Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకాశీతతమో 7 ధ్యాయః.

విశోకద్వాదశీవ్రతమ్‌.

మనుః : కి మభిష్టవియోగశోకసఙ్ఘా దలముద్దర్తు ముపోషణవ్రతం చ|

విభవోద్భవకారి భూతలే7స్మీ న్భవభూతేరపి సుదనంచ పుంసః. 1

శ్రీమత్స్యః : పరిపృష్టమిదం జగత్ర్పియం య ద్విబుధానామపి దుర్లభం -|- మహచ్చ|

తవ భక్తిమయత స్తథాపి వక్ష్యే వ్రత మిన్త్రాసురమావేషు గుహ్యమ్‌. 2

పుణ్య మాశ్వయుజే మాసి విశోక ద్వాదశీవ్రతమ్‌ | దశమ్యాం లఘుభు గ్విద్వా నారభే న్నియమేన తు. 3

ఉదఙ్మఖః ప్రాఙ్ముభోవా దన్తధావనపూర్వకమ్‌ | ఏకాదశ్యాం నిరాహార స్సమభ్యర్చ్యచ కేశవమ్‌. 4

శ్రియం చాభ్యర్య్చ విధివ ద్భోజ్యమేవ పరే హని | ఏవం నియమకృత్సుప్తా%్‌వ ప్రాతరుత్థాయ మానవః. 5

స్నానం సర్వౌషధైః కుర్యా త్పఞ్చగవ్యజలేన చ | శుక్లమాల్యామ్బర స్తద్య త్పూజయే చ్ర్ఛీశ ముత్పలైః.

విశోకాయ నమః పాదౌ జఙ్ఘేచ వరదాయవై | శ్రీ శాయ జానునీ తద్వ దూరుచ జలశాయినే. 7

కన్దర్పాయ నమో గుహ్యంమాధవాయ నమః కటిమ్‌ | దామోదరాయే త్యుదరం పార్శ్వేతు విపులాయవై. 8

నాభించ పద్మనాభాయ హృదయం మన్మథాయ వై| శ్రీ ధరాయ నమో వక్షః కరౌ మధుభిదే నమః. 9

చ్రకిణ వామబాహుంచ దక్షిణం గదినే నమః| వైకుణ్ఠా యనమః కణ్ఠ మాస్యం యజ్ఞముఖాయవై. 10

నాసా మశోకనిధయే వాసుదేవాయ చాక్షిణీ | లలాటం వామనాయేతి హరయేతి పునర్ర్భవౌ. 11

అలకాన్మాధవాయేతి కిరీటం విశ్వరూపిణ | నమస్యర్వాత్మనే తద్వ చ్ఛిర ఇత్యభిపూజయేత్‌. 12

ఏవం సమ్పూజ్య గోవిన్దం ధూపమాల్యానులేపనైః | తతస్తు మణ్డపంకృత్వా స్థణ్ణిలంకారయేన్ముదా. 13

చతురశ్రం సమన్తాచ్చారత్నిమాత్రముదక్ల్పవమ్‌ | సూక్ష్యం హృద్యంచ పరితో వప్రత్రయాసమావృతమ్‌. 14

త్ర్యఙ్గుళోచ్ర్ఛిస్తారే ద్విరఙ్గుళమ్‌ | స్థణ్డిలస్యోపరిష్టాత్తు భిత్తి రష్టాంగుళాభ##వేత్‌. 15

నదీవాలుకయా శూర్పే లక్ష్య్మాః ప్రతికృతిం న్యసేత్‌| స్థణ్డిలే శూర్పమారోప్య లక్ష్మీ మిత్యర్చయేద్భుధః. 16

ఎనుబది ఒకటవ అధ్యాయము.

విశోక ద్వాశీ వ్రతమ-గుడ ధేన్యాదిదానములును.

మనుపు మత్య్స నారాయణుని ఇట్లడిగెనుః ఇష్టవియోగమువలన శోకము కలుగకుండ చేయునదియు కలిగిన అట్టిశోకమునుండి ప్రాణులనుద్దరించునదియు విభవములను కలిగియుంచునదియు సంసార నాశకమునునగు ఉపవాస పూర్వకమగు వ్రతమేది? అనగా మత్య్సడిట్లు చెప్పసాగెను. నీవడిగిన ఈ ప్రశ్నము జగత్త్రియము; దేవతలకును దుర్లభము; గొప్పది; దేవ దానవ మానవులకును గుహ్యమగునది. ఐనను నీవు భక్తుడవ అడిగితివి కావున చెప్పెదను. అశ్వయుజ మాసమున చేయు విశోక ద్వాదశీ వ్రతము ఇట్టి పుణ్యకరము.

దశమినాడు లఘు భోజనము చేసి సంప్రదాయమెరిగి నియముతో వ్రతమారంభించవలెను. ఏకాదశినాడు పలదోముకొని స్నానాదికము నెరవేర్చి నిరాహారుడై ఉత్తరాముఖుడో ప్రాఙ్మాఖుడో అయి కేశవుని లక్ష్మిని యథావిధిగా ఆర్చించి ద్వాదశినాడు పారణ చేయవలయును. ఎట్లన-ద్వాదశినాడు ఉదయమున లేచి సర్వౌషదులతోను పంచగవ్య సహిత జలముతోను స్నానమాడి తెల్లని పుష్పములను వస్త్రములను ధరించి కలువపూలతో విష్ణునర్చించవలయును.

(పూజా మంత్రముః) 1. విశోకాయనమః పాదౌ పూజయామిః 1. వరదాయనమః జంఘే పూజయామి; 3. శ్రీశాయనః-జనునీ పూజయామి; 4. జలశాయినేనమః-ఊరూ పూజయామి; 5. కందర్పాయనమః-గుహ్యం పూజయామి; 6. మాధవాయనమః-కటిం పూజయామి; 7. దామోదరాయనమః-ఉదరం పూజయామి; 8. విపులాయనమః-పార్శ్వే పూజయామి; 9. పద్మనాభాయనమః- నబి పూజయామి; 10. మన్మథాయనమః- హృదయం పూజయామి; 11. శ్రీధరాయనమః-వక్షః పూజాయామి; 12. మధుభిదేనమః - కరౌ పూజయామి; 13. చక్రిణనమః-వామభాహుం పూజయామి; 14. గదినేనమః - దక్షిణ బహుం పూజయామి; 15. వైకుంఠాయనమః- కంఠం పూజయామి; 16. యజ్ఞముఖాయనమః - అన్యం పూజయామి; 17. అశోకనిధయేనమః - నాసాం పూజయామి; 18. వాసుదేవాయనమః - అక్షిణీ పూజయామి; 19. వామనాయ నమః-లలాటం పూజయామి; 20. హరయేనమః-భ్రువౌ పూజయామి; 21. మధవాయనమః - అలకాన్‌ పూజయామి; 22. విశ్వరూపిణనమః - కిరీటం పూజయామి; 23. సర్వాత్మనేనమః-శిరః పూజయామి; ఇట్లు అంగపూజ జరిపి పిమ్మట గంధ ధూపమాల్యములతో విష్ణుని పూజింపవలెను.

మండపము ఏర్పరచి దానియందు పిడమూర కొలత భుజముతో చతురస్రము మనోహరమగు సన్నని అరుగు ఉత్తరపు వాలుదలతో చేసి దాని చుట్టును మూడు ప్రాకారములు చేయవలెను. వానిలో బయటిది మూడంగుళముల ఎత్తునడుమది రెండంగుళముల ఎత్తు లోపలిది ఎనిమిదంగుళముల ఎత్తు ఉండలెను. ఏటి ఇసుకతో లక్ష్మీ ప్రతిమచేసి చేటలోఉంచవలెను. ఆ చేట నరుగుమీద ఉంచి లక్ష్మిని పూజించవలయును.

నమో దేవ్యై నమశ్శాన్త్యై నమోలక్ష్మ్యై నమశ్ర్శియై| నమస్తుష్ట్యై వృష్ట్యై హృష్ట్యైనమో నమః.

విశోకదుఃఖనాశాయై విశోకా వరదా7స్తు మే | విశోకాచాస్తు సన్తత్యై విశోకా సర్వసిద్దయే. 18

తతశ్శుక్లామ్బరైశ్శూర్పం వేష్ట్య సమ్పూజయేత్పలైః | భ##క్ష్యైర్నానావిధై స్తద్య త్సువర్ణకలశేనచ. 19

రజనీషుచసర్వాసు పిబేద్దర్బోదకం పునః| తతస్తు గీతనృత్యాదికారయోత్సకలాం నిశామ్‌. 20

యామత్రయే వ్యతీతేతు తత ఉత్థాయ మానవః | అభిగమ్యచ విప్రానా మిథునాని సమర్చయేత్‌. 21

శక్తితస్త్రీణి చైకం చ వస్త్రమాల్యానలేపనైః | శయనానిచ పూజ్యాని నమో7స్తు జలశాయినే. 22

తతస్తు గీతవాద్యాన్తే రాత్రౌ జాగరణ కృతే | ప్రభాతేచ జలస్నానం కృత్యా దమ్పత్య మర్చయేత్‌. 23

భోజనంచ యథాశక్త్యా విత్తశాఠ్యవివర్జితః | భుక్త్వా శ్రుత్వా పురాణాని తద్దినం చాతివాహయేత్‌. 24

అనేన విధినా సర్వం మాసిమాసి సమాచరేత్‌ | వ్రతాన్తే శయనం దద్యా ద్గుడధేనుస్మన్వితమ్‌. 25

సోపథానకవిశ్రామ స్వాస్తరావణం శుభమ్‌ | యథాన లక్ష్మీ ర్దేవేశ త్వాం పరిత్యజ్య గచ్ఛతి. 26

తథా సురూప మారోగ్య మశోకశ్చాస్తు మే సదా | యథా దేవేన రహితా న లక్ష్మీ ర్జాయతే క్వచిత్‌. 27

తథా విశోకతా మే7స్తు భక్తిగ్ర్యాచ కేశ##వే | మన్త్రేణానేన శయనం గుడధేనుసమన్వితమ్‌. 28

శూర్పంచ లక్ష్మ్యాసహితం దాతవ్యం భూతి మిచ్చతా | ఉత్పల కరవీరంచ బాణ మవ్లూనకుఙ్కుమమ్‌.

కేతకీ సిన్దువారంచ మల్లికాగన్థపాటలమ్‌ | కదమ్బం మాలతీ (కుఙ్కమం) చాపి శస్తాన్యేతాని సర్వదా. 30

(లక్ష్మీ పూజా మంత్రములుః) 1. దేవ్యై నమః- 2. శాంత్యై నమః - 3. లక్ష్య్మైనమః -4. శ్రియైనమః- 5. పుష్ట్యైనమః- 6. తుష్ట్యై నమః- 7. వృష్ట్యై నమః- 8. హృష్ట్యై నమః 9. విశోకాయై నమః- 10. దుంఖనాశాయైనమః అను నవి లక్ష్మీ పూజా మంత్రములు. వీనిలో ఆమెను పూజించి ఈ అర్ఘ్యము నిచ్చు మంత్రములతో ప్రార్థించవలెను. శోకములు లేకుండా జేయు లక్ష్మీదేవి నాకు వరముల నిచ్చునది యగుగాక: విశోకయగు లక్ష్మి సంతానము కలిగించుగాక: ఉన్న సంతతికి యోగ క్షేమముల నిచ్చుగాక : పిమ్మట ఆ చేటను తెల్లని క్రొత్త వస్త్రములతో చుట్టవలెను. దానిని నానా విధ భక్ష్యములతో ఫలములతో పూజించి దేవికి సువ్ణ కలశము నర్పించవలెను. రాత్రులయందు దర్భలు వేసి ఉంచిన ఉదకమును త్రాగి ఉండవలయును. రాత్రియంతయు నృత్యగీతముతో గడుపవలెను.

అందునను రాత్రి మూడవ జాము గడిచిన వెంటనే ఆరంభించి- యథాశక్తిగా ముగ్గురనుగాని ఒకరినికాని విప్రదంపతులను స్వయముగా కడకు పోయి పీలుచుకొనివచ్చి వారిని-వారికి దాన మీయ సిద్దపరచిన శయనాది సామగ్రిని క్రమముగా వస్త్రమాల్యాదికముతో అర్చించవలెను. పూజయందు 'జలశాయినే నమః' అను మంత్రమును వినియోగించవలెను.

ఇట్లు గీత వాద్యాదులతో రాత్రి ముగియు వరకు గడిపి జాగరణము ముగించి ఉదయము స్నానమాడి దంపతుల నర్చించి వారికి శయనాదిక మీయవలెను. యథాక్తిధనశాఠ్యము లేక బ్రాహ్మణ సంతర్పణము చేసి తానును భుజించి పురాణ శ్రవణముతో ఆనాడు గుడపవలెను. ఇట్లు ప్రతి మాసమును (సంవత్సరము ముగియు వరకు) జరిపి వ్రతాంతమున గుడధేనువు - దిండ్లు-పరపులు మొదలగు పరికరములు-దుప్పటి మొదలగునవి. వీనితో కూడ మంచము(ల)ను చేటతో కూడా లక్ష్మీదేవిని విప్రున(ల)కు దాన మీవలెను. దీనిచే సర్వ శుభములును కలుగును.

పూజకై 1. కలువ(తెలుపు-ఎరుపు-నీలము-ఏదైనను) 2. కరవీరము (ఎర్రగన్నేరు - దానివంటి ఆకులుగల చెట్టునకే పూచెడి పూవులను కరవీరమే,) 3. ఱల్లుపూవు-4. వాడ(ని)గన్నేరు- 5. కుంకుమపూవు. 6.మొగలి, 8.ప్రేంకణము-8. మల్లె-9. సంపెంగ-10, మంకెన-11, కడిమి -12. మాలతీ పుష్పములు వరుసగా పండ్రెండు మాసములందును ప్రశస్తములు లేదా ఇవి ఎప్పుడును పూజకై మంచివి.

గుడధేన్యాదిదానిని

మనుః : గుడధేనువిధానం చ సమాచక్ష్వ జగత్పతే| కింరూపం కేనమన్రే దాతవ్యం తదిహోచ్యతామ్‌. శ్రీమహత్స్యః: గుడధేను విదానస్య యద్రూప మిహ యత్ఫలమ్‌| తదిదానీం ప్రవక్ష్యామి సర్వపావవినాశనమ్‌.

కృష్ణాజినం చతుర్హస్తం ప్రాగ్గ్రీవం విన్యసే ద్భువి | గోమయేనానులిప్తాయాం దర్భానా స్థీర్య సర్వతః.

లఘ్వైణ కాజినం తద్వ ద్వత్యస్య పరికల్పయేత్‌: ప్రాఙ్ముభీం కల్పయేద్దేను ముదగాస్యస్వవత్సకామ్‌. 34

ఉత్తమా గడధేను స్స్యా త్తదా బారచతుష్టయమ్‌| వత్సం భారేణ కుర్వీత భారాభ్యాం మధ్యమా స్మృతా.

అర్ధభారేణ వత్సస్స్యా త్కనిష్టా భారకేణతు | చతుర్థాంశేన వత్సస్స్యా ద్గృహీ విత్తానుసారతః. 36

ధేనువత్సౌ స్యసేదేవం సితమాల్యామ్బరావృతౌ| శుక్తికర్ణా విక్షుపాదౌ సితముక్తాఫలేక్షణౌ. 37

సితాసూత్రసిరాజాతౌ సితకమ్బళకమ్బళౌ | తామ్రమస్తకపృష్ఠౌ తౌ సితచామరరోమకౌ. 38

విద్రుమభ్రూయుగోపేతౌ నవనితస్తనాన్వితౌ | క్షౌమపుచ్ఛౌ కాంస్యదోహా విన్ద్రనీలకతారకౌ. 39

సువర్ణశృఙ్గాభరణౌ రాజతాఖురసంయుతౌ | నానాఫలసమాయుక్తౌ ఘ్రాణగన్దకరణ్డకౌ. 40

ఇత్యేవం రచయిత్వా తౌ ధూపదీపై రథార్చయేత్‌ | యాలక్ష్మీ స్సర్వభూతానాం యాచ దేవే వ్యవస్థితా. 41

ధేనురూపేణ సా దేవీ మమపాపం వ్యపోహతు | దేహస్థా యాచ రుద్రాణీ శఙ్కరస్య చ యాప్రియా 42

దేనురూపేణ సా దేవీ మమ పాపం వ్యపోహతు | విష్ణోరఃక్షసి యా లక్ష్మీ స్స్వాహా యాచ విభావసోః. 43

చన్ద్రార్క ఋక్షతారాణా మనరూపాచ యారామా | చతుర్ముఖస్య యాలక్ష్మి స్స్వాహా యాచ విభావసోః. 44

యాలక్ష్మీర్లోకపాలానాం సాధేను ర్వరదా7స్తు మే | స్వధా యా పితృముఖ్యానాం స్వాహా యజ్ఞభుజాం తథా.

ధేనురూపేణ సాదేవీ మమ పాపం వ్యవపోహతు | సర్వపాపమరే దేవి తత్త్వం శాన్తిం ప్రయచ్చయే. 46

ఏవమామన్ర్య తాం ధేనుం బ్రాహ్మణాయ నివేదయేత్‌ |

గుడధేన్వాధి ధానములు.

విశోక ద్వాదశీ కల్పమున ప్రాసంగికముగా పేర్కొనిన గుడధేనుదానము అనుది ఏమి? దాని స్వరూపమును విధానమును దానమును వినియోగించు మంత్రమును తెలుపుమని మనువడుగగా మత్య్స నారాయణుడిట్లు చెప్పెను: సర్వ పాప వినాశనమగు గుడధేను స్వరూపమును దాన విధానఫల వినియోజ్య మంత్రములను తెలిపేదను; వినుము.

నాలుగు మూరల పొడవుగల కృష్ణాజినము(నల్లని మచ్చలుగల ఇఱ్ఱిచర్మము)ను గోమయముతో అలికి నాలుగు వైపుల దర్భలను పరచిన ప్రదేశమున తూర్పు మొగము అగునట్లు పరచవలెను. అట్టి ప్రదేశముననే ఉత్తరమునకు మొగ మగునట్లు చిన్న కృష్ణాజినము కూడ దానికి దగ్గరగా పరచవలెను. (మొదటిది ఆపుకొరకును -రెండవదిదూడ కొరకును.)

గుడముతో ఆవును దూడను చేసి తూర్పు మొగముగా ఆవును ఉత్తరపు మొగముగా దూడను నిలుపవలెను. యథాశక్తిగా అవును నాలుగు 'బారువ'దూడను ఒక బారువ - ఇదే వంతున అవును రెండు బారువలు - దూడను అర బారువు -ఆవును ఒక బారువ దూడను పావు బారువ గూకముట బెల్లముతో చేయవలెను. వీనికి ముత్తెపు చిప్పలతో చెవులు-చెరకుగడతో కాళ్లు-ముత్తెములతోకండు తెల్లని దారములతో నాడులు - తెల్ల కంబళితోగంగడోలు-పలుచని రాగి రేకుతో మొగము -వీపు-తెల్లని చామరముతో తోక కుచ్చు-పడగములతో కనుబొమ్మలు-వెన్నతో చన్నులు పట్టుదారముతో తోకకాడ-కంచుపాత్రతో పొదగు - ఇంద్రనీలముతో కనుగ్రుడ్లు-బంగారు కొమ్ములు వెండి గిట్టలు సంపెగ పూలతో ముక్కలు అమర్చవలెను. వానిముందు నా ఫలములుంచువలెను. ఇట్లు సిద్దపరచిన ఆ అవును దూడను గంధ దూపదీపాదికముతో నైవేద్యముతోఅర్చించవలెను.

పిమ్మట ఈ అర్థమునిచ్చు మంత్రముతో వాటిని ప్రార్థించవలెను. (మంత్రార్థము:) సర్వ భూతములందును సర్వ దేవతలయందును సర్వదేహములందును ఉన్నదియై శంకరుని ప్రియురాల రుద్రాణిగా విష్ణుని వక్షస్సునందు లక్ష్మిగా అగ్నియందు స్వాహాగా చంద్ర రవి నక్షత్ర తారలయందు కాంతిరూపయగు లక్ష్మిగా చతుర్మఖనందు వాణిగా కుబేరునందు ధనముగా లోకపాలురయందు ఆయా రూపములతో లక్ష్మిగా పితృదేవతలయందు స్వధారూపగా నున్న లక్ష్మీయే ధేను రూపమునుండి నాపాపమును పోగొట్టుగాక: సర్వపాపహరయగు దేవీ: లక్ష్మీ: ఇట్టీ నీవు నాకు శాంతిని ఇమ్ము.

ఇట్లు అగుడ దేనువు నామంత్రించి దానిని బ్రాహ్మణునకియవలయును.

_______________________________

* శాన్తిం ప్రయచ్ఛతు

విధానమేవం దేనూనాం సర్వాసా మిహ పఠ్యతే. 47

యాస్తు పాపసవినాశిన్యం ఫఠ్యనే ¡ దశ ధేనవః | తాసాం స్వరూపం పక్ష్యామి నామానిచ నరాధిప. 48

ప్రథమా గుడధేను స్స్యాద్ఘృతదేసు స్తథా7పరా| తిలధేను స్తృతీయాతు చతుర్థీ జలసంజ్ఞితా. 49

పఞ్చమీ రసదేనుస్స్యాత్‌ షష్ఠీ ధాన్యాహ్వయా తథా| సప్పమీ శర్కరాదేను రష్టమీ లవణస్యచ. 50

రత్నధేనుశ్చ నవమీ దశమీ స్యా త్య్సరూపతః | కుమ్భాః స్యుర్ధ్రవధేనూనా మితారాసాంతు రాశయః. 51

సువర్ణధేనుం చాప్యత్ర కేచిఙచ్ఛన్తి మాసవాః| నవనీతేన తైలేన తలైన తథా7న్యేపి మహర్షయః. 52

ఏతదేవ విధానంస్యా త్త ఏవో పస్కరా స్ప్మృతాః | మాన్రావాహనసంయుక్తాస్సదా పర్వణిపర్వణి. 53

యథాశ్రద్దం ప్రదాతవ్యా భుక్తిముక్తి ఫలప్రదాః | గుడ ధేను పసఙ్గేన సర్వా స్తావన్మయోదితాః. 54

అనేక యజ్ఞఫలదా స్సర్వపాపహరా శ్శుభాః | వ్రతానా మొత్తమం యస్మా ద్విశోక ద్వాదశీవ్రతమ్‌ 55

తదఙ్గత్వేన చైవాత్ర గుడధేనుః ప్రశస్యతే | ఆయనే విషువే పుణ్య వ్యతీపాతే7థవా పునః

56

గుడధేన్వాదయో దేయా స్సోపరాగాదిపర్వసు | విశోకద్వాదశీ పుణ్యా సర్వపాపహరా శుభా. 57

యాముపోష్య నరో యాతి త్వష్ణో ః పరమం పదమ్‌ | ఇహలోకే చ సౌభాగ్య మాయు రారోగ్యమేవచ. 58

వైష్ణవం పద మాప్నోతి మరణ స్మరణా ద్దరేః నవర్భు దరసహాస్రాణి దశచాష్టౌచ ధర్మవిత్‌. 59

నచోగ్రదుఃఖదౌర్గత్యం తస్య ఞ్జాయతే నృప | నారీవా కురతే యాతు విశోకద్వాదశీవ్రతమ్‌. 60

నృత్తగీతపరా నిత్యం సా7పి తతఫలమాప్నుయాత్‌ | తస్మా దగ్రే హరే ర్నిత్య మన సంగీతవాదనమ్‌. 61

కర్తవ్యం భూతికామేన భక్త్యాయతు పరయా ముదా|

ఇతి పఠతి యఇత్థం సర్వదా యస్తు సమ్య ఙ్మధుముర నరకారే రర్చనం సాధుపశ్యేత్‌. 62

మతిమపిచ నరాణాం యో దదాతీన్ద్రలోకే | వసతి స విబుధౌఘైః పూజ్యతే కల్పమేకమ్‌.

ఇతి శ్రీమత్స్యమహపురాణ మత్స్యమనసంవాదే విశోకద్వాదశివ్రత గుడధేన్వాదిదానకథనం

నామైకాశీతత మో7ధ్యాయః.

పాపహరములగుధేనువులుఇట్టివిగుడ-ఘృత-తిల-జల-రస-ధాన్య-శర్క రా-లవణ-రత్న-స్వరూప(గోరూప) ధేనువు లనునవి పది కలవు. సువర్ణ-నవనీత తైల ధేనువులను కూడ కొందరు మహర్షులు చెప్పినారు. వీటిలో ద్రవ ధేనువులను అవి నింపిన మట్టికడవలతో (చిన్న పాత్రలతోకాని) అమర్చవలెను. గట్టి ద్రవ్యములైనచో రాసులుగా అమర్చవలయును. అన్నిటి విషయమును ఇదే విధానము; ఇవే మంత్రములు, ఆవాహనాది పూజలతో ఆయా పర్వము లందవి ఈయవలయును. గుడ ధేను ప్రసంగమున ఇవి చెప్పుటయైనది. ఇవి అన్నియు సర్వపాపరహములు; అనేక యజ్ఞఫలప్రదములు.

విశోక ద్వాదశీ వ్రతము వ్రతములలో నెల్ల ఉత్తమమయినది. దానికి అంగభూతము ఈ గుడధేను ధానము.

ఈ ధేను దానములు ప్రత్యేకముగా ఈయవలెనని (ఉత్తర-దక్షిణ) ఆయనములు-విషువ (రాత్రింబవళ్ళు సమముగా ఉండు) కాలము వ్యతీపాత యోగమున్న దినము - ఇట్టివి తగిన కాలములు.

ఈ విశోక ద్వాదశీ పుణ్యప్రదము-సర్వపాపహరము-శుభకరము; ఈ దినమున ఉపవాసము ముక్తిప్రదము. దీనచే ఇహమను ఆయురారోగ్య సౌభాగ్యములు-మరణ కాలమున (ఇది చేసిన వారికి) హరిస్మరణ మాత్రమున విష్ణలోక ప్రాప్తి కలుగును. ఇరువది ఏడు వందల అర్బుదముల సంవత్సరములపాటు దారిద్ర్యమును తీవ్ర దుఃఖములును లేక సుఖింతురు. నృత్తగీతాది పూర్వకముగా నియముతో ఈ వ్రతము చేసిన స్త్రీకిని ఈ ఫలముకలుగును.కనుకహరి

_______________________________________

o నవ

ఎదుట నృత్తగీతములు భక్తితోచేయుట కర్తవ్యము. దానిని సకల సంపదలును ముక్తియు లభించును.

ఈ వ్రతమును వినినను చదవినను ఇతరులకు తెలిపినను చూచినను కల్పకాలము ఇంద్రలోకమున దేవ పూజితుడై సుఖించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున విశోక ద్వాదశీవ్రత-గుడ ధేన్వాది దాన కథనమను ఎనుబది యొకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters