Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునైదవ అధ్యాయము

మూ || నూత ఉవాచ -

ఋషభస్వాను భావోయం వర్ణితః శివయోగినః | అథాన్యస్యాపి వక్ష్యామి ప్రభావం శివయోగినః || 1 ||

భస్మనశ్చాపి మహాత్మ్యం వర్ణయామి సమానతః | కృతకృత్యా భవిష్యంతి యచ్ర్ఛుత్వా పాపినోజనాః || 2 ||

అస్త్యేకో వామదేవాఖ్యం శివయోగీ మహాతపాః నిర్ధ్వంద్వో నిర్గుణః శాంతో నిః సంగః సమదర్శనః || 3 ||

అత్మారామోజిత క్రోధో గృహదార విపర్ణిత ః | అతర్కిత గతిర్మౌనీ సంతుష్టో నిష్పరి గ్రహః || 4 ||

భస్మోద్ధూలిత సర్వాంగో జటామండిలమండితః | పల్కలాజిన సంవీతో భిక్షామాత్ర పరిగ్రహః || 5 ||

న ఏకదాచరన్‌ లోకే సర్వానుగ్రహతత్పరః | క్రౌంచారణ్యం మహా ఘోరం ప్రవివేశయ దృచ్ఛయా || 6 ||

తస్మిన్నిర్మనుజే7రణ్య తిష్ఠత్యే కో7తి భిషణః | క్షుత్తుషా కలితో నిత్యం యః కశ్చిత్‌ బ్రహ్మరాక్షసః || 7 ||

తంప్రవిష్టం శివాత్మానం సదృష్ట్యా బ్రహ్మరాక్షసః | అభిదుద్రవ వేగేన జగ్థుం క్షుత్పరిపీడితః || 8 ||

వ్యాత్తాన నం మహాకాయం భీమదంష్ట్రం భయానకం | తమాయాంత మభిప్రేక్ష్యయోగీశోనచాలనః || 9 ||

అథాభిద్రుత్య తరసా సఘోరో వనగోచరః | ధోర్భ్యాం నిష్పీడ్య జగ్రాహ నిష్కంవం శివయోగినం || 10 ||

తదంగ స్పర్శనాదేవ సద్యో విధ్వస్తకిల్బిషః | సబ్రహ్మరాక్షసో ఘోరో విషణ్ణ ః స్మృతి మాయ¸° || 11 ||

యథాచింతామణింస్పృష్ట్యాలోహంకాంచనతాంప్రజేత్‌ | యథాంజంబూనదీంప్రాప్యమృత్తికాస్వర్ణతాంప్రజేత్‌ || 12 ||

యథామానసమభ్యేత్యవాయసాయాంతిహంసతాం | యథామృతం సకృత్పీత్వానరోదేవత్వమాప్నుయాత్‌ || 13 ||

తథైవహి మహాత్మానో దర్శన సర్పనాదిభిః | సద్యఃపునంత్యఘోపేతాన్‌ సత్సంగో దుర్లభోహ్యతః || 14 ||

యఃపూర్వం క్షుత్పిపాసార్తో ఘోరాత్మావిసినేచరః | ససద్యః తృప్తిమాయాతః పూర్ణానందోబభూవహ || 15 ||

తద్గాత్రా లగ్నసిత భస్మ కణాను విద్ధః సద్యో విధూత ఘన పాపతమః స్వభావః |

సంప్రాప్త పూర్వ భవ సంస్కృతి రుగ్రకార్యస్తత్పాద పద్మయుగలే ప్రణతోబభాషే || 16 ||

రాక్షస ఉవాచ -

ప్రసీదమే మహోగిన్‌ ప్రసీద కరుణానిధే | ప్రసీద భవతప్తానాం అనందామృత వారిదే 17

తా|| సూతుని వచనము - శియోగియైన ఋషభుని అనుభవము వర్ణించును. మరో శియోగి యొక్క ప్రభావాన్ని కూడా చెపుతాను (1) భస్మము యొక్క మాహాత్య్మాన్ని సూక్షంగా వర్ణిస్తాను. పాపులైన జనులు దానిని విని కృతకృత్యుతౌతారు. (2) మహాతపస్సంపన్నుడైన వాసుదేవుడను పేరుగల శియోగి ఒకరున్నారు. నిర్ద్వంద్వుడు,నిర్గుణుడు, శాంతుడు, నిస్పంగుడు, సమదర్శనుడు (3) ఆత్మయందు ఆనందించేవాడు, జితక్రోధుడు, గృహము దారలేనివాడు. ఆలోచించకుండా వెళ్ళేవాడు ( ఇబ్బందులు లెక్కించడు) మౌని సంతుష్ఠుడు, దానంపట్టడు (4) శరీరం నిండా భస్మం గలవాడు, జటామండలం గలవాడు. వల్కల అజినములు కలవాడు, భిక్షను మాత్రమే గ్రహించేవాడు. (5) అతడొకసారి లోకంలో తిరగుతూ అందరిని అనుగ్రహింపదలచి మమాఘోరమైన క్రౌంచారణ్యాన్ని అనుకోకుండా ప్రవేశించాడు. (6)అజనంలేని అడవిలో మిక్కిలి భయంకరముగా ఆకలి దప్పికలతో బాధపడే ఒక బ్రహ్మరాక్షసుడు ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడు (7) వచ్చిన ఆ శివాత్ముని ఆ బ్రహ్మరాక్షసుడు చూచి ఆకలితో పీడింపబడి వేగంగా, చంపటానికి అనుసరించాడు. (8) మహాకాయుడు నోరు తెరిచిన వాడు భీమ దంష్ట్రుడు, భయానకుడు వస్తున్న వాణ్ణిచూచి యోగీశుడు కదలలేదు. (9) ఘోరుడైన రాక్షసుడు వేగంగా పరుగెత్తిచేతులతోబంధించి, కదలిక లేని శియోగిని పట్టుకున్నాడు. (10) అతని శరీర స్పర్శతోనే వెంటనే అతని పాపాలన్నీ పోయి ఆ బ్రహ్మరాక్షసుడు ఘోరంగా విషణ్ణుడైపూర్వజన్మ స్కృతి నందాడు (11) చింతామణి స్పర్శతో లోహము బంగారమైనట్లుగా, జంభూనదిని పొందిమట్టి బంగారమైనట్లు (12) మానస సరస్సును చేరి కాకులు హంసలైనట్లు , అమృతాన్ని ఒక సారి త్రాగి నరుడు దేవత్వమందినట్లు (13)గా, మహాత్ములు దర్శన స్పర్శనాదుల వల్ల పాపాత్ములను పవిత్రులను చేస్తారు. అందువల్లనే సత్పంగము దుర్లభ##మైంది. (14) పూర్వము క్షుత్పిపాసారుడైనవాడు, ఘోరాత్ముడు, అడవిసంచారి, వాడు వెంటనే తృప్తినంది పూర్ణానందుడైనాడు. (15) అయోగి శరీరమందలి తెల్లని భస్మకణములతోస్పర్శ కలిగి వెంటనే ఘనమైనపాపపుచీకట్లు తొలగిపోగా, పూర్వ జన్మస్మృతిని పొంది, ఆ రాక్షసుడు, ఆ యోగి పాద పద్మములకు నమస్కరించి ట్లన్నాడు (16)రాక్షసుని వచనము - ఓ మహాయోగి ! నన్నను గ్రహించండి. ఓ కరుణానిధి, అనుగ్రహించండి, భవతప్తులైన వారికి, ఆనందమనే అమృతవారిధి అనుగ్రహించండి. (17)

మూ || క్వాహం పాపమతిర్ఘోరః సర్వప్రాణి భయంకరః |క్వతే మహాఘభావన్య దర్శసంకరుణాత్మన ః 18

ఉద్థరోద్ధరమాంఘోరే పతితం దుఃఖ సాగరే | తప సన్నిధి మాత్రేణ మహానందో7భివర్ధతే 19

వాసుదేవ ఉవాచ -

కస్త్వం పనేచరో ఘోరో రాక్షసో7త్ర కిమాస్థితః | కథమేతాం మహాఘోరాం కష్టాంగతి మవాప్తవాన్‌ 20

రాక్షస ఉవాచ-

రాక్షసో 7హమితః పూర్వం పంచ వింశతిమేభ##వే | గోప్తా యువజన రాష్ట్రస్య దుర్జయోనామ వీర్యవాన్‌ 21

సో7హందురాత్మాపాపీయాన్‌ సై#్వరచారీ మదోత్కటః | దండధారీ దురాచారః ప్రచండోనిర్‌ ఘృణః ఖలః 22

యువబహుకలంతో7 పికామసక్తో7 జితేంద్రియః | ఇమాంపాపీయసీం చేష్టాంపునరేగకాంగతో 7స్మ్యహం 23

ప్రత్యహంనూతనామన్యాం నారీంభోక్తు మనాః సదా | అహృతాః సర్వదేశేభ్యోనార్యోభృత్త్యేర్మదాజ్ఞయా 24

భుక్త్వాభుక్త్వా పరిత్యక్తామేకామేకాం దినేదినే | అంతర్‌గృహెషు సంస్థాప్య పునరన్యాః స్త్రీయోధృతాః 25

ఏవం స్వరాష్ట్రాత్పర రాష్ట్రతశ్చదేశాకరగ్రామపుర ప్రజేభ్యః |

అహృత్యనార్యోరమితా దినే దినే భుక్తాపునః కాపిన భుజ్యతేమయా 26

అథాన్యైశ్చన భుజ్యంతే మయా భుక్తాస్తథాస్త్రియః | అంతర్గృహేషునిహితాః శోచం తేచదివానిశం 27

బ్రహ్మవిట్‌క్షత్రశూద్రాణాం దాన్యర్యోమయాహాతాః |మమరాజ్యేస్థితావిప్రాఃసహదారైః ప్రదుద్రువుః 28

సభర్తృకాశ్చ కన్యశ్చవిధవాశ్చరజస్వలాః అహృత్య నార్యోరమితా మయా కామాతాత్మనా 29

త్రిశతం ద్విజనారీణాం రాజస్త్రీణాం చతుః శతం | షట్‌ శతం వైశ్యనారీణాం సహస్రం శూద్రయోషితాం || 30 ||

శతం చండాలనారీణాం పులిందీనాం సహస్రకం | శైలూక్షీణాం పంచశతం రజకీనాం చతుఃశతం || 31 ||

అసంఖ్యా వారముఖ్యాశ్చ మయాభుక్తా దురాత్మనా | తథాపి మయికామస్యన తృప్తిః సమాజాయత || 32 ||

ఏవందుర్విషయాసక్తంమత్తం పానరతంసదా | ¸°వనేపి మహారోగా వివిశుః యక్ష్మకాదయః || 33 ||

రోగార్దితో7నపత్యశ్చ శత్రుభిశ్చాపి పీడితః | త్యక్తో మాత్యైశ్చ భృత్యైశ్చమృతో7హం స్వేనకర్మణా || 34 ||

తా || పాపమతిని, ఘోరమైనవాణ్ణి, సర్వ ప్రాణులకు భయం కల్గించేవాణ్ణి అట్టి నేనెక్కడ. కరుణాత్ములైన మీలాంటి మహానుభావుల దర్శనమెక్కడ (18) ఘోరమైన దుఃఖ సాగర మందు పడిన నన్ను ఉద్థరించు, ఉద్ధరించు. మీ సన్నిధిలో ఉంటే చాలు ఎంతో ఆనందం పెరుగుతుంది (19) అనగా వామదేవుని వచనము - వనేచరుడు ఘోరమైన రాక్షసుడవు నీవెవరవు. ఇక్కడెందుకున్నావు. ఈ మనోహరమైన కష్టమైన గతిని ఎల్లా పొందావు. (20) అనగా, రాక్షసుని వచనము - నేను రాక్షసుణ్ణి. కాని ఇంతకు మునుపు ఇరువది ఐదవ జన్మలో యవన రాష్ట్రమునకు రక్షకుణ్ణి. పరాక్రమవంతుణ్ణి దుర్జయుడని పేరుగలవాణ్ణి (21) ఆ నేను దురాత్ముణ్ణి. పాపీయుణ్ణి, స్వేచ్ఛగా తిరిగేవాణ్ణి. మదోత్కటుణ్ణి. దండధారిని , దురాచారుణ్ణి. ప్రచండుణ్ణి దయాహీనుణ్ణి. ఖలుడను (22) యువకుణ్ణి. అనేకమంది భార్యలున్నా కామా సక్తుణ్ణి జితేంద్రియుణ్ణి కాను. ఇట్టి పాపీయమైన చేష్టగల మరొకరిని పొందాను (23) ప్రతిరోజు ఇతరమైన కొత్త స్త్రీని అనుభవించే మనస్సు గలవాణ్ణి ఎప్పుడూ. సర్వ దేశముల నుండి, నా ఆజ్ఞతో భృత్యులు ఆడవాళ్ళను తెచ్చేవారు (24) అనుభవించి, అనుభవించి వదలి వారిని ఒక్కొక్కరిని ప్రతిరోజు అంతఃపురమందుంచి, పిదప ఇతర స్త్రీలను చేరేవాణ్ణి.(25) ఈ విధముగా నా రాష్ట్రము, పర రాష్ట్రము దేశములు గ్రామ పురములు వీటన్నింటి నుండి స్త్రీలను తెప్పించి ప్రతిరోజు రమించేవాణ్ణి ఒకసారి అనుభవించిన దానిని రెండమారు అనుభవించే వాడిని కాదు (26) నేనను భవించిన స్త్రీలను మరొకడెవ్వరూ అనుభవించే వారు కాదు. అంతఃపురంలో ఉండి రాత్రింబగళ్ళు ఏడ్చువాళ్ళ (27) బ్రహ్మవిట్‌ క్షత్రి యశూద్రుల స్త్రీలను నేనెప్పుడు హరించానో అప్పుడు నా రాజ్యమందున్న బ్రాహ్మణులు తమ భార్యలతో పాటు పరుగెత్తి పోయారు (28) భర్తలు కలవారు, కన్యలు, విధవలు, రజస్వలలు వీళ్ళందరిని రప్పించి ఆ స్త్రీలను కామహతుడనై రమించాను (29) బ్రాహ్మణ స్త్రీలు మూడువందలు, నాలుగు వందలు రాజస్త్రీలు, ఆరువందలు వైశ్యస్త్రీలు, శూద్రస్త్రీలు వేయిమంది (30) నూరుగురు చండాల స్త్రీలు, బోయజాతి వాళ్ళు వేయిమంది, నాట్యకత్తెలు ఐదువందలు, చాకలి వారు నాలుగు వందలు (31) వార స్త్రీలు లెక్కలేనంత మంది ఇంతమందిని దురాత్ముడైన నేను అనుభవించాను. ఐనా నాకు కామం అంటే తృప్తి కలుగలేదు. (32) ఈ విధముగా దుర్విషయా సక్తుడనై మత్తుడనై, ఎప్పుడూ పానరతుడనైన నన్ను ¸°వ్వనంలోనే రాజ యక్ష్మాది రోగములు ఆశ్రయించాయి. (33) రోగాలతో బాధపడుతూ, సంతాన హీనుడనై శత్రువులు కూడా పీడించగా అమాత్యులు,భృత్యులు విడిచి పెట్టిపోగా నా కర్మవల్ల నేను చనిపోయాను (34).

మూ || ఆయుర్వి సత్యయ శోవివర్థతే భాగ్యంక్షయం యాత్యతి దుర్గతిం ప్రజేత్‌ |

స్వర్గాచ్చ్యవంతేపితరః పురాతనా ధర్మస్య పేతస్య సరస్య నిశ్చితం || 35 ||

అధాహం కింకరైః యామ్యైఃనీతోవైవస్వతాలయం | తతో7 హంనరకేఘోరేవర్షాణాంఅయుతత్రయం || 36 ||

తత్రాహం నరకే ఘోరే తత్కుండే వినిపాతితః | రేత పిబన్‌ పీడ్యమానోన్య వసంయమకింకరైః || 37 ||

తతః పాపానే శేషేణ పిశాచోనిర్జనేవనే | సహస్ర శిశ్నః సంజాతో నిత్యం క్షుత్‌ తృషయాకులః || 38 ||

పైశాచీంగతి మాశ్రిత్య నీతందివ్యం శరచ్ఛతం | ద్వితీయేహం భ##వేజాతో వ్యాఘ్రః ప్రాణి భయంకరః || 39 ||

తృతీయే7జగరో ఘోరశ్చతుర్దేహం భ##వేవృకః | పంచమే విడ్వరాహశ్చ షష్ఠే7హం కృకలాలసః || 40 ||

సప్తమే7హం సారమేయః నృగాలశ్చాష్టమేభ##వే | నవమే గవయో భీమో మృగో7హం దశ##మే భ##వే || 41 ||

ఏకాదశే మర్కటశ్చ గృధ్రో7హం ద్వాదశే భ##వే | త్రయో దశే7హం సకులోవాయునశ్చ చతుర్దశే || 42 ||

అచ్ఛభల్లం పంచదశే షోడశేవన కుక్కుటః | గర్దభో7హం సప్త దశేమార్జారోష్టా దశేభ##వే || 43 ||

ఏకోన వింశే మండూకః కూర్మో వింశతిమే భ##వే | ఏకవింశే భ##వే మత్స్యో ద్వావింశే మూషకో7భవం || 44 ||

ఉలూకోహంత్రయోవింశేచతుర్వింశేవనద్విపః | పంచవింశేభ##వే చాస్మిన్‌ జాతోహం బ్రహ్మరాక్షసః || 45 ||

క్షుత్సరీతో నిరాహారోవ సామ్యత్రమహావనే

ఇదానీ మాగతం దృష్ట్వా భవంతం జగ్థుముత్సుకః | త్వద్దేహ స్పర్శమాత్రేణ జాతా పూర్వ భవస్మృతిః || 46 ||

గతజన్మ సహస్రాణి స్మరామ్యద్యత్వదంతికే | నిర్వేదశ్చ పరోజాతః ప్రసన్నం హృదయంచమే || 47 ||

ఈదృశో7యం ప్రభావస్తే కథం లబ్థో మహామతే | తపసా నాపి తీవ్రేణ కిముతీర్థ నిషేవణాత్‌ || 48 ||

యోగేన దేవశక్త్యా వామంత్రైర్వానంతశక్తిభిః | తత్వతో బ్రూహి భగవాన్‌ త్వామహం శరణంగతః || 49 ||

వామదేవ ఉవాచ -

ఏష మద్గాత్రలగ్నస్య ప్రభావో భస్మనోమహాన్‌ | యత్సం పర్కాత్‌ తమోవృత్తేః తవేయంమతి రుత్తమా || 50 ||

కోవేద భస్మ సామర్థ్యం మహాదేవాదృతే పరః | దుర్విభావ్యం యధాశంభోః మాహాత్మ్యం భస్మనస్తధా || 51 ||

పురాభవాదృశః కశ్చిత్‌ బ్రాహ్మణో ధర్మవర్జితః | ద్రావిడేషు స్థితో మూఢః కర్మణా శూద్రతాం గతః || 52 ||

తా || ఆయుస్సు నశిస్తుంది. అపకీర్తి వస్తుంది. భాగ్యం నశిస్తుంది. దుర్గతిని పొందుతాడు. పురాతనమైన పితరులు స్వర్గం నుండి కిందపడతారు. ధర్మం నుండి తప్పిన నరుని స్థితి ఇది నిశ్చితము (35) ఆ పిదప యముని కింకరులు నన్ను యమ మందిరానికి తీసుకెళ్ళారు. పిదప ఘోరమైన నరక కుండమందు పడవేయబడ్డాను (36) ఆ ఘోరమైన నరక మందు ముప్పదివేల సంవత్సరాలు నేను రేతముతాగుతూ యమ కింకరులతో పీడింపబడుతూ ఉన్నాను (37) పిదప పాపం మిగులగా అడవిలోజనం లేనిచోట పిశాచుణ్ణ సహస్ర శిశ్నములు కలవాడినైనాను. రోజు ఆకలి దప్పికలతో బాధపడేవాణ్ణి (38) పిశాచ గతిని పొంది దేవతల నూరు శరత్తులను గడిపాను. రెండో జన్మలో నేను ప్రాణి భయంకరమైన పులినైనాను. (39) మూడవసారి అజగరమైనాను. చతుర్థ జన్మలో తోడేలునైనాను. పంచమంలో మలందినే పందినైనాను. ఆరవ జన్మలో తొండనైనాను. (40) ఏడవ జన్మలో కుక్కనైనాను. అష్టమ జన్మలో నక్కనైనాను. నవమంలో గవయమైనాను పదవ జన్మలో మృగమునైనాను (41) పదునొకండవ దానిలోకోతినైనాను. పన్నెండవ జన్మలో గృద్ధ్రమైనాను. పద మూడవసారి ముంగిసనైనాను. పదునాల్గవ జన్మలో కాకినైనాను (42) పదిహేనవ సారి గుడ్డేలుగునైనాను. పదహారవ సారి అడవికోడినైనాను. పదునేడవ సారి గాడిదనైనాను. పద్దెనిమిదవ జన్మలో పిల్లినైనాను. (43) పందొమ్మిదవసారి కప్పనైనాను. ఇరువదవ సారి తాబేలు నైనాను. ఇరువది ఒకటవసారి చేపనైనాను. ఇరువది రెండవసారి ఎలుకనైనాను (44) ఇరువది మూడవసారి గుడ్లగూబనైనాను. ఇరువది నాల్గవసారి అడవి ఏనుగైనాను. ఈ ఇరువది ఐదవసారి జన్మలో బ్రహ్మరాక్షసుడనైనాను. (45) ఆకలిగొని, ఆహారంలేక, ఈ అడవిలో ఉంటున్నాను. ఇప్పుడువచ్చిన నిన్నుచూచి చంపదలిచాను. నీ దేహస్పర్శ మాత్రంచేత నాకు పూర్వజన్మస్మృతి కలిగింది (46) నీ సమీపంలో గడిచిన వేల జన్మలను ఈ వేళ స్మరిస్తున్నాను. నిర్వేదం చాలా కలిగింది. నా హృదయం ప్రసన్నమైంది (47) నీ ప్రభావ మిలాంటిది. ఇలాటి శక్తి మీకెలా కలిగింది, ఓ మహామతి! దీనికి తీవ్ర తపస్సు కారణమా తీర్థసేవనమా (48) యోగంవల్లనా, దేవశక్తి వల్లనా, అనంతశక్తి గల మంత్రములతోనా, ఓ భగవాన్‌! యథార్థం చెప్పండి. మిమ్మల్ని నేను శరణ వేడాను (49) వామదేవుని వచనం - ఇది నా శరీరానికి తగిలిన భస్మం యొక్క గొప్ప ప్రభావమది దీని సంపర్కంవల్ల తమోవృత్తిలో నున్న నీకు ఇంతమంచి బుద్ధి కలిగింది. (50) భస్మశక్తి ఎవడికి తెలుసు, మహాదేవునకు తప్ప ఎవరికీ తెలియదు. శంభుని మాహాత్మ్యం తెలియనట్లే భస్మ మాహాత్మ్యము తెలియదు (51) పూర్వం నీలాగే ధర్మ వర్జితుడైన ఒక బ్రాహ్మణుడు మూఢుడు ద్రావిడ దేశంలో ఉండేవాడు కర్మవల్ల శూద్రుడైనాడు (52).

మూ || చౌర్యవృత్తిః నైష్కృతి కోవృషలీరతిలాలసః | కదాచిజ్జారతాం ప్రాప్తః శూద్రేణ నిహతో నిశి || 53 ||

తచ్ఛవస్య బహిర్గ్రామాత్‌ క్షిప్తస్య ప్రేతకర్మణః | చచార సారమేయోం7గే భస్మపాదో యదృచ్ఛయా || 54 ||

అథతం నరకేఘోరే పతి తంశివ కింకరాః | నిన్యుః విమాన మారోప్య ప్రసహ్యయ మకింకరాన్‌ || 55 ||

శివదూతాన్‌ సమభ్యేత్య యమోపి పరిపుష్టవాన్‌ | మహాపాతక కర్తారం కథమేనం నినీషథ || 56 ||

అథోచుః శివదూతాస్తే పశ్యాస్య శవ విగ్రహం | పక్షోలలాట దుర్మూలాస్యం కితాని సుభస్మనా || 57 ||

అత ఏనం సమానేతు మాగతాః శివశాసనాత్‌ | నాస్మాన్నిషేద్దుం శక్తోసిమాస్త్వ త్ర తవసంశయః || 58 ||

ఇత్యాభాష్య య మంశంభోఃదూతాస్తంబ్రాహ్మణంతతః | పశ్యతాంసర్వలోకానాంనిన్యుర్లోకమనామయం || 59 ||

తస్మాదశేష పాపానాం సద్యః సంశోధనం పరం | శంభోర్వి భూషణం భస్మ సతతంధ్రియతే మయా || 60 ||

ఇత్థం నిశమ్య మాహాత్మ్యం భస్మనో బ్రహ్మరాక్షసః | విస్తరేణ పునః శ్రోతుమౌత్కంఠ్యాత్‌ ఇత్య భాషత || 61 ||

సాధు సాధు మహాయోగిన్‌ ధన్యోస్మితపదర్శనాత్‌ | మాంవిమోచయథర్మాత్మన్‌ఘోరాదస్మాత్కుజన్మనః || 62 ||

కించిదస్తీహమేభాతి మయాపుణ్యం పురాకృతం | అతోహం త్వత్ర్ప సాదేన ముక్తోస్మ్య ద్య ద్విజోత్తమ || 63 ||

ఏకసై#్మ శివభక్తాయ తస్మిన్‌ పార్థివ జన్మని | భూమిర్‌ వృత్తి కరీదత్తా సస్యా రామాన్వితా మయా || 64 ||

యమేనాపి తదైవోక్తం పంచవింశతిమేభ##వే | కస్యచిద్యోగినః సంగాత్‌ మోక్ష్యసే సంనృతేరితి || 65 ||

తదద్య ఫలితం పుణ్యం యత్కించిత్‌ ప్రాగ్భవార్జితం | అతోనిర్మసుజారణ్య సంప్రాప్తస్తవ సంగమః || 66 ||

అతో మాంఘోర పాప్మానం సంసరంతం కుజన్మని | సముద్ధర కృపాసింధో దత్వా భస్మసమంత్రకం || 67 ||

కథంధార్య మిదం భస్మ కో మంత్రః కోవిధిః శుభః | కఃకాలః కశ్చవాదేశః సర్వం కథయమే గురో || 68 ||

భవాదృశా మహాత్మానః సదాలోకహితే రతాః | నాత్మనోహిత మిచ్ఛంతి కల్పవృక్షసధర్మిణః || 69 ||

సూత ఉవాచ -

ఇత్యుక్తస్తే సయోగీశీఘోరేణ వనచారిణా | భూయోపి భస్మ మాహాత్మ్యం వర్ణయా మాస తత్వవిత్‌ || 70 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తర ఖండే భస్మ మాహాత్మ్య కథనం నామ పంచదశో7ధ్యాయః || 15 ||

తా || దొంగతనం చేస్తూ, పని లేకుండా, శూద్ర స్త్రీ రతిలాలసుడై ఒకసారి జారుడై వెళ్ళినాడు. ఆ రాత్రి శూద్రుడు వాణ్ణి చంపాడు (53) ఊరి బయట పారవేయబడ్డ ఆ శవంనకు ప్రేతకర్మ జరగాలి. భస్మము పాదమందు గల ఒక కుక్క ఈతని శరీరంను అనుకోకుండా తాకింది (54) ఘోరమైన నరకమందు పడ్డ ఈతనిని శివకింకరులు తీసుకెళ్ళారు. యమ కింకరులను ఎదిరించి, విమానంలోకూర్చో బెట్టుకొని తీసుకెళ్ళారు. (55) శివదూతల దగ్గరకు వచ్చి యముడు కూడా అడిగాడు. మహాపాతకములుచేసిన వీనిని ఎట్లా తీసుకెళుతున్నారు (56) శివదూత లిట్లన్నారు. ఈతనిని శివ విగ్రహాన్ని చూడండి. ఈతని వక్షము, నొసలు, భుజమూలముల భస్మముతో గుర్తించబడ్డాయి. (57) అందువల్ల శివుని ఆజ్ఞవల్ల ఈతనిని తీసుకు వెళ్ళటానికి వచ్చాము. మమ్మల్ని నిరోధించటం నీ వల్ల కాదు. ఇందులో నీకు అనుమానం అవసరంలేదు (58) అని యమునితో పలికి శివదూతలు ఆ బ్రాహ్మణుని ఆ పిదప అన్ని లోకాల వారు చూస్తుండగా, అనామయమైన లోకానికి తీసుకెళ్ళారు (59) అందువల్ల అన్ని పాపములకు వెంటనే ఉత్తమమైన శుద్ధి, శంభుని భూషణమైన భస్మము. దాన్నే నేను ఎప్పుడూ ధరిస్తాను. (60) అనగా బ్రాహ్మరాక్షసుడు భస్మ మాహాత్మ్యాన్ని విని, తిరిగి విస్తారంగా వినటానికి ఉత్కంఠ కలవాడై ఇట్లన్నాడు (61) ఓ మహాయోగి! బాగుబాగు నీ దర్శనంతో నేను ధన్యుణ్ణౖనాను. ఓ ధర్మాత్మ!ఈకుజన్మ నుండి నన్ను విముక్తుణ్ణి చేయి (62) నేను చేసిన పుణ్యం కొంచెముందని నా కన్పిస్తోంది. అందువల్లనే నీ అనుగ్రహంవల్ల ఈ వేళ ముక్తుణ్ణౖనాను. ఓ ద్విజోత్తమ (63) ఆరాజుజన్మలో ఒక శివభక్తునకు సస్య ఆరామములతో కూడిన భూమిని నేను వృత్తిగా ఇచ్చాను (64) యముడు కూడా అదే చెప్పాడు. ఇరువది ఐదవ జన్మలో ఒక యోగి సహవాసం వల్ల సంసారం నుండి ముక్తి నందుతావు అని (65) పూర్వజన్మలో సంపాదించిన ఏ కొంచము పుణ్యమో ఈ వేళ ఫలించింది. అందువల్ల మనుష్యులు లేని అడవిలో సమాగమము లభించింది (66) అందువల్ల ఘోర పాపములుకల, కుజన్మలో తిరుగుతున్న నన్ను ఉద్ధరించు ఓ దయానిధి, మంత్రపూతమైన భస్మమును ఇవ్వు (67) ఈ భస్మమును ఎట్లా ధరించాలి. మంత్రమేది. శుభ##మైన విధిఏది కాలమేది దేశ##మేది ఓగురు! నాకంతా చెప్పు (68) నీలాంటి మహాత్ములు ఎప్పుడూ లోకహితముకై ఆసక్తి గలవారు తమహితమును కోరేవారు కారు. కల్పవృక్షంతో సమానమైన వారు (69) సూతులిట్లన్నారు. ఘోరమైన ఆవనచారి ఆ యోగీశునితో అట్లా అనగా ఆ తత్వవిదుడు తిరిగి భస్మ మాహాత్మ్యాన్ని వర్ణింపసాగాడు (70) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తర ఖండమందు భస్మ మాహాత్మ్య కథన మనునది పదునైదవ అధ్యాయము ||15 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters