Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువదితొమ్మిదవఅధ్యాయము

మూ|| శ్రీ సూత ఉవాచ : -

స్నాత్వాసాధ్యామృతేతీర్థేనృపశాపవిమోక్షణ | సర్వతీర్థంతతోగచ్ఛేత్‌మనుజోనియమాన్వితః || 1 ||

సర్వతీర్థంమహాపుణ్యంమహాపాతకనాశనం | మహాపాతకముక్తోవాయుక్తోవాసర్వపాతకైః || 2 ||

శుద్ధ్యేత తత్‌ క్షణా దేవ సర్వతీర్థనిమజ్జనాత్‌ | తావత్సర్వాణి పాపాని దేహేతిష్ఠంతి సువ్రతాః || 3 ||

సయావత్సర్వతీర్థేస్మిన్‌ నిమజ్జేత్‌ పాప పూరుషః స్నానార్థం సర్వతీర్థేస్మిన్‌ దృష్ట్వా యాంతం ద్విజానరం || 4 ||

వేపంతే సర్వపాపాని నాశోస్మాకం భ##వేదితి | గర్భవాసాది దుఃఖాని తావద్యాతి సరోభువి || 5 ||

న స్నాయత్‌ సర్వతీర్థేస్మిన్‌ యావద్ర్బాహ్మణ పుంగవాః | అనుష్టితైర్మహాయాగైః తథాతీర్థనిషేవణౖః || 6 ||

గాయత్ర్యాది మహా మంత్రజపైః నియమపూర్వకం | చతుర్ణామపివేదానాం అవృత్యాశతసంఖ్యయా || 7 ||

శివవిష్ట్వాది దేవానాం పూజయాభక్తి పూర్వకం | ఏకాదశ్యాదితిధిషుత దైవాన శ##నేనచ

యత్ఫలం లభ##తే మర్త్యః తల్లభేదత్ర మజ్జనాత్‌ || 8 ||

ఋషయ ఊచుః -

సర్వతీర్థమితి ఖ్యాతిః సూతాన్య కథ మాగతా | బ్రూహ్యస్మాక మిదం పుణ్యం విస్తరాత్‌ శృణ్వతాంమునే || 9 ||

శ్రీ సూత ఉవాచ -

పురానుచరితో నామ మునిర్ని యమ సంయుతః || 10 ||

భృగువంశ సముద్భూతో జాత్యం ధోజర యాతురః అశక్త స్తీర్థ యాత్రాయాం నేత్రాభావేన సద్విజాః || 11 ||

సర్వేషా మేవతీర్థానాం స్నాతు కామోమహామునిః | దక్షిణాం బునిధౌ పుణ్యం గంధమాదన పర్వతం || 12 ||

గత్వాశంకరముద్దిశ్యత పస్తేపే నుదుష్కరం | త్రికాలమర్చయన్‌ శంభుమువవాసీ జితేంద్రియః || 13 ||

తథా త్రిషవణ స్నానాత్‌తథైవాతిధి పూజకః | శశిరేజల మధ్య స్థోగ్రీష్మే పంచాగ్ని మధ్యగః || 14 ||

వర్షాస్వాసార సహన అబ్భక్షో వాయుభోజనః | ఉద్దూలనం త్రిపుండ్రంచ భస్మనా ధారయన్‌సదా || 15 ||

జాబాలోపని షద్రీత్యా తథారుద్రాక్షధారకః | ఏవముగ్రంత పశ్చక్రే దశసంవత్సరం ద్విజః || 16 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - రాజు శాపాన్ని తొలగించిన సాధ్యామృత తీర్థమందు స్నానం చేసి నరుడు నియమాన్వితుడై పిదప సర్వతీర్థమునకు వెళ్ళాలి (1) సర్వతీర్థము మహాపుణ్యము మహాపాతక నాశకము. మహాపాతకయుక్తుడైనా సర్వపాతకములు కలవాడైనా (2) సర్వతీర్థంలో స్నానం చేయటంవల్ల ఆ క్షణంలోనే శుద్ధుడౌతాడు. దేహంలో సర్వపాపములు ఎంతవరకుంటాయంటే (3) పాప పురుషుడు సర్వతీర్థంలో, మునగనంతవరకు, సర్వతీర్థమును చూచి స్నానము కొరకు వెళ్తున్న నరుని (4) సర్వపాపములు వణుకుతాయి మాకు నాశం రాబోతున్నది అని బ్రాహ్మణుపుంగవులార! సర్వతీర్థంలో స్నానం చేయనంత వరకు నరుని గర్భ వాసాది దుఃఖములు పోవు (5) యాగానుష్ఠానం వల్ల తీర్థసేవనం వల్ల (6) నియమంగా గాయత్ర్యాది మహామంత్ర జపంవల్ల నూరుమార్లు నాలుగు వేదముల ఆ వృత్తివల్ల (7) భక్తితో శివవిష్ట్వాది దేవతల పూజవల్ల ఏకాదశి మొదలగు తిథులలో భోజనం చేయక పోవటంవల్ల లభించే ఫలము నరుడు ఇక్కడ స్నానంచేయటం వల్ల పొందుతాడు (8) ఋషులిట్లనిరి - ఓ సూత | దీనికి సర్వతీర్థమనే పేరు ఎట్లా వచ్చింది. వినాలనుకునే మాకు ఓముని! విస్తరంగా పుణ్యమైన దీనిని మాకు చెప్పండి (9) శ్రీ సూతులిట్లనిరి - పూర్వం సుచరితుడనే ముని నియమవంతుడై ఉన్నాడు (10) భృగువంశంలో జన్మించినవాడు, పుట్టుకతో గుడ్డివాడు, ముసలితనంతో బాధపడుతున్నాడు. కళ్ళులేనందువల్ల అతడు తీర్థయాత్ర చేయటానికి ఆశక్తుడు (11) అన్ని తీర్థములలో స్నానం చేయాలని కోరికగల మహాముని. దక్షిణ సముద్రంలో పుణ్యమైన గంధమాదన పర్వతమునకు (12) వెళ్ళి శంకరునుద్దేశించి నుదుష్కరమైన తపమాచరించాడు. ఉపవాసం ఉంటూ జితేంద్రియుడై త్రికాలములందు శివుని ఆరాధిస్తూ (13) త్రిషవణ స్నానం చేస్తూ, అతిథుల పూజిస్తూ, చలికాలంలో నీటిమధ్యఉంటూ ఎండాకాలంలో పంచాగ్నిమధ్య మందుంటూ (14) వర్షములలో వర్షధారను సహిస్తూ నీటిని భక్షిస్తూ వాయు భోజనం చేస్తూ, ఎప్పుడూ భస్మంతో ఉద్ధూలన ముత్రివుండము ధరిస్తూ (15) జాబాలోపనిషత్తులో చెప్పినట్లు చేస్తూ రుద్రాక్షలు ధరిస్తూ, ఈ విధంగా పది సంవత్సరములు ఉగ్రమైనతపస్సు చేశాడు (16).

మూ|| తపసాతస్య సంతుష్టః శంకరశ్చంద్రశేఖరః | ప్రాదురాసీన్మునేస్తన్యద్విజాః సుచరితస్యవై || 17 ||

సమారుహ్యమహోక్షాణం భూతవృందనిషేవితః | గిరిజార్థ వపుశ్శూలీ సూర్యకోటి సమప్రభః || 18 ||

స్వభాసాభాసయన్‌ సర్వాదిశోవితిమిరాస్తదా | భస్మపాండురసర్వాం గోజటామండలమండితః || 19 ||

అనంతాది మహానాగ విభూషణ విభూషితః | ప్రాదుర్భూతస్తతః శంభుః ప్రాదాత్తన్యవిలోచనే || 20 ||

ఆత్మావలోకనార్థాయ శంకరోగిరిజాపతిః | తతః సుచరితో విప్రాః శంభునాదత్త దృగ్‌ద్వయః

అలోక్య పరమేశానం ప్రతుష్టావ ప్రసన్నధీః || 21 ||

సుచరిత ఉవాచ -

జయదేవ మహేశాన జయ శంకర ధూర్జటే || 22 ||

జయబ్రహ్మాది పూజ్యత్వం త్రిపురఘ్న యమాంతక | జయోమేశ మహాదేవ కామాంత క జయామల || 23 ||

జయసంసార వైద్యత్వం భూతపాల శివావ్యయ | త్రియంబకనమస్తుభ్యం భక్త రక్షణ దీక్షిత || 24 ||

వ్యోమకేశ నమస్తుభ్యం జయకారుణ్యవిగ్రహ | నీలకంఠ నమస్తుభ్యం జయ సంసారమోచక || 25 ||

మహేశ్వరనమస్తుభ్యం పరమానంద విగ్రహ | గంగాధర నమస్తుభ్యం విశ్వేశ్వర మృడావ్యయ || 26 ||

నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ శంభ##వే | శర్వాయోగ్రాయ గర్భాయ కైలాసపతయేనమః || 27 ||

రక్షమాంకురుణాసింధో కృపాదృష్ట్యవలోకనాత్‌ | మమవృత్తమనాలోచ్య త్రాహిమాం కృపయాహర || 28 ||

శ్రీ సూత ఉవాచ -

ఇతిస్తుతో మహాదేవః తమేన మిదమభ్యధాత్‌ | మునిం సుచరితం విప్రా దయో దవ్వానుమాపతిః || 29 ||

మహాదేవ ఉవాచ -

మునే సుచరితాద్యత్వం వరం వరయ కాంక్షితం | వరందాతుంత వాయాతః పుణ్యస్మిన్నాశ్రమేశుభే

ఇతీరితో మునిః ప్రాహ మహాదేవం దయానిధిం | || 30 ||

సుచరిత ఉవాచ -

భగవంస్త్వం ప్రసన్నోమే యదిస్యాచ్చంద్ర శేఖర || 31 ||

తర్హిత్వాం ప్రవృణోమ్యద్ధాం వరం మద భికాంక్షితం | జరావలితదేహో హం కుత్రచిద్గం తుమక్షమః || 32 ||

సర్వతీర్థేషుచ స్నాతుం అకాంక్షామమవిద్యతే | తస్మాత్సర్వేషు తీర్థేషు స్నానేన మనుజోహియత్‌

ఫలంప్రాప్నోతి మే బ్రూహి తత్ఫలా వాప్తి సాధనం || 33 ||

తా || అతని తపస్సుతో సంతుష్టుడైన శంకరుడు చంద్రశేఖరుడు అసుచరితముని ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు (17) మహా వృషభమునెక్కి, భూతసమూహము సేవిస్తుండగా సగం శరీరంలో పార్వతిని కలిగి, శూలము ధరించి, కోటి సూర్యులతో సమానమైన కాంతితో (18) తన కాంతితో దిక్కులనన్ని వెలిగిస్తూ, చీకట్లు లేకుండా చేస్తూ, శరీరం నిండ భస్మంధరించి తెల్లగా, జటామండలంతో అలంకరింపబడి (19) అనంతాది మహానాగులనే భూషణములను అలంకరించుకొని శంభువు ప్రాదుర్భవించి అతనికి నేత్రముల నిచ్చాడు (20) శంకరుడు గిరిజాపతి తన్ను చూడటం కొరకు కళ్ళిచ్చాడు. పిదప సుచరితుడు బ్రాహ్మణుడు శివుడు రెండు కళ్ళివ్వగా పరమేశుని చూచి ప్రసన్నమైన బుద్ధితో స్తుతించాడు (21) సుచరితుని వచనము - దేవ, మహేశాన, శంకర, ధూర్జటి (22) బ్రహ్మాది పూజిత, త్రిపుర సంహార, యమాంతక, ఉమేశ, మహాదేవ, కామాంతక, అమల నీకు జయము జయము (23) సంసార వైద్యభూతపాల, శివ , అవ్యయ, త్రియంబక, భక్త రక్షణలో దీక్షితుడ నీకు నమస్కారము. నీకు జయము (24) వ్యోమకేశ నీకు నమస్కారము. కారుణ్య విగ్రహ నీకు జయము. నీలకంఠ, సంసారమోచక నీకు నమస్కారము. నీకు జయము (25) మహేశ్వర పరమానంద విగ్రహ నీకు నమస్కారము గంగాధర విశ్వేశ్వర, మృఢ, అవ్యయ నీకు నమస్కారము (26) భగవంతుడైన వాసుదేవుడైన శంభునకు నీకు నమస్కారము, శర్వ, ఉగ్రగర్భ, కైలాసపతి నీకు నమస్కారము (27) కృపాదృష్టితో చూచి ఓ కరుణాసింధు నన్ను రక్షించు. నా వృత్తాంతమును ఆలోచించకుండ ఓ హర ! దయతో నన్ను రక్షించు (28) శ్రీ సూతులిట్లనిరి - అని మహాదేవుని స్తుతించగా ఈతనితో మహాదేవుడు ఇట్లా అన్నాడు దయగలిగిన ఉమాపతి మునియైన సుచరితునితో ఇట్లా అన్నాడు. (29) మహాదేవుని వచనము - ఓ ముని సుచరిత ! ఈ రోజు నీవు నీకిష్టమైన వరమును కోరుకో. ఈ శుభ##మైన పుణ్యాశ్రమంలో నీకు వరమివ్వటానికి వచ్చాను. అని అనగా దయానిధియైన మహాదేవునితో ముని ఇట్లా అన్నాడు. (30) సుచరిత వచనం - ఓ చంద్రశేఖర ! భగవాన్‌ ! నీవు నాకు ప్రసన్నుడవైతే (31) నాకిష్టమైన కోరికను నిన్ను కోరుకుంటాను. నా శరీరం ముసలితనంతో పండిపోయింది. ఎక్కడికి వెళ్ళలేను శక్తిలేని వాణ్ణి (32) అన్ని తీర్థములలో స్నానం చేయటకు ఆ కాంక్ష నాకుంది. సర్వతీర్థములలో స్నానం చేయటంవల్ల మనుజుడు పొందే ఫలితాన్ని నాకు చెప్పు. ఆ ఫలాన్ని పొంద టానికి సాధనాన్ని కూడా చెప్పు (33) అని.

మూ|| మహాదేవ ఉవాచ -

అహమావాహయిమిష్యామి తీర్థాస్య త్రైవ కృత్స్నశః || 34 ||

రామస్యసేతునాపూతే నగేస్మిన్గంధమాదనే | ఇత్యుక్త్వా సమహాదేవః పర్వతే గంధమాదనే || 35 ||

తీర్థాన్యావాహయా మానమునిప్రీత్యర్థముత్తమః | తతస్సుచురితం ప్రాహ శంకరః కరుణానిధిః || 36 ||

మునేనుచరితే దంతు మహాపాతకనాశనం | సాన్నిథ్యాత్సర్వ తీర్థానాం సర్వతీర్థాభిదంస్కృతం || 37 ||

మయాత్రసర్వతీర్థానాంమనసాకర్షణాదిదం | మానసంతీర్థమిత్యాఖ్యాం లవ్స్యతే భుక్తిముక్తిదం || 38 ||

అతః సుచరిత్రాత్రత్వం స్నాహి సద్యోవిముక్తయే | మహాపాతక సంఘానాం దావానల సమద్యుతౌ || 39 ||

కామమోహభయక్రోధలో భరోగాది నాశ##వే | వినావేదాంత విజ్ఞానం సద్యోనిర్వాణ కారణ || 40 ||

జన్మమృత్య్వాది నక్రౌషు సంసారార్ణవతారణ | కుంభీపాకాది సకల నరకాగ్ని వినాశినే || 41 ||

ఇతీరితః సుచరితః శంభునామదనారిణా | నస్నౌవిప్రాః సర్వతీర్థే మహాదేవస్య సన్నిధౌ || 42 ||

స్నాత్వో త్థితః సుచరితో దదృశేఖిలమానవైః | జరావలితనిర్ముక్తన్తరుణోతీవ సుందరః || 43 ||

దృష్ట్వా స్వదేహసౌందర్యం తతః సుచరితోమునిః | శ్లాఘయామానతత్తీర్థం బహుధాన్యేచతాపసాః || 44 ||

మహాదేవః సుచరితం బభాషేతదనంతరం | అస్యతీర్థస్యతీరేత్వం వనన్‌ సుచరితద్విజ || 45 ||

స్నానం కురుష్వ సతతం స్మరన్‌మాం ముక్తిదాయకం | దేశాంతరీయ తీర్థేషు మావ్రజ బ్రాహ్మణోత్తమ || 46 ||

అన్యతీర్థస్య మహాత్మ్యాత్‌ మామంతే ప్రాప్స్యసిధ్రువం|

అన్యేపి యేత్రస్నాన్యంతి తేపి మాంప్రాప్నుయుర్ద్విజ || 47 ||

ఇత్యుక్త్వా భగవానీశః తత్రైవాంత రధీయత | తస్మిన్నంతర్హితే రుద్రేతతః సుచరితోమునిః || 48 ||

అనేకకాలం నివసన్‌ సర్వతీర్థస్యతీరతః | స్నానం సమాచరం స్తీర్థే మానసే నిమయాన్వితః ||49 ||

దేహాంతే శంకరం ప్రాప సర్వబంధ విమోచితః | సాయుజ్యం చాపినంప్రాప సర్వతీర్థస్య వైభవాత్‌ || 50 ||

ఏవంశః కథితం విప్రాః సర్వతీర్థస్య వైభవం | ఏతత్పఠన్‌ వాశ్రుణ్వన్‌ వా ముచ్యతే సర్వపాతకైః || 51 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతు మాహాత్మ్యే సర్వతీర్థ ప్రశంసాయాం సర్వతీర్థ స్వరూప కథనం నామ ఏకోన త్రింశోధ్యాయః || 29 ||

తా || మహాదేవుడు ఇట్లన్నాడు - అన్ని తీర్థములను ఇక్కడే నేను ఆ వాహన చేస్తాను (34) రామ సేతువుతో పవిత్రమైన ఈ గంధమాదన పర్వతమందు ఆవాహన చేస్తానని ఆమహాదేవుడు గంధమాదన పర్వతమందు (35) ఉత్తముడు ముని ప్రీతికొరకు తీర్థములను ఆవాహన చేశాడు. పిదప దయగల శంకరుడు సుచరునితో ఇట్లా అన్నాడు. (36) ఓ సుచరిత ! ఇది మహాపాతకనాశకము. అన్ని తీర్థములు సన్నిధిలో ఉన్నందువల్ల సర్వతీర్థమని పేరు కలిగింది. దీనిలో (37) నేను మనస్సుతో సర్వతీర్థములను ఆకర్షించినందువల్ల ఇది మానసతీర్థమనే పేరును పొందుతుంది. ఇది భుక్తి ముక్తులనిచ్చేది. (38) అందువల్ల సుచరిత వెంటనే ముక్తి కొరకు నీవు ఇక్కడ స్నానం చేయి. మహా పాతక సంఘములకు ఇది దావానలనము. (39) కామ మోహభయక్రోధలోభములనే రోగములను నశింపచేసేది. వేదాంత విజ్ఞానము లేకుండానే వెంటనే ముక్తి కారణమైనట్టిది (40) జన్మముత్యువు (మొదలగునవి) అనే మొసళ్ళు గల సంసార సముద్రమును దాటుటకనువైనది, కుంభీపాకాది సమస్త నరకాగ్నిని నశింపచేసేది. ఈ సర్వతీర్థము (41) అని మదనారియైన శంభువు చెప్పగా సుచరితుడు మహాదేవుని ఎదుట సర్వతీర్థమందు స్నానము చేశాడు (42) స్నానం చేసి లేచిన సుచరితుని అఖిల మానవులు చూచారు. ముసలితనంతో పండిన శరీరంనుండి ముక్తుడైనవాడు యవ్వన వంతుడైన సుందరుడాతడు (43) తన దేహ సౌందర్యం చూసుకొని సుచరితముని అనేక విధముల ఆ తీర్థమును పొగిడాడు. ఇతర తాపసులు పొగిడారు (44)ఆపిదప మహాదేవుడు సుచరితునితో ఇట్లా అన్నాడు. ఓ సుచరిత ! బ్రాహ్మణ ! ఈ తీర్థతీరమందు నీవు ఉంటూ (45) ముక్తి దాయకమైన నన్ను స్మరిస్తూ ఎల్లప్పుడూ స్నానంచేయి. బ్రాహ్మణోత్తమ దేశాంతరములందున్న తీర్థములకు వెళ్ళొద్దు (46) ఈ తీర్థమాహాత్మ్యమువల్ల చివర, నన్ను నీవు పొందగలవు నిశ్చయము. ఓ బ్రాహ్మణ! ఇక్కడ స్నానం చేసిన ఇతరులు కూడా నన్ను పొందుతారు (47) అని పలికి ఈశుడు అక్కడే అంతర్థానమైనాడు. రుద్రుడు అంతర్హితుడైనాక, సుచరితముని (48) సర్వతీర్థమందు అనేక కాలము నివసించి మాసస తీర్థంలో నియమంగా స్నానమాచరించి (49) సర్వబంధములనుండి విముక్తుడై దేహాంతరమందు శంకరుని పొందాడు. సర్వతీర్థ ప్రభావం వల్ల సాయుజ్యమును కూడా పొందాడు (50) ఈ విధముగా సర్వతీర్థ వైభవాన్ని మీకు చెప్పాను. ఓ విప్రులార! దీనిని చదివిన వారు విన్నవారు సర్వపాతకములనుండి ముక్తులౌతారు (51) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మహాత్మ్యమందు సర్వతీర్థ ప్రశంసయందు సర్వతీర్థ స్వరూప కథన మనునది ఇరువది తొమ్మిదవ అధ్యాయము (29)

Sri Scanda Mahapuranamu-3    Chapters