Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది ఏడవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ |

యమునాయాంచ గంగాయాంగయా యాంచనరోముదా | స్నానంవిధాయవిధివత్‌ కోటితీర్థంతతోప్రజేత్‌ || 1 ||

కోటితీర్థం మహా పుణ్యం సర్వలోకేషు విశ్రుతం | సర్వసంపత్కరంశుద్ధం సర్వపాపప్రణాశనం || 2 ||

దుః స్వప్న నాశనం హ్యేత్యత్‌ మహాపాతక నాశనం | మహావిఘ్న ప్రశమనం మహా శాంతికరం నృణాం || 3 ||

స్మృతి మాత్రేణయత్సుంసాం సర్వపాపనిషూదనం | లీల యాధనుషః కోట్యాస్వయం రామేణనిర్మితం || 4 ||

పురాదాశరథీ రామో నిహత్య యుధిరావణం | బ్రహ్మహత్యా విమోక్షాయ గంధమాదన పర్వతే || 5 ||

ప్రాతిష్ఠిపల్లింగమేకం లోకాను గ్రహకామ్యయా | లింగస్యాస్యాభిషేకాయ శుద్ధం వారిగవేషయన్‌ || 6 ||

నావిందత జలం తత్ర పార్శ్వే దశరథాత్మజః | లింగాభిసేక యోగ్యంచ జలంకిమితి చింతయన్‌ || 7 ||

నవేన వారిణాలింగం స్నావనీయం మయేతిసః | నిశ్చిత్య మససాతత్ర ధనుష్కోట్యారఘూద్వహః || 8 ||

బిభేద ధరణీం శీఘ్రం మన సాజహ్నవీం స్మరన్‌ | రామకార్ముక కోటిః సా త దాప్రాప రసాతలం || 9 ||

తత ఉద్ధారయా మాన తద్ధనుర్ధన్వినాంవరః | ధనుష్యుద్ధ్రియమాణతు రాఘవేణ మహీతలాత్‌ || 10 ||

కాకుస్థేసస్మృతా గంగా నిర్య¸° విపరాత్తతః | వారిణాతేన తల్లింగమహ్యషించ ద్రఘూద్వహః ||11 ||

రామకార్ముకకోట్యైవయతస్త న్నిర్మితం పురా | అతః కోటిరితి ఖ్యాతం తత్తీర్ణం భువనత్రయే || 12 ||

యాని యానీహ తీర్థాని సంతివై గంధమాదనే | ప్రథమం తేషుతీర్థేషు స్నాత్వా విగతకల్మషః || 13 ||

శేషపాపవిమోక్షాయ స్నాయాత్‌ కోటౌసరస్తతః | తీర్థాంతరేషు స్నానేన యః పాపౌఘోస నశ్యతి || 14 ||

అనేక జన్మకోటీభిః అర్జితో హ్యస్థి సంస్థితః | విసశ్యతి స సర్వోపి కోటిస్నానా న్న సంశయః || 15 ||

యదిహి ప్రథమం స్నాయాత్‌ అత్రకోటౌనరోద్విజాః | తస్యముక్తస్య తీర్థాని వ్యర్థాన్యే వాపరాణిహి || 16 ||

ఋషయ ఊచుః -

సూత సర్వార్థ తత్వజ్ఞ వ్యాసశిష్య మునీశ్వర | అస్మాకం సంశయం కంచిత్‌ ఛింధి పౌరాణికోత్తమ || 17 ||

కోటౌస్నాతస్య మర్త్యస్య యది తీర్థాంతరం వృథా | కిమర్థం ధర్మతీర్థాది తీర్థేషు స్నాంతి మానవాః || 18 ||

తీర్థాని తాని సర్వాణి సమతి క్రమ్య మానవాః | అత్రైవ కోటౌకిం స్నానం నకుర్వం తిహి తద్వద || 19 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - యమున, గంగ, గయ వీని యందు నరుడు ఆనందంతో శాస్త్రప్రకారము స్నానం చేసి పిదప కోటి తీర్థమునకు వెళ్ళాలి (1) కోటితీర్థము మహా పుణ్యప్రదము సర్వలోకములందు ప్రసిద్ధమైంది. సర్వ సంపదల నిచ్చేది, శుద్ధము, సర్వపాపనాశకము (2) చెడు స్వప్నముల నశింపచేసేది, మహా పాతక నాశకము.మహా విఘ్నములు శమింపచేసేది, మహా శాంతి నిచ్చేది (3) స్మరణ మాత్రం చేత పురుషుల సర్వ పాపముల సంహరించేది. విలాసంగా ధనస్సు యొక్క కోటితో స్వయంగా రామునితో నిర్మింపబడింది (4) పూర్వం దశరథ రాముడు యుద్ధంలో రావణుని చంపి బ్రహ్మహత్యనుండి విముక్తి కొరకు గంధమాదన పర్వత మందు (5) లోకములనను గ్రహించేకొరకు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని అభిషేకించే కొరకు శుద్ధమైన నీటిని వెతుకుతూ (6) ఆ ప్రక్కలో రాముడు నీటిని కనుగొన లేదు. లింగాభిషేకమునకు యోగ్యమైన జలమేదని ఆలోచిస్తూ (7) కొత్త నీటితో లింగానికి స్నానం చేయించాలి నేను అని రాముడు మనస్సులో నిశ్చయించి ధనుష్కోటితో (8) భూమిని శీఘ్రముగా ఛేదించాడు మనస్సులో గంగను స్మరించాడు. రామ కార్ముకకోటి అప్పుడు రసాతలాన్ని చేరింది (9) ధన్వులలో శ్రేష్ఠుడైన రాముడు అక్కడినుండి తన ధనుస్సును పైకి లేపాడు. రాఘవుడు భూమినుండి ధనస్సును పైకి తీస్తుండగా (10) గంగను స్మరించాడు. ఆ రంధ్రము నుండి గంగ పైకి వచ్చింది. ఆ నీటితో రాముడు లింగాన్ని అభిషేకించాడు (11) రామ కార్ముక కోటితో నిర్మించబడింది కనుక అది ఆ తీర్థము ముల్లోకములలో కోటి అని ప్రసిద్ధమైంది (12) ఈ గంధమాదనంలో ఏఏ తీర్థాలున్నాయో మొదట ఆయా తీర్థములలో స్నానం చేసి విగత కల్మషుడై (13) మిగిలిన పాప విముక్తి కొరకు నరుడు కోటి యందు స్నానం చేయాలి. తీర్థాంతరములందు స్నానం వల్ల నశించని పాపములు (14) అనేక జన్మ కోటులలో సంపాదించిన ఆస్థులలో ఉన్నది అంతా కోటి స్నానం వల్ల నశిస్తుంది. అనుమానంలేదు (15) ఒకవేళ మొదటనే ఈ కోటియందు నరుడు స్నానం చేసిన యెడల ఆ ముక్తుడైన వానికి ఇతర తీర్థములన్ని వ్యర్థములే. (16) ఋషులిట్లనిరి - సూత సర్వార్థములనెరిగినవాడ! వ్యాసశిష్య! మునీశ్వర ! పౌరాణికోత్తమ ! మా ఒక చిన్న అనుమానాన్ని ఛేదించు (17) కోటిలో స్నానం చేసిన వానికి ఇతర తీర్థములు వ్యర్థమైన యెడల ధర్మతీర్థాది తీర్థములందు నరులు ఎందుకు స్నానం చేస్తున్నారు (18) ఆ తీర్థములనన్ని వదలి నరులు ఈ కోటిలోనే ఎందుకు స్నానం చేయటంలేదు దానిని చెప్పండి అని అనగా (19).

మూ || శ్రీ సూత ఉవాచ -

అహో రహస్యం యుష్మాభిః పృష్టమేతన్మునీశ్వరాః | నారదాయ పురాశంభుః పృచ్ఛతే యత్కిలాబ్రవీత్‌ || 20 ||

తద్ర్బవీమిమునిశ్రేష్ఠాః శృణుధ్వం శ్రద్ధ యాసహ | గచ్ఛన్యదృచ్ఛయావాపి తీర్థయాత్రాపరోపివా || 21 ||

మార్గమధ్యే ద్విజశ్రేష్ఠాః తీర్థ దేవాలయం తథా | దృష్ట్వాశ్రుత్వాపి వా మోహాత్‌ ససేవేత స రాధమః || 22 ||

నిష్కృతిస్తస్యనాస్తీతి ప్రాcబువస్పరమర్షయః | సేతుం గచ్ఛన్‌ తతోన్యేషు నస్నా యాద్యది మానవః || 23 ||

తీర్థాతిక్రమ దోషైః సబహిష్కార్యోం త్యపద్ధ్విజైః | అతః స్నాతవ్యమేవైషు చక్రతీర్థాదిషుద్విజాః || 24 ||

స్నాత్వాచైతేషు తీర్థేషు శేషపాప విముక్తయే | ప్రయతైర్మను జైరత్ర స్నాతవ్యం కోటి తీర్థకే || 25 ||

కోటౌ చాభిషవంకృత్వానతిష్ఠేద్గం ధమాదనే | నివర్తేత్త క్షణాదేవ నిష్పాపోగ ంధమాదనాత్‌ || 26 ||

రామోపి హిపురాకోటి తీర్థ సంభూత వారిణా | రామనాథేభిషిక్తేతు స్వయం స్నాత్వా చ తత్రవై || 27 ||

బ్రహ్మహత్యావిముక్త స్సన్‌ తత్‌ క్షణాదేవ సానుజః | అరూఢ పుష్పకోయోధ్యాం ప్రయ¸°కపిభిర్వృతః || 28 ||

అతఃకోటౌనరః స్నాత్వా పాపశేషవిమోచితః | నివర్తే త్తత్‌క్షణాదేవ రామో దాశరథిర్యథా || 29 ||

ఏతద్ధి తీర్థప్రపరం సర్వలోకేషు విశ్రుతం | రామనాధాభిషేకాయనిర్మింతం రాఘవేణయత్‌ || 30 ||

స్వయం భగవతీయత్ర సన్నిధత్తేచ జాహ్నవీ | తారక బ్రహ్మణా యత్ర రామేణ స్నాత మాదరాత్‌ || 31 ||

తస్యవై కోటితీర్థస్య మహిమాకేన కథ్యతే | యత్ర స్నాత్వా పురాకృష్ణో లోకసంగ్రహణచ్ఛయా || 32 ||

మాతుల స్యతు కంసస్యవ్యధ దోషాద్విమోచితః | తస్యవైకోటి తీర్థస్య వధ మహిమాకేనకథ్యతే || 33 ||

ఋషయ ఊచుః -

కిమర్థమవధీ త్కంసం మాతులం యదునందనః | యద్దోష శాంతయే సూతసస్నౌ కోటౌ మహామనాః || 34 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - ఓమునులార ! మీరు రహస్యాన్ని అడిగారు. నారదుడడుగగా పూర్వంశంభుడు చెప్పాడు (20) దానినే చెప్తాను ఓ మునిశ్రేష్ఠులార ! శ్రద్ధగా వినండి. అనుకోకుండాగాని, తీర్థ యాత్రాపరుడైకాని (21) ఓ ద్విజులార! మార్గమధ్యంలో తీర్థంకాని దేవాలయం కాని ఉన్నదని విని చూచి మోహం వల్ల సేవించని నరాధము (22)నకు నిష్కృతి లేదని పరమర్షులు చెప్పారు. సేతువునకు వెళ్తూ మానవుడు ఇతరమైన వాటిలో స్నానం చేయనియెడల (23) తీర్థాతి క్రమ దోషంతోఅతనిని బహిష్కరించాలి అంత్యజునివలె అని అన్నారు. అందువల్ల ఈ చక్రతీర్థ మొదలైన వాటిలో బ్రాహ్మణులు స్నానం చేయాల్సిందే (24) ఈ తీర్థములలో స్నానం చేసి శేష పాపవిముక్తి కొరకు మనుజులు ప్రయత్న పూర్వకముగా కోటి తీర్థములో స్నానం చేయాలి (25) కోటిలో స్నానం చేసి గంధమాదనంలో ఉండకూడదు. నిష్పాపుడై వెంటనే గంధమాదనం నుండి మరలాలి (26) పూర్వం రాముడు కూడా కోటి తీర్థంలో పుట్టిన నీటితో రామనాథుని అభిషేకించాక తాను కూడా స్వయంగా స్నానం చేసి అక్కడ (27) బ్రహ్మ హత్య నుండి విముక్తుడై ఆ క్షణమందే తమ్మునితో కూడి పుష్పక మధిరోహించి వానరులతో కూడా అయోధ్యకు వెళ్ళాడు. (28) అందువల్ల నరుడుకోటియందు స్నానంచేసి పాపశేషంనుండి విముక్తుడై దశరథరామునివలె వెంటనే మరలి పోవాలి (29) ఇది తీర్థములలో శ్రేష్ఠము సర్వలోకములందు ప్రసిద్ధము రామనాథుని అభిషేకముకొరకు రాముడు నిర్మించాడు (30) ఇక్కడ భగవతి జాహ్నవి స్వయంగా సన్నిధిలో ఉంటుంది. తారక బ్రహ్ముడైన రాముడు ఆదరంతో స్నానం చేశిన (31) కోటి తీర్థమహిమను గూర్చి ఎవడు చెప్పగలడు. లోక క్షేమము కొరకు పూర్వం కృష్ణుడు స్నానం చేసి (32) మాతుల వథ, కంసవథ వల్ల వచ్చిన దోషం నుండి ముక్తుడైనాడు. అట్టి కోటి తీర్థ మహిమను ఎవరు చెప్పగలరు (33) ఋషులిట్లనిరి - యదునందనుడు తన మామను కంసుని ఎందుకు చంపాడు. ఓ సూత ! ఏ దోష శాంతి కొరకు మహా మనస్సు గల కృష్ణుడు కోటిలో స్నానం చేశాడు (34).

మూ|| శ్రీ సూత ఉవాచ -

వసుదేవ ఇతిఖ్యాతః శూరపుత్రో యదోః కులే | ఆ సీత్స దేవకసుతాం దేవకీమితి విశ్రుతాం || 35 ||

ఉద్వాహ్యరథమారూఢః స్వపురం ప్రస్థితఃపురా | అథ సూతో బభూవాథకం సోహ్యానక దుందుభేః || 36 ||

అశరీరాత దావాణీకం సంసారథి మబ్రవీత్‌ | భగినీంచతథాభామం వాహయంతం రథోత్తమే || 37 ||

యా మిమాం వాహయస్యత్ర రథేనత్వమరిందమ | అస్యాస్త్వా మష్టమోగర్భో వధిష్యతిన సంశయః || 38 ||

ఇత్యాకర్ణ్య వచో దివ్యం కంసః ఖడ్గం ప్రగృహచ | స్వసారం హంతుముద్యోగం చకార ద్విజ పుంగవాః || 39 ||

తతః ప్రోవాచ తంకంసం వసుదేవః ససాంత్వయన్‌ |

వసుదేవ ఉవాచ -

అస్యాం ప్రసూతాన్దాస్యామితుభ్‌యం కంససుతానహం || 40 ||

ఏనాం స్వసారం మాహింసీః నాస్యాస్తే భీతిరస్తిహి | శ్రుత్వా తద్వచనం కంసో నివృత్తస్తద్వధాత్తదా ||41 ||

దేవకీ వసుదేవాభ్యాం సహితః స్వపురం య¸° | పాదాపసక్తనిగడౌ దేవకౌ వసుదేవకౌ || 42 ||

స్థాపయామాన దుష్టాత్మా కంసః కారాగృహేతదా | తతః కాలేన మహతా వసుదేవాద్ధి దేవకీ || 43 ||

షట్‌పుత్రాస్జన యామాసక్రమేణ మునిపుంగవాః | జాతాస్తాన్వుసుదేవేన దత్తాన్‌ కంసోపి సోవధీత్‌ || 44 ||

హతేషు షట్‌పుత్రేషు దేవక్యుదరజన్మసు | కంసేన క్రూరమతివా నిష్కృపేణ ద్విజోత్తమాః || 45 ||

శేషోభూత్సప్తమోగర్భోదేవక్యాజఠరేతదా | మాయాదేవీ తతో గర్భం తంవై విష్ణు ప్రబోదితా || 46 ||

నందగోపగృహస్థాయాం రోహిణ్యాం సమవేశయత్‌ | దేవక్యాః సప్తమో గర్భః పతితో జఠరాదితి || 47 ||

లోకే ప్రసిద్ధి రభవత్‌ మహతీ విష్ణులీలయా | దేవకీ జఠరేపశ్చాత్‌ విష్ణుః గర్భత్వమాప్తవాన్‌ || 48 ||

తతో దశను మాసేషు గతేషు హరి రవ్యయః | దేవకీ జఠరాజ్జజ్ఞే కృష్ణ ఇత్యభివిశ్రుతః || 49 ||

శంఖచక్ర గదాఖడ్గ విరాజిత చతుర్భుజః | కిరీటీవన మాలీ చపిత్రోః శోకవినాశనః || 50 ||

తందృష్ఠ్వా హరిమీశానం తుష్టా వానక దుందుభిః || 51 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - యదుకులంలో శూరుని పుత్రుడు వసుదేవుడని ప్రసిద్ధి చెందినవాడు ఉండేవాడు. అతడు దేవకునిసుతను దేవకి అని ప్రసిద్ధి చెందిన దానిని వివాహమాడి (35) రథమథి రోహించి తన నగరానికి బయలుదేరాడు. అనక దుందుభికి కంసుడు సూతుడైనాడు (36) అప్పుడు అశరీరవాణి సారథియైన కంసునితో ఇట్లా అంది. రథమందు, భగినిని, భామను తీసుకుపోతున్నావు (37) ఓ అరిందమ ! రథంమీద నీవు ఎవరిని తీసుకుపోతున్నావో, ఈమె ఎనిమిదవ గర్భము నిన్ను చంపుతుంది అనుమానంలేదు. (38) అనేదివ్యవాణినివిని కంసుడు ఖడ్గం తీసుకొని తన చెల్లెలును చంపుటకు ప్రయత్నించాడు (39) పిదప వసుదేవుడు అతనిని ఓదారుస్తూ ఆ కంసునితో ఇట్లా అన్నాడు. వసుదేవోక్తి - ఓ కంస ఈమె ప్రసవించిన కొడుకులను నీకునేను ఇస్తాను (40) ఈ నీ చెల్లెలును హింసించొద్దు. ఈమె భయము నీ కొద్దు. అని అనిన ఆ మాటలను కంసుడు విని ఆమెను చంపటం మానేశాడు (41) దేవకీ వసుదేవులతో కూడి స్వపురమునకు వెళ్ళాడు. దేవకీ వసుదేవులకు కాలియందు బేడీలు తగిలించి (42) దుష్టాత్ముడైన కంసుడు కారాగృహంలో ఉంచాడు. చాలా కాలమునకు వసుదేవునివలన దేవకి (43) క్రమంగా ఆరుగురుపుత్రులను కనినది. పుట్టిన వారిని వసుదేవుడు కంసునకీయగా అతడు వారిని చంపాడు (44) దేవకి గర్భంలో జన్మించిన ఆరుగురు పుత్రులను కౄరబుద్ధిగల, దయలేని కంసుడు చంపాక (45) దేవకి ఏడవ గర్భమందు శేషుడు జన్మించాడు. మాయాదేవి ఆ గర్భమును విష్ణువుచే ప్రేరితురాలై (46) నంద గోవుని ఇంటియందున్న రోహిణికి చేర్చింది. దేవకి యొక్క సప్తమగర్భము జఠరము నుండి పడిపోయిందని (47) లోకంలో గొప్ప ప్రసిద్ధి ఏర్పడింది. విష్ణులీలవలన పిదపదేవకీజఠరమందు విష్ణువు గర్భముగాఐనాడు. (48) పిదప పదినెలలు గడిచాక అవ్యయుడైన హరి దేవకీ జఠరము నుండి కృష్ణుడను పేరుగలవాడై జన్మించాడు (49) శంఖ చక్రఖడ్గములతో ప్రకాశించు నాల్గు భుజములు కలవాడు, కిరీటి వనమాలి,పితరుల శోకాన్ని నశింప చేసేవాడు (50) ఈశానుని, హరిని చూచి అనక దుందుభి ఆనందపడ్డాడు (51).

మూ || వసుదేవ ఉవాచ-

విశ్వం భవాన్‌ విశ్వపతిః త్వమేవ | విశ్వస్య యోనిః త్వయి విశ్వమాస్తే |

మహాన్‌ ప్రధానశ్చ విరాట్‌ స్వరాట్‌ చ | సమ్రాడ సిత్వం భగవాన్‌ సమస్తం || 52 ||

ఏవం జగత్కారణ భూతధామ్నే | నారాయణా యామిత విక్రమాయ

శ్రీ శార్‌ఙ్గ చక్రాసి గదాధరాయ | నమోనమః కృత్రిమ మానుషాయ || 53 ||

స్తువంతమేవంశౌరింతం వసుదేవం హరిస్తదా | అవోచత్ర్పీణ యంస్తం చ దేవకీంచ ద్విజోత్తమాః || 54 ||

హరిరువాచ-

అహం కంసం వధిష్యామి మాభీర్వాం పితరావితి | నంద గోపస్య గృహిణీ యశోదాజసయత్సుతాం

మమమాయాంపూర్వదినే సర్వలోకవిమోహినీం || 55 ||

మాంతస్యాఃశయనేన్యస్యయశోదాయాఃసుతాంతుతాం | అదాయదేవకీశయ్యాం ప్రాపయస్వయదూత్తమ || 56 ||

ఏవముక్తః సకృష్ణేన తథైవ హ్యకరోద్ద్విజాః | రురోద మాయాతనయా దేవకీశయనేస్థితా || 57 ||

అథబాలధ్వనింశ్రుత్వాకం సః సంకులమానసః | సూతికా గృహమాగమ్య తామాదాయచ దారికాం || 58 ||

శిలాయాం పోథయామాన నిరయోనిరపత్రపః | అథ తద్ధస్తమాచ్ఛిద్య సాయుధాష్ట మహాభుజా

మహాదేవ్యబ్రవీత్కంసం సమాహూయాతికోవనా || 59 ||

మాయోవాచ -

అరేరే కంసపాపాత్మన్‌ దుర్బుద్ధే మూఢచేతన || 60 ||

యత్రకుత్రా పిశత్రుస్తే వర్తతే ప్రాణహారకః | మార్గయస్వాత్మనోమృత్యుం తంశత్రుంకంసమాచిరం || 61 ||

ఇతీరయిత్వాసాదేవీ దివ్యస్థానాన్యవాప్యచ | లబ్ధపూజామనుష్యేభ్యోబభూవాభీష్టదాయినీ || 62 ||

శ్రుత్వాసదేవీవచనం కంసోపి భృశమాకులః | బాలగ్రహాన్‌ పూతనాదీన్‌ స్వాంతకం బాధితుంరివుం || 63 ||

ప్రేషయామానదేశేషు శిశూసన్యాం శ్చబాధితుం | తేచ బాలగ్రహాః సర్వే ప్రయయుః నంద గోకులం || 64 ||

హతశ్చకృష్ణనతదా ప్రయయుః యమసాదనం | తతః కతిపయాహన్సు గతేషు ద్విజపుంగవాః || 65 ||

రామకృష్ణా వ్యవర్థేతాం గోకులే బాలకౌతదా | అనేక బాలక్రీడాభిః చి క్రీడతు రరిందమౌ || 66 ||

కంచిత్కాలం వత్సపాలౌ వేణునాద మకుర్వతాం | కంచిత్కాలంచ గోపాలౌగుంజాతాపిచ్ఛభూషితౌ || 67 ||

రేమాతే బహుకాలంతౌ గోకులే రామకేశవౌ || 67 1/2 ||

తా|| వసుదేవోక్తి - ఈ ప్రపంచం నీవు, విశ్వపతివి నీవు విశ్వమునకు యోనివి. నీలో ఈ విశ్వముంది. మహాన్‌, ప్రధానుడవు, విరాట్‌, స్వరాట్టు, సమ్రాట్టు ఓ భగవాన్‌ సమస్తము నీవే (52) జగత్తునకు కారణ భూతమైన స్థానమా, నారాయణ, అమిత పరాక్రమశాలి | శ్రీ శార్‌ఙ్గచక్ర అసిగదాధారి, కృత్రిమ మనుష్య రూపధారి నీకు నమస్కారము. (53) ఈ విధముగా శౌరినిస్తుతిస్తున్న ఆ వసుదేవునితో హరి అప్పుడు దేవకి వసుదేవులను సంతోషపరుస్తూ ఇట్లా అన్నాడు (54) హరి వచనము - నేను కంసుని వథిస్తాను. తల్లిదండ్రులార ! మీరు భయపడకండి. నందగోవుని గృహిణి యశోద పూర్వదినమున పుత్రికను ప్రసవించింది. అది నామాయ సర్వలోక విమోహిని (55) ఆమె పడకయందు నన్నుంచి యశోదసుతయైన ఆమెను తీసుకొని ఓయదూత్తమ ! దేవకి పడక యందు జేర్చు. (56) ఆ కృష్ణుడు ఇట్లా చెప్పగానే అతడు అట్లాగే చేశాడు. దేవకి పడక యందున్న ఆ మాయ అను కన్య ఏడ్చింది (57) బాల ధ్వనిని విని కంసుడు. సంకుల మానసుడై సూతికాగృహమునకు వచ్చి ఆ కన్యను తీసుకొని (58) నిర్దయుడై, ఏమాత్రం సిగ్గులేకుండా శిలపై కొట్టాడు. పిదప ఆమె హస్తము ఛేదించుకొని, ఎనిమిది మహా భుజములతో మహాదేవి కంసుణ్ణి సంబోధించి అతి కోపంతో ఇట్లా అంది (59) మాయ వచనము - అరే ! కంస ! పాపాత్మ ! దుర్బుద్ధి ! మూఢచేతనుడ! (60) నీ ప్రాణాన్ని హరించే నీ శత్రువు ఎక్కడో ఒక చోట ఉన్నాడు. ఓ కంస! మృత్యువైన ఆ నీశత్రువును వెతుకు. అలసించవద్దు. (61) అని పలికి అదేవి దివ్యస్థానములను చేరి మనుష్యుల నుండి పూజలను పొంది కోరికల నిచ్చేదిగా ఐంది (62) ఆ దేవీ వచనమును విని కంసుడు కూడా మిక్కిలి వ్యాకుల పడి తన అంతకుని, రివువును బాధించుటకు బాల గ్రహాలను పూత నాదులను (63) దేశములందు పంపించాడు ఇతర శిశువులను బాధించుటకు పంపాడు. ఆ బాల గ్రహములన్ని నందగోకులమునకు వెళ్ళాయి (64) కృష్ణుడు వాటిని చంపాక అవి యమమందిరానికి వెళ్ళాయి. ఓ బ్రాహ్మణులార ! కొన్ని రోజులు గడిచాక (65) గోకులంలో ఆ బాలకులు రామ కృష్ణులు పెరిగారు. శత్రు మర్దనులైన వారు అనేక బాలక్రీడలతో ఆడుకున్నారు (66) కొంతకాలం దూడలను పాలిస్తూ వేణునాదమును చేశారు. గుంజ, తాపింఛములతో అలంకరించుకొని కొన్నాళ్ళు గోవులను పాలిస్తూ (67) చాలా కాలము వారు రామ కేశవులు గోకులంలో (సుఖించారు) క్రీడించారు. (67 1/2).

మూ || కంసః కదాచిదక్రూరం గోకులే రామకేశవౌ || 68 ||

ప్రేషయా మానవిప్రేంద్రాః సమానయితు మంజసా | అసయా మాస చాక్రూరో రామకృష్ణా చ గోకులాత్‌ || 69 ||

మధురాంకం సనిర్దేశాత్‌ స్వర్ణతోరణ రాజితాం || 70 ||

తతః సమానీయన రామకేశవౌ | య¸° పురీం గాందినిజస్తదగ్రే

దృష్ట్వా చకంసం వినివేద్య కార్యం | తసై#్మ స్వగేహం ప్రవిశేశపశ్చాత్‌ || 71 ||

అథా పరాహ్ణే వసుదేవపుత్రా | వన్యేద్యురిష్టేః సహ గోపపుత్రైః

ఉపేయతుః సాలనిఖాత యుక్తాం | స గోపురాట్టాం మథురాపురీం తౌ || 72 ||

స్తోత్రాణి శృణ్వన్‌ పుర¸°వతానాం | కృష్ణస్తు రామేణ సహైవగత్వా

ధనుర్నివేశంసహసైవ తత్ర | దదర్శ చాపంచ మహత్‌ దృఢజ్యం || 73 ||

విద్రావ్యసర్వాన పిచాప పాలాన్‌ | ధనుః సమాదాయ సలీలయాశు

మౌర్వ్యాం నియోక్తుం సమయాం చకార | తదంతరే భగ్నను భూత్‌ ద్విధైవ || 74 ||

కోదండ భంగోత్థిత శబ్దమాశు | శ్రుత్వాభియాతాన్‌ బలినోనిహంతుం

నిజఘ్నతుస్తౌ ప్రతి గృహ్యఖండౌ | చాపస్యపాలాన్‌ బలినౌ ద్విజేంద్రాః || 75 ||

తతః కువల యాపీడం గజంద్వారిస్థితంక్షణాత్‌ | నిహత్య రామకృష్ణాతౌ మహాబల పరాక్రమౌ || 76 ||

తస్యదంతౌ సముత్పాట్య దధానౌకర యోర్ద్వయో ః అంసేనిధాయతౌదంతౌ రంగంప్రయయతుఃక్షణాత్‌ || 77 ||

నిహత్య మల్లంచాణూరం ముష్టికంతో శలం తథా | అన్యాంశ్చమల్ల ప్రవరాన్‌ నిన్యతుః యమసాదనం || 78 ||

సమారురుహతున్తూర్ణం తుంగం మంచంచతౌతదా | తత్రతుంగే సమాసీన మానవే కంసమేత్యతౌ

తస్థతుస్తం తృణీకృత్యసింహౌక్షుద్రమృగం యథా || 79 ||

తతః కంసం సమాకృష్యకృష్ణో మంచో పరిస్థితం | పాదౌ గృహీత్వా వేగేన భ్రామ యామా సచాంబరే || 80 ||

తతస్తం పోథయామాసస భూమౌ గత జీవితం | కంసభ్రాతౄన్‌ బలోప్యష్టౌ నిజఘ్నే ముష్టినా ద్విజాః || 81 ||

ఏవం నిహత్యతం కంసం కృష్ణః పరబలార్దనః పితరౌమోచయామాన నిగడాదతిదుఃఖితౌ || 82 ||

సర్వానాస్థాపయామాన బలేన సహామాధవః శ్రీ కృష్ణేసహతం కంసంశ్రుత్వాప్రాపుఃపురీంతదా || 83 ||

బాంధవామధురా యాంయేపూర్వం కంసేన బాధితాః ఉగ్రసేనం తథా రాజ్యే స్థాపయామానకేశవః || 84 ||

అసహిష్ణుః ద్విజాః పిత్రోః ఏవంకం సకృతాగనం | జఘానమాతులంకంసం దేవబ్రాహ్మణకంటకం || 85 ||

తతఃకదాచిత్‌ కృష్ణోయమాత్మానం ద్రష్టు మాగతాన్‌|నారదాదీన్‌ మునీన్‌ సర్వాన్‌ ఇదం పcపచ్ఛ సత్తమః || 86 ||

తా || ఒకసారి కంసుడు గోకులంలోని రామకేశవులను (68) త్వరగా తీసుకురావటానికి అక్రూరుని పంపాడు. గోకులంనుండి రామకృష్ణులను అక్రూరుడు తీసుకు వచ్చాడు. (69) కంసుని ఆదేశాన్ననుసరించి స్వర్ణతోరణములతో వెలిగే మథురకు వారిని తెచ్చాడు (70) రామకేశవులను తీసుకొనివచ్చి గాందినిజుడు (అక్రూరుడు) నగరమునకు వెళ్ళి, ఎదురుగా కంసుని చూచి అతనికి కార్యాన్ని నివేదించి పిదప తన ఇంటికి వెళ్ళాడు (71) తరువాతి రోజు మధ్యాహ్నమున వసుదేవ పుత్రులు ఇష్టులైన గోపపుత్రులతో ఇళ్ళు, కందకములు, గోపురము రాచనగరులు గల మధురాపురిని వారు ప్రవేశించారు (72) పురమందలి యువతుల స్తోత్రములు వింటూ రామునితో సహా కృష్ణుడు వెళ్ళి ధనుశ్శాలను చూచాడు దృఢమైన అల్లి త్రాడు గల ధనస్సును చూచాడు (73) ధనస్సును రక్షించే వారినందరిని పరుగెత్తించి అతడు తొందరగా అవలీలగా ధనస్సును తీసుకొని అల్లిత్రాడును ఎక్కుపెట్టుటకు వంచినంతలో ఆ ధనస్సు రెండు ముక్కలైంది (74) ధనస్సు భంగమైనందువల్ల కలిగిన ధ్వనినివిని వచ్చిన బలవంతులను చంపుటకు ధనుస్సు ముక్కలను తీసుకొని బలవంతులైనవారు ధనుఃరక్షకులను చంపారు (75) పిదప కువలయా పీడమను పేరు గల ఏనుగును ద్వారంలో ఉన్నదానిని మహా బలపరాక్రమవంతులైన ఆ రామకృష్ణులు చంపి (76) దాని కోరలను పీకి వారు వాటిని తమ చేతులలో ధరించి, ఆ దంతములను భుజము యందు పెట్టుకొని క్షణంలో రంగమునకు వెళ్ళారు (77) మల్లురైన చాణూర, ముష్టిక, తోశలులను చంపి ఇతర మల్లుర శ్రేష్ఠులను కూడా యమసదనమునకు పంపారువారు. (78) త్వరగా వారు ఎత్తైన మంచను ఎక్కారు. ఎత్తైన ఆసనంపైన కూర్చున్న కంసుని వారుసమీపించి, సింహముక్షుద్రమృగములను తృణీకరించి నిలిచినట్లు కంసుని తృణీకరించి వారు నిలిచారు (79) మంచపైనున్న కంసుని లాగి కృష్ణుడు వాని పాదములను బట్టి వేగంగా అకాంలో తిప్పసాగాడు (80) ప్రాణం పోయిన ఆ కంసుని కృష్ణుడు భూమిపై విడిచాడు. తన ముష్టితో కంసుని భ్రాతలను ఎనిమిది మందిని బలరాముడు చంపాడు (81) ఈ విధముగా పరబలమును నశింపచేసే కృష్ణుడు ఆకంసుని చంపి, అతి దుఃఖితులైన తలిదండ్రులను బేడీలనుండి విడిపించాడు (82) తన బలంతో మాధవుడు అందరిని నిలువరించాడు. కృష్ణుడు కంసుని చంపాడనివిని అప్పుడు నగరానికి బంధువులు వచ్చారు (83) వీరంతా పూర్వం కంసునితో బాధింపబడ్డవారు, మధురలో ఉన్నవారు. కేశవుడు ఉగ్రసేనుని రాజ్యంలో ఉంచాడు (84) తలిదండ్రులకు ఈ విధంగా అపకారంచేసిన కంసుని సహించనివారై దేవ బ్రాహ్మణ కంటకుడైన మాతులుడైన కంసుని చంపారు (85) పిదప ఒకసారి కృష్ణుడు తనను చూడటానికి వచ్చిన నారదాది మునులను ఇట్లా అడిగాడు. (86).

మూ || శ్రీ కృష్ణ ఉవాచ -

మయా యంమాతులో విప్రాహతః కంసోతిపాపకృత్‌ | మాతులస్యవధేదోషః ప్రోచ్యతే శాస్త్రవిత్తమైః || 87 ||

ప్రాయశ్చిత్త మతోబ్రూతతద్దోషవినివృత్తయే | అవో చన్నారదస్తత్ర కృష్ణ మద్భుత విక్రమం

వాచామధురయావిప్రాభక్తిప్రణయపూర్వకం || 88 ||

నారద ఉవాచ -

నిత్యశుద్ధశ్చ ముక్తశ్చ భద్రశ్చైవ భవాన్సదా || 89 ||

సచ్చిదానంద రూపశ్చ పరమాత్మా సనాతనః | పుణ్యం పాపం చతేనాస్తి కృష్ణయాదవనందన || 90 ||

తథాపిలోకశిక్షార్థం భవతాగరుడధ్వజ | ప్రాయశ్చిత్తంతు కర్తవ్యం విధినానేన మాధవ || 91 ||

లోకసంగ్రహణం తాపత్‌ కర్తవ్యం భవతాధునా | రామసేతౌ మహాపుణ్య గంధమాదన పర్వతే || 92 ||

రామేణ స్థాపితం లింగం రామనాథా భిదంపురా తస్యాభిషేకతోయార్థం ధనుష్కోట్యారఘూద్వహః || 93 ||

గాంభిత్వోత్వాదయామానతీర్థం కోటీతివిశ్రుతం తవ పూర్వావతారేణ రామేణాక్లిష్ట కర్మణా || 94 ||

బ్రహ్మహత్యావిశుద్ధ్యర్థం నిర్మితం స్వయమేవయత్‌ | తత్రస్నానం కురుష్వత్వం ధర్మ్యే పాపవినాశ##నే || 95 ||

తేనతే మాతులవధా ద్దోషః శీఘ్రం వినంక్ష్యతి | కోటితీర్థేహరేః స్నానం బ్రహ్మహత్యాది శోధకం || 96 ||

స్వర్గమోక్షప్రదం పుంసాం ఆయురారోగ్యవర్ధనం | ఇతిశ్రుత్వామునేర్వాక్యం నారదస్య సమాధవః || 97 ||

విసృజ్యతానృసీన్‌ సర్వాన్‌ తస్మిన్నేవక్షణద్విజాః | రామసేతౌ య¸°తూర్ణం స్వదోష పరిశుద్ధయే || 98 ||

దినైః కతిపయైర్గత్వా కోటితీర్థం యదూద్వహః స్నాత్వా సంకల్ప పూర్వంచ దత్వా దానాన్యనేకశః || 99 ||

సమాతులవధోత్పన్న దోషేభ్యః మముచే క్షణాత్‌ | నిషేవ్యరామనాథంచ స్వపురం మధురాం య¸° || 100 ||

శ్రీ సూత ఉవాచ -

ఏవం ప్రభావం పుణ్యంచ కోటితీర్థం మునీశ్వరాః | బ్రహ్మహత్యాదిభిః పాపైః సద్యోముచ్యేత మానవః

నానేన సదృశం తీర్థం అన్యదస్తి మహీతలే || 101 ||

అత్రస్నానాత్‌ త్రయోదేవా బ్రహ్మవిష్ణుశివాద్విజాః ప్రీతాః స్యురన్యే దేవాశ్చ నాత్ర కార్యావిచారణా || 102 ||

ఏవం వఃకథితం చిత్రం కోటి తీర్థస్యవైభవం | యచ్ఛుత్వా సర్వపాపేభ్యోముచ్యతేమానవోభువి || 103 ||

శ్రుత్వేమం పుణ్యమధ్యాయంపఠిత్వాచమునీశ్వరాః | బ్రహ్మహత్యాదిభిః సత్యం ముచ్యతే పాతకై ర్నరః || 104 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే కోటి తీర్థ ప్రశంసాయాం కృష్ణస్య మాతుల వధ దోషశాంతి వర్ణనం నామ సప్తవింశోధ్యాయః || 27 ||

తా || శ్రీ కృష్ణుడిట్లనిరి - ఓ విప్రులార ! అతి పాపకారియైన కంసుడు మా మాతులుడు ఈతనిని నేను చంపాను. శాస్త్ర మెరిగినవారు మాతులుని చంపిన పాపమని అంటారు (87) ఆ దోష నివృత్తి కొరకు ప్రాయశ్చిత్తాన్ని చెప్పండి. అద్భుత పరాక్రమము కల కృష్ణునితో నారదుడు. భక్తి ప్రేమ నిండారగా తీయని మాటలతో ఇట్లా అన్నాడు. (88) నారదుని మాట - నీవు నిత్యశుద్ధునివి, ముక్తునివి, భద్రునివి (89) సచ్చిదానంద రూపునివి, సనాతనునివి, పరమాత్మవు. నీకు పుణ్య పాపములు లేవు ఓ కృష్ణా ! యాదవ నందన (90) ఐనా ఓ గరుడధ్వజ! లోకములకు తెలిపే కొరకు, విధాన పూర్వకముగా ఓ మాధవ ! నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి (91) నీవిప్పుడు లోక సంగ్రహణము చేయాలి. గంధమాదన పర్వతమందలి మహాపుణ్యప్రదమైన రామసేతువు యందు (92) రాముడు స్థాపించిన రామనాధుడను పేరుగల లింగం యొక్క అభిషేకం నీటి కొరకు ధనుష్కోటి యందు రాముడు (93) భూమిని ఛేదించి తీర్థమును పుట్టించాడు. దానిని కోటి అని అంటారు. నీ పూర్వావతారమైన రాముడు సులభకర్మగా (94) బ్రహ్మహత్య నుండి విశుద్ధి కొరకు స్వయంగా నిర్మించాడు. ధర్మ్యమైన పాపనాశకమైన దానిలో నీవుస్నానం చెయ్యి (95) దాని వల్ల నీకు కల్గిన మాతుల వధ దోషము తొందరగా నశిస్తుంది. కోటి తీర్థంలో హరిస్నానము బ్రహ్మహత్య దోషమును తొలగించేది (96) స్వర్గమోక్షములను, ఆయురారోగ్యమును ఇచ్చేది. అనే ముని వాక్యములను విని మాధవుడు (97) ఆ క్షణంలో ఆ ఋషులందరిని వదలి తన దోష పరిశుద్ధి కొరకు రామసేతువునకు వెళ్ళాడు. (98) కొద్ది రోజులలో కోటి తీర్థమునకు వెళ్ళి కృష్ణుడు సంకల్ప పూర్వకముగా స్నానం చేసి అనేక దానములు చేసి (99) మాతుల వధవల్ల కల్గిన దోషం నుండి క్షణంలో ముక్తుడైనాడు రామనాథుని సేవించి తన నగరమైన మథురకు వెళ్ళాడు (100) శ్రీ సూతుని వచనము - ఇట్టి ప్రభావము కలది పుణ్యమైనది కోటి తీర్థము ఓ మునులార ! మానవుడు బ్రహ్మహత్యాది దోషములనుండి వెంటనే ముక్తుడైతాడు. ఈ భూమిపై ఈ తీర్థముతో సదృశ##మైన తీర్థము మరొక్కటి లేదు (101) ఇక్కడ బ్రహ్మవిష్ణుశివులు త్రిమూర్తులు స్నానం చేసి సంతోషించారు. ఇతర దేవతలు కూడా ఇక్కడ విచారించాల్సింది లేదు (102) కోటి తీర్థ వైభవాన్ని చిత్రమైన దాన్ని మీకు చెప్పాను. దీనిని విని మానవుడు సర్వపాపములనుండి ముక్తుడౌతాడు (103) ఈ పుణ్యమైన అధ్యాయమును విని చదివి బ్రహ్మహత్యా దిపాతకములనుండి నరుడు ముక్తుడౌతాడు సత్యము. (104) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు కోటితీర్థ ప్రశంసయందు కృష్ణుని మాతులవధ దోషశాంతిని వర్ణించుట అనునది ఇరువది ఏడవ అధ్యాయము.

Sri Scanda Mahapuranamu-3    Chapters