Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది ఒకటవ అధ్యాయము

మూ || నూతువాచ -

ఏవం బ్రహ్మర్షినా ప్రోక్తాంవాణీంపీయూషనన్నిభాం | ఆకర్ణ్యముదితోరాజా ప్రాంజలిః పునరబ్రవీత్‌ || 1 ||

రాజోవాచ -

అహోసత్సంగమఃపుంసాంఅశేషాఘప్రశోధనః | కామక్రోదనిహంతాచిష్టదోగ్ధాజనస్యహి || 2 ||

మమమాయాతమోనష్టంజ్ఞానదృష్టిఃప్రకాశితా | తవదర్శనమాత్రేణప్రాయోహమమరోత్తమః || 3 ||

శ్రుతంచపూర్వచరితంబాలయోఃసమ్యగేతయోః | భవిష్యదపిపృచ్ఛామి మత్పుత్రాచరణంమునే || 4 ||

అస్యాయఃకతివర్షాణిభాగ్యంపదచకీదృశం | విద్యాకీర్తిశ్చశక్తిశ్చశ్రద్ధాభక్తిశ్చకీదృశీ || 5 ||

ఏతత్సర్వమశేషేణ మునేత్వంపక్తుమర్హసి | తవశిష్యోస్మిభృత్యోస్మిశరణం త్వాంగతోస్మ్యహం || 6 ||

ఏతత్పర్వమశేషేణ మునేత్వంపక్తుమర్హసి | తవశిష్యోస్మిభృత్యోస్మిశరణంత్వాంగతోస్మ్యహం || 6 ||

పరాశరఉవాచ -

అత్రావాచ్యంహియత్కించిత్‌కథంశక్తోస్మిశంసితుం | యచ్ర్ఛుత్వాధృతిమంతోపివిషాదంప్రాప్నుయుర్జనాః ||7 ||

తథాపినిర్వ్యలీకేనభావేనపరివృచ్ఛతః | అవాచ్యమపివక్ష్యామితవస్నేహాన్మహీవతే || 8 ||

అముష్యత్వత్కుమారస్యవంర్షాణిద్వాదశాత్యయుః | ఇతఃపరంప్రపద్యేతసప్తమేదివసేమృతిం || 9 ||

ఇతితస్యవచఃశ్రుత్వాకాలకూటమివోదితం | మూర్భితఃసహసాభూమౌపతితోనృపతిఃశుచా || 10 ||

తముత్థాప్యనమాశ్వాస్యనమునిఃకరుణార్ద్రధీః | ఉవాచమాభైఃనృవతేవునర్వక్ష్యామితేహితం || 11 ||

సర్గత్‌ వురాని రాలోకం యదేకంనిష్కలంవరం | చిదానందమయంజ్యోతిఃన ఆద్యఃకేవలఃశివః || 12 ||

న ఏవాదౌరజోరూపంసృష్ట్వాబ్రహ్మణమాత్మనా | సృష్టికర్మనియుక్తాయతసై#్మవే దాంశ్చదత్తవాన్‌ || 13 ||

వునశ్చదత్తవానీశ ఆత్మతత్వైకనంగ్రహం | సర్వోపనిషదాంసారంరుద్రాధ్యాయంచదత్తవాన్‌ || 14 ||

యదేకమవ్యయంసాక్షాత్‌ బ్రహ్మజ్యోతిఃసనాతనం | శివాత్మకంపరంతత్వంరుద్రాధ్యాయేప్రతిష్ఠితా || 15 ||

న ఆత్మభూఃసృజత్‌ద్విశ్వంచతుర్భిర్వదనైర్విరాట్‌ | ససర్జవే దాంశ్చతురోలోకానాంస్థితిహెతవే || 16 ||

తత్రాయంయజుషాంమద్యేబ్రహ్మణోదక్షిణాన్ముఖాత్‌ | అశేషోవనిషత్సరో రుద్రాధ్యాయః సముద్గతః || 17 ||

తా || సూతునివచనము - అని బ్రహ్మర్షి చెప్పిన అమృతసన్నిభ##మైనవార్తను వినిరాజు అనందపడి చేతులుజోడించి ఇట్లన్నాడు-(1) రాజువచనము - ఓహోసజ్జనసహవానము పురుషులను సమస్తపాపములనుండి శుద్దిచేస్తుంది. కామక్రోధ ములను చంపేది. జనములకు ఇష్టాన్ని కూర్చేది. (2) నామాయాతమమునష్టమైంది. జ్ఞానదృష్టిప్రకాశించింది. నీదర్శన మాత్రంతో అమరోత్తమప్రాయుణ్ణౖనాను. (3) ఈ బాలుల పూర్వ చరిత్రను బాగావిన్నాను. ఓ ముని! భవిష్యత్తులో గూడా నాపుత్రునిచరిత్రను వినదలిచాను (4) ఇతని ఆయుస్సు ఎంతకాలము, ఈతని భాగ్యాన్ని చెప్పండి. విద్యకీర్తిశక్తి, శ్రద్ధభక్తి ఎలాంటివి (5) ఓ ముని! ఇవన్నీ పూర్తిగా మీరుచెప్పండి. నీశిష్యుణ్ణి, భుత్యుణ్ణి, నిన్ను శరణువేడాను. (6) అనగా పరాశ రునివచనము - చెప్పరానిది ఏదైనా ఉంటేదాన్నెట్లా చెబుతాను. దాన్నివిని ధైర్యవంతులైనజనులు కూడా విషాదాన్ని పొందుతారు. (7) ఐనా అబద్ధంలేకుండా మనస్ఫూర్తిగా అడిగేమీకు స్నేహంవల్లచెప్పకూడనిది కూడా చెప్పాను ఓరాజ, (8) ఈ నీకుమారునికి వన్నెండు సంవత్సరాలు గడిచాయి. ఇకముందు ఏడవరోజున మరణిస్తాడు (9) అనే అతని మాటను కాలకూటంలాటిదాన్ని విని మూర్ఛపోయి దుఃఖిస్తూ రాజుభూమిపై వడ్డాడు. (10) అతనిని లేపి ఓ దార్చి కరుణతో ఆముని ఇట్లన్నాడు. భయపడొద్దు. ఓ నృపతి! నీకుహితం బోధిస్తాను. (11) నృష్టికన్నముందు, నిరాలోకము, నిష్కలము, పరమైనది. ఒకటి చిదానందమయమైన జ్యోతి అదేతొలిది అదికేవలం శివుడే (12) అతడేతొలుత రజో రూపుడైన బ్రహ్మను తననుండి సృష్టించి, అతనిని సృష్టియందు ఏర్పరచిఆతనికివేదాలను ఇచ్చాడు (13) తిరిగి ఈశుడు ఆత్మతత్వసంగ్రహమును ఇచ్చాడు. సర్వోపనిషత్తులసారాన్ని రుద్రాధ్యాయాన్ని ఇచ్చాడు (14) ఒక్కటే, అవ్యయము సాక్షాత్తుబ్రహ్మజ్యోతి, సనాతనము, శివాత్మకము పరతత్వమురుద్రాధ్యయమందుంది (15) ఆ ఆత్మభువు, విరాట్టునాల్గు వదనములతో విశ్వాన్ని సృజించారు. లోకముల స్థితికొరకు నాల్గువేదములను సృజించాడు (16) యుజుస్సులమధ్యలో బ్రహ్మయొక్కదక్షిణముఖంనుండి అశేష ఉపనిషత్తుల సారము రుద్రాధ్యాయము వచ్చింది(17)

మూ || ఏషమునిభిఃసర్వైః మరీచ్యత్రిపురోగమైఃనహదేవైః ధృతస్తే భ్యఃతచ్ఛిష్యాజగృముశ్చతం || 18 ||

తచ్ఛిష్యశిషై#్యఃతత్పుత్రైఃతత్పుత్రైశ్చక్రమాగతైః | ధృతోరుద్రాత్మకఃసో7యంచేదసారఃప్రసాదితః || 19 ||

ఏషేవవరోమంత్రః ఏష ఏవవరంతవః | రుద్రాధ్యాయజవఃపుంసాంపరంకైవల్యసాధనం || 20 ||

మహాపాతకినఃప్రోక్తాఃఉపపాతకినశ్చయే | రుద్రాధ్యాయజపాత్‌సద్యః తే7పియాంతిపరాంగతిం || 21 ||

భూయోపిబ్రహ్మణాసృష్టాః సదసన్మిశ్రయోనయః | దేవతిర్యజ్‌మనుష్యాద్యాఃతతఃసంపూరితజగత్‌ || 22 ||

తేషాంకర్మాణిసృష్టానిస్వజన్మాసుగుణానిచ | లోకాస్తేషుప్రవర్తంతేభుంజతేచైవతత్పలం || 23 ||

లోకసృష్టిప్రవాహార్థంస్వయమేవప్రజాపతి | ధర్మాధర్మౌససర్జాగ్రేస్వవక్షః వృష్ఠభాగతః || 24 ||

ధర్మమేవాసుతిష్టంతః పుణ్యంవిందతితత్ఫలం | అధర్మమనుతిష్టంతః తేపాపఫలభోగినః || 25 ||

పుణ్యకర్మఫలం స్వర్గోనరకస్తద్విపర్యయః | తయోర్ద్యావధిపౌధాత్రాకృతౌశతమఖాంతకౌ || 26 ||

కామఃక్రోధశ్చలోభశ్చమదమానాదయఃవరే | అధర్మస్యసుతా అసన్‌ సర్వేనరకనాయకాః || 27 ||

గురుతల్పః సురాపానంత ధాన్యఃపుల్కసీగమః | కామస్యతనయా హ్యేతేప్రధానా ః పరికీర్తితాః || 28 ||

క్రోధాత్పితృవధోజాతః తథా మాతృవధః పరః | బ్రహ్మహాత్యాచకన్యైకా క్రోధన్యతనయాఅమీ || 29 ||

దేవస్వహరణశ్చైవబ్రహ్మస్వహరణస్తథా | స్వర్ణస్తేయితిత్వేతే లోభస్యతనయాఃస్మృతాః || 30 ||

ఏతానాహూయచాండాలాన్‌యమః పాతకనాయకాన్‌ | సరకన్యవివృద్ధ్యర్థం ఆధిపత్యం చకారహ || 31 ||

తేయమేనసమాదిష్టానవపాతకనాయకాః | తేసర్వేసంగతాభూయోఘోరా పాతకనాయకాః || 32 ||

నరకాన్‌ పాలయామానుః స్వభృత్త్యేశ్చోపపాతకైః | రుద్రాధ్యాయేభువిప్రాప్తే సాక్షాత్కైవల్యసాధనే || 33 ||

భీతాఃప్రదుద్రువుః సర్వేతే7 మీ పాతకనాయకాః | యమంవిజ్ఞావయామానుసహాన్యైరువపాతకైః || 34 ||

జయదేవమహారాజవయం హితపకింకరాః | నరకస్యవిపృద్ధ్యర్థం సాధికారాఃకౄతాస్త్వయా || 35 ||

అధునావర్తితుంలోకేనశక్తాః స్మోవయంప్రభో | రుద్రాధ్యాయానుభావేననిర్థగ్ధాశ్యైవవిద్రుతాః || 36 ||

తా || ఇదిమునులందరితో మరీచి అత్రిమొదలగువారితో దేవతలతో ధరించబడింది. వారు తమ శిష్యులకు చెప్పారు. (18) వారిశిష్యులతో వారిపుత్రులతో క్రమంగా వచ్చినవారితోఈ రుద్రాత్మకవేద సారము ధరించబడింది. వారికి ప్రసాదించారు. (19) ఇదే పరమమంత్రము. ఇదే పరమతవము. రుధ్రాద్యాయజపము పురుషులకుకై వల్యసాధకము (20) మహాపాతకులు, ఉపపాతకులు ఎవరైనా దీనిని చదివినవారు జపించిన మాత్రం చేత వెంటనే వారు ఉత్తమగతికి చేరుతారు (21) బ్రహ్మసత్‌ అసత్‌ మిశ్రయోనులను సృష్టించాడు. దేవతిర్యక్‌ మనుష్యులు మొదలగువారిని సృష్టించాడు. దానితో ఈ జగత్తు సంపూరితమైంది. (22) తమజన్మకు అనుగుణమైన కర్మలువారికి సృష్టించాడు. లోకులు ఆకర్మలాచరిస్తున్నారు. ఆఫలితమనుభవిస్తున్నారు. (23) లోకసృష్టినడిచే కొరకు ప్రజాప్రతిస్వయంగా తన వక్షస్థలమునుండి, వృష్టభాగంనుండి ధర్మాధర్మములను సృష్టించాడు. (24) ధర్మాన్నే అనుసరించినవారు దాని ఫలాన్ని పుణ్యాన్ని పొందుతారు. అధర్మమాచరించేవారు. పాపఫలాన్ని అనుభవిస్తారు. (25) పుణ్యకర్మఫలము స్వర్గము. పాపమునకు ఫలము నరకము. వాటికి బ్రహ్మ ఇద్దరు అధిపులను ఏరర్పరచాడు వారు ఇంద్రుడు, యముడు (26) కామక్రోధలోభ మదమానాదులు ఇతరములు అధర్మమునకు మతులు అంతానరకనాయకులు (27) గురుతల్పగమనము సురాపాసము అట్లాగే చండాలస్త్రీగమనము వీరు కామమునకు సంతానముప్రధానంగా చెప్పబడ్డారు. (28) క్రోధంవల్ల పితృవధపిదపమాతృవధ ఒక కన్యబ్రహ్మహత్యవీరుక్రోధమునకు సంతానము (29) దేవస్వహరణము, బ్రహ్మస్వహరణము, స్వర్ణస్తేయము వీరులోభయమునకు సంతానము అని చెప్పబడ్డారు. (30) యముడు ఈచండాలురను పాతకనాయకులను పిలిచి న రకవృద్ధికొరకు ఆధిపత్యం ఇచ్చాడు (31) యముని అజ్ఞపొంది ఈ తొమ్మది మంది, పాతకనాయకులు (32) తమభృత్యులు ఉపపాతకులతో కూడిన నరకాన్ని పాలించసాగాడు. కైవల్యసాధనమైనరుద్రాధ్యా యంభుమికివచ్చాక (33) ఈపాతకనాయకులంతా భయపడి పరెగెత్తారు. ఇతర ఉపపాత కములతో కూడియమునకు విజ్ఞాపనచేశారు. (34) ఓ దేవ! మహారాజనీకు జయము. మేమునీ బంట్లము. నరకవృద్ధి కొరకు నీవు మమ్ములను సాధికారులను చేశావు. (35) ఇప్పుడు మేములోకంలో ఉండటానికి ఆసమర్థులమైనాము. ఓ ప్రభు. రుద్రాధ్యాయ అనుభవంతో దగ్ధులమైనాము. పరుగెత్తాము (36)

మూ || గ్రామేగ్రామేన దీకూలే పుణ్యష్వాయతనేషుచ | రుద్రజాప్యేతుపర్యాప్తేకథంలోకేచరే మహి || 37 ||

ప్రాయశ్చిత్తసహస్రంవైగణయామోనకించన | రుద్రజాప్యాక్షరాణ్య వసోఢుంబతనశక్నుమః || 38 ||

మహాపాతకముఖ్యానామస్మాకంలోకఘాతినాం | రుద్రజాప్యంభయంఘోరం రుద్రజాప్యం మహద్విషం || 39 ||

అతో దుర్విషహం ఘోరమస్మాకంవ్యసంమహత్‌ | రుద్రజ్యాపేన సంప్రాప్తం అవనేతుంత్వర్వసి || 40 ||

ఇతివిజ్ఞాపితః సాక్షాద్యమః పాతకవాయకైః | బ్రహ్మణో7ంతికమాసాద్యత సై#్మసర్వంస్యవేదయత్‌ || 41 ||

దేవదేవజగన్నాథత్వామేవశరణంగతః | త్వయానియుక్తో మర్త్యానాంనిగ్రహెపావకారిణాం || 42 ||

అధునాపాపినోమర్త్యానసంతివృథివీతలే | రుద్రాధ్యాయేననిహతం పాతకానాం మహత్కులం || 43 ||

పాతకానాంకులేనష్టే నరకాఃశూన్యతాంగతాః | నరకేశూన్యతాం యాతేమమరాజ్యం హినిష్భలం || 44 ||

తస్మాత్త్వయోవభగవాన్‌ ఉపాయః పరిచింత్యతాం | యథామేనవిహన్యేతస్వామిత్వంమర్త్యదేహినాం || 45 ||

ఇతివిజ్ఞాపితోదాతాయమేనవిరిఖిద్యతా | రుద్రజావ్యవిఘాతార్థం ఉపాయం పర్యకల్పయత్‌ || 46 ||

అశ్రద్దాంచైవదుర్మేధాం అవిద్యాయాఃనుతే ఉభే | శద్దామేధావిఘాతిన్మౌమర్త్యేషుపర్యచోదయత్‌ || 47 ||

తాఖ్యాంవిమోహితేలోకేరుద్రాధ్యాయవరాజ్‌ ముఖే | యమఃన్వస్థాసమాసాద్యకృతార్థ ఇవసో భవత్‌ || 48 ||

పూర్వజన్మకృతైఃపాపైం జాయంతే7 ల్పాయుషోజనాః | తానిపాపానినశ్యంతిరుద్రంజప్తవతాంనృణాం || 49 ||

క్షీణషుసర్వపాపేషుదీర్ఘ మాయుర్భలంధృతి ః | ఆరోగ్యం జ్ఞానమైశ్వర్యం వర్ధతే సర్వదేహినాం || 50 ||

రుద్రాధ్యాయేనయేదేవంస్నాపయంతిమ హేశ్వరః | తజ్ఞలైః కుర్వతః స్నానం తే మృత్యుం సంతరంతిచ || 51 ||

రుద్రాధ్యాయాభిజప్తేనస్నానం కుర్వంతియే 7భసా | తేషాంమృత్యుభయంనాస్తి శివలోకేతుహీయతే || 52 ||

శతరుద్రాభిషేకేణ శతయుర్జాయతేనరః | అశేషపావనిర్ముక్తః శివస్యదయితోభ##వేత్‌ || 53 ||

తా || ప్రతిగ్రామమందునదీ కూలమందు పుణ్య అయతనములందు రుద్రజవులు వ్యాపిస్తే లోకంలో ఎట్లా తిరుగాలిమేము (37) ప్రాయశ్చిత్తసహస్రములను ఇంకా లెక్కించటం లేదు. రుద్రజపమందలి అక్షరములనే సహించుటకు అసమర్థులమైనాము. (38) లోకములను చంపేమహాపాతక ముఖ్యులమైన మాకురుద్రజపము గొప్పఘోరము భయము రుద్రజపము పెద్ద విషము (39) భరించరాని ఘోరవిషమిది ఇదిమాకు పెద్దవ్యవసనము. రుద్రజపం వల్ల వచ్చిన దానిని తొలగించ గల వాడివినీవే (40) అనిపాతకనాయకులు యమునితో చెప్పగా యముడు బ్రహ్మదగ్గరకు వచ్చి అతని కంతా చెప్పాడు (41) ఓ దేవ దేవ ! జగన్నాథ ! నీన్నే శరణువేడాను. పాపమాచరించిన వారిని నరులను గ్రహించేందుకు నీవునియమించావు. (42) ఇప్పడు భూమిలో పాపియైన నరులు లేరు. పాతక సమూహమంతా రుద్రాధ్యాయంతో నాశనమైంది (43) పాతకుల సమూహం నశించాక నరకం శూన్యమైతే నారాజ్యమేనిష్ఫలము (44) అందువల్ల ఓ భగవాన్‌! మీరే ఉపాయమాలోచించాలి. నరులపై స్వామిత్వము పోకుండాచూడండి (45) యముడు బాధపడుతూ ఇట్లా బ్రహ్మతో చెప్పగా రుద్రజవులకు విఘాతం కల్గించేకొరకు ఉపాయాన్ని కల్పించాడు. (46) అ విద్యకు ఇద్దరు సంతానము దుర్మేధ, ఆశ్రద్ధ అని (అడ) శ్రద్ధ మేధలకు విఘాతం కల్గించేవి. వీటిని నరులపై వదిలాడు. వారితో లోకం మోహాన్ని పొంది. రుద్రాధ్యాయం నుండి జనులు పరాజ్‌ముఖులు కాగా యముడు తన నివాసానికి వచ్చి తాను కృతార్థుడైనట్లు భావించాడు. (48) పూర్వజన్మ పాపములతో నరులు అల్పాయుషులౌతారు. రుద్రాన్ని జపించే నరులకు ఆ పాపాలు నశిస్తాయి (49) అన్ని పాపాలు నశిస్తే ధీర్ఘయువు బలము, ధృతి, ఆరోగ్యము, జ్ఞానము ఐశ్వర్యము అన్ని ప్రాణులకు పెరుగుతాయి. (50) రుద్రాధ్యాయంతో మహేశ్వరునికి అభిషేకం చేసేవారు ఆ నీటితో స్నానం చేస్తే వారు మృత్యువును దాటుతారు. (51) రుద్రాధ్యాయంతో జపంచేసిన నీటితో స్నానం చేసిన వారికి మృత్యుభయంలేదు. వారు శివలోకంలో వెలుగొందుతారు. (52) శతరుద్రాభిషేకంతో నరుడు శతాయువౌతాడు. అశేష పాపముల నుండి ముక్తుడై శివునకు ప్రీతిపాత్రుడౌతాడు (53).

మూ || ఏషరుద్రాయుతస్నానంకరోతుతపుత్రకః | దశవర్షసహస్రాణిమోదతే భూవిశక్రవత్‌ || 54 ||

అవ్యాహతబలైశ్వర్యోహతశ్రతుర్నిరామయః | నిర్థూతాఖిలపాపౌఘః శాస్తాఘః శాస్తారాజ్యమకంటకం || 55 ||

నిప్రావేదవిధః శాంతాఃకృతిసః శంసితప్రతా ః | జ్ఞానయజ్ఞత పోనిష్టాః శివభక్తిపరాయణాః || 56 ||

రుద్రాధ్యాయజపంసమ్యక్‌కుర్వంతు విమలాశయా ః | తేషాంజపాను భావేనసద్యః శ్రేయోభివష్యతి || 57 ||

ఇత్యుక్తవంతం సృపతింమహామునింత మేనవవ్రే ప్రథమం క్రియాగురుం |

అథాపరాంస్త్యక్తధనాశయాన్‌ మునీనా హవాయా మానసహస్రశః క్షణాత్‌ || 58 ||

తేవిప్రాఃశాంత మనసఃసహస్ర పరిసంమితా ః | కలశానాంశతం స్థావ్యపుణ్యవృక్షరసైర్యుతం || 59 ||

రుద్రాధ్యాయేవ సంస్నాప్యతముర్వీపతిపుత్రకం విధివత్‌స్నాపయామానుః సంప్రాప్తేసప్తమేధినే || 60 ||

స్నాప్యమానోమునిజనైః సరాజస్యకుమారకః | అకస్మాదేవసంత్రస్తఃక్షణం ముర్భామవాపహ || 61 ||

సహసైవప్రబుద్ధో7 సౌమునిభిఃకృతరక్షణః | ప్రోవాచకశ్చిత్‌పురుషోదండహస్తః సమాగతః || 62 ||

మాంప్రహర్తుంకృతమతింభీమదండోభయానకః సో7 పిచాన్యైర్మహావీరైఃపురుషైరభితాడితః || 63 ||

బద్ద్వాపాశేనమహతాదూరంనీత ఇవాభవత్‌ | ఏతావదహమద్రాక్షంభవద్భిఃకృతరక్షణః || 64 ||

ఇత్యుక్తవంతసృపతే ః తనూజంద్విజసత్తమాః | అశిర్భిఃపూజయామానుః భయంరాజ్జేస్యవేదయన్‌ || 65 ||

అథసర్వాన్‌ ఋషీన్‌ శ్రేష్టాన్‌ దక్షిణా భిర్నృపోత్తమః | పూజయిత్వాపరాన్నేనభోజయిత్వాచభక్తితః || 66 ||

ప్రతిగృహ్యాశిషస్తేషాం మునీవాంబ్రహ్మనాదినాం | భక్త్వాబంధు జనైస్సార్థం సభాయాంసముపావిశత్‌ || 67 ||

తస్మిన్‌సమాగతే వీరేమునిభిః సహపార్థివే | అజగామమహాయోగీదేవర్షిః నారదఃస్వయం || 68 ||

తమాగతం ప్రేక్ష్యగురుం మునీనాంసార్ధంసదసై#్యః అఖిలైర్మునింఃదైః |

ప్రణమ్యభక్త్యావినివేశ్యపీఠేకృతోపచారం సృపతిర్భ భాషే || 69 ||

రాజోవాచ -

దృష్టంకిమస్తితే బ్రహ్మన్‌ త్రిలోక్యాంకించిదద్భుతం | తన్నోబ్రూహివయం సర్వేత్వద్వాక్యామృతలాలసాః || 70 ||

తా || ఈ నీపుత్రుడు రుద్రంతో పదివేలస్నానాలుచేయని. ఈ భూమిపై ఇంద్రునివలె పదివేల సంవత్సరాలు ఆనందిస్తాడు (54) ఎదురులేని బలము, ఐశ్వర్యముకలవాడై శత్రువుల నశించినవాడై అమయములులేని వాడై, పాప ఓ ఘములు నశించినవాడై రాజ్యాన్ని ఎదురులేకుండా శాసిస్తాడు (55) విప్రులువేదవిదులు, శాంతులు కృతకృత్యులు, ప్రశంసింపబడిన వ్రతంకలవారు. జ్ఞానయజ్ఞతపోనిష్టులు శివభక్తి పరాయణులు (56) ఔతారు. విమలమైన, మనస్సుతో రుద్రాధ్యాయజపాన్ని బాగాచేయని, వాని జపమహత్తువల్ల వెంటనే శ్రేయస్సుకలుగుతుంది. (57) అని చెబుతున్న ఆ మునినే ఆ రాజు, తనమొదటి క్రియాగురవుగా భావించాడు. ఇంకా ఇతరమైన ధనాశ##లేనివేలకొలది మునులను క్షణంలో అవాహనచేశాడు. (58) అవిప్రులు శాంతమనస్సులవారు వేయిసంఖ్యగలిగివారునూరు కలశములస్థాపించి, అందుపుణ్య వృక్షములరసముంచి (59) అరాకుమారుని రుద్రాధ్యాయంతో స్నానంచేయించి ఏడవరోజురాగా విధిప్రకారము స్నానం చేయించారు. (60) మునిజనులు స్నానం చేయిస్తుండగా అరాకుమారుడు అకస్మాత్తుగా భయపడి క్షణంలో మూర్ఛ పోయినాడు. (61) త్వరగా అతడులేచి మునులు రక్షణచేయగా ఇట్లన్నాడు. దండహస్తుడైన ఒక పురుషుడువచ్చి (62) నన్ను కొట్టదలిచాడు భీమదండంగలవాడు, భయానకుడు. అతడు కూడా ఇతరులైన మహావీరులైన పురుషులతో కొట్ట బడ్డాడు. (63) పెద్దపాశంతో కట్టబడి దూరంగా తీసుకపోబడ్డట్టు ఐనాడు. మీతో రక్షింపబడుతూ ఇంతమాత్రంనేను చూచాను. (64)ఇట్లా పలికిన రాకుమారుని బ్రాహ్మణులు ఆశీర్వదములతో పూజించారు. భయాన్ని రాజుకు తెలిపారు (65) ఆరాజు శ్రేష్టులైన ఋషలందరిని దక్షిణలతో పూజించి భక్తిపూర్వకముగా మంచి భోజనంతో భుజింపచేసి (66) ఆ బ్రహ్మ వాదులమునుల ఆశీర్వాదాన్ని తీసుకొని భక్తితో, బంధుజనులతో కూడి సభలో కూర్చున్నాడు. (67) వీరుడైన రాజుమునులతో పాటురాగా మహాయోగి, దేవర్షినారదుడు స్వయంగా వచ్చాడు (68) మునులకు గురువైన, వచ్చిన అ నారదుణ్ణి, మునీందులతో అఖిలసదస్సులతోపాటు అరాజు చూచి భక్తితో నమస్కరించి పీఠమందు కూర్చోబెట్టి ఉపచారములు చేసి రాజిట్లన్నాడు (69) రాజువచనము - ముల్లోకములలో అద్భుతమైనది మీరు చూచింది ఏది దాన్ని మాకు చెప్పండి. మేమంతా మీ వాక్యామృతమందు లాలానులముగా ఉన్నాము. అని అనగా (70)

మూ || నారద ఉవాచ -

అత్రచిత్రం మహాద్ధృష్టంవ్యోమ్నోవతరతామయా | తచ్ఛృణుశ్వమహారాజన హైభిః మునిపుంగనై ః || 71 ||

అద్యమృత్యురిహాయాతో నిహంతుంవపుత్రకం | దండహస్తోధురాధర్షోలోకముద్భాయన్‌ సదా || 72 ||

ఈశ్వరోపి విదిత్వైసంత్వత్పుత్రంహంతుమాగతం | న హైవపార్షదైః కంచిత్‌వీరభద్రమచోదయత్‌ || 73 ||

స అగత్యహఠాస్మృత్యుం త్యత్పుత్రంహం తు మాగతం | గృహీత్వాసుదృఢంధ్వాదండే నాభ్యహనందుషా || 74 ||

తంనీయమానంజగదీశ్వసన్నిధింశీఘ్రంవిదిత్వాభగవాన్‌యమఃస్వయం |

కృతాంజలిర్దేవజయతేత్యుధిరయన్‌ ప్రణమ్య మూర్థ్ననిజగాద శూలినం || 75 ||

యమువాచ -

దేవదేవమహారుద్రవీరభద్రనమో7స్తుతే | నిరాగసికథం మృత్యౌకోవస్తవసముత్థితః || 76 ||

నిజకర్మానుబంధేనరాజపుత్రంగతాయుషం | పహర్తుముద్యతేమృత్యౌకోవరాధోవదప్రభో || 77 ||

వీరభద్రఉవాచ -

దశవర్షనహస్రాయుః నరాజతనయఃకథం | వినత్తిమంతరాయాతి రుద్రస్నానహతాశుభః || 78 ||

అస్తిచేత్తపసందే హో మధ్వాక్వే7 ప్యనివారితే చిత్రగుప్తంసమాహూయాప్రష్టవ్యో7ద్యైవమాచిరం || 79 ||

నారద ఉవాచ -

అథాహుతశ్చిత్రగుప్తోయమేనసహసాగతః | అయుః ప్రమాణం త్వత్యూనోః పరివృష్టః నచాబ్రనీత్‌ || 80 ||

ద్వాదశాబ్దించతస్యాయుః ఇత్యుక్త్వాథవిమృశ్యచ | పునర్లేఖ్యగతం ప్రాహనవర్షయుత జీవితం || 81 ||

అధభీతోయమోరాజా వీరభ్రదం ప్రణమ్యచ | కథంచిన్మోయామాసమృత్యుందుర్వారబంధనాత్‌ || 82 ||

వీరభ్రదేణముక్తో7 థ యమో7గాన్నిజమందిరం | వీరభ్రదశ్చకైలాస మహం ప్రాప్తస్తవాంతికం || 83 ||

అతస్తవకుమారో7 యంరుద్రజాప్యానుభావతః | మృత్యోర్భయంసముత్తీర్యనుఖీ జాతో7యుతం సమాః || 84 ||

ఇత్యుక్తాసృపమామంత్ర్యవారదేత్రి దివంగతే | విప్రాఃసర్వేప్రముదితాః స్వంస్వంజగ్మురధాశ్రమం || 85 ||

ఇత్థం కాశ్మీరసృపతీరుద్రాధ్యాయ ప్రభావతః | విస్థీర్యాశేషదుఃఖానికృతార్థోభూత్సపుత్రకః || 86 ||

యోకీర్తయంతి మనుజాఃపరమేశ్వరస్య మాహాత్మ్యమేతదథం కర్ణపుటైంః పిబంతి |

తేజన్మకోటికృతపాపగఱౖం విముక్తాఃశాంతా ః ప్రయాంతి పరమంపదమిందుమౌలే ః || 87 ||

ఇతి శ్రీస్కాందమహాపురాణ ఏకాశితి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తర ఖండే రుద్రాధ్యాయమహిమ వర్ధనం నామ ఏకవింశో7ధ్యాయ ః || 21 ||

తా|| నాదునివచనము - నేను ఆకాశం నుండి దిగుతుండగా ఒక మహావిచిత్రాన్ని చూచాను. ఈ ముని పుంగవులతోపాటు దానిని విను ఓ మహారాజ ! (71) నీ కొడుకును చంపటానికి ఈ వేళ మృత్యవు ఇక్కడికి వచ్చాడు. దండహస్తుడు దురాధర్షుడు. ఎల్లప్పుడూ లోకాలను బాధపెడ్తాడు. (72) ఈశ్వరుడు కూడా నీ కొడుకును చంపటానికి ఈతడు వచ్చాడని తెలిసి తనపక్కనున్న వారితో పాటు ఒక వీరభద్రుని ప్రేరేపించాడు (73) అతడు వచ్చి నీకొడును హఠాత్తుగా చంపటానికి వచ్చినయముని పట్టుకొని గట్టిగ బంధించి కోపంతో దండంతో కొట్టాడు. (74) జగదీశుని సన్నిధికి తనను తీసుకుపోతున్నట్లు యముడు త్వరగా తెలుసుకొని అతడు చేతులు జోడించి ఓ దేవ ! నీకు జయము. అని పలుకుతూతలవంచి నమస్కరిస్తూ శూలంగలవారితో ఇట్లన్నాడు. (75) యముని వచనము - దేవదేవ ! మహారుద్ర వీరభద్ర నీకు నమస్కారము. తప్పులేనినాపై మీకు కోపం ఎట్లా కలిగింది. (76) తనకర్మననుసరించి చనిపోయిన రాజపుత్రుని కొట్టడానికి సిద్దపడ్డమృత్యువు దేమి తప్పోచెప్పు (నాది) ఓప్రభు (77) అనగా వీరభ్రదునివచనము - ఆరాజు - తనయునివయస్సు పదివేల సంవత్సరాలు. రుద్రస్నానంతో అతని అశుభమంతాపోయింది. ఎట్లావిపత్తి కలిగి ఉంటాడు (78) నీకు సందేహముంటే సందేహంలేని వ్యాఖ్యాన్ని గూర్చి చిత్రగుప్తుని పిలిచి ఈ వేళే అడుగు అలస్యం చేయొద్దు. (79) అనగా నారదవచనము - యముడు చిత్ర గుప్తునిపిలువగా అతడు వచ్చాడు. నీకొడుకు ఆయుఃప్రమాణాన్ని అడుగగా అతడిట్లన్నాడు. (80) అతని వయస్సు పన్నెండు సంవత్సరాలు అని పలికి మరి ఆలోచించి వ్రాసినదాన్ని చూచి పదివేలసంవత్సరాలు అని చెప్పాడు. (81) యముడు భయపడి వీరభద్రునకు నమస్కరించిగా దుర్వారబంధమునుండి మృత్యువును ఎట్లాగో విడిపించాడు (82) వీరభద్రుడు విడిచిపెట్టాకయముడు తనమందిరానికి వెళ్ళాడు. కైలాసానికి వీరభద్రుడు నేను నీదరికి వచ్చాము (83) అందువల్ల ఈ నీకుమారుడు రుద్రజపప్రభావం వల్ల, మృత్యుభయాన్ని దాటి, పదివేల సంవత్సరాలు సుఖవంతుడైనాడు. (84) అని రాజుకు చెప్పి, పోయివస్తానని చెప్పిన నారదుడు స్వర్గానికి వెళ్ళాక, విప్రులంతా ఆనందించి తమ తమ ఆశ్రమాలకు వెళ్ళారు. (85)ఈ విధంగా కాశ్మీరరాజు రుద్రాధ్యాయప్రభావం వల్ల అన్ని దుఃఖాలు దాటి పుత్రునితో పాటు కృతార్థుడైనాడు (86)పర మేశ్వరమాహాత్మ్యాన్ని ఏనరులు కీర్తిస్తారో ఈ మహాత్మ్యాన్ని చెవులతో వింటారో, వారు జన్మకోటులతో చేసిన పాపరాసుల నుండి విముక్తులైశాంతులై ఇందు మౌళియొక్క పరమపదమును చేరకుంటారు. (87)అని శ్రీస్కాందమహా పురాణ మందు ఏకాశీతి సహస్రసంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తరఖండమందు రుద్రాధ్యాయమ హిమవర్ధనమనునది ఇరువది ఒకటవ అధ్యాయము (21).

Sri Scanda Mahapuranamu-3    Chapters