థితా || 46 ||

సామునింలోభయామాసమనోహర విచేష్టితః | పికోపి తస్మిన్సమయే చుకూజానందయన్మనః || 47 ||

శ్రుత్వాపికస్వరంరంభాం దృష్ట్వాచమునిపుంగవః | సంశయావిష్టహృదయో విదిత్వాశక్రకర్మతత్‌

శశాపరంభాం క్రోదేన విశ్వామిత్రస్తపోధనః || 48 ||

విశ్వామిత్ర ఉవాచ -

యస్మాత్కోపయసేరంభౌ మాంత్వం కోపజయైషిణం || 49 ||

శిలాభవాత్రత స్మాత్త్వం రంభే వర్షశతాయుతం 7 తదంతరే బ్రాహ్మణన రక్షితా మోక్షమాప్ప్యసి || 50 ||

విశ్వామిత్రస్య శాపేన తదంతేసాశిలా భవత్‌ | బహుకాలం శిలాభూతా తస్థౌ తస్యా శ్రమే ద్విజాః || 51 ||

విశ్వామిత్రో పిధార్మాత్మా పునస్తప్త్వా మహత్సవః | లేభేవసిష్ఠ వాక్యేన బ్రాహ్మణ్యం దుర్లభం నృపైః || 52 ||

బహుకాలం శిలాభూతా రంభాప్యాసీత్తదాశ్రమే || 52 1/2 ||

తా || దేవతలిట్లా అన్నారు. ఓ రంభ! నీవు హిమవత్పర్వత మందు కౌశికీ తీరమందున్న మునిని (39) తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని నీ చేష్టలతో లోభ##పెట్టు. ఆతని తపస్సుకు విఘ్నమయ్యేట్టు చేయి (40) ఇట్లా అనగా, రంభ దేవతలు ఇంద్రుడు మొదలగు వారితో చేతులు జోడించి నమస్కరిస్తూ అప్పుడు ఇట్లా అంది (41) రంభ వచనము - అతి క్రూరుడు, మహోకోపం కలవాడు మహామునియైన ఆ విశ్వామిత్రుడు ఆతడు కోపంతో నన్ను శపిస్తాడు. ఓ దేవతలార! అందువల్ల అతడంటే భయము. (42) అందువల్ల మీ పరిచారికయైన నన్ను మీరు దయతో రక్షించండి. అని రంభ అనగా అప్పుడు ఇంద్రుడు ఆమెతో ఇట్లా అన్నాడు (43) ఇంద్రుని మాట - ఓ రంభ! నీవు భయపడొద్దు. దపోధనుడైన ఆ మహర్షిని చూసి నేను కూడా నీకు సహాయం చేసే కొరకు మన్మథునితో కూడి వస్తాను (44) కోకిలల ధ్వనితో మధురమైన వసంతుడు కూడా వస్తాడుమనతో. అతి సుందరరూపం కల నీవు మహామునిని లోభ##పెట్టు (45) అని ఇంద్రుడనగా రంభ విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళింది. అతని దృష్టి గోచరమయ్యేట్లుగా నిలబడి లలితమైన రూపంతో ఉంది (46) మనోహరమైన చేష్టలతో ఆమె ఆ మునిని లోభ##పెట్టసాగింది. ఆ సమయంలో కోకిల కూడా మనస్సును ఆనందపరుస్తూ కూయసాగింది. (47) మునిపుంగవుడు పిక స్వరమును విని రంభను చూచి హృదయం సంశయంతో నిండిపోగా ఇది ఇంద్రుని పని అని గ్రహించి కోపంతో తపోదనుడైన విశ్వామిత్రుడు రంభను శపించాడు (48) విశ్వామిత్ర వచనము ఓ రంభ! కోపమును జయించాలని అనుకుంటున్న నన్ను నీవు కోపంకలిగేట్టుగా చేస్తున్నావు. (49) కనుక ఓ రంభ! నీవు పదివేల నూర్ల సంవత్సరాలు (లక్ష) ఇక్కడ శిలగా పడి ఉండు. ఈ మధ్యలో బ్రాహ్మణునితోరక్షింపబడి మోక్షాన్ని పొందుతావు (50) అని విశ్వామిత్రుని శాపంతో ఆమె శిలగా మారింది. ఓ ద్విజులార! ఆతని ఆశ్రమంలో చాలా కాలము శిలగానే ఉండింది (51) ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు తిరిగి గొప్ప తపస్సు చేసి వసిష్ఠుని వాక్యంతో రాజులకు దుర్లభ##మైన బ్రాహ్మణ్యమును పొందాడు (52) రంభ కూడా ఆతని ఆశ్రమంలో చాలా కాలము శిలగానే ఉండింది.

మూ || తస్మిన్నే నాశ్రమేపుణ్యశిష్యోగస్త్యన్య సంమతః || 53 ||

శ్వేతోనామమునిశ్చక్రే ముముక్షుః పరమంతపః | చిరకాలం తపస్తస్మిప్రకుర్వతి మహామునౌ || 54 ||

అంగారకేతివి ఖ్యాతా రాక్షసీ కాచిదాగతా | తస్యాశ్రమ మతిక్రూరామే ఘన్వన మహాస్వనా || 55 ||

మూత్ర రక్త పురీషాద్యైః దూషయామానభీషణా | ఉపద్రవైస్తథాచాన్యైర్బాధ యామాసతం మునిం || 56 ||

అథకృద్ధోమునిః శ్వేతో వాయువ్యాస్త్రేణయోజయన్‌ | శప్తాం కుశికపుత్రేణ రాక్షసై#్యప్రాక్షిపచ్ఛిలాం || 57 ||

రాక్షసీసాప్రదుద్రావ వాయవ్యాస్త్రణ యోజితా | వాయువ్యాస్త్ర ప్రయుక్తేన దృషదానుద్రుతాచసా || 58 ||

దక్షిణాంబునిధేస్తీరం ధావతి స్మభయార్దితా | ధావన్తీమనుధాపన్తీ సాశిలాస్త్ర ప్రయోజితా || 59 ||

పపాతో పరిరాక్షస్యామజ్జంత్యాః కపితీర్థకే | మృతాసారాక్షసీతత్ర శిలాపాతాత్‌ స్వమూర్ధని || 60 ||

విశ్వామిత్రేణ శప్తాసాక పితీర్థేనిమజ్జనాత్‌ | శిలారూపం పరిత్యజ్యరంభా రూపముపేయుషీ || 61 ||

దేవైః కుసుమధారా భిరభివృష్టామనోరమా | దివ్యం విమాన మారూఢా దివ్యాంబరవిరాజితా || 62 ||

హారకే యూరకటక నాసాభరణ భూషితా | ఉర్వశ్యాద్యప్సరోభిశ్చ సభిభిః పరివారితా || 63 ||

కపితీర్థస్యమాహాత్మ్యం ప్రశంసతీపునః పునః | నిషేవ్యరామనాథంచ శంకరం శశిభూషణం || 64 ||

ఆఖండలపురీం రమ్యాం ప్రయయావమరావతీం | రాక్షసీసాపిశాపేన కుంభజస్యమహౌజనః || 65 ||

ఘృతాచీ దేవవేశ్యాహి రాక్షసీరూపమాగతా | సాప్యత్ర కపితీర్థాప్సుస్నానాత్స్వం రూపమాయ¸° || 66 ||

ఏవంరంభాఘృతాచ్యౌతేకపితీర్థేనిమజ్జనాత్‌ | అగస్త్య శిష్యశ్వేతస్యప్రాసాదాద్ద్విజసత్తమాః || 67 ||

రాక్షసీత్వం శిలాత్వంచ హిత్వాస్వం రూపమాగతే | తస్మాత్సర్వప్రయత్నేన స్నాతవ్యం కపితీర్థకే || 68 ||

య శృణోతీయ మధ్యాయం పఠతేవాపిమానవః | ప్రాప్నోతికపితీర్థస్య స్నానజంఫలముత్తమం || 69 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే కపితీర్థప్రశంసాయాం రంభాఘృతాచీ శాపవిమోక్షణ వర్ణనం నామ ఏకోనచత్వారింశోధ్యాయః || 39 ||

తా || పుణ్యమైన ఆ ఆశ్రమంలోనే అగస్త్యుని శిష్యుడు (53) శ్వేతుడను ముని మోక్షార్థిఐ పరమమైన తపస్సు చేశాడు. ఆ మహాముని అక్కడ చాలా కాలము తపస్సు చేస్తుండగా (54) అంగారక అనుపేరుగల ప్రసిద్ధి చెందిన రాక్షసి ఒకతె వచ్చింది. అతి క్రూరురాలు, మేఘగర్జన వంటి పెద్ద గొంతుగల (55) భీషణమైన ఆ రాక్షసి మూత్ర రక్త పురీషాదులతో ఆ ఆశ్రమాన్ని మలిన పరిచింది. ఆ మునిని ఉపద్రవములతో ఇతర విధముల బాధించసాగింది. (56) అప్పుడు కోపగించిన శ్వేతనామక ఆముని వాయవ్యాస్త్రమును సందించి, కౌశికునితో శపింపబడ్డ ఆశిలను ఆ రాక్షసిపై విసిరాడు. (57) వాయవ్యాస్త్రముతో గురిపెట్టబడిన ఆ రాక్షసి పరుగెత్త సాగింది. వాయవ్యాస్త్రంతో ప్రయోగింపబడ్డ శిలతో అనుసరింపబడుతూ అది పరుగెత్తింది (58) భయపడుతూ అది దక్షిణ సముద్రతీరాన్ని గూర్చి పరుగెత్తింది. అస్త్రముతో ప్రయోగింపబడ్డ ఆశిల పరుగెత్తుతున్న రాక్షసిని అనుసరిస్తూ (59) కపితీర్థంలో మునుగుతున్న రాక్షసిపైన పడింది. తన తలపై రాయిపడడంతో ఆ రాక్షసి అక్కడ చచ్చిపోయింది. (60) విశ్వామిత్రునితో శపించబడ్డ ఆమె(శిల) కపి తీర్థంలో మునగటంవల్ల శిలా రూపాన్ని వదలి రంభారూపాన్ని పొందింది. (61) మనోరమమైన ఆమెను దేవతలు పూలధారలతో వర్షించారు (తడిపారు). దివ్య విమానమునారోహించి, దివ్యఅంబరములతో వెలిగిపోతూ (62) హారకేయూర కటకనాసాభరణములతో అలంకరింపబడి, ఊర్వశిమొదలగు అప్సరసలతో సఖులతో పరివేష్టింపబడి (63) కపితీర్థమాహాత్మ్యాన్ని మాటిమాటికి ప్రశంసిస్తూ, రామనాథుడు, శశిభూషణుడైన శంకరుని సేవించి (64) ఇంద్రుని పట్టణమైన అందమైన అమరావతికి వెళ్ళిపోయింది. మహా తేజస్సంపన్నుడైన అగస్త్యుని శాపంతో (ఆ రాక్షసి గూడా) (65) ఘృతాచి అనుదేవవేశ్యరాక్షసి రూపాన్ని పొందింది. ఆమె కూడా ఇక్కడ కపితీర్థం నీటిలో స్నానం వల్ల తన రూపాన్ని పొందింది. (66) ఈ విధంగా రంభ ఘృతాచులిద్దరు కపితీర్థ స్నానంవల్ల అగస్త్య శిష్యుడైన శ్వేతుని అనుగ్రహం వల్ల ఓ బ్రాహ్మణులార ! (67) రాక్షసి రూపాన్ని, శిలరూపాన్ని వదలి తమ రూపాన్ని పొందారు. అందువలన అన్ని విధముల ప్రయత్నించి కపి తీర్థ మందు స్నానం చేయాలి (68) ఈ అధ్యాయమును వినిన లేదా చదివినా నరుడు ఉత్తమమైన కపితీర్థంలో స్నానం వల్ల వచ్చే ఫలాన్ని పొందుతాడు (69) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్రసంహిత యందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యంలో కపితీర్థ ప్రశంసయందు రంభా ఘృతాచి శాపమోక్షణ వర్ణనమనునది ముప్పది తొమ్మిదవ అధ్యాయము || 39 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters