Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునారవ అధ్యాయము

మూ|| సూత ఉవాచ-

కుండే హనుమతః స్నాత్యా స్వయంరుద్రేణ సేవితే | అగస్తి తీర్థం విప్రేంద్రా తతోగచ్ఛేత్సమాహితః || 1 ||

ఏతద్వినిర్మితం తీర్థం సాక్షాద్వైకుంభయోనినా | ప్రవర్తమానే కలహే పురావై మేరు వింధ్యయోః || 2 ||

నిరుద్ధభువనాభోగో వవృధే వింధ్యపర్వతః తదా ప్రాణిషు సర్వేషు నిరుచ్ఛ్వాసేషు దేవతాః ll 3 ll

కైలాసంపర్వతం గత్వాశంభ##వే తద్విజిజ్ఞపన్‌ l తదా సపార్వతీ పాణి గ్రహణోత్సుకకౌతుకీ ll 4 ll

ప్రేషయిత్వావసిష్ఠాదీన్‌ పార్వతీంయీచితుంమునీన్‌ l కుంభజత్వం నిగృహ్ణీష్వ వింధ్యాద్రిమితిసో7న్వశాత్‌ ll 5 ll

తతః సకుంభజః ప్రాహభగవంతం పినాకినం lఉద్యాహ వేషం తేదేవ నద్రక్ష్యే హంకథం విభో ll 6 ll

ఇతి విజ్ఞాపితః శంభుఃపునఃకుంభజమబ్రవీత్‌l కుంభజోద్వాహవేషంతో పార్వత్యాసహితోహ్యహం ll 7 ll

వేదారణ్య మహాపుణ్య దర్శయిష్యామ్య సంశయః తద్గచ్ఛశీఘ్రం వింధ్యాద్రిం నిగ్రహీతుం మునీశ్వర ll 8 ll

ఏవముక్తస్తతో గస్త్యోవింధ్యాద్రింసనిగృహ్యచ l పాదాక్రమణ మాత్రేణ సమీకుర్వన్‌ మహీతలం ll 9 ll

చరిత్యాదక్షిణాన్‌ దేశాన్‌ గంధమాదన మన్వగాత్‌ l సవిదిత్వామహర్షిస్తు గంధమాదన వైభవం ll 10 ll

తత్ర తీర్థం మహాపుణ్యం స్వనామ్నా నిర్మమేమునిః l లోపాముద్రాఖస్తత్ర వర్తతే7ద్వాపి కుంభజః ll 11 ll

తత్రస్నాత్వాచ పీత్వాచన భూయో జన్మభాక్భవేత్‌ l ఇహలోకే త్రికాలే7పి తత్తీర్థసదృశం ద్విజాఃll 12 ll

తీరర్థంనవిద్యతే పుణ్యం భుక్తిముక్తి ఫలప్రదం l సర్వాభీష్టప్రదం నౄణాం యత్తీర్థస్నానవైభవాత్‌ ll 13 ll

సుదీర్ఝ తమ సఃపుత్రః కక్షీవాన్నామనామతః లేభే మనోరమాం నామస్వనయస్య సుతాంప్రియాం ll 14 ll

కక్షీపతః కథాసేయం పుణ్యాపాపవినాశినీ l తాంకథాంపః ప్రపక్ష్యామి తచ్ఛృణుధ్వం మునీశ్వరాః ll 15 ll

అస్తిదీర్ఝ తమానామమునిఃపరమ ధార్మికఃl తస్య పుత్రః సమభవత్‌ కఠ్షీవానితి విశ్రుతః ll 16 ll

ఉపనీతః సకక్షీవాన్‌ బ్రహ్మచారీజితేంద్రియఃl వేదాభ్యాసాయ సగురోః కులేవాస మకల్పయత్‌ ll 17 ll

తాll సుతులిట్లనిరి - స్వయంగా రుద్రుడు సేవించిన హనుమత్కుండంలో స్నానం చేసి శ్రద్ధగా , పిదప అగస్తి తీర్థమునకు వెళ్ళాలి (1) ఈ తీర్థాన్ని అగస్త్యుడే స్వయంగా నిర్మించాడు. పూర్వం మేరు, వింధ్య పర్వతములకు కలహం జరుగుతుండగా (2)వింధ్య పర్వతములోకముల పూర్ణతను అడ్డగిస్తూ పెరిగింది. ప్రాణులంతా ఉచ్ఛ్వానరహితులు కాగా దేవతలు (3)కైలాస పర్వతమునకువెళ్ళి ఈ విషయాన్ని శివునకు విజ్ఞావన ,చేశారు అప్పుడు శివుడు పార్వతీపాణి గ్రహణమందు ఉత్సుకత కలవాడై (4)పార్వతిని యాచించుటకు వసిష్టాదిమనులను పంపి, కుంభజ! నీవు వింధ్య పర్వతాన్ని నిగ్రహించు అని ఆతనిని అనుశాసించాడు (5)అప్పుడు కుంభజుడు పినాకితో ఇట్లా అన్నాడు మీ వివాహపు వేషాన్ని చూడలేను గదా ఎట్లా ప్రభు! (6)అని అంటే శివుడు తిరిగి కుంభజునితో ఇట్లా అన్నాడు. కుంభజ ! నీవు విహహ వేషమంటే నేను పార్వతితో కూడినదే (7) మహాపుణ్య ప్రదమైన వేదారణ్యంలో కనిపిస్తాము అనుమానంలేదు. అందువల్ల ఓ ముని తోందరగా వింధ్యాద్రిని నిగ్రహించుటకు వెళ్ళు(8)అని శివుడనగా ఆ అగస్త్యుడు వింధ్యాద్రిని, నిగ్రహించి, పాదమును అక్రమించుట ద్వారా (పాదం మోపి) నే భుమిని చక్కజేసి (9) దక్షిణ దేశాలు తిరుగుతూ గంధమాదనము వెళ్ళాడు. ఆమహర్షి గంధమాదన వైభవాన్ని తెలుసుకొని (10) తన పేరుతో ఆముని మహా పుణ్యప్రదమైన తీర్థాన్ని నిర్మింప చేశాడు. లోపాముద్ర సఖుడైన కుంభజుడునేటికి గూడా అక్కడున్నాడు . (11) అక్కడ స్నానం చేసి జలపానం చేసిన యెడల తిరిగి జన్మరాదు. ఈ లోకంలో త్రికాలములందును ఆ తీర్థముతో సమానమైన (12)తీర్థములేదు. అది పుణ్యప్రదమైనది. భుక్తిముక్తి ఫలములనిచ్చేది. అన్ని కోరికలతీర్చేది. ఆ తీర్థస్నాన వైభవం వల్ల(13) సుదీర్ఝ తమసుని పుత్రుడు కక్షీవంతుడను వాడు, స్వనయుని కూతురైన మనోరమ అనుదానిని భార్యగా పొందాడు. (14)కక్షీపతుని కథ పుణ్యమైంది పాపనాశకమైంది ఆకథను మీకు చెప్పెదను, ఓ మునులారా ! మీరు వినండి (15)పరమధార్మికుడు, దీర్ఝతముడను ముని ఉండేవాడు. ఆతనికి కక్షీవంతుడను పేరు గలపుత్రుడుండేవాడు (16) ఉపనయనం ఐన ఆ కక్షీవంతుడు బ్రహ్మచారి జితేంద్రియుడు. వేదభ్యాసము కొరకు ఆతడు గురుకులమందువానము కల్పించుకున్నాడు (17).

మూll ఉదంకస్యగురోర్గేహెవసన్‌ దీర్ఝతమః సుతః l సో7ధ్యేష్టచతురోవేదాన్‌ సాంగాన్‌ శాస్త్రాణిషట్తథా ll 18 ll

ఇతి హాసపురాణాని తథోపనిషదో7పిచ l ఉషిత్వాషష్టివర్షాణి కక్షీవాన్‌ గురుసన్నిదౌ ll 19 ll

ప్రయాస్యన్‌ స్వగృహం విప్రాగురవేదక్షిణామదాత్‌ l ఉవాచ వైగురుర్విద్వాన్‌ కక్షీవాన్‌ బ్రహ్మవిత్తమః ll 20 ll

కక్షీవాను వాచ -

అహంగృహంప్రయాస్యామి కుర్వనుజ్ఞాంమహామునే l అవలోక్యకృపాదృష్ట్యా మాంరక్షోదంకసాంప్రతం ll 21 ll

ఉదంకస్త్వేవముదితః కక్షీవంతమథాబ్రవీత్‌ l

ఉదంక ఉవాచ -

అనుజానామి కక్షీవాన్‌ గచ్ఛత్వం స్వగృహం ప్రతి lll 22 ll

ఉద్వాహార్థముపాయంతే వత్సవక్ష్యామితచ్ఛృణు l రామసేతుం ప్రయాహిత్వం గంధమాదన పర్వతం ll 23 ll

తత్రాగస్త్యకృతం తీర్థం సర్వాభీష్టప్రదాయకం l భుక్తిముక్తి ప్రదం పుంసాం సర్వపాపనిబర్హణం ll 24 ll

విద్యతేస్నాహితత్రత్వం సర్వమంగల సాధనే l త్రివర్షం వసతత్రత్వం నియమాచార సంయుతః ll 25 ll

వర్షేషు త్రిషుయాతేషు చతుర్థేవత్సరేతతః l నిర్గమిష్యతి మాతంగః కశ్చిత్తీర్థోత్తమాత్తతః ll 26 ll

చతుర్థంతో మహాకాయః శరదభ్రసమచ్ఛవి ః తంగజం గిరిసంకాశం స్నాత్వతత్ర సమారుహ ll 27 ll

అరుహ్యతంగజంవత్సస్వన యస్యపురీంప్రజ lచతుర్దంత గజస్థంత్వాం దృష్ట్వా శక్రమివాపరం ll 28 ll

రాజర్షిః స్వనయోధీమాన్‌ హర్షవ్యాకులలోచనఃl స్వకన్యాయాః కృతే దుఃఖం త్యజేదేవ హౄదిస్థితం ll 29 ll

పురాహిప్రతిజజ్ఞేసాతస్యపుత్రీమనోరమా l చతుర్దంతం మహాకాయంగజం సర్వాంగపాండురం ll 30 ll

ఆరుహ్యయః సమాగచ్ఛేత్‌ సమేభర్తాభ##వేదితిl స్వకన్యాయాః ప్రతిజ్ఞాంతాం సమాకర్ణ్య సభూపతిః ll 31 ll

దుంఖాకులమనాభూత్వాసతతం పర్యచింతయత్‌ l స్వనయే చింతయత్యేవంనారదః సముపాగమత్‌ ll 32 ll

తమాగతం మునిందృష్ట్వా రాజర్షి రతిధార్మికః lప్రత్యుద్గమ్య ముదాయుక్తః పాద్యార్ఝ్యాద్యైః అపూజయత్‌ ll 33 ll

ప్రణమ్యనారదం రాజా వచనంచేదమ బ్రవీత్‌ lకన్యేయం మమదేవర్షే ప్రతిజ్ఞామకరోత్పురా ll 34 ll

చతుర్దంతం మహాకాయం గజం సర్వాంగ పాండురం l అరుహ్యయః సమాగచ్ఛేత్‌ సమేభర్తాభ##వేదితి ll 35 ll

చతుర్దంతో మహాకాయోగజః సర్వాంగపాండురఃl సంభ##వేదింద్ర భవనే భూతలేనైవ విద్యతే ll 36 ll

ఇయంచదుస్తరామేనాం ప్రతిజ్ఞాం బాలిశా7కరోత్‌l ఇయం ప్రతిజ్ఞాతితరాం సతతం బాధతేహిమాం ll 37 ll

అనూఢాహిపితుః కన్యాసర్వదాశోకమావహెత్‌ l ఇతి తస్యవచఃశ్రుత్వాస్వనయంనారదో 7బ్రవీత్‌ ll 38 ll

మావిషీదస్వరాజర్షేతస్యా ఈదృగ్విధఃపతిః భవిష్యత్య చిరాదేవ పృథివ్యాం బ్రాహ్మణోత్తమః ll 39 ll

కక్షీవానితి విఖ్యాతో జామాతాతే భవిష్మతి l ఇత్యుక్త్వానారదమునిః యయావాకాశమార్గతః ll 40 ll

స్వనయః తద్వచః శ్రుత్వానారదేన ప్రభాషితంl ఆకాంక్షతేదివారాత్రం తాదృగ్విధసమాగమం ll 41 ll

అతః సౌమ్యమహాభాగకక్షీవాన్‌ బాలతాపస l అగస్త్య తీర్థమద్యత్వం స్నాతుం గచ్ఛత్వరాన్వితః ll 42 ll

సర్వమంగలసిద్ధిస్తే భవిష్యతిన సంశయః ll 42 1/2 ll

తాll గురువైన ఉదంకుని ఇంట్లో ఉంటూ దీర్ఝతముని కొడుకు నాలుగువేదములను అంగములతో కూడా శాస్త్రము లారింటిని (18)ఇతి హాసపురాణములు, ఉపనిషత్తులు అభ్యసించాడు. కక్షీవంతుడు గురుసన్నిధిలో అరవై సంవత్సరాలు ఉండి (19) తన ఇంటికి వెళ్తూ గురువునకు దక్షిణ ఇచ్చాడు. పూజ్యుడు, విద్వాంసుడు బ్రహ్మవిత్తముడుఐన కక్షీవంతుడు గురువుతో ఇట్లా అన్నాడు (20) కక్షీవంతుని మాట- ఓముని నేను ఇంటికి వెళ్తున్నానమ అనుజ్ఞ ఇవ్వండి. కృపాదృష్టితో నన్ను చూచి ఓ ఉదంక! నన్ను రక్షించు అని ఇట్లా ఉదంకునితో అనగానే ఆతడు కక్షీవంతునితో ఇట్లా అన్నాడు (21)ఉదంకునిమాట-ఓకక్షీవంత! ఇంటికి వెళ్ళటానికి అనుజ్ఞ ఇస్తున్నాను . నీ ఇంటికి వెళ్ళు (22) నీవివాహము కొరకు నీకు ఉపాయాన్ని చెబుతాను. దాన్ని విను.రామసేతువునకు గంధమాదన పర్వతానికి నీవు వెళ్ళు.(23)అక్కడ అగస్త్యుడేర్పరచిన తీర్థముంది. అన్ని కోరికలను తీర్చేది. పాపాలన్ని తొలగించేది.భుక్తిముక్తి ప్రదము (24) అన్ని మంగలముల సాధించే దానిలో నీవు స్నానం చేయి. నియమాచారములతో కూడా అక్కడ నీవు మూడు సంవత్సరాలుండు (25) మూడు సంవత్సరాలుగడిచాక నాల్గవ సంవత్సరంలో ఆ ఉత్తమ తీర్థమునుండి ఒక ఏనుగు బయటికి వస్తుంది (26)నాల్గు కోరలు, భారీశరీరము, శరత్కాల మేఘంవలె తెల్లని కాంతి గలది అది. కొండలాగా ఉండే ఆ ఏనుగు స్నానం చేసి అధిరోహించు (27) ఆ ఏనుగును ఎక్కి స్వనయుని పురానికి వెళ్ళు. నాలుగు కోరలుగల ఏనుగుపై అపర ఇంద్రునిలా ఉన్న నిన్ను చూచి (28) రాజర్షి, బుద్ధిమంతుడైన స్వనయుడు ఆనందంతో చంచలమైన నేత్రములు కలవాడై తన మనసులో ఉన్న తన కన్యను గూర్చిన దుఃఖాన్ని వదిలేస్తాడు (29) ఆతని కూతురు మనోరమ పూర్వం ప్రతిజ్ఞ చేసింది. నాల్గుదంతములు కలది, మహాకాయముగలది . అంతా తెల్లగా ఉన్నట్టిది ఐన ఏనుగును (30) ఎక్కి వచ్చినవాడే నా భర్తకావాలి అని. తనకూతురు ప్రతిజ్న దానిని విన్న ఆ రాజు (31) దుఃఖంతో నిండిన మనస్సు కలవాడై ఎప్పుడు విచారిస్తుండేవాడు. స్వనయుడు ఇట్లా చింతిస్తూ ఉండగా నారదుడొచ్చాడు. (32) వచ్చిన ఆమునిని చూచి ఆతిధార్మికుడైన రాజర్షి ఎదురేగి సంతోషంతో కూడినవాడై పాద్య అర్ఝ్యములతో పూజించాడు . (33) రాజు, నారదునకు నమస్కరించి ఇట్లా అన్నాడు. ఓదేవర్షి ! ఈనా కూతురు పూర్వం ప్రతిజ్ఞ చేసింది (34)నాల్గుదంతములు, మహాకాయము, సర్వాంగ పాండురము ఐన ఏనుగును ఎక్కివచ్చిన వాడే నా భర్త కాగలడని (35)చతుర్దంతములు, మహాకాయము, సర్వాంగ పాండురము ఐన గజము ఇంద్రభవనంలో ఉండొచ్చు. భూతలంలో లేదు (36) దుస్తరమైన ప్రతిజ్ఞను ఈ అమాయకురాలు చేసింది . ఈ ప్రతిజ్ఞ ఎప్పుడు నన్ను మిక్కిలిగా బాధిస్తోంది (37) వివాహంకాని అమ్మాయి తండ్రికి ఎప్పుడూ దుఃఖాన్ని కల్గించేది. అనే ఆతని మాటలను విని స్వనయునితో నారదుడు ఇట్లా అన్నాడు (38) బాదపడకు ఓరాజర్షి ! ఆమె యొక్క ఇలాంటి కోరిక ఈ భూమి మీద తప్పకుండా తీరుతుంది, త్వరలోనే బ్రహ్మణుడు (39)కక్షీవంతుడను పేరుగల ప్రసిద్ధుడు నీకు అల్లుడౌతాడు. ఇట్లా చెప్పి నారదముని ఆకాశమార్గంగుండా వెళ్ళిపోయాడు (40)స్వనయుడు, నారదుడుచెప్పిన మాటలను విని అటువంటివాని సమాగమముకొరకు రాత్రింబవళ్ళు కోరుకుంటున్నాడు . (41) కనుక ఓ మహాభాగ! బాలతాపస! సౌమ్య! కక్షీవంతుడ ! వేగంగా నీవు అగస్త్య తీర్ధానికి ఇప్పుడే స్నానం చేయటానికి వెళ్ళు (42) సర్వమంగళసిద్ధి నీకు కల్గుతుంది అనుమానం లేదు. ll 42 1/2 ll

మూll ఉదంకేనైవముక్తో7 థకక్షీవాన్‌ ద్విజపుంగవః ll 44 ll

అనుజ్ఞా తశ్చగురుణాప్రయ¸°గంధమానదం l సంప్రాప్యాగస్త్య తీర్థంచ తత్రసస్నౌజితేంద్రియః ll 44 ll

క్షేత్రో పవాసమ కరోత్‌ దినమేకం మునీశ్వరః lఅపరేద్యుః పునఃస్నాత్వాపారణామకరోద్ద్విజఃll 45 ll

రాత్రౌతత్రైవసుష్వాప కక్షీవాన్‌ ధర్మతత్పరః ఏవంనియమయుక్తస్య తస్యకక్షీవతోమునేః ll 46 ll

ఏకేనదివసేనోనం వర్షత్రయమథాగమత్‌ l అధవర్షత్రయస్యాంతే తస్మిన్నేవదినేమునిః lll 47 ll

అన్వాస్యపశ్చమాంసంధ్యాం సుఖం సుష్వావతత్తటే l యామమాత్రావశిష్టాయాం విభావర్యాం మహాధ్వనిః ll 48 ll

ఉదభూcత్పలయాంభోధి వీచికోలాహలోవమః తేనశ##బ్దేన మహతాకక్షీవాన్‌ ప్రత్యబుధ్యత ll 49 ll

తతస్తున్వనయోనామరాజాసానుచరోబలీ l మృగయాకౌతుకీతత్రమధురాపతిరాయ¸° ll 50 ll

వినిఘ్నన్‌ సగజాన్‌ సింహాన్‌ వరాహాన్‌ మహిషాన్‌ రురాన్‌lఅన్యాన్‌ మృగవిశేషాంశ్చసరాజాన్యవధీచ్ఛరైః ll 51 ll

సామాత్యోమృగయాసక్తోరథవాజిగజైర్యుతఃl అగస్త్యతీర్థసవిధం ఆససాదభటాన్వితః ll 52 ll

సరాజామృగయాశ్రాంతః శ్రాంతసైనిక సంవృతః lతత్తీర్థతీర ప్రాంతేషు నిషసాద మహీపతిఃll 53 ll

తతః ప్రభాతే విమలే కక్షీవాన్‌ మునిసత్తమః lఅగస్త్యతీర్థేస్నాత్వా7సౌసంధ్యాం పూర్వాముపాస్యచ ll 54 ll

తస్యతీరే జపస్మంత్రాన్‌ తస్థౌని యమ సంయుతఃl అత్రాంతరే తీర్థవరాత్‌ గజఏకోవినిర్య¸° ll 55 ll

చతుర్దంతో మహాకాయః కైలాస ఇవమూర్తిమాన్‌ l సనముత్థాయతత్తీర్థాత్‌ అగాత్‌ కక్షీవదంతికం ll 56 ll

తమాగతముదంకోక్తలక్షణౖరువలక్షితం l తదానిరీక్ష్యకక్షీవాన్‌ ఆరోఢుంస్నానమాతనోత్‌ ll 57 ll

నమస్కృత్యచతత్తీర్థం శ్లాఘమానోముహుర్ముహుః lఆరురోహచకక్షీవాన్‌ చతుర్దంతం మహాగజం ll 58 ll

ఆరుహ్మతంచతుర్దంతం రజతాచలసన్నిభం l స్వనయస్యపురీమేవకక్షీవాన్‌ గంతుమైచ్ఛత ll 59 ll

తా ll ఉందకుడు ఇట్లా చెప్పాక కక్షీవంతుడు (43) గురువు అనుజ్ఞను పొంది గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అగస్త్య తీర్థమును చేరి జితేంద్రియుడైన ఈతడు స్నానం చేశాడు (44) ఈ మునీశ్వరుడు ఒకరోజు క్షేత్రోపవాసము చేశాడు. మరుసటి రోజు మరల స్నానం చేసి ఆ బ్రాహ్మణుడు పారణ చేశాడు (45) ధర్మతత్పరుడైన కక్షీవంతుడు రాత్రియందు అక్కడే పడుకొన్నాడు . ఈ రకంగా నియమవంతుడైన ఆ కక్షీవంత మునికి (46) ఒకరోజు తక్కువగా మూడు సంవత్సరాలు గడిచాయి. మూడవ సంవత్సరం చివర ఆ రోజేముని (47) పశ్చిమ సంధ్యను ఉపాసించి దాని తీరమందు హాయిగా నిద్రించాడు. రాత్రి ఒక ఝాముమాత్రమే మిగిలిఉందనగా పెద్దధ్వని (48)పిదప బలవంతుడైన, అనుచరులతో కూడిన స్వనయుడనే రాజు, మాధురాపతి వేటాడే కౌతుకంతో అక్కడికి వచ్చాడు (50) అతడు ఏనుగులను, సింహాలను, పందులను, దున్నలను, దుప్పులను చంపుతూ వచ్చాడు. ఇంకా ఇతర మృగ విశేషములను కూడా ఆ రాజు బాణములతో చంపాడు. (51) మంత్రులతోరథములు గుఱ్ఱములు ఏనుగులతో కూడినవాడై వేటయందాసక్తి కలవాడైభటులతో కూడి అగస్త్య తీర్థము సమీపమునకు వచ్చాడు . (52) ఆ రాజు వేటాడి ఆలసిపోయి, అలసిన సైన్యం కలవాడై ఆ తీర్థప్రాంతమందు విశ్రమించాడు (53)పిదప తెల్లవారాక కక్షీవముని అగస్త్యతీర్థంలో స్నానంచేసి పూర్వసంధ్యను ఉపాసించి (54) ఆ తీర్థతీరంలో మంత్రములు జపిస్తూ నియమంగా ఉన్నాడు . ఇంతలో ఆ తీర్థమునుండి ఒక ఏనుగు బయటికి వచ్చింది (55) చతుర్దంతములు మహాకాయము కైలాసమువలె తెల్లగా ఉంది . అది ఆ తీర్థమునుండి లేచి కక్షీవముని సమీపమునకు వెళ్ళింది. (56) ఉదంకుడు చెప్పిన లక్షణములుగల ఆ వచ్చిన ఏనుగును చూచి, దానిని ఎక్కటానికి కక్షీవుడు స్నానం చేశాడు (57)ఆ తీర్థానికి నమస్కారం చేసి మాటిమాటికి దాన్ని పొగుడుతూ, చుతర్ధంతములు కల అమహాగజమును కక్షీవుడు ఎక్కాడు (58)నాల్గుదంతములతో కైలాసపర్వతంవలె తెల్లగా ఉన్న ఆ ఏనుగు నెక్కి కక్షీపుడు స్వనయుని నగరానికి వెళ్ళదలిచాడు (59).

మూll తమారుఢం చతుర్దంతం శ్వేతదంతావలోత్తమం l నవీక్ష్యనిశ్చికాయైనం కక్షీవానితిభూపతిః ll 60 ll

ప్రసన్నహృదయోరాజా తస్యాంతికముపాగమత్‌ l తదాభ్యాశముపాగమ్య కక్షీవంతం నృపో 7బ్రవీత్‌ll 61 ll

స్వనయ ఉవాచ-

త్వం బ్రహ్మన్‌ కస్యపుత్రో7సి నామకింతవమేవద l గజమేనం సమారుహ్యకుత్రవాగంతుమిచ్ఛసి ll 62 ll

స్వనయేనైవముక్తస్తు కక్షీవాన్‌ వాక్యమ బ్రవీత్‌ l

కక్షీవాసువాచ -

పుత్రో7 హం దీర్ఝతమసః కక్షీవా నితివిశ్రుతః ll 63 ll

స్వనయస్యతురాజర్షేః గచ్ఛామినగరం ప్రతి l అహముద్వోఢుమిచ్ఛామి తస్యకన్యాం మనోరమాం ll 64 ll

చతుర్దంతగజారుఢస్తత్ర్పతిజ్ఞాంచపుకరయన్‌ l స్వనయస్యనుతాపాణిం గ్రహిష్యామిన రాధివ ll 65 ll

తద్భాషితం సమాకర్ణ్య శ్రోత్ర పీయూషవర్షణం l హర్షసంపుల్లన యనః స్వనయోవాక్యమబ్రవీత్‌ ll 66 ll

కక్షీవాన్‌ భోః కృతార్ధో7 స్మి సఏవ స్వనయోహ్యహం l ఉద్వోఢుమిచ్ఛతిభవాన్‌ యస్యకన్యాం మనోరమాం ll 67 ll

స్వాగతంతేముని శ్రేష్ఠకక్షీవాన్‌ బాలతాపన l మమకన్యాం గృహాణత్వం తపోధన మనోరుమాం ll 68 ll

తయాసహచరన్‌ ధర్మాన్‌ గార్హస్థ్యం ప్రతిపాలయ l రాజోక్తః సతదోవాచకక్షీవాన్‌ ధర్మతత్పరః ll 69 ll

రాజనం స్వనయం ప్రీతం మదురాం పురవాపినం l

కక్షీవానువాచ -

పితా దీర్ఝతమానామవేదారణ్యమమ ప్రభో ll 70 ll

అస్తేతపశ్చరన్‌సౌమ్యెనియమాచారతత్పరఃl తస్యాంతి కంప్రేషయత్వం విప్రమేకందరావతే ll 71ll

తధోక్తః సతదారాజా స్వనయోహృష్టమానసఃlఅనేక సేనయాసార్థం ప్రాహిణోత్‌ స్వపురోధనం ll 72 ll

విప్రం సుదర్శనం నామవేదారణ్య స్థలం ప్రతి l సుదర్శనః సమా దిష్టః స్వనయేననృపేణసం ll 73 ll

మహత్యాసేన యాసార్థం ప్రయమౌవేదకాననం l తత్రోటజేసమాసీనం తందీర్ఝతమనంమునిం lll 74 ll

తపశ్చరంతమాసీనం థ్యాయన్‌ వే దాటవీపతిం l పురోహితో దదర్శాథ జపంతం మంత్రముత్తమం ll 75 ll

ప్రణామమకరోత్తసై#్మమునయే ససుదర్శనః l ఉవాచదీర్ఝతమనం మునిం ప్రహ్లాదయన్నివ ll 76 ll

తా ll నాలుగు దంతములుగల ఉత్తమమైన తెల్లని ఏనుగును ఎక్కిన ఆతనిని చూచి ఈతడు కక్షీవంతుడు అని రాజు నిశ్చయించుకొనెను (60) ప్రసన్నమైన హృదయముగలరాజు ఆతని సమీపమునకు వచ్చాడు. అట్లా సమీపమునకు వచ్చి రాజు కక్షీవంతునితో ఇట్లా అన్నాడు . (61) స్వనయునిమాట - ఓబ్రహ్మ!నీవు ఎవరిపుత్రుడవు, నీ పేరేమిటి నాకు చెప్పు. నీవు ఈ ఏనుగునెక్కి ఎక్కిడికి వెళ్ళ దలిచావు. స్వనయుడు ఇట్లా అనగానే కక్షీవుడు ఇట్లా అన్నాడు. (62) కక్షీవుని మాట - నేను దీర్ఝతుసుని పుత్రుణ్ణి. కక్షీపుడు అనినాపేరు. (63) స్వనయుడను రాజర్షి నగరానికి వెళ్తున్నాను అతని కూతురైన మనోరమను వివాహమాడుటకు ఇష్టపడుచున్నాను. (64) నాల్గుకోరలుగల ఏనుగునెక్కిన అనే అమె ప్రతిజ్ఞను నెరవేర్చి స్వనయుని కూతురు పాణి గ్రహణాన్ని చేస్తాను (65) అని అన్న ఆతని మాటలను విని, వీనులకు అమృతమునందించినట్లుకాగా ఆనందంతో విప్పారిననేత్రములుకలవాడై స్వనయుడు ఇట్లా అన్నాడు (66) ఓకక్షీవుడ ! నేను ధన్యడనైనాను. అన్వనయుడనునేనే. నీవు పెండ్లాడదలచిన మనోరమ తండ్రిని (67) ఓబాలతాపస!మునిశ్రేష్ట! కక్షీవ ! నీకు స్వాగతము ఓతపోదన ! నాకూతురైన ! కన్యయైన మనోరమను స్వీకరించు (68)ఆమెతో కూడి ధర్మాన్నిచరిస్తూ గృహస్థ ధర్మాన్ని పరిపాలించు. రాజు ఇట్లుఅనగా ఆ దర్మతత్పరుడైన కక్షీవుడు ఇట్లా అన్నాడు. సంతుష్టుడై మధురావురవాసి యైన రాజైన స్వనయునితో ఇట్లా అన్నాడు (69)కక్షీవుని వచనము. వేదారణ్యమందు దీర్ఝతముడు నా తండ్రి (70) తపమాచరిస్తూ, నియమాచారతత్పరుడై, సౌమ్యుడైన వాడు ఉన్నాడు. ఓరాజా! అతని సమీపానికి నీవు ఒక బ్రాహ్మణుని పంపించు (71)ఆ రాజు స్వనయుడు సంతోషించి అట్లాగే అని పలికి అప్పుడు అనేక సేనలతో సహ తన పురోహితుని పంపాడు (72) వేదారణ్యానికి సుదర్శనుడను విప్రుని పంపాడు. స్వనయుడను రాజుతో అట్లా అజ్ఞాపింపబడ్డ సుదర్శనుడు (73)వేదకాననమునకు చాలా పెద్ద సేనతో వెళ్ళాడు. అక్కడ పర్ణశాలలో కూర్చున్న దీర్ఝతమనుడనుమునిని (74) వేదాటవీపతిని ధ్యానిస్తూ తపమాచరిస్తున్న వానిని, ఉత్తమ మంత్రాన్ని జపిస్తున్న వానిని పురోహితుడు చూచాడు (75) ఆ సుదర్శనుడు ఆ మునికి నమస్కారము చేశాడు. మునిని దీర్ఝతమసుని సంతోషపెడుతున్నట్లుగా పలికాడు (76).

మూll సుదర్శన ఉవాచ -

కచ్చిత్తే కుశలం బ్రహ్మన్‌ కచ్చిత్తే వర్దతే తవః ఆశ్రమే కుశలం కచ్చిత్‌ కచ్చిద్ధర్మే సుఖంవద ll 77 ll

వృష్టః సుదర్శనేనైవం మునిర్దీర్ఝతమాస్తదా l సుదర్శన మువాచేదం అర్ఝ్యాదివిధి పూర్వకం ll 78 ll

దీర్ఝతమా ఉవాచ-

సర్వత్ర కుశలం బ్రహ్మన్‌ సుదర్శన మహామతే lమమవేదాటవీనాథకృపయానాశుభం క్వచిత్‌ ll 79 ll

తవాపికుశలం బ్రహ్మన్‌ కింసుఖాంగమనంతథా l కింవా7గమన కార్యంతే సుదర్శనమమాశ్రమే ll 80 ll

స్వనయస్యపురోధ్యాస్త్వం ఖలువేదవిదాంవరఃl తంవిహాయమహారాజం మధురా పురవాసినం ll 81 ll

మహాత్యాసేనయాసార్థం కిమర్ధంత్వమిహాగతః lఇత్యుక్తో దీర్ఝతమసాతదానీం ససుదర్శనః ll 82 ll

ఉవాచతం మహాత్మానం మునింజ్వతిత తేజసం l సర్వత్రమేసుఖంప బ్రహ్మన్‌ భవతః కృపయాసదా ll 83 ll

భగవన్‌ స్వనయోరాజా సాష్టాంగం ప్రణిపత్యతు lత్వాం ప్రాహప్రశ్రితం వాక్యం మున్ముఖేన శ్రుణష్వతత్‌ ll 84 ll

స్వనయ ఉవాచ -

కక్షీవాంస్తే సుతో బ్రహ్మన్‌ గంధమాదన పర్వతే lస్నానం కుర్వన్నగస్త్యస్య తీర్థే సంప్రతి వర్తతే ll 85 ll

తస్యరూపం తపోధర్మ మాచారాన్‌ వైదికాంస్తథా l వేదశాస్త్ర ప్రవీణత్వం అభిజాత్యం చతాదృశః ll 86 ll

లోకత్తరమిదం సర్వం విజ్ఞాయ తవనందనే l మనోరమాం సుతాం తసై#్మ దాతుమిచ్ఛామ్యహంమునే ll 87 ll

మృగయాకౌతుకీ చాహం గంధమాదన పర్వతం l ఆగతోమునిశార్థూల వర్తే యుష్మత్సుతాంతికే ll 88 ll

పిత్రనుజ్ఞాంవినానాహం ఉద్వహేయంసుతాంతవ l ఇతిబ్రూతే తవసుతః కక్షీవాస్మునిసత్తమ ll 89 ll

తద్భవాన్‌ మత్సుతాం తసై#్మ దాతుంమేనుగ్రహంకురు l పై#్రషయంచ సమీపంతే సేనయాచ సుదర్శనం ll 90 ll

సుదర్శన ఉవాచ -

ఇతిమాం భగవస్రజా ప్రాహిణోత్తవ సన్నిధింlతద్భవాననుమన్యస్వరాజ్ఞస్తస్య చికీర్షితం ll 91 ll

శ్రీసూత ఉవాచ-

ఇత్యుక్త్వా విరరామాథ స్వన యస్య పురోహితః l తతో దీర్ఝతమాః ప్రాహాస్వనయస్యపురోహితం ll 92 ll

దీర్ఝతమా ఉవాచ-

సుదర్శన భవత్వేవం కథితం స్వనయేనయత్‌ lమమాభీష్టతమం హ్యెతత్‌పాణి గ్రహణ మంగలం ll 93 ll

అగమిష్యామ్యహం విప్రగంధమానద పర్వతం lఇత్యుక్త్వాసము నిర్విప్రా మహాదీర్ఝతమామునిః ll 94 ll

వేదాటవీపతింసత్వాభక్తి ప్రవణ చేతసా l సుదర్శనేన సహితః సేతుముద్దిశ్యనిర్య¸° ll 95 ll

షట్‌భి దినైఃమునిఃపుణ్యం ప్రయ¸° గంధమాదనం l అగస్తితీర్థ తీరంచ గత్వాదీర్ఝతమామునిః ll 96 ll

అథపుత్రందదర్శాగ్రే కక్షీవంతం మహామునిః కక్షీవాన్‌ పితరం దృష్ట్యా వవందే నామకీర్తయన్‌ ll 97 ll

తతోదీర్ఝతమాయోగీస్వాంక మారోప్యతంసుతం l మూర్ద్య్సుపాఘ్రయ సస్నేహం సస్వజే పులకాకులః ll 98 ll

కుశలం పరిపప్రచ్ఛ తదాదీర్ఝతమాఋషిఃl సర్వవేదాస్త్వయాధీతాః కక్షీవాన్‌ కిమవత్సక ll 99 ll

శాస్త్రాణ్యపాఠీః కింత్వం వావత్ససర్వం వదస్వమేl ఇతిసృష్టః స్వపిత్రాస సర్వం వృత్తం తమ బ్రవీత్‌ ll 100 ll

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీత సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్య్మే అగస్తి తీర్థప్రశం సాయాం కక్షీవదుద్వాహో ద్యోగ వర్ణనం నామ షోడశో7 ధ్యాయః ll 16ll

తాll సుదర్శనుడిట్లనెను- ఓబ్రహ్మన్‌ !మీరుక్షేమమా మీతపస్సువర్థిల్లుతోందా! మీ అశ్రమంలో అంతా క్షేమమేనా. ధర్మం ఆచరణ సుఖంగా సాగుతోందా చెప్పండి (77) సుదర్శనుడు ఇట్లా అడుగగా అప్పుడు దీర్ఝతమముని అర్ఝ్యము మొదలగు వానితో శాస్త్రప్రకారము పూజించి సుదర్శనునితో ఇట్లా అన్నాడు . (78)దీర్ఝతముని వచనము -ఓబుద్ధిమంతుడ!సుదర్శన!బ్రహ్మ! అంతటా క్షేమము వేదాటవీనాథుని కృపతో నాకు అశుభమన్నది లేదు (79) మీరు క్షేమమేనా, మీరు సుఖంగా ఇక్కడికి వచ్చారా. మీరు ఏ పని మీద ఈ ఆశ్రమానికి వచ్చారు. ఓ సుదర్శన (80)నీవు స్వనయుని పురోహితునివి, వేదవిదులలో శ్రేష్ఠుడవు. మధురాపురంలో ఉండే రాజును వదలి (81) పెద్దసైన్యంతో సహా ఎందుకొరకు నీవిక్కడికి వచ్చావు. అని దీర్ఝతముడనగా అప్పుడు సుదర్శనుడు (82)తేజస్సుతో వెలిగిపోతున్న మహాత్ముడైన మునితో ఇట్లా అన్నాడు . మీదయతో అంతా సుఖంగానే ఉంది నాకు. (83)భగవాన్‌! స్వనయుడను రాజు సాష్టాంగ నమస్కారముచేస్తూ వినయపూర్వకమైన మాటలను మీకు చెప్పాడు. నాద్వారా మీరు వినండి . (84) స్వనయుని మాట - ఓబ్రహ్మ కక్షీవుడు మీకుమారుడు గంధమాదన పర్వతమందు అగస్త్యతీర్థంలో స్నానంచేస్తూ ఇప్పుడున్నాడు (85)అతని రూపము, తపము, ధర్మము వైదికాచారమలు, వేదశాస్త్ర ప్రావీణ్యము, అందుకు తగిన ఉత్తమ వంశజాతత్వము. (86)లోకోత్తరమైన వీటన్నిటిని మీ కుమారుని యందుచూచి ఓ ముని!మనోరమ అను నాకూతురును నేను అతనికివ్వదలిచాను . (87)వేటమీది కుతూహలంతో నేను గంధమాదన పర్వతానికి వచ్చాను. ఓముని! వచ్చి మీకుమారుని దగ్గర ఉన్నాను (88) మాతండ్రిగారి ఆజ్ఞ లేకుండా నీకూతురును నేను వివాహమాడను . అని కక్షీవుడు నీకుమారుడన్నాడు (89)అందువల్ల మీరు, నా కమమారైను ఆతనికిచ్చుటకు, నా యందను గ్రహించండి. సేనతో సుదర్శనుని మీదగ్గరకు పంపాను (90) సుదర్శనుని మాట -అని నన్నురాజు మీసన్నిదికి పంపాడు అందువల్ల మీరు ఆ రాజు కోరికను అనుమతిచండి (91)శ్రీసూతులిట్లనిరి -అని పలికి స్వనయుని పురోహితుడు విరమించాడు అప్పుడు దీర్ఝతముడు స్వనయునితో ఇట్లా అన్నాడు (92)దీర్ఝతమునిమాట -స్వనయుడు చెప్పినట్లుగానే కానిమ్ము. ఈ మంగలమైన పాణిగ్రహణము నాకు చాలా ఇష్టమైనది (93)నేను గంధమాదన పర్వతానికి వస్తాను. అని ఆ ముని చెప్పి, అతడు (94)భక్తి పూర్వకమైన మనస్సుతో వేదాటవీపతికి నమస్కరించి సుదర్శనునితో కూడి సేతువునుద్దేశించి బయలు దేరాడు . (95)ఆరు రోజులు ముని పుణ్యమైన గంధమాదన మునకు బయలుదేరాడు . దీర్ఝతమముని అగస్తి తీర్థ తీరమునకు వెళ్ళి, (96)తనకుమారుడైన కక్షీవంతుని ఆముని చూచాడు. కక్షీవుడు తన తండ్రిన చూచి తన పేరును చెబుతూ నమస్కరించాడు (97)పిదప దీర్ఝతమముని తనకుమారుని తొడయందుకూర్చోబెట్టుకొని, స్నేహ పూర్వకముగా మూర్ధమాఘ్రాణించి పులకాంకితుడై ఆలింగనము చోసుకున్నాడు. (98) అప్పుడు దీర్ఝతమ ఋషి కుశల మడిగాడు. ఓవత్స! నీవు అన్నివేదములను అభ్యసించావా (99) శాస్త్రములు పఠించావా. అన్నీనాకు చెప్పు అని తండ్రి అడుగగా అంతవృత్తాంతమును తండ్రితో చెప్పాడు (100) అని శ్రీస్కాంద మహాపురాణమందు ఎనుబది ఒక్కవేల సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండ మందు సేతుమాహాత్మ్యమందు అగస్తితీర్థప్రశంసయందు కక్షీవుని వివాహ ప్రయత్నమనునది పదునారవ అధ్యాయము సమాప్తము ll 16 ll

Sri Scanda Mahapuranamu-3    Chapters