Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది మూడవ అధ్యాయము

మూ|| శ్రీ సూత ఉవాచ -

అగ్నితీర్థాభిదే తీర్థే సర్వపాతకనాశ##నే | స్నానం కృత్వావిశుద్ధాత్మాచక్రతీర్థంతతో వ్రజేత్‌ || 1 ||

యంయం కామం సముద్దిశ్యచక్రతీర్థే ద్విజోత్తమాః | స్నానం సమాచరేన్మర్త్యః తంతం కామం సమశ్నుతే || 2 ||

పురాహిర్బుధ్య్ననా మాతు మహర్షిః సంశితవ్రతః | సుదర్శన ముపాస్తాస్మింస్తపస్వీగంధమాదనే || 3 ||

తపస్యంతం మునింతత్రరాక్షషా ఘోరరూపిణః | అబాధం త సదావిప్రాస్తపోవిఘ్నైకతత్పరాః || 4 ||

సుదర్శనం తదాగత్యభక్తరక్షణ వాంఛయా | యాతుధానాన్బాధమానాన్న్య వధీర్లీలయా పురా || 5 ||

తదాప్రభృతితచ్చక్రం భక్త ప్రార్థన యాద్విజాః | అహిర్బుధ్న్యకృతే తీర్థే సన్నిధానం సదాకరోత్‌ || 6 ||

తదా ప్రభృతి తత్తీర్థం చక్రతీర్థమితీర్యతే | సుదర్శన ప్రసాదేన తత్రతీర్థేనిమజ్జనాత్‌ || 7 ||

రక్షః పిశాచా దికృతాపీడానాస్త్యే వకర్హిచిత్‌ - స్నాత్వాస్మిన్‌ పావనే తీర్థేఛిన్నపాణిః పురారవిః

సహిరణ్యమ¸°పాణీలబ్ధవాంస్తీ ర్థవైభవాత్‌ | || 8 ||

ఋషయఊచుః -

ఛిన్నపాణిః కథమభూదాదిత్యః సూతనందన

యధాచలబ్ధవాన్‌ పాణీ సౌవర్ణోతద్వదస్వనః | || 9 ||

శ్రీ సూత ఉవాచ -

ఇంద్రాదయః సురాః పూర్వం సతతం దైత్యపీడితాః || 10 ||

కింకుర్మితిసంచింత్యసంభూయసమమంత్రయన్‌ | బృహస్పతింపురస్కృత్యమంత్రయిత్వాచిరంసురాః || 11 ||

తురాసాహంపురోధాయ ధామస్వాయంభువంయయుః | తేబ్రహ్మాణం సమాసాద్యదృష్ట్వా స్తుత్వాచభక్తితః || 12 ||

తతో వ్యజిజ్ఞపంస్తసై#్మస్బేషామాగమకారణం -

సురాఊచుః -

భగవన్భారతీనాథ దైత్యాహ్యస్మాన్బలోత్కటాః || 13 ||

బాధంతేసతతందేవతత్రబ్రూహిప్రతికియాం | ఇత్యుక్తః ససురైర్‌ బ్రహ్మతానాహకృపయావచః || 14 ||

బ్రహ్మోవాచ -

మాభైష్టయూయంవిబుధాఃతత్రోపాయంబ్రవీమ్యహం | మహెశ్వరం మహాయజ్ఞం అసురాణాంవినాశనం || 15 ||

ప్రారాభధ్వం సురాయూయం మునిభిస్తత్వ దర్శిభిః | అయంచదైవతైస్సర్వైః విధిలోభంవినాకృతః || 16 ||

హెశ్వరో మహాయజ్ఞః క్రియతాం గంధమాదనే | యదిహ్యన్యత్రతం యజ్ఞంకుర్యుస్తద్విబుధర్షభాః || 17 ||

యజ్ఞవిఘ్నంతదాకుర్యుః దురాత్మానః సురద్విషః | క్రియతే యద్యయం యజ్ఞోగంధమాదన పర్వతే || 18 ||

సుదర్శన ప్రసాదేన నైవవిఘ్నోభ##వేత్తదా | అహిర్బుధ్న్యాభిధాన స్య మహర్షే ర్గంధమాదనే || 19 ||

అనుగ్రహాయ తత్తర్థే సన్నిధత్తే సుదర్శనం | అతః కురుధ్వం భోయూయంతం యజ్ఞం గంధమాదనే || 20 ||

నాతిదూరే చక్రతీర్థా దసురాణాం వినాశకం || 20 ½ ||

తా|| శ్రీ సూతులిట్లనిరి - సర్వపాతకముల నశింపచేసే అగ్నితీర్థమందు స్నానం చేసి విశుద్ధాత్ముడై పిదప చక్రతీర్థమునకు వెళ్ళాలి (1) చక్రతీర్థంలో ఏఏ కోరికలతో స్నానం చేస్తారో ఆయా కోరికలను పొందుతారు. (2) ప్రతినిష్ఠుడై పూర్వం అహిర్బుధ్న్యుడను మహర్షి గంధమాదనమందు సుదర్శనాన్ని ఉపాసించాడు (3) అక్కడ తపస్సు చేస్తున్నముని ని ఘోరరూపులైన రాక్షసులు, తపోవిఘ్నమే పనిగా గలవారై ఎప్పుడూ బాధించారు (4) భక్తరక్షణ వాంఛతో సుదర్శనము అప్పుడు వచ్చి, బాధిస్తున్న రాక్షసులను అవలీలగా చంపింది (5) నాటి నుండి ఆ చక్రము భక్తుల ప్రార్థనతో అహిర్బుధ్న్యుడేర్పరచిన తీర్థంలో ఎప్పుడూ సన్నిధిలో ఉంటుంది (6) అప్పటినుండి ఆ తీర్థము చక్రతీర్థమని పిలువబడుతుంది. సుదర్శనము అనుగ్రహంవల్ల ఆతీర్థంలో స్నానం చేసిన యెడల (7) రక్షః పిశాచాదుల వల్ల కలిగే పీడలేనే లేదు. ఈ పావన తీర్థమందు స్నానం చేసి పూర్వము సూర్యుడు చేతులు విరిగినవాడై ఈతీర్థ వైభవం వల్ల హిరణ్యమయపాణిని పొందాడు (8) ఋషులిట్లనిరి - ఓ సూతనందన ఆదిత్యుడు ఛిన్నపాణి ఎట్లైనాడు. ఎట్లా బంగారు చేతులను పొందాడు. దాన్ని చెప్పండి (9) శ్రీ సూతుని వచనము - ఇంద్రాది దేవతలు పూర్వము ఎప్పుడూ రాక్షసులతో పీడింపబడుతూ (10) ఏం చేయాలని అందరు కలిసి ఆలోచించారు. బృహస్పతిని ముందుంచుకుని దేవతలు చాలాసేపు ఆలోచించి (11) ఇంద్రుణ్ణి ముందుగా పెట్టుకొని బ్రహ్మస్థానమునకు వెళ్ళారు. వారు బ్రహ్మను చేరి, చూచి, భక్తితో స్తుతించి (12) పిదప తామెందు కొరకు వచ్చారో ఆతనికి నివేదించారు. దేవతల మాట - భగవాన్‌ ! బారతీనాథ ! బలవంతులైన రాక్షసులు మమ్ములను (13) ఎప్పుడూ బాధిస్తున్నారు. ఓ దేవ! దీనికి ప్రతి క్రియను చెప్పండి. అని దేవతలనగా బ్రహ్మదయతో వారితో ఇట్లన్నాడు (14) బ్రహ్మోక్తి - ఓ విబుధులార! మీరు భయపడకండి అందుకు ఉపాయాన్ని నేను చెబుతాను. మాహేశ్వరమను మహాయజ్ఞము అసుర, నాశకము (15) ఓ దేవతలార! తత్వదర్శులైన మునులతో కూడి మీరు ఆరంభించండి. దీన్ని దేవతలందరు కలిసి విధిలోభం లేకుండా చేయాలి (16) మహేశ్వర మహాయజ్ఞాన్ని గంధమాదనంలో చేయండి. ఇతరచోట ఈ యజ్ఞాని చేస్తే ఓ విబుధులార! (17) దురాత్ములైన సురద్విషులు అప్పుడు యజ్ఞవిఘ్నము నాచరిస్తారు. ఈ యజ్ఞాన్ని గంధమాదన పర్వతమందు చేస్తే (18) సుదర్శనము అనుగ్రహంవల్ల అప్పుడు యజ్ఞవిఘ్నము కాదు. అహిర్బుధ్న్యుడను పేరుగల మహర్షిపై అనుగ్రహంతో గంధమాదనంలో (19) ఆ తీర్థంలో సుదర్శనము సన్నిధిలో ఉంటుంది. అందువల్ల మీరు ఆ యజ్ఞాన్ని గంధమాదనంలో చేయండి (20) చక్రతీర్థమునకు కొద్దిదూరంలో అసురనాశకమైన యజ్ఞం చేయండి (20 ½).

మూ|| తతస్తే బ్రహ్మవచసానహసాగంధమాదనం || 21 ||

బృహస్పతం పురస్కృత్య జగ్ముర్యజ్ఞచికీర్షయా | తేవ్రణమ్య మహాత్మానం అహిర్బుధ్న్యం మునీశ్వరం || 22 ||

అకల్పయన్‌ యజ్ఞవాటాన్నాతిదూరే తదాశ్రయాత్‌ | యజ్ఞకర్మసువిష్ణాతైః సహితాస్తే తపోధనైః || 23 ||

ఇష్టిమారే భిరేదేవా అనురాణాం వినాశినీం | తస్మిన్‌కర్మణిహోతాసీత్స్వయమే వబృహస్పతిః || 24 ||

బభూవమైత్రావరుణోజయంతః పాకశాసనిః | అచ్ఛావాకోబభూవాత్రవసూనామష్టమోవసుః || 25 ||

గ్రావస్తుదభవత్తత్రశక్తిపుత్రః పరాశరః | అష్టావక్రోమహాతేజా అధ్వర్యుధురమూఢవాన్‌ || 26 ||

తత్రప్రతిప్రస్థాతాభూద్విశ్వామిత్రోమహుమునిః | నేష్టాబభూవవరుణః ఉన్నేతాచధనేశ్వరః || 27 ||

బ్రహ్మాబభూవసవితా యజ్ఞస్వార్థధురం వహన్‌ | బభూవబ్రాహ్మణాచ్ఛం సీ వసిష్ఠో బ్రాహ్మణోత్తమః || 28 ||

ఆగ్నీధ్రోభూచ్ఛునః శేవః పోతా జాతశ్చపావకః | ఉద్గాతావాయురభవత్‌ ప్రస్తోతాచవరేతరాట్‌ || 29 ||

ప్రతిహర్తాతుతత్రాసీత్‌ అగస్త్యః కుంభసంభవః సుబ్రహ్మణ్యోమధుచ్ఛందావిశ్వామిత్రాత్మజోమహాన్‌ || 30 ||

యజమానస్స్వయమ భూత్‌దేవరాజఃపురందరః | ఉపద్రష్టాబభూవాత్రవ్యాసపుత్రః శుకోమునిః || 31 ||

తతస్తేఋత్విజః సర్వే దేవరాజం పురందరం | విధివద్దీక్షయాం చక్రుస్తత్రమాహెశ్వరేక్రతౌ || 32 ||

ప్రావర్తతమహాయజ్ఞఏవంవై గంధమాదనే | సుదర్శనప్రభావేన దుఃసహెనాతి పీడితాః || 33 ||

నావిందన్నసురాస్తత్రరంధ్రం యజ్ఞే ప్రవర్తితే | ఎవం నిరంతరాయోసౌ ప్రావర్తతమహాక్రతుః || 34 ||

భక్షయంశ్చహరిస్తత్ర జజ్వాలహుతవాహనః | విధివత్కర్మజాలానికృత్వాధ్వర్యురసంభ్రమాత్‌ || 35 ||

మంత్రపూతం పురోడాశం జుహవామాసపావకే | హుతశేషం పురోడాశం విభజ్యాధ్వర్యురాదరాత్‌ || 36 ||

ఋత్విగ్భ్యోహోతృముఖ్యేభ్యః ప్రదదౌ పాపనాశనం || 36 ½ ||

తా|| పిదప వారు బ్రహ్మవాక్కుతో గంధమాదనమునకు (21) త్వరగా బృహస్పతిని ముందుంచుకొని యజ్ఞం చేయాలనే కోరికతో వెళ్ళారు. వారు మహాత్ముడైన అహిర్బుధ్న్యమునీశ్వరునికి నమస్కరించి (22) ఆ ఆశ్రమానికి కొద్ది దూరంలో యజ్ఞవాటికను ఏర్పరచారు. యజ్ఞకర్మ యందు నిష్ణాతులైన తపోధనులతో కూడి (23) దేవతలు అసురనాశకమైన ఇష్టిని ఆరంభించారు. ఆ కర్మలో హోత స్వయంగా బృహస్పతే (24) పాకశాసని కొడుకైన జయంతుడు మైత్రావరుణు డయ్యాడు. వసువులలో అష్టమవసువు అచ్ఛావాకుడైనాడు (25) శక్తి పుత్రుడు పరాశరుడు గ్రావస్తుతుడైనాడు. అధ్వర్యుభారమును మహాతేజస్వియైన అష్టావక్రుడు వహించాడు (26) విశ్వామిత్ర మహాముని ప్రతిప్రస్థాతా ఐనాడు. వరుణుడనేష్టాధనేశ్వరుడు ఉన్నేతఐనారు (27) సవిత, యజ్ఞము యొక్క సగము భారాన్ని వహిస్తూ బ్రహ్మఐనాడు. బ్రాహ్మణోత్తముడు వసిష్ఠుడు బ్రాహ్మణాచ్ఛంపి ఐనాడు. (28) శునః శేవుడు అగ్నీధ్రుడైనాడు. వాయువు ఉద్గాత ఐనాడు. పరేతరాట్టు (యముడు) ప్రస్తోతైనాడు (29) కుంభసంభవుడు అగస్త్యుడు ప్రతిహర్త ఐనాడు. గొప్పవాడైన విశ్వామిత్రాత్మ జుడు, సుబ్రహ్మణ్యుడు మధుచ్ఛందుడైనాడు. (30) దేవరాజు ఇంద్రుడు స్వయంగా యజమాని ఐనాడు. వ్యాసపుత్రుడు, ముని శుకుడు ఉపద్రష్ట ఐనాడు (31) పిదప ఆ ఋత్విజులందరు దేవరాజైన ఇంద్రుని ఆ మాహెశ్వర క్రతువునందు శాస్త్ర ప్రకారము దీక్ష వహింపచేశారు (32) ఈవిధంగా గంధమాదనంలో మహాయజ్ఞం ఆరంభ##మైంది. దుఃసహమైన సుదర్శన ప్రభావంతో అతిగా పీడితులై (33) యజ్ఞం నడుస్తుండగా రాక్షసులు ఆ యజ్ఞంలో దోషాన్ని కనుగొనలేక పోయారు. ఈ విధంగా ఏ అంతరాయము లేకుండ మహా యజ్ఞము నడిచింది (34) హరియైన అగ్నిభక్షిస్తూ బాగా వెలిగాడు. తొట్రుపాటు లేకుండా శాస్త్ర ప్రకారము అధ్వర్యుడు కర్మలనాచరించాడు (35) మంత్ర పూతమైన పురోడాశమును అగ్నిలో హోమం చేశాడు. హోమం చేయగా మిగిలిన పురోడాశాన్ని అధ్వర్యుడు విభజించి ఆదరంతో (36) ఋత్విక్కులకు హోతృముఖ్యులకు పాపనాశకమైన, దానిని ఇచ్చాడు.

మూ|| సవిత్రేబ్రహ్మణ చైకం అత్యుగ్రతర తేజసం || 37 ||

దదౌతత్రపురోడాశభాగం ప్రాశిత్రనామకం | ప్రతిజగ్రాహపాణిభ్యాం ప్రాశిత్రం సవితా తదా || 38 ||

సవిత్రా స్పృష్ట మాత్రం సత్‌తత్‌ ప్రాశిత్రం దురాసదం | తస్యపాణీ ప్రచిచ్ఛేద పశ్యతాం సర్వఋత్విజాం || 39 ||

తతః సంఛిన్నపాణిః సప్రాశిత్రేణోగ్రతేజసా | కిమేతదితి సంత్రస్తోవిషణ్ణవదనోభవత్‌ || 40 ||

సవితా ఋత్విజః సర్వాన్‌ సమాహూయేదమబ్రవీత్‌

సవితోవాచ -

పురోడాశస్యభాగోయం మమప్రాశిత్రనామకః || 41 ||

దత్తశ్చిచ్ఛేద మత్పాణీమిషత్స్వేవభవత్స్వపి | అతోభవంతః సంభూయ సర్వఏవహి ఋత్విజః || 42 ||

కల్పయంతామిమౌపాణీనోచేద్యజ్ఞం నిహస్మ్యముం | సవితుర్వాక్యమాకర్ణ్య తే సర్వేసమచింతయన్‌ || 43 ||

తత్రమధ్యేమునీంద్రాణాం దేవానాం చైవ సర్వశః | అష్టావక్రోమహాతేజా ఋత్విజస్తాన భాషత | || 44 ||

అష్టావక్ర ఉవాచ -

శృణుధ్వం ఋత్విజః సర్వేమమవాక్యం సమాహితాః మయిజీవతివిప్రేంద్రా విరించానాం శతంగతం || 45 ||

జాయంతేచ మ్రియం తేచ, చతురానన కోటయః | పశ్యన్నేవచతాన్సర్వాన్‌ అహంప్రాణానధారయం || 46 ||

తత్రలోకేశ్వరాభిఖ్యేవర్తమానే ప్రజాపతౌ | విప్రోహరిహరోనామనివసన్‌ శ్యామలాపురే || 47 ||

వ్యాధేనారణ్యవాసేన కేల్యర్థం లక్ష్యవేధినా | ఛిన్నపాదోభవద్బాణౖర్లక్ష్యమధ్యం సమాగతః || 48 ||

సగంధమాదనం ప్రాప్యమునిభిః ప్రేరితస్తదా | స్నాత్వాచమునితీర్థేస్మిన్‌ ప్రాప్తవాంశ్చరణౌపురా || 49 ||

తదాపుణ్యమిదం తీర్థం మునితీర్థమితీరితం | ఇదానీం చక్రతీర్థాఖ్యం చక్రనామత్వవిందత || 50 ||

తదత్రక్రియతాం స్నానం ప్రాశిత్రచ్ఛిన్నపాణినా | మునితీర్థే సవిత్రాపి యుష్మాకం యదిరోచతే || 51 ||

తా|| బ్రహ్మఐన సవితకు మిక్కిలి ఉగ్రతేజస్సుగల ఒక భాగమును (37) ప్రాశిత్రమను పేరుగల దానిని పురోడాశభాగమును ఇచ్చాడు. సవిత అప్పుడు ప్రాశిత్రమును చేతులతో గ్రహించాడు (38) సవిత తాకగానే ఆ చేరరాని ప్రాశిత్రము అందరు ఋత్విజులు చూస్తుండగా ఆతని చేతులను ఛేదించింది (39) ఉగ్రతేజస్సుగల ప్రాశిత్రముతో పోయిన చేతులు గల సవిత ఇదేమిటని భయపడి విషణ్ణవదనుడైనాడు (40) సవితఋత్విజులందరిని పిలిచి ఇట్లా అన్నాడు. సవితోక్తి - ఇది ప్రాశిత్ర మను పేరుగల పురోడాశము నాభాగము ఇది (41) ఇవ్వగానే, మీరు చూస్తుండగానే నా చేతులను ఛేదించింది. అందువల్ల మీరంతాకలిసి, ఋత్విజులందరు (42) ఈ చేతులను తిరిగి కల్పించండి లేదా ఈ యజ్ఞాన్ని నాశనం చేస్తాను. సవిత వాక్యాన్ని వారందరు విని ఆలోచించారు (43) ఆ మునీంద్రుల, అందరు దేవతల మధ్యలో మహా తేజస్సు గల అష్టావక్రుడను ఋత్విజుడు వారితో ఇట్లా అన్నాడు (44) అష్టావక్రునిమాట - ఓ ఋత్విజులార! నా మాటను శ్రద్ధగా వినండి. నేను బ్రతికుండగానే నూరుగురు విరించులు గడిచిపోయారు (45) చతురాననుల నమూహ ములు పుడ్తున్నారు చస్తున్నారు. వాటన్నిటిని చూస్తునే నేను ప్రాణములను ధరించాను (46) లోకేశ్వరుడనే పేరుగల ప్రజాపతి ఉండగా శ్యామాలాపురమందు హరిహరుడను పేరుగల బ్రాహ్మణుడు నివసించేవాడు (47) అరణ్యంలో ఉండే వ్యాధుడు ఆ టకోరకు (తమాష) లక్ష్మాన్ని ఛేదిస్తుండగా, లక్ష్యమునకు మధ్యగా వచ్చి బాణముతో పాదములు పోగొట్టుకున్నాడు (48) ఆతడు మునులతో ప్రేరేపింపబడి గంధమాదనమునకు వచ్చి ఈ ముని తీర్థంలో స్నానం చేసి పాదములను తిరిగి పొందాడు (49) అప్పుడు పుణ్యమైన ఈ తీర్థము మునితీర్థమని చెప్పబడింది. ఇప్పుడు చక్రతీర్థమను పేరు గలిగి చక్రనామము పొందింది. (50) ప్రాశిత్రము వల్ల చేతులు విరిగిన సవిత ఇక్కడ స్నానం చేయాలి. మీకిష్టమైతే మునితీర్థంలో సవిత కూడా చేయాలి. (51)

మూ|| ఋత్విజః కథితాసై#్వవం అష్టావక్రమహర్షిణా | సవితారమభాషంత సర్వేఏవవ్రహర్షితాః || 52 ||

సవితః స్నాహితీర్థే స్మిన్‌ తవపాణీ భవిష్యతః | అష్టావక్రోయథాప్రాహ తథాకురుసమాహితః || 53 ||

తతః స, సవితాగత్వాచక్రతీర్థం మహత్తరం | సస్నౌ పాణ్యోరవాప్త్యర్థం ఇష్టదాయిని తత్రసః || 54 ||

ఉత్తిష్ఠన్నేవస తదాతత్రస్నాత్వా సభక్తికం | యుక్తో హిరణ్మయాభ్యాంతుపాణిభ్యాం సమదృశ్యత || 55 ||

హిరణ్యపాణింతం దృష్ట్వా జహృషుః సర్వఋత్విజః | తతః సమాప్యతం యజ్ఞం దైత్యసంఘాన్విజిత్యచ || 56 ||

ఇంద్రాదయః సురాః సర్వే సుఖితాః స్వర్గ మాయయుః | తస్మాదేతత్సమాగత్య తీర్థం సర్వైశ్చమానవైః || 57 ||

సేవనీయంప్రయత్నేన స్వస్వాభీష్టస్యసిద్ధయే | అంధైశ్చకుణిభిర్మూకైః బధిరైఃకుబ్జకైరపి || 58 ||

ఖంజైః పంగుభిరప్యేత దంగహేనైస్తథావరైః | సంఛిన్నపాణి చరణౖః సంఛిన్నాన్యాంగ సంచయైః || 59 ||

మనుషై#్యశ్చ తథాన్యైశ్చ వికలాంగస్య పూర్తయే | సేవనీయమిదంతీర్థం సర్వాభీష్ట ప్రదాయకం || 60 ||

ఏవంవః కథితం విప్రాః చక్రతీర్థస్యవైభవం | యత్రస్నాత్వా పురాభిన్నౌ పాణీప్రాపప్రభాకరః || 61 ||

యఃపఠే దిమమధ్యాయం శృణుయాద్వాసమాహితః అంగాని వికలాన్యస్య పూర్ణానిస్యుర్న సంశయః || 62 ||

మోక్షకామస్యమర్త్యస్య ముక్తిః స్యాన్నాత్ర సంశయః || 63 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే చక్రతీర్థ ప్రశంసాయాం ఆదిత్యహిరణ్మయ పాణ్యవాప్తి వర్ణనం నామ త్రయో వింశోధ్యాయః || 23 ||

తా|| అష్టావక్రమహర్షి ఋత్విజులతో ఇట్లా అన్నాక, అందరూ ఆనందపడి సవితతో ఇట్లా అన్నారు. (52) సవిత నీవు ఈ తీర్థంలో స్నానం చేయి. నీకు చేతులు వస్తాయి. అష్టావక్రుడు ఎట్లా చెప్పాడో అట్లా శ్రద్ధతో చేయి అన్నాక (53) పిదప మహాత్తరమైన చక్రతీర్థమునకు సవిత వెళ్ళి చేతులు రావటం కొరకు ఇష్టాలను కూర్చే దానిలో ఆతడు స్నానం చేశాడు (54) భక్తి పూర్వకముగా స్నానము చేసి లేచినంతలో బంగారు చేతులతో కూడినవాడై కనిపించాడు. (55) బంగారు చేతులు కల ఆతనిని చూచి ఋత్విజులందరు ఆనందించారు. ఆ యజ్ఞమును సమాప్తి చేసి దైత్య సంఘముల జయించి (56) ఇంద్రాది దేవతలు అందరు సుఖంగా స్వర్గానికి వెళ్ళారు. అందువల్ల ఈ తీర్థమునకు వచ్చి, నరులందరు (57) తమ తమ అభీష్టసిద్ధి కొరకు ప్రయత్న పూర్వకముగా దీనిని సేవించాలి. అంధులు, చప్పిడి చేయివారు, మూగవారు, చెవిటి వారు, గూనివారు (58) కుంటివారు, చప్పిడి కాలువారు అంగహీనులైనవారు, అట్లాగే ఇతరులు విరిగిన కాలు చేతులవారు, తెగిన ఇతర అవయవముల వారు (59) మనుష్యులు అట్లాగే ఇతరులు వికలాంగపూర్తి కొరకు, సర్వాభీష్ట ప్రదాయకమైన దీనిని సేవించాలి (60) ఈ విధముగా మీకు చక్రతీర్థవైభవమును చెప్పాను. ఓ బ్రాహ్మణులారా! ఎక్కడైతే పూర్వం, విరిగిన చేతులను, స్నానం చేసి ప్రభాకరుడు పొందాడో (61) ఈ అధ్యాయాన్ని చదివినవారి శ్రద్ధగా విన్నవారి వికలాంగములు పూర్ణ మౌతాయి. అనుమానం లేదు (62) మోక్షకామియైన, నరునకు ముక్తిలభిస్తుంది. ఇందులో అనుమానములేదు, (63) అని శ్రీస్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతుమాహాత్మ్యమందు చక్రతీర్థ ప్రశంసయందు ఆదిత్యునకు బంగారు చేతులు రావటమనునది ఇరువది మూడవ అధ్యాయము || 23 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters