Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్విస ప్తతితమో7ధ్యాయః.

అజ్గారకవ్రతమ్‌.

ఈశ్వరః: 

శృణు చాన్య ద్భవిష్యం య ద్రూపసమ్పత్ప్రదాయకమ్‌ | భవిష్యతి యుగే బ్రహ్మ న్ద్వాపరాన్తే పితామహ 1

పిప్పలాదేన కథితం యుధిష్ఠిరపురో మహత్‌ | తపన్తం నైమిశారణ్య పిప్పలాదం మహామునిమ్‌ 2

అభిగమ్య తథా చైనం ప్రశ్న మేత త్కరిష్యతి | యుధిష్ఠిరో ధర్మసూను ర్ధర్మయుక్తం తపోనిధిమ్‌. 3

యుధిష్ఠిరః: కథ మారోగ్య మైశ్వర్య మపి ధర్మేమతి స్తథా | అవ్యజ్గతా శివే భక్తి ర్విష్ణోవాపి భ##వే త్కథమ్‌.

ఈశ్వరః: తస్యోత్తర మిదం బ్రహ్మ న్పప్పలాదస్య ధీమతః

శృణుష్వ యద్వక్ష్యతి స ధర్మపుత్త్రాయ ధార్మికః. 5

పిప్పలాదః : సాధు పృష్టం త్వయా భద్ర ఇదానీం కథయామి తే |

అజ్గారవ్రత మిత్యేత త్సర్యం వక్ష్యామి తే నృప. 6

అత్రా పుద్యాహరన్తీమ మితిహాసం పురాతనమ్‌ | ఇరోచనస్య సంవాదం భార్గవస్యచ ధీమతః. 7

డెబ్బది రెండవ అధ్యాయము

అంగారక వ్రతము.

ఈశ్వరుడిట్లు చెప్పెను: బ్రహ్మా! రూప సంపదలనొసగు మరియొక భవిష్య (ముందటి కాలమునకు పనికి వచ్చు) వ్రతము చెప్పెదను; వినుము . నైమిశారణ్యమున తపస్సాచరించుచుండు తపోనిధియు ధర్మయుక్తుడునగు పిప్పలాదమునికడకు పోయి ధర్మపుత్త్రుడగు యుధిష్ఠిరుడు ఆరోగ్యైశ్వర్యములు ధర్మమందు స్థిరబుద్ధి అవికలాంగత్వము శివ విష్ణులయందు ధ్రువభక్తి కలుగు నుపాయము తెలుపుమని అతనిని వేడును. పిప్పలాదుడతనికిట్లు చెప్పును; రాజా! చక్కగా అడిగితివి . అంగారక వ్రతమనునది కలదు. నీకదియంతయు చెప్పెనదు. ఈ విషయమున విరోచన భార్గవ సంవాదమను ఇతిహాసము పరంపరలో వినబడుచున్నది.

ప్రహ్లాదస్య సుతం దృష్ట్వా ద్వ్యష్టవర్షాకృతిం కృతీ l రూపేణా ప్రతిమం కన్త్యా ప్రహస న్భృగునన్దనః 8

సాధు సాధు మహాబాహో విరోచన శివం తవ l తత్తదాహస్మితం దృష్ట్వా పప్రచ్ఛ సురసూదనః. 9

బ్రహా న్కిమర్థ మేతత్తే హాస్య మాకస్మికం కృతమ్‌ l సాధు సాధ్వితి చోక్త్వామాం సర్వం చైత ద్వదస్వమే. 10

తమేవంవాదినం శుక్ర ఉవాచ వదతాం వంః విస్మయా ద్ర్వతమాహాత్య్మా దేత ద్ధాస్యం కృతం మయా.

అజ్గారకోత్పత్తిః.

పురా దక్షవినాశాయ కుపితస్య త్రిశూలినః l అపత ద్భీమవక్త్రస్య స్వేదభన్దు ర్లలాటజః. 12

భిత్త్వాస సప్తపాతాళం నిర్దహ న్త్సప్తసాగరా&l అనేకవక్త్రనయనో జ్వలజ్జ్వలనభీషణః 13

వీరభద్ర ఇతి ఖ్యాతః *కరపాదాయు తాయుధః l కృత్వా7సౌయజ్ఞమథనం పున ర్భూతల మాశ్రితః. 14

త్రిజగ న్నిర్దహన్భూయ శ్శివేన వినివారితః l కృతం త్వయా వీరభద్ర దక్షయజ్ఞవినాశనమ్‌. 15

ఇదానీ మల మేతేన లోకదాహేన కర్మణా l శాన్తిప్రదాతా సర్వేషాం గ్రహి%ాణాం మధ్యగో భవ. 16

ప్రక్షిప్య తేజనాః పూజాం కరిష్మన్తి వరా న్మమ l అజ్గారక ఇతి ఖ్యాతిం పొగమిష్యసి ధరాత్మజ. 17

దేవలోకే ద్వితీయంతు తవ రూపం భవిష్యతి l యేచ త్వాం పూజయిష్యన్తి చుతుర్థ్యాం తుదినే నరాః. 18

__________________________________________________________________

*కరపాదాయుతావృతః

రూప మారోగ్య మైశ్వర్యం తేష్యనన్తం భవిష్యతి l ఏవ ముక్త స్తదా శాన్తి మగమ త్వామరూపధృత్‌. 19

సఞ్జౌత స్తత్‌ష్ణా ద్రాజ న్గ్రహత్వ మగమ త్పునః l

ఎట్లనగా-ఒకమారు రాక్షసగురుడు భృగు నందనుడు శుక్రుడు రూపమునను కాంతియందును నిరుపమానుడును పదునారేండ్ల ప్రాయమువాడును ప్రహ్లాద పుత్త్రుడునగు విరోచనుని చూచి నవ్వుచు-బాగు-బాగు-మహాబాహూ! విరోచనా! నీకు క్షేమమా! అనెను. విరోచనుడతని చిరునవ్వు చుచి విప్రా! నన్ను చూచి ఆకారణముగా నీవేల నవ్వితివి? బాగు బాగనియు పలికితివి! ఏల? ఇదంతయునాకు తెలుపుమనగా పురుషోత్తముడగు శుక్రుడతనికిట్లనెను: వ్రతమహాత్మ్య విషయమై ఆశ్చర్యముతో నవ్వితిని. పూర్వము దక్ష వినాశమునకై కుపితుడై భయంకర ముఖడైన త్రిశూలి లలాటము నుండి స్వేదబిందువులు క్రింద పడెను. వాటినుండి సప్తపాతాళముల భేదించుచు సప్తసాగరముల దహించుచు అనేక వక్త్రనయనుడును మండెడు అగ్ని వలె భీషణుడును పదివేల కరములు పాదములు ఆయుధములుగా కలవాడేమో యన దగిన వీరభద్రుడనునతడు జనించెను. అతడు యజ్ఞ ధ్వంసముచేసి మరల భూతలము చేరెను. అతడు మరల త్రిజగముల నిర్థహించనుండ శివుడది వారించెను. వీరభద్రా! నీవు దక్షయజ్ఞ వినాశము చేసితివి. ఈ లోకదాహకృత్య మిక చాలును. (లోక) éశాంతి ప్రదాతవయి సర్వగ్రహములలో నొకడవగుము. నావరమున జనులు విస్తరించి నీపూజ జరుపుదురు. భూమి (పైపడిన స్వేద భిందువుల) నుండి పుట్టిన నీవు అంగారకుడు (అంగార-క=నిప్పకణిక-వలె- ఉన్నవాడు) అని ఖ్యాతి కొందుదువు. నీ రెండవ రూపము దేవ (ద్యు) లోకమునందుండును. (గ్రహముగా ఉండు రూపము అంతరిక్షమునందలిది.) చతుర్థీ తిథియందు (మంగళ- అంగారక- వారమునాడు) నిన్ను పూజించువారు అనంత రూపారోగ్యైశ్వర్యవంతులగుదురు. శివుడిట్లనగనే ఆ వీరభద్రుడు శాంతించి కామరూపుడు కావున తత్‌క్షణముననే గ్రహమై యంతరిక్షమున నిలిచెను.

స కదాచి ద్భహం స్తస్య పూజార్చాదిక ముత్తమమ్‌. 20

దృష్టవా న్ర్కియమాణంచ శుద్రత్వేన వ్యవస్థితః l తేన త్వం రూపవా న్జాత స్సురశత్రుకులోద్వహ. 21

శూద్రేణ క్రియమాణస్య వ్రతస్య తవ దర్శనాత్‌ l ఈదృశీం రూపనమ్పత్తిం దృష్ట్వా విస్మితవా నహమ్‌.

సాదుసాధ్వితి తేనోక్త మహో మాహాత్య్మ ముత్తమమ్‌ l పశ్యతో7పి భ##వే ద్రూప మైశ్వర్యం కిము కుర్వతః. 24

యస్మాచ్చ భక్త్యా దరణీసుతస్య విబుధ్యమానేన గవాదిదానమ్‌ l ఆలోకితం తేన సురారిగర్భసమ్భాతి రేషా తవ దైత్యజాత. 25

పిప్పలాదః : అథ తద్వచనం శ్రుత్వా భార్గవస్య మహాత్మనః l ప్రహ్లాదనన్దనోధీరః పునః పప్రచ్ఛ విస్మితః:

విరోచనః: భగవం స్తద్ర్వతం సమ్య క్ర్ఛోతు మిచ్ఛామి తత్త్వతః l దీయమానంతు తద్దానం మయా దృష్టం భవాన్తరే. 27

మాహాత్మ్యంచ విధానంచ యథావ ద్వక్తు మర్హసి l ఇతి తద్వచనం శ్రుత్వా విప్రః ప్రోవాచ విస్తరాత్‌. 28

ఇది ఇట్లుండ నీవు పూర్వ జన్మమున నొకప్పుడు శూద్రుడవై ఉండి (ఎవరో) చేయుచుండిన అంగారక పూజను అతని అర్చామూర్తిని చూచుట తటస్థించెను. సురశత్రుకుల శ్రేష్ఠా! దానిచే నీవు రూపవంతుడ వయితివి. నీకుగల-వివిధ-రుచి(కాంతి) చాలదూరమువరకు పోవుచున్నందున నీకు విరోచనుడు (వి-రుచ్‌) అను పేరు ఏర్పడినది. శూద్రుడు చేయు చుండిన వ్రతమును చూచినందువలన (అపుడు శూద్రుడుగా నుండిన) నీకు కలిగిన ఈ రూపనంపత్తి చూచి విస్మితుడనయి స్మితముచేసితిని. ఈ వ్రత మాహాత్మ్య ముత్తమముని 'సాధు-సాధు' 'బాగు-బాగు' అంటిని. వ్రతమును చూచినవానికి కూడ రూపైశ్వర్యములు కలు నే! చేసినవానికి (కలుగునని) వేరుగా చెప్పనేల! ఏలయన రాక్షసకుమారా! నీవు వివేకవంతుడవై దరణీ పుత్త్రుని పూజాదికమను గోదానాదికమును చూచినందుననే నీవు ఇట్లు రాక్షసరాజ గర్భసంజాతుడ వయితివి కదా!

(పిప్ఫలాదు డనెను:) మహాత్ముడగు భార్గవుని (శుక్రుని) ఆ మాటవిని ధీరుడు ప్రహ్లాదనందనుడు నగు విరోచనుడు విస్మితుడై మరల ఇట్లడిగెను: భగవన్‌! ఆ వ్రతమును జన్మాంతరమున నేను చూచిన ఆ వ్రతదానాదికమును లెస్సగా వినగోరుచున్నాను. ఆ వ్రత మాహాత్మ్య విధానములను యథావత్‌గా చెప్ప వేడెదను. శుక్రః చతుర్థ్యఙ్గారకదినం యదా భవతి దానవ | మృదా స్నానం తదా కుర్యా త్పద్మరాగవిభూషితః. 29

అగ్ని ర్మూర్ధాదివో మన్త్రం జపం స్తావ దుదఙ్ముఖః |

శూద్రస్తూష్టీం స్మర న్భౌమ మాస్తే భోగవివర్జితః. 30

అథా స్తమిత ఆదిత్యే గోమయే నానులేపయేత్‌ | ప్రాఙ్గణం పుష్పమాలాద్యై రక్షతాభి స్సమ న్తతః. 31

అభ్యర్చ్యాభిలిఖే త్పద్మం కుఙ్కుమే నాష్టపత్రకమ్‌ | కుఙ్కుమస్యా ప్యభావేతు ర క్తచన్దన మిష్యతే. 32

చత్వారః కరకాః కార్యాః భక్ష్యభోజ్య సమన్వితాః | తణ్డులై రక్తశాలీయైః పద్మరాగైశ్చ సంయుతాః. 33

చతుష్కోణషు తా న్కృత్వా ఫలాని వివిధానిచ | గన్ధమాల్యాదికం సర్వం తథైన వినివేదయేత్‌. 34

సువర్ణశృఙ్గీం కపిలా మథార్చ్య రూపై#్యః ఖురైః కాంస్య దోహాం సవత్సామ్‌ |

ధురన్ధరాం రత్నవతీంచ సౌమ్యాం దాస్యామి దీప్తామ్బరసంయుతాం చ. 35

అఙ్గుష్ఠమాత్రం పురుషం సురూపం సౌవర్ణ మప్యాయతబాహుదణ్డమ్‌ |

చతుర్భుజం హేమమయం సుతామ్రపాత్రే గుడస్యోపరి ధాన్యయుక్తే. 36

సామస్వరజ్ఞాయ జితేన్ద్రియాయ పాత్రాయ శీలాస్వయసంయుతాయ |

దాతవ్య మేత త్సకలం ద్విజాయ కుటుమ్బినే కించి దదామ్భికాయ 37

చవితి మంగళవారమునాడు పద్మరాగమణి ధరించి ఉత్తరాముఖుడై ''అగిర్మూర్ధాదివః'' అను మంత్రమును జపించుచు మృత్తికతో స్నానము చేయవలెను. శూద్రుడైనచో మంత్రము జపింపకయే చేయవలెను. భోగము లేవియు అనుభవించకుండ నిరాడంబరుడై యుండవలెను. (పగలంతయు ఇట్లుండి) సూర్యు డస్తమించగనే ముంగిటిని గోమయముతో ఆలికి పుష్పమాలలతో అక్షతములతో అభ్యర్చనము చేసి ఆ చోట కుంకుమముతో అష్టదళపద్మము వేయవలెను. రక్తచందనముతోనై న వేయవచ్చును. నాలుగు గరిగ(ఒక విధమగు మట్టిపాత్ర)లను భక్ష్యభోజ్య(పదార్థ)ములతో ఎర్ర వడ్ల బియ్యముతో పద్మరాగములతో నింపవలెను. (ఈ అలికినచోట) నాలుగు మూలలందు వాటిని వివిధ ఫలములను గంధమాల్యాది ద్రవ్యములను ఉంచి (అంగారకునకు) నివేదించవలెను. బంగారు కొమ్ములు వెండి గిట్టలు పిదుకుటకు కంచుపాత్ర దూడ కలదియు మెరయు వస్త్రములతో కప్పబడినది శ్రేష్ఠమయినది రత్నములు కలది సాధు స్వభావ అగు పాడి కపిలగోవును దానము చేయుదునని సంకల్పించి దానిని సిద్ధపరచవలెను. పొడవయిన చతుర్బాహువులుకల సురూపుడగు పురుషుని విగ్రహమును బంగారముతో బొటనవ్రేలియంత పరిమాణముతో చేయించి ధాన్యముతో తనింపిన తామ్రపాత్రము పైభాగమున బెల్ల ముంచి దానిపై ఈ ప్రతిమను నిలుపవలెను. ఇదంతయును సస్వరముగ సామవేదమును నేర్చిన వాడు జితేంద్రియుడు దానయోగ్యుడు మంచి శీలము వంశము కలవాడు కుటుంబి దంభములేనివాడు నగు విప్రునకు దానమీయవలెను.

భూమిపుత్త్ర మహభాగ స్వేదోద్భవ పినాకినః | రుపార్థీ త్వాం ప్రపన్నో7 స్మి గృహాణార్ఘ్యం నమోస్తు తే.

మన్త్రేణానేన దత్వార్ఘ్యం రక్తచన్దనవారిణా | తతో7ర్చయే ద్విప్రవరం రత్నమాల్యామ్బరాదిభిః. 39

దద్యా న్మన్త్రేణ తేనైవ భౌమం గోమిథునాన్వితమ్‌ |

శయ్యాం చ భ క్తితో దద్యా త్పర్వోపస్కరసంయుతామ్‌. 40

యద్య దిష్టమం లోకే యచ్చాన్య ద్దయితం గృహే | తత్త ద్గుణవతే దేయం తదే వాక్షయ మిచ్ఛతా. 41

ప్రదక్షిణం తతః కృత్వా విసృజే ద్ద్విజపుఙ్గవమ్‌ | నక్త మక్షారలవణ మశ్నీ యా ద్ఘృతసంయుతమ్‌. 42

భక్త్యా యస్తు పుమా న్కుర్యా దేవ మఙారకాష్టకమ్‌ | చతురో వా7థవా తస్య యత్పుణ్యం తద్వదామి తే.

రూపసౌభాగ్యసమ్పన్నో పున ర్జన్మని జన్మని | విష్ణౌ వా7పి శివే భక్త స్సప్తద్వీపాధిపో భ##వేత్‌. 44

సప్తకల్పసహస్రాణి రుద్రలోకే మహీయతే | తస్మా త్త్వమపి దైత్యేన్ద్ర వ్రత మేత త్సమాచర. 45

పిప్పలాదః : ఇత్యేవ ముక్త్వా భృగునన్దనో7పి జగామ దైత్యశ్చ చకార సర్వమ్‌ |

త్వంచాపి రాజ న్కురు సర్వ మేత ద్యతో7క్షయం వేదవిదో వదన్తి. 46

ఈశ్వరః : తథేతి సమ్పూజ్య స పిప్పలాదం వాక్యం చకా రాద్భుతవీర్యకర్మా |

శృణోతి యశ్చైన మనన్యచేతా స్తస్యాపి సిద్ధిం భగవా న్విధ త్తే. 47

ఇతి శ్రీమత్స్యమహాపురాణ పిప్పలాదయుధిష్ఠిరసంవాదే అఙ్గారకవ్రతకథనం

నామ ద్విస ప్తితితమో7ధ్యాయః.

అర్ఘ్యదాన మంత్రము: ''భూమిపుత్త్రా! మహాభాగా! శంకర స్వేదసంజాతా! సురూపముకోరి నిన్ను శరణు చొచ్చినాను. నీకు వందనము. ఈ అర్ఘ్య మందుకొనుము.'' అను అర్థము నిచ్చు మంత్రముతో చందనోదకముతో అర్ఘ్యమునిచ్చి రత్న మాల్యవస్త్రాదులతో బ్రాహ్మణు నర్చించి ఇదే మంత్రముతో గోమిథునముతో కూడ (ఆవును కోడెదూడను) సర్వోప కరణములతోడి శయ్యను లోకమును జనుల కిష్టమగునదియు తన ఇంటిలో తన కిష్ట మనిపించినదియు(లభ్యమగునంతలో) సద్గుణవంతుడగు ఆ విప్రవర్యునకు ఇది అక్షయఫలదము కావలెననుచు దాన మీయవలెను. పిమ్మట ప్రదక్షిణపూర్వకముగా బ్రాహ్మణుని వీడ్కొనవలెను. (పగ లుపవసించి) నక్తమున (రాత్నియందు) ఉప్పు కారము పులుపు లేకుండ నేతితో భుజించవలెను. ఎనిమిది కాని నాలుగు కాని చవితితోడి మంగళవారములందు వ్రత మాచరించినవాడు జన్మజన్మములందును రూపసౌభాగ్యసంపదయు విష్ణుశివులందు భక్తియు స ప్తద్వీపాధిపత్యమును (ఇహలోకమున) అనుభవించి (పరమున) డెబ్బదివేల కల్పములపాటు రుద్రలోకమున పూజితుడై సుఖించును. కావున దైత్యేంద్రా ! నీవు ఈ వ్రత మాచరించుము.

(పిప్పలాదుడు) ఇట్లుపదేశించి శుక్రుడు వెళ్లగా విరోచను డదియంతయు నట్లేచేసెను. కావున రాజా(యుధిష్ఠిరా!) నీవును అక్షయఫలదమని వేదవేత్తలు చెప్పెడి ఈ వ్రతము నాచరించుము. అని పిప్పలాడు యుధిష్ఠిరునకు తెలిపెను.

(ఈశ్వరుడు): అద్భుతశ క్తియు అద్భుత కర్మాచరణమునుకల యుధిష్ఠిరుడును పిప్పలాదుని వచనము నాదరించి ఆ వ్రత మట్లే యాచరించెను. అనన్యచి త్తముతో దీనిని వినినవానికి భగవంతు డదే ఫలము నొసంగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున అంగారకవ్రత కథనమను డెబ్బదిరెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters