Sri Matsya Mahapuranam-1    Chapters   

పంచనపతితమో7ధ్యాయః.

ఫలత్యాగవ్రతమ్‌.

నన్దికేశ్వరః : తథా సర్వఫలత్యాగ మహాత్మ్యం శృణు నారద |

య దక్షయం పరం లోకే సర్వకామఫలప్రమ్‌. 1

మార్గశీర్షే శుభే మాసే తృతీయాయాం మునే వ్రతమ్‌ | ద్వాదశ్యామథవా7ష్టమ్యాం

చతుర్దశ్యా మథాపి వా. 2

ఆరభే చ్ఛుక్లపక్షస్య కృత్యా బ్రాహ్మణవాచనమ్‌ | అన్వేష్వపిచ మాసేషు పుణ్యషు

మునిసత్తమ. 3

సదక్షిణం పాయసేన భక్తితః పూజయే ద్ద్విజా& | అష్టాదశానాం ధాన్యానా మన్యచ్చ

ఫలమూలకమ్‌. 4

వర్జయే దేకవర్షంతు వినైవౌషధకారణమ్‌ | సవృషం కాంచనం రుద్రం ధర్మరాజంచ

కారయేత్‌. 5

కూశ్మాణ్డం మాతులుఙ్గంచ వార్తాకం పనసం తథా | అమ్రాతకకపిత్థాని కలిఙ్గ మథ

వారుకమ్‌. 6

శ్రీఫలాశ్వత్థబదరం జమ్బీరం కదళీఫలకమ్‌ | కాశ్మరం దాడిమం శక్త్యా కలధౌతాని

షోడశ. 7

మూలకామలకం జమ్బూతిన్త్రిణీ కరమర్దకమ్‌| తక్కోలైలాక జమ్బీర కరీర కుటజం

శమీ. 8

ఉదుమ్బరం నాళికేరం ద్రాక్షా7 థ బృహతీద్వయమ్‌ | రౌప్యాని కారయే ద్భక్యా ఫలానీమాని షోడశ. 9

తామ్రం తాళఫలం కుర్యా దగస్తిఫలయేవచ | పిణ్డీతకాశ్మర్యఫలం తథా సూరణకన్దకమ్‌.

10

రక్తాలుకాకన్దకంచ కేతకావ్లూకచిద్భటమ్‌ | చిత్రవల్లీఫలం తద్వ త్కూటశాల్మలికాఫలమ్‌. 11

యామ్య నిష్పావ మధుక వటేఙ్గుద పటోలకమ్‌ | తామ్రాని షోడశైతాని కారయేచ్ఛక్తితో నరః 12

తొంబది యైదవ అధ్యాయము.

ఫలత్యాగ (పండ్లను తినక మానెడు) వ్రతము

నందికేశ్వరుడు నారదునకు ఇంకను ఇట్లు చెప్పెను. నారదా: ఇట్టిదేయగు సర్వఫలత్యాగ వత్ర మహాత్మ్యమును వినుము. ఇది (ఇహపర) లోకములందు అక్షయమును - సర్వకాను ఫలప్రదమును శుభమగునది. మార్గశీర్షమాసమునందుకాని పుణ్యములగు ఇతర మాసములలో వేనియందుకాని శుక్లపక్షమున తదియ- అష్టమి- ద్వాదశి-చతుర్దశి- వీనిలో నేదైన తిథినాడు బ్రాహ్మణులచే స్వస్తి వాచనము జరిపించి ఈ వ్రతము నారంభించవలెను. అనాడు బ్రాహ్మణులకు పాయస సహితమగా భోజనము పెట్టించి దక్షిణనీయవలెను. ఔషధ (ఆరోగ్య) కారణము లేకుండనే సంవత్సరము పాటు పదునెనిమిది విధములగు ధాన్యములు తప్ప మిగిలిన ఫలములు (కూరగాయలు కూడ) దుంపలు వేళ్లు ఏవియు తినక వదలవలయును.

పిమ్మట(వ్రత పూర్తికై) బంగారుతో ఎద్దును రుద్రుని ధర్మరాజును చేయించవలయును. బూడిద గుమ్మడి కాయ మాదీఫలము పందిలివంగ కాయ పనస మామిడిపండ్లు ఆమ్రాతపు ఫలము (అంబాళము -దీని రసము మామిడిపండు రసమువలె నుండును. అని నిఘంటువు) వెలగపండు కళింగము అనెడు (విష్ణు ప్రీతికరమగు)పండు ఖర్బూజా దోస పండు మారేడు పండు రావికాయ రేగుపండు నిమ్మపండు అరటిపండు గుమ్ముడు దుంప దానిమ్మపండు ఇవి పదునారును తన శక్తికి తగినట్లు బంగారుతో చేయించవలెను. ముల్లంగి ఉసిరిగ నేరేడు చింతకాయ కలివెపండు తక్కోల ఫలము ఏలకికాయ నిమ్మపండు వెదురు మొలక కొడిసెకాయ జమ్మికాయ మేడికాయ టెంకాయ ద్రాక్షపండు చిన్న పందిలి వంగకాయ వాకుడుకాయ ఈ పదునారును వెండితో చేయించవలెను. తాటిపండు అవిసికాయ పొగడుపండు కపిల ద్రాక్ష పండు కందదుంప చిలగడదుంప మొగలిపూవు(కాయ) చిద్భటము (ఒకకాయ ) మంజిష్ఠ (తీగకు కాచిన) కాయ కొండ బూరుగుకాయ గంధపు కాయ బొబ్బరకాయ ఇప్పకాయ మర్రికాయ గారకాయ పొట్లకాయ-ఇవి పదునారును రాగితో చేయించవలెను.

ఉదకుమ్భద్వయం కృత్వా ధాన్యోపరి సవస్త్రకమ్‌ l తతశ్చ కారయే చ్ఛయ్యాం శయ్యోపరి సవాసమ్‌. 13

తామ్ర పాత్రద్వయోపేతం యమరుద్రవృషాన్వితమ్‌ l ధేన్వా సహైవ శాన్తాయ విప్రాయథ కుటుమ్బినే.

సపత్నీకాయ సమ్పూజ్య పుణ్య7హ్ని వినివేదయేత్‌ l యథా ఫలేషు సర్వేషు వస న్త్యమరకోటయః. 15

తథా సర్వఫలత్యాగవ్రతా ద్భక్తి శ్శివే7స్తు మే l యథా శివశ్చ ధర్మశ్చ నదా7నన్తఫలప్రదౌ. 16

తత్యుక్తఫలదానేన తౌస్యాతాం ఫలదౌ సదా l యథా ఫలాన్యనన్తాని శివభ##క్తేషు సర్వదా. 17

తథా7నన్తఫలావాప్తి రస్తు మే జన్మన్మని l యథా భేదం నపశ్యామి శివవిష్ణ్వర్కపద్మజా&. 18

తథా మమా స్తు విపశ్వాత్మా శఙ్కర శఙ్కర స్సదా l ఇతి దత్వాతు తత్సర్వ మలజ్కృత్యవిభూషణౖః.

శక్తశ్చే చ్ఛయనం దద్యా త్సర్వోపస్కరసంయుతమ్‌ l అశక్తస్తు ఫలాన్యేవ యథోక్తాని విధానతః. 20

తథోదకుమ్భసంయుక్తం శివధర్మౌ సకాఞ్చనౌ l విప్రాయ దత్వా భుఞ్జీత వాగ్యతః ఫలవర్జతమ్‌ . 21

అన్యానపి యథాశక్త్యా భోజయే ద్ద్విజపుఙ్గవా9l ఏత ద్భాగవతానాంచ శైవవైష్ణవయోగినామ్‌ . 22

శుభం సర్వఫలత్యాగ వ్రతం వేదవిదో విదుః | నారీభిశ్చ యథాశక్త్యా కర్తవ్యం మునిపుఙ్గవ. 23

ఏతస్మాన్న పరం కించి దిహలోకే పరత్రచ | వ్రతమస్తి మునిశ్రేష్ఠ యదనన్తఫలప్రదమ్‌ . 24

సువర్ణ రూప్య తామ్రేఘ యావన్తః పరమాణవః | భవన్తి పూజ్యమానేషు ఫలేషు మునిసత్తమ. 25

తావద్యుగసహస్రాతి రుద్రలోకే మహీయతే l

ఏత త్సమస్తకలుషాపహరం వరాణాం సఞ్జీవనాయ మనుజేషుచ సర్వదా స్యాత్‌. 26

జన్మాన్తరేష్వపి న పుత్త్రవియోగదుఃఖ మాప్నోతి ధామచ పురన్దరదేవజుష్టమ్‌ l

యోవా శృణోతి పురుషో7ల్పధనీ పఠేద్వా దేవాలయేషు భవనేష్వపి ధార్మికాణామ్‌. 27

పాపై ర్విముక్తవపు రత్ర వదం మురారే రానన్దకృత్పద ముపైతి శివస్య సో 7పి. 24u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ ఫలత్యాగ వ్రతమాహాత్మ్య కధనం నామ పఞ్చనవతితమో7ధ్యాయః.

రెండు నీటి పాత్రలు చేయించవలెను. వీటిని ధాన్యముపై పరచిన నూతన వస్త్రముపై ఉంచవలెను. మంచము - దానిపైకి పరపులు మొదలగునవియు దుప్పటియురెండు రాగిప్రాత్రలు(పళ్లెరములు) యమ రుద్ర వృషభముల ప్రతిమలు ధేను ప్రతిమ ఇవి అన్నియు శాంతుడు కుటుంబి సపత్నీకుడు అగు బ్రాహ్మణునకు శుభ దినమున అతనిని (దంపతులను) పూజించి ఈయవలెను.

సర్వఫలముల యందును దేవతలు అందరును నివసింతురు. కావున ఈ సర్వఫల త్యాగ వ్రత మాహాత్మ్యమున నాకు శివునియందు భక్తి సిద్ధించుగాక ! శివుడును ధర్మదేవుడును సధా అనంత ఫలప్రదులు. కావున వారి (ప్రతిమల)తో

__________________________________________________________________________

*భక్ష్య

కూడ చేసెడి ఫలదానము వలన వారును అనంత ఫలప్రదులగుదురుగాక ! శివ భక్తులయందు (వలన) సదా అనంతఫలములు నిలిచి (కలుగుచు) ఉండును. కావున నాకును జన్మజన్మమునందును అనంత ఫలసిద్ధి యగుగాక! శివునికి - విష్ణురవి బ్రహ్మలకు-నడుమ నేను భేదమును భావన చేయను. కావున విశ్వాత్ముడగు శంకరుడు సదా నాకు శంకరు (శుభము కలిగించు వా ) డగుగాక!'' అను అర్థమునిచ్చు మంత్రముతో వారిని అలంకరించి ఆ విప్ర దంపతులకు ఇవి అన్నియు దానమీయవలెను. శక్తి ఉన్నచో సర్వోపస్కరములతో కూడ మంచమును ఈయవలెను. శక్తిలేనిచో ఈ చెప్పిన ఫలము లను మాత్రము యథా విధానమగ ఈయవలెను. ఉదకుంభములను రెంటిని శివుని ధర్ముని ప్రతిమలను తప్పుక ఈయవలెను. పిమ్మట ఆ బ్రాహ్మణుని -శక్తియున్నచో ఇంకను చాలమంది బ్రాహ్మణులను కూడ భుజింపజేసి తానును పండ్లు ఏవియు లేకుండ భుజించవలెను.

వేదతత్త్వ వేత్తలును ప్రశంసించెడు ఈ సర్వఫల త్యాగ వ్రతము శివ విష్ణు భక్తులకు వారికిని యోగులకును స్త్రీలకును గూడ కర్తవ్యము ఇహపరముల రెంటియందు అనంతఫలముల నీయగల వ్రతము దీనిని మించినది మరియొకటిలేదు%. ఈ వ్రతమున పూజింపబడు ఫల ప్రతిమల కుపయోగించిన సువర్ణ రజత తామ్రములందు ఎన్ని పరమాణువులు కలవో అన్ని వేల యుగములపాటు రుద్ర లోకమునందు ఈ వ్రతకర్త పూజితుడయి సుఖించును.

ఈ వ్రతము దాని నాచరించిన నరుల సమస్త కలుషములను హరించును . ఇహలోకమున సంజీవనమయి సర్వదా సుఖింపజేయును. జన్మాంతరముల యందును అట్టివారికి పుత్త్రవియోగ దుఃఖము కలుగదు; ఇంద్రాది దేవత లనుభవించెడి స్వర్గసుఖములు లభించును.

దీని నాచరించుటకు శక్తి లేనివారు పుణ్యకరమగు ఈ వ్రతవిధానమును ధార్మికులైవరైన దేవాలయములందో భవనములందో చెప్పుచుండగ వినినను తామే చదివినను పాప విముక్తులై ఇహలోకమున సుఖించి పరమున విష్ణు స్థానమును పిమ్మట ఆనందప్రదమగు శివ స్థానమును పొందుదురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఫలత్యాగ వ్రత మాహాత్య్మ కథనమను

తొంబదియైదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters