Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది రెండవ అధ్యాయము

మూ|| శ్రీ సూత ఉవాచ -

భూయోపి సంప్రవక్ష్యామి ధనుష్కోటేస్తు వైభవం | యుష్మాక మాదరేణాహం నైమిశారణ్య వాసినః || 1 ||

నందోనామ మహారాజః సోమవంశ సముద్భవః | ధర్మేణ పాలయామాన సాగరాంతాం ధరామిమాం || 2 ||

తస్యపుత్రః సమభవత్‌ ధర్మగుప్త ఇతిశ్రుతః | రాజ్యరక్షా ధురం నందో నిజపుత్రే నిధాయసః || 3 ||

జితేంద్రియోజితా హరః ప్రవివేశతపోవనం | తాతేతపోవనం యాతే ధర్మగుప్తాభిధోనృపః || 4 ||

మేదినీం పాలయామా సధర్మజ్ఞోనీతి తత్పరః | ఈజే బహువిధైర్యజ్ఞైః దేవానింద్ర పురోగమాన్‌ || 5 ||

బ్రాహ్మణ భ్యోదదౌవిత్తం క్షేత్రాణి చబహూనిసః | సర్వే స్వ ధర్మనిరతః తస్మిన్‌ రాజనిశాసతి || 6 ||

బభూపుర్నాభవన్‌ పీడాస్తస్మింశ్చోరాది సంభవాః | కదాచిద్ధర్మగుప్తోయ మారూఢస్తుర గోత్తమం || 7 ||

వనంవివేశవిప్రేంద్రా మృగయారసకౌతుకీ | తమాలతాల హింతాల కురవాకులదిఙ్‌ముఖే || 8 ||

విచచారవనే తస్మిన్‌ సింహవ్యాఘ్రభయానకే | మత్తాలికులసంనాద సమ్మూర్భిత దిగంతరే || 9 ||

పద్మకల్హారకుముద నీలోత్పల వనాకులైః తటాకైరపి సంపూర్ణే తపస్విజన మండితే || 10 ||

తస్మిన్వనే సంచరతో ధర్మగుప్తస్య భూపతేః | అభూద్విభావరీ నిప్రాస్తమసావృత దిఙ్‌ముఖా || 11 ||

రాజాపిపశ్చిమాం సంధ్యాం ఉపాస్యనియమాన్వితః | జజాపతత్రచవనే గాయత్రీం వేదమాతరం || 12 ||

సింహవ్యాఘ్రాదిభీత్యాస్మిన్‌ వృక్షమేకం సిమాస్థితే | రాజపుత్రే తదాభ్యాగాత్‌ ఋక్షః సింహభయార్దితః || 13 ||

అస్వధావతతం ఋక్షమేకః సింహోవనే చరః | అసుద్రు తః స సింహేన ఋక్షోవృక్షము పారుహత్‌ || 14 ||

అరుహ్యఋక్షో వృక్షంతం దదర్శజగతీపతిం | వృక్షస్థితం మహాత్మానం మహాబలపరాక్రమం || 15 ||

ఉవాచ భూపతిందృష్ట్వాఋక్షో యం వనగోచరః | మాభీతిం కురురాజేంద్రవత్స్యావోరజనీమిహ || 16 ||

మహాసత్వోమహాకాయో మహాదంష్ట్రా సమాకులః | వృక్షమూలం సమాయాతః సింహోయమతి భీషణః || 17 ||

రాత్ర్యర్ధం భజనిద్రాంత్వం రక్ష్యమణోమయా దితః | తతః ప్రసుప్తం మాంరక్షశర్వర్యర్ధం మహామతే || 18 ||

ఇతితద్వాక్యమాదాయ సుప్తేనందసుతే హరిః | ప్రోవాచ ఋక్షం మస్తోయం నృపశ్చత్యజ్యతామితి || 19 ||

తా || శ్రీ సూతులిట్లనిరి | నైమిషారణ్య వాసులార ! ధనుష్కోటి వైభవాన్ని ఇంకా చెప్తాను మీకు ఆదరంతో (1) సోమవంశమందు పుట్టిన నందుడను మహారాజు సాగరమేహద్దుగా గల ఈ భూమిని ధర్మంతో పాలించసాగాడు (2) అతనికి ధర్మగుప్తుడని పిలువబడు పుత్రుడు కలిగాడు. రాజ్యరక్షాభారమును నందుడు తన కొడుకు యందుంచి (3) జితేంద్రియుడు, జితాహారుడు ఆరాజు తపోవనమునకు వెళ్ళాడు. తండ్రి తపోవనమునకు వెళ్ళాక ధర్మగుప్తుడను పేరు గల రాజు (4) ధర్మజ్ఞుడై నీతి తత్పరుడై భూమిని పాలించసాగాడు. ఇంద్రుడు మొదలగు దేవతలను బహువిధ యజ్ఞములతో పూజించాడు. (5) బ్రాహ్మణులకు విత్తమును బహుక్షేత్రములను ఇచ్చాడు. ఆ రాజు పరిపాలిస్తుండగా అందరు తమతమ ధర్మములందు ఆసక్తితో ఉన్నారు. (6) దొంగలు మొదలగు వారితో కలిగే పీడలు కలుగలేదు. ఒకసారి ఈ ధర్మగుప్తుడు ఉత్తమమైన గుఱ్ఱాన్ని అధిరోహించి (7) వేటాడుట యందు ఆసక్తి కలవాడై అడవిలోకి ప్రవేశించాడు. దిక్కులన్ని తమాలతాల హింతాల కురవవృక్షములతో నిండి ఉన్నాయి (8) సింహవ్యాఘ్రములతో భయానకమైన ఆ అడవి యందు తిరుగసాగాడు. దిక్కులన్ని మదించిన తుమ్మెదల ధ్వనితో నిద్రిస్తున్నాయి. (9) పద్మకల్హార కుముదనీలోత్పల వనములతో నిండిన తటాకములతో పూర్ణమై తపస్విజనులతో అలంకరింపబడి ఉంది (10) ఆ అరణ్యంలో తిరుగుతున్న ధర్మగుప్తరాజునకు రాత్రైంది. దిక్కులన్ని చీకటితో కప్పబడ్డాయి (11) రాజు కూడా పశ్చిమ సంధ్యను ఉపాసించి నియమం కలవాడై వేదమాతయైన గాయత్రిని ఆ అడవిలో జపించాడు (12) సింహ వ్యాఘ్రముల భయముతో ఈ రాజు ఒక చెట్టు నెక్కగా, సింహ భయంతో బాధపడుతూ ఒక ఎలుగు బంటు రాజుదరికి వచ్చింది (13) అడవిలో తిరిగే ఒక సింహము ఆ ఎలుగుబంటును అనుసరించి పరుగెత్తసాగింది. సింహంవెనుకపరుగెత్తిరాగాభయంతో ఎలుగుబంటు చెట్టెక్కింది (14) ఆ ఎలుగు బంటు చెట్టునెక్కి రాజును చూసింది. మహా బలపరాక్రమములు గల మహాత్ముడైన చెట్టుయందున్న (15) రాజును చూచి అడవిలో కన్పించే ఆ ఎలుగుబంటు ఇట్లా అంది. ఓ రాజేంద్ర భయపడొద్దు. ఇక్కడ ఈ రాత్రి ఉందాము (16) గొప్పబలము, గొప్పశరీరము, గొప్ప కోరలు కలిగిన ఈ భీషణమైన సింహము చెట్టుమొదటికి వచ్చింది (17) నేను మొదటినుండి నిన్ను రక్షిస్తుండగా నీవు సగము రాత్రి వరకు నిద్రపో. ఓ మహామతి ! మిగిలిన సగమురాత్రి నిద్రపోయే నన్ను రక్షించు నీవు (18) ఆ మాటను అంగీకరించి నందసుతుడు నిద్రపోగా అప్పుడు సింహము ఎలుగుబంటుతో ఇట్లా అంది. ఈ రాజు నిద్రపోయాడు. ఈతనిని వదులు అని (19)

మూ|| తంసింహమ బ్రవీ దృక్షో ధర్మజ్ఞో ద్విజసత్తమాః | భవాన్‌ ధర్మం నజానీషే మృగరాజవనేచర || 20 ||

విశ్వాసఘాతినాంలోకే మహాకష్టా భవంతి హి | సహి మిత్ర ద్రుహాం పాపం నశ్యేద్యజ్ఞాయుతైరపి || 21 ||

బ్రహ్మహత్యాది పాపానాం కథంచిన్నిష్కృతిర్భవేత్‌ | విశ్వస్తఘాతినాం పాపంసనశ్యేజ్జన్మకోటిభిః || 22 ||

నాహంమేరుం మహాభారం మన్యే పంచాన్య భూతలే | మహాభారమిమం మన్యేలోకే విశ్వాసఘాతకం || 23 ||

ఏవముక్తోథ ఋక్షేణ సింహస్తూష్ణీ మభూత్తదా | ధర్మగుప్తే ప్రబుద్ధేతు ఋక్షః సుష్వాప భూరుహె || 24 ||

తతః సింహోబ్రవీద్భూవం ఏన మృక్షం త్యజస్వమే | ఏవముక్తోథ సింహేన రాజాసుప్తమశంకితః || 25 ||

స్వాంకన్యస్త శిరస్కం తమృక్షం తత్యాజ భూతలే | పాత్య మాసన్తతో రాజ్ఞాన ఖాలంబిత పాదవః || 26 ||

ఋక్షః పుణ్యవశాత్‌ వృక్షాత్‌ నపపాత మహీతలే | స ఋక్షో నృపమభ్యేత్య కోపాద్వాక్యమ భాషత || 27 ||

కామరూప ధరోరాజన్నహం భృగుకులోద్భవః | ధ్యాన కాష్ఠాభి ధోనామ్నా ఋక్షరూపమధారయం || 28 ||

యస్మాదనాగసంసుప్తం అత్యాక్షీన్మాం భవాన్పృప | మచ్ఛాపాత్త్వమతః శీఘ్ర మున్మత్తశ్చర భూపతే || 29 ||

ఇతిశప్త్వాముని ర్భూవం తతః సింహమభాషత | నృసింహస్త్వం మహాయక్షః కుచేర సచివః పురా || 30 ||

హిమవద్గిరి మాసాద్యకదాచిత్‌త్వం వధూసఖః | అజ్ఞానాత్‌ గౌతమభ్యాశే విహార మతనోర్ముదా || 31 ||

గౌతమో ప్యుటజాద్దై వాత్‌ సమిదాహరణాయవై | నిర్గతస్త్వాం వివసనం దృష్ట్వా శాపముదా హరత్‌ || 32 ||

యస్మాస్య మాశ్రమేద్య త్వం వివస్త్రః స్థితవానసి | అతః సింహత్వమద్యైవ భవితాతే న సంశయః || 33 ||

ఇతిగౌతమ శాపేన సింహత్వమగమత్పురా | కుబేర సచివోయక్షో భద్రనామాభవాన్‌పురా || 34 ||

కుబేరో ధర్మశీలోహితద్బృత్యాశ్చతథైవహి | అతః కి మర్థంత్వం హింసి మామృక్షిం వనగోచరం || 35 ||

ఏతత్సర్వమహంధ్యానాత్‌ జానామీహమృగాధిప || 35 1/2 ||

తా || ఓ బ్రాహ్మణులార ! ధర్మమెరిగిన ఆ ఋక్షము ఆ సింహంతో ఇట్లా అంది. వనంలో తిరిగే మృగరాజ ! నీకు ధర్మం తెలయదా (20) విశ్వాసఘాతులకు లోకంలో ఎన్నో కష్టాలు వస్తాయి. మిత్రద్రోహియైన వాని పాపము పదివేల యజ్ఞములు చేసినా నశించదు. (21) బ్రహ్మహత్యాది పాపములకు ఏదో రకంగా నిష్కృతి ఉంది. విశ్వాస ఘాతుల పాపము కోటి జన్మలలోను నశించదు (22) ఓ పంచాస్యమ! ఈ భూమి మీద మేరువును మహాభారమైన దానినిగా భావించటం లేదు. విశ్వాస ఘాతకుడే లోకంలో మహా భారమైన వాడుగా నేను భావిస్తాను (23) ఇట్లా ఎలుగుబంటు అనగానే సింహం మౌనంగా ఉండి పోయింది. ధర్మగుప్తుడు మేల్కొనగానే ఎలుగుబంటుచెట్టుపైపడుకొంది (24) అప్పుడుసింహంఇట్లాఅంది రాజుతో ఈ ఎలుగుబంటును నాకు వదలు అని. ఇట్లా అనగానే రాజు ఏ మాత్రం శంకలేకుండా నిద్రిస్తున్న (25) తన తొడపై తల ఆన్చి నిద్రిస్తున్న ఆ ఎలుగుబంటును భూమిపైకి విడిచాడు. రాజు దానిని పడవేస్తుండగా, అది తన గోళ్ళతో చెట్టును పట్టుకొని (26) అదృష్టవశాత్తు ! పుణ్యం భూమిపై పడలేదు. ఆ ఎలుగు గొడ్డు రాజు దగ్గరకు వచ్చి కోపంతో ఇట్లా అంది. (27) ఓ రాజ ! నేను భృగుకులంలో పుట్టినవాణ్ణి. కామరూపధారిని నాపేరు ధ్యానకాష్ఠాభిధుడు. ఎలుగుగొడ్డు రూపం ధరించాను (28) ఓ రాజ ! తప్పులేని, నిద్రిస్తున్న నన్ను నీవు వదిలావు కనుక ఇక్కడి నుండి నా శాపం వల్ల త్వరగా ఉన్మత్తుడవై తిరుగు ఓ రాజ ! (29) అని ముని రాజును శపించి పిదప సింహంతో ఇట్లా అన్నాడు. నీవు నృసింహుడవు. మహా యక్షుడవు పూర్వం కుబేరుని సచివుడవు (30) హిమవత్‌గిరికి ఒకసారి నీవు నీ భార్యతో కూడా వచ్చి, అజ్ఞానం వల్ల గౌతముని ఆశ్రమమందు సంతోషంతో విహరించావు (31) గౌతముడు కూడా దైవవశాత్తూ సమిదలు తెచ్చే కొరకు పర్ణశాల నుండి బయటికి వచ్చి వస్త్రములులేని నిన్ను చూచి శపించాడు. (32) నా ఆశ్రమంలో ఈ వేళనీవు వివస్త్రుడవుగా ఉన్నావు కనుక ఇప్పుడే సింహమువైపోదువుగాక అనుమానంలేదు అని (33) అని గౌతమ శాపం వల్ల పూర్వం సింహమువైనావు. కుబేర సచివుడవు భద్రుడను పేరుగల యక్షుడవు పూర్వంలో నీవు (34) కుబేరుడు ధర్మశీలుడు అతని భృత్యులు కూడ అలాంటివారే. అందువల్ల అడవిలో కన్పించిన ఋషివైన నన్ను నీవు ఎందుకు హింసిస్తావు (35) ఓ మృగాధిప ! ఇదంతా నేను ధ్యానం వల్ల తెలుసుకున్నాను. (33 1/2)

మూ || ఇత్యుక్తే ధ్యాన కాష్ఠేన త్యక్త్వా సింహత్వ ఆశునః || 36 ||

యక్షరూపం గతోదివ్యం కుబేర సచివాత్మకం | ధ్యానకాష్ఠమసావాహప్రాంజలిః ప్రణతోమునిం || 37 ||

అద్యజ్ఞాతం మయాసర్వం పూర్వవృత్తంమహామునే | గౌతమః శాపకాలేమే శాపాంతమపిచోక్తవాన్‌ || 38 ||

ధ్యాన కాష్ఠేన సంవాద ఋక్షరూపేణ తేయదా | తదానిర్ధూయసింహత్వం యక్షరూపమవావ్స్యసి || 39 ||

ఇతిమామబ్రవీద్ర్బహ్మన్‌ గౌతమోమునిపుంగవః | అద్యసింహత్వనాశాన్మేజానామిత్వాం మహామునే || 40 ||

ధ్యానకాష్ఠాభిధం శుద్ధం కామరూప ధరంసదా | ఇత్యుక్త్వాతం ప్రణమ్యాథ ధ్యానకాష్ఠం సయక్షరాట్‌ || 41 ||

విమాన వరమారుహ్య ప్రయమావలకాపురీం | తస్మిన్గతేతుయక్షేశే ధ్యానకాష్ఠో మహామునిః || 42 ||

అవ్యాహతేష్ట గమనోయధేష్టః ప్రయ¸°మహీం | ధ్యానకాష్ఠేగతేతస్మిన్‌ కామరూపధరేమునౌ || 43 ||

ధర్మగుప్తోమునేః శాపాత్‌ ఉన్మత్తః ప్రయ¸°పురీం | ఉన్మత్తరూపంతందృష్ట్వా మంత్రిణస్తునృపోత్తమం || 44 ||

పితుః సకాశమానిన్యే రేవాతీరే మనోరమే | తసై#్మనివేదయామానుః మతిభ్రంశం సుతస్యతే || 45 ||

జ్ఞాత్వాతుపుత్ర వృత్తాంతం సందస్తన్యపితాతదా | పుత్రమాదాయతరసాజైమినే రంతికం య¸° || 46 ||

తసై#్మనివేదయామాన పుత్రవృత్తాంత మాదితః | భగవాన్‌ జైమినే పుత్రో మమాద్యోన్మత్తతాం గతః || 47 ||

అస్యోన్మాద వినాశాయ బ్రూహ్యుపాయం మహామునే | ఇతివృష్టశ్చిరం దధ్యౌజైమినిర్ముని పుంగవః || 48 ||

ధ్యాత్వాతు సుచిరం కాలంనృపం నందమధాబ్రవీత్‌ | ధ్యానకాష్ఠన్యశాపేన హ్యున్మత్తస్తే సుతోభవత్‌ || 49 ||

తస్యశాపస్యమోక్షార్థం ఉపాయం ప్రబ్రవీమితే |

తా || అనిధ్యాన కాష్ఠుడు చెప్పాక త్వరగా అతడు సింహరూపాన్ని వదలి (36) కుబేర సచివాత్మకమైన దివ్యమైన యక్షరూపాన్ని పొందాడు. ఈతడు చేతులు జోడించి నమస్కరిస్తూ ధ్యాన కాష్ఠమునితో ఇట్లా అన్నాడు (37) ఓ మహాముని ! పూర్వ వృత్తాంతమంత ఈ రోజు నేను తెలుసుకున్నాను. గౌతముడు నా శాపకాలమందు నాకు శాపాంతాన్ని కూడా చెప్పాడు (38) ధ్యానకాష్ఠునితో నీకు ఋక్షరూపంలో ఉండగా సంవాదం జరిగితే అప్పుడు నీవు సింహత్వం వదలి యక్షరూపాన్ని పొందుతావు (39) అని ముని పుంగవుడు, బ్రహ్మయైన గౌతముడు నాతో అన్నాడు. ఈ రోజు నాకు సింహత్వం పోయింది కనుక తెలుసుకున్నాను. (40) ధ్యాన కాష్ఠుడను పేరుగల వానిగా, శుద్ధునిగా, కామరూపధరునిగా తెలుసుకున్నాను. అని పలికి అయక్షరాజు ఆ ధ్యానకాష్ఠునకు నమస్కరించి (41) శ్రేష్ఠమైన విమానమునెక్కి అలకాపురికి వెళ్ళాడు ఆ యక్షేశుడు వెళ్ళాక ధ్యాన కాష్టమహాముని (42) అడ్డులేని స్వేచ్ఛాగమనం కలవాడుకనుక భూమిపైన యథేష్టముగా వెళ్ళాడు. కామరూపధరుడైన ధ్యానకాష్ఠముని వెళ్ళాక (43) ముని శాపం వల్ల ధర్మగుప్తుడు ఉన్మత్తుడై తననగరికి బయలుదేరాడు. ఉన్మత్త రూపుడైన రాజును చూసి మంత్రులు (44) మనోరమమైన రేవాతీరంలో నున్న అతని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళారు. అతనితో నీ కొడుకునకు మతి భ్రంశ##మైనదని చెప్పారు. (45) అతని తండ్రి నందుడు కొడుకు వృత్తాంతమును తెలుసుకొని అప్పుడు కొడుకును తీసుకొని త్వరగా జైమిని దగ్గరకు వెళ్ళాడు. (46) అతనికి మొదటినుండి పుత్రుని వృత్తాంతాన్ని తెలిపాడు ఓ జైమిని ! భగవాన్‌ ! నా ఆకొడుకు ఈవేళ ఉన్మత్తుడైనాడు (47) ఓ మహాముని ! వీని ఉన్మాదము తొలగిపోయే కొరకు ఉపాయం చెప్పండి. అని అడుగగా జైమిని ముని పుంగవుడు చాలాసేపు ధ్యానం చేశాడు. (48) చాలాసేపు ధ్యానించి నంద నృపునితో ఇట్లన్నాడు. ధ్యానకాష్ఠుని శాపంవల్ల నీ కొడుకు ఉన్మత్తుడైనాడు (49) ఆ శాపం నుండి ముక్తి కొరకు నీకు ఉపాయం చెప్తాను.

మూ || దక్షిణాంబునిధౌసేతౌ పుణ్య పాపవినాశ##నే || 50 ||

ధనుష్కోటిరితి ఖ్యాతం తీర్థమస్తిమహత్తరం | పవిత్రాణాం పవిత్రంచ మంగలానాం చమంగలం || 51 ||

శ్రుతిసిద్ధంమహాపుణ్యం బ్రహ్మహత్యాదిశోధకం | నీత్వాతత్రసుతంతేద్య స్నాపయస్వమహీవతే || 52 ||

ఉన్మాదస్తక్షణాదేవతస్యనశ్యేన్నసంశయః | ఇత్యుక్తస్తం ప్రణమ్యాసౌజై మినింమునిపుంగవం || 53 ||

నందః పుత్రం సమాదాయ ధనుష్కోటింయ¸°తదా | తత్రచస్నాపయామాపుత్రం నియమపూర్వకం || 54 ||

స్నానమాత్రాత్తతః సద్యోనష్టోన్మాదోభవత్పుతః | స్వయంసస్నౌన నందోపి ధనుష్కోటౌ సభక్తికం || 55 ||

ఉషిత్వాదినమేకంతు సపుత్రస్తుపితాతదా | సేవిత్వారామనాథంచ సాంబమూర్తిం ఘృణానిధిం || 56 ||

పుత్రమాపృచ్ఛ్యనందస్తం ప్రయ¸°తపసేవనం | గతేపితరిపుత్రోపి ధర్మగుప్తోనృపోద్విజాః || 57 ||

ప్రదదౌరామనాధాయ బహువిత్తానిభక్తితః | బ్రాహ్మణ భ్యోధనం ధాన్యం క్షేత్రాణి చదదౌతదా || 58 ||

ప్రయ¸°మంత్రి భిస్సార్ధం స్వాంపురీంతదనం తరం | ధర్మేణ పాలయామాసరాజ్యం నిహతకంటకం || 59 ||

పితృపైతామహం విప్రాధర్మగుప్తోతి ధార్మికః | ఉన్మాధైరప్య పస్మారైః గ్రహైః దుష్టైశ్చయేనరాః || 60 ||

గ్రస్తాభవంతి విప్రేంద్రాస్తేపి చాత్రనిమజ్జనాత్‌ | ధనుష్కోటౌ విముక్తాః న్యుః సత్యం సత్యం వదామ్యహం || 61 ||

పరిత్యజ్యధనుష్కోటిః తీర్థమన్యద్ర్వజేత్తుయః | సిద్ధంసగోపయస్త్యక్త్వాన్నహీక్షీరంప్రయాచతే || 62 ||

ధనుష్కోటిః ధనుష్కోటిః ధనుష్కోటిరితిద్విజాః | త్రిః పఠంతోనరాయేతు యత్రక్వాపి జలాశ##యే || 63 ||

స్నాంతి సర్వేనరాస్తేవైయాస్యంతి బ్రహ్మణః పదం | ఏవం వః కథితావిప్రా ధర్మ గుప్త కథాశుభా || 64 ||

యస్యాః శ్రవణ మాత్రేణ బ్రహ్మ హత్యావినశ్యతి | స్వర్ణస్తేయాదయాశ్చాన్యే నశ్యేయుః పాపసంచయాః || 65 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే ధనుష్కోటి ప్రశంసాయాం ధర్మగుప్తోన్మాద విమోక్షణ వర్ణనం నామద్వాత్రింశోధ్యాయః || 32 ||

తా || పాపనాశనమైన పుణ్యప్రదమైన దక్షిణ సముద్రమందు సేతువుయందు (50) మహత్తరమైనది ప్రసిద్ధమైనది ధనుష్కోటి అనే తీర్థం ఉంది. పవిత్రమైన వాటికన్న పవిత్రమైంది. మంగళకరమైన వాటికి మంగళకరము (51) శ్రుతి సిద్ధమైనది, మహాపుణ్యప్రదమైనది. బ్రహ్మహత్యాదుల నుండి పరిశుద్ధి చేసేది. ఓ రాజ! నీ కొడుకును అక్కడికి తీసుకువెళ్ళి ఈ వేళ స్నానం చేయించు (52) అతని ఉన్మాదము ఆ క్షణంలోనే నశిస్తుంది. అనుమానంలేదు. అనిచెప్పగా ఆజైమిని మునిపుంగవుని ఈతడునమస్కరించి (53) నందుడు కొడుకును తీసుకొని ధనుష్కోటికి అప్పుడే వెళ్ళాడు. అక్కడ కొడుకును నియమపూర్వకముగా స్నానం చేయించాడు. (54) వెంటనే స్నానమాత్రం చేతనే కొడుకునకు ఉన్మాదము నష్టమైంది. ధనుష్కోటి యందు భక్తి పూర్వకముగా ఆనందుడు కూడా స్నానం చేశాడు (55) కొడుకుతో పాటు తండ్రి అక్కడ ఒకరోజు ఉండి రామనాధుని, దయగల సాంబమూర్తిని సేవించి (56) కొడుకుతోపోయివస్తానని చెప్పినందుడు తపస్సు కొరకు వనమునకు వెళ్ళాడు. తండ్రివెళ్ళి పోయాక పుత్రుడైన ధర్మగుప్తరాజు (57) భక్తిపూర్వకముగా రామనాధునకు అనే కధనముల నిచ్చాడు. బ్రాహ్మణులకు ధనము, ధాన్యము, క్షేత్రములు ఇచ్చాడు (58) మంత్రులతో కూడి ఆ పిదప తన నగరమునకు వెళ్ళాడు. శత్రువులు లేకుండా ధర్మంగా రాజ్యమును పాలించసాగాడు. (59) అతిధార్మికుడైన ధర్మగుప్తుడు పితృపైతామహమైన రాజ్యాన్ని పాలించసాగాడు. ఉన్మాదములతో అపస్మారములతో, దుష్టగ్రహములతో పీడింపబడిన నరులు (60) వారుకూడ ఇక్కడ స్నానం చేయటం వలన ధనుష్కోటి వలన పాపవిముక్తులైతారు. నేను సత్యాన్ని చెబుతున్నాను. (61) ధనుష్కోటి తీర్థమును వదలి ఇంకొక చోటికి పోయినవారు సిద్ధంగా ఉన్న ఆవుపాలను వదలి (బ్రహ్మ) జెముడు చెట్టుపాలను యాచించినట్లే (62) ధనుష్కోటి ధనుష్కోటి ధనుష్కోటి అని మూడుసార్లు పఠించి నరులు ఏ జలాశయంలోనైనా (63) స్నానం చేస్తే ఆనరులందరు బ్రహ్మ అనే పదమునకు చేరుతారు. ఈ విధముగా మీకు శుభ##మైన ధర్మగుప్తకథను చెప్పాను. ఓ బ్రాహ్మణులారా ! (64) దానిని విన్న మాత్రముననే బ్రహ్మహత్యనశిస్తుంది. స్వర్ణస్తేయము మొదలగుఇతరములైనపాపసంచయములు నశిస్తాయి (65) అని శ్రీ స్కాందమహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు ధనుష్కోటి ప్రశంసయందు ధర్మగుప్తుని ఉన్మాద విమోక్షణ వర్ణనమనునది ముప్పది రెండవ అధ్యాయము || 32 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters