Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునెనిమిదవ అధ్యాయము

మూ సూత ఉవాచ -

అథాహంసంప్ర వక్ష్యామి సర్వధర్మోత్తమోత్తమ | ఉమామహెశ్వరం నామవ్రతం సర్వార్థ సిద్ధిధం || 1 ||

అనర్త సంభవః కశ్చిన్నామ్నావేదరథోద్విజః | కలత్రపుత్ర సంపన్నో విద్వాసుత్తమవంశజః || 2 ||

తసై#్యకంవర్త మానస్య బ్రాహ్మణస్య గృహాశ్రయే | బభూవ శారదానామ కన్యాకమలలోచనా || 3 ||

తాంరూపలక్షణోపేతాం బాలాంద్వాదశహాయనాం | యయాచే పద్మనాభాభ్యో మృతదారశ్చ సద్విజః || 4 ||

మహాధనస్యశాంతస్య సదారాజ సఖస్యచ | యాజ్ఞా భంగ భయాత్తస్యతాం కన్యాం ప్రదదౌషితా || 5 ||

మధ్యందినే కృతోద్వాజహః సవిప్రః శ్వశురాలయే | సంధ్యాముపాసితుం సాయంసరస్తటముపాయ¸° || 6 ||

ఉపాస్య సంధ్యాం విధివత్‌ ప్రత్యాగచ్ఛత్త మోవృతే | మార్గేదష్టో భుజంగేన మమార నిజకర్మణా || 7 ||

తస్మిన్‌ మృతే కృతోద్వాహె సహసాతస్య బాంధవాః | చుక్రుశుః శోక సంతప్తౌ శ్వశురావస్య కన్యకా || 8 ||

నిర్‌హృత్యతం బంధుజనాజగ్ముః స్వం స్వం నివేశనం | శారదా ప్రాప్త వైధవ్యాపితురేవాలయే స్థితా || 9 ||

భూతాచ్ఛా దనభోజ్యేన భర్త్రా విరహితాసతీ | నినాయక తిచిన్మాసాన్‌ సాబాలా పితృమందిరే || 10 ||

ఏకదానై ధ్రువోనామ కశ్చిద్వృద్ధతరోమునిః | అంధః శిష్యకర గ్రాహీ తన్మందిరము పాయ¸° || 11 ||

తస్మిన్‌ వృద్ధే గృహం ప్రాప్తే క్వాపియాతేషుబంధుషు|సాక్షాదివాత్మనో దైవం సామాలాసముపాగమత్‌ || 12 ||

స్వాగతం తేమహాభాగ పీఠేస్మిన్నుపవిశ్యతాం | నమస్తే మున ఇనాథాయ ప్రియంతే కరవాణికిం || 13 ||

ఇత్యుక్త్వా భక్తి మాస్థాయ కృత్వా పాదావనే జనం | వీజయిత్వా పరిశ్రాంతంతంమునింపర్యతోషయత్‌ || 14 ||

శ్రాంతం పీఠే సమావేశ్య కృత్వా భ్యంగం స్వపాణినా | కృతస్నానంచ విధివత్‌ కృతదేవార్చనం మునిం || 15 ||

సుఖాననోవ విష్టంతం ధూపమాల్యానులేవనైః | అరచయిత్వా వరాన్నే నభోజయామాన సాదరం || 16 ||

తా || సూతులిట్లన్నారు - ఇప్పుడు నేన సర్వధర్మములలో ఉత్తమోతమమైన దానిని చెప్తున్నాను. ఉమా మహెశ్వరుని ఈ వ్రతంపేరు. ఇది సర్వ అర్థములను సిద్ధింపచేసేది (1) ఆనర్త దేశంలో పుట్టినవాడు వేదరధుడు అని ద్విజుడు. కలత్రము పుత్రులు కలవాడు. విద్వాంసుడు. ఉత్తమ వంశజాతుడు (2) ఈ విధముగా గృహ స్థాశ్రమంలో ఉన్న ఆ బ్రాహ్మణునకు కమలముల వంటి లోచనములు గల కన్య శారద అనుపేరు గలది ఉండేది (3) రూప లక్షణములు గల పన్నెండు సంవత్సరాల వయస్సు కల ఆ బాలను, భార్య చనిపోయిన ఒక బ్రాహ్మణుడు పద్మనాభుడనే వాడు యాచించాడు (4) మహాధనవంతుడు శాంతుడు, ఎప్పుడు రాజునకు స్నేహితుడు ఐన ఆతడడిగితే, ఇవ్వకపోతే యాచన భంగమౌతుందనే భయంతో, తండ్రి ఆ కన్యను ఆతనికిచ్చాడు. (5) మధ్యాహ్నకాలమందు మామ ఇంట్లో వివాహమాడిన ఆ విప్రుడు సాయంకాలము సంధ్య చేయటానికి సరస్సు తీరానికి వెళ్ళాడు (6) శాస్త్ర విధిగా సంధ్యన ఉపాసించి ఆ చీకట్లో తిరిగి వచ్చాడు దారిలో పాము కరువగా తన కర్మవశాత్తు మరణించాడు ఆతడు (7) పెళ్ళైన ఆతడు మరణించగానే త్వరగా ఆతని బంధువులు అత్తమామలు, కన్యక అందరు శోక సంతప్తులై ఏడ్చారు. (8) ఆతనిని వదలి ఆతని బంధుజనులంతా తమతమ ఇళ్ళకు వెళ్ళారు శారద విధవరాలై తండ్రి ఇంటిలోనే ఉండింది (9) భూతములతో అచ్ఛాదిమైన భోజనంతో (వాలిన) భర్త లేకుండా కొన్ని మాసములు ఆబాల తండ్రి ఇంట్లో గడిపింది (10) ఒక రోజునై ధ్రువుడను పేరుగల చాలా వృద్ధుడైన మునిగ్రుడ్డివాడు శిష్యుల చేయిపట్టుకొని వారి ఇంటికి వచ్చాడు (11) ఆ వృద్ధుడు ఇంటికి రాగా బంధువులు ఎక్కడికోపోగా తన దైవమే సాక్షాత్తుగా వచ్చినట్లు ఆ బాలతలచింది(12) ఓ మహాభాగ! నీకు స్వాగతము. ఈ పీఠమందు కూర్చోండి. ఓ మునినాథ నీకు నమస్కారము. మీకు నేను ఏమి పరియమాచరించాలి (13) అని పలికి భక్తితో పాదములుకడిగి, అలసిన అతనికి విసనకర్రతో విసిరి ఆ ముని నిసంతోష పరిచింది (14) అలసినవానిని పీఠమందు కూర్చోబెట్టి తన చేతితో అభ్యంగం చేసి(చేయించి) స్నానం చేసినవిధి ప్రకారము దేవార్చన చేసిన మునిని (15) సుఖంగా ఆసనమందు కూర్చున్న వానిని ఆతనిని ధూమాల్య అనులేపనములతో పూజించి శ్రేష్ఠమైన అన్నములతో ఆదర పూర్వకంగా భుజింపచేసింది (16).

మూ || భుక్త్వాచ సమ్యక్‌ శనకైః తృప్తశ్చానందనిర్భరః | చకారాంధమునిస్తసై#్య సుప్రీతః పరమాశిషం || 17 ||

విహృత్య భర్త్రా సహసా చతేన లబ్థ్వా సుతం సర్వగుణౖర్వరిష్ఠం |

కీర్తించలోకేమహతీమవాస్యప్రసాదయోగ్యాభవదేవతానాం || 18 ||

ఇత్యభివ్యాహృతంతేన ముని నాగత చక్షువా | నిశమ్య విస్మితా బాలాప్రత్యువాచ కృతాంజలిః || 19 ||

బ్రహ్మన్‌ త్వద్వచనం సత్యం కదాచిన్న మృషాభ##వేత్‌ |దదేతస్మంద భాగ్యాయాః కథమేతత్ఫలిష్యతి || 20 ||

శిలాగ్ర్యామివ సద్వృష్టిః శునక్యామివసత్ర్కియా | విఫలామంద భాగ్యాయాం ఆశీః బ్రహ్మవిదామపి || 21 ||

సైషాహం విధవా బ్రహ్మన్‌ దుష్కర్మ ఫలభాగినీ | త్వదాశీర్వచనస్యాస్య కథంయాస్యామి పాత్రతాం || 22 ||

ముని రువాచ -

త్వామనా లక్ష్యమత్ర్పోక్తం అంధేనాపి మయా7ధునా | తదేతత్పాధయిష్యామి కురుమచ్ఛాసనం శుభే || 23 ||

ఉమా మహెశ్వరం నామవ్రతం యదిచరిష్యసి | తేన వ్రతాసుభావేన సద్యః శ్రేయో7సు భోక్ష్యసే || 24 ||

శారదోవాచ -

త్వయోపదిష్టం యత్నేన చరిష్యామ్య పిదుశ్చరం | తద్ర్వ తంబ్రూహిమే బ్రహ్మన్‌ విధానం వదవిస్తరాత్‌ || 25 ||

మునిరువాచ -

చైత్రేవా మార్గశీర్షే వాశుక్లపక్షే శుభేదినే | వ్రతారం భం ప్రకుర్వీత యథావత్‌ గుర్వనుజ్ఞయా || 26 ||

అష్టమ్యాంచ చతుర్దశ్యాం ఉభయోరపి పర్వణోః | సంకల్పం విధివత్‌ కృత్వా ప్రాతఃస్నానంసమాచరేత్‌ || 27 ||

సంతర్ప్య పితృ దేవాదీన్‌ గత్వాస్వ భవనం ప్రతి | మండపం రచయేద్దివ్యం వితానాద్యైర లంకృతం || 28 ||

ఫలపల్లవ పుష్ఫాద్యైః తోరణౖశ్చ సమన్వితం | పంచవర్ణైశ్చ తస్మధ్యేరజోభిః పద్మముద్ధరేత్‌ || 29 ||

చతుర్దశదలై ర్బాహ్యె ద్వా వింశద్భస్తదంతరే | తదంతరే షోడశభిః అష్టభిశ్చతదంతరే || 30 ||

ఏవంపద్మం సముద్ధృత్య పంచవర్ణెర్మనోరమం | చతురస్రం తతః కుర్యాత్‌ అంతర్వర్తులముత్తమం || 31 ||

వ్రీహితండుల రాశించ తస్మధ్యేచ సకూర్చకం | కూర్చో పరిసు సంస్థాప్య కలశం వారి పూరితం || 32 ||

తా || మెల్లగా చక్కగా భుజించి తృప్తుడై ఆనందనిర్భరుడై ఆనందించి ఆ అంధముని ఆమెకు ఆశీర్వచనం చేశాడు (17) త్వరగా భర్తతో విహరించి, సర్వ గుణములతో వరిష్టుడైన కొడుకును ఆతనితో పొంది,లోకంలో గొప్పకీర్తిని పొంది దేవతలకు ప్రసాద (అనుగ్రహ) యోగ్యురాలవు కమ్ము (18) అని పలికినాడ ఆముని కళ్ళు లేనివాడు, ఆ మాటలు విని బాలవిస్మితయై చేతులు జోడించి ఇట్లా అంది (19) ఓ బ్రహ్మ నీ వచనము నిజము కావాలి ఎప్పుడూ అబద్ధంకారాదు. మంద భాగ్యురాలైన నాకీ విషయం ఎట్లా ఫలిస్తుంది. (20) వర్షం పర్వతంమీద పడ్డట్టు, సత్కారమును కుక్కకు చేసినట్లు బ్రహ్మవిదుల ఆశీర్వాదముకూడా మందభాగ్యురాలైన నావిషయంలో వ్యర్థమే (21) ఓ బ్రహ్మన్‌! ఈ నేను విధవను దుష్కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాను. మీ ఈ ఆశీర్వాదమునకునే నెట్లాయోగ్యురాలనౌతాను అనగా (22) ముని వచనము - నిన్ను చూడకుండా, గుడ్డివాణ్ణౖనా నేను ఇప్పుడు ఏం చెప్పానో దాన్ని సాధిస్తాను. ఓ శుభురాల! నా ఆజ్ఞను పాలించు (23) నీవు ఉమా మహెశ్వరము అనే వ్రతాన్ని ఆచరిస్తే ఆవ్రత మాహాత్మ్యంతో వెంటనే శ్రేయస్సును పొందుతావు అనగా (24) శారద వచనము - ఆచరించ వీలు కానిదైనా మీరు ఉపదేశించిన దానిని ప్రయత్న పూర్వకముగా ఆచరిస్తాను. ఆ వ్రతమేమిటో నాకు చెప్పండి. ఓ బ్రహ్మన్‌! విస్తారంగా దాని విధానాన్ని తెలుపండి (25) ముని ఇట్లన్నాడు - చైత్ర మందుకాని మార్గ శీర్షమందు కాని శుక్లపక్షంలో శుభదినమందు గురువు అనుజ్ఞతో చెప్పిన విధంగా వ్రతారంభం చేయాలి (26) రెండు పర్వములందలి అష్టమి యందు మరి చతుర్దశి యందు విధి ప్రకారము సంకల్పం చేసి ప్రాతః స్నానము చేయాలి (27) పితృదేవతలను తృప్తిపరచి తన భవనానికి వెళ్ళి చాందిని మొదలగు వానితో అలంకృతమైన దివ్యమైన మంటపానని ఏర్పరచాలి (28) ఫలములు, చిగురుటాకులు పుష్పాదులు తోరణములు అమర్చాలి. దాని మధ్యలో ఐదురంగులతో ముగ్గుతో పద్మం వేయాలి (29) బయట పదునాల్గు దళాలు, ఇరవై రెండు దళాలు దాని మధ్యలో ఐదురంగులతో ముగ్గుతో పద్మం చేయాలి (29) బయట పదునాల్గు దళాలు, ఇరవై రెండు దళాలు దానిమధ్య ఎనిమిది దళాలు కలిగిన (30) దాన్ని గీసి ఐదు రంగులతో మనోరమంగా తీర్చి పిదప చతురస్రం చేయాలి. లోపల గుండ్రంగా ఉండటము శ్రేయస్కరము (31) ధాన్యము, బియ్యము దాని మధ్యలో ఆపై కూర్చ ఉంచాలి. కూర్చపై నీటితో నిండిన కలశము నుంచాలి (32).

మూ || కలశోపరివిన్యస్య వస్త్రం వర్ణ సమన్వితం | తస్య పరిష్టాత్‌ సౌవర్ణ్యౌ ప్రతిమే శివయోః శుభే

నిధాయపూజయేద్భక్త్యా యధావి భవవిస్తరం || 33 ||

పంచామృతైస్తు సంస్నాస్య తథాశుద్ధోదకేనచ | రుద్రైకా శకం జప్త్వా పంచాక్షర శతాష్టకం || 34 ||

అభిమంత్ర్యపునః స్థాప్య పీఠమధ్యేతథార్చయేత్‌ | స్వయం శుద్ధా సనాసీనో ధౌత శుక్లంబరః సుధీః || 35 ||

పీఠమా మంత్ర్య మంత్రేణ ప్రాణాయామాన్‌ సమాచరేత్‌ | సంకల్ప ప్రవదేత్తత్రశివాగ్రేవిహితాంజలిః || 36 ||

యాని పాపాని ఘోరాణి జన్మాంతర శ##తేషుమే | తేషాం సర్వ వినాశాయ శివపూజాం సమారభే || 37 ||

సౌభాగ్య విజయారోగ్య ధర్మైశ్వర్యాభివృద్ధయే | స్వర్గాపవర్గసిద్ధ్యర్థం కరిష్యే శివపూజనం || 38 ||

ఇతి సంకల్ప ముచ్చార్య యధావత్సు సమాహితః | అంగన్యాసంతతః కృత్వాధయాయేదీశంచపార్వతీ || 39 ||

కుందేందు ధవలాకారం నాగాభరణ భూషితం | వరదా భయ హస్తంచ బిభ్రాణం పరశుం మృగం || 40 ||

సూర్యకోటి ప్రతీకాశం జగదానంద కారణం | జాహ్నవీజల సంపర్కాత్‌ దీర్ఘ పింగజటాధరం || 41 ||

ఉరగేంద్ర ఫణోద్భూత మహాముకుట మండితం | శీతాంశుఖండ విలసత్‌ కోటీరాంగద భూషణం || 42 ||

ఉన్మీలత్ఫాలనయనం తథా సూర్యేందులోచనం | నీలకంఠం చతుర్బాహుం గజేంద్రాజిన వాసనం || 43 ||

రత్నసింహాసనా రూఢం నాగా భరణ భూషితం | దేవీం చదివ్య వసనాం బాలసూర్యాయుత ద్యుతిం || 44 ||

బాలవేషాం చతస్వంగీం బాలశీతాం శుశేఖరాం | పాశాంకుశవరా భీతించి భ్రతీంచ, చతుర్భుజాం || 45 ||

ప్రసాద సుముఖీమంబా లీలారసవిహారిణీం | లసత్కుర వకాశోక పున్నాగ నవపంచకైః || 46 ||

కృతావతం సాముత్ఫుల్ల మల్లికోత్కలితాలకాం | కాంచీకలాప పర్యస్త జఘనా భోగశాలినీం || 47 ||

ఉదారకింకిణీ శ్రేణీ నూపురాఢ్య పదద్వయాం | గండమండల సంసక్తరత్న కుండల శోభితాం || 48 ||

తా || రంగు వస్త్రాన్ని కలశముపై ఉంచాలి. దానిపై శివపార్వతుల విశుభ##మైన బంగారు ప్రతిమలను ఉంచాలి. ఉంచి ఐశ్వర్యం ఉన్నంతలో భక్తితో పూజించాలి (33) పంచామృతముతో స్నానం చేయించి ఏకాదశరుద్రాన్ని జపించి, ఎనిమిది వందలసార్లు పంచాక్షరిని జపించి (34) అభిమంత్రించి తిరిగి ఉంచి పీఠమధ్య మందుంచి పూజించాలి. స్వయంగా శుద్ధాసన మందు కూర్చొని ఉతికిన తెల్లని వస్త్రముల బుద్ధిమంతుడు ధరించి (35) మంత్రంతో పీఠమును ఆ మంత్రించి ప్రాణాయా మమాచరించాలి. సంకల్పించి అక్కడ శివుని ఎదుట చేతులు జోడించి, ఇట్లా పలకాలి (36) ఘోరమైన పాపములను జన్మాంతర శతములందు నేను చేసిన వానిని అన్నింటిని నశింపచేసే కొరకు శివపూజను ఆరంభిస్తున్నాను (37) సౌభాగ్య విజయ, ఆరోగ్య ధర్మఐశ్వర్యముల అభివృద్ధి కొరకు స్వర్గ అపవర్గముల సిద్ధికొరకు శివపూజను చేస్తున్నాను (38) అని సంకల్పాన్ని ఉచ్చరించి విధిగా చక్కగా పిదప అంగన్యాసం చేసి ఈశుని పార్వతిని ధ్యానించాలి. (39) కుందపూలు చంద్రుడు వానివలె తెల్లని వానిని, నాగా భరణ భూషితుని వరద అభయహస్తుని, పరశువు మృగమును ధరించిన వానిని (40) కోటి సూర్యులతో సమానమైన వానిని జగత్తునకు ఆనందకారణమైన వానిని, గంగా జలస్పర్శతో దీర్ఘమైన పింగళ జడలు ధరించిన వానిని (41) ఉరగేంద్రుని ఫణములనుండి కల్గిన మహాముకుటముతో అలంకరింపబడిన వానిని శీతాంశు ఖండములతో వెలిగే కోటీర అంగద భూషణముల వానిని (42) వికసించిన ఫాలనేత్రం కలవానిని, అట్లాగే సూర్యచంద్రులు నేత్రములు గలవానిని, నీలకంఠుని నాల్గు చేతులవానిని, ఏనుగ చర్మ ధారిని (వస్త్రుని) (43) రత్న సింహాసన మందుకూర్చున్న వానిని, నాగా భరణ భూషితుని ధ్యానించి, దేవిని దివ్య వస్త్రముల దానిని, పదివేల బాల సూర్యుని కాంతి గలదానిని (44) బాల వేషను, సూక్ష్మాంగిని, బాల చంద్రుని తలలోగల దానిని, పాశఅంకుశ, వర అభీతులను ధరించినదానిని,నాల్గు చేతులు దానిని (45) అనుగ్రహమునకు తగిన సుముఖము కలదానిని అంబను లీలారసమందు విహరించే దానిని, కురవక, అశోక, పున్నాగ,నవ చంపకములతో వెలిగిపోతూ (46) వానిని తలలో గల దానిని, వికసించిన మల్లికలతో కూడిన ముంగురులు కలదానిని, కాంచీ కలాపముతో కూడిన జఘనా భోగముతో ప్రకాశించే దానిని (47) ఉదారమైన కింకిణీ శ్రేణుల గల నూపురములతో కూడిన పాదముల జంట గల దానిని, గండ మండలమందు తగిలిన రత్నకుండలములతో వెలిగే దానిని (48).

మూ || బింబాధరాసు రక్తాంశు లసద్దశనకుట్మలాం | మహార్హరత్నగ్రైవేయతార హారవిరాజితాం || 49 ||

నవమాణిక్యరుచిర కంకణాం గదముద్రికాం | రక్తాంశుక పరాధీనాం రత్న మాల్యాను లేవనాం || 50 ||

ఉద్యత్పీనకు చద్వంద్వనిందితాం భోజకుడ్మలాం | లీలాలోలాసితా పాంగీం భక్తానుగ్రహదాయినీం || 51 ||

ఏవంధ్యాత్వాతుహృత్పద్మే జగతః పితరౌశివౌ | జప్త్వాత దాత్మకంమంత్రం తదంతే బహిరర్చయేత్‌ || 52 ||

ఆ వాహ్యప్రతి మాయుగ్మే కల్పయేదానాదికం | అర్ఘ్యంచ దద్యాత్‌ శివయోఃమంత్రణానేనమంత్రవిత్‌ || 53 ||

నమస్తే పార్వతీనాథ త్రైలోక్య వరదర్షభ | త్య్రం బకేశ మహాదేవ గృహాణార్ఘ్యం నమో7స్తుతే || 54 ||

నమస్తే దేవదేవేశి ప్రసన్న భయహారిణి | అంబికే వరదే దేవి గృహాణార్ఘ్యం శివప్రియే || 55 ||

ఇతిత్రి వారముచ్చార్య దద్యాదర్ఘ్యం సమాహితః | గంథపుష్పాక్షతాన్‌ సమ్యక్‌ దూపదీపాన్‌ప్రకల్పయేత్‌ || 56 ||

నైవేద్యం పాయసాన్నేన ఘృతాక్తం పరికల్పయేత్‌ | జుహుయాన్మూలమంత్రేణ హవిరష్టోత్తర శతం || 57 ||

తత ఉద్వాన్యనైవేద్యం ధూపనీరాజనాదికం | కృత్వానివేద్యతాంబూలం నమస్కుర్యాత్సమాహితః || 58 ||

అధాభ్యర్చ్యో పచారేణభోజయే ద్విప్రదంపతీ || 59 ||

ఏవం సాయంతనీం పూజాం కృత్వా విప్రాను మోదితః | భుంజీత వాగ్యతో రాత్రౌహ విష్యంక్షీరభావితం || 60 ||

ఏవం సంవత్సరం కుర్యాద్ర్వతం వక్షద్వయేబుధః | తతః సంవత్సరే పూర్ణేవ్రతో ద్యాపసమాచరేత్‌ || 61 ||

శతరుద్రాభి జప్తేన స్నానయే త్ర్పతిమే జలైః - ఆగమోక్తేన మంత్రేణ సంపూజ్య గిరాజాశివౌ || 62 ||

నవస్త్రంన సువర్ణంచ కలశం ప్రతిమాన్వితం | దత్వాచార్యాయ మహతే సదాచార రతాయచ

బ్రాహ్మణాన్‌ భోజయేద్భక్తా యథాశక్త్యాభి పూజ్యచ || 63 ||

దద్యాచ్చ దక్షిణాం తేభ్యో గోహిరణ్యాం బరాదికం | భుంజీత తదనుజ్ఞాతః సహెష్ట జన బంధుభిః || 64 ||

ఏవంయఃకురుతే భక్త్యా వ్రతం త్రైలోక్య విశ్రుతం త్రిః సప్తకులముద్ధృత్య భుక్త్వాభోగాన్‌ యేథేప్సితాన్‌ || 65 ||

తా || దొండపండు వంటి పెదవి యొక్క ఎర్రని కాంతితో వెలిగే దంతముల మొగ్గలు గలదాని, గొప్ప వైయోగ్యమైన రత్నముల కంఠా భరణము తారహారములు వానితో వెలిగే దానిని (49) నవమాణిక్యముల వంటి అందమైన కంకణములు అంగధముద్రికలు కలదానిని రక్త వస్త్రము ధరించిన దానిని, రత్నమాలలుమై పూతలు కలదానిని (50) ఉబికియున్న బలిసిన ఉరద్వంద్వములతో తిరిస్కరింపబడిన తామర మొగ్గలు గలదానిని, విలాసంగా కదులుతున్న నల్లని కనుచూపులు దానిని, భక్తులపై అనుగ్రహం చూపేదానిని (51) ఇట్లా (ఇద్దరిని) హృత్పద్మమందు జగత్తునకు పితరులైన శివపార్వతులను ధ్యానించి, శివపార్వత్యాత్మకమైన మంత్రాన్ని జపించి ఆ పిదప బయటి పూజ చేయాలి (52) రెండు ప్రతిమలను ఆవాహనచేసి ఆసనాదులు కల్పించాలి. మంత్రమెరిగినవారు ఈ మంత్రంతో శివపార్వతులకు అర్ఘ్యమివ్వాలి (53) పార్వతీనాథ నమనస్సులు నీకు త్రైలోక్యములకు వరమిచ్చేవాడ, త్ర్యం బక ఈశ, మహాదేవ అర్ఘ్యాన్ని స్వీకరించు. నీకు నమస్కారము (54) ఓదేవదేవేశి! ప్రపన్నుల భయహారిణి! నీకు నమస్కారము. ఓ అంబిక! వరదే! దేవి! శివప్రియ! అర్ఘమును స్వీకరించు. (55) అని మూడుసార్లు ఉచ్చరించి చక్కగా అర్ఘ్యమివ్వాలి. అక్షతలు గంధము పుష్పములు, ధూప, దీపములను చక్కగా కల్పించాలి (56) పాయ సాన్నము, ఘృతం కలిసింది నైవేద్యంగా పెట్టాలి. మూల మంత్రంతో హవిస్సును వేస్తూ నూట ఎనిమిదిసార్లు హోమం చేయాలి (57) పిదప నైవేద్యాన్ని తీసివేసి ధూప నీరాజనాదుల ఏర్పరచి తాంబూల నివేదన చేసి చక్కగా నమస్కారం చేయాలి (58) ఇక ఉపచారములతో పూజించి విప్రదంపతులకు భోజనం పెట్టాలి (59) ఇట్లా సాయంకాల పూజకూడా చేసి విప్రుల అనుజ్ఞ పొంది, మాట్లాడకుండా పాలతో కూడిన హవిష్యమును రాత్రి భోంచేయాలి. (60) ఇట్లా సంవత్సర కాలం వ్రతం చేయాలి, బుధుడు రెండు పక్షములందు చేయాలి. పిదప సంవత్సరం నిండాక వ్రతోద్యాపన ఆచరించాలి (61) శతరుద్ర జపంతో కూడిన జలంతో ఆ విగ్రహాలకు స్నానం చేయించాలి. ఆగమోక్త మంత్రంతో పార్వతి శివులను పూజించి (62) వస్త్రములు, సువర్ణము, కలశము, ప్రతిమ వీటన్నిటిని సదాచారం గలిగిన మంచి ఆచార్యునకు ఇచ్చి, బ్రాహ్మణులను యథాశక్తిగా పూజించి భక్తితో భోజనం పెట్టాలి (63) వారికి దక్షిణనివ్వాలి, గోవులు బంగారము, వస్త్రములు మొదలగునవి. వారి అనుజ్ఞనంది, ఇష్టజన, బంధువులతో కూడి భుజించాలి (64) ఇట్లా భక్తితో త్రైలోక్య ప్రసిద్ధమైన ఈవ్రతాన్ని ఎవరు చేస్తారో, ఇరువది ఒక్క కులము వారిని ఉద్దరించి, భోగములను ఇష్టమైన వాటిని అనుభవించి (65).

మూ || ఇంద్రాదిలోక పాలానాం స్థానేషు రమతేధ్రువం | బ్రహ్‌ మలోకే చరమతే విష్ణులోకేచ శాశ్వతే || 66 ||

శివలోక మధ ప్రాప్య తత్ర కల్పశతం పునః భుక్త్వా భోగాన్‌ సువిపులాన్‌ శివయేవ ప్రపద్యతే || 67 ||

మహావ్రత మిదం ప్రోక్తం త్వమపిశ్రద్ధ యాచర | అత్యంత దుర్లభం వాపి లప్స్యసేచ మనోరధం || 68 ||

ఇత్యాదిష్టామునీంద్రేణ సాబాలాముదితా భృశం | ప్రత్యగ్రహీత్‌ సువిశ్రబ్ధా తద్వాక్యంసుమనోహరం || 69 ||

అథతస్యాః సమాయాతాః పితృమాతృ సహోదరాః | తంమునిం సుఖమాసీనం దదృశుః కృతభోజనం || 70 ||

సహసాగత్యతే సర్వే సమశ్చ క్రుర్వహాత్మనే | ప్రసీదనః ప్రసీదేతి గృణంతః పర్య పూజయన్‌ || 71 ||

శ్రుత్వాచతే తయా సాధ్వ్యా పూజితంపరమంమునిం|అనుగ్రహంవ్రతంతసై#్యశ్రుత్వాహర్షంపరంయయుః || 72 ||

తేకృతాం జలయః సర్వేతమూచుః మునిపుంగవం || 73 ||

అధ్యధన్యావయం సర్వేత వాగమన మాత్రతః | పావితం నః కులం సర్వం గృహంచ సఫలీకృతం || 74 ||

ఇయంచ శారదానామ కన్యావైధవ్యమాగతా | కేనాపికర్మ యోగేన దుర్విలంఘ్యేన భూయసా || 75 ||

సైషాద్యతవపాదాబ్జం ప్రపన్నాశరణం సతీ | ఇమాం సముద్ధరాసహ్యాత్‌ సుఘోరాద్దుఃఖ సాగరాత్‌ || 76 ||

త్వయాపితావ దత్రైవ స్థాతవ్యంనో గృహాంతికే | అన్మద్గృహమఠే7వ్యస్మిన్‌ స్నానపూజా జపోచితే || 77 ||

ఏషాబాలాపిభగవాన్‌ కుర్వంతీ త్వత్పదార్బనం | వ్రతంత్వత్పన్నిధానేన చరిష్యతి మహామునే || 78 ||

యావత్సమాప్తి మాయాతి వ్రతమస్యాస్త్వదంతికే | ఉషిత్వాతావదత్రైవ కృతార్థాన్‌ కురునోగురో || 79 ||

ఏవమభ్యర్థితః సర్వైః తస్యాభ్రాతృజనాదిభిః | తథేతి సమునిశ్రేష్ఠః తత్రోవాసమఠుశుభే || 80 ||

సాపితే నోపదిష్టేన మార్గేణ గిరిజాశివౌ | అర్చయంతీ వ్రతం సమ్యక్‌ చచార విమలాసతీ || 81 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తర ఖండే ఉమా మహెశ్వర వ్రతాచరణంనామ అష్టాదశో7ధ్యాయః || 18 ||

తా || ఇంద్రాది లోకపాలుర స్థానములందు ఆనందిస్తాడు యధార్థము. బ్రహ్మలోకమందు శాశ్వతమైన విష్ణులోకమందు ఆనందిస్తాడు (66) ఆపై శివలోకం చేరి అక్కడ తిరిగి నూరుకల్పముల పర్యంతము విస్తారంగా భోగములను అనుభవించి శివుని చేరుతాడు (67) దీనిని మహావ్రతమని అన్నారు.నీవు కూడా శ్రద్ధగాదీన్ని ఆచరించు. మనోరధము అత్యంత దుర్లభ##మైనా నెరవేరుతుంది. (68) అని మునీంద్రుడు ఆదేశించగా ఆ బాల చాలా ఆనందించి సుమనోహరమైన ఆ మాటను అలా విశ్వాసంతో స్వీకరించింది (69) ఇక వచ్చిన ఆమె పితృమాతృ సహోదరులు సుఖంగా కూర్చున్న భోజనం చేసిన ఆ మునిని చూచారు (70) ఆ మహాత్మునకు, వారంతా, త్వరగా వచ్చి నమస్కారం చేశారు. అనుగ్రహించండి. మాపై అనుగ్రహించండి అని పలుకుతూ ఆతనిని పూజించారు (71) ఆ సాధ్వి ఆ మునిని పూజించిందని విని, ఆమెపై అనుగ్రహంగా వ్రతం గూర్చి చెప్పారని విని చాలా ఆనందించారు. (72) వారంతా చేతులు జోడించి ఆ ముని పుంగవునితో ఇట్లన్నారు (73) మీ ఆగమన మాత్రంచేతమేమంతా ఈ వేళ ధన్యులమైనాము. మా కులమంతా పవిత్రమైంది. మా గృహం సఫలమైంది (74) ఈమె శారద అనేకన్య వైధవ్యాన్నిపొందింది. అధికమైనదాట శక్యం కాని ఏదో కర్మయోగం వల్ల ఇట్లా ఐంది. (75) ఆ ఈమె మీపాదాబ్జములపై శరణు వేడింది. అసహ్యమైన సుఘోరమైన దుఃఖసాగరం నుండి ఈమెను ఉద్ధరించండి. (76) మీరు కూడా మా గృహ సమీపమందు ఇక్కడే ఉండండి. మా గృహమఠమందు ఈ స్నానపూజ జపములకు తగిన చోట ఉండండి. (77) ఈ బాలకూడా మీ పాదార్చన చేస్తూ మీ సన్నిధి యందే వ్రతమాచరిస్తుంది ఓ మహాముని! (78) సమాప్తి చెందాక, మీ సమీప మందు వ్రతం అయ్యాక మీరు ఇక్కడే ఉండి మమ్మల్ని కృతార్థులను చేయండి, ఓగురు! (79) ఇట్లా అందరు ప్రార్థించగా ఆమె భ్రాతలు మొదలగు వారు ప్రార్థించగా అట్లాగే అని ఆముని శ్రేష్ఠుడు ఆ శుభ##మైన మఠంలో ఉన్నాడు (80) ఆమె కూడా ఆతడు చెప్పిన మార్గంలో పార్వతి శివులను పూజిస్తూ విమలంగా ఉంటూ చక్కగా వ్రతం ఆచరించింది. (81) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు మూడవదైన బ్రహ్మోత్తర ఖండమందు ఉమా మహెశ్వర వ్రతాచరణ మనునది పదునెనిమిదవ అధ్యాయము || 18 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters