Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పదవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

విహితాభిషవోమర్త్యః సర్వతీర్థేతిసావనే | బ్రహ్మహత్యాది పాపఘ్నీం ధనుష్కోటింతతోప్రజేత్‌ || 1 ||

యస్యాః స్మరణ మాత్రేణ ముక్తః స్యాన్మాస వోభువి | ధనుష్కోటిం ప్రవశ్యంతి స్నాంతివా కథయంతియే || 2 ||

అష్టావింశతి భేదాంస్తే నరకాన్నో వభుంజతే | తామిస్రమంధతామిస్ర మహారౌరవరౌరవౌ || 3 ||

కుంభీపాకం కాల సూత్ర మసి పత్రపనం తథా | కృమిభక్షోంధ కూపశ్చ నందంశం శాల్మలీతథా || 4 ||

సూర్మి వైతరిణీ ప్రాణరోధో విశసనం తథా | లాలాభక్షోప్య వీచిశ్చ సారమే యాదనం తథా || 5 ||

తథైవ వజ్రకణకం క్షారకర్దమపాతనం | రక్షోగణాశనం చాపి శూల ప్రోతం వితోదనం || 6 ||

దందశూకాశనం చాపి పర్యావర్తనం సంజ్ఞతం | తిరోధానాభిదం విప్రాః తథానూచీముఖాభిధం || 7 ||

పూయశోణిత భక్షంచవిషాగ్ని పరిపీడనం | అష్టావింశతి సంఖ్యాక మేవం నరక సంచయం || 8 ||

సయాతి మనుజోవిప్రాధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | విత్తావత్యకలత్రాణాంయో న్యే షామవహారకః || 9 ||

సకాల పాశనిర్బద్ధోయమదూతైర్భయానకైః | తామిస్రనరకే ఘోరే పాత్యతే బహువత్సరం || 10 ||

స్నాతిచేద్ధనుషః కోటౌ తస్మిన్నాసౌనిపాత్యతే | యోనిహత్యతుభర్తారం భుంక్తే తస్యధనాదికాన్‌ || 11 ||

పాత్యతే సోంధ తామిస్నేమహాదుఃఖ సమాకులే | స్నాతి చేద్ధనుషః కోటౌతస్మిన్నాసౌని పాత్యతే || 12 ||

భూతద్రోహేణయోమర్త్యః పుష్ణాతి స్వకుటుంబకం | సతానిహవిహాయాశు రౌరవేపాత్యతేధ్రువం || 13 ||

విషోల్బణ మహాసర్ప సంకులేయమపూరుషైః | స్నాతిచేద్ధనుషః కోటౌతస్మిన్నాసౌనిపాత్యతే || 14 ||

యః స్వదేహం భరోమర్త్యో భార్యాపుత్రాదికం వినా | స మహారౌరనేఘోరే పాత్యతేనిజ మాంసభుక్‌ || 15 ||

స్నాతిచేద్ధనుషః కోటౌతస్మిన్నా సౌనిపాత్యతే || 15 1/2 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - అతి పావనమైన సర్వతీర్థమందు స్నానం చేసిన నరుడు పిదప బ్రహ్మహత్యాది పాపములను నశింపచేసే ధనుష్కోటికి పిదప వెళ్ళాలి (1) దానిని స్మరించి నంతమాత్రమున మానవుడు భూమియందు ముక్తుడౌతాడు. ధనుష్కోటిని చూచినవారు, అందుస్నానమాడినవారు, దాన్ని గూర్చి చెప్పినవారు (2) పదునెనిమిది రకములైన నరకములను అనుభవించరు. తామిస్రము, అంధతామిస్రము, మహారౌరవ రౌరవములు (3) కుంభీపాకము, కాల సూత్రము, అసి పత్రవనము, కృమిభక్షణము, అంధకూపము, సందంశం, శాల్మలి (4) సూర్మి వైతరిణి, ప్రాణరోధము, విశసనము, లాలా భక్షణము, అవీచి, సారమేయ భక్షణము (5) వజ్రకణకము, క్షారకర్దమపాతనము, రక్షోగణ భక్షణము, శైల ప్రోతము, వితోదనము (6) దంద శూక ఆశనము, పర్యావర్తనము, తిరోధానము, సూచీముఖము (7) పూయశోణిత భక్షణము, విషాగ్ని పీడ, ఈవిధముగా ఇరువది ఎనిమిది రకముల నరకములు (8) ధనుష్కోటి యందు స్నానం చేయటం వలన మనుజుడు వీటికి పోడు. ఇతరుల డబ్బు, సంతానము, భార్య వీరిని అపహరించువాడు (9) భయానకమైన యమదూతలతో కాలపాశబద్ధుడై చాలా సంవత్సరాలు ఘోరమైన తామిస్ర నరకంలో వేయబడతాడు (10) ధనుష్కోటి యందు స్నానం చేసినచో అందులో పడవేయబడడు. భర్తనుచంపి అతని ధనం మొదలగువాటిని అనుభవించే (11) స్త్రీ మహాదుఃఖంతో నిండిన అంధతామిస్రంలో పడవేయబడుతుంది. ధనుష్కోటియందు స్నానం చేసిన యెడల ఈమె అందులో పడవేయబడదు (12) ఇతర ప్రాణులకు అపకారం చేసి తనకుటుంబాన్ని పోషించేవాడు. వారినిక్కడే వదలి పోతాడు త్వరలో రౌరవమందాతడు వేయబడతాడు (13) అతిగా విషముగలిగిన మహాసర్పములు గల రౌరవమందు యమ పురుషులు వేస్తారు. ధనుష్కోటి యందు స్నానం చేస్తే అతడు దీనియందు పడవేయబడడు (14) భార్య పుత్రులు లేకుండ తన దేహమును పోషించుకునే నరుడు, ఘోరమైన మహారౌరవమందు పడవేయబడతాడు. తన మాంసాన్ని తానే తింటాడు. (15) ధనుష్కోటి యందు స్నానం చేస్తే దానియందుఈతడు పడవేయబడడు (15 1/2).

మూ|| యః పశూన్‌ పక్షిణోవాపి నప్రాణాన్ని రుణద్ధివై || 16 ||

కృపాలేశవి హీనంతం క్రవ్యా దైరపినిందితం | కుంభీపాకేతప్తతైలే పాతయంతి యమానుగాః ||17 ||

స్నాతిచేద్ధనుషః కోటౌతస్మిన్నాసౌని పాత్యతే | మాతరం పితరం పిప్రాన్‌యోద్వేష్టి పురుషాధమః || 18 ||

సకాల సూత్రనరకే విస్తృతాయుతయోజనే | అధస్తాదగ్ని సంతప్త ఉపర్యర్క మరీచిభిః || 19 ||

ఖలేతామ్రమమయే విప్రాః పాత్యతే క్షుధయార్దితః | స్నాతిచేద్ధనుషః కోటౌ తస్మిన్నానౌని పాత్యతే || 20 ||

యోవేదమార్గముల్లంఘ్య వర్తతే కుపథేనరః | సోసిపత్రవనే ఘోరే పాత్యతే యమకింకరైః || 21 ||

స్నాతిచేత్‌ ధనుషః కోటౌతస్మిన్నాసౌ నిపాత్యతే | యోరాజా రాజభృత్యోవా హ్యదండ్యే దండమాచరేత్‌ || 22 ||

శరీరదండంవిప్రేవానశూకర ముఖేద్విజాః | పాత్యతేనరకే ఘోరే ఇక్షపద్యంత్ర పీడితః | || 23 ||

స్నాతిచేత్‌. . . .ఈశ్వరాధీన వృత్తీనాం హింసాం యః ప్రాణినాం చరేత్‌ || 24 ||

తైరేవ పీడ్యమానోయం జంతుభిః స్వేనపీడితైః | అంధకూపే మహాభీమే పాత్యతే యమకింకరైః || 25 ||

తత్రాంధకారబహులే విని ద్రో నిర్వృతశ్చేరేత్‌ | స్నాతిచేత్‌ . . . . . || 26 ||

యోశ్నాతి పంక్తి భేదేన సన్య సూపాదికం నరః | అకృత్వా పంచయజ్ఞం వాభుంక్తే మోహేన సద్విజాః || 27 ||

ప్రపాత్య తేయమభ##టైః నరకే కృమిభోజనే | భక్ష్య మాణః కృమిశ##తైః భక్షయన్‌ కృమిసంచయాన్‌ || 28 ||

స్వయంచకృమిభూతస్పన్‌ తిష్ఠేద్యాన దఘక్షయం | స్నాతిచేత్‌........ || 29 ||

యోహరే ద్విప్ర విత్తానిప్తేయేన బలతోపినా | అన్యేషా మపి విత్తాని రాజా తత్పురుషోపివా || 30 ||

అయస్మయాగ్నికుండేషు నందంశైః సోతిపీడితః | నందంశేనరకే ఘోరే పాత్యతేయమ పూరుషైః || 31 ||

స్నాతిచేత్‌.............. | అగమ్యాం యోభిగచ్చేత స్త్రియం వై పురుషాధమః || 32 ||

అగమ్యం పురుషం యోషిత్‌ అభిగచ్చేత వాద్విజాః | తాపయస్మయనారీంచ పురుషం చాప్యయస్మయం || 33 ||

తప్తా వాలింగ్య తిష్ఠంతౌ యావచ్చంద్ర దివాకరౌ | సూర్మ్యాఖ్యే నరకే ఘోరే పాత్యతే బహుకంటకే || 34 ||

స్నాతిచేత్‌ ............ | బాధతే సర్వజంతూన్యోనానోపామైరువద్రవైః || 35 ||

శాల్మలీ నరకే ఘోరే పాత్యతే బహుకంటకే | స్నాతిచేత్‌.... || 36 ||

తా || ప్రాణంతో ఉన్న పశుపక్షులను ఇబ్బంది పెట్టేవాడు (16) దయలేనివాడు, క్రవ్యాదులచేత కూడా నిందింపబడే వాడు కుంభీపాకమందు కాగిన నూనెలో యమభటులచే వేయబడతాడు (17) ధనుష్కోటిలో స్నానం చేస్తే అందులో వేయబడడు. తల్లి దండ్రులను బ్రాహ్మణులను ద్వేషించే న రాధముడు (18) విస్తృతమై అయుత యోజన విస్తీర్ణమైన కాల సూత్ర నరకమందు వేయబడి, క్రింద అగ్నితో తపింపబడుతూ, పైన సూర్య కిరణాలతో తపింపబడుతూ, (19) ఆకలితో బాధపడుతూ తామ్రమయమైన ప్రాంతమున వేయబడతాడు ధనుష్కోటి యందు స్నానం చేస్తే అందులో వేయబడడు (20) వేదమార్గాన్ని వదలి చెడుమార్గంలో నడిచే నరుడు యమకింకరులతో ఘోరమైన అసిపత్రవనంలో వేయబడతాడు (21) ధనుష్కోటి - లో స్నానం చేస్తే అందులో వేయబడడు. రాజుకాని, రాజు భృత్యుడు కాని శిక్షించతగని వానిని శిక్షిస్తే (22) విప్రునకు శరీరదండన విధించినవాడు సూకరముఖమందు వేయబడతాడు. ఘోరమైన నరకమందు యంత్రంలో పీడింపబడే చెరుకు గడవలె బాధింపబడుతాడు (23) ధనుష్కోటి యందు స్నానం చేస్తే అందువేయబడు. ఈశ్వర అధీనమైన వృత్తులలో తిరిగే ప్రాణులను హింసించిన నరుడు (24) తాను పీడించిన జంతువులతోనే పీడింపబడుతూ యమకింకరులతో మహా భయంకరమైన అంధకూపమందు వేయబడతాడు (25) అంధకారం అధికంగా ఉన్న అక్కడ నిద్రలేక ఊరటలేక తిరుగుతాడు. ధనుష్కోటిలో స్నానం చేస్తే అందులో వేయబడడు (26) ధాన్యము సూపము మొదలగు వానిని పంక్తి భేదంతో తినినవాడు, పంచయజ్ఞం చేయకుండా మోహంతో తినినవాడు (27) యమభటులతో కృమిభోజనమనే నరకంలో వేయబడతాడు కృమిశతములతో తినబడుతూ కృమి సమూహములను తింటూ (28) తాను కృమిగా మారి పాపనాశమయ్యేవరకు ఉంటాడు. ధనుష్కోటి యందు స్నానం చేస్తే అందులో వేయబడడు (29) బ్రాహ్మణుల విత్తమును దొంగతనంగా లేదా బలవంతంగా హరించిన, ఇతరుల సొమ్మును హరించిన రాజుగాని, రాజ పురుషుడు గాని (30) ఉక్కుమయమైన అగ్ని గుండములలో వేయబడి నందశములతో (వటుకారు) బాగా పీడింపబడి యమపురుషులతో ఘోరమైన నంద శనరక మందు వేయబడతాడు (31) ధనుష్కోటి యందు స్నానం చేస్తే అందులో వేయబడడు. పొందతగని స్త్రీని పొందిన పురుషాథముడు (32) పొందతగని పురుషుని పొందిన స్త్రీ ఉక్కుమయమైన స్త్రీని, అట్లాగే ఉక్కుమయమైన పురుషుని (33) కాల్చబడిన వానిని కౌగిలించుకొని సూర్యచంద్రులున్నంతకాలము ఉంటారు. సూర్మ్య అనే నరక మందు ఘోరమైన బహుకంటకమయమైన దాని యందు వేయబడతారు (34) ధనుష్కోటి యందు స్నానం చేస్తే అందులో వేయబడరు. రకరకాలైన ఉపాయములతో ఉపద్రవములతో అన్ని జంతువులను బాధించే నరుని (35) బహుకంటకమైన శాల్మలి నరక మందు వేస్తారు. ధనుష్కోటి యందు స్నానం చేసిన వానిని అందువేయరు (36)

మూ|| రాజావారాజభృత్యో వాయఃపాషండ మనువ్రతః | భేదకో ధర్మసేతూనాం వైతరణ్యాం నిపాత్యతే || 37 ||

స్నాతిచేత్‌ .............. | వృషలీ సంగదుష్టోయః శౌచాద్యాచారవర్జితః || 38 ||

త్యక్తలజ్జః త్యక్తవేదః పశుచర్యారతస్తథా | సపూయ విష్టామూత్రాసృక్‌ శ్లేష్మపిత్తాదిపూరితే || 39 ||

అతిబీభత్సనరకే పాత్యతేయమకింకరైః | స్నాతిచేత్‌ || 40 ||

అశ్మభిః మృగయుర్‌ హన్యాద్బాణౖః వాబాధతే మృగాన్‌ | స విధ్యమానోబాణౌఘైః పరత్రయమకింకరైః || 41 ||

ప్రాణరోధాఖ్యనరకే పాత్యతే యమకింకరైః | స్నాతిచేత్‌ || 42 ||

దాంభికోయః పశూన్‌ యజ్ఞే విధ్యనుష్ఠాన వర్జితః | హంత్యసౌపరలోకేషు వైశ##సేనరకే ద్విజా || 43 ||

కృన్త్యమానోయమభ##టైః పాత్యతేదుఃఖ సంకులే | స్నాతిచేత్‌ ...... || 44 ||

ఆత్మభార్యాం సవర్ణాం యోరే తః పాయయతేతునః | పరత్రరేతః పాయినన్‌రేతః కుండే విపాత్యతే || 45 ||

స్నాతిచేత్‌ ............. | యోదన్యుః మార్గమాశ్రిత్యగరదోగ్రామదాహకః || 46 ||

పణిక్‌ ద్రవ్యాపహారీచ సపరత్ర ద్విజోత్తమాః | వజ్రదంష్ట్రాహికాబిఖ్యే నరకే పాత్యతేచిరం || 47 ||

స్నాతిచేత్‌........ | విద్యంతేయాని చాన్యాని నరకాని పరత్రవై || 48 ||

తానినా ప్నోతిమనుజో ధనుష్కోటినిమజ్జనాత్‌ | ధనుష్కోటౌ సకృత్‌ స్నానాత్‌ అశ్వమేధ ఫలం లభేత్‌ || 49 ||

అత్మవిద్యాభ##వేత్‌ సాక్షాత్‌ ముక్తి శ్చాపిచతుర్విధా | స పాపేరమతే బుద్ధిః స భ##వేత్‌ దుఃఖ మేవవా || 50 ||

బుద్ధేః ప్రీతిర్భవేత్‌ సమ్యక్‌ ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | తులా పురుషదానేన యత్ఫలం లభ##తేనరైః || 51 ||

తత్ఫలం లభ్యతే పుంభిః ధనుషోటౌ నిమజ్జనాత్‌ | గోసహస్రప్రదానేన యత్పుణ్యం హిభ##వే న్పృణాం || 52 ||

తత్పుణ్యం లభ##తే మర్త్యోధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | ధర్మార్థ కామమోక్షేషు యంయమిచ్ఛతి పూరుషః || 53 ||

తంతంపద్యః సమాప్నోతి ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ || 53 1/2 ||

తా || రాజుకాని రాజభృత్యుడుకాని పాషండముననుసరించినవాడు, ధర్మమార్గమును భేదించినవాడు వైతరణి యందు పడవేయబడతాడు (37) ధనుష్కోటి యందు స్నానం చేస్తే అతడందులో, పడవేయబడడు. శూద్రస్త్రీ సహవాసంతో దుష్టుడైనవాడు శౌచాద్యాచారములు లేనివాడు (38) సిగ్గులేనివాడు,వేదముల వదలినవాడు, పశువులా సంచరించువాడు, చీము, మలము మూత్రము రక్తము శ్లేష్మము పిత్తము మొదలగు వానితో నిండిన (39) అతి బీభత్సమైన నరకమందు యమకింకరులతో పడవేయబడుతాడు. ధనుష్కోటిలో స్నానం చేస్తే అందు అతడు వేయబడడు. (40) వేటగాడు మృగములను రాళ్ళతో కొట్టి లేదా బాణములతోనైనా బాధించి చంపిన యెడల పరలోకంలో యమకింకరుల బాణముల సమూహంతో బాధిస్తుండగా (41) యమకింకరులు ప్రాణరోధమనే నరకమందు వేస్తారు. ధనుష్కోటిలో స్నానం చేస్తే అతడందు వేయబడడు (42) విధివత్‌ అనుష్ఠానములేక దాంభికుడై యజ్ఞమందు పశువులను చంపుతాడో అతడు పరలోకంలో వైశననరకమందు (43) ఛేదింపబడుతు యమభటులతో దుఃఖ సంకులమందు వేయబడుతాడు. ధనుష్కోటి యందు స్నానం చేసిన యెడల అతడందు వేయబడడు. (44) సవర్ణురాలైన తనభార్యతో రేతః సును తాగించేవాడు. పరలోకంలో రేతః పాయిఔతూ రేతః కుండంలో వేయబడుతాడు (45) ధనుష్కోటిలో స్నానం చేస్తే అందు అతడు వేయబడడు. దొంగల మార్గముననుసరించి గ్రామదాహకుడై, విషమిచ్చువాడై (46) వణిక్‌ ద్రవ్యమపహరించినవాడు ఓ బ్రాహ్మణులారా ! పరలోకంలో చాలాకాలము వజ్ర దంష్ట్రాహిక అనే నరకంలో వేయబడుతాడు (47) ధనుష్కోటిలో స్నానం చేస్తే అందు అతడు వేయబడడు. ఇవి వీనికన్న ఇతరములైన నరకములను పరలోకంలో ఉన్నవానిని (48) ధనుష్కోటిలో స్నానం చేస్తే మనుష్యుడు పొందడు. ధనుష్కోటిలో ఒకసారి స్నానం చేస్తే అశ్వమేథ ఫలము లభిస్తుంది. (49) ఆత్మవిద్యసాక్షాత్కరిస్తుంది. నాల్గువిధములముక్తిలభిస్తుంది. పాపముయందుబుద్ధిరమించదు. దుఃఖంగానికలగదు (50) ధనుష్కోటి స్నానం వల్ల బుద్ధికి మంచిగా ప్రీతి లభిస్తుంది. తులా పురుష దానంవల్ల నరుడు పొందే ఫలాన్ని (51) ధనుష్కోటిలో స్నానం వల్ల పురుషులు పొందుతారు. సహస్రగోదానంవల్లనరులకులభించేపుణ్యము (52) ధనుష్కోటిలో స్నానంవల్ల లభిస్తుంది. ధర్మార్థ కామమోక్షములలో నరుడు కోరేదానిని (53) ధనుష్కోటి స్నానం వల్ల వెంటనే పొందుతాడు (53 1/2)

మూ || మహాపాతక ముక్తోవా యుక్తోవా సర్వపాతకైః || 54 ||

సద్యః పూతోభ##వే ద్విప్రాధనుష్కోటౌనిమజ్జనాత్‌ | ప్రజ్ఞాలక్ష్మీః యశః సంపత్‌ జ్ఞానం ధర్మోవిరక్తతా || 55 ||

మనఃశుద్ధిః భ##వేన్పౄణాం ధనుష్కోటి నిమజ్జనాత్‌ | బ్రహ్మహత్యాయుతం చాపి మరాపానాయుతం తథా || 56 ||

అయుతం గురుదారాణాం గమనం పాపకారణం | స్తేయాయుతం సువర్ణానాం తత్సం సర్గశ్చకోటిశః || 57 ||

శీఘ్రం విలయమాప్నోతి ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | బ్రహ్మహత్యా సమానాని సురాపాన సమానిచ || 58 ||

గురుస్త్రీగమనేనాపి యానితుల్యాని చాస్తికాః | సువర్ణస్తేయతుల్యాని తత్సం సర్గసమానిచ || 59 ||

తాని సర్వాణి నశ్యంతి ధనుష్కోటినిమజ్జనాత్‌ | ఉక్తేష్వేతేషు సందేహక్ష సకర్తవ్యః కదాచన || 60 ||

జిహ్వాగ్రేపరశుంతప్తం ధారయామి న సంశయః | అర్థవాదమిమం సర్వం బ్రువన్వైనారకీ భ##వేత్‌ || 61 ||

సంకరః సహివిజ్ఞేయః సర్వకర్మ బహిష్కృతః | అహోమౌర్థ్యమహోమౌర్థ్యం అహోమౌర్థ్యం ద్విజోత్తమాః || 62 ||

ధనుష్కోట్యభిదేతీర్థే సర్వపాతకనాశ##నే | అద్వైత జ్ఞానదేవుం సాంభుక్తిముక్తి ప్రదాయిని || 63 ||

ఇష్టకామ్యప్రదేనిత్యం తథైవాజ్ఞాననాశ##నే | స్థితేపి తద్విహాయాయం రమతేస్యత్రవైజనః || 64 ||

అహోమోహస్యమాహాత్మ్యం మయాపక్తుం నశక్యతే | స్నాతన్యధనుషః కోటౌనాంత కాద్భయమస్తివై || 65 ||

ధనుష్కోటిం ప్రపశ్యం తి తత్రస్నాంతిచయేనరాః

స్తువంతిచ ప్రశంసంతి స్పృశంతి చనమంతిచ | నపిబంతిహితేస్తన్యం మాతృణాం ద్విజపుంగవాః || 66 ||

ఋషయ ఊచుః -

ధనుష్కోట్యభిధాతస్యకధం సూత సమాగతా || 67 ||

తత్సర్వం బ్రూహితత్వేన విస్తరాన్ముని పుంగవ | ఇతిపృష్టోనైమిశీయైః అహసూతః పునశ్చతాన్‌ || 68 ||

తా || మహా పాతకముక్తుడైనా సర్వపాతకములతో కూడినవాడైనా (54) ధనుష్కోటి స్నానం వల్ల వెంటనే పవిత్రుడౌతాడుప్రజ్ఞలక్ష్మియశస్సు సంపద, జ్ఞానము ధర్మము విరక్తి (55) మనః శుద్ధి ఇవన్ని ధనుష్కోటి స్నానం వల్ల నరులకు కల్గుతాయి. పదివేల బ్రహ్మహత్యలు, పదివేల సురాపానాలు (56) పదివేల గురుదారగమనము, పదివేల సువర్ణస్తేయము, అట్టివారితో కోట్లకొలది సంపర్గము ఇవన్నీ పాపకారణాలు (57) ధనుష్కోటి స్నానం వలన ఇవన్ని తొందరగా నశిస్తాయి. బ్రహ్మహత్యతో సమానమైనవి. సురాపానంతో సమానమైనవి (58) గురుస్త్రీ గమనంతో సమానమైనవి, బంగారం దొంగిలించటంతో సమానమైనవి, తత్సం సర్గంతో సమానమైనవి (59) అవన్నీ అస్తికులార ! ధనుష్కోటి స్నానం వల్ల నశిస్తాయి. ఈ చెప్పిన వాటి విషయంలో ఎప్పుడూ సందేహించాల్సిన పనిలేదు (60) కావలిస్తే నాలుకచివర కాలిన గొడ్డలిని ధరిస్తాను, అనుమానంలేదు. ఇదంతా స్తుతి కోసం చెప్పిందని అనే వాడు నరకానికి పోతాడు (61) వాడు సంకరుడని తెలుసుకోవాలి. అన్ని కర్మలలో వానిని బహిష్కరించాలి. ఓ బ్రాహ్మణులార ! ఎంత మూర్ఖము, ఎంత మూర్ఖము, ఎంత మూర్ఖము (62) అన్ని పాపముల నశింపచేసే ధనుష్కోటి అనే తీర్థమందు, అద్వైత జ్ఞానాన్నిచ్చే పురుషులకు భుక్తిని ముక్తిని ఇచ్చే (63) రోజు ఇష్టమైన కోరికలనిచ్చే, అజ్ఞానాన్ని నశింపచేసే తీర్థముండగా కూడా దానిని వదలి ఈ జనుడు వేరేచోట ఆనందపడుతున్నాడు క్రీడిస్తున్నాడు అయ్యో ఎంత మూర్ఖము (64) అయ్యో ! మోహమాహాత్మ్యాన్ని నేను చెప్పలేను ధనుష్కోటిలో స్నానం చేసిన వానికి అతంక(వ్యాధి) భయములేదు (65) ధనుష్కోటిని చూసి అక్కడ స్నానం చేసినవారు స్తుతించినవారు, ప్రశంసించిన వారు, స్పృశించినవారు, నమస్కరించినవారు వారు తిరిగి మాతృస్తన్యమును తాగరు ఓ బ్రాహ్మణులార ! (66) ఋషులిట్లాఅన్నారు. సూత! దానికి ధనుష్కోటి అనే పేరు ఎట్లా వచ్చింది (67) ఓ మునిపుంగవ ! విశదంగా, యథార్థంగా అదంతా చెప్పండి. నైమిషం యందలి ఋషులడుగగా సూతుడు తిరిగి వారితో ఇట్లా అన్నాడు (68)

మూ || శ్రీ సూత ఉవాచ -

రామేణ నిహతేయుద్ధే రావణలోకకంటకే | విభీషణ చ లంకాయాం రాజనిస్థాపితేతతః || 69 ||

వైదేహీలక్ష్మణయుతో రామో దశరథాత్మజః | సుగ్రీవప్రముఖైర్వీరైః వానరైరపి సంవృతః || 70 ||

సిద్ధచారణ గంధర్వ దేవ విద్యాధరర్షిభిః | అప్సరోభిశ్చ సతతం స్తూయమాననిజాద్భుతః || 71 ||

లీలావిధృత కోదండః త్రిపురఘ్నోయథాశివః సర్వైః పరివృతో రామో గంధమాదన మన్వగాత్‌ || 72 ||

తత్ర స్థితం మహాత్మానం రాఘవం రావణాంతకం | ప్రాంజలిః ప్రార్ధయామాన ధర్మజ్ఞోధ విభీషణః || 73 ||

సేతునానేన తేరామ రాజానః సర్వఏవహి | బలోద్రిక్తాః సమభ్యేత్య పీడయేయుః పురీంమమ || 74 ||

అతఃసేతు మిమంభింధి ధనుష్కోట్యారఘూద్వహ | ఇతి సంప్రార్థితస్తేన పౌలస్త్యేన స రాఘవః || 75 ||

బిభేద ధనుష ః కోట్యాస్వసేతుం రఘునందనః | అతోద్విజాః తతస్తీర్థం ధనుష్కోటి రితిశ్రుతం || 76 ||

శ్రీరామధనుషః కోట్యా యోరేఖాం పశ్యతేకృతాం | అనేక క్లేశ సంయుక్తం గర్భవాసం నపశ్యతి || 77 ||

ధనుష్కోట్యాకృతారేఖా రామేణ లవణాంబుధౌ | తద్దర్శనాద్భవేన్ముక్తిః నజానే స్నానజం ఫలం || 78 ||

నర్మదారోధసితపో మహాపాతక నాశనం | గంగాతీరే తుమరణం అపవర్గ ఫలప్రదం || 79 ||

దానం ద్విజాః కురుక్షేత్రే బ్రహ్మహత్యాది శోధకం | తపశ్చమరణం దానం ధనుష్కోటౌకృతం నరైః | 80 ||

మహాపాతకనాశాయ ముక్త్యై చా భీష్ట సిద్ధయే | భ##వేత్స మర్థం విప్రేంద్రా నాత్రకార్యా విచారణా || 81 ||

తావత్సంపీడ్యతే జంతుః పాతకైశ్చోపపాతకైః | యావన్నాలోక్యతే రామ ధనుష్కోటిః విముక్తిదా || 82 ||

భిద్యతే హృదయ గ్రంధిః ఛిద్యంతే సర్వ సంశయాః | క్షీయంతే పాప కర్మాణి ధనుష్కోట్యవలోకినః || 83 ||

దక్షిణాం భోనిధౌసేతౌ రామచంద్రేణ నిర్మితా | యారేఖా ధనుషః కోట్యా విభీషణ హితాయవై || 84 ||

సైవకైలా స పదవీం వైకుంఠ బ్రహ్మలోకయోః మార్గః స్వర్గన్యలోకస్యనాత్ర కార్యా విచారణా || 85 ||

తా || శ్రీ సూతులిట్లనిరి- లోకకంటకుడైన రావణుడు యుద్ధంలో రామునితో చంపబడ్డాక, విభీషణుని లంకా రాజ్య మందుంచాక (69) వైదేహీలక్ష్మణులతో కూడిన దశరథాత్మజుడైన రాముడు సుగ్రీవ ప్రముఖులైన వీరులతో, వానరులతో కూడా కూడి (70) సిద్ధ చారణ గంధర్వ దేవ విద్యాధర ఋషులతో అప్సరసలతో నిరంతరము తన అద్భుత కార్యాలు పొగబడుతూ (71) విలాసముగా ధరించిన కోదండము గలవాడై త్రిపురా సుర సంహారకుడైన శివునివలె అందరితో పరివృతుడైన రాముడు గంధమాదనమునకు వెళ్ళాడు (72) అక్కడున్న మహాత్ముడైన రాఘవుని రావణాంతకుని ధర్మజ్ఞుడైన విభీషణుడు చేతులు జోడించి ప్రార్థించాడు (73) ఈ సేతువు ద్వారా రాజులందరు బలోద్రిక్తులై వచ్చి నా నగరాన్ని పీడిస్తారు (74) అందువల్ల ఓ రఘూద్వహా! ధనుష్కోటితో ఈ సేతువును ఛేదించు. అని విభీషణుడు ప్రార్థించగా ఆ రాముడు (75) తన సేతువును ధనుష్‌కోటితో భేదించాడు. అందువల్ల ఓ బ్రాహ్మణులార! నాటి నుండి తీర్థము ధనుష్కోటి అని ప్రసిద్ధమైంది (76) శ్రీరామ ధనస్సు కోటితో చేయబడ్డ రేఖను చూచినవారు అనేక క్లేశములతో నిండిన గర్భ వాసమును చూడరు (77) రాముడు ధనుష్కోటితో ఉప్పు సముద్రములో చేసిన రేఖను చూస్తేనే ముక్తి లభిస్తుంది. స్నానం వల్ల కలిగే ఫలాన్ని చెప్పవలసిందిలేదు (78) నర్మద తీరంలో తపస్సు చేసిన మహాపాతకములు నశిస్తాయి. గంగాతీరమందుమరణిస్తే మోక్షం లభిస్తుంది (79) కురుక్షేత్రమందు దానము చేస్తే బ్రహ్మహత్య పాపము నుండి శుద్ధుడౌతాడు. ధనుష్కోటి యందు తపస్సు మరణము దానము చేసిన నరులు (80) మహా పాతకములు నశింపచేసుకొని ముక్తి కొరకు, ఆ భీష్టసిద్ధి కొరకు సమర్థులౌతారు. ఇందులో విచారించాల్సింది లేదు (81) ప్రాణి, ముక్తినిచ్చే రామ ధనుష్కోటిని చూడనంతవరకు పాతకములతో ఉపకాతకములతో పీడింపబడుతాడు (82) హృదయ గ్రంధి భేదింపబడుతుంది. అన్ని అనుమానాలు ఛేదింపబడుతాయి. ధనుష్కోటిని చూచినవారికి పాప కర్మలు క్షీణిస్తాయి (83) దక్షిణ సముద్రమందు సేతువు యందు రామచంద్రుడు నిర్మించిన విభీషణుని హితమునకైన ధనస్సుకోటితో చేసిన రేఖ (84) కైలాస సంపదనిస్తుంది. వైకుంఠ బ్రహ్మలోకములకు మార్గము స్వర్గలోకమునకు మార్గము ఇక్కడ చర్చించాల్సిందిలేదు (85).

మూ || తుల్యం యజ్ఞ ఫలైః పుణ్యౖః ధనుష్కోట్యవగాహనం | సర్వమంత్రాధికం పుణ్యం సర్వదాన ఫల ప్రదం || 86 ||

కాయక్లేశకరైః పుంసాం కింతపోభిః కి మధ్వరైః | కింవేదైః కి మువాశాసై#్రః ధనుష్కోట్యవలోకినః || 87 ||

రామచంద్ర ధనుష్కోటౌ స్నానం చేల్లభ్యతే నృణాం | సితాసిత సరిత్‌పుణ్య వారిభిః కింప్రయోజనం || 88 ||

రామచంద్ర ధనుష్కోటి దర్శనం లభ్యతే యది | కాశ్యాంతు మరణాన్ముక్తిః ప్రార్థ్యతే కిం వృథానరైః || 89 ||

అని మజ్జ్యధనుష్కోటౌ అనుపోష్యదినత్రయం | అదత్వాకాంచనం గాంచ దరిద్రః స్యాన్న సంశయః || 90 ||

ధనుష్కోట్య వగాహేన యత్ఫలం లభ##తేనరః | అగ్నిష్టోమాదిభిర్యజ్ఞేః ఇష్ట్వాపిబహుదక్షిణౖః || 91 ||

సతత్ఫల మవాప్నోతి సత్యం సత్యం వదామ్యహం | ధనుష్కోట్యభిధంతీర్థం సర్వతీర్థాధికంవిదుః || 92 ||

దశకోటి సహస్రాణి సంతితీర్థాని భూతలే | తేషాం సాన్నిధ్యమస్త్యత్ర ధనుష్కోటౌ ద్విజోత్తమాః || 93 ||

అష్టౌవనవ అదిత్యా రుద్రాశ్చమరుతన్తథా | సాధ్యాశ్చ సహగంధర్వాః సిద్ధ విద్యాధరాస్తథా || 94 ||

ఏతేచాన్యేచయే దేవాః సాన్నిధ్యం కుర్వతే పదా | తీర్థేత్ర ధనుషఃకోటౌనిత్యమేవ పితా మహః || 95 ||

సన్నిథత్తే శివో విష్ణుఃఉమామాచసరస్వతీ | ధనుష్కోటౌ తపస్తప్త్వా దేవాశ్చ ఋషయస్తథా || 96 ||

విపులాం సిద్ధి మగమన్‌ తత్ఫలేన మునీశ్వరాః | ప్నాయాత్తత్ర నరోయస్తు పితృదేవాంశ్చతర్పయేత్‌ || 97 ||

సర్వపాపవినిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే | అత్రైకం భోజయే ద్విప్రం యోనరో భక్తి సంయుతః || 98 ||

ఇహలోకే వరత్రాపి సోనంత సుఖమశ్నుతే | శాకమూల ఫలే వృత్తిం యోనవర్తయతే నరః || 99 ||

ననరోధనుషః కోటౌ స్నాయాత్తత్ఫలసిద్ధయే | అశ్వమేధ క్రతుం కర్తుం శక్తిర్యన్యన విద్యతే || 100 ||

ధనుష్కోటౌ సహిస్నాయాత్‌ తేనతత్ఫల మశ్నుతే | బ్రాహ్మణః క్షత్రియోవైశ్యః శూద్రోవాపి మునీశ్వరాః || 101 ||

నింద్యయోనౌన జాయంతే ధనుష్కోట్యవ గాహనాత్‌ || 101 1/2 ||

తా || ధనుష్కోటిలో స్నానం చేయటం పుణ్యమైన యజ్ఞఫలములతో సమానము. సర్వమంత్రములకన్న అధిక పుణ్య ప్రదము. సర్వదానముల ఫలాన్నిచ్చేది. (86) శరీరానికి క్లేశాన్ని కల్గించే తపస్సులు, యజ్ఞములు ఎందుకు. ధనుష్కోటిని చూచిన వానికి వేదములతో గాని శాస్త్రములతో గాని పనియేమి (87) రామ చంద్రుని ధనుష్కోటిలో నరులకు స్నానం లభిస్తే గంగయమున నదుల పుణ్యజలముతో ప్రయోజనమేమి (88) రామ చంద్రుని ధనుష్కోటి దర్శనం లభిస్తే, కాశియందు మరణం వల్ల ముక్తిని ప్రార్థిస్తారెందుకు వ్యర్థంగా నరులు (89) ధనుష్కోటి యందు స్నానం చేయక మూడు రోజులు ఉపవాసముండక, బంగారమును, గోవును దానం చేయక ఉంటే దరిద్రుడౌతాడు, అనుమానంలేదు (90) ధనుష్కోటి స్నానం వల్ల లభించే ఫలము, అగ్నిష్టోమాది యజ్ఞములు బహు దక్షిణలతో హోమం చేసినా (91) ఆ ఫలితం లభించదు సత్యము సత్యమ చెప్తున్నాను. ధనుష్కోటి అను పేరు గల తీర్థము అన్ని తీర్థముల కన్న అధికమైనది (92) ఈ భూమిపై పదికోట్ల వేల తీర్థములున్నాయి. అవన్ని ఈ ధనుష్కోటిలో సన్నిధిలో ఉన్నాయి. ఓ బ్రాహ్మణులార ! (93) అష్ట వసువులు, ఆదిత్యులు, రుద్రులు, మరుత్తులు, గంధర్వులు, సాధ్యులు, సిద్ధులు, విద్యాధరులు (94) వీరేకాక ఇతర దేవతలు కూడాఎప్పుడూ సన్నిధిలో ఉంటారు. ఈ ధనుష్కోటి యందు ఎల్లప్పుడు బ్రహ్మ (95) సన్నిధిలో ఉంటాడు, శివుడు, విష్ణువు, ఉమ, లక్ష్మి,సరస్వతి, దేవతలు, ఋషులు, ధనుష్కోటిలో తపస్సుచేసి (96) ఓ మునులార ! ఆ ఫలంతో విపులమైన సిద్ధిని పొందారు. ఇక్కడ స్నానం చేసిన, పితృ దేవతలను తృప్తి పరచిన నరుడు (97) సర్వపాపములనుండి ముక్తుడై బ్రహ్మలోకమందు ప్రకాశిస్తాడు. భక్తితో ఒకరికి భోజనంపెట్టిన నరుడు (98) ఈ లోకంలో పరలోకమందు ఆతడు అనంత సుఖాన్ని పొందుతాడు. శాకము, మూలము, ఫలము వీనితో జీవనం గడపని నరుడు (99) ఆ ఫలసిద్ధి కొరకు ధనుష్కోటి యందు స్నాన చేయాలి. అశ్వమేధక్రతువు చేయటానికి శక్తి లేని నరుడు (100) ధనుష్కోటిలో స్నానం చేస్తే ఆ ఫలితాన్ని పొందుతాడు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఎవరైనాకాని ఓమునులార ! (101) ధనుష్కోటి స్నానం వలన నింద్యయోని యందు జన్మించరు (1011/2).

మూ|| మకరస్థేరవౌమాఘేధనుష్కోటౌతుయోనరః || 102 ||

స్నాయాత్‌ పుణ్యంనిగదితుంతస్యాహంనక్షమోద్విజాః | మాఘమాసే ధనుష్కోటౌ అవగాహతయోనరః || 103 ||

సస్నాతః సర్వతీర్థేషు గంగాదిషుమునీశ్వరః | ప్రాప్నుయాదక్షయాన్‌ లోకాన్‌ మోక్షం చాపి లభేతనః || 104 ||

జన్మప్రభృతియత్పాపంస్త్రియోవాపురుషన్యవా | తత్సర్వం మాఘమాసేత్రమజ్జనాత్‌ విలయంప్రజేత్‌ || 105 ||

యధానురాణాం సర్వేషాం ఉత్తమోరఘునందనః | తథైవ చధనుష్కోటిః సర్వతీర్థోత్తమాస్మృతా || 106 ||

తత్రస్నానం మాఘమాసే సర్వాభీష్టప్రదాయకం | త్రింశద్దినం మాఘమాసే నియతోపి జితేంద్రియః || 107 ||

ధనుష్కోటౌ నరః స్నాయాత్‌ అవునర్భవ సిద్ధయే | ఏకభుక్తో జితక్రోధో మాఘమాసేత్రయోనరః || 108 ||

స్నానంకరోతి విప్రేంద్రాముచ్యతే బ్రహ్మహత్యయా | శ్రీరామ ధనుషః కోటౌ మాఘమాసే నరస్తుయః || 109 ||

స్నాత్వాంతే శివరాత్రౌచ నిరాహారో జితేంద్రియః | కృత్వాజాగరణం రౌత్రౌ ప్రతియామం విశేషతః || 110 ||

రామనాథం మహాదేవమభ్యర్చ్య విధిపూర్వకం | పరేద్యురుదితే సూర్యేధనుష్కోటౌ నిమజ్జ్యచ || 111 ||

అన్వేష్వపిచతీర్థేషు స్నాత్వానియతమాససః నిర్వర్త్య నిత్యకర్మాణి రామనాథం నిషేవ్యచ || 112 ||

యథాశక్తి ద్విజానన్నైః భోజయిత్వా ద్విజోత్తమాః | భూమిం గాంచతిలాన్‌ ధాన్యం దత్వా విత్తం చ శక్తితః || 113 ||

బ్రాహ్మణౖరవ్యనుజ్ఞాతః స్వయంభుజీతవాగ్యతః | ఏవం కృతవతః పుంసోరామనాధోమహేశ్వరః || 114 ||

విమోచ్య సర్వపాపాని భుక్తింముక్తిం ప్రయచ్ఛతి | అతః సర్వ ప్రయత్నేన మాఘమాసే మునీశ్వరాః || 115 ||

స్నాతవ్యం హి ధనుష్కోటౌ నరైరత్ర ముముక్షుభిః ధనుష్కోటౌ నరఃస్నానం సేతావర్ధోదయేతుయః || 116 ||

కరోతి తన్యపాపాని నశ్యంత్యే ఇక్షణాత్‌ ద్విజాః | స్నానం మహోదయే చాత్ర భుక్తి ముక్తి పలప్రదం || 117 ||

తా || సూర్యుడు మకరరాశియందుండగా మాఘమాసమందు ధనుష్కోటియందు (102) స్నానం చేసిన నరుని పుణ్యం చెప్పటానికి నేను సమర్థుణ్ణి కాను. మాఘమాస మందు ధనుష్కోటి యందు స్నానం చేసిన నరుడు (103) సర్వ తీర్థములలో గంగాదులలో స్నానం చేసిన వాడౌతాడు. అక్షయలోకములను పొందుతాడు. మోక్షాన్ని కూడా పొందుతాడు (104) పుట్టుక నుండి పురుషుడుకాని స్త్రీ కాని చేసిన పాపమంత మాఘమాసంలో ఇక్కడ స్నానం చేయటం వల్ల పోతుంది (105) దేవతలందరికి రాముడు ఉత్తముడైనట్లే ధనుష్కోటి సర్వతీర్థములలో ఉత్తమము (106) మాఘమాసంలో అక్కడ స్నానము సర్వఅభీష్టములను తీర్చేది. ముప్పది రోజులు మాఘమాసంలో నియమంతగా జితేంద్రియుడైన (107) నరుడు మళ్ళీ జన్మరాకుండుకొరకు ధనుష్కోటి యందు స్నానం చేయాలి. ఏక భుక్తం కలవాడై క్రోధం జయించి ఇక్కడ మాఘమాసంలో స్నానం చేసిన నరుడు (108) బ్రహ్మహత్య నుండి ముక్తుడైతాడు. శ్రీరాముని ధనుష్కోటియందు మాఘమాసంలో నరుడు (109) స్నానం చేసి శివరాత్రికి నిరాహారుడై, జితేంద్రియుడై రాత్రికి జాగరణ చేసి, ప్రతి యామమందు విశేషంగా (110) మహాదేవుడైన నామనాధుని విధి పూర్వకముగా పూజించి తరువాతి రోజు సూర్యోదయమయ్యాక ధనుష్కోటి యందు స్నానం చేసి (111) ఇతర తీర్థములందు కూడా నియమంగల మనస్సు కలవాడై స్నానం చేసి నిత్యకర్మ లాచరించి, రామనాధుని సేవించి (112) శక్తికి తగినట్లు బ్రాహ్మణులకు భోజనము పెట్టి, భూమిని, ఆవును తిలలను, ధాన్యమును విత్తమును శక్తి కొలది ఇచ్చి (113) బ్రాహ్మణుల అనుజ్ఞను పొంది మాటనియమం కలిగి తాను భోంచేయాలి. ఇట్లా చేసిన నరుని మహేశ్వరుడైన రామనాధుడు (114) సర్వపాపములనుండి విముక్తుని చేసి అతనికి భుక్తిముక్తుల నిస్తాడు. అందువల్ల అన్ని విధముల ప్రయత్నించి ఓ మునులార ! మాఘమాసమందు (115) ముక్తికోరే నరులు. ఇక్కడ ధనుష్కోటి యందు స్నానం చేయాలి. అర్ధోదయమందు సేతువు యందలి ధనుష్కోటి యందు స్నానం చేసిన నరుని (116) పాపములు క్షణంలో నశిస్తాయి ఓ ద్విజులార ! మహోదయ మందు ఇక్కడ స్నానము భుక్తిముక్తి ఫలములనిచ్చేది (117)

మూ|| యః స్నాయాత్‌ధనుషఃకోటావర్ధోదయమహోదయే | తస్యవశ్యాస్త్రయోదేవాబ్రహ్మవిష్ణుమహేశ్వరాః || 118 ||

ధనుష్కోటౌ ద్విజాః స్నానం అర్ధోదయ మహోదయే | వినాప్యద్వైతవిజ్ఞానం సాయుజ్యప్రాప్తి కారణం || 119 ||

తత్రస్నానంద్విజాః పుంసాం అర్ధోదయ మహోదయే | మన్వాద్యుక్తంవినాసత్యం ప్రాయశ్చిత్తం హిపాపినాం || 120 ||

అత్రసేతౌ ధనుష్కోటా వర్ధోదయమహోదయే | స్నాతిచేన్మనుజోవిప్రాః సత్యం యజ్ఞం వినావ్యయం || 121 ||

యజ్ఞానాం ఫలమాప్నోతి సంపూర్ణం నాత్రసంశయః | చంద్రసూర్యోపరాగేషు యః స్నాయాదత్రమానవః || 122 ||

తస్యపుణ్యఫలంవక్తుంశేషేణాపినశక్యతే | చంద్రసూర్యో పరాగేషు ధనుష్కోట్యవగాహనం || 123 ||

బ్రహ్మహత్యాది పాపానాం ప్రాయశ్చిత్త ముదీరితం | శ్రీరామ ధనుషః కోటౌ చంద్రసూర్యౌ పరాగయోః || 124 ||

స్నానం సాయుజ్య దంప్రోక్తం సర్వతీర్థఫల ప్రదం | చంద్రసూర్యో పరాగేషు అర్ధోదయమహోదయే || 125 ||

స్నాతవ్యమత్రమనుజైః భుక్తిముక్తి ఫలేచ్ఛుభిః | అతః సర్వం పరిత్యజ్య గచ్ఛధ్వం మునిపుంగవాః || 126 ||

ధనుష్కోటిం మహాపుణ్యాం భుక్తిముక్తి ఫలప్రదాం | తత్రగత్వాపితృభ్యశ్చ కురుధ్వం పిండదావనం || 127 ||

అకల్పం పితృతృప్తిః స్యాదత్ర పిండ నివాపనాత్‌ | పితృణాం తృప్తి దంస్థానత్రయం రామేణ నిర్మితం || 128 ||

సేతుమూలే ధనుష్కోట్యాం గంధమాదన పర్వతే | పిండం దత్వా పితృభ్యోత్ర ఋణాన్ముక్తో భవిష్యతి || 129 ||

సేతుమూలం ధనుష్కోటిం గంధమాదనమేవచ | ఋణమోక్ష ఇతిఖ్యాతం త్రిస్థానం దేనిర్మితం || 130 ||

అతః సర్వప్రయత్నేన ధనుష్కోటి ర్నిషేవ్యతాం | అత్రా గత్యధనుష్కోటౌ స్నాత్వా నియమపూర్వకం || 131 ||

ద్రోణాచార్య మతః శ్రీమాన్‌ అశ్వత్థామా మునీశ్వరాః సుప్తమారణ దోషేణ ఘోరేణ మముచేక్షణాత్‌ || 132 ||

ఏవం వః కథితం విప్రా ధనుష్కోటేస్తు వైభవం | భుక్తిముక్తి ప్రదం నౄణాం సర్వపాప నిబర్హణం || 133 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతు మాహాత్మ్యే ధనుష్కోటి ప్రశంసాయాం ధనుష్కోటి వైభవ కథన వర్ణన నామ త్రింశోధ్యాయః || 30 ||

తా || అర్థోదయ మహోదయ మందు ధనుష్కోటి యందు స్నానం చేసిన వానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు వశ్యులౌతారు (118) అర్ధోదయ మహోదయమందు ధనుష్కోటి స్నానము, అద్వైత విజ్ఞానము లేకుండానే సాయుజ్య ప్రాప్తికి కారణమౌతుంది. (119) అర్ధోదయ మహోదయ మందు అక్కడ స్నానం చేయటం, మన్వాదులు చెప్పినట్లు ప్రాయశ్చిత్తం చేయకున్నా పాపులకు నిజమైన ప్రాయశ్చిత్తమౌతుంది (120) అర్ధోదయమహోదయ మందు ధనుష్కోటిలో స్నానం చేస్తే నిజమైన యజ్ఞం చేయకున్నా (121) అతడు సంపూర్ణముగా యజ్ఞముల ఫలాన్ని పొందుతాడు అనుమానంలేదు. చంద్రసూర్యుల గ్రహణమందు ఇక్కడ స్నానం చేసిన మానవుని (122) పుణ్యఫలమును శేషుడు కూడా చెప్పలేడు. చంద్ర సూర్యగ్రహణములలో ధనుష్కోటి స్నానము (123) బ్రహ్మహత్యాది పాపములకు ప్రాయశ్చిత్తమనిచెప్పబడింది. చంద్ర సూర్య ఉపరాగమందు శ్రీరామ ధనుష్కోటి (124) స్నానము సాయుజ్యము నిచ్చేది. సర్వతీర్థఫల ప్రదమని చెప్పబడింది. అర్ధోదయ మహోదయమందు చంద్ర సూర్యగ్రహణమందు (125) భుక్తిముక్తి ఫలమును కోరే నరులు స్నానం చేయాలి. అందువల్ల ఓ మునులార ! అన్నింటిని వదలి వెళ్ళండి. (126) భుక్తి ముక్తి ఫలప్రదమైన మహా పుణ్యమైన ధనుష్కోటికి. అక్కడికి వెళ్ళి పితరులకు పిండ ప్రదానము చేయండి (127) ఇక్కడ పిండనిర్వాపణము వలన ఆ కల్పము పితృతృప్తి కల్గుతుంది. పితరులకు తృప్తి నిచ్చేస్థానములను మూటిని రాముడు నిర్మించాడు (128) సేతు మూల మందు, ధనుష్కోటి యందు గంధమాదన పర్వత మందు పితరులకు పిండమునిస్తే ఋణము నుండి ముక్తుడౌతాడు (129) సేతు మూలము, ధనుష్కోటి, గంధమాదనము, దేవ నిర్మితమైన ఈ మూడు స్థానములు ఋణ మోక్షకారకమని ప్రసిద్ధమైంది. (130) అందువల్ల అన్ని ప్రయత్నములతో ధనుష్కోటిని సేవించండి. ఇక్కడికి వచ్చి ధనుష్కోటి యందు నియమపూర్వకముగా స్నానం చేసి (131) ద్రోణాచార్యుని సుతుడైన శ్రీమాన్‌ అశ్వత్థామ నిద్రిస్తున్న వారిని చంపిన దోషం నుండి ఘోరమైన దాని నుండి క్షణంలో ముక్తుడైనాడు (132) ఈ విధముగా మీకు ధనుష్కోటి వైభవాన్ని చెప్పాను, ఓ బ్రాహ్మణులార ! భుక్తిముక్తులనిచ్చేది. నరుల అన్ని పాపములను తొలగించేది (133) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖంఠ మందు సేతు మాహాత్మ్యమందు ధనుష్కోటి ప్రశంసయందు ధనుష్కోటి వైభవం చెప్పటమును వర్ణించటమనునది ముప్పదవ అధ్యాయము సమాప్తము

Sri Scanda Mahapuranamu-3    Chapters