Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టమో7ధ్యాయః

విరిఞ్చికృతపృథురాజ్యాభిషేకాదిః.

ఋషయః: ఆదిసర్గ స్త్వయా సూత కథితో విస్తరేణ నః | ప్రతిసర్గశ్చ ఏతేషా మధిపాం స్తా న్వదస్వ నః. 1

సూతః: యదాభిషిక్త స్సకలాధిరాజ్యే పృథుర్ధరిత్య్రా మమరాధిపేన | తదౌషధీనా మధిపం చకార యజ్ఞవ్రతానాం తపసాం చ సోమమ్‌ 2

నక్షత్ర తారా ద్విజ వృక్ష గుల్మ లతా వితానస్య చ రుక్మగర్భమ్‌ | అపా మధీశం వరుణం ధనానాం రాజ్ఞాం ప్రభుం వైశ్రవణం చ తద్వత్‌. 3

విష్ణుం రవీణా మధిపం వసూనా మగ్నిం చ లోకాధిపతిం చకార | ప్రజాపతీనా మధిపం చ దక్షం చకార శక్రం మరుతా మధీశమ్‌. 4

దైత్యాధిపానా మథ దానవానాం ప్రహ్లాద మీశం చ యమం పితౄణామ్‌ | పిశాచరక్షః పశుభూతయక్ష బేతాళరాజ్ఞా మథ శూలపాణిమ్‌. 5

ప్రాలేయశైలం చ పతిం గిరీణా మీశం సముద్రం ససరిన్నదీనామ్‌ | గన్ధర్వవిద్యాధర కిన్నరాణా మీశం పున శ్చిత్రరథం చకార. 6

నాగాధిపం వాసుకి ముగ్రవీర్యం సర్పాధిపం తక్షక మాదిదేశ | దిగ్వారణానా మధిపం చకార గజేన్ద్ర మైరావత నామధేయమ్‌. 7

సుపర్ణ మీశం పతతాం హయానాం రాజాన ముచ్బైశ్శ్రవసం చకార | సింహం మృగాణా మృషభం చకార ప్లక్షం పున స్సర్వవనస్పతీనామ్‌. 8

పితామహః పూర్వ మథాభ్యపిఞ్చ దీశాన్పున స్సర్వదిశాధినాధా& | పూర్వేణ దిక్పాల మథాభ్యషించ న్నామ్నా సుధర్మాణ మరాతికేతుమ్‌. 9

తతోధిపం దక్షిణత శ్చకార సర్వేశ్వరం శఙ్ఖపదాభిధానమ్‌ | సుకేతుమన్తం దిగధీశ మీశం చకార పశ్చా ద్భువనాణ్డగర్భః. 10

హిరణ్యరోమాణ ముదగ్దిగీశం ప్రజాపతి స్సోమపతించకార | అద్యాపి కుర్వన్తి దిశా మధీశా శ్శబ్దం వహన్తస్తు భువోభిరక్షామ్‌. 11

చతుర్భి రేభిః పృథునామధేయో నృపోభిషిక్తః ప్రథమం పృథివ్యామ్‌ | మన్వన్తరే చాధిగతే తథైవ వైవస్వతం చక్రు రిమం పృథివ్యామ్‌. 12

గతేన్తరే చాక్షుషనామదేయే వైవస్వతాఖ్యే చ పునః ప్రవృత్తే | ప్రజాపతి స్సోస్య చరాచరస్య బభూవ సూర్యాన్వయవంశచిహ్నః. 13

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే విరిఞ్చకృత పృథు

రాజ్యాభిషేకాదికథనం నామాష్టమోధ్యాయః.

అష్టమాధ్యాయము

బ్రహ్మ పృథువు మొదలగు వారికి ఆయా ఆధిపత్యము లిచ్చుట

శౌనకాది ఋషులు సూతు నిట్లడిగిరి : అయ్యా ! మీరు మాకు పరమాత్మ చేసిన ఆదిసర్గమును (ప్రథమసృష్టిని) తెలిపితిరి. దీని తరువాత చేసిన ప్రతి సర్గమును ఆ సృష్టియందలి ఆయా భూతములకును పదార్థములకును అధిపతులను విశదీకరింపుడు.

సూతుడు ఇట్లు చెప్పనారంభించెను : అమరాధిపుడగు బ్రహ్మ సకల ధరిత్రికి పృథువును అధిపతిగా చేసెను. అట్లే ఓషధులకు యజ్ఞ కర్మలకు తపస్సులకు సోముని-నక్షత్రములు తారలు పక్షులు వృక్షములు గుల్మము (పొద)లు లతలు మొదలగు వానికి హిరణ్య గర్భుని జలములకు వరుణుని ధనములకు రాజులకు కుబేరుని ఆదిత్యులకు విష్ణువను ఆదిత్యుని వసువులకు అగ్ని అను వసువును ప్రజాపతులకు దక్షుని దేవతలకు ఇంద్రుని దైత్యదానవులకు ప్రహ్లాదుని పితృ దేవతలకు యముని పిశాచములకు రక్షస్సులకు పశువులకు యక్ష భూత బేతాళములకు శూలపాణిని పర్వతములకు హిమవంతుని సరిత్తులకు (జల ప్రవాహములకు) నదులకు సముద్రుని గంధర్వులకు విద్యా ధరులకు కింనరులకు చిత్రరథుని నాగులకు వాసుకిని సర్పములకు తక్షకుని దిగ్గజములకు ఐరావతమును పక్షులకు గరుడుని అశ్వములకు ఉచ్చైః శ్రవమును మృగములకు సింహమును వనస్పతు (పూయకయే కాయలు కాచెడు చెట్టు)లకు జువ్వి చెట్టును అధిపతులనుగా చేసెను. సుధర్ముని తూర్పునకు శంఖుని దక్షిణమునకు సుకేతుమంతుని పశ్చిమమునకు హిరణ్యరోముని ఉత్తరమునకు దిగధిపతులనుగా బ్రహ్మ అభిషేకించెను. వారు ఇప్పుడును (మత్స్యనారాయణుడు మనువునకు ఈ వృత్తాంతము చెప్పు నాటికి) ఈ నలుగురు దిక్పాలురును పృథుని మొదటి భూలోకాధిపతినిగా అభిషేకించిరి. ఆ మన్వంతరము గడచిన తరువాత సూర్య వంశజుడగు వైవస్వతుని భూలోకాధిపతినిగా చెసిరి. అనగా చాక్షుషమన్వంతరము గడువగా వైవ స్వత మన్వంతరము ప్రారంభము కాగా సూర్య వంశమునకు పతాక వంటి వాడగు వైవస్వతుడు భూలోక చక్రవర్తిగా ప్రజాపతిగా అభిషిక్తుడయ్యె.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున బ్రహ్మ పృథువు మొదలగు వారిని ఆయా

అధిపతులనుగా అభిషేకించుట యను అష్టమాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters