Sri Scanda Mahapuranamu-3    Chapters   

పందొమ్మిదవ అధ్యాయము

మూ || సూత ఉవాచ -

ఏవంమహావ్రతం తస్యాః చరంత్యాగురుసన్నిధౌ | సంవత్సరో వ్యతీయాయ నియమా సక్తచేతనః || 1 ||

సంవత్స రాంతే సాబాలా తత్రైవ పితృమందిరే | చకారోద్యా వనం సమ్యక్‌ విప్రభోజనపూర్వకం || 2 ||

దత్వాచ దక్షిణాంతేభ్యో బ్రాహ్మణ బ్యో యథార్హతః | విసృజ్యతాన్నమస్కృత్యపితృభ్యామభినందితా || 3 ||

ఉపోషితా స్వయంతస్మిన్‌ దినేనియమమాశ్రితా | జజాప పరమం మంతరముపదిష్టం మహాత్మనా || 4||

అథప్రదోష సమయే ప్రాప్తే సంపూజ్య శంకరం | తస్మిన్‌ గృహాంతి కమఠే గురోస్తస్యచ సన్నిధౌ || 5 ||

జపార్చన రతా సాధ్వీధ్యాయంతీ పరమేశ్వరం | తస్మిన్‌ జాగరణ రాత్రౌ ఉపవిష్టా శివాంతికే || 6 ||

యుగ్మం - తస్యాంరాత్రౌతయాసార్థంసమునిర్జగదంబికా | జపధ్యానతపోభిశ్చతోషయామాపార్వతీం || 7 ||

తస్యాశ్చభక్త్యావ్రతభావితాయామునేస్తపోయోగ సమాధినాచ ||

తుష్టాభవానీ జగదేకమాతా ప్రాదుర్భభూవాకృత సాంద్రమూర్తిః || 8 ||

ప్రాదుర్భూతాయ దాగౌరీ తయోరగ్రేజగన్మయీ | అంధో7పితత్‌ క్షణాదేవమునిః ప్రాపదృశోర్ద్వయం || 9 ||

తాం వీక్ష్య జగతాంధాత్రీ మా విర్భూతాం పురః స్థితాం | నిపేతతుః తత్పదయోః సమునిః సాచకన్యకా || 10 ||

తౌభక్తి భావోచ్ఛ్వసి తామలాశయా వానందబాష్పోక్షిత సర్వగాత్రౌ |

ఉత్థవ్యదేవీ కృపయా పరిప్లుతా ప్రేవ్ణూ బభాషే మృతదువల్గు భాషీణీll 11ll

దేవ్యువాచ-

ప్రీతాస్మితే మునిశ్రేష్ఠ వత్సే ప్రీతాస్మితే 7నఘే l కింవాద ద్యామ్యభి మతం దేవానామపి దుర్లభం ll 12 ll

ముని రువాచ-

ఏషాతు శారదానామ కన్యాతు గతభర్తృకా l మయా ప్రతి శ్రుతం చాసై#్య తుష్టేన గత చక్షుషా ll 13 ll

సహభర్త్రా చిరంకాలం విహృత్యసుతముత్తమం l లభ##స్వేతిమయాప్రోక్త సత్యం కురు నమో7స్తుతే ll 14 ll

శ్రీదేవ్యువాచ-

ఏషా పూర్వభ##వే బాలా ద్రావిడస్య ద్విజన్మనః l ఆ సీద్ద్వితీయా దయితా భామినీనామవిశ్రుతా ll 11 15 ll

సా భర్తృప్రేయ సీనిత్యం రూపమాధుర్యపేశలా l భర్తారం పశమానిన్యే రూపపపశ్యాది కైతవైః ll 16 ll

అస్యాంచా సక్తహృదయః సవిప్రోమోహమంత్రితః l కదాచిదపి నైవాగాత్‌ జ్యేష్ఠ పత్నీం పతివ్రతాం ll 17 ll

అసభ్యాగమనాద్భర్తుః సానారీపుత్ర వర్జితా l సదాశోకేన సంతప్తా కాలేన నిధనం గతా ll 18 ll

అస్యాగృహ సమీవస్థోయః కశ్చిత్‌ బ్రాహ్మణోయువా l ఇమాం వీక్ష్యాథచార్వంగీం కామార్తఃకరమగ్రహీత్‌ ll 19 ll

అసయారోషతామ్రాక్ష్యాన విప్రస్తు నివారితః l ఇమాం స్మరన్దివానక్తం నిధనం ప్ర్పత్యపద్యత ll 20 ll

తా ll సుతులిట్లన్నారు - ఈ విధముగా గురువుల సన్నిధిలో అమె మహావ్రత మాచరిస్తుండగా నియమము యందు అసక్తమైన మనస్సు కల ఆమెకు సంవత్సర కాలం గడిచిపోయింది (1)సంవత్సరం చివర ఆ బాల అక్కడే పితృమందిరమందు విప్రభోజనపూర్వకముగా చక్కగా వ్రతోద్యాపన చేసింది (2) అ బ్రహ్మణులకు తగినట్లుగా దక్షిణలిచ్చి వారికి నమస్కరించి విడిచిపెట్టి పితరులు అభినందించగా (3) ఆ రోజు స్వయంగా ఉపవసించి నియమములనాశ్రయించి మహాత్ముడు ఉపదేశించిన ఉత్తమ మంత్రాన్ని జపంచేసింది. (4) ప్రదోష సమయం కాగా శంకరుని పూజించి, ఆ గృహాంతిక మఠమందు ఆ గురువు సన్నిధిలో (5) జప అర్చన వరురాలై అసాధ్వి పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆ జాగారమందు రాత్రిపూట శివుని సన్నిధిలో కూర్చున్నది. (6) ఆ రాత్రి ఆమెతో పాటుముని జగదంబికను జపధ్యాన తపస్సులతో సంతోషపెట్టాడు పార్వతిని. (7)వ్రత భావంతో నిండిన ఆమె భక్తి వల్ల మునియొక్క తపోయోగ సమాధి వల్ల పార్వతి సంతోషించి ఆ జగదేక మాత, తన రూపంతో ప్రత్యక్షమైంది(8) జగన్మయి ఐన పార్వతి వారి ఎదుట ప్రత్యక్షం కాగానే, అంధుడైన అమునికూడా అక్షణంలోనే కళ్ళను పొందాడు(9)ప్రత్యక్షమై ఎదురు ఉన్న ఆ జగద్ధాత్రిని చూచి ఆమె పాదములపై ఆ మని అకన్యక పడినారు. (10) భక్తి భావంతో నిండిన స్వచ్ఛమైన ఆశయంకల, ఆనందబాష్పాలతో తడిసిన నర్వశరీరంగల ఇ ఇద్దరిని లేపి అదేవి దయతో నిండినదై ప్రేమతో మృదువుగా చక్కని మాటకలదై ఇట్లా అంది (11) దేవి వచనము - ఓ మునిశ్రేష్ఠ నీపై సంతసించాను. ఓబాల! పుత్యాత్మురాల నీపై ఆనందించాను. దేవతలకు దుర్లభ##మైన అభిమతం నీకేమివ్వాలి (12)అనగా ముని వచనము- ఈమె శారద అనుకన్య భర్త చనిపోయాడు. కళ్ళు లేనినేను ఆనందించి ఈమెకు మాట ఇచ్చాను (13) భర్తతోపాటు చిరకాలము విహరించి, ఉత్తమ పుత్రుణ్ణి పొందు అని నేను చెప్పిన దానిని నిజం చేయి నీకు నమస్కారము అని అనగా (14)దేవి వచనము- ఈబాల పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణునకు రెండవ భార్యగా ఉండేది . భామిని అని ఈమె పేరు. (15) ఆమె ఎప్పుడూ భర్తకు ఇష్టమైంది. రూపమాధుర్యములతో మృదువైనది. రూపవశ్యాదులతో మోసంగా భర్తను స్వాదీన పరచుకుంది (16) ఈమె యందు అసక్తి గల హృదయం కలవాడై మోహబద్ధుడై ఆ బ్రాహ్మణుడు ఏప్పుడూ పతివ్రతయైన పెద్ద భార్య దగ్గరకు వెళ్ళేవాడు కాదు (17) భర్త రానందువల్ల ఆమెకు పిల్లలు కలుగలేదు. ఎప్పుడూ దుఃఖిస్తూ కొంత కాలానికి మరణించింది . (18)ఈమె ఇంటి సమీపమందుండే ఒక బ్రాహ్మణ యువకుడు ఈమెను అందమైన శరీరం కలదాన్ని చూచి కామర్తుడై ఈమె చేయి పట్టుకున్నాడు (19)ఈమె కోపంతో చూచి అతనిని నివారించింది . ఈమెనే రాత్రింబగళ్ళు స్మరిస్తూ మరణించాడు (20).

మూll ఏషాసమో హ్యభర్తారం జ్యేష్ఠపత్న్యం పరాజ్ముఖం l చకారతేనపా పేనభ##వేస్మిన్‌ విధవా7భవత్‌ ll 21 ll

యాః కుర్వంతి స్త్రియోలోకే జాయాపత్యోశ్య విప్రియం l తా సాంకౌమార వైధవ్యమేక వింశతి జన్మసు ll 22 ll

యదేత యాపూర్వ భ##వే మత్పూ జామహతీకృతా l తేన పుణ్యన తత్పావం నష్టం సర్వంతదైవహి ll 23 ll

యో విప్రో విరహార్తః సన్‌మృతః కామవిమోహితః lసో7స్యాః పాణి గ్రహంప కృత్వాభ##వేస్మిన్నిధనంగతః ll 24 ll

ప్రాగ్జన్మ సతిరేతస్యాః పాండ్య రాష్ట్రేషు సో7ధువా l జాతో విప్రవరః శ్రీమాన్‌ సదారః సవరిచ్ఛదః ll 25ll

తేన భర్త్రాప్రతినిశం సైషా ప్రేవ్ణూభి సంగాతా l స్వప్నేరతిసుఖం యాతు శ్రేష్ఠం జాగరణాదపి ll 26 ll

షష్ఠుత్తర త్రిశతయోజన దూరసంస్థో దేశాదితోద్విజపరః సచకామగత్యాl

ఏనాం వధూంప్రతినిశం మనసోభి రామాం స్వప్నేషు పశ్యతి చిరంరతి మాద ధానః ll 27 ll

సైషావైనన్న సంగత్యా పత్యుః ప్రతినిశంసతీ l కాలేన లప్స్యతే పుత్రం వేదవేదాంగ పారగం ll 28 ll

ఏతస్యాంతన యంజాతం ఆత్మనః చిరసంగమాత్‌ l సో7పి విప్రో7నిశం స్వప్నే ద్రక్ష్యతి ప్రేమభావినం ll 29 ll

అనయారాథితా పూర్వే భ##వే సాహం మహామునే l అసై#్యవ వరదానాయ ప్రాదుర్బూ తాస్మి సాంవ్రతం ll 30 ll

సూత ఉవాచ-

అథౌవాచ మదహాదేవీతాం బాలా ప్రతిసాదరం | అయివత్నేమహాభాగే శృణుమే పరమంవచః ||31 ||

యదాకదాపి భర్తారం క్వాపిదేశే పురాతనం | ద్రక్ష్యసిస్వప్న దృష్టం ప్రాక్‌ జ్ఞాన్య సేత్యం విచక్షణా || 32 ||

త్వాం ద్రక్ష్యతి సవిప్రో పి నునయాం స్వప్న లక్షణాం | తదా పరస్పరాలాపో యువయోః సంభవిష్యతి || 33||

తదాన్వతనయం భ##ద్రే తసై#్మ దేహి బహుశ్రుతం | ఫలమస్యవ్రత స్యాగ్ర్యం తన్య హస్తే సమర్పయ || 34 ||

తతః ప్రభృతి తసై#్యవ వశేతిష్ఠ సుమధ్యమే | యువయేర్ధైహికః సంగోమా భూత్స్యస్నరతాదృతే || 35 ||

కాలత్పం చత్వమానన్నే తస్మిన్‌ బ్రాహ్మణ సత్తమే | అగ్నిం ప్రవిశ్యతేనైన సహయాన్యసిమత్పదం || 36||

పుత్రస్తే భవితా సుభ్రు సర్వలోక మనోరమః | సంపదశ్చ భవిష్యంతి ప్రాస్యతే పరమం పదం || 37 ||

సూత ఉవాచ -

ఇత్యుక్త్వా జగన్మాతా దత్వాత సై#్య మనోరథం l తయోః సంవశ్యతో రేవక్షణనా దర్శనంగతా ll 38 ll

సాపి బాలా వరం లబ్ధ్వా పార్వత్యాః కరుణానిధే ః l అవాప పరమానందం పూజయా మాసతం గురుం ll 39 ll

తస్యాం రాత్య్రాం వ్యతీతాయాం సమునిర్లబ్ధలోచనః l తస్యాః పిత్రోశ్చ తత్పర్వం రహస్యాచష్ట ధర్మవిత్‌ ll 40 ll

అథనర్వాసు పామంత్య్ర శారదాంచ యశస్వినీం l విధాయానుగ్రహం తేషాం య¸° సై#్వర గతిర్మునిః ll 41 ll

తాll ఈమె భర్తను సమ్మెహింపచేసి, జ్యేష్ఠపత్ని నుండి భర్తను పరాజ్ముఖుని చేసినందుకు ఆ పాపంతో ఈ జన్మలో విధవ ఐంది(21) ఏస్త్రీలు లోకంలో భార్యా భర్తలకు అపకారం చేస్తారో వారికి ఇరువది ఒక్క జన్మలలో కౌమార వైధవ్యము లభిస్తుంది (22)పూర్వజన్మలో ఈమెనాకై గొప్ప పూజ చేసింది. ఆపుణ్యంవల్ల ఆ పాపమంతా అప్పుడే నష్టమైంది. (23)కామ మోహితుడై ఏవిప్రుడు విరహార్తుడై మరణించాడో అతడు ఈ జన్మలో ఈమెను వివాహమాడి మరణించాడు (24) ఈమె పూర్వజన్మ పతి పాండ్య రాష్ట్రంలో ఇప్పుడు విప్రవరుడై పుట్టాడు. శ్రీమాన్‌, భార్య పరిజనము కలవాడుగా ఉన్నాడు. (25)ఆ భర్తతో ప్రతిరాత్రి ఈమె ప్రేమగలదై స్వప్నమందు రతిసుఖాన్ని పొందని జాగరణ మందుకన్న అది శ్రేష్ఠము (26)ఇక్కడి నుండి మూడు వందల అరవై యోజనముల దూరమందలి దేశమందున్న ద్విజవరుడు కర్మగతితో ప్రతిరాత్రి మనస్సునకు నచ్చిన ఈ వధువును స్వప్నంలో చూస్తాడు. చాలసేపు రతిని కూరుస్తాడు (27)ఈమె స్వప్న కలయికతొ భర్తకు ప్రతిరాత్రి కన్పించి కొంతకాలానికి వేద వేదాంగ పారగుడైన పుత్రుణ్ణి కంటుంది . (28)తనుచాలా కాలంస్వప్న సంగమంవల్ల ఈమెయందు పుత్రుణ్ణి పొందుతాడు . అవిప్రుడు కూడా ఎల్ల కాలము ప్రేమ భావితుడైన అతనిని కలలోచూస్తాడు (29) పూర్వభవ మందు నేను ఈమెతో పూజనందాను ఓ మహాముని! ఇప్పుడు ఈమెకు వరం ఇచ్చేకొరకే వచ్చాను అనిఅంది. (30)సూతుని వచనము -మహాదేవి ఆ బాలతో సాదరంగా ఇట్లా అంది ఓ బలా! ఓమహాభాగె! నామంచి మాటలను విను (31)ఎప్పుడైనా నీ భర్తను ఏప్రదేశంలోనైనా చూస్తే ఇది వరకు కలలో చూసిన వానిని నీవు విచక్షణ కలిగి గుర్తిస్తావు(32) ఆతడు నిన్ను చూస్తాడు స్వప్న లక్షణములు గల సునయము గల నిన్ను చూశాక అప్పుడు మీకు పరస్పర సంభాషణ జరుగుతుంది (33) అప్పుడు బాగా పాండిత్యము గల ఆతని కొడుకును అతనికివ్వు ఓభ##ద్రే! ఈ వ్రతముయొక్క ఫలాన్ని శ్రేష్ఠమైన దానిని అతని హస్తమందుంచు (34)నాటి నుండి అతని అధీనమందే ఉండు ఓ సుమద్యమ! స్వప్నరతి తప్పమీకు దైహిక సమాగమము కలుగొద్దు (35)కాలం గడిచాక ఆ బ్రాహ్మణ సత్తముడు మరణించాక అగ్నిలొ ప్రవేశించి అతనితో పాటు నాస్థానానికి వస్తావు (36)నీకు కలిగే పుత్రుడు సర్వలోక మనోహరుడౌతాడు సంపదలు లభిస్తాయి. పరమ పదాన్ని పొందుతాడు (37)సూతుని వచనము- అని త్రిజగన్మాత పలికి ఆమె కోరికనిచ్చి వారు చూస్తుండగానే క్షణంలో కన్పించకుండా పోయింది (38) కరుణా నిధియైన పార్వతివల్ల అబాలవరాన్ని పొంది పరమానందాన్ని పొందింది. ఆ గురువును పూజించింది (39) ఆ రాత్రి గడిచాక ఆముని కళ్ళను పొంది అమె తలిదండ్రులకు అదంతా రహస్యంగా చెప్పాడు ఆధర్మవేది (40) ఇక అందరితో చెప్పి యశస్వినియైన శారదను వారిని అనుగ్రహించిముని స్వేచ్ఛగా వెళ్ళపోయాడు. (41)

మూll ఏవందినేషు గచ్ఛత్సుసాబాలాచ ప్రతిక్షణం l భర్తుః సమాగమంలేభే స్వప్నే సుఖవివర్థనం ll 42 ll

గౌర్యవర ప్రదానేన శారదా విశదవ్రతా l దధారగర్భం స్వప్నెపి భర్తుః సంగాను భావతః ll 43 ll

తాం శ్రుత్వాభర్తృ రమితాం శారదాం గర్భితీ సతీం సర్వేధిగితి ప్రోచుస్తాం జారిణీతి జగుర్జనాః ll 44 ll

సంపరేతస్య తద్భర్తుః యేజాతికులబాంధవాః తాం వార్తాందుః సహాంశ్రుత్వాయయుస్తత్పితృమందిరం ll 45 ll

అథసర్వే సమాయాతా గ్రామవృద్ధాశ్చ పండితా ః l సమాజం చక్రిరే తత్రకులవృద్దెః సమన్వితం ll 46 ll

అంతర్వత్నీం సమాహూయ శారదాం వినతాననాం l అతర్జయన్‌ సుసంక్రుద్ధాః కేచిదానన్‌ పరాజ్‌ముఖాః ll 47 ll

అయిజారిణి దుర్బుద్దేకి మేతత్తే విచేష్టితం అస్మత్కులే సుదుష్కీర్తిం కృతవత్యసి బాలిశే ll 48 ll

ఇతి సంతర్జయంతస్తే గ్రామవృద్ధామనీషిణః l సర్వే సంమంత్రయా మానుః కింకుర్మ ఇతిభాషిణః ll 49 ll

తత్రోచుః కేచ వృద్ధాస్తాం బాలాం ప్రతి వినిర్దయాః ఏషా పాపమతిర్బాలాకులద్వయవినాశినీ ll 50 ll

కృత్వాస్యాః కేశవపనం ఛిత్వా కర్ణౌచ నాసికాం l నిర్వాస్యతాం బహిర్గ్రామాత్‌ పరిత్యజ్య స్వగోత్రతః ll 51 ll

ఇతిసర్వే సమాలోచ్యతాం తథా కర్తుముద్యతాః l అథాంతరిక్షే సంభూతా శుశ్రువేవన గోచరా ll 52 ll

అనయానకృతం పాపం సచైవ కులదూషణం l వ్రత భంగోన చైతస్యాః సుచరిత్రే య మంగనా ll 53 ll

ఇతః పరమియం నారీ జారిణీతి వదంతియే l తేషాం దోష నిమూఢానాం సద్యోజిహ్వావిదీర్యతే ll 54 ll

ఇత్యంతరిక్షే జనితాం వాణీం శ్రుత్వా7శరీరిణీం సర్వే వ్రజహృముః తస్యాజననీజన కాదయః ll 55 ll

తతః ససంభ్రమాః సర్వేగ్రామవృద్ధాః సభాజనాః ముహూర్తం మౌనమూలంబ్య భీతస్తస్థురధోముఖాః ll 56 ll

తత్రకేచిద విశ్వస్తామిధ్యావాణీత్య వాదిషుః తేషాం జిహ్వా ద్విధా భిన్నా వవముస్తే కృమీన్‌ క్షణాత్‌ ll 57 ll

తతఃసంపూజయామానుఃతాంబాలాంజ్ఞాతిబాంధవాః బాంధవాశ్చస్త్రియోపృద్ధాఃశశంసుః సాధుసాధ్వితి ll 58 ll

ముముచుఃకేచిదానందబాష్పబిందూన్‌కులోత్తమాః lకులస్త్రియః ప్రముదితాః తాముద్దిశగ సమాశ్వసన్‌ ll 59 ll

అథతత్రా పరేప్రోచుః దేవోపదతి నానృతం l కథమేషా దధౌగర్భం శీలాన్న చలతి ధ్రువం ll 60 ll

తాll ఈ విధంగా రోజులు గడుస్తుండగా ఆ బాల ప్రతి క్షణము స్వప్నమందు, సుఖాన్ని పెంపొందించే భర్త సమాగమాన్ని పొందింది(42)విశదవ్రత ఆశారద గౌరివర ప్రదానంతో కలలో కూడా, భర్త సమాగమాన్నను భవించినందువల్ల గర్భం ధరించింది(43)భర్త లేకుండా గర్భిణియైన శారద అను సతినిగూర్చి విని అందరు ఛీ అని అన్నారు. జనులు ఆమె జారిణి అని అన్నారు(44) చనిపోయిన ఆమె భర్తయొక్క జాతికుల బాంధవులు ఎవరున్నారో వారు దుఃసహమైన ఆ వార్తను విని అమె తండ్రి ఇంటికి వచ్చారు. (45) ఇక గ్రామ వృద్దులు పండితులు అందరు వచ్చారు. కులవృద్ధులతో కూడిన సమాజాన్ని అక్కడ ఏర్పరచారు (46)తలవంచుకొన్న గర్భిణియైన అశారదను పిలిచి, చాలా కోపగించి భయపెట్టారు. కొందరామెను చూడటానికి ఇష్టపడలేదు. (47) ఓ జారిణి, దుర్భద్ది నీవు చేసిన ఈ పనేమిటి. మాకులానికి చాలా చెడ్డపేరును తెచ్చిపెట్టావు ఓ బాలిశె (48) అని వారు భయ పెడ్తువారు, బుద్ధిమంతులైన గ్రామవృద్ధులు అందరు ఏం చేద్దాం అని మాట్లాడుకుంటూ అలోచించసాగారు( 49) అక్కడ కొందరు వృద్ధులు అమెపై ఏమాత్రం దయలేకుండా ఇట్లన్నారు. ఇది పాపపుబుద్ధిది. బాల రెండుకులాలను నశింపచేసేది. (50)ఈమె వెంట్రుకలు కోరిగించు, ముక్కుచెవులుకోసి తన గోత్రం నుండి తీసేసి ఊరి బయటకు పంపండి (51)అని అంతా ఆలోచించి ఆమెను అట్లాగే చేద్దామనుకున్నారు. ఇంతలో అకాశంలో పుట్టిన, కనిపించని ఒక వాక్కు ఇట్లా వినిపించింది (52)ఈమె పాపం చేయలేదు. కులదూషణ చేయలేదీమె. ఈమె వ్రతభంగమూ కాలేదు .ఈమె మంచి చరితం గలది (53)ఇక ముందు ఈమెను ఎవరైనా జారిణీ అంటే దోషంతో మూఢులైన వాళ్ళ వాలుక వెంటనే చీలిపోతుంది (54) అని ఆకాశంలో పుట్టిన అశీరరవాణిని విని వారంతా ఆనందించారు. ఆమె తలిదండ్రులు కూడా (55)పిదప తొందరగా అందరు గ్రామవృద్ధులు సభా జనులు క్షణకాలం మౌనం వహించి భయపడి అధోముఖులై నిల్చున్నారు. (56) కొందరా మాటపై విశ్వాసం లేక ఇది అబద్ధపు మాట అని అన్నారు. వారి నాలుక రెండు వక్కలైంది. క్షణంలో వారు పురుగులను కక్కారు(57)ఇక జ్ఞాతి బాంధవులు ఆ బాలను పూజించసాగారు. బాంధవులు స్త్రీలు వృద్ధులు బాగు బాగని పొగిడారు (58)కొందరు కులోత్తములు అనంద బాష్పబిందువులను వదిలారు. కులస్త్రీలు ఆనందించి ఆమెను గూర్చి ఓదార్పుపొందారు (59) ఆక్కడ ఇతరులు కొందరిట్లన్నారు. దేవుడు అబద్ధమాడదు. శీలము నుండి ఈమె తప్పలేదు. నిజమె మరి ఈమె గర్భమెట్లా ధరించింది(60)

మా|| ఇతిసర్వాన్‌ సభ్యజనాన్‌ నంశయావిష్ట చేతన: | విలోక్యవృద్ధస్తత్రైకో సర్వజ్ఞో లోకతత్వనిత్‌ || 61 ||

మాయామయమిదంవిశ్వదృశ్యతే శ్రూయతే చయత్‌ | కింభావ్యం కిమభావ్యం వాసంసారే7స్మిన్‌క్షణాత్మకే || 62 ||

అని రూప్యమ భూతార్థం మాయయాజాయతేన్ఫుటం | ఈశ్వరస్యపశేమాయాతస్యకోవేదచేష్టితం ||63||

యూపకే తోశ్చ రాజర్షేః శుక్రం నివతితంజలే | సశుక్రంతజ్జలం పీత్వా వేశ్యాగర్భందధౌకిల || 64 ||

మనేర్వి భాండకస్యాపి శుక్రంపీత్వా నహాంభసా | హరిణీ గర్భిణీ భూత్వా ఋష్యశృంగమసూయత || 65 ||

నురాష్ట్రస్యత ధారాజ్ఞః కరంస్పృష్ట్యా మృగాంగనా | తత్‌ క్షణాత్‌ గర్భిణీ భూత్వామునింప్రసూత తాపనం || 66 ||

తథాసత్యవతీ నారీ శఫరీగర్భసంభవా | తథైవ మహిషీ గర్భో జాతశ్చ మహిషా నురః || 67 ||

తథాసంతి పునానార్యః కారుణ్యాత్‌ గర్భసభవాః | తథాహి వనుదేవేన రోహిణ్యాస్తనయో7భవత్‌ || 68 ||

దేవతానాం మహర్షీణాం శాపేనచ వరేణచ | అయుక్తమపియత్కర్మయుజ్యతే నాత్ర నంశయః || 69 ||

సాంబస్య జఠరాజ్ఞాతం మునలంమునిశావతః | యువనాశ్వస్యగర్భో7భూన్మునీనాం మంత్రగౌరవాత్‌ || 70 ||

నూనమేషాపి కల్యాణీ మహర్షేః పాదసేపనాత్‌ | మహావ్రతాను భావాచ్చ ధత్తే గర్భమనిందితా || 71 ||

అస్మిన్నర్థే రహస్యేనం సత్యం వృచ్ఛంతు యోషితః | తతోనివృత్త సందేహో భవిష్యతి మహాజనః || 72 ||

తతస్తద్వచనా దేవ తామవృచ్ఛంతు స్త్రియోమిధః | తాభ్యః శశం సతత్సర్వం సాస్వవృత్తం మహాద్భుతం || 73 ||

విజానంతఃతతస్సర్వే మానయిత్వాచతాంసతీం |మోదమానాఃప్రశంసంతఃప్రయయుఃస్వంస్వమాలయం || 74 ||

అథకాలేశుభే ప్రాప్తే శారదావిమలాశయా | అనూత తనయం చాలా బాలార్కసమతేజనం || 75 ||

సకుమారో మహోదారలక్షణః కమలేక్షణః | అవాప్యమహతీం విద్యాంచాల్య ఏవమహామతిః || 76 ||

అథోపనీతో గురుణా కాలే లోకమనోరమః | నశార దేయ ఏవేతి లోకే ఖ్యాతి మనాపహ || 77 ||

ఋగ్వేద మష్టమేపర్షే నవమే యజుషాం గణం | దశ##మే సామవేదం చలీం యాధ్యగమత్సుథీః || 78 ||

అథత్రిలోకమహితే సంప్రాప్తే శివపర్వణి | గోకర్ణం ప్రయయుః సర్వేజనాః సర్వనివాసినః || 79 ||

శారదా పిన్వపుత్రేణ గోకర్ణం ప్రయ¸°నతీ || 80 ||

తా || అని అందరు సభ్యజనులు సంశయావిష్ట మనస్కులు కాగా వారిని చూచి ఒక వృద్ధుడు సర్వజ్ఞుడు లోకతత్వమోరిగినవాడు (61) ఇట్లన్నాడు. ఈ లోకము మాయతో నిండినది, కనిపించేది వినిపించేదంతా ఏది జరుగుతుందో ఏది జరగదో క్షణాత్మకమైన ఈ సంసారంలో తెలియదు. (62) జరుగని దాని గురించి చెప్పలేము (జరుగదు అని) మాయవల్ల తప్పక జరుగుతుంది మాయ ఈశ్వరాధీనము. ఆతని చేష్టలు ఎవరికి తెలుసు (63) యూపకేతుపను రాజర్షి శుక్రము నీటిలో పడింది. శుక్రంతో కూడిన ఆ జలాన్ని తాగి వేశ్య గర్భం ధరించింది కదా. (64) విభాండక ముని శుక్రాన్ని నీటితో పాటు తాగి జింక గర్భం ధరించి ఋష్యశృంగుణ్ణి కన్నది. (65) సురాష్ట్రుడను రాజు చేతిని తాకి ఆడలేడి ఆ క్షణంలోనే గర్భం ధరించి మునిని, తాపనుని కన్నది (66) సత్యవతి అనే స్త్రీ చేపగర్భం నుండి జనించింది. మహిషాసురుడు బఱ్ట (మహిషీ)గర్భం నుండి జన్మించాడు (67) అట్లాగే ఇది వరలో స్త్రీలు కరుణవల్ల గర్భం ధరించిన వారున్నారు అట్లాగే వసుదేవుని వల్ల రోహిణికి పుత్రుడు కల్గాడు (68) దేవతల, మహార్షుల శాపంవల్ల తగని పని కూడా జరుగుతుంది. అనుమానంలేదు (69) మునిశాపం పల్లసాంబుని కడుపు నుండి రోకలి పుట్టింది. మునుల మంత్రాధిక్యంవల్ల యువనాశ్వునకు గర్భమైంది. (70) అట్లాగే ఈ కల్యాణి మహర్షి పాదసేవవల్ల, మహావ్రత ప్రభావంవ్ల, నిందింపబడకుండ గర్భాన్ని ధరించి ఉండవచ్చు. (71) ఈ విషయంలో రహస్యంగా ఈమెను స్త్రీలు నిజమేమిటో అడగండి. విదవ మహాజనుల సందేహం తీరిపోతుంది. (72) అనగా పిదప ఆ మాట ప్రకారం ఆడవాళ్ళంతా కలిసి ఆమె నడిగారు. ఆమె వారికి తన వృత్తాంతాన్నంతా మహాద్భుతమైన దానిని చెప్పింది (73) పిదప వారంతా తెలుసుకొని ఆమెను గౌరవించి ఆనందిస్తూ ప్రశంసిస్తూ తమ తమ ఇళ్ళకు వెళ్ళారు (74) శుభ##మైన కాలం రాగా విమలమైన ఆశయం గల శారద అ బాల బాల అర్కుని వంటి తేజస్సు గల పుత్రుని కన్నది (75) ఆతడు మహా ఉదార లక్షణములవాడుకమలముల వంటి చూపులవాడు. గొప్పబుద్ధి కలవాడై బాల్యమందే గొప్ప విద్యను పొందాడు (76) సకాలంలో ఆలోకమనోరముడు గురువు ద్వారా ఉపనయనాన్ని పొంది ఆతడు శారదేయుడు అని లోకంలో ప్రసిద్ధిని పొందాడు (77) ఎనిమిదవ ఏట ఋగ్వేదాన్ని నవమ మందు యజుర్వేదాన్ని దశమమందు సామవేదాన్ని అవలీలగా అభ్యసించాడు, ఆ బుద్ధిమంతుడు (78) త్రిలోక ప్రసిద్ధమైన శివపర్వం రాగా జనులంతా ఉన్న వాళ్ళందరూ గోకర్ణానికి వెళ్ళారు (79) శారద కూడా తన పుత్రుని తోపాటు గోకర్ణానికి వెళ్ళింది (80)

మూ || తత్రాపశ్యత్‌ సమాయాతంసదాస్వస్నేషు లక్షితం | సూర్వజన్మని భర్తారం ద్విజబంధుజనావృతం || 81 ||

తందృష్ట్యా ప్రేమ నిర్విణ్ణా పులకాంకిత విగ్రహా | నిరుద్ధ బాష్ప ప్రనరాతస్థౌతన్న్యస్తలోచనా || 82 ||

నచవిప్రో7పితాం దృష్ట్వా రూపలక్షణ లక్షితాం | స్వప్నే సదాభుజ్యమానాం ఆత్మనోరతి దాయినీం || 83 ||

తం కుమారమపి స్వప్నే దృష్ట్వా చాత్మశరీరజం | విలోక్య విన్మయా విష్టః తదంతి కముపాయ¸° || 84 ||

భ##ద్రేత్వంప్రష్టు మిచ్ఛామి యత్కించి న్మనసిస్థితం | ఇతిప్రతమమాభాష్యరహఃస్థానంనినాయతం || 85 ||

కాత్వం కథయవామోరు కన్యభార్యాసినువ్రతే | కోదేశః కస్యవాపుత్రీకిన్నామేత్య బ్రవీచ్చతాం || 86 ||

ఇతితేన సమావృష్టాసానారీబాష్పలోచనా | వ్యాజహరాత్మనోవృత్తం బాల్యే వైధవ్యకారణం || 87 ||

పునఃప ప్రచ్ఛతాంబాలాం పుత్రఃకన్యాయముత్తమః | కధంధృతోవాజఠరే బాలో7యం చంద్రసన్నిభః || 88 ||

శారదోవాచ -

ఏషమేతనయః స్వామిన్‌ సర్వవిద్యావిశారదః | శారదేయ ఇతిప్రోక్తో మమనామ్నైవ కల్పితః || 89 ||

ఇతి తస్యాః వచః శ్రుత్వా విహస్య బ్రాహ్మణోత్తమః | ప్రోవాచ కష్టాత్కష్టంహిచరితం తవభామిని || 90 ||

పాణి గ్రహణమాత్రంతే కృత్వా భర్తామృతః కిల | కథంచాయం నుతో జాతః తస్య కారణముచ్యతాం || 191 ||

ఇతి తేనోదితాం వాణీం ఆకర్ణ్యాతీ వలజ్జితా | క్షణం చాశ్రుముఖీ భూత్వా ధైర్యాదిత్థమభాషత || 92 ||

శారదోవాచ -

తదలం పరిహాక్త్యాత్వం మాంవేత్సిమహామతే | త్వామహంవేద్మిచార్థే7స్మిన్‌ ప్రమాణం మనాపయోః || 93 ||

ఇత్యుక్త్వాసర్వమావేద్య దేవ్యాదత్తం పరాదికం | ప్రతస్యార్థంకుమారంతం దదౌతసై#్మ ధృతప్రతం || 94 ||

సో7పి ప్రముదితో నిప్రః కుమారం ప్రతిగృహ్యతం | పిత్రోరనుమతేనైవతాం నినాయ నిజాలయం || 95 ||

సాపిస్థిత్వా బహూన్‌ మాసాన్‌ తస్యవిప్రన్యమందిరే | తస్మిన్‌ కాలవంశప్రాప్తే ప్రవిశ్యాగ్నిం తమన్వగాత్‌ || 96 ||

తతస్తౌ దంపతీ భూత్వా విమానం దివ్యమాస్థితౌ | దివ్యభోగనమాయుక్తౌ జగ్మతుః శివమందిరం || 97 ||

ఇత్యేతత్‌ పుణ్యమాఖ్యానం మానమనువర్ణితం | వఠతాం శృణ్యతాం సమ్యక్‌ భుక్తిముక్తి ఫలప్రదం || 98 ||

ఆయురారోగ్య సంపత్తి ధనధాన్య వివర్థనం | స్త్రీణాం మంగల సౌభాగ్య సంతాన సుఖ సాధనం || 99 ||

ఏతన్మహాఖ్యానమమౌఘనాశనం గౌరీమహేశవ్రత పుణ్యకీర్తనం |

భక్త్యా సకృద్యః శృణుయాచ్చ కీర్తయేత్‌ భుక్త్వాస భోగాన్‌ పదమే తిశాశ్వతం || 100 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తర ఖండే శారదాఖ్యాన వర్ణనం నామ ఏకోన వింశో7ధ్యాయః | 19 ||

తా || అక్కడకు తనకు ఎప్పుడూ కలలో కన్పించిన వానిని ఎదురుగా చూచింది. పూర్వజన్మలో ఆతడు భర్త ద్విజులు బంధువులు చుట్టూ ఉన్నారు (81) అతనిని చూచి ప్రేమ వివశ##యై, శరీరం నిండా పులకలు రాగా, కన్నీళ్ళను ఆవుకొని, ఆతనినే చూస్తూ నిలబడింది (82) ఆతడు కూడా ఆమెను చూచి, రూపలక్షణములు కలదానిని స్వప్నంలో తనచే ఎప్పుడు అనుభవింపబడుతూ తనకు రతిని ఇచ్చే ఆమెను చూచాడు (83) ఆకుమారుని కూడా తన నుండి పుట్టిన వానిని కలలో చూచి, ఇక్కడ చూచి విస్మయంతో నిండినవాడై అతని దగ్గరకు వచ్చాడు (84) ఓ భ##ద్రే! నా మనసులో వున్నదానిని ఏదో ఒకదానిని నిన్ను అడుగదలచాను. అని మొదలు పలికి ఆమెను చాటుకు తీసుకెళ్ళాడు. (85) నీవెవరో చెప్పు. ఓ వామోరు! సువ్రత! నీవెవరి భార్యవు. నీదేశ##మేది. ఎవరి పుత్రికవు. నీ పేరేమిటి అని ఆమెనడిగాడు. (86) అని అడుగగా ఆమె కన్నీళ్ళు నింపుకుటూ తన వృత్తాంతాన్ని బాల్యంలో కల్గిన వైధవ్య కారణమును తెల్పింది (87) తిరిగి ఆమెను అడిగాడు. ఈ ఉత్తముడైన బాలుడు ఎవరి వాడు అని వీణ్ణి గర్భంలో ఎట్లా ధరించావు. వీడు చంద్రునిలా ఉన్నాడు (88) అనగా శారద వచనము - ఓస్వామి! వీడు నాకుమారుడు. సర్వ విద్యలలో విశారదుడు శారదేయుడు అని అంటారు. నా పేరుతోనే ఏర్పరచారు (89) అనే ఆమె మాటను విని నవ్వి ఆ బ్రాహ్మణోత్తముడు ఇట్లన్నాడు. నీ చరిత్ర మిక్కిలి కష్టమైనది, ఓ భామిని ! (90) నిన్ను వివాహం మాత్రం చేసుకొని నీ భర్త చనిపోయాడు. గదా, ఈ పిల్లవాడు ఎట్లా పుట్టాడు. దానికి కారణాన్ని చెప్పండి (91) అనగా ఆతడన్న మాటను విని చాలా సిగ్గుపడి చాలా సిగ్గుపది కొంచంసేపు కన్నీళ్ళు పెట్టుకొని ధైర్యంగా ఇట్లా పలికింది (92) శారదవచనము- ఈ పరిహాసంచాలు. ఓ మహామతి! నీవు నన్నెరుగుదువు. నేను నిన్నెరుగుదును. ఈవిషయంలో మన మనస్సులే సాక్షి (93) అని పలికిదేవి ఇచ్చిన వరాదులు అంతా చెప్పి వ్రతమునకు భాగమైన ఆకుమారుని ధ్రుతవ్రతుని (వ్రతథారి) ఆమె ఆతనికిచ్చింది (94) ఆ బ్రాహ్మణుడు ఆనందపడి ఆకుమారుని తీసుకొన్నాడు. తండ్రి ఆజ్ఞతో ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళాడు (95) ఆమె కూడా అనేక మాసాలు ఆ విప్రుని ఇంటిలో ఉండి ఆతడు చనిపోయాక అగ్ని ప్రవేశం చేసి ఆతనిని అనుసరించింది (96) పిదప వారు దంపతులై దివ్య విమానాన్ని ఎక్కారు. దివ్యభోగములు కల వారై శివమందిరానికి వెళ్ళారు (97) అని ఈపుణ్యమైన కథను నేను చెప్పాను, చదివే వారికి వినే వారికి చక్కగా భుక్తిముక్తి ఫలములనిచ్చేది. (98) ఆయున్సు, ఆరోగ్యము, సంపత్తి ధనము ధాన్యము వీటిని పెంచేది. స్త్రీలకు మంగళసౌభాగ్య సంతాన సుఖములనిచ్చేది (99) ఈ మహా ఆ ఖ్యానము పాపరాశిని నశింపచేసేది. గౌరీ మహెశుల వ్రతపుణ్యమునుకీర్తనము భక్తితో ఒక్కసారి ఎవరు చేసినా విన్నా కీర్తించినా అతడు భోగముల అనుభవించి శాశ్వత పదమును పొందుతాడు (100) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తర ఖండమందు శారద ఆఖ్యాన వర్ణనమనునది పందొమ్మిదవ అధ్యాయము || 19 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters