Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదవ అధ్యాయము

మూ || సూత ఉవాచ -

విచిత్రం శివ నిర్మాణం విచిత్రం శివచేష్టితం | విచిత్రం శివమాహాత్మ్యం విచిత్రం శివభాషితం || 1 |

విచిత్రం శివభక్తానాం చరితం పాపనాశనం | స్వర్గాపవర్గయోః సత్యం సాధనంతద్ర్బవీమ్యహం || 2 ||

అవంతీ విషయే కశ్చిత్‌ బ్రాహ్మణోమందరాహ్వయుః | బభూవవిషయారామః స్త్రీజితో ధనసంగ్రహీ || 3 ||

సంధ్యాస్నాన పరిత్యక్తో గంధమాల్యాం బరప్రియః | కుస్త్రీనక్తోకుమార్గస్థోయథాపూర్వమజామిలః || 4 ||

సవేశ్యాం పింగలాం నామ రమమాణోదినానిశం | తస్యా ఏవగృహేనిత్యం ఆసీద విజితేంద్రియః || 5 ||

కదాచిత్సదనే తస్యాః తస్మిన్ని వనతిద్విజే | ఋషభోనామ ధర్మాత్మా శివయోగీ సమాయ¸° || 6 ||

తమాగత మభిప్రేక్ష్య మత్వాస్వం పుణ్య మూర్జితం | సావేశ్యానచ విప్రశ్చ పర్యపూజయతాముభౌ || 7 ||

తమారోప్యమహాపీఠేకంబలాంబరసంవృతే | ప్రక్షాల్యచరణౌభక్త్యాతజ్జలం, ధధతుఃశిరః || 8 ||

స్వాగతార్ఘ్యనమస్కారైఃగంధపుష్పాక్షతాదిభిః | ఉపచారైఃసమభ్యర్చ్యభోజయామానతుర్ముదా || 9 ||

తంభుక్తవంతమాచాంతం పర్యంకే సుఖసంస్తరే | ఉపవేశ్యముదాయుక్తాతాంబూలంప్రత్యయచ్ఛతాం || 10 ||

పాదసంవాహసంభక్త్యాకుర్వంతౌదైవచోదితౌ | కల్పయిత్వాతుశుశ్రూషాప్రీణయామాసతుశ్చిరం || 11 ||

ఏవంసమర్చితస్తాభ్యాంశివయోగీమహాద్యుతిః | అతివామ్యనిశామేకాంయ¸°ప్రాతస్తదాదృతః || 12 ||

ఏవంకాలేగతప్రాయేనవిcపోనిధనంగతః | సాచేవేశ్యామృతాకాలేయ¸°కర్మార్జితాంగతిం || 13 ||

సవిప్రఃకర్మణానీతోదశార్ణధరణీపతేః | వజ్రబాహుకుటుంబిన్యాఃసుమత్యాగర్భమాస్థితః || 14 ||

తాంజ్యేష్ఠపత్నీంనృపతేఃగర్భసంపదమాశ్రితాం | అవేక్ష్యతసై#్యగరళంసపత్న్యఃఛద్మనాదదుః || 15 ||

సాభుక్త్వాగరలంఘోరంసమృతాదైవయోగతః | క్లేశ##మేవవరం ప్రాపమరణాదతిదుఃసహం || 16 ||

అధకాలేనమాయాతేపుత్రమేకమజీజనత్‌ |క్లేశేనమహతాసాధ్వీపీడితావరవర్ణినీ || 17 ||

స నిర్దశోరాజపుత్రఃస్పృష్టపూర్వోగరేణయత్‌ | తేనావాపమహాక్లేశం క్రందమానోదివానిశః || 18 ||

తస్యబాలస్యమాతాచసర్వాంగప్రణపీడితా | బభూవతురతిక్లిష్టా గరయోగప్రభావతః || 19 ||

తా || సూతులిట్లన్నారు - శివనిర్మాణము విచిత్రము శివుని చేష్టవిచిత్రము. శివ మాహాత్మ్యము విచిత్రము శివుని భాషణ విచిత్రము (1) శివభక్తుల చరిత్రవిచిత్రము,పాపనాశకము. స్వర్గఅపవర్గములను సాధించి ఇచ్చేది. నిజముదాని గూర్చి చెబుతాను. (2) అవంతిదేశంలో ఒక బ్రాహ్మణుడుండేవాడుమందరుడనిపేరు. విషయములందు విశ్రమించేవాడు, స్త్రీలోలుడు, ధనసంగ్రహేచ్ఛకలవాడు (3) సంధ్యాస్నానములులేనివాడు గంధమాల్యఅంబరములందప్రేమకలవాడు. కుత్సితస్త్రీలందు ఆసక్తికలవాడు. చెడుమార్గమందున్నవాడు. పూర్వంఅజామిళుడు ఎట్లుండేవాడో అలాంటివాడు (4) ఆతడు పింగళఅనువేశ్యను రాత్రింబగళ్ళురమించేవాడు. జితేంద్రియుడుకానందువల్లఎప్పుడూ ఆమెఇంట్లోనే ఉండేవాడు (5) ఒకసారిబ్రాహ్మణుడు ఆమెఇంట్లోఉండగా ఋషభుడనుపేరుగల ధర్మాత్ముడు శివయోగివచ్చినాడు (6) ఆవచ్చినవాణ్ణి చూసి తానుసంపాదించినపుణ్యంగాభావించి ఆవేశ్యావిప్రుడు వారిద్దరూఆతణ్ణి పూజించారు. (7) కంబళము, వస్త్రములు గల మహాపీఠమందు ఆతనినికూర్చోబెట్టిఆతని పాదాలుకడిగిఆజలాన్ని తమశిరముపైభక్తితో ధరించారు. (8) స్వాగతఅర్ఘ్య నమస్కారములతో గంధపుష్పఅక్షతాదులతోఉపచారములతో బాగాపూజించిఆనందంతో ఆతనిని భుజింపచేశారు (9) భుజించిచేతులుకడుగు కున్నసుఖంగాఉన్నవానినిచిగురుల పడకపైకూర్చోబెట్టి ఆనందంతోతాంబూల మిచ్చారు. (10)భక్తితో పాదసంవాహనంచేసిదైవప్రేరణవల్ల శుశ్రూషచేసిచాలాసేపుసంతోషపరిచారు (11) వారిట్లాపూజించగామహాద్యుతిగలశివ యోగి ఒకరాత్రిగడిపి, వారితో ఆదరింపబడి తెల్లవారివెళ్ళిపోయాడు (12) ఇట్లాకాలంగడిచివయసుడిగి ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆవేశ్యకూడా కాలవశాత్తూ మరణించింది. కర్మార్ణితమైనగతిని పొందింది (13) ఆబ్రాహ్మణుడు కర్మవశం పదుడైదశార్దవరాజువజ్రబాహువుభార్యసుమతియొక్క గర్భంలో ప్రవేశించాడు. (14) గర్భసంపదను పొందిన రాజుగారి పెద్దభార్యనుచూచి ఆమెసవతులు ఆమెకు, మోసంతో విషమిచ్చారు. (15) ఆమె ఘోరమైన విషాన్ని తిని అదృష్టవశాత్తు చావలేదు. చాలా కష్టపడింది. మరణంకన్న ఎక్కువైనకష్టమది (16) కొంత కాలానికి ఆమె ఒక పుత్రుని కన్నది. ఆసాధ్వి, వరవర్ణిని, అనేకంగా కష్టపడింది (17) అదృష్టహీనుడైఆరాజపుత్రుడుఇతఃపూర్వంవిషస్పర్శపొందాడు. అందువల్ల చాలా బాధననుభవించాడు. రాత్రింబగళ్ళు ఏడ్చేవాడు (18) ఆపిల్లవానితల్లి అవయవాలన్నింటా వ్రణములతో బాధపడసాగింది. విషప్రభావంవల్ల వారిద్దరూ చాలా కష్టాలపాలయ్యారు (19)

మూ || తౌరాజాచసమానీతౌవైద్యశ్చకృతభేషజా | సస్వాస్థ్యమాపతుర్యత్నైఃఅనేకైర్యోజితైరపి || 20 ||

నరాత్రౌలభ##తేనిద్రాంసారాజ్ఞీవిపులవ్యధా | స్వపుత్రస్యచదుఃఖేనదుఃఖితానితరాంభృశా || 21||

నీత్వైవంకతిచిన్మాసాన్‌సరాజామాతృపుత్రకౌ | జీవంతౌచమృతప్రా¸°విలోక్యాత్మస్యచింతయత్‌ || 22 ||

ఏతౌమేగృహణీపుత్రౌనిరయాదాగతావిహ | అశ్రాంతరోగౌక్రందంతౌనిద్రాభంగనవిధాయినౌ || 23 ||

అత్రోపాయంకరిష్యామిపాపయోఃధ్రువమేతయోః | మర్తుంవాజీవితుంవాపినక్షమౌపావభోగినౌ || 24 ||

ఇత్థంవినిశ్చిత్యచభూమిపాలఃసక్తఃసపత్నీషుతదాత్మజేషు | ఆహూయసూతంనిజదారపుత్రౌనిర్వావయామాసరథేనదూరం || 25 ||

తౌసూతేనపరిత్యక్తౌకుత్రచిద్విజనేవనే | అవాపతుఃపరాంపీడాంక్షుత్‌తృడ్భ్యాంభృశవిహ్వలౌ || 26 ||

సోద్వహంతీనిజంబాలంనిపతంతీపదేపదే | నిఃశ్వసంతీనిజంకర్మనిందంతీచకితాభృశం || 27 ||

క్వచిత్కంటకభిన్నాంగీముక్తకేశీభయాతురా | క్వచిద్వ్యాఘ్రస్వనైర్భీతాక్వచిద్వ్యాలైరసుద్రుతా || 28 ||

భర్త్యమానాపిశాచైశ్చవేతాలైఃబ్రహ్మరాక్షసైః || మహాగుల్మేషుధావంతీభిన్నపాదాక్షురాశ్మభిః || 29 ||

సైవంఘోరేమహారణ్యభ్రమంతీనృపగేహినీ | దైవాత్ర్పాప్తావణిఙ్‌మార్గంలోవాజినరసేవితం || 30 ||

గచ్ఛంతీతేసమార్గేణసుదూరమతియత్నతః | దదర్శవైశ్యనగరంబహుస్త్రీనరసేవితం || 31 ||

తస్యగోప్తామహావైశ్యోనగరస్యమహాజనః | అస్తిపద్మాకరోనామరాజరాజ ఇవావరః || 32 ||

తస్యవైశ్యపతేఃకాచిత్‌ గృహదాసీనృపాంగవాం | ఆయాంతీందూరతోదృష్ట్వాతదంతికముపాయ¸° || 33 ||

సాదాసీనృపతేఃకాంతాంనపుcతాంభృశపీడితాం | స్వయంవిదితవృత్తాంతాస్వామినేపరత్యదర్శయత్‌ || 34 ||

సతాందృష్ట్వావిశాంనాధోరుజార్తాంక్లిష్టపుత్రకాం | నీత్వారహసిసువ్యక్తంతద్వృతాంత మపృచ్ఛత || 35 ||

తయానివేదితాశేషవృత్తాంతఃసవణిక్పతిః | అహోకష్టమితిజ్ఞాత్వానిశశ్వాసముహుర్ముహుః || 36 ||

తామంతికేస్వగేహస్యసంనివేశ్యరహోగృహె | వాపోన్నపానశయనైమాతృసామ్యమపూజయత్‌ || 37 ||

తస్మిన్‌గృహెవవధూఃనివసంతీరక్షితా | ప్రణయక్ష్మాదిరోగాణాంనశాంతింప్రత్యపద్యత || 38 ||

తా || రాజువారిద్దరికివైద్యులచేమందిప్పించాడు. అనేకప్రయత్నాలు చేసినా వారు స్వస్థులుకాలేదు (20) రాణిచాలా బాధతోరాత్రిళ్ళునిద్రించటంలేదు. తనకొడుకుకు కలిగినబాధతో ఆమెబాధపడుతూ చాలాకృశించింది (21) ఈ రకంగా కొన్నాళ్ళు గడిపినాక ఆ రాజు ఆతల్లిపుత్రులనుచూచి వీరు బ్రతికినాచచ్చిన వారిలా ఉన్నారని ఆలోచించాడు (22) వీరునా భార్యపుత్రుడు, నరకంనుండి ఇక్కడికివచ్చారు. ఎడతెగని రోగంకలిగి ఉన్నారు. ఏడుస్తున్నారు. నానిద్రకు భంగం కల్గిస్తున్నారు (23) ఇక్కడ ఏదైనా ఉపాయమాలోచించాలి. పాపులైన వీరిద్దరిగూర్చిఆలోచించాలి చావటానికైనా జీవించటానికైనా వీరు శక్తిలేకుండాఉన్నారు పాపభాగులు (24) అని ఆలోచించి ఆ రాజు తన ఇతర భార్యలయందు వారికుమారులందు ఆసక్తుడై, సూతునిపిలిచి తన భార్యను పుత్రుని రథంపై దూరంగా పంపాడు (25)ఆ సూతుడు వారిని జనంలేని అడవిలో విడిచిపెట్టాడు. ఆకలి దప్పికలతో చాలా చలించి వారుఎంతో బాధపొందారు (26) ఆమె తనకుమారుని మోస్తూ అడుగడుగున పడిపోతూ తనకర్మకు నిట్టూరుస్తూ, నిందించుకుంటూ మాటిమాటికి చకితురాలై (27) ముళ్ళతోచీలిన అవయవాలుకలదై, వెంట్రుకలుముడివీడి, భయంతో ఆతురురాలై, ఒక్కోచోటపులులగర్జనలతో భయపడుతూ ఒక్కోచోట సర్పాలు తరుమగా (28) భయపడుతూ పిశాచ, భేతాళ, బ్రహ్మరాక్షసులతో భయపెట్టబడుతూ పొదలలో పరుగెత్తుతూ కత్తులలాంటి రాళ్ళతో పాదాలు చీలిపోగా (29) ఆమె ఈ విధంగా ఘోరమైన అరణ్యమందు తిరుగుతూ ఆ రాజుభార్య అదృష్టవశాత్తు గోవులు, గుఱ్ఱములు నరులు నడిచే వణిక్‌మార్గమున చేరింది (30) ఆత్రోవ వెంటచాలాదూరము అతిప్రయత్నంమీద వెళుతూఅనేకమంది స్త్రీలు పురుషులుగలవైశ్యనగరమునుచూచింది (31) దాని రక్షకుడు మహావైశ్యుడు. నగరంలో పెద్దవాడు వానిపేరు పద్మాకరుడు. మరోరాజువంటివాడు (32) ఆవైశ్యపతి యొక్క గృహదాసిఒక రాజస్త్రీనివస్తున్నదాని దూరంనుండే చూచి, ఆమె దగ్గరకు వచ్చింది. (33) ఆదాసి రాజుభార్యను, ఆమెకొడుకును చాలా బాధపడుతున్న దానినిచూచి, స్వయంగా ఆమెవృత్తాంతాన్ని తెలుసుకొని, తనయజమానికి చూపింది (34) ఆవైశ్యశ్రేష్ఠుడు రోగంతో బాధపడుతున్న ఆమెను కష్టపడుతున్న ఆమె కొడుకును చూచి, రహస్యంగా తీసుకువెళ్ళి వివరంగా ఆమె వృత్తాంతాన్ని అడిగాడు (35) ఆమెతన వృత్తాంతం అంతా చెప్పగా ఆపణికృతి తెలుసుకొని అయ్యో ఎంతకష్టమైంది అని మాటిమాటికి నిట్టూర్చాడు (36) ఆమెన తన ఇంటికి దగ్గర రహస్యగృహంలో ఉంచి, వస్త్రము, అన్నము, పానీయము, శయనము, వీటిని అమర్చి తల్లిలాగా పూజించాడు (37) ఆ గృహంలో ఆ రాజుభార్యక్షేమంగా నివసిస్తూ, వ్రణముల యక్ష్మాదిరోగములనుండి శాంతిని పొందలేదు. (38)

మూ || తతోదినైఃకతిపయైఃసబాలోప్రణపీడితః | విలంఘితభిషక్‌సత్వోమమారచవిధేర్వశాత్‌ || 39 ||

మృతేస్వతనయేరాజ్ఞీశోకేసమహతావృతా | మూర్ఛితాచాపతత్‌భూమౌగజభ##గ్నేవవల్లరీ || 40 || దైవాత్‌సంజ్ఞామవాప్యాధబాష్పక్లిన్నపయోధర | సాంత్వితా7పివణిక్‌స్త్రీభిః విలలావసుదుఃఖితా || 41 ||

హాతాతతాతహాపుత్రహోమమ ప్రాణరక్షక | హారాజకులపూర్ణేందోహామమానందవర్థన || 42 ||

ఇమాంఅనాధాంకృపణాంత్వత్ర్పాణాంత్యక్తబాంధవాం | మాతరంతేపరిత్యజ్యయాతో7సినృపాత్మజ || 43 ||

ఇత్యేభిరుదితైర్వాక్యైఃశోకచింతావివర్ధకైః | విలవంతీంమృతాపత్యాంకోసుసాంత్వయితుంక్షమః || 44 ||

ఏతస్మిన్సమయేతస్యాదుఃఖశోకచికిత్సకః | ఋషభఃపూర్వమాఖ్యాతఃశివయోగీసమాయ¸° || 45 ||

సయోగీవైశ్యనాథేనసార్ఘహస్తేసపూజితః | తస్యాఃసకాశమగమత్‌శోచన్త్యాఇదమబ్రవీత్‌ || 46 ||

ఋషభఉవాచ -

అకస్మాత్కిమహోవత్సరోరవీషివిమూఢధీః | కోజాతఃకతమోలోకేకోమృతోపదసాంవ్రతం || 47 ||

అమీదేహాదయోభావాస్తోయఫేనసధర్మకాః | క్వచిద్ర్భాంతిఃక్వచిచ్ఛాంతిఃస్థితిర్భవతివాపునః || 48 ||

అతో7స్మిన్‌ఫేనసదృశేదేహెపంచత్వమాగతే | శోకస్యానవకాశత్వాత్‌నశోచంతి వివశ్చితః || 49 ||

గుణౖర్భూతానినృజ్యంతేభ్రామ్యంతేనిజకర్మభిః | కాలేనాధవికృష్యంతే వాననాయాంచశేరతే || 50 ||

మాయయోత్పత్తి మాయాంతిగుణాఃసత్వాదయస్త్రయః | తైరేవదేహాజాయంతేజాతాస్తల్లక్షణాశ్రయాః || 51 ||

దేవత్వంయాతిసత్వేనరజసాచమనుష్యతాం | తిర్యక్త్వంతమసాజంతుః వాసనానుగతోవశః || 52 ||

సంసారేవర్తమానేస్మిన్‌జంతుఃకర్మానుబంధనాత్‌ | దుర్విభావ్యాంగతింయాతిసుఖదుఃఖమయీంముహుః || 53 ||

అపికల్పాయుషాంతేషాందేవానాంతువిపర్యయః | అనేకామయబద్ధానాంకాకథానదేహినాం || 54 ||

కేచిద్వదంతిదేహస్యకాలమేవహికారణం | కర్మకేచిద్గుణాన్‌కేచిత్‌దేహఃసాధారణోహ్యయం || 55 ||

కాలకర్మగుణాధానంపంచాత్మకమిదంవపుః | జాతందృష్ట్వాసహృష్యంతినశోచంతిమృతంబుధాః || 56 ||

అవ్యక్తే జాయతేజంతుః అవ్యక్తేచవ్రలీయతే | మధ్యేవ్యక్త వదాభాతిజలబుద్బురసన్నిభః || 57 ||

యదా గర్భగతోదేహీ వినాశః కల్పితస్తదా | దైవాజ్జీవతి వాజాతో మ్రియతో సహసైనవా || 58 ||

తా || కొద్దిరోజులకు ఆబాలుడు వ్రణములచే పీడితుడై వైద్యులశక్తులను అతిక్రమించి విధివశాత్తు మరణించాడు (39) తనకొడుకు చనిపోయాగ ఆరాణిచాలా దుఃఖాన్నిపోంది మూర్ఛతో భూమిపై పడింది, ఏనుగు తెంపగా తీగ కింద పడ్డట్టుపడింది. (40) అదృష్టవశాత్తు తిరిగి మేలుకొని కన్నీళ్ళతో రొమ్ములు తడుస్తుండగా, వణిక్‌స్త్రీలు ఓదారుస్తున్నా, దుఃఖంతో చాలా ఏడ్చింది (41) అయ్యో! నా తండ్రి, తండ్రీ ! నాకొడుక, నా ప్రాణ రక్షకుడ, రాజవంశము నకు చందమామా, నా ఆనందాన్ని పెంచేవాడ (42) అనాధను, కృపణురాలిని, నీయందే ప్రాణముగలదాన్ని బంధువులందరిచే విడువబడ్డదాన్ని నన్ను నీ తల్లినివిడచి ఎక్కడి కెళ్ళావు ఓ రాకుమార (43) ఇట్లాచెప్పి మాటలతో శోకమును చింతనుపెంచే మాటలతో ఏడుస్తున్న, కొడుకు చచ్చిఉన్న ఆమెను ఎవడు ఓదార్చసమర్థుడు (44) ఈసమయంలో ఆమె దుఃఖ శోకములకు వైద్యుడులా ముందుచెప్పిన ఋషభుడు శివయోగివచ్చాడు (45) ఆయోగిని వైశయనాధుడు అర్ఘ్య హస్తంతో పూజించాడు ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏడుస్తున్న ఆమెతో ఇట్లన్నాడు (46) ఋషభుని వచనం - ఓ చిన్నదానా ! అకస్మాత్తుగా ఎందుకేడుస్తున్నావు, బుద్ధిహీనురాలవై, పుట్టినవాడెవడూ, ఈ ప్రపంచంలో వాడెన్నవవాడు, చచ్చినవాడెవడూ ఇప్పుడు నాకుచెప్పు (47) ఈదేహా దిభావములనీటినురగలవంటివి. ఒకచోటభ్రాంతి, ఒకచోట శాంతి, నిలకడ ఉందామళ్ళా (48) అందువల్ల నురుగులాంటి శరీరంనశిస్తే ఏడ్వవలసిన అవసరంలేదుకనుక బుద్ధిమంతులు ఏడ్వరు (49) గుణములతో ప్రాణులు సృజింపబడతాయి. తమతమ కర్మలతో తిరుగుతుంటాయి కాలంతో ఆకర్షింపబడతాయి. వాసనతో సంచరిస్తుంటాయి (పూర్వజన్మ వాసనలు) (50) సత్వాది గుణములు మూడు మాయతో ఉత్పత్తి నందుతాయి. వానితోనే శరీరము లేర్పడుతాయి. పుట్టినా ఆలక్షణముల నాశ్రయించిఉంటాయి (51) సత్వగుణంతో దేవత్వాన్ని రజోగుణంతో మనుష్యత్వాన్ని తమోగుణంతో తిర్యక్‌ల క్షణాన్ని పోందుతాయి. ప్రాణి వాసనననుసరించి దాని ఆధీనమైఉంటుంది (52) ఈనడుస్తున్న సంసారంలో జంతువు కర్మాధీనమైనందువల్ల సుఖదుఃఖమయమైన ఊహింపవీలుకాని గతిని మాటిమాటికి పొందుతుంది. (53) కల్పాయుస్సు గల ఆదేవతలకు గూడా ఈ విపర్యయం తప్పదు నరదేహూలకు అనేక ఆమయములతో బద్ధులైన వారికి చెప్పేదేముంది (54) దేహమునకు కాలమే కారణమని అంటారు. కర్మకారణమని కొందరు గుణములు కారణమని కొందరు అంటారు. ఈ దేహముసాధారణమైంది (55) కాలము కర్మగుణములు వీటికి స్థానము ఈ శరీరము పంచాత్మకమైంది. పుట్టినవాణ్ణి చూచిఆనందించరు, చనిపోయినవాణ్ణి గూర్చిఏడవరు బుధులు (56) ఆవ్యక్తం నుంచిప్రాణిపుడ్తుంది. అవ్యక్తమందేలీన మౌతుంది. వ్యక్తమైనట్లుగా మధ్యలో మెరుస్తుంది. నీటి బుడగతో సమానమైంది. (57) గర్భగతమైనప్రాణిఅప్పుడే నశించ వచ్చు. దైవవశాత్తు బ్రతికితే వెంటనే చావవచ్చు (58)

మూ|| గర్భస్థాఏవనశ్యంతి జాతమాత్రాస్తధావరే | క్విచిద్యువానోనశ్యంతిమ్రియంతే కేపివార్థకే || 59 ||

యాదృశంప్రాక్తసంకర్మతాదృశంవిందతేవపుః | భుంక్తేతదనురూపాణిసుఖదుఃఖానివైహ్యసౌ || 60 ||

మాయానుభావేరితయోఃపిత్రోఃసురత సంభ్రమాత్‌ | దేహ ఉత్పద్యతేకోపిపుంయోషిత్‌క్లీబలక్షణః || 61 ||

ఆయుఃసుఖంచదుఃఖంచపుణ్యంపాపంశ్రుతంధనం | లలాటేలిఖితంధాత్రావహన్‌జంతుఃప్రజాయతే || 62 ||

కర్మణామవిలంఘ్యత్వాత్‌కాలస్యాప్యనతిక్రమాత్‌ | అనిత్యత్వాచ్ఛభావానాంనశోకంకర్తుమర్హసి || 63 ||

క్వస్వప్నేనియతంస్థైర్యంఇంద్రజాలేక్వసత్యతా | క్వనిత్యతాశరన్మేఘేక్వశశ్వత్త్వంకలేబరే || 64 ||

తపజన్మస్యతీతానిశతకోట్యయుతానిచ | అజానంత్యాఃపరంతత్వంసంప్రాప్తో7యంమహాభ్రమః || 65 ||

కస్యకస్యాసితనయా జననీ కన్యకన్యవా | కస్యకస్యాపి గృహిణీ భవకోటిషువర్తినీ || 66 ||

పంచభూతాత్మకోదేహః త్వగనృఙ్‌మాంసబంధనః | మేధోమజ్జాస్థినిచితోవిణ్మూత్రశ్లేష్మభాజనం || 67 ||

శరీరాంతరమప్యేతన్నిజదేహాద్భవంమలం | మత్వాస్వతనయంమూఢేమాశోకంకర్తుమర్హసి || 68 ||

యదినామ జనః కశ్చిత్‌ మృత్యుం తరతి యత్నతః | కథంతర్హివిపద్యేరన్‌సర్వేపూర్వేవివశ్చిత || 69 ||

తవసావిద్యయాబుద్ధ్యామంత్రౌషధిరసాయవైః | అతియాతిపరంమృత్యుంసకశ్చిదపిపండితః || 70 ||

ఏకస్యాద్యమృతిర్జంతోఃశ్వశ్చాన్యస్యవరాననే | తస్మాదనిత్యావయనేనత్వంశోచితుమర్హసి || 71 ||

నిత్యంసన్నిహితోమృత్యుఃకింసుఖంవదేదహినాం | వ్యాఘ్రేపురఃస్థితేగ్రాసఃపశూనాంకింనురోచతే || 72 ||

అతోజన్మజరాంజేతుంయదిచ్ఛసివరానవే | శరణంవ్రజసర్వేశం మృత్యుంజయముమాపతిం || 73 ||

తావస్మృత్యుభయంఘోరం తావజ్జన్మజరాభయం | యావన్నోయాతిశరణందేహీశివవదాంబుజ || 74 ||

అనుభూయేహదుఃఖాని సంసారేభృశదారుణ | మనోయదావియజ్యేతతదాధ్యేయోమహెశ్వరః || 75 ||

మనసాపిబతఃపుంసఃశివధ్యానరసామృతం | భూయన్తృష్ణానజాయేత సంసారవిషయానవే || 76 ||

విముక్తనర్వసంగైశ్చమనోవైఊరాగ్యయంత్రితం | యదాశివవదేమగ్నంతదానాస్తిపునర్భవః || 77 ||

తస్మాదిదంమనోభ##ద్రేశివధ్యానైకసాధనం | శోకమోహసమావిష్టం మాకురుష్వశివంభజ || 78 ||

సూతఉవాచ -

ఇత్థంసానునయంరాజ్ఞీబోధితాశివయోగినా | ప్రత్యచష్టగురోస్తస్యవ్రణమ్యచరణాంబుజం || 79 ||

తా || కొందరు గర్భంలోనే మరణిస్తారు. కొందరు పుట్టగానే మరణిస్తారు. కొందరు యువకులైనశిస్తారు. కొందరు వార్థకంలో నశిస్తారు. (59) పూర్వకర్మ ఎలాంటిదో అలాంటిశరీరాన్ని పొందుతాడు. ఈతడు అందుకనుగుణమైన సుఖ దుఃఖములుఅనుభవిస్తాడు. (60)మాయఅనుభావంతో ప్రేరేపింపబడ్డతలిదండ్రులకుసురతసంభ్రమంవల్ల పురుషుడు గానో స్త్రీగానో క్లీబలక్షణములుగలవాడుగానో ఏదోఒక శరీరం ఏర్పడుతుంది. (61) ఆయుస్సు, సుఖము, దుఃఖము, పుణ్యము, పాపము, చదువు, ధనము వీటిని బ్రహ్మనొసటియందు ఎంతవ్రాస్తే అంత తీసుకొని ప్రాణిపుడ్తాడు. (62) కర్మనుఅతిక్రమించలేము, కాలాన్నిదాటలేము. భావములు అనిత్యమైనందువల్లదుఃఖించిపనిలేదు. (63) స్వప్నమందు నియతమైన స్థైర్యముంటుందా. ఇంద్రజాలంలో సత్యము ఎప్పుడూ ఉంటుందా. శరన్మేఘం నిత్యం (శాశ్వతత్వం)గా ఉంటుందా కలేబరము ఎప్పుడూ ఉంటుందా (64) నీవి పదిలక్షలకోట్ల జన్మలు గడిచిపోయాయి. ఈ గొప్పతత్వం తెలియనందువల్ల ఈగొప్పభ్రమేర్పడింది (65) ఎవరెవరికూతరువైనావో, ఎవరెవరితల్లివైనావో, ఎవరెవరిభార్యవైనావో కోట్లజన్మలలో (66) ఈశరీరంపంచభూతాత్మకమైంది. చర్మము, రక్తముమాంసములు కలది మేధ, మజ్జ, బొక్కలు కలిగింది. మలమూత్రశ్లేష్మలకు స్థానమైంది (67) మరోశరీరంకూడా ఈ మనదేహంనుండి ఉద్భవించిందే, మలినమైంది. అని తలచి ఓ మూఢురాలనీకొడుకును గూర్చి దుఃఖించొద్దు (68) ఒకవేళ ఎవరైనా ప్రయత్న పూర్వకముగా మృత్యువును తరిస్తే, పూర్వమందలివిద్వాంసులంతా ఎందుకు కష్టపడి ఉండేవాళ్ళు (బాధ) (69) తపస్సుతో విద్యతో, బుద్ధితో మంత్ర ఓషధిరసాయనములతో ఏ పండితుడూ మృత్యువును దాటడంలేదు (70) ఈవేళ ఒక ప్రాణినశిస్తుంది. ఓవరాననే ! రేపు మరో ప్రాణి నశిస్తుంది. ఈఅవయవము అనిత్యమైంది. అందువల్ల నీవు దుఃఖించొద్దు (71) మృత్యువు ఎప్పుడూ దగ్గరలోనే ఉంది. ప్రాణులకు సుఖమెక్కడోచెప్పు. పులిఎదురుగాఉంటే పశువులకు గడ్డిరుచిస్తుందా (72) ఓవరానన ! జన్మజరను జయించదలిస్తే, సర్వేశుని మృత్యుంజయుని ఉమాపతిని శరణువేడు (73) ఈమృత్యుభయము, ఈఘోరమైన జన్మజరాభ యము ఎంతవరకంటే దేహిశివపదాంబుజములను శరణుపొందనంతవరకే. (74) మిక్కిలి దారుణమైన సంసారమందు ఇక్కడ దుఃఖాలను అనుభవించి మనస్సుఎప్పుడు వియక్తమైందో అప్పుడు మహేశ్వరుని ధ్యానించు (75) శివధ్యాన రసామృతమును మనస్సుతోతాగేనరునకు సంసారవిషయాసవ మందు తిరిగి దప్పికగలగదు. (76) సర్వసంగములతో విముక్తమైమనస్సు వైరాగ్యంతో నియమింపబడి ఎప్పుడైతేశివపాదములందుమగ్నమైందో అప్పుడు మరోజన్మలేదు, ఉండదు (77) అందువల్ల ఓ భ##ద్రే! ఈమనస్సు శివధ్యానమునకు ఒకేఒక్క సాధనము ఈ మనస్సునుశోకమోహసమావిష్టంగా చేయకు. శివుని భజించు (78) సూతులిట్లన్నారు. ఈ విధముగా శివయోగిఅనునయపూర్వకముగా రాజ్ఞినిప్రభోదించాడు. ఆగురువుయొక్క చరణాంబుజములకు నమస్కరించి ఇట్లా పలికింది. (79)

మూ || రాజ్ఞ్యువాచ -

భగవన్‌మృతపుత్రాయాఃత్యక్తాయాఃప్రియమంధుభిః | మహారోగాతురాయామేకాగతిఃమరణంవినా || 80 ||

అతో7హంమర్తుమిచ్ఛామిసహైవశిశునా7మునా | కృతార్థాహంయదద్యత్వామవశ్యంమరణోన్ముఖీ || 81 ||

సూతఉవాచ -

ఇతితస్యావచఃశరుత్వాశివయోగీదయానిధిః | పూర్వోపకారంసంస్మృత్యమృతస్యాంతికమాయ¸° || 82 ||

సతదాభస్మసంగృహ్యశివమంత్రాభిమంత్రితం | విదీర్ణేతన్ముఖేక్షిప్త్వామృతంప్రాణౖరయోజయత్‌ || 83 ||

నబాలఃసంగతఃప్రాణౖఃశ##నైరున్మీల్యలోచనే | ప్రాప్తపూర్వేంద్రియబలోరురోదస్తస్యకాంక్షయా || 84 ||

మృత్యస్యపునరుత్థానంవీక్ష్యబాలస్యవిస్మితాః | జనాముముదిరేసర్వేనగరేషుపురోగమాః || 85 ||

అధానందభరారాజ్ఞీవిహ్వలోన్మత్తలోచనా | జగ్రాహతనయంశీఘ్రంబాష్పవ్యాకులలోచనా || 86 ||

ఉపగుహ్యతదాతన్వీపరమానందనిర్వృతా | సవేదాత్మాసమస్యంవాసుషుప్తేవపరిశ్రమాత్‌ || 87 ||

పునశ్చఋషభోయోగీతయోర్మాతృకుమారయోః | విషవ్రణయుతందేహంభవస్మనైవపరామృశత్‌ || 88 ||

తౌచతద్భన్మనాస్పృష్టౌప్రాప్తదివ్యకలేవరౌ | దేవానాంసదృశంరూపందధతుః కాంతిభూషితం || 89 ||

సంప్రాప్తేత్రిదివైశ్వర్యేయత్సుఖంపుణ్యకర్మణాం | తస్మాచ్ఛతగుణంప్రాపసారాజ్ఞీసుఖముత్తమం || 90 ||

తాంపాదయోర్నిపితితాంఋషభఃస్రేమవిహ్వలః | ఉత్థాప్యాశ్వాసయామానదుఃఖైర్ముక్తామువాచహ || 91 ||

అయివత్సేమహారాజ్ఞీవత్వంశాశ్వతీఃసమాః | యావజ్ఞీవసిలోకేస్మిన్నతావత్‌ప్రాప్య్స సేజరాం || 92 ||

ఏషతేతనయఃసాధ్విభద్రాయురితినామతః | ఖ్యాతింయాస్యతిలోకేషునిజంరాజ్యమవాప్స్యతి || 93 ||

అస్యవైశ్యస్యసదనేతాపత్తిష్ఠశుచిస్మితే | యావదేషకుమారస్తేప్రాప్తవిద్యోభవిష్యతి || 94 ||

సూతఉవాచ -

ఇతితాంఋషభోయోగీతంచరాజకుమారకం | సంజీవ్యభస్మవీర్యేణయ¸°దేశాన్‌యథేప్సితాన్‌ || 95 ||

ఇతిశ్రీస్కాందేమహాపురాణ ఏకాశీతిసాహస్ర్యాంసంహితాయాం తృతీయే బ్రహ్మోత్తరఖండేభద్రాయ్వాఖ్యానేఋషభయోగినాభద్రాయుజీవనం నామదశమో7ధ్యాయః ||

తా || రాజ్ఞివచనము - ఓ భగవాన్‌! పుత్రుడు మరణించిన, ప్రియబంధువులు విడిచిపెట్టిన, మహారోగాతురనైన నాకుమరణం తప్పమరోగతిఏది (80) అందువల్ల ఈపిల్లవాడితోకూడినేను చావదలిచాను. మరణోన్ముఖియైననేను ఈ వేళనిన్నుచూచాను. నేను ఈవేళచరితార్థురాలినయ్యాను (81) సూతునివచనము - అని ఆమె మాటలను విని దయానిధి యైన శివయోగిపూర్వపుఉపకారాన్నిస్మరించి చనిపోయినవానిదగ్గరకొచ్చాడు. (82) ఆతడప్పుడు భస్మాన్ని తీసుకొని దాన్ని శివ మంత్రంతో అభిమంత్రించి తెరచిన ఆతనినోటియందువేసి చనిపోయిన ఆపిల్లవానినిప్రాణములతోనిలిపాడు (83) ఆ బాలుడు ప్రాణములనుపొందినవాడై మెల్లగా కళ్ళు తెరచి, పూర్వపుఇంద్రియముల బలాన్ని పొంది స్తన్యముకొరకు ఏడ్చినాడు (84) చనిపోయినపిల్లవాడులేవటంచూచి ఆశ్చర్యపడినగరములందుపెద్దలంతా ఆనందించారు (85) ఆనందంతో నిండినరాణి విహ్వలురాలై, ఉన్మత్తలోచనయై, బాష్పవ్యాకులలోచనయైకొడుకును కౌగిలించుకొని తనను గాని ఇతరునిగాని గుర్తించలేదు. పరిశ్రమనుండి విముక్తయైసుషుప్తినందినదివలె ఐంది (87) తిరిగి ఋషభయోగి ఆమాతకుమారుల యొక్క విషcవణములతో కూడిన దేహమును ఆభస్మంతోనేపరామర్శించాడు. (88) ఆభస్మంత గలగానే వారుదివ్యశరీరం కలవారైదేవతలవంటి రూపాన్నిధరించారు. కాంతివంతమైంది ఆశరీరం (89) పుణ్యకర్మలకు త్రిదివైశ్వర్యములభిస్తే ఏసుఖమో అంతకన్నవేయిరెట్లధికమైన ఉత్తమసుఖాన్ని ఆరాణిపొందింది (90) కాళ్ళమీదపడిన ఆమెను ప్రేమ విహ్వలుడైనఋష భుడులేపి, ఓదార్చి దుఃఖములనుండి ముక్తినందినావనిఅన్నాడు (91) ఓవత్సే! మహారజ్ఞి అనేకసంవత్సరాలు జీవించు ఈ లోకంలో ఎంతకాలంఉంటావో అంతకాలం ముసలి తనాన్నిపొందవు (92) ఓ సాధ్వి ఈనీకొడుకు భద్రాయువనుపేరుతో ఈలోకాలలో కీర్తినొందుతాడు. తనరాజ్యాన్ని పొందుతాడు (93) ఈవైశ్యుని ఇంటిలో, ఈనీకొడుకు విద్యనభ్యసించేంతవరకు ఉండుఓశుచిస్మితే ! (94) సూతునివచనము - అని ఋషభయోగి ఆమెను ఆరాకుమారుని భస్మశక్తితో బ్రతికించి యధేచ్ఛగా దేశాలకు వెళ్ళాడు (95) అని శ్రీస్కాందమహాపురాణమందు ఏకాశీతి సహస్రసంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తరఖండమందు భద్రాయువుకధలోభద్రాయుజీవనమును ఋషభయోగిచేసినవిధముఅనునది పదవ అధ్యాయము || 10 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters