Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టస ప్తతితమో7ధ్యాయః.

కమలస ప్తమీవ్రతమ్‌.

ఈశ్వరః : 

అతఃపరం ప్రవక్ష్యామి తద్వత్కమలస ప్తమీమ్‌ | యస్యా స్సఙ్కీ ర్తనాదేవ తుష్యతీహ దివాకరః. 1

వసన్తామలస ప్తమ్యాం స్నాతః సన్గౌరసర్షపైః | తిలపా తేచ సౌవర్ణం నిధాయ కమలం శుభమ్‌. 2

వస్త్రయుగ్మయుతం కృత్వా గన్ధపుషై#్పః సమర్చయేత్‌ | నమః కమలహస్తాయ నమస్తే విశ్వధారిణ. 3

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తు తే | తతో వికాలవేళాయా ముదకుమ్భసమన్వితమ్‌. 4

విప్రాయ దద్యా త్సమ్పూజ్య వస్త్రమాల్యవిభూషణౖః | శ క్తిశ్చే త్కపిలాం దద్యా దలఙ్కృత్య విధానతః.

అహోరాత్రే గతే పశ్చా దష్టమ్యాం భోజయే ద్ద్విజా& | యథాశక్త్యా7థ భుఞ్జీత సప్తమ్యాం తైలవర్జితమ్‌.

అనేన విధినా శుక్లస ప్తమ్యాం మాసిమాసి చ | సర్వం సమాచరే ద్భక్త్యా విత్తశాఠ్యవివర్జితః. 7

వ్రతా న్తే శయనం దద్యా త్సువర్ణకమలాన్వితమ్‌ | గాంచ దద్యా త్స్వశక్త్యాచ సువర్ణాంచ పయస్వినీమ్‌. 8

భాజనాసనపాదీ& దద్యా దిష్టా నుపస్కరా& | అనేన విధినా యస్తు కుర్యా త్కమలస ప్తమీమ్‌. 9

లక్ష్మీ మనన్తా మభ్యేతి సూర్యలోకేచ మోదతే | కల్పేకల్పే తథా లోకా న్త్సప్త గత్వా పృథక్పృథక్‌. 10

అప్సరోభిః పరివృత స్తతో యాతి పాం గతిమ్‌ |

ఏతద్వ్రతం యశ్శృణుయా త్సమగ్రం పఠేచ్చ భక్త్యా7థ మతిం దదాతి. 11

సో7ప్యత్ర లక్ష్మీ మచలా మవాప్య గన్ధర్వ విద్యాధరలోకభా క్స్యాత్‌.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ కమలసప్తమీవ్రతకథనంనామాష్ట

సప్తతితమో7ధ్యాయః.

డెబ్బది ఎనిమిదవ అధ్యాయము

కమల స ప్తమీ వ్రతము

ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఇపు డిక ఇట్టిదే యగు కమల స ప్తమీ వ్రతమును తెలిపెదను. దానిని కీ ర్తించినంతనే ఆదిత్యుడు సంతసించును. వసంత (చైత్ర వైశాఖములలో నేదైన) శుక్ల స ప్తమినాడు తెల్లని ఆవల (పిండితో-నూనె)తో స్నానము చేసి నూవుల పళ్లెరమునందు నూతన వస్త్రయుగ్మమునుంచి దానిపై బంగారు కమలముంచి గంధపుష్పాదికముతో సమర్చించవలెను. కమలహస్తుడు-విశ్వధారి-దివాకరుడు-ప్రభాకరుడు (పగటిని-ప్రకాశమును కలిగించువాడు) అగు రవీ! నీకు వందనము. అని నమస్కరించవలెను. పిమ్మట వికాల(సంధ్యా)సమయమున విప్రుని వస్త్రమాల్య విబూషణములతో సంపూజించి ఈ సామగ్రితో సువర్ణ కమలమును ఉదకుంభమును శ క్తి యున్నచో సాలంకారముగ కపిలగోవును విధానానుసారము దాన మీయవలెను. స ప్తమినా డుపవసించి అష్టమినాడు యథాశ క్తిగ భుజింపజేసి తానును భుజింపవలెను. సప్తమినాడు మాత్రము తైలములేని ఉపాహారము తినవలెను.

ఇట్లు ప్రతిమాసమున ధనముండియు లోభి చక శుక్ల స ప్తమినాడు సంవత్సరము పొడవున చేయుచు పోవలయును. వ్రతాంతమున (ఉద్యాపనముగా) బంగారు కమలముతోపాటు సర్వోపస్కరములతో శయనము (మంచము పడకలు)బంగారు కొమ్ములు అలంకరించిన పాడి కపిల గోవును పాత్రలు పీఠములు ఆసనములు దీపములు మొదలగు ఇష్టసామగ్రిని కూడ ఈయవలెను.

ఇట్లు కమల స ప్తమీ వ్రత మాచరించినవాడు అనంతమగు లక్ష్మిని పొందుటయే కాక సూర్యలోకమున సుఖించును. కల్పమునకు ఒకటి చొప్పున ఏడు ఊర్ధ్వలోకములకు క్రమశః పోయి అచ్చట నెల్ల అప్సరసలతో పూజలందుకొని సుఖించి తుదకు ము క్తి నందును.

దీనిని సమగ్రముగా భక్తితో వినినను తెలిపినను ఇహమున స్థిరమగు ఐశ్వర్యము ననుభవించి పరమున విద్యాధర లోకమున సుఖించును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున కమల స ప్తమీ వ్రతమను డెబ్బది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters