Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది రెండవ అధ్యాయము

మూ || నూత ఉవాచ-

ఏవంశితమఃవంధాశివేనైన ప్రదర్శితః | సృణాంసంసృతిబద్ధానాం సద్యోముక్తికరఃపరః || 1 ||

అధదుర్మేధసాంపుసాం వేదేష్యనది కారిణాం | స్త్రీణాంద్విజాతి బంధూనాంసర్వేషాంచశరీరిణాం || 2 ||

ఏష సాధారణః పంథా ః సాక్షాత్కై వల్యసాధనః మహముని జనైః సేవ్యోదేవైరపినుపూజితః || 3 ||

యత్కథశ్రవణం శంభోఃసంసారభయానాశనం | సద్యోముక్తికరంశ్లాఘ్యంపవిత్రం సర్వదేహినాం || 4 ||

అజ్ఞానతిమిరాంధానాం దిపో7 యంజ్ఞానసిద్ధిదః | భవరోగని బద్ధానాం నుసేవ్యంపరమౌషధం || 5 ||

మహాపాతకశైలావాం వజ్రఘాతనుదారుణం | భర్జనం కర్మభీజానాం సాధనం సర్వసంపదాం || 6 ||

యేశృణ్వంతి సదాశంభోఃకధాంభువనపావనీం | తేవైమనుష్యాలోకేస్మిన్‌ రుద్రాఏవనసంశయః || 7 ||

శృణ్వతాంశూలినోగాధాంతధాకీర్తయతాంసతాం | తేషాంషాదర జాంస్యేవతీర్థాని మునయోజగుః || 8 ||

తస్మాన్నిః శ్రేయవంగంతు యేభివాంఛంతిదేహినః | తేశృణ్యంతుసదాభక్త్యాశైవంపౌరాణికీంకథాం || 9 ||

యద్యశక్తః సదా శ్రోతుంకథాంపౌరాణి కీంనరః | ముహూర్తంవాపిశృణుయాత్‌నియతాత్మాదినేదినే || 10 ||

అధప్రతిదినంశ్రోతుమశక్తోయది మానవః | పుణ్యమాసేషుమాపుణ్యదినేపుణ్య తిధిష్యపి || 11 ||

యఃశృణోతికథాంరమ్యాంపురాణౖః నముదీరతాం | పనిస్తరతి సంసారందగ్ధ్యాకర్మమహాటవీం || 12 ||

ముహూర్తం వాతదర్థం వాక్షణం వాపావనీంకధాం | యేశృణ్వంతిసదాభక్త్వాసతేషామస్తి దుర్గతి ః || 13 ||

యత్ఫలం సర్వ యజ్ఞేషుసర్వదానేషుయత్ఫలం | సకృత్‌ పురాణ శ్రవణాత్‌తత్ఫలం విందతేసరః || 14 ||

కలౌయుగే విశేషణ పురాణశ్రవణాదృతే | నాస్తిధర్మః షరంపుంసాంవాస్తి ముక్తిపధం పరః || 15 ||

పురాణశ్రవణాత్‌ శంభోః నాస్తింకీర్తనంపరం | అత ఏ సమనుష్యాణాం కల్పద్రుమమహాఫలం || 16 ||

కలౌహివాయుషోమర్త్యాః దుర్భలా శ్రమపీడితా ః | దుర్మేధసోదుఃఖభాజో ధర్మాచారవివర్జితాః || 17 ||

తా || సూతునివచనము - ఈ విధముగా శివమైన మార్గమును శివుడే చెప్పాడు. సంసారబద్ధులైన నరులకు వెంటనే ముక్తినిచ్చేది. పరమైనది (1) దుర్మేధనులైన నరులకు, వేదములతో అధికారంలోని వారికి ద్విజాతిబంధువులకు స్త్రీలకు, శరీరధారులందరకి (2) ఇది సాధారణ మార్గము. సాక్షాత్తుగా కైవల్యసాధనము మహామునులు సేవించేది దేవతలతో పూజింప బడేది (3) అశివ కథాశ్రవణము సంసారభయనాశనము వెంటనేముక్తినిచ్చేది.శ్లాఘించతగినది ప్రాణులందరికి పవిత్రమైనది (4) అజ్ఞాన తిమిరాంధులకు ఈ దీపము జ్ఞాన సిద్ధిని కల్గించేది. భవరోగబద్ధులకు సేవించ తగిన ఉత్తమఔషదము (5) మహాపాతకములచే శైలములకు వజ్రఘాతమువలె దారుణమైనది. కర్మభీజములకు బెదిరింపు సర్వసంపదలకు సాధనము (6) భువనపావనమైన శంభుకధను ఎప్పడూ ఎవరు వింటారో ఆనరులు ఈ లోకంలో రుద్రులే అనుమానం లేదు (7) శూలిగాధవినేవారి యొక్క అట్లాగే కీర్తించి సజ్జనుల యొక్క పాదరజములే లోకాలకు తీర్థములు, అనుమునులన్నారు. (8) అందువల్ల ముక్తిని చేరటానికి ఎవరిష్టపడతారో వారు భక్తితో ఎప్పుడు శివసంబంధమైన పురాణ కథను వివాలి. (9) ఎప్పుడు వినటానికి శక్తిచాలాకపోతే నరుడు పౌరాణికకథను నియతాత్ముడై ప్రతిరోజు ముహూర్త కాలమైనావినాలి. (10) ఒక వేళ ప్రతి రోజు వినటానికి నరుడు అశక్తుడైతే పుణ్యమాపములందు, పుణ్యదినమందు పుణ్యతిధులందు (11) ఎవడు వింటాడో పురాణములలో చెప్పిన ఈ రమ్యమైన కథను కర్మ మహాటవిని కాల్చేసి సంసారాన్ని దాటేస్తాడు (12) ముహూర్తముకాని, అందులోసగంకాలముకాని, క్షణంకాని పావనకథకు భక్తితో ఎప్పడూ ఎవరు ఇంటారో దుర్గతిలేదు. (13) సర్వయజ్ఞములకు ఏఫలమో సర్వదానములకు ఏ ఫలమో ఒకసారి పురాణం విన్నందువల్ల ఆ ఫలాన్ని నరుడు పొందుతాడు. (14) విశేషించికలియుగంతో పురాణ శ్రవణం కన్నపరమమైన ధర్మమునరులకు లేదు. పరమైనముక్తి పధము లేదు మరొకటి (15) పురాణశ్రవణంకన్న శంభువంకీర్తన మరొకటి లేదు. అందువల్లనే మనుష్యలకు కల్పద్రుమములే మహాఫలకరము (16) కలిలో హీనాయుషులైన వరులు, దుర్భలులు, శ్రమపీడితులు, దుర్మేధమలు, దుఃఖభాజనులు, ధర్మాచారవర్ణితులు అధికం అవి (17)

మూ || ఇతి సంచింత్యకృపయాభగవాన్‌ బాదరాయణః | హితాయతేషాం విధదేపురాణాఖ్యం సుధారసం || 18 ||

పి బన్నే వామృతం యత్నాత్‌ ఏతత్య్సదజరామరః | శంభోః కథామృతంకుర్యాత్‌ కులమే వాజరామరం || 19 ||

బాలోయువాదరిద్రోవా వృద్ధోవాదుర్భలో పినా | పురాణజ్ఞః సదావంద్యః పూజ్యశ్చనుకృతార్థభిః || 20 ||

నీ చబుద్ధింనంకుర్వీత పురాణజ్ఞేకదాచన | యస్యవక్త్రాంబుజాద్వాణీ కామధేనుః శరీరణాం || 21 ||

గురవఃసంతిలోకేషు జన్మతోగుణతస్తథా | తేషామపిచనర్వేషాంపురాణజ్ఞః పరోగురుః || 22 ||

భవకోటి సహప్రేషుభూత్వాభూత్వావసీదతి | యోదదాత్యపురునర్వృత్తిం కో7 న్యస్తస్మాత్పరోగురు ః || 23 ||

పురాణజ్ఞః శుచిఃదాంతః శాంతోవిజితమత్సరః | సాధుఃభకారుణ్య వాన్‌వాగ్మీపదేత్పుణ్యకథాం సుధీ ః || 24 ||

వ్యాసాసనం సమారూఢో యధాపౌరాణి కోద్విజః | అసమాప్తప్రసంగశ్చ నమస్కుర్యాన్నకన్యచిత్‌ || 25 ||

యేధూర్తాయేచదుర్వృత్తాయేచానై విజిగిషవః | తేషాంకుటీలవృత్తినాం అగ్రేనైన వదేత్కధాం || 26 ||

సదుర్ధన సమాకీర్ణేనశూద్రశ్వాపదావృతే | దేశేన ద్యూత సదనే పదేత్పుణ్యకధాః సుధీ ః || 27 ||

సద్ధామేనుజనాకీర్ణేసు క్షేత్రేదేవతాలయో | పుణ్యనదనదీతీరే పదేత్పుణ్యకధాంసుధీ ః || 28 ||

శివభక్తిసమాయుక్తానాస్యకార్యేషులాలసా ః | వాగ్యతాః సుశ్రనవో వ్యగ్రాఃశ్రోతారః పుణ్యభాగినః || 29 ||

అభక్తాయేకదాః పుణ్యాంశృణ్యంతిమనుజాధమాః | తేషాంపుణ్యఫలంనాస్తి దుఃఖం స్మాజ్జన్నజన్మని || 30 ||

పురాణంయేత్వసం పూజ్యతాంబూలద్యైరుపాయనైః | శృణ్వంతి చకధాంభక్త్వాదరిద్రాంన్యుః నపాపినః || 31 ||

కధాయాంకీర్త్య మానాయాంయేగచ్ఛంత్యన్యతోనరాః | భోగాంతరేప్రణశ్యంతి తేషాందారాశ్చసంపదః || 32 ||

సోష్టీషమస్తకాయేచక థాంశృణ్వంతిపావనీం | తే బాలకాః ప్రజాయంతే పాపినోమనుజాధమా ః || 33 ||

తాంబూలం భక్షయంతో యేకధాంశృణ్వంతిపావనీం | స్వవిష్టాం ఖాదయంత్యేతాన్నరకే యమకింకరా ః || 34 ||

తా || ఆలోచించి కృపతో భగవాన్‌ బాదారాయణుడు వారి హితంకొరకు పురాణమను పేరుగల సుధారసాన్ని చేశాడు (18) ఈ అమృతాన్ని ప్రయత్నపూర్వకముగా తాగితే ఇది అజరామరత్వాన్నిస్తుంది. శంభునికధామృతముకులాన్నే అజరామరంచేస్తుంది. (19) బాలుడు, యువకుడు, దరిద్రుడు, వృద్దుడు,దుర్బలుడు ఎవరైనా పురాణజ్ఞుడైతే వానిని ఎప్పుడు నమస్కరించాలి. సుకృతంకొరేవారు వారిని పూజించాలి. (20) నీచ బుద్దిని పురాణజ్ఞునిపైఎప్పుడూఉంచరాదు. ఎవరి వక్త్రాంబుజము నుండి వాణివస్తుందో అది శరీరాధారులకు కామధేనువు (21) లోకంలో జన్మంతో గుణంతో గురువులున్నారు. వాళ్ళందరిలో పురాణజ్ఞుడు నరుడైన గురువు (22) వేల కోట్లజన్మలలో అయ్యి అయ్యి నశిస్తాడు. గురువుకన్నవేరైన వాడెవడు తిరిగిరాని జీవితాన్ని (జన్మలేదు) ఇచ్చేవాడు (23) పురాణజ్ఞుడు, శుచియైనవాడు దాంతుడు, శాంతుడు, మత్సరంలేనివాడు, సాధువు కారుణ్యంగలవాడు, వాగ్ని ఐన సుధీమవంతుడు పుణ్యకధను చెప్పాలి. (24) పౌరాణికద్విజుడు వ్యాసంపై కూర్చొని, ప్రసంగాన్ని సమప్తి చేయకుండా ఎవనికీ నమస్కరించరాదు. (25) దూర్తులు, దుర్వృత్తులు, జయించే బుద్దిగలవారు ఇతరులు, అలాంటి కుటిలనడవడికలవారి ముందరకధను చెప్పరాదు (26) దుర్జనులు లేని, శూద్రులు శ్వాపదములులేని, ద్యూతసదనం కానిచోట కధను బుద్దిమంతుడు చెప్పాలి. (27) సద్గ్రమమందు సుజనులున్నచోట, సుక్షేత్రమందు, దేవతాలయమందు పుణ్యమైన నదీతీరమందు పుణ్యకధను చెప్పాలి (28) శివభక్తికలవారు ఇతరకార్యములపై ఆసక్తిలేనివారు, వాగ్యతులు బాగా వినగలిగినవారు, అచంచలులు అట్టి శ్రోతలు పుణ్యభాగులు (29) అభక్తులైన మనుజాధములుఈ కధను ఇంటారో వారికి పుణ్యఫలములేదు.జన్మజన్మలలోదుఃఖం కల్గుతుంది (30) పురాణాన్ని పూజించకుండా తాంబూలాదికానుకలు ఇవ్వకుండా కూడా కధను భక్తితో విన్న దరిద్రులు కూడా పాపులుకారు (31) కధను చెబుతూ ఉంటేవేరేవైపుపోయే నరులుమరో జన్మలో నశిస్తారు వారి భార్యలు సంపదలు కూడా (32) పావనమైనకధను తలపాగధరించి ఎవరు వింటారో వారు బాలకులై జన్మిస్తారు. మనుజాధములైన పాపులౌతారు. (33) పావనమైన కధను వింటూ తాంబూలం సేవించే వీరితోయమకింకరులు నరకంలో వీరి నిష్టాన్నితినిపిస్తారు (34)

మూ || యోచతుంగాననారూఢాః కధాంశృణ్వంతిదాంభికాః | అక్షయాన్నరకాన్‌ భుక్త్వాతే భవంత్యే వవాయసాః || 35 ||

యోచవీరాపవారూఢాః యోచమంచకసంస్థితాః | శృణ్యంతివత్కధాంతైవైభవంత్యసృజుపాదపాః || 36 ||

అసంప్రణమ్యశృణ్వంతో విషవృక్షాభవంతితే | కధాంశయానాః శృణ్యంతో భవంత్య జగరానాః || 37 ||

యఃశృణోతిక ధాంపక్తుఃసమానాసమాశ్రితః | గురుతల్పన మంపాంనంప్రావ్యనరకం ప్రజేత్‌ || 38 ||

యేనిందంతి పురాణజ్ఞంకధాంవాపాపహరిణీం | తేనైజన్మశతం మర్త్యాః శునకాఃనం భవంతిచ || 39 ||

కధాయాంవర్తమానాయాంయేవదంతి నరాధమాః | తేగర్ధ భాఃవ్ర జాయన్తేకృకలాసాః తతఃపరం || 40 ||

కదాచిదపియేపుణ్యాం నశృణ్వంతి కధాంసరా ః | తేభ్యుక్త్వానరకాన్‌ ఘోరాన్‌ భవంతివనమాకరాః || 41 ||

యేకథామనుమోదం తేకీర్త్య మానంనరోత్తమాః | ఆశృణ్యంతో7పితే యాంతి శాశ్వతంపరమంపదం ||42 ||

కధాయాంకీర్త్యమానాయాంవిఘ్నంకుర్వంతియేకఠాః | కోట్యబ్దాన్‌ నరకాన్‌ భుక్త్వాభవంతి గ్రామానుకరా ః || 43 ||

యేశ్రావయంతి మనుజాన్‌ పుణ్యాంపౌరాణికీంకదాం |కల్పకోటి శతం తిష్టంతి బ్రహ్మణ ః పదం || 44 ||

అసనార్ధం ప్రయచ్ఛంతి పురాణజ్ఞస్యయేనరా ః | కంబలాజినవాసాంసి మంచఫలకమేవచ || 45 ||

స్వర్గలోకం సమాసాద్య భుక్త్వభోగాస్‌ యథేప్పితాన్‌ ః స్థిత్వాబ్రహ్మాదిలోకేషువదం యాంతిని రామయం || 46 ||

పురాణజ్ఞస్యయచ్చంతియే సూత్రవనసంవనం | భోగినోజ్ఞానసంపన్నాంతేభవంతిభ##వేభ##వే || 47 ||

యేమహాపాతకైఃర్యుక్తా ఉపపాతకి నశ్చయే | పురాణ శ్రవణా దేవతే యాంతిపరమ పందం || 48 ||

అత్రవక్ష్యే మహాపుణ్యం ఇతిహాసంద్విజోత్తమాః | శృణ్వతాంసర్వ పాపఘ్నం విచిత్రంను మనోహరం || 49 ||

దక్షిణాపధమ థ్యెవైగ్రా మోభాష్కలంజ్ఞితః | తత్రసంతిజనా ఃసర్వే మూఢకర్మ విసర్జితాః || 50 ||

నతత్రబ్రాహ్మణాచారాః శ్రుతిస్మృతిపరాజ్‌ముఖా ః | జవస్వాధ్యాయరహితాంః పరస్త్రీ విషయాతురా ః || 51 ||

తా || ఎత్తైన ఆసనం పై కూర్చొని దాంభికంగా కధను విన్నవారు అక్షయమైననరకములను అనుభవించి వారు కాకులౌతారు (35) వీరాసనమందు కూర్చుని, మంచె మందు కూర్చుని సత్కధను విన్నవారు. వంకరకాళ్ళవారౌతారు(36) సమస్కరించ కుండా వినేవారు విషవృక్షాలౌతారు.పడుకొని వినేవారు నరుల అజగరులౌతారు. (37) కధచెప్పేవ్యక్తితో సమానమైన అసనమందు కూర్చొని వినేవారు గురుతల్పగుల పాపాన్ని పొంది నరకం వెళ్తారు. (38) పురాణజ్ఞునినిందించేవారు. పాపహరణ మైనకథనువిందించేవారు. ఆనరులు నూరుజన్మలు కుక్కలౌతారు. (39) కధనడుస్తుండగా, మధ్యలోమాట్లాడేవారు తొలుత గాడిదలౌతారు. ఆ పిదప ఊసరవెల్లులౌతారు. (40) ఎప్పుడైనా ఒకసారి నరులు ఈ పుణ్యమైన కధనువినరో వారు ఘోరనరకములను భవించి పిదప అడవిపందులౌతారు. (41) ఏనరలు కీర్తిస్తున్నకధను విని ఆనందిస్తారో, వారు కధను కధను వినకున్నప్పటికిని వారు శాశ్వతమైన పరమ పదమును చేరుకుంటారు (42) కధను కీర్తిస్తుంటే విఘ్నం చేసే శఠులు కోటిసంవత్సరాలు నరకమనుభవించి గ్రామసూకరములౌతారు. (43) పుణ్యమైన పౌరాణిక కధనుఎవరు వినిపిస్తారో అనరులు కోటికల్పకాలములు ప్రధముడై బ్రహ్మస్థానంలోఉంటాడు (44) పురాణజ్ఞునకు ఏనరులు ఆసనము కొరకు కంబల అజిన వస్త్రములు మంచ, ఫలకము,ఇస్తారో వారు (45) స్వర్గంలోకంచేరి ఇష్టమైన భోగములను భవించి బ్రహ్మాదిలోకము లందుఉండిపిదపనిరామయపదమునకు చేరుతారు (46) పురాణజ్ఞునకుఎవరు కొత్త సూత్రవసనమిస్తారో వారుభోగులు, జ్ఞానసంపన్నులు ఔతారు ప్రతి జన్మమందు (47) మహాపాతకముకలవాడు,ఉపపాతకాలుచేసిన వారు పురాణ శ్రవణం వింటేనే వారు పరమపదానికి చేరుతారు. (48)ఓ ద్విజోత్తములార ! ఇక్కడ ఒకపుణ్యమైన ఇతి ఆహాసాన్ని చెబుతాను. వినేవారి పాపములనంతా నశింపచేస్తుంది. విచిత్రను మనోహరమైనది (49) దక్షిణాపథమధ్య మందు బాష్కలమనుపేరుగల గ్రామముంది. అక్కడ ఉన్నవారంతా మూఢులు కర్మనివర్జితులు (50) అక్కడ బ్రహ్మణాచారులులేరు. అంతా శ్రుతిస్మృతులకు పరాజ్‌ ముఖులు. జనస్వాద్యాయములులేని వారు, పరస్త్రీలయందు విషయములందు అతురులు (51)

మూ || కృషీకలాః శస్త్రధరాః నిర్ధనాజిహ్మవృత్తయః | నజాసంతిపరంధర్మం జ్ఞానవైరాగ్య లక్షణం || 52 ||

స్త్రీయశ్చ పాపనిరతాః సై#్వరిణ్యఃకామలాలసా ః | దుర్భుద్ధయః కుటిలంగాః నద్ర్వతాచావర్ణితాః || 53 ||

తత్త్రైకోవిదురోనామదురాత్మబ్రాహ్మణాధమః | అసీద్వేశ్యాపతిర్యో సౌసదారో7 సికుమార్గగః || 54 ||

స్వప్నతీంబందులాంనాహిత్వాప్రతినివంతధా | వేశ్యాభవనమాసాధ్యరమతేస్మరపీడితః || 55 ||

సాపితస్వాంగవారా త్రౌవిముక్తానవ¸°వనా | అవహంతీస్మరావేశం రేమోజారేణసంగతా || 56 ||

తాంకదాచిద్దురాచారాంజారేణసహసంగతాం | దృష్ట్యాతస్యాఃపతిఃక్రోధాదభిదుద్రావసత్వరః || 57 ||

జూరేపలాయితేపత్నీంగృహీత్వానదురాశయః | సంతాడ్యముష్టిబంధేనముహూర్మ హురతాడయత్‌ || 58 ||

సానారీపీడితాభర్త్రాకుపితాప్రాహనిర్భయా | భవాన్‌ప్రతినిశంవేశ్యాంరమతేకాగతిర్మమ || 59||

అహంరూపవతీయోషానవ¸°వనశాలినీ | కధంసహిష్యేకామార్తాతవనంగతివర్జితా || 60 ||

ఇత్యుక్తఃసతయాతన్వ్యాప్రోవాచచబ్రాహ్మాణాధమః | యుక్తమేవత్వయోక్తంహితస్మాద్వక్ష్యామితేహితం || 61 ||

జారేభ్యోధనమాకృష్యతేభ్యేదేహిపరాంరతిం | తద్థనందేహిమేసర్వంపణ్యస్త్రీణాందదామితత్‌ || 62 ||

ఏవం సంపూర్యతేకామోమమాపిచవరాననే | తధేతిబభర్తృవచనం ప్రతిజగ్రాహసావధూః || 63 ||

ఏవంతయోస్తుదంపత్యోః దురచారపరవృత్తయోః కాలేసనిధనంప్రాప్తంసవిప్రోవృషలీపతిః || 64 ||

మృతేభర్తరిసానారీపుత్రైఃసహనిజాలయే | ఉవాసనుచిరంకాలంకించిదుత్క్రాంత¸°వనా || 65 ||

ఏకదాదైవయోగేన సంప్రాప్తేపుణ్యపర్వణి | సానారీబంధుభిఃసార్థంగోకర్ణంక్షేత్రమాయ¸° || 66 ||

తత్రతీర్థజలేస్నాత్వాకస్మింశ్చిద్దేవతాలయే | శుశ్రావదేవముఖ్యానాంపుణ్యాంపౌరాణికీంకధా || 67 ||

యోషితాంజారసక్తానాం నరకేయమకింకరాః | సంతప్తలోహపరిఘంక్షిపంతిస్మరమందిరే || 68 ||

ఇతిపౌరాణికేనోక్తంసాశ్రుత్వాధర్మసంహితాం | తమువాచరహస్యేషాభీతాబ్రాహ్మణపుంగవం || 69 ||

బ్రహ్మన్‌ పాపమజానంత్యామయాచరితముల్బణం | ¸°వనేకామచారేణకౌటిల్యేనప్రవర్తితం || 70 ||

తా || కృషీవలులు, శస్త్రధరలు, నిర్దేవులు, వక్రస్వభావులు, జ్ఞానవైరాగ్యలక్షణమైన పరమధర్మమును తెలుసుకోలేరు (52) స్త్రీలు పాపనిరతులైనవారు, సై#్వరిణులు, కామలాలసులు, దుర్బుద్ధులు, కుటిలగులు, సద్ర్వతాచారములు లేనివారు (53) అక్కడ విదురుడను దురాత్ముడు బ్రాహ్మణాధముడు వేశ్యాపతి ఉండేవాడు. అతనికి భార్య ఉన్నా తప్పుమార్గంలో వెళ్ళేవాడు. (54) తన భార్యను బంధువులను వదిలి ప్రతిరాత్రివేశ్యాభవనంచేరి స్మరపీడితుడై రమించేవాడు (55) ఆతని భార్య రాత్రిపూట విముక్తయైన¸°వ్వన ఆమెస్మరుని ఆవేశాన్ని సహించనిదైజారునితో కూడి ఆనందించింది (56) ఒక సారి ఆదురాచారసుజారునితో కూడిన దాన్నిచూచి ఆమెభర్తత్వరగా కోపంతో పరుగెత్తాడు (57) ఇంతలో జారుడు పరుగెత్తాక భార్యనుతీసుకొని ఆదురాశయుడు ముష్ఠిబంధంతో కొట్టాడు. మాటి మాటికి కొట్టాడు (58) ఆమెను ఆతడు బాధించగా ఆమెకోపంతో నిర్భయంగా భర్తతోఇట్లాఅంది. నీవుప్రతిరోజు వేశ్యతో సుఖిస్తున్నావు నాగతేమిటి. (59) నేను అందగత్తెను, వయస్సుగలదానిని. స్త్రీనికామార్తనైనీ సంగంమంలేకుండా ఎట్లాసహిస్తాను. (60) ఆమె అట్లనగా ఆబ్రాహ్మణాధముడు ఇట్లన్నాడు. నీవు చెప్పింది. నిజమే అందువల్ల నీకుహితమైన దానిని చెప్తాను. (61) జారులనుండి ధనంతీసుకొని వారికి పరమైన ఆనందాన్ని ఇవ్వు. ఆధనమంతా నాకు ఇవ్వు దాన్ని నేను వేశ్యాస్త్రీలకిస్తాను (62) ఇట్లా నాకోరిక, కూడా పూర్ణమౌతుంది. ఓ వరానన ! అట్లాగే అని ఆస్త్రీ భర్తమాటను స్వీకరించింది. (63) ఈ విధముగా దురాచారమందు ప్రవృత్తులైన ఆదంపతులు. కాలవశాత్తుమరణించాడు, ఆ విప్రుడు, శూద్రస్త్రీ భర్త(64) భర్తమరణించాక ఆ స్త్రీ పుత్రులతో పాటు తన ఇంటి యందు చాలాకాలముంది. కొంచం యవ్వనం గడిచాక (65) ఒకసారి దైవయోగంవల్ల పుణ్యపర్వం రాగా ఆ స్త్రీ తన బంధువులతో కూడి గోకర్ణక్షేత్రానికి వెళ్ళింది (66) అక్కడ తీర్థజలమందుస్నానంచేసి, ఒక దేవతాలయ మందు దేవముఖ్యులపుణ్యమైన పౌరాణికకధను విన్నది (67) జారసక్తులైన స్త్రీలకు యమకింకరులు నరకమందు వారి స్మరమందిరమందు బాగాకాల్చిన లోహపుపరిగను పెడ్తారు (68) అని పౌరాణికుడు చెప్పిన ధర్మ సంహితమైన దానిని విని, అతినతో బ్రాహ్మణపుంగవునితో రహస్యంగా ఈమెభయపడి ఇట్లా అంది. (69) ఓ బ్రహ్మన్‌ ! పాపంతెలియక నేను చెడుగా ప్రవర్తించాను. ¸°వనమందు కామచారంతో కౌటిల్యంగాప్రవర్తించాను (70)

మూ|| ఇదంత్వద్వచనంశ్రుత్వాపురాణార్థవిజృంభితం | భీతిర్మేమ

హతీజాతాశరీరంవేపతేముహ ః || 71 ||

ధిఙ్‌మాందురింద్రియాసక్తాంపాపాంస్మరనిమోహితాం|అల్పస్యయత్సుఖస్యార్థేఘోరాంయాస్యామిదుర్గతిం || 72 ||

కధంపశ్యామిమరణయమూదూతాన్‌భయంకరాన్‌ | కధంపాశైఃబలాత్కంఠేబధ్యమానాధృతింలభే || 73 ||

కధంసహిష్యేనరకేఖండశోదేహకృఃతనం | పునఃకధంపతిష్యామిసంతప్తాక్షారకర్దమే || 74 ||

కథంచయోనిలక్షేషుక్రిమికీటఖగాదిషు | పరిభ్రమామిగుఃఖౌఘాత్‌పీడ్యమానానిరంతరం || 75 ||

కధంచరోచతేమహ్యంఅద్యప్రభృతిభోజనం | రాత్రౌకధంచసేవిష్యేనిద్రాందుఃఖపరిప్లుతా || 76 ||

హాహాహతాస్మిదగ్థాస్మివిదీర్ణహృదయాస్మిచ | హవిధేమాంమహాపాపేదత్వాబుద్ధిమపాతయః || 77 ||

పతతఃతుంగశైలాగ్రాత్‌శూలాక్రాంతస్యదేహినః | యద్దుఃఖంజాయతేఘోరంతస్మాత్కోటిగుణంమమ || 78 ||

అశ్వమేధాయుతంకృత్వాగంగాంస్నాత్వాశతంసమాః | నశుద్ధిర్జాయతే ప్రాయోమత్పాపస్యగరీయనః || 79 ||

కింకరోమిక్వగచ్ఛామికంవాశరణమాశ్రయే | కోనామాంత్రాయతేలోకేపతంతీనరకార్ణవే || 80 ||

త్వమేవమేగురుఃబ్రహ్మంస్వంమాతాత్వంపితాసిచ | ఉద్థరోద్ధరమాందీనాంత్వామేవశరణంగతాం || 81 ||

ఇతితాంజాతనిర్వేదాంపతితాంచరణద్వయే | ఉత్థాప్యకృపయాధీమాన్‌ బభాషేద్విజపుంగనః || 82 ||

బ్రాహ్మణ ఉవాచ -

దిష్ట్యాకాలేప్రబుద్ధాసిశ్రుత్వేమాంమహతీంకధాం | మా భైషీః తపవక్ష్యామిగతించైవసుఖావహాం || 83 ||

సత్కధాశ్రవణాదేవజాతాతేమతిరీదృశీ | ఇంద్రియార్థే మవైరాగ్యం పశ్చాత్తాపోమహాసభూత్‌|| 84 ||

పశ్చాత్తాపోహిసర్వేషాంఅఘనాంనిష్కృతిఃపరా | తేనైవకురుతేసద్యఃప్రాయశ్చిత్తంసుధీర్నరః || 85 ||

ప్రాయశ్చిత్తానిసర్వాణికృత్వా చవిధిపత్‌పునః | అపశ్చాత్తాపినోమర్త్యానయాంతిగతిముత్తమాం || 86 ||

సత్కధాశ్రవణాన్నిత్యంసంయాతిపరమాంగతిం | పుణ్యక్షేత్రనివాసాచ్చచిత్తశుద్ధిఃప్రజాయతే || 87 ||

తా || ఈ మీ మాటను పురాణార్థముతో కూడినదానిని విని నాకు చాలా భయంకలిగింది. శరీరం మాటి మాటికి కంపి స్తోంది. (71) దురింద్రియాసక్తురాలినిపాపిని, స్మరమోహితురాలినిఛీఛీ. అల్పమైన సుఖంకొరకు ఘోరమైన దుర్గతిని పొందబోతున్నాను (72) మరణంతర్వాతభయంకరులైన యమదూతలను ఎట్లాచూడగలను. కంఠమందు పాశములతో బలంగా బంధించగా నాకుధైర్యం ఎట్లా కలుగుతుంది. (73) నరకంలో శరీరాన్ని తునకలుగా నరకడం ఎట్లా సహిస్తాను మరిగిన కారపుబురదలో ఎట్లా ఉండగలను (74) క్రిమికీటఖగాదులలక్షయోనులందు ఎట్లాజన్మించను. దుఃఖ ఓఘములతో పీడింబడుతూనిరంతరము ఎట్లా తిరుగను (75) నేటినుండి నాకుభోజనం ఎట్లా రుచిస్తుంది. దుఃఖపరి ప్లుతురాలనై నిద్రనెట్లాపొందుతాను (76) చచ్చాను, చచ్చాను, దగ్థురాలినైనాను. హృదయవిదీర్ణురాలినయ్యాను. ఓ విధి! నాకు మహాపాపమందు బుద్థినిచ్చి, పడేశావు (77) తుంగమైన శైలాగ్రమునుండి పడేవానికి, శూలంతో కుచ్చబడ్డ ప్రాణికి ఎంతదుఃఖంకల్గుతుందో అంతకన్న ఘోరమైన దుఃఖము కోటిగుణితమునాకుకల్గుతోంది. (78) పదివేల అశ్వ మేధాలుచేసి, నూరుసంవత్సరాలు గంగలోస్నానంచేసినా, నా గొప్ప పాపమునకు తరచుగా శుద్ధికలుగదు79) ఏం చేయను. ఎక్కడికివెళ్ళను. ఎవరిని శరణువేడన. నరకార్ణవమందు పడేనన్నులోకంలో రక్షించేవారెవరు (80) నీవేనా గురువువు ఓ బ్రహ్మ ! నీవే తండ్రివి. నీవే తల్లివి కూడా. దీనురాలైననన్ను ఉద్ధరించు, ఉద్ధరించు, నిన్నే శరణువేడినదానను (81) అని నిర్వేదాన్ని పొందిన, పాదములందు పడిన ఆమెను దయతో లేపి, ద్విజపుంగవుడు ఇట్లన్నాడు (82) బ్రాహ్మణ వచనము - అదృష్టవశాత్తు సకాలంలో ఈ గొప్పకధనువినిమెల్కొన్నావు. భయపడకు. నీకు సుఖకరమైన గతిని చెబుతాను (83) సత్కధాశ్రవణంవల్లనే నీ బుద్ధి ఇట్లామారింది. ఇంద్రియార్థములందు వైరాగ్యము పశ్చాత్తాపము ఎంతో కలిగింది. (84) పశ్చాత్తాపమే అన్ని పాపములకు ఉత్తమనిష్కృతి. దానితోనే బుద్ధిమంతుడైన నరుడ వెంటనే ప్రాయశ్చిత్తాని చేసుకుంటాడు (85) శాస్త్రప్రకారము అన్నిప్రాయశ్చిత్తములు చేసుకొని తిరిగి పునీతుడౌతాడు. సశ్చాత్తాపంలేనినరులు ఉత్తమ గతినిపొందరు. (86) సత్కధాశ్రవణంవల్ల ఎప్పుడూ ఉత్తమ గతిని పొందుతారు. పుణ్యక్షేత్రమందునివాసంవల్ల చిత్తశుద్ధి కల్గుతుంది. (87)

మూ || యధాసత్కధయానిత్యంసంయాతిపరమాంగతిం|తథాన్యైః సద్ర్వతైః జంతోఃస భ##వేత్‌మ తిరుత్తమా || 88 ||

యథాముహుఃశోధ్యమానోదర్పణోనిర్మలోభ##వేత్‌ | తయాసత్కధయాచేతోవిశుద్ధింపరమాంప్రజేత్‌ || 89 ||

విశుద్ధేచేతసినృణాంధ్యానంసిద్ధ్యత్యుమాపతేః | ధ్యానేనసర్వంమలినంమనో వాక్కాయసంభృతం || 90 ||

సద్యోవిధూయకృతినోయాంతిశంభోఃపరంపదం | అతఃసంన్యస్తపుణ్యానాంసత్కధాసాధసంపరం || 91 ||

కథయాసిద్ధ్యతిధ్యాసంధ్యానాత్కైవల్యముత్తమం | అసిద్ధపరమధ్యానః కథామేతాంశృణోతియః

సో7స్యజన్మనిసంప్రాప్యధ్యానంయాతిపరాంగతిం || 92 ||

నామోచ్చారణమాత్రేణమంత్రమజామిలః | పశ్చాత్తాపసమాయుక్తస్వవాపరమాంగతిం || 93 ||

సర్వేషాంశ్రేయసాంబీజంసత్కధాశ్రవణంనృణాం | యస్తద్విహీనఃసవశుఃకథంముచ్యేతబంధనాత్‌ || 94 ||

అతస్త్వమపిసర్వేభ్యోవిషయేభ్యోనివృత్తధీః | భక్తింపరాంసమాధాయసత్కధాంశృణుసర్వదా |

శృణ్వంత్యాఃసత్కధాంనిత్యంచేతస్తేశుద్ధిమేష్యతి || 95 ||

తేనధ్యాయసివిశ్వేశంతతోముక్తిమవాప్స్యసి | ధ్యాయతఃశివపాదాబ్జంముక్తిరేకేసజన్మనా || 96 ||

భవిష్యతినసందేహఃసత్యంసత్యంవదామ్యహం | ఇత్యుక్తాతేనవిప్రేణసానారీబాష్పసంకులా || 97 ||

పతిత్వాపాదయోస్తస్యకృతార్థాస్మీత్యభాషత | తస్మిన్నేవమహాక్షేత్రేతేస్మాదేవద్విజోత్తమాత్‌ || 98 ||

శుశ్రావసత్కధాంసాధ్వీంకైవల్యఫలదాయినీం | సఉవాచద్విజస్తసై#్యకధాంవైరాగ్యబృంహితాం || 99 ||

యాంశృత్వామనుజఃసద్యఃత్యజేద్విషయవాసనాం | తస్యాశ్చిత్తంయధాశుద్ధంవైరాగ్యరసగంయథా || 100 ||

తథోవాచద్విజఃశైవకంధాంభక్తిసమన్వితాం | యథాయథామనస్తస్యాఃప్రసాదమభిగచ్ఛతి |

తథాతథాశ##నైఃశంభోధ్యాన యోగము పాదిశత్‌ || 101 ||

శ##నైశ##నైఃధ్వస్తరజస్తమోమలంవిముక్తసర్వేంద్రియభోగవిగ్రహం |

విశుద్ధతత్వంహృదయంద్విజస్త్రియావిశ్వేశ్వరంశ్వేశ్వరరూపచింతనం || 102 ||

ఇత్థంసద్గురుమాశ్రిత్యసానారీప్రాప్తసన్మతిః | దధ్యౌముహుర్ముహుఃశంభోఃచిదానందమయంవపుః || 103 ||

నిత్యంతీర్థజలేస్నాత్వాజటావల్కలధారిణీ | భస్మోద్ధూలితసర్వాంగీరుద్రాక్షకృతభూషణా || 104 ||

శివనామజపాసక్తావాగ్యతా మితభోజనా | బద్ధపద్మాసనా7వ్యగ్రాసత్కధాశ్రవణాత్సుభా

||105 ||

గురుశుశ్రూషణరతాత్యక్తాపత్యసుహృజ్జనా | గురూవదిష్టయోగేనశివమేవమతోషయత్‌ || 106 ||

తా || సత్కధవల్లఎప్పుడూ ఉత్తమగతినిపొందినట్లు ఇతరములైన సద్ర్వతములతో ప్రాణుతకు ఉత్తమమతి కలుగదు (88) తుడిచినకొద్దీఅద్దం నిర్మలమైనట్లు ఆసత్కధతో మనస్సు పరమశుద్దినిపొందుతుంది (89) విశుద్ధమైన మనస్సు యందు నరులకు ఉమాపతిధ్యానముసిద్ధిస్తుంది. ధ్యానంవలన మనోవాక్కాయములతో ఏర్పడిన మలినమంతా (90) వెంటనే నశించి, కృతకృత్యులైశంభుని పరమపదమును చేరుకుంటారు. అందువల్ల పుణ్యంసాధించదలచిన వారికి సత్కధ ఉత్తమసాధనము (91) కధవల్ల ధ్యానంసిద్ధిస్తుంది. ధ్యానంవల్ల ఉత్తమకైవల్యం సిద్దిస్తుంది. పరమధ్యానము సిద్ధించ కుండా ఈ కధను విన్నవారు మరో జన్మలో ధ్యానాన్ని పొంది ఉత్తమగతికి చేరుతారు. (92) నా మోచ్చారణ మాత్రంతో మంత్రాన్ని జపించి అజామిలుడు, పశ్చాత్తాపాన్ని పొందినవాడై ఉత్తమగతిచేరాడు. (93) నరులకు అన్ని శ్రేయస్సులకు మూలము సత్కథాశ్రవణము. అది లేని వాడు పశువు. వాడు బంధంనుండి ఎట్లా ముక్తుడౌతాడు. (94) అందువల్ల నీవుకూడా అన్ని విషయములనుండి బుద్ధిమరలినదానవై అధికభక్తిని పొంది ఎప్పుడు సత్కధను విను. సత్కధను రోజూవిన్నందువల్ల నీమనస్సుశుద్ధినిపొందుతుంది (95) దానితో విశ్వేశుని ధ్యానిస్తావు. ఆపిదప ముక్తినందుతావు. శివపాదములు ధ్యానించేవానికి ఒక జన్మతో ముక్తి (96) కల్గుతుంది. అనుమానంలేదు. నేను నిజం చెబుతున్నాను. నిజము. అని బ్రాహ్మణుడు చెప్పగా ఆస్త్రీ కన్నీళ్ళునింపినదై (97) ఆతని పాదములపై పడి కృతార్థులనైనాను అనిపలికింది. ఆమహాక్షేత్రమందు, ఆబ్రాహ్మణోత్తముని నుండే (98) కైవల్యఫలమునిచ్చే సత్కధలను ఆసాధ్వివిన్నది. ఆద్విజుడు ఆమెకు వైరాగ్యముతో కూడిన కధలను చెప్పాడు (99) వాటిని వినగానే నరుడు వెంటనే విషయవాసనను వదులుతాడు. ఆమెమనస్సు ఎట్లా శుద్ధమైందో ఎట్లా వైరాగ్యరసము నందిందో (100) ఆద్విజుడుభక్తితోకూడినశివకధలను చెప్పాడు. ఎట్లాఎట్లా ఆమెమనస్సు ప్రసాదగుణమును పొందిందో అట్లాఅట్లామెల్లగా శివునిధ్యానయోగమును ఉపదేశించాడు (101) మెల్లమెల్లగా రజస్త మస్సులు పోయి నిర్మలత ఏర్పడి సర్వేంద్రియములలోభోగగ్రహణము తొలగిపోయి, హృదయం విశుద్ధతత్వమై ఆబ్రాహ్మణ స్త్రీ హృదయమువిశ్వేశ్వరరూపచింత నమందుప్రవేశించింది (102) ఇట్లాసద్గురువును పొంది ఆ స్త్రీ మంచి బుద్ధిని పొంది మాటిమాటికిశివునియొక్కచిదానందమయమైన శరీరాన్నిధరించింది (103) రోజుతీర్థజలమందుస్నానంచేసి జటావల్కలములు ధరించి భస్మం అన్ని అవయవములందు పూసుకొని రుద్రాక్షాలంకారము కలిగి (104) శివనామజపమందు ఆసక్తురాలై వాక్కుని బందించి మితభోజనంకలదై పద్మాసనమందు కూర్చొని అవ్యగ్రురాలై సత్కధలను వినదలచి 105) గురు శుశ్రుషయందు ఆసక్తురాలై అవత్యసుహృజ్జనులను వదలి గురూ పదిష్టయోగంతో శివుని ఈ విధంగా సంతోషపరచింది (106)

మూ || విశ్వేశవిశ్వ విలయస్థితి జన్మహెతో విశ్వైకవంద్య శివశాశ్వత విశ్వరూప |

విధ్వస్త కాల విపరీత గుణావభాస శ్రీ మన్మహెశమయి ధేహి కృపాకటాక్షం || 107 ||

శంభో శశాంకకృతశేఖరశాంతమూర్తే గంగాధరమరపరార్చిత పాదపద్మ

నాగేంద్ర భూషణ నగేంద్ర నికేతనేశ భక్తార్తి హాన్‌ మయిని ధేహి కృపా కటాక్షం || 108 ||

శ్రీ విశ్వనాధ కరుణాకర శూలపాణ భూతేశ భర్గ భువన త్రయగీతకీర్తే |

శ్రీ నీల కంఠమదనాంతక విశ్వమూర్తే గౌరీపతే మయినిధేహి కృపాకటాక్షం || 109 ||

ఇత్థంప్రతిదినంభక్త్యా cపార్థయంతీ మహెశ్వరం|శృణ్వంతీ సత్కంధాం సమ్యక్‌కర్మబంధంసమాచ్ఛినత్‌ || 110 ||

అథకాలేన సానారీ సముత్సృజ్యకలేవరం | మహేశాను చరైర్నీతా సంప్రాప్తా శివమందిరం || 111 ||

తత్రదేవైః మహాదేవం సేవ్యమానం సహోమయా | గణశనంది భృంగాద్యైః వీరభ##ద్రేశ్వరాదిభిః || 112 ||

ఉపాస్యమానం గౌరీశం కోటి సూర్యసమప్రభం | త్రిలోచనం పంచముఖం నీలగ్రీవం సదాశివం || 113 ||

వామాంకేబిభ్రతం గౌరీం విద్యుచ్చంద్రసమప్రభాం | దృష్ట్వాస సంభ్రమంనారీ సాప్రణమ్య పునఃపునః || 114 ||

ఆనందాశ్రుజలోత్సిక్తారోమహర్ష సమాకులా | సమ్మానితా కరుణయా పార్వత్యా శంకరేణచ || 115 ||

తస్మిన్‌ లోకే పరానంద ఘనజ్యోతిషి శాశ్వతే | లబ్థ్వానివాస మచలంలేభే సుఖమనాహతం || 116 ||

సాకదాచిదుమాం దేవీం ఉపస్పృశ్య ప్రణమ్యచ | పర్యపృచ్ఛతమే భర్తాకాంగతింగత వానితి || 117 ||

తామువాచమహాదేవీ సతే భర్తాదురాశయః | భక్త్వానరకదుఃఖాన్ని వింధ్యే జాతః పిశాచకః || 118 ||

పునః పప్రచ్ఛ సానారీ దేవీంద్రిభువనేశ్వరీం | కేనోపాయేన మే భర్తా సద్గతిం ప్రాప్నుయాదితి || 119 ||

దేవ్యువాచ -

సో7స్మత్కధాం మహాపుణ్యాంకదాచిచ్ఛృణుయాద్యది | నిస్తీర్యదుర్గతింసర్వాంఇమంలోకంప్రయాస్యతి || 120 ||

తా || ఓ విశ్వేశ! ప్రపంచలయమునకు ఉనికికి జన్మకు కారణమైనవాడా, లోకములతో నమస్కరింపబడే ఒకే నాథుడ, శివ, శాశ్వత, విశ్వరూప, కాలాతీతుడ,

విపరీతగుణములతో కన్పించేవాడ, శ్రీమన్‌మహహేశనాయందు నీకృపాకటాక్షమును ఉంచు (107) ఓ శంభుచంద్రుని తలపై గలవాడ, శాంతమూర్తి, గంగాధర, అమరపద అర్చిత పాదపద్మములు కలవాడ, నాగేంద్రభూషణ, నగేంద్రమందుండేవాడ, ఈశ, భక్తుల ఆర్తినిహరించేవాడ, నాపైనీ కృపాకటాక్షాన్ని ఉంచు (108) శ్రీ విశ్వనాధకరుణాకర, శూల నీలకంఠ, మదనాంతక విశ్వమూర్తి, గౌరీపతి, నాపైనీ కృపాకటాక్షాన్ని ఉంచు (109) ఇట్లా ప్రతిరోజు భక్తితో మహెశ్వరుని ప్రార్థిస్తూ సత్కధను వింటూచక్కగా కర్మబంధాన్ని తెంపుకుంది (110) కొంతకాలానికి ఆస్త్రీ శరీరాన్ని వదలిమహెశుని అనుచరులతో తీసుక పోబడి శివమందిరానికి చేరింది (111) అక్కడదేవతలు ఉమతోపాటు మహాదేవుని సేవిస్తున్నారు. గణశ, నంది, భృంగి, మొదలగువారితో వీరభ##ద్రేశ్వరాదులతో (112) సేవించబడుతున్న గౌరీశుని, కోటిసూర్యులసమానకాంతివానిని త్రిలోచనుని, పంచముఖుని, నీలగ్రీవుని, సదాశివుని (113) వామాంకమందు గౌరిని ధరించినవానిని విద్యుత్‌చంద్రులవంటి కాంతిగలవానిని చూచితొందరగా ఆనారిమాటిమాటికి నమస్కరించి (114) ఆనందఅశ్రుజలములు కలదైరోమహర్షములతో కూడినదై ఉండగా దయగల పార్వతిశివులు ఆమెను సమానించారు (115) పరమ ఆనందము, ఘనమైనజ్యోతిస్సుగల శాశ్వతమైన ఆలోకమందునివాసాన్ని పొంది, అచలమైన ఎదురులేని సుఖాన్ని పొందింది. (116) ఆమెఒకసారి ఉమాదేవిని సమీపించినమస్కరించి ఇట్లాఅడిగింది. నాభర్త ఏగతినిపోందాడు అని (117) ఆమెతో మహాదేవి ఇట్లాఅంది. దురాశయంగల నీ భర్త నరకదుఃఖములనుభవించి వింధ్యంలో పిశాచమైనాడు (118) తిరిగి ఆస్త్రీ త్రిభువనేశ్వరురాలైన ఆదేవిని అడిగింది. ఏ ఉపాయముతో నాభర్త సద్గతిని పొందుతాడు, అని (119) దేవి ఇట్లా అంది - ఆతడు మాకధను మహాపుణ్యమైన దానిని ఎప్పుడైనా వింటే, ఈ దుర్గతిని దాటి ఈ లోకానికి వస్తాడు అని (120)

మూ || ఇతిగౌర్యావచఃశ్రుత్వాసానారీవిహితాంజలిః | ప్రార్థయామానతాందేవీంభర్తుః పాపవిశోధనే || 121 ||

తయాముహుఃప్రార్థ్యమానాపార్వతీకరుణాయుతా | తుంబురుంనామ గంధర్వం ఆహుయేదమధాబ్రవీత్‌ || 122 ||

తుంబురోగచ్ఛభద్రంతేవింధ్యశైలంసహానయా | ఆస్తేపిశాచకస్తత్రయో7స్యాఃపతి రసస్మతిః || 123 ||

తస్యాగ్రేపరమాంపుణ్యాంకధామస్మద్గుణౖర్యుతాం | అఖ్యాయదుర్గతేర్ముక్తంతమానయశివాంతికం || 124 ||

ఇతి దేవ్యాసమాదిష్టః తుంబురుస్తాం ప్రణమ్యచ | తయాసహవిమానేన వింధ్యాద్రింసహసాయ¸° || 125 ||

తతాపశ్యన్మహాకాయంరక్తనేత్రంమహాహనుం | ప్రహనంతం రుదంతంచవల్గంతంచ పిశాచకం || 126 ||

బలాద్గృహీత్వాతంపాశైర్బద్ధ్వావైసంనివేశ్యచ | తుంబురుః పల్లకీహస్తోజగౌగౌరీపతేఃకధాం || 127 ||

సపిశాచోమహాపుణ్యాంకథాంశ్రుత్వాపురద్విషః | విధూయకలుషంసర్వంసప్తాహాత్‌ప్రాపసంస్కృతిం || 128 ||

సపైశాచంవపుస్త్యక్త్వాస్వరూపందివ్యమాప్యచ | జగౌస్వయమపిశ్రీమచ్చరితం పార్వతీపతేః || 129 ||

విమానమారుహ్యసదివ్యరూపథృక్‌సతుంబురుఃపార్శగతః స్వకాంతయా |

గాయన్మహెశస్యగుణాన్‌మనోరమాన్‌జగామకైవల్యపదంసనాతనం | || 130 ||

సూత ఉవాచ -

ఇత్యేతత్‌కథితంపుణ్యంఆఖ్యానందురితావహం | మహెశ్వరప్రీతికరంనిర్మలాజ్ఞానసాధనం || 131 ||

య ఇదంశృణుయాన్మర్త్యఃకీర్తయే ద్వాసమాహితః | శంభోఃగుణానుకథనం విచిత్రంపాపనాశనం || 132 ||

పరమానందజనకంభవరోగమహౌషధం | భుక్త్వేవవివిధాన్‌ భోగాన్‌ ముక్తోయాతిపరాంగతిం || 133 ||

సూత ఉవాచ -

యూయంఖలుమహాభాగాః కృతార్థామునిసత్తమాః | యేసేవంతేసదాశంభోః కధామృతరసంసవం || 134 ||

తేజన్మభాజఃఖలు జీవలోకేయేషాంమనోధ్యాయతివిశ్వనాధం |

వాణీగుణాన్‌స్తౌతికథాంశృణోతిశ్రోత్త్రద్వయంతేభవముత్తరంతి || 135 ||

వివిధగుణవిభేదైఃనిత్యమస్పృష్టరూపం జగతి చబహిరంతర్వాసమానం మహిమ్నా |

స్వమహసివిహరంతం వాఙ్‌మనోవృత్తిదూరం పరమశివమనంతానంద సాంద్రంప్రపద్యే || 136 ||

ఇతిశ్రీస్కాందేమహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాంసంహితాయాం తృతీయే బ్రహ్మోత్తరఖండే పురాణశ్రవణ మహిమవర్ణనం నామద్వావింశో7ధ్యాయః || 22 || సమాప్తమిదం బ్రాహ్మఖండే తృతీయంబ్రహ్మోత్తరఖండం || ఇతి స్కాందేతృతీయం బ్రాహ్మఖండ సంపూర్ణం ||

తా || అనేగౌరి మాటలను విని ఆస్త్రీ చేతులు జోడించి, ఆ దేవిని ప్రార్థించింది. భర్త పాపాన్ని శుద్ధిచేయమని (121) ఆమోమాటిమాటికి ప్రార్థించగా పార్వతి దయగలదై తుంబురుడనే గంధర్వుణ్ణి పిలిచి ఇట్లాచెప్పింది (122) తుంబుర! నీవు వెళ్ళు నీకు మేలౌతుంది. వింధ్య శైలానికి ఈమెతో వెళ్ళు. అక్కడో పిశాచి ఉన్నాడు. ఈమె భర్త చెడు బుద్ధివాడు (123) ఆతని ఎదుట పరమపుణ్యమైన మాగుణములతో కూడిన కథనుచెప్పి దుర్గతినుండి ముక్తుడైన ఆతనిని శివుని సమీపమునకు తీసుకురా (124) అని దేవిచెప్పగా తుంబురుడు ఆమెకు నమస్కరించి ఆమెతో కూడి వింధ్యాcదికి త్వరగా వెళ్ళాడు (125) అక్కడ పెద్దశరీరంకల ఎర్రని, కళ్ళుగల పెద్ద హనువుగల, నవ్వుతున్న ఏడుస్తున్న, గుఱ్ఱంలా ఎగురుతున్న పిశాచాన్ని చూశాడు (126) బలవంతంగా వట్టి ఆతనిని తాళ్ళతో కట్టి ఉంచుకొని తుంబురుడు వల్ల కీహస్తుడై గౌరీ పతికధను చెప్పాడు (127) ఆ పిశాచముమహాపుణ్యమైన శివుని కధనువిని పాపమంతా పోయిఏడురోజులకుస్మృతినందాడు (128) ఆతడు పైశాచశరీరాన్ని వదలి దివ్యస్వరూపాన్ని పొంది, తానుకూడా పార్వతీపతి కధలను గానంచేశాడు (129) విమానమధిరోహించి ఆదివ్యరూపధారి ఆతుంబురుడు ప్రక్కనుండగా తన భార్యతో కూడి మహెశ్వరునిగుణాలను గానంచేస్తూ సనాతనమైన కైవల్యపదానికి వెళ్ళాడు. (130) సూతులిట్లాఅన్నారు. దురితమును తొలగించే ఈపుణ్యమైన అఖ్యానాన్ని చెప్పాను. మహెశ్వరునికి ప్రీతికూర్చేది నిర్మలజ్ఞాన సాధకము (131) ఏమర్త్యుడు దీన్ని వింటాడో చక్కగా కీర్తిస్తాడో ఆతడు ముక్తుడౌతాడు. శంభుగుణములను చెప్పటం విచిత్రమైనది. పాపనాశకము (132) పరమానందాన్ని కల్గించేది. భవరోగమునకు గొప్పమందు వివిధ భోగములను అనుభవించి, ఇక్కడ పిదపముక్తుడై పరగతికి వెళ్తాడు (133) సూతునివచనము - ఓమునిసత్తములార - మీరు మహాభాగులు, కృతార్థులు, ఎవరుఎల్లప్పుడూ అమృతరసమైనవమైన శంభువుకథనువింటారో (134) వారుజీవలోకమందు జన్మనుపొందినట్లులెఖ్ఖ ఎవరు విశ్వనాధుని ధ్యానిస్తారో వారు ధన్యులు. ఎవరి వాక్కు గుణములను స్తుతిస్తోంది. ఎవరి చెవులు కథను వింటాయి. అట్టి వారే భవమును దాటుతారు (135) వివిధగుణభేదములతో ఎప్పుడూ రూపం స్పష్టంగా లేని తన మహిమతో అంతటా జగత్తులో బయట, లోపలకాని సమానమో అట్టి తనమనస్సులో తిరగే, వాఙ్‌మనోవృత్తి కిదూరమైన అనంత ఆనంద సాంద్రుడైన పరమశివుని స్తుతిస్తున్నాను (136) అని శ్రీ స్కాందమహాపురాణమందు ఏకాశీతి సహస్రసంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తరఖండమందు పురాణశ్రవణమహిమవర్ణనమనునది ఇరువది రెండవ అధ్యాయము - 22 - బ్రాహ్మఖండమందు తృతీయమైన బ్రహ్మోత్తరఖండము ఇది సమాప్తమైనది - అని స్కాందమందు మూడవదైన బ్రాహ్మఖండము సంపూర్ణము.

Sri Scanda Mahapuranamu-3    Chapters