Sri Matsya Mahapuranam-1    Chapters   

త్ర్యశీతతమో7 ధ్యాయః.

లవణ్యపర్వతదానమ్‌.

ఈశ్వరః : అథాత స్పమ్ర్పపక్ష్యామి లవణాచల ముత్తమమ్‌|

యత్ర్పసాదాన్నరో లోకా నాప్నోతి శివసంయుతా&. 1

ఉత్తమ ష్షోడశ ద్రోణౖః కర్తవ్యో లవణాచలః | మధ్యమస్స్యా త్తదర్ధేన చతుర్భి రధమ స్స్మృతః. 2

వితత్తహీనో యథాశక్త్యా ద్రోణాదూర్ద్వంతు కారయేత్‌| చతుర్థాంశేన విష్కమ్భ పర్వతా న్కారయే త్పృథక్‌.

విధానం పూర్వవ త్కుర్యా ద్ర్బహ్మాదీనాంచ సర్వదా|

­తద్వ ద్దేమతరూ న్త్సర్వా9 లోకాపాలాన్నివేశ##యేత్‌. 4

సరాంసి వనవృక్షాదీం స్తద్య దత్రాపి కారయేత్‌ | కూర్యాజ్జాగరణం రాత్రౌ దాన మన్త్రా న్నిబోధమే. 5

సౌభాగ్యరససమ్భూతో యతో 7యం లవణో రసః | తదాత్మకత్వేన చ మాం పాహిత్వం పర్వతోత్తమ. 6

యస్మా దన్యరసా స్సర్వే నోత్కటా లవణం వినా | ప్రియంచ శివయో ర్నిత్యం తస్మాచ్ఛా న్తపరో భవ. 7

విష్ణుదేహసముద్భూతం యస్మా ఆరోగ్యవర్దనమ్‌ | తస్మా త్పర్వతరూపేణ సాహి సంసారసాగరత్‌. 8

అనేన విధినా యస్తు దద్యాల్లవణపర్వతమ్‌ | ఉమాలోకే వసే త్కల్పం తతో యాతి పరాం గతిమ్‌. 9

ఇతి శ్రీమత్స్యమహపురాణ లవణపర్వత దానమాహత్మ్య

కథనం నామ త్ర్యశీతితమో7ధ్యాయః.

ఎనుబది మూడవ అధ్యాయము

లవణ పర్వత దానము

ఈశ్వరుడు ఇట్లు చెప్పెను : ఇప్పుడు ఒక లవణ పర్వత దాన విషయము చెప్పెదను. అది ఉత్తమమయినది. దాని దాననుగ్రహమున మానవుడు శివునకాశ్రయమగు లోకములనుపొందును. పదునారుగాని ఎనిమిదికాని నాలుగు కాని

_______________________________________

­తద్వ ద్దేమమయా న్త్సర్వా&

ద్రోణముల పరిమితికల లవణము దీనికై కావలయును. అందులకును ధనశక్తి లేనివాడు ద్రోణ పరిమితికి తక్కువ కాకుండ ఎంతతోనైనా చెయవచ్చును. మొత్తము పరిణాములో నాలుగువవంతు లవణముతో విష్కంభ పర్వతముల నేర్పరచవలెను. బ్రహ్మాది దేవతలను బంగారు వృక్షములను లోకపాలురను సరస్సులను పైవలెన్‌ చేయవలెను. రాత్రి జాగరణమును చెయలెను. (దాన మంత్రము.) లవణ రసము(రుచి) సౌభాగ్య రసముతో నిండినది. దానితో ఏర్పడిన పర్వతోత్తమా : నన్ను రక్షించుము. ఈ లవణ రసము లేనిదే మిగిలిన రుచులు స్పుటములు కావు; గొప్పవి కావు. ఈ లవణ రసము పార్వతీ పరమేశ్వరులకు ప్రియమమయినది కూడను. ఇట్టి నీవు ఓ రసమా: నాకు శాంతినిమ్ము. విష్ణు దేహమునుండి ఉద్భవించిన దానవు ఆరోగ్య వర్దనమవు అగు లవణ పర్వతమా! సంసార సాగరమునుండి నన్ను కాపాడుము. ఈ విధానముతో లవణ పర్వత దానము చేయువాడు కల్పకాలముపాటు ఉమాలోకమునందు వసించి ఉత్తమ గతినొందును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున లవణ పర్వత దానమాహత్మ్య కథనమను ఎనుబది మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters