Sri Scanda Mahapuranamu-3    Chapters   

శ్రీః

శ్రీ స్కంద మహా పురాణము

(తృతీయ భాగము)

(బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్య ప్రారంభము)

ప్రధమోధ్యాయః

శ్రీ గణశాయనమః

శ్రీవేద వ్యాసాయ నమః

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే ||

తెల్లని వస్త్రము ధరించినవాడు, తెలుపు వర్ణమువాడు, నాలుగు చేతులవాడు, నిర్మలమైన ముఖము కలవాడు ఐన విష్ణువును సర్వ విఘ్నముల ప్రశాంతి కొరకు ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను)

నైమి శారణ్మ నిలయాః ఋషయః శౌనకాదయః | అష్టాంగయోగనిరతాః బ్రహ్మజ్ఞానైక తత్పరాః || 1 ||

ముముక్షవో మహాత్మానో నిర్మమా బ్రహ్మవాదినః | ధర్మ జ్ఞా అనసూయాశ్చ సత్యవ్రత పరాయణాః || 2 ||

జితేంద్రియా జిత క్రోధాః సర్వభూతదయాలవః భక్త్యా పరమయావిష్ణుం అర్చయంతః సనాతనం || 3 ||

తపస్తే పుర్మహా పుణ్య నైమిశేముక్తి దాయిని | ఏకదాతే మహాత్మానః సమాజం చక్రురుత్తమం || 4 ||

కథయంతో మహాపుణ్యాః కథాః పాపప్రణాశినీః భుక్తిముక్త్యోరుపాయంచ జిజ్ఞాసంతః పరస్పరం || 5 ||

షడ్‌ వింశతి సహస్రాణాం ఋషీణాం భావితాత్మనాం | తేషాం శిష్య ప్రశిష్యాణాం సంఖ్యాకర్తుంన శక్యతే || 6 ||

తా || నైమిశారణ్యంలో నివసించేవారు, శౌనకాది ఋషులు, వారు అష్టాంగయోగమందు ఆసక్తి కలవారు, బ్రహ్మజ్ఞాన మందే మనస్సు కలవారు, (1) మోక్షమును కోరుచున్నవారు, గొప్ప ఆత్మకలవారు, మమకారంలేని వారు, బ్రహ్మను గూర్చి చర్చించువారు, ధర్మ మెరిగిన వారు, అసూయలేనివారు, సత్యం చెప్పటం అనే వ్రతనిష్ఠులు (2) ఇంద్రియముల జయించినవారు, క్రోధమును జయించినవారు, అన్ని ప్రాణులందు దయజూపు వారు, వీరు మిక్కిలి భక్తితో, సనాతనుడైన విష్ణువును పూజిస్తూ పుణ్యాత్మకమైన, ముక్తిన ప్రసాదించే నైమిశారణ్య మందు తపమాచరించారు. ఒకసారి ఆశౌనకాది మహాత్ములు ఉత్తమమైన సమూహంగా ఏర్పడ్డారు. (అందరూ కలిశారు) (4) పాపములను నశింపచేసే మహాపుణ్యప్రదమైన కథలను చెప్పుకుంటూ, పరస్పరము భుక్తికి ముక్తికి చెందిన మార్గములను తెలుసుకుంటూ సమావేశమయ్యారు. (5) పరమాత్మను భావించుటచే పవిత్రులైన ఇరువది ఆరువేల ఋషులు వారి శిష్యప్రశిష్యులు, వీరిని లెక్కించుట సాధ్యముగాకున్నది. (6).

ఆత్రాంతరే మహా విద్వాన్‌ వ్యాసశిష్యో మహామునిః ! అగమన్నైమిశారణ్యం సూతః పౌరాణి కోత్తముః || 7 ||

తమాగతం మునిందృష్ట్యా జ్వలంతమివ పావకం | ఆర్ఝ్యాద్యైః పూజయామానుః మునయః శౌనకాదయః || 8 ||

సుఖోపవిష్టంతం సూత మాసనే పరమేశుభే| ప్రవచ్ఛుః పరమంగుహ్యం లోకానుగ్రహ కాంక్షయా| || 9 ||

సూత ! ధర్మార్థతత్వజ్ఞ స్వాగతం మునిపుంగవ l శ్రుతవాన్‌త్వం పురాణాని వ్యాసాత్‌ సత్యవతీ సుతాత్‌ ll10 ll

అతః సర్వ పురాణానాం అర్థజ్ఞోసి మహామునే l కానిక్షే త్రాణి పుణ్యాని కానితీర్థాని భూతలే l ll 11 ll

కథంవాలప్ప్యతేముక్తిః జీవానాంభవసాగరాత్‌ l కథం హరేహరౌవా పినృణం భక్తిః ప్రజాయతే l ll 12 ll

కేనసిద్ధ్యేతచ ఫలంకర్మణః త్రివిధాత్మనః l ఏతచ్చాన్యచ్చతత్సర్వం కృపయావదసూతజ ll

13 ll

బ్రూయుఃస్నిగ్థాయ శిష్యాయ గురవో గుహ్మమవ్యుత l ఇతివృష్టః తదాసూతోనైమిశారణ్యవాసిభిః ||14||

పక్తుం ప్రచక్రమేనత్వా వ్యాసం స్వగురుమాదితః ||14 1/2||

తాll ఇంతలో గొప్ప విద్వాంసుడు, వ్యాసునిశిష్యుడు, గొప్పముని, పౌరాణికులలో శ్రేష్ఠుడు ఐన సూతుడు నైమిశారణ్యం వచ్చాడు (7) అగ్నిలాగా వెలిగిపోతూ వచ్చిన ఆ మునిని చూచి, శౌనకాది ఋషులు అర్ఝ్యము (చేతులు కడుగుకోవటానికి నీళ్ళివ్వటం) మొదలగువానితో పూజించారు (8) పరమశుభ##మైన ఆసనంలో సుఖంగా కూర్చున్న ఆ సూతుణ్ణి, లోకములను అనుగ్రహించాలనే బుద్ధితో మిక్కిలి రహస్యమైన విషయాన్ని అడిగారు. (9) ధర్మతత్వ మెరిగిన మహార్షి శ్రేష్ఠుడ l ఓ సూతl నీకు స్వాగతము. సత్యవతీసుతుడైన వ్యాసుని నుండీ నీవు పురాణాలు విన్నావు (10) అందువల్ల ఓ మహాముని ! అన్ని పురాణముల అర్థమెరిగిన వాడవు నీవు. ఏ క్షేత్రము, ఏ తీర్థములు ఈ భూమిమీద పుణ్యప్రదమైనవి. జీవులకు సంసార సాగరమునుండి ముక్తి ఎట్లా లభిస్తుంది. విష్ణువు యందుకాని శివునియందుకాని మనుష్యులకు భక్తి ఎట్లాపుడ్తుంది. మూడు విధములైన కర్మల (మనోవాక్‌కాయముల) ఫలం దేనివల్ల సిద్ధిస్తుంది. ఇది, ఇతర విషయాలు అదంతా దయతో చెప్పండి, ఓ సూతజుడ! (13) ప్రీతి పాత్రుడైన శిష్యునకు రహస్యమైన విషయాన్నైనా గురువులు చెప్పుదురు. అని ఈ రకంగా నైమిశారణ్యమందున్న సూతుణ్ణి అడిగారు. (14) అప్పుడు (వారితో అడగబడి) సూతుడు తన గురవైన వ్యాసునకు నమస్కరించి ఆదినుండి ఇట్లా చెప్పనారంభించాడు. (14 1/2).

శ్రీసూత ఉవాచ -

సమ్యక్పృష్టమిదంవిప్రా యుష్మాభిర్జగతో హితం || 15 ||

రహస్యమేత ద్యుష్మాకం పక్ష్యామిశ్రుణుతాదరాత్‌ l మయానోక్తమిదం పూర్వం

కస్యాపిముని పుంగవాః || 16 ||

మనోనియమ్య విప్రేంద్రాః శ్రుణుధ్వం భక్తి పూర్వకం l అస్తిరామేశ్వరంనామ రామసేతౌ

పవిత్రితం || 17 ||

క్షేత్రాణా మపిసర్వేషాం తీర్థానా మపిచోత్తమం l దృష్టమాత్రే రామసేతౌ ముక్తిః సంసార సాగరాత్‌ || 18 ||

హరేహరౌచ భక్తిః స్యాత్‌ తథాపుణ్య సమృద్ధితా l కర్మణః త్రివిధస్యాపిసిద్ధిః స్యాన్నాత్ర సంశయః || 19 ||

యోనరోజన్మ మధ్యేతుసేతుం భక్త్యావలోకయేత్‌ l తన్యపుణ్యఫలంవక్ష్యే శ్రుణధ్వం మునిపుంగవాః || 20 ||

తాll లోక కల్యాణం కొరకు మీరు దీన్ని బాగా అడిగారు బ్రాహ్మణులారా (15) ఈ రహస్యాన్ని మీకు చెబుతున్నాను. ఆదరంతో వినండి. ఓ మునిశ్రేష్ఠులారా! ఈ విషయాన్ని ఇంతకు ముందు ఎవ్వరికీ చెప్పలేదు (16) భక్తితో, మనస్సును, నిగ్రహించుకొని వినండి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా ! రామసేతువు యందు పవిత్రమైనట్టిది, రామేశ్వరం అనే పేరు గలది ఉంది. (17) అది సర్వక్షేత్రములకన్న సర్వ తీర్థములకన్న ఉత్తమమైనట్టిది. రామసేతువును చూచినంత మాత్రమున సంసారసాగరము నుండి ముక్తి లభిస్తుంది. (18) హరి హరుల యందు (మనకు) భక్తి పుడ్తుంది. పుణ్యము సమృద్ధిగా పెరుగుతుంది. త్రివిధ కర్మలకు సిద్ది లభిస్తుంది. ఈ విషయంలో అనుమానం లేదు (19) జన్మ మధ్యలో ఏవ్యక్తి భక్తితో సేతువును చూస్తాడో ఆతనికి లభించే పుణ్యఫలాన్ని గూర్చి చెబుతున్నాను. ఓ మునిశ్రేష్ఠులారా ! వినండి (20).

మాతృతః పితృతశ్చైవ ద్వికోటికుల నంయుతః ! విర్విశ్య శంభునాకల్పం తతోమోక్షం

సమశ్నుతే ll 21 ll

గణ్యంతే పాంసవో భూమేః గణ్యంతే దివితారకాః ! సేత దర్శనజం పుణ్యం శేషేణా పినగణ్యతే ll 22ll

సమస్త దేవతారూపః సేతుబంధః ప్రకీర్తితః l తద్దర్శనవతః పుంసఃకః పుణ్యం గణితుంక్షమఃll 23ll

సేతుం దృష్ట్యనరోవిప్రః సర్వయాగకరః స్మృతః l స్నాతశ్చసర్వతీర్థేషు తపోతప్యత చాఖిలం ll24 ll

సేతుంగచ్చేతి యోబ్రూయాత్‌యంకంవాపి నరం ద్విజాః l సోపి తత్ఫల మాప్నోతికి మన్యైః బహుభాషణౖః ll 25 ll

సేతు స్నానకరోమర్త్యః సప్తకోటికులాన్వితః l సంప్రాప్య విష్ణు భవనం త్రత్త్రెవ పరిముచ్యతే ll 26 ll

సేతుంరామేశ్వరం లింగం గంధమాదన పర్వతం l చింతయన్మనుజః సత్యం సర్వపాపైః ప్రముచ్యతే ll 27 ll

మతృతః పితృతశ్చైవ లక్షకోటికులాన్వితః l (సంప్రాప్యవిష్ణు భవనం తత్రైవ పరిముచ్యతే) ll 28 ll

ముషావస్థాం వసాకూపంతధా వైతరణీం నదీం l శ్వభక్షం మూత్రపానంచ సేతుస్నాయీన పశ్యతి ll 29 ll

తప్తశూలం తప్త శిలాం పురీష హ్రదమేవచ l తథాశోణిత కూపంచ సేతు స్నాయీనపశ్యతి ll 30 ll

శాల్మల్యా రోహణం రక్త భోజనం కృమి భోజనం l స్వమాంసభోజనం చైవవహ్ని జ్వాలా ప్రవేశనం ll 31 ll

శిలావృష్ఠిం వహ్నివృష్టం నరకం కాలసూత్రకం l క్షారోదకం చోష్ణతోయం నేయాత్‌ సేత్వవలోకతః ll 32 ll

సేతుస్నాయీనరో విప్రః పంచపాతక వానపి l మాతృతః పితృతశ్చైవ శతకోటి కులాన్వితః ll 33 ll

కల్పత్రయం విష్ణుపదేస్థిత్వా తత్రైవ ముచ్యతే l అధః శిరః శోషణం చనరకం క్షారసేవనం ll 34 ll

పాషాణయంత్రపీడాంచ మరుత్‌ ప్రవతనం తథా lపురీష లేపనం చైవ తథాక్రకచదారణం ll 35 ll

పురీష భోజనం రేతః పానం సంధిషు దాహనం l అంగార శయ్యా భ్రమణం తథా ముసల మర్దనం ll36 ll

ఏతాని నరకాణ్యద్ధా సేతుస్నాయీనపశ్యతి l సేతుస్నానం కరిష్యే హమితి బుద్ధ్యావిచింతయన్‌ ll 37 ll

తాll తల్లికి చేందిన అట్లాగే తండ్రికి చెందిన రెండు కోట్లకులము వారితో కూడినవాడై శివునితో కల్పకాలము సుఖముగా ఉండి ఆ పిదప మోక్షమును పొందుతాడు (21) భూమి యందలి రేణువుల లెక్కింపవచ్చు, ఆకాశంలో తారకల లెక్కింపవచ్చు, కాని సేతు దర్శనం వల్ల కలిగే పుణ్యాన్ని éశేషుడు కూడా లెక్కింపలేడు (22) సేతుబంధము సమస్త దేవతల రూపము అని చెప్పబడింది. కనుక దాని దర్శనం పొందిన పురుషుని పుణ్యాన్ని లెక్కింప ఎవడు సమర్థుడు (23) సేతువును చూచిన బ్రాహ్మణుడు. సర్వయాగములను నిర్వర్తించిన వాడుగా చెప్పబడ్డాడు అన్ని తీర్థములలో స్నానము చేసినవాడు, నమస్త తవములను ఆచరించినవాడౌతాడు. (24) బ్రాహ్మణులు ఏమనిషితోనైనా సేతువునకు వెళ్ళు అని అన్నట్లైనచో ఆతడు కూడా ఆ ఫలితాన్ని పొందుతాడు. ఎక్కువగా మాట్లాడి ఏం ప్రయోజనం (25) సేతుస్నానం చేసే మనిషి, ఏడుకోట్లకులము వారితో కూడినవాడై విష్ణుభవనాన్ని పొంది అక్కడే ముక్తి నందుతాడు (26) సేతువును, రామేశ్వరంలోని లింగాన్ని, గంధమాదన పర్వతాన్ని చింతించే మనిషి అన్ని పాపములనుండి ముక్తుడౌతాడు ఇది సత్యము (27) తల్లికి మరియు తండ్రికి చెందిన లక్షకోటి కులము వారితో కూడినవాడై విష్ణు భవనాన్ని పొంది తల్లికి మరియు తండ్రికి చెందిన లక్షకోటి కులము వారితో కూడినవాడై విష్ణు భవనాన్ని పొంది అక్కడే ముక్తి నందుతాడు. మూడు కల్పముల కాలము శంభు పదమందుండి అక్కడే ముక్తి నందుతాడు. (28)మూష అవస్థను (ఎలుకస్థితి), వసకూపమను, వైతరిణినదిని, కుక్కను తినుటను, మూత్రపానమును సేతుస్నానము చేసినవాడు చూడడు (29) కాల్చిన శూలమును, కాల్చినశిలను, పురీషపు హ్రదమును (లోతుగల గుంట), రక్తపు బావిని సేతువు యందు స్నానము చేసినవాడు చూడడు. (అనగా ఈ బాధలు నరకంలో రావు). శాల్మలి (వృక్షం)ని ఎక్కటం, రక్తపు భోజనము పురుగులను భుజించుట,, తనమాంసం తానే తినుట, అగ్నిజ్వాలలో ప్రవేశించుట (31) రాళ్ళవాన, అగ్నివాన, నరకము, యమపాశము, కారపునీరు, వేడినీరు వీటిని సేతువును చూసినవాడు పొందడు (32) పంచ పాతకములు కలిగినవాడైనా, సేతువు యందు స్నానము చేసిన విప్రుడు, తల్లికి చెందిన, తండ్రికి చెందిన నూరుకోట్ల కులము వారితో కూడినవాడై (33) మూడు కల్పములు విష్ణు స్థానమందుండి అక్కడే ముక్తి నందుతాడు. తలక్రిందులు వేలాడుట, శోషిల్లుట, నరకము, కారమును సేవించుట (34) రాతియంత్రవుపీడ సుడిగాలిలోపడి పోవటం, పురీషమును పూసుకోవటము, రంపముతో చీల్చబడటము (35) మలభోజనము, రేతస్సును తాగటము, సంధులలో మంటలు, నిప్పుల పడక యందు తిప్పబడటం, రోకళ్ళతో కొట్టబడటం (36) ఇవన్నీ నరకాలు (అందలి కష్టాలు). సేతువు యందు స్నానం చేసేవాడు వీటన్నిటిని చూడడు (పొందడు). సేతు స్నానమును చేస్తాను, నేను, అని బుద్ధితో ఆలోచిస్తూ (37)

గచ్ఛేచ్ఛత పదంయస్తు నమహాపాతకో పినన్‌ l బహూనాం కాష్ఠయంత్రాణాం కర్షణం శస్త్ర భేదనం ll38 ll

పతనోత్పతనం చైవగదాదండని పీడనం l గజ దంతై శ్చహననం నానా భుజగదంశనం ll 39 ll

ధూమపానం పాశబంధం నానాశూలని పీడనం l ముఖేచనా సికాయాంచ క్షారోదక నిషేచనం ll 40 ll

క్షారాంబుపానం నరకం తప్తాయః సూచిభక్షణం l ఏతానినరాకాన్యద్ధానయాతి గతపాతకః ll 41 ll

క్షారాంబు పూర్ణరంధ్రాణాం ప్రవేశం మలభోజనం l స్నాయుచ్చేదం స్నాయుదాహం అస్థిభేదన మేవచ ll 42 ll

శ్లేష్మాదనం పిత్తపానం మహాతిక్తనిషేవణం l అత్యుష్ణతైలపానంచ పానంక్షారోదకన్యచ ll 43 ll

కషాయోదక పానం చతప్తపాషాణ భోజనం l అత్యుష్ణసికతా స్నానం తథాదశన మర్దనం l ll 44 ll

తప్తాయః శయనం చైవ సంతప్తాంబు నిషేచనం l సూచి ప్రక్షేపణం చైవ నేత్రయోః ముఖ సంధిషు ll 45 ll

శిశ్నే సవృషణచైవ హ్యయో భారస్య బంధనం l వృక్షా గ్రాత్పతనం చైవ దుర్గంధపరి పూరితే ll 46 ll

తీష్ణధారాస్త్ర శయ్యాంచరేతః పానాదికంతథా l ఇత్యాది సరకాన్‌ ఘోరాన్‌ సేతుస్నాయీన పశ్యతి ll 47 ll

సేతుసైకత మధ్యేయః శేతేతత్పాం సుకుంఠితఃl యావంతః పాంసవోలగ్నాః తస్యాంగే విప్రసత్తమాః ll 48 ll

తావతాంబ్రహ్మహత్యానాం నాశః స్యాన్నాత్ర సంశయః l సేతుమధ్యస్థవాతేన యస్యాంగం స్పృశ్యతే ఖిలం ll 49 ll

సురాపానాయుతం తస్యతత్‌క్షణాదేవనశ్యతి l వర్తతేయస్య కే శాస్తువ పనాత్‌ సేతుమధ్యతః ll 50 ll

గురుతల్పాయుతం తస్యతత్‌క్షణా దేవనశ్యతి l యస్యాస్థిసేతు మధ్యేతు స్థాపితం పుత్రపౌత్రకైః ll 51 ll

స్వర్ణస్తేయా యుతం తస్య తక్షణా దేవనశ్యతి ll 51 1/2 ll

తా ll (సేతు స్నానమును గూర్చి ఆలోచిస్తూ) నూరు అడుగులు వేసినవాడు గొప్ప పాతకుడైన (పాపముక్తుడౌతాడు). అనేకమైనకట్టె యంత్రములను లాగటము, శస్త్రములతో భేదింపబడుట (38) పడటము,పైకెగరటం, గదాదండముతో పీడ, ఏనుగుదంతములతో చంపబడుట, పాములచే కరిపించబడుట, (39) పొగత్రాగుట, తాళ్ళచే కట్టబడుట, రకరకాల శూలములతో పీడింపబడుట, ముఖమందు ముక్కు యందు కారపునీళ్ళు చల్లబడుట (40) కారపునీళ్ళు తాగుట, నరకము, కాల్చిన ఉక్కుసూదిని తినుట, ఇవన్ని నరకములు ఈ పాపములన్నీ పోతాయి. ఈ నరకములకు చేరడు (స్నేతుస్నానం చేసినవాడు) (41) కారపునీళ్ళతో నిండిన రంధ్రములలో ప్రవేశించటం, మలభోజనము, స్నాయు (నరము) వులఛేదము, స్నాయువుల దాహము, బొక్కల భేదనము (42) శ్లేష్మభక్షణము, పిత్తమును తాగుట, చేదును భుజించటం, బాగా వేడిగల నూనేను తాగటం, కారపునీరును తాగటం, (43) వగరు నీరు తాగటము, కాల్చిన రాయిని మింగటం, మిక్కిలి వేడిగల ఇసుకతో స్నానము, దంతముల మర్దనము (44)కాల్చిన ఉక్కుపై పడుకోవటం, బాగా కాగిన నీటిని సేవించటం, కళ్ళు, ముఖసంధులలో సూదితో పొడవబడటం, (45)ఉక్కుముద్ద బరువును వృషణములు శిశ్నమునకు కలిపికట్టబడటం, దుర్గంధంతో నిండిన దానిలో చెట్టు మీదినుండి పడటం (46) తీక్ణమైన అంచులు గల అస్త్రముల శయ్యపై పడుకోవటం, రేతస్సును తాగటం, ఇవి మొదలుగా ఘోరమైన నరకములను సేతువు యందు స్నానమాచరించిన వాడు పొందడు (47) సేతువు దాని ఇసుక వీని మధ్యలో ఆ ఇసుక రేణువులు ఒంటి నిండా కలిగి నిద్రపోయినవాని శరీరంలో ఎన్ని ఇసుకరేణువులు ఉన్నాయో (48) అన్ని బ్రహ్మహత్యల నాశము జరుగుతుంది, అనుమానం లేదు. సేతు మధ్యంలోని, గాలితో శరీరమంతా స్పృశింపబడ్డ (49) వాని అయుత (పదివేలు) నురాపానముల పాపము, ఆక్షణంలోనే నశిస్తుంది. తలకోరిగించుకోటం వల్ల సేతు మధ్యంలో పడ్డ వెంట్రుకలు కలవాని (50) అయుతగురుతల్పగత పాపము ఆక్షణంలోనే నశిస్తుంది. పుత్రపౌత్రులతో సేతుమధ్యలో స్థాపించబడ్డ అస్థికలుకల వాని అయుత స్వర్ణస్తేయ పాపము, ఆక్షణంలోనే నశిస్తుంది.

స్మృత్వాయం సేతుమధ్యేతు స్నానం కుర్యాత్‌ద్విజోత్తమాః మహాపాతకి సంసర్గదోషః తస్యలయం ప్రజేత్‌ ll52 ll

మార్గభేదీ స్వార్థపాకీయతి బ్రాహ్మణదూషకః l అత్యాగీ వేదవిక్రేతా పంచైతే బ్రహ్మఘాతకాః ll 53 ll

బ్రాహ్మణాన్యః సమాహూయదాస్యామీతిధనాదికం l పశ్చాన్నాస్తీతియో బ్రూతే బ్రహ్మహాసోపికీర్తితః ll54ll

పరిజ్ఞాయయతోధర్మాన్‌ తసై#్మయోద్వేషమాచరేత్‌ l అవజానాతివా విప్రాన్‌ బ్రహ్మహాసోపికీర్తితః ll55 ll

జలపానార్థమాయాతం గోవృందంతు జలాశ##యే | నివారయతియో విప్రాబ్రహ్మహా సోపికీర్తితః ll 56 ll

సేతుమేత్యతుతే సర్వే ముచ్యంతే దోష సంచయైః బ్రహ్మఘాతక తుల్యాయే సంతిచాన్యే ద్విజోత్తమాః ll 57 ll

సేతుమాగత్యతే సర్వేముచ్యంతేనాత్ర సంశయః ఔపాసన పరిత్యాగీ దేవతాన్న స్యభోజకః ll 58 ll

సురాపయోషిత్‌ సంసర్గీ గణికాన్నాశనస్తథా l గణాన్న భోజకశ్చైవ పతితాన్నరతశ్చయః ll 59 ll

ఏతేనురాపినః ప్రోక్తాః సర్వ కర్మ బహిష్కృతా ః |సేతుస్నానేన ముచ్యంతే తేసర్వేహతకి ల్బిషా ll 60 ll

సురాపతుల్యాయేచాన్యే ముచ్యంతే సేతుమజ్జనాత్‌ ll60 1/2 ll

తా ll సేతు మధ్యంలో భగవంతుని స్మరించి స్నానంచేసిన బ్రాహ్మణులు మహాపాతకి సంసర్గం వల్ల కలిగే దోషం నుండి ముక్తులౌతారు. (52) మార్గమును తప్పినవాడు, తన కోసం వండుకునే వాడు, యతులను బ్రాహ్మణులను దూషించేవాడు, అత్మాశకలవాడు, వేదములను అమ్మేవాడు ఈ ఐదుగురు బ్రహ్మఘాతకులు (53) బ్రాహ్మణులను పిలిచి ధనమిస్తానని చెప్పి, తర్వాత లేదనేవాడు బ్రహ్మహా అని పిలువబడుతాడు (54) ఒకనినుండి ధర్మమును తెలుసుకొని అతనికే ద్వేషమాచరించువాడు, బ్రాహ్మణులను అవమానించువాడు అతడుకూడా బ్రహ్మహా అని పిలువబడతాడు (55) జలాశయంలోకి నీరుతాగటానికి వచ్చిన ఆవుల మందను నివారించే వాడుకూడా బ్రహ్మహా అని పిలువబడుతాడు (56) వాళ్ళందరూ సేతువును చేరాక దోషముల నుండి ముక్తులౌతారు. బ్రహ్మఘాతుకులతో సమానమైన వారుకూడా ఇతర బ్రాహ్మణులు (57) సేతువును చేరి ముక్తులౌతారు. ఇందులో అనుమానంలేదు. ఔపాసనను వదిలినవాడు, దేవతాన్నమును భుజించినవాడు (58) మద్యం సేవించటం, స్త్రీ సహవాసం కలవారు, వేశ్యాన్నమును భుజించేవారు, ప్రమథుల అన్నమును తినువారు, పతితుల అన్నమందు ఆసక్తి కలవాడు (59) వీరందరు సురావులు అని పిలువబడతారు. అన్ని కర్మలందు బహిష్కరింపబడ్డవారు, సేతుస్నానంవల్ల పాపాలన్ని పోయి (వీరందరు) ముక్తులౌతారు. (60) సురాపతుల్యులైన ఇతరులు కూడా సేతుస్నానం వల్ల ముక్తులౌతారు (60 1/2).

కందమూల ఫలానాంచకస్తూ రీపట్టవాససాం ll 61 ll

పయశ్చందన కర్పూరక్రము కాణాంతథైవచ l మధ్వాజ్యతామ్రకాం స్యానాం రుద్రాక్షాణాంతథైవచ ll 62 ll

చోరకాస్తు పరిజ్ఞేయాః సువర్ణస్తేయినః సమాః | తేసేతుక్షేత్రమాగత్య ముచ్యంతేనాత్ర సంశయః ll 63 ll

అన్యేచస్తేయినః సర్వేసేతుస్నానేన వైద్విజాః l ముచ్యంతే సర్వపాపే భ్యోనాత్రకార్యా విచారణా ll 64 ll

భగినీం పుత్రభార్యాం చత థెవ చరజస్వలాం l భ్రాతృభార్యాం మిత్ర భార్యాం మద్యపాంచ పరస్త్రియం ll 65 ll

హీనస్త్రి యంచ విశ్వస్తాం యో భిగచ్ఛతి రాగతః | గురుతల్పీన విజ్ఞేయః సర్వకర్మ బహిష్కృతః ll 66 ll

ఏతేచాన్యేచయే సంతి గురుతల్పగ తుల్యకాః l తే సర్వే ప్ర­ముచ్యంతే సేతుస్నానేన వైద్విజా ll 67 ll

ఏతైః సంసర్గిణోవిప్రాః యే చాన్యే సంతి పాపినః l సేతుస్నానేన మహతాతే పి మోక్షమవాప్నుయుః ll 68 ll

యాగం వినాదేవలోకే ఘృతాచీమేనకాదిభిః l సంభోగ కామినోవిప్రాః స్నాతుంసేతా వఘావహే ll 69 ll

అనిషేవ్యరవింవహ్ని మను పాస్యపరాన్‌సురాన్‌ l శుభకామీజనః సేతౌకుర్యాత్‌స్నానం సభక్తికం ll 70 ll

తిలాన్‌ భూమిం సువర్ణంచధాన్యం, తందులమేవచ l అదత్వేచ్ఛంతితే స్వర్గం స్నాతుంసేతౌతుతేద్విజాః ll 71 ll

ఉపవాసైః వ్రతై ః కృత్స్నైః అసంతావ్యనిజాంతనుం l స్వర్గాభిలాషిణః పుంసః స్నాతుంసేతౌవిముక్తి దే ll72 ll

సేతుస్నానం మోక్షదంహి మనః శుద్ధిప్రదం తథా l జపాత్‌హోమాత్‌ తథా దానాత్‌ యాగాచ్చ తపసో పిచ సేతుస్నానం విశిష్టం హి పురాణ పరిపఠ్యతే ll 73 1/2 ll

తా ll కందమూల ఫలములను, కస్తూరి పట్టువస్త్రములను (61) పాలు, చందనము, కర్పూరము పోకలు, తేనె, నేయిరాగి, కంచు, రుద్రాక్షలు (62) వీటిని హరించు వారిని చోరకులు అని తెలుసు కోవాలి. వీరు సువర్ణస్తేయి(దొంగ)లతో సమానము. వీరు సేతు క్షేత్రమునకు వచ్చి ముక్తులౌతారు. అనుమానంలేదు (63) ఇతర విదములైన దొంగలుకూడా సేతు స్నానం వల్ల అన్ని పాపముల నుండి ముక్తులౌతారు. ఇందులో ఆలోచించాల్సింది లేదు (64) చెల్లెలు, పుత్రుని భార్య, రజస్వలను, సోదరుని భార్యను, మిత్రుని భార్యను తాగిన దానిని, పరస్త్రీని, హీనస్త్రీని, విధవనురక్తుడై పొందేవాడుగురు తల్పగుడు అని గ్రహించాలి. అతడు అన్ని కర్మలలో బహిష్కృతుడు. (66) వీరు, వీరిలాగురుతల్పగ, తుల్యులైన ఇతరులు అందరు సేతుస్నానంతో ముక్తులౌతారు. (67) వీరితో సహవాసంగల పాపులైన ఇతర విప్రులందరు గొప్పదైన సేతుస్నానంతో (వారుకూడా)మోక్షం పొందుతారు (68) యజ్ఞం చేయకుండా దేవలోకంలో ఘృతాచీ మేనకాదులతో సంభోగాన్నికోరే విప్రులు పాపనాశకమైన సేతువు యందు స్నానం చేయటానికి వస్తారు (69) సూర్యుని, అగ్నిని సేవించకుండ, పరులైన దేవతలను ఉపాసించకుండ ఉన్నవారు శుభకాములైతే భక్తితోకూడి సేతువుయందుస్నానం చేయాలి (70) నువ్వులు, భూమి సువర్ణము, ధాన్యము, బియ్యము వీటిని దానం చేయకుండానే స్వర్గంకోరెవారు సేతువు యందు స్నానం చేయటానికి వస్తారు (71) తమ శరీరాన్ని ఉపవాసములతో వ్రతములతో పూర్తిగా తపింపచేయకుండానే స్వర్గాన్ని కోరే పురుషులు ముక్తినిచ్చేసేతువు యందు స్నానం చేయటానికి వస్తారు. (72) సేతుస్నానము ముక్తినిచ్చేది, అట్లాగే మనః శుద్ధిని కల్గించేది. జపము, హోమము దానము, యాగము, తపము వీటన్నిటికన్నా (73) సేతుస్నానము విశిష్టము అని పురాణంలో చెప్పబడింది. (73 1/2).

అకామనాకృతం స్నానం సేతౌపాపవినాశ##నే ll 74 ll

అపునర్భవదం ప్రోక్తం సత్యముక్తం ద్విజోత్తమా ః l యః సంపదం సముద్దిశ్యస్నాతి సేతౌనరోముదా ll 75 ll

ససంపదమవాప్నోతి విపులాంద్విజపుంగవా ః l శుద్ధ్యర్థంస్నాతిచేత్‌ సేతౌ తదాశుద్ధి మవావ్నుయాత్‌ ll 76 ll

రత్యర్థంయదిచ స్నాయాత్‌ అప్సరోభిర్నరోదివి l తదారతిమవాప్నోతి స్వర్గలోకే7 మరీజనైః ll 77 ll

ముక్త్యర్థం యదిచస్నాయాత్‌ సేతౌముక్తి ప్రదాయిని l తదాముక్తి మవాప్నోతి పునరావృత్తి వర్జితాం ll 78 ll

సేతుఃస్నానేన ధర్మః స్యాత్‌ సేతుస్నానాదఘక్షయః l సేతుః స్నానం ద్విజశ్రేష్ఠాః సర్వకామ ఫలప్రదం ll 79 ll

సర్వప్రతాధికం పుణ్యం సర్వయజ్ఞోత్తరం స్మృతం l సర్వయోగాధికం ప్రోక్తం సర్వతీర్థాధికం స్మృతం ll 80 ll

ఇంద్రాది లోకభోగే షురాగోయేషాం ప్రవర్తతే l స్నాతవ్యంతై ః ద్విజశ్రేష్ఠాః సేతౌరామకృతేసకృత్‌ ll 81 ll

బ్రహ్మలోకేచవైకుంఠే కైలాసే పి శివాలయే l రంతుమిచ్ఛాభ##వేద్యేషాం తేసేతౌస్నాంతు సాదరం ll 82 ll

అయురారోగ్య సంపత్తి మతిరూపగుణాఢ్యతాం | చతుర్ణామపివేదానాంసాంగానాం పారగామినాం ll 83 ll

సర్వశాస్త్రాధి గంతృత్వం సర్వమంత్రేష్వభిజ్ఞతాం l సముద్దిశ్యతుయః స్నాయాత్‌సేతౌ సర్వార్థసిద్ధిదే ll 84 ll

తత్తత్‌సిద్ధిమవాప్నోతి సత్యంస్యాన్నాత్ర సంశయః దారిద్ర్యాత్‌ నరకాద్యేచ మనుజా భువిబిభ్యతి ll 85 ll

స్నానం కుర్వంతుతేసర్వేరామసేతౌ విముక్తిదే l శ్రద్ధయా సహితో మర్త్యః శ్రద్ధయా రహితో పివా ll 86 ll

ఇహలోకే వరత్రాపి సేతుస్నాయీనదుః ఖభాక్‌ l సేతుస్నానేన సర్వేషాం నశ్యతే పాప సంచయః ll 87 ll

తా ll పాపనాశకమైన సేతువు యందు కోరికలేకుండాచేసే స్నానము (74) జన్మరాహిత్యాన్ని ఇచ్చేది ఇది సత్య విషయము ఓ బ్రాహ్మణులారా! సంపదనుద్దేశించి స్నానం చేసిన నరుడు (75) అధికమైన సంపదను పొందుతాడు. సేతువుయందు శుద్ధికోసం స్నానం చేసేవాడు శుద్ధిని పొందుతాడు. (76) స్వర్గంలో అప్సరసలతో, రతికావాలనికోరేవాడు స్నానంచేస్తే అట్లాగే స్వర్గంలో దేవతా స్త్రీలతో రతిని పొందుతాడు (77) ముక్తినిచ్చే సేతువు యందు ముక్తి కొరకు స్నానం చేసినట్టైతే పునర్జన్మ లేని ముక్తిని పొందుతాడు (78) సేతుస్నానం వల్ల ధర్మము, సేతుస్నానం వల్ల పాపనాశనము. అన్ని కోరికల ఫలములనిచ్చేది (79) సర్వవ్రతములకన్న అధికపుణ్యప్రదము, సర్వతీర్థమలకన్న అధికము, సర్వయజ్ఞములకన్న ఉత్తమమ, సర్వయోగములకన్న అధికము (80) ఇంద్రాది లోకములందలి సుఖములపై కోరికగలవారు రామకృతమైన సేతువు యందు ఒకసారి స్నానంచేయాలి (81) బ్రహ్మలోకంలో, వైకుంఠంలో కైలాసంలో, శివాలయంలోను సుఖించుటకు ఇచ్ఛకలవారు సేతువు యందు ఆదరంగా స్నానం చేయండి (82) ఆయువు, ఆరోగ్యము, సంపద, అత్యంత సౌందర్యము, మంచి గుణములు, సాంగములైన నాలుగు వేదముల పారగామిత్వము (83) సర్వ శాస్త్రములను పొందటం, సర్వ మంత్రములందు నేర్పు వీటన్నిటిని ఉద్దేశించి, సర్వార్థములనిచ్చే సేతువు యందు స్నానమొనర్చిన వారు (84) ఆయా సిద్ధులను పొందుతారు. ఇందులో అనుమానం లేదు. ఇది సత్యము. దారిద్య్రం నుండి నరకం నుండి భయపడే లోకంలోని మనుష్యులు (వారందరు) (85) ముక్తి నిచ్చే రామసేతువు యందు స్నానం చేయాలి. శ్రద్ధ కలిగిన వాడుకాని, శ్రద్ధలేని వాడుకాని (86) ఇక్కడ, పరలోకంలో దుఃఖమును పొందడు, సేతువులో స్నానం చేసిన యెడల, అందరి పాపసంచయము నశిస్తుంది. (87).

వర్దతే దర్మరాశిశ్చ శుక్లపక్షే యథాశశీ l యధారత్నాని వర్ధంతే సముద్రేవి విధాన్యపి ll88 ll

తథాపుణ్యాని వర్ధంతే సేతుస్నానేన వైద్విజాః కామధేనుర్యథాలోకే సర్వాన్‌ కామాన్‌ ప్రయచ్ఛతి ll 89 ll

చింతామణిర్యథా దద్యాత్‌ పురుషాణాం మనోరథాన్‌ l యథామరతరుర్‌ దద్యాత్‌ పురుషాణామభీప్సితం ll90 ll

సేతుస్నానం తథానౄణాం సర్వాభీష్టాన్‌ ప్రదాస్యతి l అశక్తః సేతుయాత్రాయాం దారిద్ర్యేణ చమానవః ll 91 ll

యాచిత్వాసధనం శిష్టాత్‌ సేతౌ స్నానం సమాచరేత్‌ స్నానం సమాచరేత్‌ సేతుస్నాన సమం పుణ్యం తత్ర దాతా సమశ్నుతే ll92 ll

తథాప్రతి గృహీతాపి వ్రాప్నోత్యవికలం ఫలం l సేతుయాత్రాం సముద్దిశ్య గృహ్ణీయాత్‌ బ్రాహ్మణాత్‌ ధనం ll 93 ll

క్షత్రియాదపిగృహ్ణీయాత్‌ నధద్యుః బ్రాహ్మణాయది l వైశ్యాద్వాప్రతిగృహ్ణీయాత్‌నవ్రయచ్ఛంతి చేస్నృపాః ll 94 ll

శూద్రాన్నప్రతి గృహ్ణీయాత్‌ కథంచిదపిమానవః | యః సేతుం గచ్ఛతః పుంసోధనం వాధాన్యమేవవా ll 95 ll

దత్వావస్త్రాదికంవాపి ప్రవర్త యతిమానవః సో శ్వమేధాది యజ్ఞానాం ఫలమాప్నోత్యనుత్తమం ll96 ll

చతుర్ణామపివేదానాం పారాయణ ఫలంలభేత్‌ l తులాపురుష ముఖ్యానాం దానానాం ఫల మశ్నుతే ll 97 ll

బ్రహ్మహత్యా దిపాపానాం నాశః స్యాత్‌నాత్ర సంశయః | బహునాకింప్రలాసేన సర్వాన్‌కామాన్‌ సమశ్నుతే ll 98 ll

ఏవం ప్రతిగ్రహీతాపి తత్తుల్య ఫలమశ్నుతే | యా చతః సేతుయాత్రార్థంన ప్రతిగ్రహా కల్మషం ll 99 ll

సేతుంగచ్ఛ ధనంతే హందాస్యామీతి ప్రలోభ్యయః|పశ్ఛన్నాస్తీ తిచ బ్రూయాత్‌తమాహుఃబ్రహ్మఘాతకం ll100 ll

లోభేనసేతు యాత్రార్థం సంపన్నోపి దరిద్రవత్‌ l మానవోయదియాచేత తమాహుఃస్తే యినం బుధాః ll 101 ll

గమిష్యేసేతు మితివై యోగృహీత్వాదనంనరః | నయాతిసేతుంలో భేన తమాహుః బ్రహ్మఘాతకం ll 102 ll

యేనకేనాప్యుపాయేన సేతుంగచ్ఛేన్న రోముదా l అశక్తోదక్షిణాం దత్వాగమయే ద్వాద్విజోత్తమమ్‌ ll 103 ll

యాచిత్వాయజ్ఞకరణయథా దోషోన విద్యతే l యాచిత్వాసేతు యాత్రాయాం తథా దోషోనవిద్యతే ll 104 ll

యాచిత్వాప్యన్యతో ద్రవ్యం సేతుస్నానే ప్రవర్తయేత్‌ l సో పితత్ఫలమాప్నోతి సేతుస్నాయీనరా యథా ll105 ll

జ్ఞానేనమోక్ష మభియాంతి కృతేయుగేతు | త్రేతాయుగే యజనమేవ విముక్తి దాయి

శ్రేష్ఠం తథాన్యయుగ యోరపి దానమాహుః l సర్వత్రసేత్వభిషవోహివ రోనరాణాం ll 106 ll

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే సేతుగమనఫలా దివర్ణనం నామ ప్రథమోధ్యాయః

తా ll శుక్లపక్షంలో చంద్రుడు పెరిగినట్లు ధర్మము పెరుగుతుంది. సముద్రంలో వివిధ రత్నములు పెరిగినట్లు (88) సేతు స్నానం వల్ల పుణ్యములు పెరుగుతాయి. లోకంలో కామధేనువు అన్ని కోరికల నిచ్చినట్టు (89) మనుష్యులకోరికలను చింతామణి తీర్చునట్లు, మనుష్యులు కోరికలను కల్పవృక్షం ఇచ్చునట్లు (90) సేతుస్నానం కూడా మనుష్యుల అన్ని కోరికలను తీరుస్తుంది. దరిద్రంవల్ల సేతుయాత్రలో అశక్తుడైన మనిషి (91) శిష్టుల నుండి ఆధనాన్ని యాచించి సేతుస్నానమాచరించాలి. ధనమును ఇచ్చినవాడు సేతుస్నానంతో సమానమైన పుణ్యమును పొందుతాడు (92) అట్లాగే స్వీకరించినవాడు కూడా అధికఫలితాన్ని పొందుతాడు. సేతుయాత్రకొరకు బ్రాహ్మణుని నుండి ధనం స్వీకరించాలి. (93) బ్రాహ్మణులు ఇవ్వని పక్షంలో క్షత్రియుని నుండి గ్రహించాలి ఒకవేళ రాజులు ఇవ్వని పక్షంలో వైశ్యుని నుండైనా గ్రహించాలి (94) ఎట్టిస్థితిలోనైనా శూద్రుని నుండి ధనం స్వీకరించరాదు. సేతువునకై వెళ్ళే వానికి ధనముకాని ధాన్యముకాని (95) వస్త్రాదికములుకాని ఇచ్చి ప్రేరేపించే మనిషి అశ్వమేధాది యజ్ఞముల ఫలమును పొందుతాడు. (96) నాల్గువేదములను పారాయణం చేస్తే వచ్చే ఫలాన్ని దీనివల్ల పొందుతాడు. తులా పురుష మొదలగు ముఖ్యదానముల ఫలాన్ని పొందుతాడు (97) బ్రహ్మహత్యాదిపాపముల నాశం కల్గుతుంది. ఎక్కువేం చెప్పాలి, అన్ని కోరికలను పొందుతాడు (98) ఆరకంగానే స్వీకరించినవాడుకూడా దానితో సమానమైన ఫలితాన్ని పొందుతాడు. సేతుయాత్ర కొరకు యాచించిన వానికి, దానం స్వీకరించటం వల్ల వచ్చే చెడు ఫలం కలుగదు (99) సేతువుకు వెళ్ళు, నీకునేను ధనమిస్తాను అని ఆశ##పెట్టి, తర్వాత లేదని చెప్పేవాణి బ్రహ్మఘాతకుడని అంటారు (100) డబ్బున్నవాడుకూడా దరిద్రునివలె సేతుయాత్ర కొరకు లోభిగా యాచిస్తే అతనిని దొంగ అని అంటారు (101) సేతువుకు వెళ్తాను ధనం ఇవ్వండి అని తీసుకొని లోభంతో సేతువుకు వెళ్ళని వాణ్ణి బ్రహ్మఘాతకుడు అని అంటారు (102) ఏదోరకంగాసంతోషంతో మనుష్యుడు సేతువుకు వెళ్ళాలి. తనకు వెళ్ళటానికి చేతకానప్పుడు బ్రాహ్మణునకు దక్షిణనిచ్చి పంపించాలి (103) యాచించి యజ్ఞం చేయటంలో దోషంలేనట్లే, యాచించిసేతువునకు పోతే దోషం లేదు (104) ఇతరుల నుండి ద్రవ్యం యాచించైనా సేతుస్నానమాచరింపచేయాలి. ఆతడుకూడా సేతుస్నానం చేసిన వానివలె ఆ ఫలితము పొందుతాడు (105) కృతయుగంలో జ్ఞానంవల్ల మోక్షము వస్తుంది. త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల వల్ల ముక్తి లభిస్తుంది. అట్లాగే ఇతర యుగములలో దానము శ్రేష్ఠమన్నారు. అన్ని యుగములలోను సేతుయాత్ర మనుష్యులకు శ్రేష్ఠమైనది. అని స్కాందమహాపురాణములో ఎనుబది ఒక్కవేల సంహితయందు మూడవదైన బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యంలో సేతువునకు వెళ్ళటంవల్ల వచ్చే ఫలాదులు వర్ణించటమనేది ప్రధమ అధ్యాయము.

Sri Scanda Mahapuranamu-3    Chapters