Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునేడవ అధ్యాయము

మూll శ్రీసూత ఉవాచ-

పునరిత్యాహకక్షీవాన్‌ పితరం తం మునీశ్వరాః lయథోదంకేనగురుణా ప్రేషితో7హమిహాధునా ll 1 ll

సమాగతోస్మితీర్థే7స్మిన్నాగస్త్యేమునిసత్తమ! స్వనయస్యసుతోద్వాహసిద్ద్యర్థం గురుచోదితః ll 2 ll

ఉపాయం తన్నిగదితమత్రకుర్వన్న్యవర్తిషంlవర్షత్రయావసానే మాముద్వాహోపాయసంయుతం ll 3 ll

స్వనయోత్రైవతిష్ఠన్‌తమానసాదయదృచ్ఛయాlసచమామేత్యకన్యాంతేదాస్యామీతివచో7బ్రవీత్‌ ll 4 ll

తతోస్మదనురోధేనత్వామాహ్వయదయంనృవఃl ఇతీరయిత్వాపితరం కక్షీవాన్‌ విరరామనః ll 5 ll

సుదర్శనో7థ విప్రేంద్రః పురోధాఃస్వనయస్యనః l ప్రయ¸°రాజ సవిధం స్వనయాయనివేదితుం ll 6 ll

రాజానంతం సమాసాద్యస్వనయం ససుదర్శనః l ప్రాప్తం నివేదయామానతం దీర్ఝతమసంమునిం ll 7 ll

తతఃసరాజాస్వనయోమునింప్రాస్తంపురోహితాత్‌lశ్రుత్వావినిర్య¸°ద్రష్టుంసహసాపటమండపాత్‌ ll 8 ll

అగస్త్యతీర్థతీరేతం సపుత్రం ఋషిసత్తమంlదదర్శరాజా స్వనయోబ్రహ్మాణమివదేవరాట్‌ll 9 ll

వవందేర్ఝతమసశ్చరణౌలోకమంగలౌ l ఉత్థాప్యనృవతింవిప్రాస్తదాదీర్ఝతమామునిః ll 10 ll

ఆశిషం ప్రయుయోజాథస్వనయాయనృపాయనః అత్రాంతరేసమాయాత ఉదంకో7పి మహాసృషిః ll 11 ll

రామసేతౌధనష్కోటౌ స్నాతుంశిష్యగణౖర్వృతః లక్షసంఖ్యోమునిగణస్తేనసాకం మునీశ్వరః ll 12 ll

ఉదంకో7గస్త్యతీర్థేస్మిన్‌ స్నాతుం సంప్రాప్తవాన్‌ మునిః lఉదంకమాగతం దృష్ట్వాకక్షీవాన్‌ ప్రణనామతం ll 13 ll

అకరోదాశిషం విప్రః శిష్యాయాథగురుస్తదాlఅథరీర్ఝతమావిప్రస్తముదంకం మహామునిం ll 14 ll

కుశలం పరిపప్రచ్ఛ సో7పితం మునివుంగవం l ఉభౌతౌమునిశార్దూలౌ సర్వలోకేషు విశ్రుతా ll 15 ll

కథాయామాసతుస్తత్రకథా పాపప్రణాశినీః l అథరాజప్యుదంకంతం ప్రణనామమునీశ్వరం ll 16 ll

ఉదంకోప్యాశిషం తసై#్మప్రాయుంక్తస్వనయాయవై l రాజథస్వనయంః ప్రీతస్తత్ర వాక్యమభాషత ll 7 ll

మునింతం దీర్ఝతమసం వివాహః క్రియతామితిl తథాస్త్విత్యవదత్సో7పి తదాదీర్ఝతమామునిః ll 18 ll

శ్వఏవ క్రియతాం రాజన్‌ సుముహూర్తే మహామతే l అత్రైవ పాణిగ్రహణం క్రియతాం గంధమాదనే ll 19ll

తాll శ్రీ సూతులిట్లనిరి - కక్షీపుడు తన తండ్రితో తిరిగి ఇట్లా అన్నాడు ఇక్కడికినేను ఉదంకుడను గురవుచే పంపబడ్డాను. (1) ఈ అగస్త్యతీర్థమునకు వచ్చాను . గురువుతో ప్రేరేపింపబడి స్వనయుని కూతురు వివాహం జరిగే కొరకు వచ్చాను (2) అతడు చెప్పిన ఉపాయాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నాను. మూడు సంవత్సరాల తర్వాత నాకు వివాహం జరిగే ఉపాయం కలవాణ్ణి (3) స్వనయుడు అనుకోకుండా ఇక్కడే ఉన్న నన్ను చేరాడు. నా దగ్గరకు వచ్చి నాకూతురు ను నీకిస్తాననేమాట పలికాడు (4) నామాటననుసరించి ఈ రాజు నిన్నుపిలిపించాడు అని తండ్రితో, పలికి కక్షీవుడు విరమంచాడు . (5)రాజుగారి పురోహితుడు సుదర్శనుడను బ్రాహ్మణుడు రాజైన స్వనయుని దరికి నివేదించుటకు వెళ్ళాడు (6) ఆసుదర్శనుడు స్వనయరాజును సమీపించి దీర్ఝతమముని వచ్చాడని చెప్పాడు (7) ఆ స్వనయరాజు ముని వచ్చాడని పురోహితుని పల్లవిని, చూచుటకై పటమంటపం నుండి త్వరగా బయటికి వచ్చాడు (8) అగస్త్య తీర్థ తీరంలో కొడుకుతో కూడిన ఋషిని, ఇంద్రుడు బ్రహ్మను చుచినట్లు, స్వనయరాజు చూచాడు (9) లోకమంగలకరములైన దీర్ఝతమునిచరణములకు రాజనమస్కరించాడు. రాజున లేపి దీర్ఝతమముని (10) స్వనయనృపుని అశీర్వదించాడు. ఇంతలో వచ్చిన ఉదంకఋషికూడా (11) ధనుష్కోటి యందు రామసేతువు యందు శిష్యగణముతో స్నానముచేయుటకు చుట్టబడిఉన్నాడు.లక్ష సంఖ్యగలమునిగణముతో మునీశ్వరుడు (12) ఉదంకుడు ఈ అగస్త్య తీర్థంలో స్నానం చేయటానికి వచ్చాడు. వచ్చిన ఉదంకుని చూచి కక్షీపుడు ఆతనికి నమస్కరించాడు(13)శిష్యునకు గురువు ఆశీర్వాదము చేశాడు. అప్పుడు దీర్ఝతముడను బ్రాహ్మణుడు ఆ ఉదంకమహామునిని(14)కుశలమడిగాడు. ఆతడు ఇతని క్షేమమడిగాడు. ఆమునీశులిద్దరు అన్నిలోకములందు ప్రసిద్ధమైనవారు(15)పాపనాశకమైన కథలను చెప్పసాగారు. ఆ రాజుకూడాఉదంకముని నమస్కరించాడు. (16) ఆ స్వనయునకు ఉదంకుడు కూడా ఆశీర్వాదమిచ్చాడు. సంతుష్టుడైన రాజు ఇట్లా అన్నాడు . (17)ఆదీర్ఝతమసునితో వివాహము చేయండి అని. ఆ దీర్ఝతమముని సరే అట్లాగే - కానీ అని అన్నాడు (18) మంచి ముహూర్తమందు రేపే చేయండి ఓ బుద్ధిమాన్‌ ! ఈ గంధమాదన పర్వతమందే పాణి గ్రహణం చేయండి (19)

మూllతస్మాదిహానయక్షిప్రంకన్యామంతః పురం తథా l ఇత్యుక్తః స్వనయోరాజాగత్వాన్వపటమంటపం ll 20 ll

అహూయశత సంఖ్యాకాన్‌ వద్ధాన్‌ వర్షపరాంస్తదా l ఆనేతుం ప్రేషయామన కన్యామంతః పురంతథా ll21ll

తేవర్షవరముఖ్యాస్తు స్వనయేన ప్రచోదితాః l మనోజవాన్‌ సమరుహ్యవాజనో మధురాంయయుః ll 22 ll

గత్వాచాంతః పురంతూర్ణంవత్తంసర్వం నివేద్యచ l కన్యయాంతః పురేణాపి సహితాః పునరాయయుః ll 23 ll

తతఃపరస్మిన్‌ దివసేశుభేదీర్ఝతమాఋషిఃl గోదానాదీని పుత్రస్యవిధివన్నిరవర్తయత్‌ ll 24 ll

నివృత్తేష్వథకక్షీవాన్‌ గోదానాదిషుకర్మను l ఉద్వోఢుంరాజతనయాంపిత్రాచగురుణాసహ ll 25 ll

చతుర్దంతం మహాకాయం గజంసర్వాంగ పాండురం l అరుహ్యహర్షనంయుక్తో ద్వితీయ ఇవదేవరాట్‌ ll 26 ll

మనోరమాయాః కన్యాయాః పూరయంశ్చమనోరథం lబ్రాహ్మణౖః బహుసాహసై#్రః సహితః స్వస్తివాచకైః ll 27 ll

తోరణాలంకతద్వారం రాజర్షేః పటమంటవం l కృతమంగలకృత్యో7సౌకక్షీవాన్‌ ముదితోయమౌ ll 28 ll

తతఃస్వనయకన్యాసాకృతమంగలభూషణా lచతుర్దంతమహాకాయశ్వేత దంతావలతస్థితం ll 29 ll

కక్షీవంతంసమాయాంతం దృష్ట్యా స్వోద్వాహనోత్సుకంl ప్రతిజ్ఞా మాత్కృతేదానీంనిర్‌ వృత్తే తిముదంయ¸° ll 30 ll

తాll అందువలన అంతః పురకన్యను తొందరగా ఇక్కడికే తీసుకురండి, అని స్వనయరాజు పలికి, తన పటమంటపమునకు వెళ్ళి (20) సూరు మంది వృద్ధులను అట్లాగే షండులను పిలిచి కన్యను, అంతః పురమును రప్పించుటకు పంపించాడు (21)స్వనయునితో పంపబడిన షండముఖ్యులు మనోవేగం కలగుఱ్ఱములనెక్కి మధురానగరికి వెళ్ళారు (22) అంతః పురమునకు వేగంగా వెళ్ళివిషయమంతా చెప్పి కన్యను అంతఃపురంతో సహా తీసుకు వచ్చారు (23)ఆ తరువాతి రోజు మంచి సమయమున దీర్ఝతము ఋషి కొడుకుతో గోదానము మొదలగువాటిని శాస్త్రప్రకారము నిర్వర్తింపచేశాడు (24)గోదానాది కర్మలు కక్షీవుడు నిర్వర్తించాక, రాకుమారైను వివాహమాడుటకు తండ్రితో గురువుతో కూడా కలిసి (25) నాలుగు దంతములు, పెద్ద శరీరముగల తెల్లని ఏనుగునెక్కి ఆనదంతో రెండవ ఇంద్రునిలా వెలిగిపోతూ (26) మనోరమ అనుకన్య యొక్క కోరికను నేరవేర్చబోతు, స్వస్తి వాచనం పలుకుతున్న అనేకవేల మంది బ్రాహ్మణలతో కలిసి (27) తోరణములతో అలంకరింపబడ్డ ద్వారముగల రాజర్షి యొక్క పటమంటపమునకు, మంగళ కృత్యములు నిర్వర్తించుకున్న ఈ కక్షీపుడు ఆనందంతో వెళ్ళాడు . (28) మంగళకర భూషణములతో అలంకరింపబడ్డ ఆ స్వనయకన్య నాల్గుదంతములు, పెద్ద శరీరము తెల్లనైనది ఐన ఏనుగుపైనున్న (29) వస్తున్న తన పెళ్ళి విషయంలో ఉత్సాహంగల కక్షీపునిచూచి, నేను చేసిన ప్రతిజ్ఞ ఇప్పటికి నేరవేరింది అని ఆనందపడింది (30).

మూ ll కక్షీవాన్‌ దీర్ఝతమసాతథోదంకేనసంయుతః lపటకార బహిర్ద్వారం క్రమాద్రాజ్ఞః సమాయమౌ ll 31 ll

స్వనయస్తుతతో దృష్ట్వాకక్షీవంతం సమాగతం l ప్రతుజ్జగామ సహిత ః సుదర్శన పురోధసా ll 32 ll

కక్షీపతో పరస్యాథకన్యకాపరిచారికా ఃlరాజతైఃస్వర్ణపాత్రైశ్చ చక్రుర్నీరాజనావిధిం ll 33 ll

స్వనయేన సమాహూతో బ్రహ్మణౖః పరివారితః ప్రవివేశాధలక్ష్మీవాన్‌ కక్షీవాన్‌ రాజమందిరం ll 34 ll

తతోపరేణసహితతంతం దీర్ఝతమసంమునిం lసోదంకమనయద్రాజా స్వగృహంవినయాన్వితఃll 35 ll

ఉదంకదీర్ఝతమసోరర్ఝ్యం చప్రదదౌనృపః lఅలంకృతే ప్రపామధ్యేవస్త్రచామరతోరణౖః ll 36 ll

వరోదీర్ఝతమాశ్చాన్యేసోదంకామునయస్తదాlన్యక్షీదన్‌స్వనయశ్చాపిసామాత్యః నపురోహితః ll 37 ll

తతోదుహితరంకన్యాంసుకేశీంతాంమనోరమాంlభూషణాలంకృతాంగాత్రేదివ్యవస్త్రధరాంశుభాం ll 38 ll

బింబోష్ఠీంచారు సర్వాంగీం పీనోన్నతపయోధరాం lc పపాయామధ్యమనయన్‌ మహాజన సమాకులం ll 39 ll

తతోవరస్యకంఠే సామాలాం చంపకనిర్మితాం lనివేశయామానశుభాజన మధ్యేమనోరమా ll 40 ll

ఉదంకస్తత ఆగత్యప్రతిష్ఠాప్యానలం స్థలేl కృత్వాగ్ని ముఖ పర్యంతం లాజాహోమాదికం తథా ll 41 ll

పాణిమాగ్రాహయత్తస్యాఃకన్యాయాశ్చవరేణతు l ఉదంకః కారయామాన సర్వకర్యాణితత్రవై ll 42 ll

వరవధ్వోః తదావిప్రాః ప్రాయుంజత తదాశిషఃlతతః సరాజా స్వనయోవరందీర్ఝతమో మునిం ll 43 ll

ఉదంకం వరపక్షీపన్‌ స్వపక్షీయాం స్తథాద్విజాఃl త్రిలక్షం బ్రాహ్మణానన్నైః భోజయామానషడ్రసైః ll 44 ll

తతః సంభావయామాసతాంబూలాద్యైరనేకథా l ఆథామంత్ర్యమునిశ్రేష్ఠ ముదంకః స్వాశ్రమం య¸° ll 45 ll

అన్వేచబ్రాహ్మణాస్సర్వేస్వదేశాన్‌ ప్రయయుస్తదాl ఏవంవివాహెనిర్వృత్తే కక్షీవద్రాజకన్యయోః ll 46 ll

తాll కక్షీపుడు దీర్ఝతమునితో, అట్లాగే ఉదంకునితో కూడా కలిసి పట ఆకారం గల బహిర్ద్వారం నుండి క్రమంగా రాజు దగ్గరకు వెళ్ళాడు (31) స్వనయుడు తన దగ్గరకు వచ్చిన కక్షీవుని చూచి తనపురోహితునితో కూడా లేచి ఎదురొచ్చాడు . (32) కన్యకాపరిచారికలు వరడైన కక్షీవునకు వెండి బంగారు పాత్రలతో నీరాజన విధిని ఆచరించారు (33) స్వనయునితో పిలువబడి బ్రాహ్మణులతో చుట్టబడి లక్ష్మీవంతుడైన కక్షీవుడు రాజమందిరము ప్రవేశించాడు (34) వరునితోకూడిన దీర్ఝతమనుని, ఉదంకుని తన ఇంటికి వినయంగా తీసుకువెళ్ళాడు రాజు. (35) రాజు ఉదంక దీర్ఝతమసులకు అర్ఝ్యమిచ్చాడు. వస్త్రచామర తోరణములతో అలంకృతమైన ప్రపామధ్యయందు (36) పెండ్లికొడుకు, దీర్ఝతముడు, ఇతరులు ఉదంకుడు మొదలగు మునులు కూర్చున్నారు. మంత్రులతో, పురోహితునితో కూడి స్వనయుడు ఉన్నాడు. (37)పిదప సుకేశియైన కన్యయైన తన కూతురు మనోరమను కంఠమందు భూషణములతో అలంకరింపబడ్డదాన్ని, దివ్యమైన వస్త్రములను ధరించిన దానిని (38) బింబోష్ఠిని, సుందరమైన సర్వవయవములు కలదానిని, పీనమైన ఉన్నతస్తనములు కలదానిని, మహాజనులతో నిండిన ప్రపామధ్యకు తీసుకొని వెళ్ళారు (39)పిదప కన్యక చంపకముల మాలను వరుని కంఠమందు, జనులమధ్యలోశుభలక్షణములు కల మనోరమ వేసింది (40) పిదప ఉదంకుడు వచ్చి అగ్నిని ప్రతిష్ఠాపించి, అగ్ని ముఖ పర్వంతము లాజాహోమము మొదలగునవి చేసి (41)వరునితో ఆకన్య పాణిని గ్రహింపచేశాడు. ఉదంకుడు అక్కడ సర్వకర్మలు చేయించాడు (42) అప్పుడు బ్రాహ్మణులు వరుడు వధువువీరిద్దరికి ఆశీర్వాదములిచ్చారు. పిదప రాజు స్వనయుడు వరుని, దీర్ఝతముని (43) ఉదంకుని వరవక్షము వారిని, తన పక్షమువారిని మూడు లక్షల బ్రాహ్మణులను షడ్రసములతో భుజింపజేశాడు (44) పిదప తాంబూలము మొదలగు వానితో అనేకవిధముల గౌరవించాడు. మునిశ్రేష్ఠునితో పోయి వస్తానని చెప్పి ఉదంకుడు తన ఆశ్రమమునకు వెళ్ళాడు (45)ఇతరు బ్రాహ్మణులందరు తమతమదేశములకు వెళ్ళారు. ఈ రకముగా వివాహము కక్షీపుడు రాజుకన్యకకు జరిగాక (46).

మూll ప్రవిశ్యఆగస్త్య తీర్థంస తిరోధత్త గజోత్తమఃl తతోదీర్ఝతమావిప్రాః పుత్రేణస్నుషయాసహ ll 47 ll

అగస్త్యస్తన్యహాతీర్థేస్నానంకృత్వేష్టదాయినిlశ్లాఘమానశ్చత్తతీర్థం సర్వలోకేషువిశ్రుతం ll 48 ll

ప్రమాతుంస్వాశ్రమంపుణ్యంవేదారణ్యంమనోధధేlరాజానంచతమాగంతుంఆవృచ్ఛన్ము%్‌మునిస్త్మనిసత్తమః ll 49 ll

స్వనయో7పితదారాజా స్వదుహిత్రేముదాన్వితః lదదౌశతసహస్రాణిస్వర్ణాని స్త్రీధనంతదాll 50

గవాంసహcసంప్రదదౌదాసీ నాంచసహస్రకం l గ్రామం పంచశతంచాపి దదౌదుహితృవత్సలః ll 51 ll

దివ్యవస్త్రాయుతంచాపిశతంభూషణపేటికాఃlహారమాలసహస్రంచదాదౌదుహితృసౌహౄదాత్‌ ll 52 ll

ఏతత్సర్వంసమాసపుత్రం నస్నుషోమునిః l రాజ్ఞాచసమనుజ్ఞాతః ప్రయ¸°వేదకాననం ll 53 ll

వేదారణ్యంసమాసాద్యతదాదీర్ఝతమామునిఃlఉవాససుసుఖం విప్రాః పుత్రేణస్నుషయాసహ ll 54 ll

సేవన్‌ వేదాటవీనాదం భుక్తిముక్తి ఫలప్రదం l న్యవసత్‌సుచిరం కాలంకక్షీవానపిభార్యయా ll 55 ll

స్వనయోపినరాజర్షిః స్నాత్వాకుంభజనిర్మితే l తత్రతీర్థేమహాపుణ్య సహితః సర్వసైనికైః ll 56 ll

అంతఃపురంసమాదాయముదితఃస్వపురంయ¸° l అగస్త్యతీర్థమాహాత్య్మాదేవం కక్షీవతోమునేః ll 57 ll

అనన్యసులభోవిప్రాఃవివావాఃసమజామతl

శ్రీసూత ఉవాచ-

ఇలుహాసస్త్వయంపుణ్యోవేదసిద్ధోమునీశ్వరాః ll 58 ll

ధన్యోయశస్య ఆయుష్యః కీర్తసౌభాగ్యవర్థనః శ్రోతవ్యఃపఠివ్యో7యం సర్వథామానవైర్ద్విజాః ll 59 ll

పఠతాం శృణ్వతాంచేయమితిహాసం పురాతనం l నేహాముత్రాపివాక్లేశోదారిద్య్రంచాపినోభ##వేత్‌ ll 60 ll

ఇతి శ్రీస్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతు మాహెత్మ్యే కక్షీ వత్‌ వివాహ నిష్పత్తి వర్ణనం నామసప్తదశో7ధ్యాయః ll 17 ll

తాll ఆ ఉత్తమగజము అగస్త్యతీర్థమును ప్రవేశించి కన్పించకుండా పోయింది. పిదప దీర్ఝతముడు కొడుకు కోడలుతో కూడి (47)ఇష్టములను తేర్చే అగస్త్య మహాతీర్థంలో స్నానంచేసి, సర్వలోకములలో ప్రసిద్ధమైన ఆ తీర్థమును ప్రశంసిస్తూ (48) తన పుణ్యప్రదమైన వేదారణ్యమునందలి ఆశ్రమునకు వెళ్ళుటకు మనస్సులో అనుకున్నాడు. ఆ రాజుతో, పోయివస్తానని ఆముని చెప్పాడు. (49) స్వనయుడు ఆరాజు సంతోషంతో తనకూతురునకు స్త్రీధనముగా లక్షబంగారు నాణములను ఇచ్చాడు (50) వేయిఆవులను, వేయిమంది దాసీజనమును ఐదునూర్ల గ్రామములను కూతురు మీది ప్రేమతో ఇచ్చాడు (51)పదివేల దివ్యవస్త్రములను, నూరు సొమ్ముల పెట్టెలను, వేయి హారములను కుతురిపై ప్రేమతో ఇచ్చాడు(52)ఇదంతా తీసుకొని కొడుకుతో కోడలితో కూడిముని, రాజు అనుమతి పొంది వేదకాననమునకు బయలుదేరాడు (53)దీర్ఝతమముని వేదారణ్యమును చేరి కొడుకు కోడలుతో సహాసుఖంగా ఉన్నాడు (54)వేదాటవీనాథుని సేవిస్తూ, భుక్తిముక్తులనిచ్చేస్వామిని సేవిస్తూ కక్షీపుడు భార్యతో కూడా చాలా కాలమున్నాడు (55) స్వనయరాజర్షి కూడా అగస్త్యుడు నిర్మించిన పుణ్యప్రదమైన ఆ తీర్థమందు సర్వసైనికులతో కూడి స్నానం చేసి (56)అంతఃపురజనాన్ని తీసుకొని అనందంగా తననగరంకువెళ్ళాడు. అగస్త్యతీర్థమాహాత్య్మంవల్ల ఈవిధముగా కక్షీవతుడనుమునికి ఇతరులకు సులభసాధ్యంకాని విధమగా వివాహం జరిగింది . (57) శ్రీసూతులిట్లనిరి- ఈ ఇతిహాసము పుణ్యప్రదమైంది వేదసిద్ధమైనది ఓమునులారా!(58) ఈ కథవినటం ధన్యత నిచ్ఛేది. కీర్తిని ఆయుష్యమును సౌభాగ్యమును పెంచేది . మానవులందరు వినతగినది చదువతగినది ఇది (59) పురాతనవైన ఈ ఇతిహాసమును చదివిన వినినవారికి ఇక్కడ, వరలోకంలో కూడా క్లేశము దారిద్ర్యము ఉండవు (60) అనిశ్రీస్కాంద మహాపురాణమందు ఏకాశీత సహస్త్ర సంఖ్యగల తృతీయమైన బ్రహ్మఖండమందు సేతమాహాత్మ్యమందు కక్షీవుని వివాహము జరిగిన విధమును వర్ణించుట యనునది పదునేడవ అధ్యాయము సమాప్తము. ll 17 ll

Sri Scanda Mahapuranamu-3    Chapters