Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రిస ప్తతితమో7ద్యాయః.

శుక్రపూజావిధిః.

పిప్పలాదః : 

అథాత శ్శృణు భూపాల ప్రతిశుక్రప్రశా న్తయే | యాత్రారమ్భే7వసానే చ తథా శుక్రోదయే ష్విహ. 1

రాజతే వాపి సౌవర్ణే కాంస్యపాత్రే7థవా పునః | శుక్లపుష్పామ్బరయుతే సితతణ్డులపూరితే. 2

విధాయ రాజతం శుక్రం శుచిముక్తాఫలాన్వితమ్‌ | మన్త్రేణానేన తత్సర్వం సామగాయ నివేదయేత్‌. 3

నమస్తే సర్వలోకేశ నమస్తే భృగునన్దన | కవే సర్వార్థసిద్ధ్యర్థం గృహాణార్ఘ్యం నమోస్తుతే. 4

ఏవ మస్యోదయే కుర్యా ద్యాత్రాదిషుచ భారత | సర్వకామా నవాప్నోతి విష్ణులోకే మహీయతే. 5

యావ చ్ఛుక్రస్య న కృతా పూజా సోమాలికై శ్శుభైః | వటుకైః పూరికాభిశ్చ అపూ పై శ్చణకై రపి. 6

తావ న్నవాన్నం నాశ్నీయా త్త్స్రీభిః కామార్థసిద్ధయే| తద్వ ద్వాచస్పతేః పూజాం ప్రవక్ష్యామి యుధిష్ఠిర. 7

సువర్ణపాత్నే సౌవర్ణ మమరేశపురోహితమ్‌ | పీతవస్త్రామ్బరయుతం కృత్వా స్నానం సుసర్షపైః. 8

పళాశాశ్వత్థభ##ఙ్గేన పఞ్చగవ్యజలేన చ | పీతామ్బరాఙ్గవసనో ఘృతహోమంతు కారయేత్‌. 9

ప్రణమ్యచ గవా సార్ధం బ్రాహ్మణాయ నివేదయేత్‌ | నమస్తే వచసాం నాధ వాక్పతే7థ బృహస్పతే. 10

క్రూరగ్రహైః పీడితానా మవనాయ నమో నమః| సఙ్క్రాన్తా వస్య కౌన్తేయ యాత్రా స్వభ్యుదయేషు చ. 11

కుర్వ న్బృహస్పతేః పూజాం సర్వా న్కామా న్త్సమశ్నుతే. 11 ||

ఇతి శ్రీమత్స్యమమాపురాణ పిప్పలాదయుధిష్ఠిరసంవాదే శుక్రగురుపూజావిధి ర్నామ

త్రిస ప్తతితమో7ధ్యాయః.

డెబ్బది మూడవ అధ్యాయము

శుక్రగురు పూజా విధానము

పిప్పలాదుడు యుధిష్ఠిరునితో ఇట్లు చెప్పెను: భూపాలా! ఇక ఇప్పుడు యాత్రారంభావసానములందు ప్రతి శుక్ర (చుక్క ఎదురు) (దోష) ప్రశాంతికై శుక్రోదయ సమయమందు చేయవలసినది చెప్పెదను. బంగారుతో కాని వెండితో కాని కంచుతో కాని చేసిన పాత్ర(పళ్లెర)మందు తెల్లని వస్త్రము పరచి తెల్లని బియ్యము నింపి శుక్రుని రజత ప్రతిమను పులు కడిగిన ముత్తెములను దానియందుంచి ఈ అర్థము నిచ్చు మంత్రముతో అవి అన్నియు సామవేదియగు బ్రాహ్మణునకు దాన మీయవలెను. ''సర్వలోకేశా! భృగునందనా! కవీ! నీకు నమస్కారము. అర్ఘ్య మందుకొని మాకు సర్వార్థసిద్ధి కలిగించుము.'' ఇట్లు చేసినచో అన్ని కోరికలును(ఇహమున)తీరి విష్ణులోకమున పూజితుడై సుఖించును.

ఇట్లు సోమాలికములు వటుకములు పూరికలు అపూపములు శనగలు వీనితో శుక్రుని పూజించు నంతవరకును ఇంటిలో స్త్రీలును క్రొత్త పంట ధాన్యపు అన్నమును తినరాదు. ఇట్లు నియమమును పాటించినరో సర్వార్థసిద్ధి కలుగును.

యుధిష్ఠిరా! ఇట్టిదే బృహస్పతి పూజయు కలదు. అది చెప్పెదను. బంగారు పాత్ర(పళ్ళెర)మందు గురుని స్వర్ణ ప్రతిమను పచ్చని పట్టు వస్త్రము చుట్టి నిలుపవలెను. యజమానుడు ఆవలతో (ఆవపిండి-ఆవనూనెలతో) మోదుగ-రావి-చిగుళ్ల ముక్కలతో కూడిన పంచగవ్య మిశ్రితజలముతో స్నాన మాడి పీతాంబరములు ధరించి నేతితో (బృహస్పతి నుద్దేశించి)హోమము చేయవలెను. బ్రాహ్మణునికి నమస్కరించి గోవును ఈ చెప్పిన సామగ్రిని దాన మీయవలెను. (మంత్రార్థము)-''వచస్సులకు నాధా! వాక్పతీ! బృహస్పతీ! క్రూరగ్రహపీడితులను రక్షించువాడా! నమస్కారము.''

సంక్రాంతి (బృహస్పతికాని రవికాని రాశియందు ప్రవేశించు) సమయమందును యాత్రాకాలమునందును అభ్యుదయ (శుభ) కర్మారంభములందును బృహస్పతి పూజ చేయువారికి సర్వకామములును సిద్ధించును. (యాత్ర-రాజులు యుద్ధములకై కాని రాచరికపు పనులకై కాని బయలుదేరుట; లేదా స్త్రీలు పుట్టి నింటికో అత్తవారి ఇంటికో బయలుదేరుట; లేదా వ్యాపారమునకో వ్యవహారమునకో తీర్థక్షేత్రాది సేవకో బయలుదేరుట)

ఇది శ్రీమత్స్య మహాపురాణమున శుక్రగురు పూజా విధానమను డెబ్బది మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters