Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువదవ అధ్యయము

మూ || సూత ఉవాచ -

అథరుద్రాక్ష మాహాత్మ్యం వర్ణయామి సమానతః | సర్వపాపక్షయకరం శృణ్వతాం పఠతామపి || 1 ||

అభక్తోవాపి భక్తోవానీచో నీచతరోపివా | రుద్రాక్షాన్థారయే ద్యస్తు రుద్రాక్షాణాంధృతవ్రతః || 2 ||

రుద్రాక్షధారణం పుణ్యంకేనవాన దృశం భ##వేత్‌ | మహావ్రతమిదం ప్రాహుఃమునయన్తత్వ దర్శినః || 3 ||

సహస్రం ధారయే ద్యస్తు రుద్రాక్షాణాం ధృతవ్రతః | తంనమంతి సురాన్సర్వే యధారుద్రః తధైవనః || 4 ||

అభావేతు సహస్రస్యబాహ్వోః షోడశషోడశ | ఏకం శిఖాయాంకరయోః ద్వాదశ ద్వాద శైవహి || 5 ||

ద్వాత్రింశత్కంఠ దేశేతు చత్వారింశత్తు మన్తకే | ఏకైక కర్ణయోః షట్‌షట్‌ పక్షన్యష్టోత్తర శతం

యోధారయతి రుద్రాక్షాన్‌ రుద్రవత్సోపి పూజ్యతే

ముక్తాప్రవాల న్ఫటికరౌవ్యవై డూర్యకాంచనైః నమేతాన్‌ ధారయేద్యస్తు రుద్రాక్షాన్‌నశివోభ##వేత్‌ || 7 ||

కేవలానపి రుద్రాక్షాన్‌ యధాలాభంబిభర్తియః | తం సన్సృశంతి పాపాని తమాంసీవ విభావనుం || 8 ||

రుద్రాక్షమాల యాజప్తో మంత్రో7నంత ఫలప్రదః | అరుద్రాక్షోజవః పుంసాంతాపన్మాత్ర ఫలపదం || 9 ||

యస్యాంగేనాస్తి రుద్రాక్ష ఏకోపి బహువుణ్యదః | తస్యజన్మ నిరర్ధం స్యాత్‌ త్రివుండ్రరహితం యది || 10 ||

రుద్రాక్షం మస్తకే బద్ధ్వాశిరః స్నానం కరోతియః | గంగా స్నాన ఫలం తన్య జాయతే నాత్ర సంశయః || 11 ||

రుద్రాక్షం పూజయే ద్యస్తు వినాతోయాభిషేచనం | యత్ఫలంలింగపూజాయాః తదేవాప్నోతి నిశ్చితం || 12 ||

ఏకవక్త్రాః పంచపక్త్రః పంచపక్త్రాః ఏకాదశముఖాః కేచిత్‌ రుద్రాక్షా లోకపూజితాః || 13 ||

భక్త్య సంపూజితో నిత్యం రుద్రాక్షః | దరిత్రం వాపి కురుతే రాజరాజశ్రియాన్వితం || 14 ||

అత్రేదం పుణ్యమాఖ్యానం వర్ణయంతిమనీషిణః | మహాపాప క్షయకరం శ్రవణాత్కీర్త నాదపి || 15 ||

తా || నూతుని వచనము - ఇక రుద్రాక్ష మాహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వర్ణిస్తాను. నినే వారికి చదివేవారికి అన్ని పాపములను నశింపచేసేది (1) భక్తుడైనా కాకపోయినా నీచుడైనా, నీ చతరుడైనా ఎవరు, రుద్రాక్షను ధరిస్తారో, వారు అన్ని పాపముల నుండి ముక్తులౌతారు (2) రుద్రాక్షధారణ పుణ్యప్రదమైంది. దేనితోను పోల్చరానిది. తత్వదర్శులైన మునులు దీనిని మహావ్రతమన్నారు (3) ధ్రుతవ్రతుడై వేయి రుద్రాక్షలు ధరించిన వానిని దేవతలంతా నమస్కరిస్తారు. రుద్రుడెట్లాగో ఆతడట్లా (4) వేయి లేకపోతే పదహారు వదహారు చేతులకు ధరించాలి ఒకటి శిఖలో చేతులకు పన్నెండు పన్నెండు (5) కంఠ మందు ముప్పది రెండు తలపై నలుబది, చెవులకు ఒక్కొక్క దానికి ఆరేసి వక్షంలో నూట ఎనిమిది ధరించాలి. రుద్రాక్షలను ధరించినవారు రుద్రునివలె పూజింపబడుతారు (6) ముత్యం, పగడం, స్ఫటికం, వెండి, వైడూర్యం, బంగారం వీటితోకూడిన వానిని రుద్రాక్షలను ఎవరుధరిస్తారో వారు శివులౌతారు (7) కేవలం రుద్రాక్షలను కూడా దొరికి నంతవరకు ఎవరు ధరిస్తారో ఆతనిని పాపములుతాకవు, సూర్యుని చీకట్లు తాకనట్లు (8) రుద్రాక్షమాలతో జపింపబడినమంత్రముఅనంతఫలాన్నిస్తుంది. రుద్రాక్ష లేకుండా జపంచేస్తే అది అంతంత మాత్రం ఫలితాన్నిస్తుంది (9) అధిక పుణ్యాన్నిచ్చే రుద్రాక్ష ఒక్కొటైన ఎవని శరీరంలో లేదో వానిజన్మ వ్యర్థము. ఒకవేళ త్రివుండ్రం లేకపోతే కూడా (10) రుద్రాక్షను తలలో కట్టుకొని శిరః స్నానముఎవరు చేస్తారో వారికి గంగా స్నాన ఫలము కల్గుతుంది. ఇందులో అనుమానం లేదు (11) నీటితో అభిషేకం లేకుండా ఎవరు రుద్రాక్షను పూజిస్తారో వారు, లింగపూజకు ఏ ఫలమో అదే ఫలం పొందుతారు నిశ్చయము (12) ఏకవక్త్రములు, పంచవక్త్రములు, కొన్ని పదకొండు ముఖములు కలవి.పదునాల్గు ముఖములవి కొన్ని ఈ రుద్రాక్షలన్ని లోక పూజితములు (13) శంకరాత్మకమైన రుద్రాక్షను రోజు భక్తితో పూజిస్తే దరిద్రుడైనా రాజరాజశ్రియాన్వితుడౌతాడు (14) బుద్ధిమంతులు ఇక్కడ ఈ పుణ్యమైన కథను చెప్తారు. విన్నా కీర్తించినా మహాపాపముల నశింపచేసేది (15).

మూ || రాజా కాశ్మీర దేశన్య భద్రసేన ఇతిశ్రుతః | తన్యవుత్రో7భవర్ధీమాన్‌ నుదర్మానామ వీర్యవాన్‌ || 16 ||

తస్యామాత్య సుతః కశ్చిత్‌ తారకోనామ సద్గుణః | బభూవ రాజపుత్రస్య సఖావరమశోభనః || 17 ||

తావుభౌ వరమస్నిగ్థౌ కుమారౌ రూప నుందరౌ | విద్యాభ్యాస వరౌబాల్యే సహక్రీడాం వ్రచక్రతుః || 18 ||

తౌసదా సర్వగాత్రేషు రుద్రాక్షకృత భూషణౌ | విచేరతు రుదారాంగౌ సతతం భస్మధారిణౌ || 19 ||

హారకే యూరకటక కుండలాది విభూషణం | హెమరత్న మయంత్యక్త్వా రుద్రాక్షాన్‌ దధతుశ్చతౌ || 20 ||

రుద్రాక్ష మాలినౌ నిత్యం రుద్రాక్ష కరకంకణౌ | రుద్రాక్ష కంఠా భరణౌ నదారుద్రాక్షకుండలౌ || 21 ||

హెమరత్నా ద్యలం కారేలోష్ఠపాషాణ దర్శనౌ | బోధ్యమానావపి జనైః నరుద్రాక్షాన్‌ వ్యముంచతాం || 22 ||

తస్యకాశ్మీర రాజన్య గృహం ప్రాప్తో యదృచ్ఛయా | పరాశరోమునివరః సాక్షాదివ పితామహః || 23 ||

తమర్చయిత్వావిధిపత్‌ రాజాధర్మ భృతాంపరః | వప్రచ్ఛ సుఖమాసీనంత్రి కాలజ్ఞం మహాముని || 24 ||

రాజోవాచ -

భగవన్నేష పుత్రోమే సోపి మంత్రినుతశ్చమే | రుద్రాక్ష ధారిణౌ నిత్యం రత్నాభరణ నిః స్పృహౌ || 25 ||

శాన్యమానావపి నదారత్నా కల్ప పరిగ్రహె | విలంఘితాస్మద్వచనౌ రుద్రాక్షేష్వే వతత్పరౌ || 26 ||

నోవదిష్టావిమౌ బాలౌకదాచి దపికేనచిత్‌ | ఏషా స్వాభావికీ వృద్ధిః కథామాసీ త్కుమారయోః || 27 ||

పరాశర ఉవాచ -

శృణురాజన్‌ ప్రవక్ష్యామి తవపుత్రస్య ధీమతః | యథాత్వం మంత్రి పుత్రస్యప్రాగ్వృత్తంవిస్మయావహం || 28 ||

నందిగ్రామే పురాకాచిత్‌ మహానందేతి విశ్రుతా | బభూవ వారవనితా శృంగార లలితాకృతిః || 29 ||

ఛత్రం పూర్ణేందు సంకాశం యానం స్వర్ణ విరాజితం | చామరాణి నుందండాని పాదుకేచహిరణ్మయే || 30 ||

తా || కాశ్మీర దేశంలో భద్రసేనుడని రాజు ఉండేవాడు. అతని కొడుకు బుద్ధిమంతుడు, వీర్యవంతుడు సుధర్ముడు అని ఉండేవాడు (16) అతని మంత్రి కొడుకు సద్గుణుడు తారకుడని ఉండేవాడు. రాజపుత్రునకు ఆతడుమిత్రుడు చాలా మంచివాడు (17) వారిద్దరు చాలా స్నేహం కలవారు కుమారులు, రూపంలో అందగాళ్ళు, విద్యాభ్యాస పరులు బాల్యంలో కలిసి అడుకునే వాళ్ళు. (18) వాళ్ళు ఎప్పుడూ అన్ని అవయవములందు రుద్రాక్షలు ఆభరణంగా ధరించేవారు మంచి అవయములవారు ఎప్పుడూ భన్మం ధరించేవారు (19) హారకే యూర కటక కుండలాది విభూషణములు బంగారు రత్నములు కలవి వదలి వారు రుద్రాక్షలు ధరించేవారు (20) రోజు రుద్రాక్షమాలలు కలవారు. రుద్రాక్షలు కరకంకణములు కలిగిన వారు రుద్రాక్షలు కంఠాభరణంగా కలవారు ఎప్పుడు రుద్రాక్షలు కుండలములుగా గలవారు (21) హెమరత్నాది అలంకారాలు వారికి మట్టి,రాళ్ళవలెను కన్పించేవి. జనులు ఎంత చెప్పినా రుద్రాక్షలను వదలలేదు. (22) ఆ కాశ్మీరరాజు యొక్క గృహమునకు అనుకొకుండా పరాశరుడు మునివరుడు, సాక్షాత్తు పితామహునివలె వచ్చాడు (23) ధర్మభృతులలో శ్రేష్ఠుడైన ఆ రాజు ఆతనిని విధి ప్రకారము పూజించాడు.త్రికాలజ్ఞుడైన మహామునిని సుఖంగా కూర్చున్న వాణ్ణి ఆ రాజు అడిగాడు. (24) రాజు వచనము - ఓ భగవాన్‌ ! ఈతడు నాకుమారుడు ఆతడు నా మంత్రి కుమారుడు రత్నాభరణములందు స్పృహలేని వారు రుద్రాక్షధారులు (25) రత్నాకల్పములను స్వీకరించటానికి ఎప్పుడూ నేను ఆదేశిస్తున్నా వారు నా మాటను దాటవేస్తున్నారు. రుద్రాక్షలందే తత్పరులు (26) వీరు ఎప్పుడూ ఎవరితోనూ ఈ బాలురు ఉపదేశాన్ని పొందలేదు. ఈ స్వాభావిక వృత్తి ఈకుమారులకు ఎట్లా వచ్చింది (27) అనగా పరాశరుని వచనము- ధీమంతుడైన నీ పుత్రుని సంగతి చెబుతాను, ఓరాజ! విను. విస్మయావహమైన మంత్రిపుత్రుని పూర్వవృత్తాని నీవడిగినట్లు చెబుతాను విను (28) పూర్వం నంది గ్రామంలో మహానంద అని ప్రసిద్ధమైన ఒక వారవనిత, శృంగార లలితా కృతి గలది ఉండేది. (29) పూర్ణేందు నదృశ##మైన ఛత్రము బంగారుతో ప్రకాశించే యానము, మంచి దండము గల చామరాలు బంగారు పాదుకలు (30).

మూ || అంబరాణివిచిత్రాణిమహార్హాణిద్యుమంతిచ | చంద్రరశ్మినిభాఃశయ్యాఃపర్యంకాశ్చహిరణ్మయాః || 31 ||

గావో మహిష్యః శతశోదాసాశ్చ శతశస్తధా || 32 ||

సర్వా భరణ దీప్తాంగ్యో దాస్యశ్చనవ¸°వనాః | భూషణాని పరార్ఘ్యాణిన పరత్నూజ్జ్వలానిచ || 33 ||

గంధకుంకుమ కన్తూరీ కర్పూరా గురులేవనం | చిత్రమాల్యావతం సశ్చయధేష్టం మృష్టభోజనం || 34 ||

నానాచిత్ర వితానాఢ్యం నానాధాన్య మయంగృహం | బహురత్న నహస్రాఢ్యం కోటిసంఖ్యాధికంధనం || 35 ||

ఏవం విభవసంపన్నా వేశ్యాకామవిహారిణీ | శివపూజా రతానిత్యం సత్యధర్మ పరాయణా || 36 ||

సదాశివ కథాసక్తా శివనామ కథోత్పుకా | శివభక్తాం ఘ్ర్యవనతా శివభక్తి రతానిశం || 37 ||

వినోదహెతోః సావేశ్యా నాట్యమండవ మధ్యతః | రుద్రాక్షైః భూషయిత్వైకం మర్కటం చైవకుక్కుటం || 38 ||

కరతాలైశ్చగీతైశ్‌చ సదానర్తయతి స్వయం | పునశ్చ విహసంత్యుచ్చైః సఖీభిః పరివారితా || 39 ||

రుద్రాక్షైః కృతకేయూరకర్ణాభరణ భూషణః | మర్కటః శిక్షయాతస్యాః సదానృత్యతి బాలవత్‌ || 40 ||

శిఖాయాం బద్ధరుద్రాక్షః కుక్కుటః కపినా సహ | చిరం నృత్యతి నృత్యజ్ఞః పశ్యతాం చిత్రమావహన్‌ || 41 ||

ఏకదా భవనం తస్యాః కశ్చిద్వైశ్యః శివవ్రతీ | ఆజగామ నరుద్రాక్షః త్రివుండ్రే నిర్మమః కృతీ || 42 ||

సబిభ్రద్‌ భస్మ విశ##దే ప్రకోష్ఠే వరకంకణం | మహారత్న పరిస్తీర్ణం జ్వలంతం తరుణార్కవత్‌ || 43 ||

తమాగతం సాగణికానం పూజ్య పరయాముదా | తత్ర్పకోష్ఠగతం వీక్ష్య కంకణం ప్రాహవిస్మితా || 44 ||

మహరత్న మయఃసో7యం కంకణస్త్వత్కరేస్థితః | మనోహరతిమే సాధో దివ్యస్త్రీ భూషణోచితః || 45 ||

ఇతితాం పరరత్నాఢ్యన స్పృమాం కరభూషణ | వీక్ష్యోదారమతిర్వైశ్వః నస్మితం సమభాషత || 46 ||

వైశ్య ఉవాచ -

అస్మిన్‌ రత్నవరే దివ్యే యదితేనం న్పృహంమనః | తమే వాదత్స్వ నుప్రీతా మౌల్యమన్య దదాసికిం || 47 ||

వేశ్యోవాచ -

వయంతు సై#్వర చారిణ్యో వేశ్యాస్తున వతివ్రతాః | అస్మత్కులోచితో ధర్మో వ్యభిచారో న సంశయః || 48 ||

యద్యేతత్‌ రత్నఖ చితందదాసి కరభూషణం | దినత్రయ మహోరాత్రంతవపత్నీభవామ్యహం || 49 ||

తా || విచిత్రమైన అంబరములు చాలా విలువైనవి, కాంతివంతమైనవి, చంద్రరశ్మివంటి శయ్యలు, హిరణ్మయమైన మంచములు (31) నూర్లకొలది ఆవులు, బఱ్ఱలు, నూర్లకొలది దానజనము (32) సర్వాభరణములతో వెలగే శరీరాలు గల సవ¸°వనవతులైన దాసీజనము, అమూల్యమైన భూషణములు నవరత్నములతో వెలిగేవి (33) గంధ కుంకుమ కస్తూ రి కర్పూర అగరులేపనములు, చిత్రమైన మాలల శిరోభూషణములు, స్వేచ్ఛగా మృష్టాన్న భోజనము (34) నానాచిత్రవితానములతో కూడిన నానాధాన్యమయమైన గృహము, బహుసహస్ర రత్నములు గల కోటి సంఖ్యాధికమైన ధనము (35) ఇంత వైభవమున్నా అవేశ్య కామంలేనట్టిది, నిత్యము శివపూజారతురాలు, సత్యధర్మ పరురాలు (36) సదాశివ కథలందు ఆసక్తికలది శివుని నామ కథలందు ఔత్సుక్యము కలది, శివభక్తుల పాదములందు తలవంచేది, ఎప్పుడూ శివభక్తి యందాసక్తి గలది (37) వినోదం కొరకు ఆవేశ్వ నాట్యమంటవం మధ్యన నుండి రుద్రాక్షలతో అలంకరించి ఒక కోతిని ఒక కోడిని (38) కరతాళములతో గీతములతో ఎప్పుడూ స్వయంగా నటింపచేసేది. తిరిగి సఖురాండ్రతో చుట్టబడి గట్టిగా నవ్వేది (39) రుద్రాక్షలతోనే కేయూర కర్ణాభరణ బూషణములు చేయగా వాటిని ధరించి కోతి ఆమె శిక్షణతో పిల్లవానివలె నాట్యంచేసేది. (40) శిఖ యందు రుద్రాక్ష కలిగి కోడి కోతితో పాటు చాలా సేపు నాట్యం చేసేది. నృత్యజ్ఞులు చూసే వారికి చిత్రమన్పించేట్లుగా (41) ఒకసారి ఆమెభవనమునకు ఒక వైశ్యుడు శివప్రతి వచ్చాడు. అతడు రుద్రాక్షలు ధరించాడు త్రిపుండ్రము గలవాడు. మమకారంలేని వాడు కృతి (42) ఆతడు భస్మాన్ని ధరించి, విశదమైన ప్రకోష్ఠమందు కంకణం ధరించి మహారత్నములు పరిచినట్లు, తరుణ అర్కునివలె వెలిగిపోతూ (43) ఉన్నాడు. వచ్చిన ఆతనిని ఆవేశ్య చాలా ఆనందంతో పూజించి ఆతని ప్రకోష్ఠమునకున్న కంకణాన్ని చూచి ఆశ్చర్యంతోఇట్లా అంది (44) మమారత్నములతో కూడిన ఆ కంకణము మీ చేతికుంది అది నా మనస్సును హరిస్తోంది. ఓ సాధు! అది దివ్యస్త్రీ భూషణములకు ఉచితమైంది అని. (45) అన్న ఆ నవరత్నములతో కూడిన దానిని కరభూషణమందు ఆశ గలదానిని చూచి ఉదారమతి గల వైశ్యుడు నవ్వుతూ ఇట్లన్నాడు (46) వైశ్యుని వచనము - ఈ రత్నవరమందు దివ్యమైన దాని యందు నీ మనస్సుకు ఆశుంటే దాన్నే తీసుకో సంతసించి దీనికి మూల్యమిస్తావా (47) అనగా వేశ్య అంది - మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్‌ళం వేశ్యలు పతివ్రతలు కారు. మా కులోచిత ధర్మం వ్యభిచారము అనుమానంలేదు (48) ఈ రత్న ఖచితమైన కరభూషణాన్ని ఇస్తే రాత్రింబగళ్ళు మూడు రోజులు నీ భార్యనౌతాను నేను అని అనగా. (49)

మూ || వైశ్య ఉవాచ -

తథాస్తు యదితే సత్యం పచనం వారవల్లబే | దదామిరత్నవలయం త్రిరాత్రం రభవమద్వధూః || 50 ||

ఏతస్మిన్‌ వ్యవహారేతు ప్రమాణం శశిభాస్కరౌ | త్రివారం సత్యమిత్యుక్త్వాహృదయంమే స్పృశప్రియే || 51 ||

వేశ్యోవాచ -

దినత్రయ మహోరాత్రం వత్నీ భూత్వాతవప్రభో | సహధర్మం చరామీతి సాతత్‌ హృదయమస్పృశత్‌ || 52 ||

అథతసై#్యన వైశ్యస్తు ప్రదదౌరత్న కంకణం | లింగం రత్నమయంచాస్యాహస్తే దత్వేదమ బ్రవీత్‌ || 53 ||

ఇదంరత్నమయం శైవంలింగం మత్ర్పాణ సన్నిభం | రక్షణీయం త్వయాకాంతే సత్యహానిర్మృతిర్మమ || 54 ||

ఏవమస్త్వితి సాకాంతా లింగమాదాయ రత్నజం | నాట్యమండ పికాస్తంభేనిధాయ ప్రావిశద్గృహం || 55 ||

సాతేన సంగతారాత్రౌ వైశ్యేన విటధర్మిణా | సుఖంనుష్వాప పర్యం మృదుత ల్పోపశోభితే || 56 ||

తతోనిశీథ నమయే నాట్య మండపి కాంతరే | అకస్మాదుత్థితో వహ్నిస్తమేవ సహసావృణోత్‌ || 57 ||

మండపేదహ్యమానేతునహసోత్థాయసంభ్రమాత్‌ | సావేశ్యామర్కటంతత్రమోచయామానబంధనాత్‌ || 58 ||

సమర్కటో ముక్త బంధః కుక్కటేన సహామునా | భీతోదూరం ప్రదుద్రావ విదూయాత్ని కణాన్‌బహూన్‌ || 59 ||

స్తంభేన సహనిర్దగ్థం తల్లింగంశకలీకృతం | దృష్ట్వా వేవ్యాచవైశ్యశ్చ దురంతం దుఃఖమావతుః || 60 ||

దృష్ట్వా ప్రాణ సమంలింగం దగ్థం వైశ్యపతిస్తథా | స్వయమప్యాప్త నిర్వేదో మరణాయమ తిందధౌ || 61 ||

నిర్వే దాన్నితరాంఖేదాత్‌ వైశ్యస్తామాహదుఃఖితాం | శివలింగేతు నిర్భిన్నే నాహం జీవితుముత్సహె || 62 ||

చితాంకారయమే భ##ద్రేత వభృత్యైః బలాధికైః | శివేమనః సమావేశ్య ప్రవిశామిహుతాశనం || 63 ||

యదిబ్రహ్మెంద్రవిష్ణ్వాద్యావారయేయుఃనమేత్యమాం |తధావ్యస్మిన్‌క్షణధీరఃప్రవిశ్యాగ్నింత్యజామ్యనూన్‌ || 64 ||

తమేవంధృడబంధంసా విజ్ఞాయ బహుదుఃఖితా | స్వభృత్యైః కారయామానచితాం స్వనగరాద్బహిః || 65 ||

తా || వైశ్యుని వచనము - ఓ వారవల్లభ! నీ మాట నిజమైనట్టైతే అది అట్లాగే కాని రత్న వలయాన్ని ఇస్తాను. మూడు రోజులు నా వధువువుకమ్ము. (50) ఈ వ్యవహారంలో సూర్యచంద్రులు ప్రమాణము మూడు సార్లు సత్యముఅని పలికి నా హృదయాన్ని స్పృశించు ఓ ప్రియ (51) అని అనగా వేశ్య వచనము - మూడు రోజులు రాత్రింబగళ్ళు నీకు భార్యనై నహధర్మాన్న ఆచరిస్తాను అని ఆమె అతని హృదయాన్ని స్పృశించింది (52) ఆమెకు ఆ వైశ్యుడు రత్నకంకణాన్ని ఇచ్చాడు. రత్నరమయమైన లింగాన్ని ఆమె చేతిలోపెట్టి ఇట్లా అన్నాడు (53) ఇది రత్నమయమైన శివలింగము నా ప్రాణంతోసమానమైంది. ఓకాంత దీన్ని నీవు రక్షించాలి. దానికి హాని జరిగితే నాకు మృతి (54) అట్లాగే అని ఆ స్త్రీ ఆ రత్న లింగాన్ని తీసుకొని నాట్యమంటవ మందలి స్తంభమందు ఉంచి ఇంట్లోకి వచ్చింది. (55) ఆమె ఆ వైశ్యునితోరాత్రి విటధర్మం ప్రకారం కలిసింది. మృదు తల్పంతోకూడిన మంచముపై హాయిగా పడుకుంది (56) పిదప అర్థరాత్రియందు నాట్యమంటపం మధ్యలో అకస్మాత్తుగా అగ్నిపుట్టింది. దానిని ఆవరించింది (57) మంటపం కాలిపోతుంటే త్వరగా లేచి తొందరగా ఆ వేవ్య కోతిని బంధనం నుండి విడిపించింది (58) ఆకోతి బంధ విముక్తురాలై ఆ కోడితో కూడా భయపడి అనేక అగ్ని కణములను చిమ్ముతూ దూరంగా పరుగెత్తింది (59) స్తంభంతో పాటుకాలి ఆ లింగము తునకలైంది. వేశ్యవైశ్యుడు ఇద్దరు చూచి చాలా దుఃఖాన్ని పొందారు (60) ప్రాణంతో సమానమైన లింగం కాలిపోవటం చూచి ఆవైశ్యపతి, స్వయంగా నిర్వేదాన్ని పొంది చనిపోదలిచాడు (61) నిర్వేదంతో చాలా దుఃఖంతో వైశ్యుడు ఆమెతో ఇట్లా అన్నాడు. శివలింగం పగిలిపోతే నేను బ్రతుకదలచుకోలేదు (62) ఓ భ##ద్రే నాకు నీ బలాధికులైన భృత్యులతో చితిని ఏర్పరచు. శివుని యందు మనన్సు నిలిపి, అగ్నిలోప్రవేశిస్తాను. (63) ఒకవేళ బ్రహ్మ ఇంద్ర విష్ణ్వాదులు నన్ను ఏకమై వారించినా, ఈ క్షణంలో ధైర్యంగా అగ్నిలో ప్రవేశించి ప్రాణాలు వదుల్తాను (64) ఆతని ఈ దృఢనిశ్చయాన్ని తెలుసుకొని ఆమె చాలా దుఃఖించి, తన నగరానికి బయట తన భృత్యులతో చితిని ఏర్పాటు చేసింది (65).

మూ || తతఃసవైశ్యః శివభక్తిపూతః ప్రదక్షిణీ కృత్య సమిద్థ మగ్నిం |

వివేశపశ్యత్సుజనేషుధీరః సాచానుతా పంయువతీవ్రపేదే || 66||

అథసాదుఃఖితానారీ స్మృత్వా ధర్మం నునిర్మలం | సర్వాన్‌ బంధూన్‌ సమీక్ష్యైవం బభాషే కరుణంవచః || 67 ||

రత్నకంకణ మాదాయ మయాసత్యముదాహృతం | దినత్రయమహం పత్నీవైశ్య స్యాముష్య సంమతా || 68 ||

కర్మణా మత్కృతేనాయం మృతోవైశ్యః శివవ్రతీ | తస్మాదహం ప్రవేక్ష్యామి సహానేనహుతాశనం

సధర్మచారిణీ త్యుక్తం సత్యమేతద్ధిపశ్యథ || 69 ||

సత్యేన ప్రీతిమాయాంతి దేవాస్త్రి భువనేశ్వరాః |సత్యాసక్తిః పరోధర్మః సత్యే సర్వం ప్రతిష్ఠితం || 70 ||

సత్యేన స్వర్గమోక్షౌచ నా సత్యేన వరాగతిః | తస్మాత్సత్యం సమాశ్రిత్య ప్రవేక్ష్యామిహుతాశనం || 71 ||

ఇతిసాదృఢ నిర్బంధా వార్య మాణిపి బంధుభిః | సత్యలోపభయాన్నారీ ప్రాణాం స్త్యక్తుంమనోదధే || 72 ||

సర్వస్వం శివభ##క్తే భ్యో దత్వాధ్యా త్వా సదాశివం | తమగ్నింత్రిః పరిక్రమ్య ప్రవేశాభిముఖీస్థితా || 73 ||

తాంపతంతీం సమిద్ధే7గ్నౌ న్వవదార్పితమానసాం | వారయామాన విశ్వాత్మా ప్రాదుర్భూతఃశివఃస్వయం || 74 ||

సాతంవిలోక్యాభిలదేవదేవంత్రిలోచనంచంద్రకలావతంనం | శశాంకసూర్యానలకోటిభాసంసబ్థేవభీతేవతథైవతస్థౌ || 75 ||

తాం విహ్వలాం పరిత్రస్తాం వేపమానాం జడీకృతాం | సమాశ్వాస్యగలద్బాష్పాం కరేగృహ్యాబ్రవీద్వచః || 76 ||

శివ ఉవాచ -

సత్యం ధర్మంచ తేధైర్యం భక్తించ మయినిశ్చలాం | నిరీక్షితుం త్వత్స కాశం వైశ్యో భూత్వాహమాగతః || 77 ||

మాయయాగ్ని సముత్థావ్య దగ్థవాన్నాట్యమంటవం | దగ్థంకృత్వారత్నలింగం ప్రవృష్టోస్మిహుతాశనం || 78 ||

వేశ్యాం కైతపకారిణ్యః సై#్వరిణ్యో జనవంచకాః | సాత్వం సత్యమను స్మృత్య ప్రవిష్టాగ్నిం మయానహ || 79 ||

అతస్తే సంప్రదాస్వామి భోగాం స్త్రిదశదుర్లభాన్‌ | ఆయుశ్చ పరమందీర్ఘం ఆరోగ్యంచ వ్రజోన్నతిం యద్యదిచ్ఛసి నుశ్రోణి తత్తదేవదదామితే

నూత ఉవాచ -

ఇతి బ్రువతి గౌరీశే సావేశ్యా వ్రత్యభాషత || 81 ||

వేశ్యోవాచ -

నమేవాంఛాస్తి భోగేషు భూమౌ స్వర్గే రసాతలే | తవ పాదాంబుజ స్పర్శాత్‌ అన్యత్కించిత్‌ నవైవృణ || 82 ||

ఏతేభృత్యాశ్చ దాన్యశ్చయే చాన్యేమమబాంధవాః | సర్వేత్వదర్చన పరాః త్వయి సంన్యస్తవృత్తయః || 83 ||

సర్వానేతాన్మయా సార్థం నీత్వాతవ పరంపదం | పునర్జన్మ భయంఘోరం విమోచయ నమోన్తుతే || 84 ||

తథేతి తస్యావచనం ప్రతినంద్య మహేశ్వరః | తాన్‌ సర్వాంశ్చ తయాసార్థం నినాయ పరమం పదం || 85 ||

పరాశర ఉవాచ -

నాట్యమండపికాదాహే ¸°దూరం విద్రుతౌ పురా | తత్రావశిష్ఠౌ తావేవ కుక్కటో మర్కటస్తథా || 86 ||

కాలేన నిధనంయాతో యస్తస్యానాట్యమర్కటః | సోభూత్తవ కుమారో7సౌ కుక్కుటో మంత్రిణఃసుతః || 87 ||

రుద్రాక్ష ధారణో ద్భూతాత్‌ పూర్వభవార్జితాత్‌ | కులేమహతి సంజాతౌ వర్తేతే బాలకావిమౌ || 88 ||

పూర్వభ్యాసేన రుద్రాక్షాన్‌ దధాతే శుద్ధమానసౌ | అస్మిన్‌ జన్మ నితం లోకం శివం సంపూజ్యయాన్యతః || 89 ||

ఏషావ్రవృత్తిన్త్వసయో ర్బాలయోః నముదాహృతా | కథాచ శివ భక్తాయాః కిమన్యత్‌ ప్రష్టుమిచ్ఛసి || 90 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయా తృతీయే బ్రహ్మోత్తర ఖండే రుద్రాక్ష మహిమ వర్ణనం నామ వింశో7ధ్యాయః || 20 ||

తా || ఆ వైశ్యుడు శివ భక్తితో పవిత్రుడై మండుతున్న అగ్నికి ప్రదక్షిణంచేసి జనులు చూస్తుండగా ధీరుడు అగ్ని ప్రవేశం చేశాడు. ఆయుపతి పశ్చాత్తావ వడింది (66) ఇక దుఃఖంతో ఆ స్త్రీ సునిర్మలమైన ధర్మాన్ని తలచి బంధువులందరిని చూచి ఈ విధంగా కరుణంగా మాట్లాడింది (67) రత్న కంకణాన్ని తీసుకొని నేను నిజం చెప్పాను. మూడు రోజులు ఆ వైశ్యునకు భార్యగా అంగీకరించాను (68) నేను చేసిన కర్మతో శివవ్రతియైన ఈ వైశ్యుడు మరణించాడు. అందువల్ల ఇతనితోపాటు నేను అగ్నిలోప్రవేశిస్తాను. సధర్మచారిణి అని చెప్పాను. అది నిజము చూడండి (69) త్రిభువనేశ్వరులు దేవతలు సత్యంతో ప్రీతినందుతారు. సత్యాసక్తి ఉత్తమ ధర్మము. సత్యమందే అన్ని ఉన్నాయి. (70) సత్యంతోనే స్వర్గమోక్షములు అసత్యంతో వరాగతిలేదు. అందువల్ల సత్యాన్ని ఆశ్రయించి అగ్నిలో ప్రవేశిస్తాను (71) అని ఆమె దృఢనిశ్చయంతో బంధువులు వద్దంటున్నా సత్యలోవ భయంవల్ల ఆనారి ప్రాణములు విడువటానికి మనస్సు నిశ్చయించుకొంది (72) అంతా శివభక్తులకు ఇచ్చి సదాశివుని ధ్యానించి, అగ్నికి మూడు ప్రదక్షిణలు చేసి ప్రవేశించటానికి సిద్ధమైనిలిచింది (73) మండుతున్న అగ్నిలో పడుతున్న ఆమెను, తన పాదములపై నిలిపిన మనస్సుగల దానిని విశ్వాత్ముడు, శివుడు ప్రాదుర్భవించి స్వయంతా వారించాడు (74) తాను ఆ అఖిలదేవదేవుని త్రిలోచనుని, చంద్రకళావతంనుని కోటిశంశాక సూర్య అనలుల వలె భాసించే వానిని చూచి స్తబ్ధఐనట్లు భీత ఐనట్టు ఐ అట్లాగా నిలబడింది (75) ఆ విహ్వలురాలును, పరిత్రస్తురాలను, వణుకుతున్న దానిని, జడంగా ఐన దానిని కన్నీరు కారుస్తున్న దానిని చేతికి తీసుకొని ఓదార్చి ఇట్లన్నాడు. (76) శివుని వచనము - నీ సత్యము, ధర్మమును నాపై నీ నిశ్చలభక్తిని పరీక్షించటానికై నీదగ్గరకు వైశ్యుడనై నేను వచ్చాను (77) మాయవల్ల అగ్నిని కల్పించి నాట్యమంటపాన్ని కల్చాను. రత్నలింగాన్ని కాల్చి అగ్నిని వర్షించాను (78) వేశ్యలు కపటమాచరించేవారు, సై#్వరిణులు జనవంచకలు ఆ నీవు సత్యాన్ని అనుసరించినాతో పాటు అగ్నిలో ప్రవేశించావు (79) అందువల్ల నీకు దేవతలకు లభించని భోగములను ఇస్తున్నాను. దీర్ఘ అయున్సు దీర్ఘ ఆరోగ్యము సంతాన వృద్ధి నీవు ఏదేది కోరితే అదంతా నీకు ఇస్తాను. ఓ నుశ్రోణి! అని (80) అనగా నూతుల వచనము - అని గౌరీశుడు పలుకగా ఆవేశ్య ఇట్లాఅంది (81) వేశ్యవచనము - నాకు బోగాలపై కోరికలేదు. భూమిపై కాని స్వర్గంలో కాని పాతాళమందు కాని నీ పాదాంబుజ స్పర్శకన్న వేరే ఇతరమైన దానిని దేనిని కోరను (82) ఈ భృత్యులు, దానులు, నా ఇతర బంధువులు అందరు మీ పూజా సక్తులై ఉన్నారు. మీయందే తమ ప్రవృత్తులను కలిగినారు (83) వీరందరిని, నాతోపాటు నీ పరమైన స్థానానికి తీసుకువెళ్ళి ఘోరమైన పునర్జన్మ భయం లేకుండా చేయి. నీకు నమస్కారము (84) అట్లాగే అని ఆమె మాటను శివుడు అభినందించి ఆమెతోపాటు వారిని కూడా పరమపదానికి తీసుకెళ్ళాడు (85) పరాశరుని వచనము - నాట్య మండపిక కాలినప్పుడుముందు దూరంగా పారవేయబడ్డవారు అక్కడ మిగిలినవారు కుక్కుట మర్కటములు వారే (86) కాలంలో మరణించిన ఆమెనాట్య పుకోతి నీ కుమారుడైనాడు. ఈ కుక్కుటము మంత్రి కుమారుడు (87) రుద్రాక్ష ధారణ వల్ల కలిగిన పూర్వజన్మ పుణ్యంతో ఈ పిల్లలిద్దరు గొప్పకులంలో పుట్టారు. (88) శుద్ధ మాననులై పూర్వ అభ్యాసంవల్ల రుద్రాక్షలు ధరించారు. ఈ జన్మలో ఆ శివుని పూజించి ఆలోకానికి వెళ్తారు (89) ఈ పిల్లల ప్రవృత్తి ఇరి అని చెప్పాను. శివభక్తురాలైన ఆమె కథ ఇంకేమి అడగదలిచావు (90) అని స్కాంద మహావురాణమందు ఏకాశీతినహస్రసంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తరఖండమందు రుద్రాక్షమహిమ వర్ణన మనునది ఇరువదవ అధ్యాయము || 20 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters