Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకసప్తతితమో7 ధ్యాయః.

అశూన్యశయనవ్రతమ్‌.

బ్రహ్మ: భగవ న్పురుషస్యేహ స్త్రయాశ్చ విరహాదికమ్‌| రోగవ్యాధిభయం దుఃఖం న భ##వే ద్యేన తద్వద. 1

ఈశ్వరః శ్రావణస్య ద్వితీయాయాం శుక్లాయాం మధుసూదనః | క్షీరార్ణవే సలక్ష్మీక స్సదా వసతి కేశవః. 2

తస్యాం సమ్పూజ్య గోవిన్దం సర్వా న్కామా న్త్సమశ్నుతే| గోభూహిరణ్యదానాని సప్తకల్పశతాయుతమ్‌. 3

అశూన్యశయనం నామ ద్వితీయా సా ప్రకీర్తితా | తస్యాం సమ్పూజయే ద్విష్ణున మేభి ర్మన్త్రైర్విధానతః. 4

శ్రీవత్సధారి & శ్రీకాన్త శ్రీవాస శ్రీపతే 7 వ్యయ | గార్హస్థ్యం మా ప్రణాశం మే యాతు ధర్మార్థకామద. 5

అగ్న యో మా ప్రణశ్యన్తు దేవతాః పురుషోత్తమ | పితరో మా ప్రణశ్యన్తు మా7స్తు దామ్పత్యభేదనమ్‌. 6

లక్ష్మ్యా వియుజ్య సే దేవ న కదాచి ద్యథా భవా& | తథా కళ త్రసమ్బన్దో దేవ మామే వియుజ్యతామ్‌. 7

లక్ష్మ్యా న శూన్యం వరద యథా తే శయనం సదా | శయ్యా మమాప్యశూన్యాతు (స్తు) తథ్తెవ మధుసూదన. 8

గీతవాదిత్రనిర్ఘోషం దేవదేవస్య కారయేత్‌ | ఘణ్టా భ##వే దశ క్తస్య సర్వవాద్యమయీ యతః. 9

డెబ్బది ఒకటవ అధ్యాయము.

అశూన్యశయన వ్రతము.

బ్రహ్మ ఈశ్వరుతోనిట్లనెను. భగవన్‌! స్త్రీ పురుషులకు విరహ-వ్యాధి-రోగ- భయ దుఃఖములు కలుగకుండు ఉపాయమున తెలుపు మనగా ఈ శ్వరుడిట్లు చెప్పెను: నారాయణుడు లక్ష్మీ సమేతముగా క్షీరసాగరమున నిరంతరము వసించుచుండునుగదా! ఆయనను శ్రావణ శుక్ల ద్వితీయ నాడు ఆర్చించినచో అన్ని కోరికలును నెరవేరును . ఆ శూన్యశయన ద్వితీయ అనబడు ఈనాడు గోవిందుని కల్పోక్త విధానముతో సంపూజించి గోభూహిరణ్య దానములు చేసినవారు డెబ్బది వేల కల్పముల కాలము సుఖింతురు.

ప్రార్థనామంత్రము: శ్రీ వత్సధారిన్‌ ! శ్రీకాంతా! శ్రీవాసా! అవ్యయా! శ్రీపతీ! ధర్మార్థ కామప్రదా! నాగార్హస్థ్యము హాని చెందకుండుగాక! మా దాంపత్యము భంగము నొందకుండుగాక! మా అగ్నులు దేవతలు పితృదేవతలు పితరులు హాని నొందకుందురు గాక! మధుసూదనా! నీకు వలెనే నాకును కళత్రముతో నిత్యసంబంధ ముండుగాక! నీశయన మెల్లప్పుడు ఆశూన్యమయి యుండునట్లే నా శయనముకూడ ఆశూన్యమై యుండుగాక! పూజా సమయమున గీతవాద్యముల వినిపించవలెను. ఇందులకు శక్తి లేనివారు ఘంటానాదమే చేయవచ్చును. ఏలయన ఘంట సర్వ వాద్యరూపమయినది.

ఏవం సమ్పూజ్య గోవిన్ద మశ్నీయా త్తైలవర్జితమ్‌ l నక్త మక్షారలవణం యావ ద్యామచతుష్టయమ్‌. 10

తతః ప్రభాతే సంజాతే లక్ష్మీపతిసమన్వితామ్‌ l దీపాన్న భాజనై ర్యుక్తాం శయ్యాం దద్యాద్వలక్షణామ్‌. 11

పాదుకోపానహచ్ఛత్ర చామరాసనసంయుతామ్‌ l అభీష్టోపస్కరై ర్యుక్తాం శుక్ల మాల్యానులేపనామ్‌. 12

సోపధానకవిశ్రామాం ఫలై ర్నానావిధై ర్యుతామ్‌ l తధాభరణగన్దైశ్చ యథాశక్త్యా సమన్వితామ్‌. 13

అవ్యజ్గౌజ్గౌయ విప్రాయ శ్రోత్రియాయ కుటుమ్బినే l దాతవ్యా వేదవిదుషే* సర్వక్రతుకృతే క్వచిత్‌ . 14

తత్రోపవేశ్య దామ్పత్య మలజ్కృత్య విధానతః l పత్న్యాస్తు భాజనం దద్యా ద్భక్ష్యభోజ్యసమన్వితమ్‌. 16

బ్రాహ్మణస్యాపి సౌవర్ణీ ముపస్కరసమన్వితామ్‌ l ప్రతిమాం దేవదేవస్య ప్రదద్యా ద్దక్షిణాన్వితామ్‌. 15

ఏవం యస్తు పుమా న్కుర్యా దశూన్యశయనం హరేః l విత్తశాఠ్యేన రహితో నారాయణపరాయణః. 17

న తస్య పత్య్నా విరహః కదాచిదపి జాయతే l నారీ వా7విధవా బ్రహ్మ న్యావ చ్చన్ద్రార్కతారకమ్‌. 18

న విరూపం న శోకార్తం దామ్పత్యం జాయతే క్వచిత్‌ l న పుత్త్రపశురత్నాని క్షయం యాన్తి పితామహ.

సప్తకల్పసహస్రాణి సప్తకల్పశతానిచ l కుర్వ న్నశూన్యశయనం విష్ణులోకే మహీయతే. 20

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ ఆశూన్యశయనద్వితీయావ్రతకథనం నామైకసప్తతితమో7ధ్యాయః.

ఇట్లు గోవిందుని పూజించి పగలు ఉపవసించి ఆ రాత్రి (నక్తం) తైలము-ఉప్పు -(పులుపు)-కారము లేని ఆహారముతిని ఆ రాత్రి గడుపవలెను. తెల్లవారిన తరువాత కుటుంబియు వేదపండితుడును శ్రోత్రియుడును సర్వ క్రతుకర్తయు ఎక్కడను ఏ లోపములేనివాడును అంగ వైకల్యము లేనివాడును అగు విప్రునకు లక్ష్మీ నారాయణ ప్రతిమను దీపములను అన్నపు పాత్రములను మంచమును పరపులను దిండ్లను అనుకొను దిండ్లను పాదుకలను చెప్పులను గొడుగులను చామరములను ఆసనములను ఇంకను ఇష్టములగు సాధన సామగ్రులను తెల్లని గంధపు పూత సామగ్రులను పూల (దండల)ను దానము చేయవలయును. ఆ బ్రాహ్మణుని అతని పత్నిని మంచముపై కూర్చుండపెట్టి శాస్త్రోక్త విధానమున అలంకరించి పత్నికి భక్ష్య భోజ్య సమన్విత పాత్రను పతికి సర్వసామగ్రీ యుక్తమగు లక్ష్మీ నారాయణుల బంగారు ప్రతిమను చేతికీయవలెను.

ధనమునకై లోభించక యథాశక్తిగా కల్ప విధానముగా నారాయణుడై దిక్కని ఈ అశూన్య శయనవత్రము చేయువారు దాంపత్యమున వియోగము లేకుండ ఆ చంద్రతారార్కము వైరూప్యము శోకము లేక సుఖింతురు. వారికి పశుపుత్త్రధన నాశమును కలుగదు. ఏడువేల ఏడువందల కల్పములపాటు వారు విష్ణులోకమున సుఖింతురు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున అశూన్య శయన వ్రతమను డెబ్బది ఒకటవ అధ్యాయము

__________________________________________________________________________

*భావేనా7పతితాయచ

Sri Matsya Mahapuranam-1    Chapters